National Games
-
నేను రాజీనామా చేయలేదు
న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్, దిగ్గజ మహిళా బాక్సర్ మేరీకోమ్ తన పదవికి రాజీనామా చేయలేదని స్పష్టం చేసింది. పదవీకాలం ముగిసేవరకు బాధ్యతలు కొనసాగిస్తానని చెప్పింది. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆమె 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం కూడా గెలుచుకుంది. 42 ఏళ్ల ఈ మణిపురి స్టార్ బాక్సర్ ఇటీవల డెహ్రాడూన్‌లో జరిగిన జాతీయ క్రీడల ముగింపు కార్యక్రమంలో పాల్గొంది. ఆ సమయంలో ఆమె అథ్లెట్స్ కమిషన్ పదవిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు నెట్టింట ప్రచారం జరిగింది. కానీ మేరీ మాత్రం తన వాట్సాప్ గ్రూప్ సంభాషణను తప్పుగా అన్వయిస్తూ మీడియాకు లీక్ చేశారని, రాజీనామా చేసినట్లు కూడా ప్రచారం చేశారని పేర్కొంది. ‘నేను అథ్లెట్స్ కమిషన్‌కు రాజీనామా చేయనేలేదు. 2026లో పూర్తయ్యే పదవీకాలం వరకు చైర్‌పర్సన్‌గా కొనసాగుతాను. ఆ రోజు నేను కమిషన్ సభ్యులతో అన్నది వేరు... నెట్టింట ప్రచారమైంది వేరు. అథ్లెట్స్ కమిషన్ సభ్యులు తమ పద్ధతి మార్చుకోవాలని సూచించాను. తనతో ప్రవర్తించే తీరు ఇలాగే కొనసాగితే రాజీనామాకు సైతం వెనుకాడనని చెప్పాను. కానీ రాజీనామా చేశానని చెప్పనే లేదు. నేను రాజీనామా చేశానంటున్నారు కదా! మరి రాజీనామా లేఖ ఏది? ఎవరైనా చూశారా? అని ప్రశ్నించింది. ఐఓఏ తన కుటుంబమని... దీంతో ఎప్పుడు విబేధించనని... ఇంతటితో వాట్సాప్ సంభాషణ వివాదానికి ముగింపు పలుకుతున్నానని చెప్పారు. 2022లో ఐఓఏ అథ్లెట్స్ కమిషన్‌కు మేరీకోమ్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైంది. టేబుల్ టెన్నిస్ స్టార్ అచంట శరత్ కమల్ వైస్ చైర్మన్‌గా ఉన్నారు. ఇంకా ఈ కమిషన్‌లో రెండు ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు, మాజీ షాట్‌పుటర్ ఓం ప్రకాశ్ కర్హాన, ఒలింపియన్ శివ కేశవన్, లండన్ ఒలింపిక్స్ కాంస్య విజేత, షూటర్ గగన్ నారంగ్ (షూటర్), రోయర్ బజరంగ్ లాల్, ఫెన్సింగ్ ప్లేయర్ భవానీ దేవి, భారత మహిళల హాకీ మాజీ కెపె్టన్ రాణి రాంపాల్, టోక్యో ఒలింపిక్స్ రజత విజేత మీరాబాయి చాను సభ్యులుగా ఉన్నారు. -
మేఘాలయలో కలుద్దాం!
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో అలరించిన జాతీయ క్రీడలు అట్టహాసంగా ముగిశాయి. తదుపరి మేఘాలయ జాతీయ క్రీడల ఆతిథ్యానికి సిద్ధం కానుంది. 2027లో అక్కడ 39వ నేషనల్ గేమ్స్ జరుగనున్నాయి. శుక్రవారం మేఘాలయ ముఖ్యమంత్రి కొంగ్‌కల్ సంగ్మా క్రీడాజ్యోతి అందుకోవడంతో దీనికి సంబంధించిన లాంఛన ప్రకియ కూడా ముగిసింది. 18 రోజుల పాటు విజయవంతంగా నిర్వహించిన తాజా జాతీయ క్రీడల్లో సర్వీసెస్ 121 పతకాలతో ఓవరాల్ చాంపియన్‌షిప్ గెలుచుకుంది. సర్వీసెస్ క్రీడాకారులు 68 స్వర్ణాలు, 26 రజతాలు, 27 కాంస్యాలు గెలిచారు. మహారాష్ట్ర అత్యధికంగా 198 పతకాలు గెలిచినప్పటికీ పసిడి వేట (54 స్వర్ణాలు)లో వెనుకబడిపోవడంతో రెండో స్థానంలో నిలిచింది. 71 రజతాలు, 73 కాంస్యాలు మరాఠా క్రీడాకారులు చేజిక్కించుకున్నారు. హరియాణా 153 పతకాలు (48 పసిడి, 47 రజతాలు, 58 కాంస్యాలు) మూడో స్థానంలో నిలువగా, ఆతిథ్య ఉత్తరాఖండ్ 24 స్వర్ణాలు, 35 రజతాలు, 44 కాంస్యాలతో మొత్తం 103 పతకాలు సాధించి ఏడో స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ (14 పతకాలు) 18వ స్థానంలో, తెలంగాణ (18 పతకాలు) 26వ స్థానంలో నిలిచాయి. 2036 ఒలింపిక్స్‌కు సిద్ధం: అమిత్ షా జాతీయ క్రీడల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విశ్వక్రీడల నిర్వహణకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. ‘క్రీడల్లో భారత్‌కు బంగారు భవిష్యత్తు ఉంది. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు రెడీగా ఉంది. ఉత్తరాఖండ్ అంటేనే దేవభూమిగా ప్రసిద్ధి. అయితే తాజా ఈవెంట్ నిర్వహణ ద్వారా ఖేల్ భూమి అయ్యింది. కేవలం క్రీడల నిర్వహణే కాదు. ఆటగాళ్లు రాటుదేలిన తీరు సాధించిన ప్రగతి రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగంలో చేసిన విశేష కృషికి నిదర్శనం. గత జాతీయ క్రీడల్లో ఉత్తరాఖండ్ 21వ స్థానంలో నిలిచింది. తాజా క్రీడల్లో ఏడో స్థానానికి ఎగబాకింది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం వల్లే క్రీడారంగంలో ఆ రాష్ట్రం ఇంతలా ఎదిగింది. ఇదే జోరు ఇకమీదటా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి, కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష, మేఘాలయ ముఖ్యమంత్రి కొంగ్‌కల్ సంగ్మా తదితరులు పాల్గొన్నారు. పీటీ ఉష మాట్లాడుతూ ‘ఈ మహత్తర ప్రయాణం ఇక్కడితో ముగిసేది కాదు. ఎల్లప్పుడు దిగి్వజయంగా సాగేది. భారత క్రీడల ప్రగతిని చాటేది’ అని ఆమె కితాబిచ్చారు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ ‘2036 విశ్వక్రీడల్లో టాప్–10లో నిలిచేందుకు ఇదొక గొప్ప ఆరంభం. దేశంలో క్రీడాసంస్కృతి పెరుగుతుందనడానికి ఇదో నిదర్శనం’ అని అన్నారు. -
National games: తెలంగాణకు 2 కాంస్యాలు
డెహ్రాడూన్: జాతీయ క్రీడల్లో గురువారం తెలంగాణ రాష్ట్రానికి రెండు పతకాలు లభించాయి. నెట్‌బాల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో తెలంగాణ జట్టుకు కాంస్య పతకం దక్కగా... షూటింగ్ మిక్స్డ్ స్కీట్ టీమ్ ఈవెంట్లో బత్తుల మునేక్–రష్మీ రాథోడ్ జోడీ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.నెట్‌బాల్‌లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ జట్ల మధ్య జరిగిన కాంస్య పతకం మ్యాచ్ 31–31 పాయింట్లతో ‘డ్రా’గా ముగిసింది. దాంతో రెండు జట్లకు కాంస్య పతకాలు ఖరారయ్యాయి. తెలంగాణ నెట్‌బాల్ జట్టు తరఫున బోడ విక్రమ్ రెడ్డి, అబ్దుల్ ఖాన్, అబ్దుల్ షరీఫ్, మొహమ్మద్ ఖాజాయుద్దీన్, శ్రవణ్ కుమార్, రఘునందన్, పులి రితిక రెడ్డి, గేయశ్రీ, శ్రుతి, గోపీ చంద్రిక, ముద్దం కీర్తన, సంహిత ప్రాతినిధ్యం వహించారు.షూటింగ్ మిక్స్డ్ స్కీట్ ఫైనల్లో ఆరు జోడీలు పోటీపడ్డాయి. 138 పాయింట్లతో ఇషాన్ సింగ్–రైజా ధిల్లాన్ (హరియాణా) జంట స్వర్ణం దక్కించుకోగా... భవతేజ్ సింగ్–గనీమత్ సెఖోన్ (పంజాబ్) ద్వయం రజతం సంపాదించింది. 133 పాయింట్లతో మునేక్–రష్మీ జంటకు కాంస్యం లభించింది. గురువారం పోటీలు ముగిశాక తెలంగాణ 18 పతకాలతో (3 స్వర్ణాలు, 3 రజతాలు, 12 కాంస్యాలు) 26వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ 14 పతకాలతో (7 స్వర్ణాలు, 1 రజతం, 6 కాంస్యాలు) 18వ స్థానంలో కొనసాగుతోంది. -
తెలంగాణ జిమ్నాస్ట్ నిష్కా అగర్వాల్‌కు స్వర్ణ పతకం
జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో మూడో పసిడి పతకం చేరింది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో బుధవారం జరిగిన మహిళల ఆరి్టస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో తెలంగాణ అమ్మాయి నిష్కా అగర్వాల్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. టేబుల్ వాల్ట్ ఈవెంట్లో నిష్కా విజేతగా నిలిచింది. ఎనిమిది మంది పోటీపడ్డ ఫైనల్లో నిష్కా 12.717 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకొని బంగారు పతకాన్ని హస్తగతం చేసుకుంది. ఈ జాతీయ క్రీడల్లో నిష్కాకిది రెండో పతకం. మంగళవారం జరిగిన ఆల్ అరౌండ్ ఈవెంట్లో నిష్కా కాంస్య పతకాన్ని సాధించింది. మరోవైపు పురుషుల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 65 కేజీల విభాగంలో తెలంగాణ రెజ్లర్ నిఖిల్ యాదవ్ కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. బుధవారం పోటీలు ముగిశాక తెలంగాణ 16 పతకాలతో (3 స్వర్ణాలు, 3 రజతాలు, 10 కాంస్యాలు) 25వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ 14 పతకాలతో (7 స్వర్ణాలు, 1 రజతం, 6 కాంస్యాలు) 18వ స్థానంలో నిలిచింది. -
జ్యోతి ‘డబుల్’ ధమాకా
డెహ్రాడూన్: భారత స్టార్ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ జాతీయ క్రీడల్లో మరోసారి ‘పసిడి’ ప్రదర్శనతో అదరగొట్టింది. మంగళవారం జరిగిన మహిళల అథ్లెటిక్స్ 200 మీటర్ల విభాగంలో విశాఖపట్నం జిల్లాకు చెందిన 25 ఏళ్ల జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 200 మీటర్ల ఫైనల్ రేసును జ్యోతి అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 23.35 సెకన్లలో పూర్తి చేసి విజేతగా అవతరించింది. తెలంగాణ అమ్మాయి నిత్య (23.76 సెకన్లు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. గత ఆదివారం జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్లో వరుసగా మూడోసారి జాతీయ క్రీడల్లో బంగారు పతకం సాధించి ‘హ్యాట్రిక్’ నమోదు చేసిన సంగతి తెలిసిందే. జిమ్నాస్టిక్స్‌లో భాగమైన మహిళల ట్రాంపోలిన్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన షేక్ యాసీన్ స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఎనిమిది మంది పోటీపడిన ఫైనల్లో కాకినాడ జిల్లాకు చెందిన షేక్ యాసీన్ తన విన్యాసాలతో మెరిపించి 39.790 పాయింట్లతో విజేతగా నిలిచింది. 2022 గుజరాత్ జాతీయ క్రీడల్లో యాసీన్ రజతం నెగ్గింది. నందిని నిలకడగా... ఏడు క్రీడాంశాల సమాహారమైన మహిళల హెప్టాథ్లాన్ (100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్‌పుట్, 200 మీటర్లు, లాంగ్‌జంప్, జావెలిన్ త్రో, 800 మీటర్లు) ఈవెంట్లో తెలంగాణకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణి అగసార నందిని స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. రెండు రోజులపాటు జరిగిన ఈ ఈవెంట్లో నందిని మొత్తం 5601 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. అంతేకాకుండా ఈ ఏడాది మే 27 నుంచి 31 వరకు దక్షిణ కొరియాలో జరిగే ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సాధించింది. మహిళల ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఆల్ అరౌండ్ విభాగంలో తెలంగాణ అమ్మాయి నిష్కా అగర్వాల్ (44.767 పాయింట్లు) కాంస్య పతకాన్ని సాధించింది. మరోవైపు మహిళల నెట్‌బాల్ ఫాస్ట్–5 ఈవెంట్లో తెలంగాణ జట్టుకు రజత పతకం లభించింది. ఫైనల్లో తెలంగాణ జట్టు 20–23తో హరియాణా చేతిలో ఓడిపోయింది. తెలంగాణ నెట్‌బాల్ జట్టు తరఫున నట్టి అఖిల, సయ్యదా మస్రతున్నీసా, జంగా సుప్లవి రాజ్, యరువా యషశ్రీ, సాయిప్రియ, కొమర రిషిక, అలోనా, తరుణ, అంజలి, యదనవేణి దీప్తి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 14 పతకాలతో (7 స్వర్ణాలు, 1 రజతం, 6 కాంస్యాలు) 17వ స్థానంలో... తెలంగాణ 14పతకాలతో (2 స్వర్ణాలు, 3 రజతాలు, 9 కాంస్యాలు) 27వ స్థానంలో ఉన్నాయి. -
తెలంగాణ టీటీ జట్టుకు కాంస్యం
డెహ్రాడూన్: జాతీయ క్రీడల్లో (National Games) తెలంగాణ (Telangana) ఖాతాలో పదో పతకం చేరింది. సోమవారం జరిగిన టేబుల్ టెన్నిస్ (Table Tennis) (టీటీ) టీమ్ ఈవెంట్లో తెలంగాణ పురుషుల జట్టుకు కాంస్య పతకం లభించింది. సూరావజ్జుల స్నేహిత్, అలీ మొహమ్మద్, మొహమ్మద్ అలీ, స్వర్ణేందు చౌధురీ, సంతోష్ రమేశ్ కుమార్‌లతో కూడిన తెలంగాణ జట్టు సెమీఫైనల్లో ఓడిపోయింది. మహారాష్ట్రతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో తెలంగాణ 0–3తో పరాజయం పాలైంది. తొలి మ్యాచ్‌లో స్నేహిత్ 6–11, 7–11, 9–11తో జశ్ మోదీ చేతిలో... రెండో మ్యాచ్‌లో మొహమ్మద్ అలీ 9–11, 9–11, 6–11తో రీగన్ చేతిలో... మూడో మ్యాచ్‌లో స్వర్ణేందు చౌధురీ 12–10, 1–11, 9–11, 3–11తో చిన్మయ సోమయ్య చేతిలో ఓడిపోయారు. మరో సెమీఫైనల్లో తమిళనాడు 2–3తో పశి్చమ బెంగాల్ చేతిలో పరాజయం చూవిచూసి కాంస్యంతో సరిపెట్టుకుంది. ఫైనల్లో పశి్చమ బెంగాల్ 3–0తో మహారాష్ట్రపై నెగ్గి పసిడి పతకం సొంతం చేసుకుంది. మహిళల విభాగంలోనూ పశి్చమ బెంగాల్ జట్టుకే స్వర్ణ పతకం లభించింది. సుతీర్థ ముఖర్జీ, ఐహిక ముఖర్జీ, పొయ్‌మంతీ బైస్యా, మౌమా దాస్, మౌహిత దత్తాలతో కూడిన పశ్చిమ బెంగాల్ ఫైనల్లో 3–0తో మహారాష్ట్రపై గెలిచింది. సోమవారం క్రీడలు ముగిశాక తెలంగాణ 10 పతకాలతో (1 స్వర్ణం, 2 రజతాలు, 7 కాంస్యాలు) 29వ స్థానంలో ఉంది. -
తైక్వాండోలో హర్షప్రదకు రజతం... వరుణ్‌కు కాంస్యం
డెహ్రాడూన్: 38వ జాతీయ క్రీడల్లో శుక్రవారం తెలంగాణ ఖాతాలో ఒక పతకం... ఆంధ్రప్రదేశ్ ఖాతాలో ఒక పతకం చేరాయి. మహిళల తైక్వాండో (క్యోరుగీ) అండర్–73 కేటగిరీలో తెలంగాణకు చెందిన పాయం హర్షప్రద రజత పతకం సొంతం చేసుకుంది. ఫైనల్లో హర్షప్రద 0–2 తేడాతో ఇతిషా దాస్ (చండీగఢ్) చేతిలో పరాజయం పాలైంది.ప్రస్తుతం తెలంగాణ ఆరు పతకాలతో (1 స్వర్ణం, 1 రజతం, 4 కాంస్యాలు) 28వ స్థానంలో ఉంది. మరోవైపు పురుషుల తైక్వాండో అండర్–68 కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టి.వరుణ్ కాంస్య పతకం గెలిచాడు. సెమీఫైనల్లో వరుణ్ 0–2తో మహేంద్ర పరిహార్ (ఉత్తరాఖండ్) చేతిలో ఓడిపోయాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 10 పతకాలతో (4 స్వర్ణాలు, 1 రజతం, 5 కాంస్యాలు) 18వ స్థానంలో ఉంది. మరిన్ని క్రీడా వార్తలుసెమీస్లో మాయ ముంబై: తన సంచలన ప్రదర్శన కొనసాగిస్తూ భారత టీనేజ్ టెన్నిస్ స్టార్ మాయ రాజేశ్వరన్ రేవతి ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 15 ఏళ్ల మాయ 6–4, 3–6, 6–2తో ప్రపంచ 285వ ర్యాంకర్ మి యామగుచి (జపాన్)పై గెలిచింది. రెండు గంటలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో మాయ ఐదు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. స్పెయిన్‌లోని రాఫెల్ నాదల్ అకాడమీలో శిక్షణ పొందుతున్న మాయ నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 117వ ర్యాంకర్ జిల్ టెచ్‌మన్ (స్విట్జర్లాండ్)తో తలపడుతుంది.భారత మూడో ర్యాంకర్, తెలంగాణకు చెందిన భమిడిపాటి శ్రీవల్లి రష్మిక పోరాటం ఈ టోరీ్నలో ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో రష్మిక 2–6, 2–6తో జిల్ టెచ్‌మన్ చేతిలో ఓడిపోయింది. క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైన రష్మికకు 3,450 డాలర్ల (రూ. 3 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 27 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రాజస్తాన్ రాయల్స్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా బహుతులేజైపూర్: భారత మాజీ లెగ్‌స్పిన్నర్ సాయిరాజ్ బహుతులే ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టుతో మరోసారి జత కట్టనున్నాడు. టీమ్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా బహుతులేను మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) కోచ్‌లలో ఒకడిగా ఉన్న బహుతులే 2018–21 మధ్య కాలంలో కూడా రాజస్తాన్ రాయల్స్ సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్నాడు.టీమ్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బౌలింగ్ కోచ్ షేన్ బాండ్లతో కలిసి అతను పని చేస్తాడు. భారత జట్టు హెడ్ కోచ్‌గా ద్రవిడ్ ఉన్న సమయంలో రెండు వేర్వేరు సిరీస్‌లలో బహుతులే కోచింగ్ బృందంలో ఉన్నాడు. బహుతులే భారత్ తరఫున 2 టెస్టులు, 8 వన్డేలు ఆడి 5 వికెట్లు తీశాడు. -
స్వప్నిల్‌కు కాంస్యం
డెహ్రాడూన్: జాతీయ క్రీడల్లో ఒలింపిక్ పతక విజేత స్వప్నిల్ కుసాలె కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. షూటింగ్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రి పొజిషన్ విభాగంలో మహారాష్ట్ర షూటర్ స్వప్నిల్ మూడో స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ) తరఫున బరిలోకి దిగిన 25 ఏళ్ల నీరజ్ కుమార్ 464.1 పాయింట్లతో స్వర్ణం చేజిక్కించుకున్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఐశ్వరి ప్రతాప్ సింగ్ (462.4 పాయింట్లు) రజత పతకం దక్కించుకోగా... పారిస్ ఒలింపిక్స్ కాంస్యం నెగ్గి ఈ విభాగంలో దేశానికి తొలి పతకం అందించిన స్వప్నిల్ (447.7 పాయింట్లు) కాంస్యం గెలుచుకున్నాడు. మరోవైపు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సురుచి సింగ్–ప్రమోద్ (హరియాణా) 17–7 పాయింట్ల తేడాతో అంజలి షెఖావత్–ఉమేశ్ చౌదరీ (రాజస్తాన్)పై గెలిచి పసిడి ఖాతాలో వేసుకుంది. రాహి సర్ణోబత్–ప్రణవ్ అరవింద్ పాటిల్ (మహారాష్ట్ర) జట్టు కాంస్యం గెలుచుకుంది. సుదీర్ఘ కాలంగా భారత టాప్ ఆర్చర్‌గా ఉన్న దీపిక కుమారి పసిడిని అందుకుంది. పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించడంలో విఫలమైన దీపిక నేషనల్ గేమ్స్‌లో జార్ఖండ్ తరఫున బరిలోకి దిగి వ్యక్తిగత విభాగంతో పాటు టీమ్ ఈవెంట్లోనూ స్వర్ణం కైవసం చేసుకుంది. పురుషుల విభాగంలో నాలుగుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న సీనియర్ ఆర్చర్ తరుణ్‌దీప్ రాయ్‌ను ఓడించిన 18 ఏళ్ల బెంగాల్ ఆర్చర్ జుయెల్ సర్కార్ జాతీయ చాంపియన్‌గా అవతరించాడు. మరో వైపు బాక్సింగ్‌లో లవ్లీనా బోర్గొహైన్, ఆరు సార్లు ఆసియా చాంపియన్ శివ థాపా విజయాలు సాధించారు. మహిళల 75 కేజీల విభాగంలో లవ్లీనా తిరుగులేని ప్రదర్శన కనబర్చగా... పురుషుల 64 కేజీల విభాగంలో శివ థాపా (అసోం) సత్తాచాటాడు. -
ఆంధ్రప్రదేశ్‌కు మూడో స్వర్ణం
డెహ్రాడూన్: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ ఖాతాలో మూడో స్వర్ణ పతకం చేరింది. బుధవారం మహిళల కనోయ్ స్లాలోమ్ కే–1 విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాగిడి గాయత్రి పసిడి పతకం సాధించింది. అంతకుముందు వెయిట్‌లిఫ్టింగ్‌లో నీలంరాజు, పల్లవి బంగారు పతకాలు గెలిచిన సంగతి తెలిసిందే. బుధవారమే ఆర్చరీలో ఆంధ్రప్రదేశ్‌కు ఒక రజతం, ఒక కాంస్యం లభించాయి. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో తిరుమూరు గణేశ్ మణిరత్నం–మాదాల సూర్య హంసిని జోడీ రజత పతకం గెలిచింది. ఫైనల్లో గణేశ్–సూర్య హంసిని ద్వయం 148–154 పాయింట్ల తేడాతో రిషభ్ యాదవ్–దీప్షిక (హరియాణా) జంట చేతిలో ఓడింది. కాంపౌండ్ పురుషుల వ్యక్తిగత విభాగంలో తిరుమూరు గణేశ్ మణిరత్నం కాంస్య పతకం సంపాదించాడు. తెలంగాణకు కాంస్యం మరోవైపు తెలంగాణ ఖాతాలో బుధవారం ఒక కాంస్య పతకం చేరింది. మహిళల ఆర్చరీ కాంపౌండ్ టీమ్ విభాగంలో చికిత, మానస నయన, శ్రేష్ణ రెడ్డి, మన్సూరా హసీబాలతో కూడిన తెలంగాణ జట్టు కాంస్య పతకాన్ని దక్కించుకుంది. తెలంగాణ జట్టు 232 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. బుధవారం పోటీలు ముగిశాక ఆంధ్రప్రదేశ్ 3 స్వర్ణాలు, 1 రజతం, 4 కాంస్యాలతో కలిపి 8 పతకాలతో 18వ స్థానంలో... తెలంగాణ 1 స్వర్ణం, 3 కాంస్యాలతో కలిపి 4 పతకాలతో 25వ స్థానంలో ఉన్నాయి. -
స్విమ్మర్లు ధినిధి, శ్రీహరి నటరాజ్‌లకు చెరో తొమ్మిది పసిడి పతకాలు
జాతీయ క్రీడల్లో కర్ణాటక స్విమ్మర్లు ధినిధి డెసింగు, శ్రీహరి నటరాజ్ పతకాల పంట పండించారు. ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల స్విమ్మింగ్ ఈవెంట్లో ఈ ఇద్దరూ చెరో 9 పసిడి పతకాలు ఖాతాలో వేసుకున్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన 14 ఏళ్ల ధినిధి మహిళల 100 మీటర్ల ఫ్రీస్టయిల్లో జాతీయ రికార్డు తిరగరాస్తూ స్వర్ణం చేజిక్కించుకోవడంతో పాటు... 400 మీటర్ల ఫ్రీస్టయిల్, మిక్స్డ్ 4్ఠ400 ఫ్రీస్టయిల్, 200 మీటర్ల ఫ్రీస్టయిల్, 100 మీటర్ల బటర్‌ఫ్లయ్, 4్ఠ100 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలే, 50 మీటర్ల ఫ్రీస్టయిల్, 4x200 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలే, మిక్స్డ్ 4x100 మీటర్ల మెడ్లేలో పసిడి పతకాలతో మెరిసింది. దీంతో పాటు 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో రజతం, 4x100 మీటర్ల రిలే మెడ్లేలో కాంస్యంతో మొత్తం 11 పతకాలు ఖాతాలో వేసుకుంది. పురుషుల విభాగంలో శ్రీహరి మొత్తం 10 పతకాలు (9 స్వర్ణాలు, 1 రజతం) సాధించాడు. మంగళవారంతో జాతీయ క్రీడల్లో స్విమ్మింగ్ పోటీలు ముగియగా... ఓవరాల్‌గా పట్టికలో కర్ణాటక 37 పతకాలతో (22 స్వర్ణాలు, 10 రజతాలు, 5 కాంస్యాలు)తో అగ్రస్థానంలో ఉంది. -
తెలంగాణకు తొలి స్వర్ణం
డెహ్రాడూన్: జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో మొదటి స్వర్ణం చేరింది. మహిళల బాస్కెట్‌బాల్ 3X3 ఈవెంట్లో తెలంగాణ జట్టు తొలి స్థానంలో నిలిచింది. ఫైనల్లో తెలంగాణ 21–11 పాయింట్ల తేడాతో కేరళపై విజయం సాధించింది. పసిడి పతకం సాధించిన మహిళల జట్టులో గులాబ్ షా అలీ, ఎస్.పుష్ప, కేబీ హర్షిత, పి.ప్రియాంక సభ్యులుగా ఉన్నారు. రెండేళ్ల క్రితం గోవా జాతీయ క్రీడల్లోనూ ఇదే ఈవెంట్లో విజేతగా నిలిచిన తెలంగాణ తమ స్వర్ణాన్ని నిలబెట్టుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో 14–12 తేడాతో తమిళనాడును ఓడించి మధ్యప్రదేశ్ కాంస్యం సొంతం చేసుకుంది. అంతకుముందు సెమీస్‌లో తెలంగాణ 18–11తో తమిళనాడును... కేరళ 13–10తో మధ్యప్రదేశ్‌ను ఓడించాయి. మరో వైపు పురుషుల బాస్కెట్‌బాల్ 3–3 ఈవెంట్లో మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు స్వర్ణ, రజత, కాంస్యాలు గెలుచుకున్నాయి. ఫైనల్లో మధ్యప్రదేశ్ 22–20 తేడాతో కేరళను ఓడించింది. కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు చేతిలో 16–21తో ఓడిన తెలంగాణ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు మూడు కాంస్యాలు మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు మంగళవారం మూడు కాంస్య పతకాలు లభించాయి. పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో కర్రి సాయిపవన్–షేక్ గౌస్ జోడీ... కనోయింగ్–కయాకింగ్ క్రీడాంశంలోని పురుషుల స్లాలోమ్–కే1 ఈవెంట్లో కొల్లకాని విష్ణు... మహిళల స్లాలోమ్–సీ1 ఈవెంట్లో దొడ్డి చేతన భగవతి కాంస్య పతకాలు సాధించారు. బ్యాడ్మింటన్ డబుల్స్ సెమీఫైనల్లో సాయిపవన్–షేక్ గౌస్ ద్వయం 13–21, 12–21తో నితిన్–ప్రకాశ్ రాజ్ (కర్ణాటక) జంట చేతిలో ఓడి కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది. మంగళవారం పోటీలు ముగిశాక ఆంధ్రప్రదేశ్ ఆరు పతకాలతో 21వ స్థానంలో, మూడు పతకాలతో తెలంగాణ 24వ స్థానంలో ఉన్నాయి. -
పసిడి పతకం నెగ్గిన పల్లవి
డెహ్రాడూన్: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌కు రెండో స్వర్ణ పతకం లభించింది. శనివారం జరిగిన మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 71 కేజీల విభాగంలో సనాపతి పల్లవి పసిడి పతకం సొంతం చేసుకుంది. పల్లవి మొత్తం 212 కేజీల బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది. పల్లవి స్నాచ్‌లో 94 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 118 కేజీలు బరువెత్తింది. శుక్రవారం పురుషుల 67 కేజీల విభాగంలో నీలంరాజు ఆంధ్రప్రదేశ్‌కు తొలి బంగారు పతకాన్ని అందించాడు. -
జాతీయ స్థాయిలో ఏపీ పరువు గోవింద!
విజయవాడ స్పోర్ట్స్: ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ (ఏపీవోఏ), ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్ఏఏపీ–శాప్) మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు క్రీడాకారుల పాలిట శాపంగా మారాయి. వెరసి రాష్ట్ర క్రీడాకారులకు 38వ జాతీయ క్రీడలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ నెల 28వ తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రడూన్‌లో ప్రారంభమైన ఈ పోటీల్లో ప్రాతినిధ్యం వహించేందుకు వెళ్లిన క్రీడాకారులు, కోచ్, మేనేజర్లు పడరాని పాట్లు పడుతున్నారు. ఫిబ్రవరి 14వ తేదీ వరకు జరిగే ఈ పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని 21 క్రీడాంశాలు అర్హత సాధించాయి.వీటిల్లో ఆర్చరీ, అథ్లెటిక్స్, జూడో, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, జిమ్నాస్టిక్స్, మోడ్రన్ పెంటాథ్లాన్, షూటింగ్, కానోయింగ్ కాయాకింగ్, స్విమ్మింగ్, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, ఉషు, మాల్కాంబ్ జట్లు శాప్ ద్వారా వెళ్లాయి. ఈ జట్లకు ట్రాక్షూట్లు, షూ, టీఏ, డీఏ, కిట్, కోచింగ్ క్యాంపులకు నగదును శాప్ సమకూర్చింది. మిగిలిన ట్రైథ్లాన్, యోగాసన, సైక్లింగ్, బీచ్ హ్యాండ్‌బాల్ జట్లు ఏపీవోఏ ద్వారా వెళ్లాయి. ఈ జట్లకు ఏపీవోఏ అధ్యక్షుడు ఆర్.కె.పురుషోత్తం ట్రాక్‌షూట్, షూ సమకూర్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28న జరిగిన మార్చ్ఫాస్ట్లో రాష్ట్రం నుంచి 20 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.వీరిలో కొందరు ధరించిన ట్రాక్ షూట్లలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం, శాప్ లోగో లేకపోవడం నిర్వాహకులు, జాతీయ మీడియాను ఆశ్చర్యానికి గురి చేసింది. ర్యాలీలోనూ ఏపీవోఏ ప్రతినిధులు కేవలం ఏపీవోఏ పేరుతో ఉన్న ఫ్లకార్డులు, బ్యానర్లనే మైదానంలో ప్రదర్శించారు. ఇదిలా ఉండగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) నిర్వహించే ఈ క్రీడల్లో రాష్ట్ర క్రీడాకారుల వసతి సౌకర్యాలు ఏపీవోఏ చూసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మన రాష్ట్ర క్రీడాకారులకు ఐవోఏ కేటాయించిన గదుల్లోకి శాప్ ఆధ్వర్యంలో వెళ్లిన క్రీడాకారులు, మేనేజర్, కోచ్‌లను ఏపీవోఏ కొన్ని గంటల పాటు అనుమతించక పోవడం కలకలం రేపింది. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోరా?హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ రాష్ట్ర క్రీడాకారులను ఆర్.కె.పురుషోత్తం ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు. 21 క్రీడలకు సంబంధించిన క్రీడాకారులకు ట్రాక్‌షూట్, షూ, టీఏ, డీఏ, కిట్ సమకూర్చేందుకు శాప్ రూ.75 లక్షలను సిద్ధంగా ఉంచినా, రాష్ట్ర పరువు గంగలో కలవడం బాధాకరం. – యలమంచిలి శ్రీకాంత్, ఏపీ కబడ్డీ సంఘం రాష్ట్ర కార్యదర్శి -
ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ సిద్ధం: ప్రధాని మోదీ
గ్రామీణ ప్రతిభకు పట్టం కట్టే జాతీయ క్రీడలు... అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉత్తరాఖండ్ వేదికగా 38వ జాతీయ క్రీడలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. వచ్చే నెల 14 వరకు జరగనున్న ఈ క్రీడల్లో 10 వేల మందికి పైగా అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఆవిర్భవించి 25 ఏళ్లు అయిన సందర్భంగా ఈ క్రీడలకు ఆతిథ్యమిస్తున్న ఆ రాష్ట్రం... ఆద్యంతం తమ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆరంభ వేడుకలు నిర్వహించింది.ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ... 2036లో భారత్‌లో ఒలింపిక్స్ నిర్వహించడమే తమ లక్ష్యమని... దీంతో దేశవ్యాప్తంగా క్రీడలకు మరింత ఆదరణ పెరుగుతుందని అన్నారు. ‘మీ సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు ప్రయ త్నాలు కొనసాగించండి.వాటికి మద్దతివ్వడంపై మేము దృష్టి పెడతాం. దేశాభివృద్ధిలో క్రీడలు ముఖ్యమైన భాగం అని బలంగా విశ్వసిస్తున్నాం. విశ్వక్రీడలకు ఆతిథ్యమిచ్చేందుకు ఆసక్తిగా ఉన్నాం. ఒలింపిక్స్ ఎక్కడ జరిగినా అన్నీ రంగాలు లాభపడతాయి. ఇలాంటి మెగా టోర్నీలతో అథ్లెట్లకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి’ అని నరేంద్ర మోదీ అన్నారు. కాగా రెండేళ్ల క్రితం ముంబై వేదికగా జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్లో ప్రధాని మోదీ 2036 ఒలింపిక్స్ఆతిథ్యానికి సిద్ధం అని ప్రకటించగా... దీనికి సంబంధించిన నివేదికను భారత ఒలింపిక్ సంఘం.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి అందించింది.ఈ క్రీడలకు డెహ్రాడూన్ ప్రధాన వేదిక కాగా... మొత్తం 7 నగరాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. 18 రోజుల పాటు జరగనున్న ఈ ఆటల్లో 32 క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. జాతీయ క్రీడల ఆరంభ వేడుకలు సాంస్కృతిక నృత్య కళారూపం ‘తాండవ్’తో ప్రారంభం కాగా.. ప్రముఖ సినీ గాయకుడు జుబిన్ నౌటియాల్ ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. అంతకుముందు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామితో కలిసి ప్రధాని మోదీ గోల్ఫ్ కార్ట్‌లో మైదానమంతా కలియతిరిగారు.అనంతరం స్థానిక సంప్రదాయ దుస్తుల్లో అథ్లెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అథ్లెట్ల మార్చ్‌పాస్ట్ అనంతరం ఉత్తరాఖండ్‌కు చెందిన భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్... క్రీడాజ్యోతిని ప్రధాని మోదీకి అందించారు. జ్యోతిని నిర్దిష్ట ప్రదేశంలో పెట్టిన ప్రధాని... క్రీడలు అధికారికంగా ప్రారంభమైనట్లు ప్రకటించారు. ఆరంభ వేడుకలు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ స్ఫూర్తి ప్రస్ఫుటించాయని ప్రధాని అన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర పక్షి మోనల్‌ను పోలి ఉండే విధంగా ‘మౌలి’ మస్కట్‌ను రూపొందించారు. మరిన్ని క్రీడావార్తలు2న రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీజీసీఏ) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తేదీన రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ జరగనుంది. బషీర్‌బాగ్ సమీపంలో లాల్‌బహదూర్ స్టేడియం యోగా హాల్లో ఈ టోర్నీని ఏర్పాటు చేశారు. అండర్–7, 9, 11, 13, 15 బాలబాలికల విభాగాల్లో ఈ టోర్నీ జరుగుతుంది.1–1–2010న లేదా ఆ తర్వాత పుట్టిన వారే ఈ టోర్నీలో ఆడేందుకు అర్హులు. స్విస్ ఫార్మాట్లో ఐదు రౌండ్లపాటు టోర్నీని నిర్వహిస్తారు. ప్రతి విభాగంలో టాప్–10లో నిలిచిన ప్లేయర్లకు ట్రోఫీలు, సర్టిఫికెట్లు, పతకాలు అందజేస్తామని టీజీసీఏ అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ తెలిపారు. ఈ టోర్నీలో పాల్గొనాలనుకునే వారు తమ ఎంట్రీలను జనవరి 31వ తేదీలోపు పంపించాలి. స్పాట్ ఎంట్రీలు స్వీకరించరు. వివరాలకు 7337578899 లేదా 7337399299 ఫోన్‌నంబర్లలో సంప్రదించాలి. శ్రీనిధి, నామ్ధారి మ్యాచ్ ‘డ్రా’ చండీగఢ్: ఐ–లీగ్‌లో శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) మూడో ‘డ్రా’ నమోదు చేసుకుంది. మంగళవారం నామ్ధారి ఫుట్‌బాల్ క్లబ్‌తో జరిగిన పోరును శ్రీనిధి జట్టు 1–1 గోల్స్‌తో ‘డ్రా’గా ముగించింది. శ్రీనిధి డెక్కన్ జట్టు తరఫున విలియమ్ అల్వెస్ ఒలీవైరా (45+1వ నిమిషంలో), నామ్ధారి జట్టు తరఫున క్లెడ్సన్ కార్వాలో డిసిల్వా (33వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. ఇరు జట్లు తొలి అర్ధభాగంలోనే ఒక్కో గోల్ సాధించాయి.ద్వితీయార్ధంలో రెండు జట్లు ఎంత ప్రయత్నించినా మరో గోల్ చేయలేకపోయాయి. గత నాలుగు మ్యాచ్‌ల్లో శ్రీనిధి జట్టుకు ఇది మూడో ‘డ్రా’ కాగా... వరుస విజయాలతో దూసుకెళ్తున్న నామ్ధారి జట్టు గెలుపు జోరుకు శ్రీనిధి క్లబ్ అడ్డుకట్ట వేసింది. తాజా సీజన్లో 11 మ్యాచ్‌లాడిన శ్రీనిధి జట్టు 3 విజయాలు, 5 పరాజయాలు, 3 ‘డ్రా’లతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని 8వ స్థానంలో ఉంది. 11 మ్యాచ్‌లాడిన నామ్ధారి ఫుట్‌బాల్ క్లబ్ 6 విజయాలు, 2 పరాజయాలు, 3 ‘డ్రా’లతో 21 పాయింట్లు సాధించి ‘టాప్’లో కొనసాగుతోంది. -
National Games: ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆరంభం
రుద్రాపూర్ (ఉత్తరాఖండ్): జాతీయ క్రీడలు మంగళవారం అధికారికంగా ప్రారంభంకానున్నా... కొన్ని క్రీడాంశాల్లో ఇప్పటికే పోటీలు మొదలయ్యాయి. బీచ్ హ్యాండ్‌బాల్‌లో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జట్లకు ఓటమి ఎదురైంది. పురుషుల విభాగం పూల్ ‘ఎ’లో ఆతిథ్య ఉత్తరాఖండ్ జట్టు 36–18 గోల్స్ తేడాతో తెలంగాణ జట్టును ఓడించగా... పూల్ ‘బి’లో ఉత్తరప్రదేశ్ జట్టు 41–37 గోల్స్ తేడాతో ఆంధ్రప్రదేశ్ జట్టుపై విజయం సాధించింది. మహారాష్ట్ర జట్టుకు స్వర్ణం మూడు అంశాల సమాహారమైన ట్రయాథ్లాన్ (స్విమ్మింగ్, రన్నింగ్, సైక్లింగ్) ఈవెంట్లో మణిపూర్, మహారాష్ట్ర క్రీడాకారులు స్వర్ణ పతకాలు సాధించారు. మిక్స్డ్ రిలే ఈవెంట్లో పార్థ్ సచిన్, డాలీ దేవిదాస్ పాటిల్, కౌశిక్ వినయ్ మలాండర్కర్, మాన్సిలతో కూడిన మహారాష్ట్ర బృందం పసిడి పతకం సొంతం చేసుకుంది.ఈ ఈవెంట్లో భాగంగా నలుగురు వేర్వేరుగా ముందుగా 300 మీటర్ల స్విమ్మింగ్ చేయాలి. ఆ తర్వాత 6.8 కిలోమీటర్లు సైక్లింగ్ చేయాలి. చివరగా 2 కిలోమీటర్లు రన్నింగ్ చేయాలి. ఈ మూడు ఈవెంట్లను కలిపి తక్కువ సమయంలో పూర్తి చేసిన మూడు జట్లకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు లభిస్తాయి. మహారాష్ట్ర బృందం 2గం:12ని:06 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది.సరుంగమ్ మెతీకి పసిడి పతకంఇక మధ్యప్రదేశ్ జట్టుకు రజతం, తమిళనాడు జట్టుకు కాంస్యం లభించాయి. పురుషుల ట్రయాథ్లాన్ వ్యక్తిగత ఈవెంట్లో మణిపూర్‌కు చెందిన సరుంగమ్ మెతీ స్వర్ణం... తెలీబా సోరమ్ రజతం... మహారాష్ట్ర ప్లేయర్ పార్థ్ కాంస్యం గెలిచారు. మహిళల ట్రయాథ్లాన్ వ్యక్తిగత ఈవెంట్లో డాలీ పాటిల్ (మహారాష్ట్ర) స్వర్ణం, మాన్సి (మహారాష్ట్ర) రజతం, ఆద్యా సింగ్ (మధ్యప్రదేశ్) కాంస్యం సాధించారు. ఫిబ్రవరి 14 వరకు... 38వ జాతీయ క్రీడలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా మంగళవారం అధికారికంగా మొదలవుతాయి. ఫిబ్రవరి 14వ తేదీ వరకు జరిగే ఈ క్రీడలనున ఉత్తరాఖండ్‌లోని ఏడు నగరాల్లో నిర్వహిస్తున్నారు. మొత్తం 32 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి. మరిన్ని క్రీడా వార్తలుసెమీస్లో బెంగాల్ టైగర్స్ రూర్కెలా: పురుషుల హాకీ ఇండియా లీగ్‌లో ష్రాచి రార్ బెంగాల్ టైగర్స్ జట్టు సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. సోమవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో బెంగాల్ టైగర్స్ 2–1 గోల్స్ తేడాతో ఢిల్లీ ఎస్జీ పైపర్స్ జట్టును ఓడించింది. ఈ గెలుపుతో బెంగాల్ టైగర్స్ జట్టు 18 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. మిగిలిన మూడు మ్యాచ్‌ల ఫలితాలు ఎలా ఉన్నా బెంగాల్ జట్టు టాప్–4లోనే ఉండనుంది. విండీస్ విజయం ముల్తాన్: బౌలర్ల హవా నడిచిన రెండో టెస్టులో వెస్టిండీస్ జట్టు 120 పరుగుల తేడాతో పాకిస్తాన్ జట్టును ఓడించింది. 1990 తర్వాత పాకిస్తాన్ గడ్డపై టెస్టుల్లో వెస్టిండీస్ గెలుపొందడం విశేషం. ఈ గెలుపుతో రెండు టెస్టుల సిరీస్ 1–1తో సమంగా ముగిసింది. ఇక 254 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో... ఓవర్‌నైట్ స్కోరు 76/4తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ జట్టు 44 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటైంది. విండీస్ స్పిన్నర్లు జోమెల్ వారికన్ (5/27), గుడకేశ్ మోతీ (2/35), కెవిన్ సింక్లెయిర్ (3/61) పాకిస్తాన్ జట్టును తిప్పేశారు. విండీస్ స్పిన్నర్లను ఎదుర్కోలేక మూడో రోజు ఆటలో పాక్ జట్టు 20 ఓవర్లు ఆడి మరో 57 పరుగులు జోడించి మిగతా ఆరు వికెట్లను కోల్పోయింది. విండీస్ ఎడంచేతి వాటం స్పిన్నర్ వారికన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించడం విశేషం. సంక్షిప్త స్కోర్లు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 163 ఆలౌట్ (41.1 ఓవర్లలో); పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్: 154 ఆలౌట్ (47 ఓవర్లలో)వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: 244 ఆలౌట్ (66.1 ఓవర్లలో)పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్: 133 ఆలౌట్ (44 ఓవర్లలో) (బాబర్ ఆజమ్ 31, రిజ్వాన్ 25, వారికన్ 5/27, సింక్లెయిర్ 3/61, గుడకేశ్ మోతీ 2/35). -
ఓవరాల్ చాంపియన్ మహారాష్ట్ర.. రాజా భళీంద్ర సింగ్ ట్రోఫీ సొంతం
పనాజీ (గోవా): జాతీయ క్రీడల్లో మహారాష్ట్ర 1994 తర్వాత తొలిసారి ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. గురువారం ముగిసిన ఈ క్రీడల్లో మహారాష్ట్ర 80 స్వర్ణాలు, 69 రజతాలు, 79 కాంస్యాలతో కలిపి మొత్తం 228 పతకాలతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఓవరాల్ చాంపియన్ హోదాలో రాజా భళీంద్ర సింగ్ ట్రోఫీని మహారాష్ట్ర సొంతం చేసుకుంది. పురుషుల విభాగంలో తమిళనాడు స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ ‘ఉత్తమ అథ్లెట్’గా... మహిళల విభాగంలో ఒడిశా జిమ్నాస్ట్‌లు సంయుక్త కాలే, ప్రణతి నాయక్ ‘ఉత్తమ అథ్లెట్స్’గా ఎంపికయ్యారు. ఉత్తమ అథ్లెట్‌గా జిమ్నాస్ట్ సంయుక్త కాలే(PC: Nat_Games_Goa) ఆంధ్రప్రదేశ్‌కు 27 పతకాలు మొత్తంగా 42 క్రీడాంశాల్లో 11 వేలకుపైగా క్రీడాకారులు ఈ క్రీడల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ 7 స్వర్ణాలు, 5 రజతాలు, 15 కాంస్యాలతో కలిపి 27 పతకాలతో 19వ స్థానంలో... తెలంగాణ 4 స్వర్ణాలు, 10 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి 25 పతకాలతో 22వ స్థానంలో నిలిచాయి. ముగింపు వేడుకలకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
వృత్తి అగర్వాల్ కు ఐదో పతకం..
-
వ్రితి అగర్వాల్‌కు కాంస్యం.. తెలంగాణ ఖాతాలో 12వ పతకం
గోవాలో జరుగుతున్న జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో 12వ పతకం చేరింది. మహిళల స్విమ్మింగ్ 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఈవెంట్లో వ్రితి అగర్వాల్ (2ని:22.28 సెకన్లు) కాంస్య పతకం నెగ్గి ఈ క్రీడల్లో మూడో పతకం సాధించింది. ఓవరాల్‌గా తెలంగాణ 2 స్వర్ణాలు, 3 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి 12 పతకాలతో 22వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ 4 స్వర్ణాలు, 2 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి 15 పతకాలతో 17వ స్థానంలో ఉంది. -
ఆంధ్ర ప్రదేశ్‌కు స్వర్ణం, కాంస్యం
పనాజీ: జాతీయ క్రీడల్లో మంగళవారం ఆంధ్రప్రదేశ్ అథ్లెట్లు రెండు పతకాలతో మెరిశారు. మహిళల 4X100 మీటర్ల రిలే ఫైనల్లో చెలిమి ప్రత్యూష, భవానీ యాదవ్, మధుకావ్య, జ్యోతి యర్రాజీలతో కూడిన ఏపీ బృందం పోటీని 45.61 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది. మహిళల జావెలిన్ త్రోలో బల్లెంను 52.55 మీటర్ల దూరం విసిరి ఏపీకి చెందిన రష్మీ శెట్టి కాంస్యం నెగ్గింది. -
జాతీయ క్రీడల్లో జ్యోతి యర్రాజీకి స్వర్ణం.. ఆంధ్రప్రదేశ్ ఖాతాలో మూడవది
పనాజీ: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌కు మూడో స్వర్ణ పతకం లభించింది. సోమవారం జరిగిన అథ్లెటిక్స్ ఈవెంట్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి యర్రాజీ చాంపియన్‌గా అవతరించింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి 13.22 సెకన్లలో అందరికంటే వేగంగా ఫైనల్ రేసును ముగించి అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు తెలంగాణ ఖాతాలో 11వ పతకం చేరింది. మహిళల స్విమ్మింగ్ 800 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో వ్రితి అగర్వాల్ రజత పతకం సాధించింది. -
వ్రితి అగర్వాల్‌కు కాంస్యం
పనాజీ: జాతీయ క్రీడల్లో తెలంగాణకు ఎనిమిదో పతకం లభించింది. ఆదివారం జరిగిన మహిళల స్విమ్మింగ్ 200 మీటర్ల ఫ్రీస్టయిల్లో తెలంగాణ అమ్మాయి వ్రితి అగర్వాల్ కాంస్య పతకం గెలిచింది. వ్రితి 200 మీటర్ల దూరాన్ని 2ని:09.42 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం తెలంగాణ ఎనిమిది పతకాలతో 20వ ర్యాంక్‌లో ఉంది. పురుషుల టేబుల్ టెన్నిస్ టీమ్ ఈవెంట్లో తెలంగాణ జట్టు 2–3తో ఢిల్లీ జట్టు చేతిలో ఓడిపోయింది. అథ్లెటిక్స్ 100 మీటర్ల విభాగంలో ఎలాకియాదాసన్ (తమిళనాడు), స్నేహ (కర్ణాటక) చాంపియన్స్‌గా అవతరించారు. -
నేషనల్ గేమ్స్‌కు ఆంధ్ర ప్రదేశ్ నుండి 609 మంది విద్యార్థుల ఎంపిక
సాక్షి, విజయవాడ: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగే 66వ నేషనల్ స్కూల్ గేమ్స్ కు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి 609 మంది విద్యార్థులు ఎంపికయ్యారని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి జి. భానుమూర్తి రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఢిల్లీ, భోపాల్, గ్వాలియర్ నగరాల్లో జూన్ 6 నుండి 12 వరకు జరిగే ఈ పోటీల్లో అండర్ 19 బాలురు, బాలికలు 21 క్రీడా అంశాల్లో పోటీపడతారని ఆయన పేర్కొన్నారు. మన రాష్ట్రం నుండి 306 మంది బాలురు, 303 మంది బాలికలు, 49 మంది కోచ్‌లు, 45 మంది మేనేజర్లు, నలుగురు హెడ్ అఫ్ ది డెలిగేట్లతో కలిపి మొత్తం 707 మంది పాల్గొననున్నారని తెలిపారు. పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి, అంతర్ జిల్లాల స్థాయిలో పోటీలు నిర్వహించి ప్రతిభావంతులైన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయడమైందని వివరించారు. జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనే క్రీడాకారుల రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రయాణ ఖర్చులు, రోజువారీ కరువు భత్యం (డిఏ), స్పోర్ట్స్ కిట్స్ కొరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు. రాష్ట్రం నుండి పాల్గొననున్న క్రీడాకారులు అథ్లెటిక్స్, బాక్సింగ్, ఫుట్ బాల్, జూడో, వాలీ బాల్, టేబుల్ టెన్నిస్, హాకీ, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, బాస్కెట్ బాల్, కుస్తీ, వెయిట్ లిఫ్టింగ్, తైక్వాండో, యోగా, ఖో ఖో, కబడ్డీ, చెస్, టెన్నిస్, హ్యాండ్ బాల్, షూటింగ్, జిమ్నాస్టిక్స్ వంటి 21 క్రీడాంశాల్లో పాల్గొంటారని భానుమూర్తి ప్రకటించారు. -
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ జాతీయ క్రీడా పోటీలకు వేదికలు!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇవ్వనున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ 3వ జాతీయ క్రీడాపోటీలకు వేదికలు ఖరారయ్యాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కలిపి ఐదు చోట్ల పోటీలను నిర్వహించనున్నారు. డిసెంబర్ 17 నుంచి 23వ తేదీ వరకు 15 వ్యక్తిగత విభాగాల్లో 2,763 మంది, ఏడు టీమ్ విభాగాల్లో 2,207 మంది దేశ వ్యాప్తంగా క్రీడాకారులు పోటీపడనున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గిరిజన పాఠశాలల క్రీడా పోటీల్లో 20 రాష్ట్రాలు ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. అత్యధికంగా ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి 480 చొప్పున, అత్యల్పంగా అరుణాచల్ ప్రదేశ్ 61, సిక్కిం 83, ఉత్తర ప్రదేశ్ 96 మంది క్రీడాకారులతో బరిలోకి దిగనున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ ఎన్.ప్రభాకర్‌రెడ్డి బుధవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా ఏకలవ్య జాతీయ పోటీలను సమర్థవంతంగా చేపడతామన్నారు. పోటీలు ప్రారంభానికి ముందే ఏపీ క్రీడాకారులకు నిపుణులైన శిక్షకులతో తర్ఫీదు ఇవ్వనున్నట్టు వివరించారు. కచ్చితంగా పతకాలు వచ్చే విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. -
'మెడల్స్ అక్కడే వదిలేసి రమ్మంటారా?'.. స్టార్ స్విమ్మర్‌కు అవమానం
భారత స్టార్ స్విమ్మర్ శ్రీహరి నటరాజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. నటరాజ్‌తో పాటు అతని బృందానికి ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది భారీ జరిమానా విధించింది. లగేజీ ఎక్కువగా ఉండమే దీనికి కారణం అని తెలిసింది. అయితే లగేజీలో ఉన్నవాటిలో ఎక్కువమొత్తంలో మెడల్స్ ఉన్నాయి. వాటి బరువు వల్లే లగేజీ బరువు పెరిగిపోయిందని శ్రీహరి నటరాజ్ బృందం పేర్కొంది. 36వ జాతీయ క్రీడలు ముగించుకొని వస్తున్న సమయంలో గుజరాత్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదే విషయమై శ్రీహరి నటరాజ్ మాట్లాడుతూ.. '' గుజరాత్లో జరిగిన 36వ జాతీయ క్రీడలు ముగించుకొని మా బృందంతో కలిసి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాను. కానీ ఇండిగో సిబ్బంది మాతో దురుసుగా ప్రవర్తించడమే గాక అదనపు లగేజీ కారణంగా భారీ జరిమానా విధించారు. అయితే అదనపు లగేజీగా భావిస్తున్న వాటిలో మెడల్స్, అథ్లెట్స్‌కు సంబంధించిన వస్తువులే ఉన్నాయి. నిజాయితీగా చెప్పాలంటే వారి విధించిన జరిమానా మాకు పెద్ద విషయం కాకపోవచ్చు..కానీ నాతో పాటు మా బృందాన్ని ట్రీట్ చేసిన తీరు బాగాలేదు. సిబ్బంది తీరు చూస్తుంటే ఎక్కడ మెడల్స్ గెలిచామో అదే స్థలంలో విడిచిపెట్టాలన్నట్లుగా ఉంది.'' అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక జాతీయ క్రీడల్లో తొలిసారి పాల్గొన్న శ్రీహరి నటరాజ్ అదరగొట్టాడు. జాతీయ క్రీడల్లో కర్నాటక తరపున పాల్గొన్న నటరాజ్ వివిధ విభాగాలు కలిపి ఆరు గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నాడు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లో మంచి ప్రదర్శన కనబరిచిన శ్రీహరి నటరాజ్ తృటిలో పతకం కోల్పోయినప్పటిక A-స్టాండర్డ్‌లో చోటు సంపాదించాడు. ఆ తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లోనూ పతకం సాధించడంలో విఫలమైనప్పటికి 100 మీ, 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్స్‌లో మంచి ప్రదర్శన కనబరిచాడు. Dear @IndiGo6E I was returning from the National Games held in Gujarat, and the staff not only behaved badly, but also charged us a hefty amount for excess baggage which was the medals and goodies that we athletes had won. — Srihari Nataraj OLY (@srihari3529) October 10, 2022 Honestly, the amount wasn't an issue, it's the the way they treated me and my teammates. Should we leave the medals we win back at the venue?🤔 @IndiGo6E — Srihari Nataraj OLY (@srihari3529) October 10, 2022 National Games Round Up: Srihari Nataraj finishes campaign with a flourish, claiming sixth gold with 100m Freestyle win@YASMinistry@IndiaSports @PIB_Indiahttps://t.co/bVhWkybCuu pic.twitter.com/3EhIB1yWbT — PIB in Tripura (@PIBAgartala) October 9, 2022 చదవండి: పుట్టినరోజున హార్దిక్ పాండ్యా ఎమోషనల్.. బెలూన్ వరల్డ్‌కప్.. క్రీడాకారిణి ప్రాణం మీదకు -
కృష్ణ చైతన్య–మహేశ్ జోడీకి స్వర్ణం
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిదో స్వర్ణ పతకం లభించింది. ఆదివారం జరిగిన పురుషుల బీచ్ వాలీబాల్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన కృష్ణ చైతన్య–మహేశ్ జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో కృష్ణ చైతన్య–మహేశ్ ద్వయం 22–24, 23–21, 15–11తో కృష్ణంరాజు–నరేశ్ (ఆంధ్రప్రదేశ్) జోడీపై విజయం సాధించింది. 2015 కేరళ జాతీయ క్రీడల బీచ్ వాలీబాల్ ఫైనల్లో కృష్ణంరాజు–నరేశ్ జోడీ చేతిలో ఓడిపోయి రజత పతకం నెగ్గిన కృష్ణ చైతన్య ఏడేళ్ల తర్వాత అదే జంటను ఓడించి ఈసారి స్వర్ణ పతకం సాధించడం విశేషం. 2015 కేరళ జాతీయ క్రీడల్లో రవీందర్ రెడ్డితో కలిసి కృష్ణ చైతన్య బరిలోకి దిగాడు. ఈసారి మహేశ్‌తో జతకట్టిన కృష్ణ చైతన్య పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. కనోయింగ్‌లో 1000 మీటర్ల స్ప్రింట్ విభాగంలో తెలంగాణకు చెందిన అమిత్ కుమార్ సింగ్ కాంస్య పతకాన్ని సాధించాడు. అమిత్ రేసును 4ని:31.533 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచాడు. పురుషుల బాక్సింగ్‌లో సర్వీసెస్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ 57 కేజీల విభాగంలో సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్ 5–0తో రోహిత్ మోర్ (ఢిల్లీ)పై గెలిచాడు. -
National Games 2022: జ్యోతి పసిడి పరుగు
గాంధీనగర్: జాతీయ క్రీడల్లో శనివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు పతకాలతో మెరిశారు. మహిళల అథ్లెటిక్స్ 100 మీటర్ల విభాగంలో విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి యెర్రాజీ స్వర్ణ పతకం సాధించగా... 400 మీటర్ల విభాగంలో దండి జ్యోతిక శ్రీ రజత పతకం సొంతం చేసుకుంది. పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ 67 కేజీల విభాగంలో నీలం రాజు రజత పతకం దక్కించుకున్నాడు. మరోవైపు తెలంగాణ యువ షూటర్ ఇషా సింగ్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో విజేతగా నిలిచి బంగారు పతకాన్ని గెల్చు కుంది. రోలర్ స్కేటింగ్ కపుల్ డ్యాన్స్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన అనుపోజు కాంతిశ్రీ–చలంచర్ల జూహిత్ జోడీ కాంస్య పతకాన్ని సాధించింది. ఈ ద్వయం 71 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ స్కేటర్ ఏలూరి కృష్ణసాయి రాహుల్ –యాష్వి శిరీష్ షా జోడీ 90.8 పాయింట్లతో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జ్యోతి యెర్రాజీ అదే ఉత్సాహంతో జాతీయ క్రీడల్లోనూ అదరగొట్టింది. 100 మీటర్ల రేసును జ్యోతి 11.51 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. అర్చన (తమిళనాడు; 11.55 సెకన్లు) రజతం, డియాండ్ర (మహారాష్ట్ర; 11.62 సెకన్లు) కాంస్యం సాధించారు. 400 మీటర్ల ఫైనల్ రేసును జ్యోతిక శ్రీ 53.30 సెకన్లలో ముగించి రెండో స్థానంలో నిలిచి రజతం గెలిచింది. ఐశ్వర్య మిశ్రా (మహారాష్ట్ర; 52.62 సెకన్లు) స్వర్ణం, రూపల్ చౌదరీ (ఉత్తరప్రదేశ్; 53.41 సెకన్లు) కాంస్యం సొంతం చేసుకున్నారు. వెయిట్‌లిఫ్టింగ్ 67 కేజీల విభాగంలో నీలం రాజు మొత్తం 270 కేజీలు (స్నాచ్‌లో 124+క్లీన్ అండ్ జెర్క్‌లో 146) బరువెత్తి రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు. 73 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్ జె.కోటేశ్వర రావు 280 కేజీల బరువెత్తి నాలుగో స్థానంలో నిలిచాడు. శుక్రవారం రాత్రి జరిగిన రోలర్ స్పోర్ట్స్ ఆర్టిస్టిక్ సింగిల్ ఫ్రీ స్కేటింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆకుల సాయిసంహిత రజతం, భూపతిరాజు అన్మిష కాంస్య పతకం సాధించారు. -
National Games 2022: తెలంగాణ నెట్‌బాల్ జట్టుకు రజతం
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో తెలంగాణ రాష్ట్రం ఖాతాలో నాలుగో పతకం చేరింది. టేబుల్ టెన్నిస్ (టీటీ)లో ఇప్పటికే మూడు పతకాలు లభించగా... తాజాగా నెట్‌బాల్ క్రీడాంశంలో తెలంగాణ జట్టుకు రజత పతకం దక్కింది. భావ్‌నగర్‌లో శుక్రవారం జరిగిన పురుషుల నెట్‌బాల్ ఫైనల్లో తెలంగాణ 73–75తో (16–9, 12–18, 16–20, 29–28) హరియాణా చేతిలో పోరాడి ఓడిపోయింది. రజత పతకం నెగ్గిన తెలంగాణ జట్టులో బి.విక్రమాదిత్య రెడ్డి, సయ్యద్ అమ్జాద్ అలీ, జన్ను హరీశ్, కంబాల శ్రీనివాసరావు, ముజీబుద్దీన్, మొహమ్మద్ ఇస్మాయిల్, పి.వంశీకృష్ణ, కె.సుమన్, కురకుల సంయుత్, బి.రంజీత్ కుమార్, సయ్యద్ మొహమ్మద్ అహ్మద్, ఎన్.లునావత్ అఖిల్ సభ్యులుగా ఉన్నారు. మహిళల టీమ్ టెన్నిస్‌లో తెలంగాణ జట్టు తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. తెలంగాణ 0–2తో గుజరాత్ చేతిలో ఓడిపోయింది. మరోవైపు మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌లో టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత, కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ మీరాబాయి చాను 49 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. మణిపూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మీరాబాయి మొత్తం 191 కేజీలు (స్నాచ్‌లో 84+క్లీన్ అండ్ జెర్క్‌లో 107) బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది. -
ఇద్దరూ ఒకప్పుడు టీమిండియా కెప్టెన్లే! ప్రేమా..పెళ్లి.. కవలలు.. మూడేళ్ల తర్వాత..
భార్యాభర్తలు.. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ పరస్పర సమన్వయంతో ముందడుగు వేస్తే జీవితం సాఫీగా సాగిపోతుంది. జీవనసహచరులు ఒకరికొకరు అండగా నిలిస్తే అనుకున్న లక్ష్యాలు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. భారత రగ్బీ క్రీడాకారుల జంట నేహా పర్దేశీ- గౌతమ్ దాగర్ ఈ కోవకే చెందుతారు. భారత రగ్బీ జట్ల మాజీ కెప్టెన్లు అయిన వీరిద్దరు తమ ప్రేమను పెళ్లి పీటల దాకా తీసుకువచ్చి 2019, ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నారు. ప్రణయ బంధాన్ని వైవాహిక బంధంగా మార్చుకుని దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. నేహా- గౌతమ్ జీవితంలోని సంతోషాలను రెట్టింపు చేస్తూ గతేడాది నవంబరులో వీరికి కవలలు జన్మించారు. తమ కలల పంటకు దెమీరా దాగర్(కూతురు), కబీర్ దాగర్(కొడుకు)గా నామకరణం చేశారు ఈ క్రీడా దంపతులు. (Photo Credit: Gautam Dagar Facebook) ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే.. సిజేరియన్ ద్వారా కవలలకు జన్మనిచ్చిన నేహా.. తిరిగి మైదానంలో దిగేందుకు సిద్ధమయ్యారు. జాతీయ క్రీడల్లో భాగంగా ఈ ‘సూపర్ మామ్’ రీఎంట్రీ ఇవ్వనున్నారు. గుజరాత్ వేదికగా 36వ జాతీయ క్రీడలు గురువారం అట్టహాసంగా మొదలైన విషయం తెలిసిందే. గతంలో కనీవినీ ఎరుగని రీతిలో సుమారు లక్షా 25 వేల మందితో కిక్కిరిసిన నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించిన ఆరంభ వేడుకల సంబరం అంబరాన్నంటింది. 36 క్రీడాంశాలు.. దాదాపుగా 600 మంది గుజరాతీ కళాకారులు తమ సాంస్కృతిక ప్రదర్శనతో కట్టిపడేశారు. ప్రేక్షకుల జయజయధ్వానాల మధ్య భారత ప్రధాని మోదీ అంగరంగ వైభవంగా ఈ ఆటల పండగను ప్రారంభించారు. జాతీయ క్రీడలు- 2022లో భాగంగా సుమారు 7000 మందికి పైగా అథ్లెట్లు 36 క్రీడాంశాల్లో పాల్గొననున్నారు. ఇందులో నేహా కూడా ఒకరు. మాతృత్వపు మధురిమలు ఆస్వాదిస్తూ.. తల్లిగా బాధ్యతలు నెరవేరుస్తూ ఇన్నాళ్లు ఆటకు దూరంగా ఉన్న ఆమె దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ రగ్బీ ఆడనున్నారు. ఈ నేపథ్యంలో టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నేహా మాట్లాడుతూ.. సిజేరియన్ తర్వాత 20 రోజులకే ట్రెయినింగ్ ఆరంభించానంటూ ఆట పట్ల అంకిత భావాన్ని చాటుకున్నారు. ఆత్మవిశ్వాసం కోల్పోను ‘‘ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ధైర్యంగా ఉంటాను. ఇప్పుడు నా ఆటలో కాస్త వేగం తగ్గినట్లు అనిపించవచ్చు. కానీ మానసికంగా నేనెంతో దృఢంగా ఉన్నాను. క్రీడాకారిణిగా నా బాధ్యతలను గతంలో కంటే మెరుగ్గా నెరవేర్చగలను. ఎందుకంటే.. నాకిపుడు మల్టీటాస్కింగ్ అలవాటైంది. ఇద్దరు చిన్నారుల ఆలనాపాలనా చూసుకుంటూనే తిరిగి రగ్బీ ఆడేందుకు సిద్ధమయ్యాను. సిజేరియన్ తర్వాత 20 రోజులకే ఫిజికల్ ట్రెయినింగ్ మొదలు పెట్టాను. ఫిట్నెస్ సాధించాను. తల్లిగా.. ప్లేయర్‌గా నా కర్తవ్యాన్ని నెరవేర్చడాన్ని నేను పూర్తి ఆస్వాదిస్తున్నా’’ అని ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న 29 ఏళ్ల నేహా చెప్పుకొచ్చారు. తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకోవడమే తన ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. కాగా 2019లో చివరిసారిగా టీమిండియాకు ఆడిన నేహా.. శుక్రవారం నాటి మ్యాచ్‌తో రీఎంట్రీకి సన్నద్ధమయ్యారు. ఇక నేహా భర్త గౌతమ్ దాగర్ గతంలో భారత పురుషుల రగ్బీ జట్టుకు సారథిగా వ్యవహరించాడు. చదవండి: T20 WC 2022: 'బుమ్రా స్థానంలో అతడికి అవకాశమివ్వండి' -
అంగరంగ వైభవంగా 36వ జాతీయ క్రీడల వేడుకలు
36వ జాతీయ క్రీడా ప్రారంభోత్సవ వేడుకలు గురువారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ టార్చ్‌ను వెలిగించి క్రీడలను ప్రారంభించారు. అనంతరం జాతీయ క్రీడలనుద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా, రెజ్లర్ రవికుమార్ దహియాలు పాల్గొన్నారు. అక్టోబర్ 10 వరకు జరిగే ఈ క్రీడల్లో 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు భారత త్రివిధ దళాలకు చెందిన సర్వీసెస్ జట్టు నుంచి మొత్తం ఏడువేల మంది క్రీడాకారులు పోటీపడనున్నారు. మొత్తం 36 ఈవెంట్స్‌లో పతకాల కోసం పోటీలుంటాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, భావ్‌నగర్ నగరాల్లో మ్యాచ్‌లను ఏర్పాటు చేశారు. చివరిసారి 2015లో జరిగిన జాతీయ క్రీడలకు కేరళ ఆతిథ్యమిచ్చింది. ఆ క్రీడల్లో తెలంగాణ 8 స్వర్ణాలు, 14 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి 33 పతకాలతో 12వ ర్యాంక్‌లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 6 స్వర్ణాలు, 3 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి 16 పతకాలతో 18వ స్థానంలో నిలిచింది. The contingents of all states and UTs arrive at the opening ceremony of the 36th National Games at Narendra Modi stadium in Ahmedabad, Gujarat. pic.twitter.com/watT2xAmG8 — ANI (@ANI) September 29, 2022 -
National Games 2022: నేటి నుంచి జాతీయ క్రీడలు
అహ్మదాబాద్: ఆయా క్రీడాంశాల్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు లేకుండానే నేటి నుంచి జాతీయ క్రీడలు అధికారికంగా మొదలుకానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ క్రీడలను ప్రారంభిస్తారు. అక్టోబర్ 10 వరకు జరిగే ఈ క్రీడల్లో 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు భారత త్రివిధ దళాలకు చెందిన సర్వీసెస్ జట్టు నుంచి మొత్తం ఏడువేల మంది క్రీడాకారులు పోటీపడనున్నారు. మొత్తం 36 ఈవెంట్స్‌లో పతకాల కోసం పోటీలుంటాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, భావ్‌నగర్ నగరాల్లో మ్యాచ్‌లను ఏర్పాటు చేశారు. సైక్లింగ్ ఈవెంట్‌ను మాత్రం న్యూఢిల్లీలో నిర్వహిస్తారు. భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) ఎల్లుండి నుంచి చైనాలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనాల్సి ఉండటంతో... టీటీ పోటీలను ఈనెల 20 నుంచి 24 వరకు నిర్వహించారు. కబడ్డీ, లాన్ బౌల్స్, రగ్బీ క్రీడాంశాల్లోనూ పోటీలు మొదలయ్యాయి. ఏడేళ్ల తర్వాత మళ్లీ జాతీయ క్రీడలు జరుగుతున్నాయి. చివరిసారి 2015లో జరిగిన జాతీయ క్రీడలకు కేరళ ఆతిథ్యమిచ్చింది. ఆ క్రీడల్లో తెలంగాణ 8 స్వర్ణాలు, 14 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి 33 పతకాలతో 12వ ర్యాంక్‌లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 6 స్వర్ణాలు, 3 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి 16 పతకాలతో 18వ స్థానంలో నిలిచింది. -
National Games 2022: రెండు రజత పతకాలు నెగ్గిన ఆకుల శ్రీజ
జాతీయ క్రీడల టేబుల్ టెన్నిస్ (టీటీ) ఈవెంట్లో తెలంగాణ క్రీడాకారిణి, జాతీయ చాంపియన్ ఆకుల శ్రీజ మెరిసింది. గుజరాత్‌లోని సూరత్‌లో శనివారం టీటీ ఈవెంట్ ముగిసింది. ఈ పోటీల్లో శ్రీజ మహిళల సింగిల్స్‌లో రజతం... మిక్స్డ్ డబుల్స్‌లో తెలంగాణకే చెందిన స్నేహిత్‌తో కలిసి రజతం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో శ్రీజ–స్నేహిత్ (తెలంగాణ) ద్వయం 8–11, 5–11, 6–11తో మనుష్ ఉత్పల్ షా–కృత్విక సిన్హా రాయ్ (గుజరాత్) జోడీ చేతిలో ఓడిపోయింది. అనంతరం జరిగిన సింగిల్స్ ఫైనల్లో శ్రీజ 8–11, 7–11, 8–11, 14–12, 9–11తో సుతీర్థ ముఖర్జీ (బెంగాల్) చేతిలో ఓటమి పాలైంది. జాతీయ క్రీడలు అధికారికంగా ఈనెల 29 నుంచి మొదలుకానున్నాయి. అయితే ప్రపంచ టీటీ చాంపియన్‌షిప్‌లో భారత జట్లు పాల్గొనాల్సి ఉండటంతో ముందుగానే టీటీ ఈవెంట్‌ను నిర్వహించారు. -
తెలంగాణకు కాంస్య పతకం
సూరత్: అధికారికంగా జాతీయ క్రీడలు ఇంకా ప్రారంభంకాకముందే తెలంగాణ జట్టు పతకాల ఖాతా తెరిచింది. మహిళల టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ ఈవెంట్లో జాతీయ సింగిల్స్ చాంపియన్ ఆకుల శ్రీజ, నిఖత్ బాను, వరుణి జైస్వాల్, గార్లపాటి ప్రణీత, మోనిక మనోహర్ సభ్యులుగా ఉన్న తెలంగాణ జట్టు కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన టీమ్ ఈవెంట్ సెమీఫైనల్స్‌లో తెలంగాణ 0–3తో పశ్చిమ బెంగాల్ చేతిలో... తమిళనాడు 1–3తో మహారాష్ట్ర చేతిలో ఓడిపోయి కాంస్య పతకాలు దక్కించుకున్నాయి. బెంగాల్‌తో జరిగిన సెమీఫైనల్స్‌లో తొలి మ్యాచ్‌లో వరుణి జైస్వాల్ 7–11, 11–13, 4–11తో సుతీర్థ ముఖర్జీ చేతిలో... రెండో మ్యాచ్‌లో ఆకుల శ్రీజ 9–11, 11–7, 11–13, 11–9, 12–14తో ఐహిక ముఖర్జీ చేతిలో... మూడో మ్యాచ్‌లో నిఖత్ బాను 10–12, 8–11, 4–11, 13–11, 9–11తో మౌమా దాస్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఫైనల్లో పశ్చిమ బెంగాల్ 3–1తో మహారాష్ట్రను ఓడించి స్వర్ణ పతకాన్ని సాధించగా, మహారాష్ట్ర రజతంతో సరిపెట్టుకుంది. పురుషుల టీమ్ ఈవెంట్లో స్నేహిత్, మొహమ్మద్ అలీ, అమన్, ఫారూఖి, వరుణ్ శంకర్‌లతో కూడిన తెలంగాణ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. పురుషుల టీమ్ ఈవెంట్ ఫైనల్లో ఆతిథ్య గుజరాత్ 3–0తో ఢిల్లీని ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. జాతీయ క్రీడలు అధికారికంగా ఈనెల 29న ప్రారంభంకానున్నాయి. అయితే భారత టీటీ జట్లు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 9 వరకు చైనాలో జరగనున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనాల్సి ఉండటంతో జాతీయ క్రీడల నిర్వాహకులు టీటీ ఈవెంట్‌ను ముందస్తుగా నిర్వహిస్తున్నారు. -
ఏడేళ్ల తర్వాత క్రీడల పండుగ.. ఎక్కడంటే..?
దేశీయ అథ్లెట్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రీడల పండుగకు మూహూర్తం ఖరారైంది. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ క్రీడల నిర్వహణకు మోక్షం లభించింది. ఈ ఏడాది చివర్లో 36వ జాతీయ క్రీడలను నిర్వహించేందుకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 వరకు గుజరాత్ వేదికగా జాతీయ క్రీడలు నిర్వహించనున్నట్లు ఐవోఏ ప్రకటించింది. ఈ విషయాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ట్విటర్ ద్వారా ధృవీకరించారు. దేశీయ క్రీడల పండుగ నిర్వహణకు అవకాశం కల్పించినందుకు ఐవోఏకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, నేషనల్ గేమ్స్ చివరిసారిగా 2015లో కేరళ వేదికగా జరిగాయి. ఆ తర్వాత పలు కారణాల వల్ల క్రీడా సంబురం వాయిదా పడుతూ వస్తుంది. 2020లో గోవా వేదికగా వీటిని నిర్వహించాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. చదవండి: Wimbledon 2022: ఎదురులేని జొకోవిచ్ -
దేశీయ హాకీకి... ‘విదేశీ చీడ’
స్వతంత్ర భారత రిపబ్లిక్లో ఆదినుంచీ దేశీయ క్రీడలకు పట్టిన చీడ, పీడ ఏమిటంటే.. ప్రధానంగా వలస భారతంలో సంపన్న రాచరిక ప్రభువులు తమ కొడుకుల కోసమని ఇంగ్లాండ్ నుంచి దేశంలోకి దిగుమతి చేసిన క్రికెట్ క్రీడే! అదిమొదలు ఈ ‘జీడి’ అంటుకుపోయి దేశీయ, గ్రామీణ, పట్టణ జాతీయక్రీడలను ధ్వంసం చేస్తూ వచ్చింది. ఈ విదేశీ క్రీడా బానిసత్వం ఫలితంగానే అనేక దేశీయ క్రీడలకు ముఖ్యంగా గొప్ప జాతీయ క్రీడా శిఖరం ‘హాకీ’కి ప్రోత్సాహం కరువై కుంటుపడిపోతూ వచ్చింది. చెడుగుడు, కోకో, కర్రా–బిళ్ల ఆట, వగైరా దేశీయ క్రీడలకు ఖర్మకాలి మన దేశంలో గిరాకీ లేదు. ఎందుకని? విదేశీ క్రికెట్‌లాగా రెండుచేతులా అవినీతికి పాల్పడి వందలాది కోట్లు దోచుకోవడానికి వీలైన వ్యాపారానికి వీలులేని సామాన్య ప్రజల దేశవాళీ క్రీడలివి. బహుశా అందుకనే విదేశీ క్రికెట్ పట్ల అంత గిరాకీ.. దేశీయ క్రీడలపట్ల అంత పరాకు, చిరాకూ!! సుమారుగా గత యాభై ఏళ్లుగా దేశవాళీ ‘హాకీ’ లాంటి జాతీయ క్రీడలకు, గ్రామీణ క్రీడలకు పట్టిన విదేశీ వలస పాలనావశేషంగా భారతదేశానికి అంటుకున్న వ్యాధులలో ఒకటి ‘అంటూ సొంటూ’ లేని క్రికెట్ క్రీడ! అలాంటి క్రికెట్‌ను భారత జాతీయ క్రీడ అయిన ‘హాకీ’ అర్ధ శతాబ్ది తరువాత మొన్ననే ముగిసిన ప్రపంచస్థాయి టోక్యో ఒలింపిక్స్‌లో ‘బ్రహ్మభేద్యం’గా తన పూర్వ ప్రతిష్టను నిలబెట్టుకోవడమేగాక తిరిగి జాతీయ క్రీడలకే తల మానికంగా నిలవడం జాతీయ క్రీడాభిమానులందరి హర్షోద్రేకాలకు కారణమైంది. అంతేగాదు, సుమారు గత వందేళ్ల వ్యవధిలో నాటి పారిస్ ఒలింపిక్స్ నుంచి నిన్నమొన్నటి టోక్యో ప్రపంచ ఒలింపిక్స్ దాకా మన జాతీయ హాకీ పలుసార్లు స్వర్ణాలు కైవసం చేసుకోవడమే కాకుండా తాజాగా అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం, హాకీలో కాంస్యం సాధించి, ప్రపంచ ఒలింపిక్స్ చరిత్రలో భారత్ ఇంతవరకు పొందిన మొత్తం 47 స్థానాల హోదాను మరొక మెట్టుకు నెట్టి 48వ స్థానానికి చేర్చడం మరొక ఘనవిజయం. రైతు బిడ్డకు స్వర్ణ పతకం ఇందుకు సూత్రధారిగా నిలిచిన భారత సైనిక సుబేదార్ టోక్యో విశ్వక్రీడల్లో ‘ఈటె’ (జావెలిన్‌త్రో)ను అనితరసాధ్యమైన దూరానికి (87.58 మీటర్లు) విసిరి మన ఒలింపిక్స్ పతకాల జాబితానే సువర్ణ ఖచితం చేసిన రైతుబిడ్డ నీరజ్ చోప్రా! అయితే, ఈసారైనా పట్టుమని పది పతకాలైనా వస్తాయని ఆశించిన ఇండియాకు గతంలో కన్నా ఒకే ఒక్క పతకం కలిసొచ్చి ఆరునుంచి ఏడు మెడల్స్‌కు పాకింది. (ఒక స్వర్ణం, 2 రజతం, 4 కాంస్య, ఎటు తిరగేసినా మొత్తం ఏడు పత కాలు) ! ఇలా వలస భారతం నేటి స్వతంత్ర భారత రిపబ్లిక్ వరకూ 10 బంగారు పతకాలతో సహా ఇండియా దక్కించుకున్న మొత్తం 35 పతకాలలో ఎనిమిది పతకాలు దేశీయ ‘హాకీ’ క్రీడవల్ల 8 పతకాలు, షూటింగ్, తదితర క్రీడల్లో ఒక్కొక్క పతకం చొప్పున జమకూడినవే నని మరచిపోరాదు! షరా మామూలుగానే టోక్యో ఒలింపిక్స్‌లో అమెరికా చివరిరోజున తృటిలో ఎగబాకి 39 స్వర్ణాలు, 41 రజతాలు, 33 కాంస్యాలతో మొత్తం 113 పతకాలతో ప్రథమ స్థానంలో నిల బడగా, చివరివరకు స్వర్ణపతకాలతో ఆధిక్యం కొనసాగించిన చైనా 38 స్వర్ణాలు, 32 రజతాలు, 18 కాంస్యాలతో మొత్తం 88 పతకాలతో ద్వితీయ స్థానంలో నిలిచి అబ్బురపరిచింది. దేశీయ క్రీడలకు క్రికెట్ చీడ స్వతంత్ర భారత్ రిపబ్లిక్లో ఆదినుంచీ దేశీయ క్రీడలకు పట్టిన చీడ, పీడలు ఏమిటంటే.. ప్రధానంగా వలస భారతంలో సంపన్న రాచరిక ప్రభువులు తమ కొడుకుల కోసమని ఇంగ్లాండ్ నుంచి దేశంలోకి దిగుమతి చేసిన క్రికెట్ క్రీడే! బ్రిటన్ పాలనలో పాటియాలా సంస్థానం మహారాజాగా ఉన్న భూపేంద్ర సింగ్ (భూప్పా) తన కొడుకు, నవానగర్ జామ్ సాహిబ్ అయిన కుమార్ రంజిత్ సింగ్‌కి క్రికెట్‌ను ప్రత్యేక శిక్షణ ఇప్పించి నేర్పించాడు. 1932 నుంచీ ఈ క్రికెట్ సంరంభాలు ప్రారంభం కాగా, రాజా కొడుకు అనారోగ్యం వల్ల ఈ ఆటకు అనంతరం పోర్బందర్ మహారాజా వారసుడయ్యాడు. దేశ స్వాతంత్య్రానికి ముందు 1932లో ఇంగ్లాండులో జరుగుతున్న టెస్ట్ క్రికెట్లో ఇండియా తరపున ఆడడానికి మన స్వాతంత్య్రానికి ముందు అప్పటికే ప్రసిద్ధుడుగా ఉన్న సి.కె. నాయుడి నాయకత్వంలో భారత దేశం తరపున టెస్ట్ క్రికెట్లో పాల్గొనడానికి ఒక టీమును పంపిం చారు. నాయుడి క్రీడాబృందం ఇంగ్లండుపై గెలుపొందడంతో ఇండియాకు ‘టెస్ట్ క్రికెట్ ఆడే జాతి’గా పేరుపడింది. ఆ తర్వాత స్వతంత్రదేశంగా ఇండియా 1948లో ఆస్ట్రేలియాపై టెస్ట్‌మాచ్‌లో ఆస్ట్రేలియాతో పోటీపడి ఓడిపోయింది. ఒక్క 1952లో మాత్రమే మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్‌పై ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా విజయం సాధించింది. అదిమొదలు ఈ ‘జీడి’ అంటుకు పోయి దేశీయ, గ్రామీణ, పట్టణ జాతీయక్రీడలను ధ్వంసం చేస్తూ వచ్చింది. విదేశీ క్రీడా బానిసత్వం తొలగేదెన్నడు? ఈ విదేశీ క్రీడా బానిసత్వం ఫలితంగానే అనేక దేశీయ క్రీడలకు ముఖ్యంగా గొప్ప జాతీయ క్రీడా శిఖరం ‘హాకీ’కి ప్రోత్సాహం కరువై కుంటుపడిపోతూ వచ్చింది. టోక్యోలో జరిగిన తాజా ప్రపంచ ఒలింపిక్స్‌లో మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని హాకీ టీమ్ 41 ఏళ్ల నిరీక్షణ అనంతరం కాంస్యపతకంతో తొలి అడ్డంకిని అధిగమించి పురుషుల హాకీని నిలబెట్టగల్గింది! అదే మోతాదులో మహిళా హాMీ టీమ్ కూడా తొలిసారిగా పురుషులకు పోటీగా రంగప్రవేశం చేసి మన్ననలు పొందగలిగింది. అయితే మనదేశం ఇంకా కులగోత్రాల కంపులో కూరుకుపోయి బయటపడలేక పోతున్నందున ఆ ‘సెగ’ నుంచి ప్రతిభావంతులైన హాకీ మహిళా క్రీడాకారులకు రక్షణ కరువు కావడం ఒక దుర్మార్గపు పరిణామం! తాజా ఒలింపిక్స్‌లో హాకీలో వందనా కటారియా నేతృత్వంలోని భారత్ హాకీ జట్టు అర్జెంటీనా జట్టుపై నాలుగు గోల్స్ స్కోర్ చేసినందుకు ఆనందించవలసిన సమయంలో దళిత మహిళగా ఆమెకు హరిద్వార్‌లో కుల కంపు ఎదురుకావడం సర్వత్రా ఖండనార్హం! విలువిద్యా రహస్యం తెలిసిన వాళ్లే బాణం విసిరినా, ఈటె విసిరినా గురితప్పనిది ద్రోణాచార్య విద్య! 88.07 మీటర్ల దూరానికి గురిపెట్టి నీరజ్ చోప్రా విసిరిన ‘జావెలిన్‌త్రో’ గురిపెట్టి మరీ విసిరే ఈటెతో సమానమే! అందుకే అంత బలిష్టంగా నీరజ్‘జావెలిన్’ విసిరిన తరువాత అదాటున నేలకొరిగే పరిస్థితిలో తమాయించుకుని తేరుకుని లేచాడు! విలువిద్యలో వింటినారిని (బలంగా గురిపెట్టి) లాగి కొట్టినపుడు భుజంపైన ‘బొప్పి’ కడుతూ ఉంటుంది. అందుకే ‘ఈ వింటినారే కదా నా భుజాన్ని రక్షిస్తోంద’ని ప్రాచీనుడు (జ్యాకిణాంకమీభుజమెగా రక్షించునదియని తనర గలవు) వాపోవలసివచ్చింది! (ఆ భుజాన్ని రక్షించిన ఆ కాయలే గదా నాకు రక్ష అని తృప్తి చెందుతారట)! ఆ పరిస్థితికి ప్రతిబింబమే నేటి అభినవ నీరజ్ చోప్రా! ఇలా మన గ్రామ సీమల్లో దేశమంతటా ఎన్నిరకాల చిత్ర, విచిత్రమైన ప్రాచీన క్రీడలు (కనుమరుగైన వాటితో సహా) ఉన్నాయో, చెడుగుడు, కోకో, కర్రా– బిళ్ల (నేటి క్రికెట్‌కు సమానమైన) ఆట, వగైరా, వగైరా! అవినీతికి తావులేనందుకే దేశీ ఆటలకు తగ్గిన గిరాకీ ఖర్మకాలి వీటికి గిరాకీ లేదు. ఎందుకని? విదేశీ క్రికెట్‌లాగా రెండు చేతులా అవినీతికి పాల్పడి వందలాది కోట్ల రూపాయలు దోచు కోడానికి వీలైన వ్యాపారానికి వీలులేని సామాన్య ప్రజల ఆటలు దేశవాళీ క్రీడలు. గతంలో ఆంగ్ల మహారచయిత కథకుడైన జార్జి బెర్నార్డ్ షా ఇంగ్లిష్వాడైనా, అక్కడ పుట్టి ప్రపంచానికి ఇంగ్లిష్‌వాడే పాకించిన (క్రికెట్‌ను పట్కార్‌తో కూడా ముట్టుకోని అమెరికాను మినహాయించి) క్రికెట్ ‘వ్యాధి’ని ఏమన్నాడో తెలుసా? పదకొండు మంది ఫూల్స్ ఆడతారు, మరో పదకొండువేలమంది పనిలేని దద్దమ్మలు చూస్తూండే క్రీడ క్రికెట్ అని చురక అంటించాడు! రాను రాను క్రికెట్ కొంతమంది అవినీతిపరుల చేతి ఎత్తుబిడ్డగా మారి పచ్చిదోపిడీ క్రీడగా మారిపోయింది. చివరికి క్రికెట్ క్రీడాకారులు కొందరు ప్రతి ఆటకీ సంపాదించే కోట్లు చాలక వారిలో అగ్ర గాములుగా ముద్రపడిన కొందరికి బహుమతిగా పొందిన కోట్ల రూపాయల విలువైన కార్లకు చెల్లించాల్సిన దేశీయ పన్నులను ఎగ్గొట్టి, పట్టుబడిన ఉదంతాలూ ఉన్నాయి. దోపిడీకి ఇలాంటి అవకాశం మన దేశీయ క్రీడలకు లేదు! బహుశా అందుకనే విదేశీ క్రికెట్ పట్ల అంత గిరాకీ దేశీయ క్రీడలపట్ల అంత పరాకు చిరాకూ!! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
జాతీయ క్రీడలు... మళ్లీ అనుమానమే!
పనాజీ (గోవా): షెడ్యూల్ ప్రకారం రెండేళ్ల క్రితమే జరగాల్సిన జాతీయ క్రీడలు పలు కారణాలతో ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డాయి. మరోసారి ఈ క్రీడలను వాయిదా వేస్తే భారీ మొత్తంలో జరిమానా కట్టాల్సి వస్తుందని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) జాతీయ క్రీడల ఆతిథ్య రాష్ట్రం గోవాను హెచ్చరించింది. దాంతో మూడోసారి సవరించిన షెడ్యూల్ ప్రకారం గోవా ఈ ఏడాది అక్టోబర్ 20 నుంచి నవంబర్ 4 వరకు జాతీయ క్రీడలను నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే కరోనా వైరస్‌తో తలెత్తిన అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో గోవా జాతీయ క్రీడల నిర్వహణ సందిగ్ధంలో పడింది. దాంతో తమ రాష్ట్రంలో జరిగే జాతీయ క్రీడలపై స్పష్టత ఇవ్వాలని భారత ఒలింపిక్ సంఘాన్ని కోరుతున్నామని గోవా క్రీడల మంత్రి మనోహర్ అజ్గాంవ్కర్ అన్నారు. ‘ఇప్పటికే అన్ని వేదికలు పూర్తయ్యాయి. ఈ క్రీడలకు మేము ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. అయితే కరోనా కారణంగా ఏం జరుగుతుందో చెప్పలేం. అనుకున్న షెడ్యూల్ ప్రకారం జాతీయ క్రీడలు జరగాలంటే తమకు మూడు నెలలు ముందుగానే తెలియజేయాలి’ అని మనోహర్ అన్నారు. కరోనా కారణంగా ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌తోపాటు ఎన్నో మెగా ఈవెంట్స్, భారత్‌లో అత్యధిక ఆదరణ కలిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా వాయిదా పడింది. దేశవ్యాప్తంగా కరోనా ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో మరోసారి జాతీయ క్రీడలు వాయిదా పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. -
వచ్చే ఏడాది అక్టోబర్‌లో జాతీయ క్రీడలు
న్యూఢిల్లీ: వాయిదా పడుతూ వస్తోన్న 36వ జాతీయ క్రీడల తుది తేదీలను మళ్లీ ఖరారు చేశారు. గోవా ఆతిథ్యమిచ్చే ఈ క్రీడలు వచ్చే ఏడాదిలో అక్టోబర్ 20 నుంచి నవంబర్ 4 వరకు జరుగుతాయని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ప్రకటించింది. 2015లో కేరళలో చివరిసారి జాతీయ క్రీడలు జరిగాయి. అనంతరం గోవా వేదికగా 2016లో జాతీయ క్రీడలను నిర్వహించాలి. కానీ ఏర్పాట్లలో జాప్యం కారణంగా మూడేళ్లుగా ఈ క్రీడలను వాయిదా వేస్తూ వస్తున్నారు. -
నాడు గోల్డ్ మెడల్ విన్నర్.. నేడు గ్యాంగ్‌స్టర్
రోహ్తక్(హరియాణా) : ఒకప్పుడు అతను జాతీయస్థాయి కుస్తీ పోటిల్లో బంగారు పతకం సాధించాడు. మరి నేడు పేరు మోసిన గ్యాంగ్‌స్టర్. ఒక హత్యానేరంలో ప్రధాన నిందితుడు. అతనిని పట్టించిన వారికి 25 వేల రూపాయల బహుమతిని కూడా ప్రకటించారు పోలీసులు. చివరకు మంగళవారం(నిన్న) పోలీసుల చేతికి చిక్కాడు. అతనే రోహ్తక్లోని మొఖ్రా గ్రామానికి చెందిన రాకేష్ మొఖ్రియా. గత ఏడాది జూన్‌లో, అస్సాన్ గ్రామానికి చెందిన బల్బీర్ హత్యకేసులో రాకేష్ ప్రధాన నిందితుడు. రాకేష్ ఎందుకు అరెస్ట్ చేయాల్సివచ్చిందో రోహతక్ ఎస్పీ జషన్‌దీప్ సింగ్ రంధవా చెబుతూ.. ‘గత ఏడాది జూన్‌లో బల్బీర్ సింగ్, రాకేష్‌కు మధ్య మద్యం కాంట్రాక్ట్ విషయంలో గొడవ జరిగింది. ఆ సమయంలో రాకేష్ తన అనుచరులతో కలిసి బల్బీర్‌ను చంపేసారు. ఈ హత్యకేసులో పోలీసులు రాకేష్ అనుచరులను కొందరిని అదుపులోకి తీసుకున్నారు. కానీ రాకేష్ మాత్రం పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు. అలానే అతని ఆచూకీ తెలిపిన వారికి 25 వేల రూపాయల నగదు బహుమతిని కూడా ఇస్తామని ప్రకటించారు. ఈ నేపధ్యంలో రెండు రోజుల క్రితం బల్బీర్ హత్యతో సంబంధం ఉన్న రాకేష అనుచరున్ని ఒకన్ని పోలీసులు అరెస్టు చేశారు. అతను ఇచ్చిన సమాచారంతో సోమవారం రాత్రి ఝాజ్జ బైపాస్ రోడ్లో ఉన్న రాకేష్‌ను యాంటి వెహికల్ థేఫ్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారని’ తెలిపారు. రాకేష్‌ను అరెస్ట్ చేసిన సమయంలో అతని వద్ద నుంచి ఒక 30బోర్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బల్బీర్‌ను హత్య చేసిన తరువాత రాకేష్ రాజస్థాన్ వెళ్లి తలదాచుకున్నట్లు విచారణలో తెలిపాడన్నారు. అంతేకాక వీరి గ్యాంగ్ లీడర్ రోహ్తష్ కుమార్ విడుదల కోసం ఎదురుచుస్తున్నాడని, అతను జైలు నుంచి విడుదల కాగానే తిరిగి నేరాలు ప్రారంభిద్దామనుకుంటున్నట్లు తెలిపాడని వెల్లడించారు. కుస్తీ పోటీల్లో బంగారు పతకం... రాకేష్ 2003లో నిర్వహించిన జాతీయ కుస్తీ పోటిల్లో హరియాణా తరుపున పాల్గొని బంగారు పతకం సాధించాడు. అలానే అదే ఏడాది ‘తల్కతోర స్టేడియం’లో జరిగిన జాతీయ క్రీడల్లో కాంస్య పతకాన్ని సాధించాడు. కానీ 2005లో నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఆవేశంలో ఝజ్జర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని హత్య చేసినందుకుగాను 6 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా తన నేర ప్రవృత్తిని మానుకోలేక గతేడాది మరో వ్యక్తిని హత్య చేసి మరోసారి జైలుకెళ్లబోతున్నాడు. -
నువ్వా.. నేనా..
మెదక్ జోన్: జిల్లా కేంద్రంగా ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో అండర్–14 బాలబాలికల జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు గురువారం నాటికి మూడో రోజుకు చేరాయి. బాలికల పోటీలు గురువారం సాయంత్రానికి ముగిశాయి. తొమ్మిది రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు కిక్‌బాక్సింగ్‌లో ఒకరిపై ఒకరు పంచులు కొడుతూ, లెగ్షాట్లతో ప్రత్యర్థులను మట్టికరిపించే ప్రతిభ అందరిని ఆకట్టుకుంది. నున్వా..నేనా అనే విధంగా చిరవరి వరకు పోరాడారు. మూడు రోజులుగా కొనసాగిన బాలికల విభాగానికి సంబంధించి విజేతలు మైనస్46 కేజీల విభాగంలో మహారాష్ట్రకు చెందిన వైష్ణవిలింబో గోల్డ్ పతకాన్ని కైవసం చేసుకుంది. ఛత్తీష్గడ్కు చెందిన కె.వి. ప్రియసింగ్ సిల్వర్ పతకం గెలుచుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన అచ్చల్పట్టి, పంజాబ్‌కు చెందిన బలింధర్కౌర్ కాస్య పతకం గెలుచుకున్నారు. మైనస్50 కేజీల విభాగంలో పంజాబ్‌కు చెందిన అర్షిక్కౌర్ బంగారు పతకం గెలుచుకుంది. మహారాష్ట్రకు చెందిన ప్రీతిహాట్వేట్ సిల్వర్ పతకం గెలుపొందింది.ఢిల్లీకి చెందిన తమన్న కాస్య పతకం గెలుచుకుంది. ఛత్తీష్గడ్కు చెందిన వసుంధర స్లిన్మౌడ్ కాస్య పతకం గెలుచుకుంది. 50 కన్నా అధిక కేజీల బరువుగల విభాగంలో ⇒ పంజాబ్‌కు చెందిన సుక్లీన్కౌర్ బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ⇒ తెలంగాణకు చెందిన అక్షిత సిల్వర్ పతకాన్ని గెలుపొందింది. ⇒ ఛత్తీస్‌గడ్‌కు చెందిన శ్రీయసుక్ల కాస్య పతకం గెలుపొందింది. ⇒ గుజరాత్‌కు చెందిన పటేల్ యాసివ్ బ్రౌజ్ (కాస్యం) పతకం గెలుపొందింది. మైనస్ 24 కేజీల విభాగంలో ⇒ మహారాష్ట్రకు చెందిన పయాల్ సిర్కి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ⇒ ఢిల్లీకి చెందిన కహక్ష సిల్వర్ పతకాన్ని గెలుచుకుంది. ⇒ విద్యాభారతికి చెందిన ఇస్హ సకి బ్రౌజ్ (కాస్యం) పతకం గెలుపొందింది. ⇒ తెలంగాణకు చెందిన ఖతీజ సజియా బ్రౌజ్ (కాస్యం) పతకం గెలుపొందింది. మైనస్ 28 కేజీల విభాగంలో ⇒ మహారాష్ట్రకు చెందిన పయాల్వేర్ బంగారు పతకాన్ని గెలుపొందింది. ⇒ తెలంగాణకు చెందిన నబుస్రా సిల్వర్ పతకాన్ని గెలుపొందింది. ⇒ పంజాబ్‌కు చెందిన నూర్ప్రీత్కౌర్ బ్రౌజ్ (కాస్యం) పతకాన్ని గెలుపొందింది. ⇒ గుజరాత్‌కు చెందిన రాధిక బ్రౌజ్ (కాస్యం) పతకం గెలుపొందింది. మైనస్ 32 కేజీల విభాగంలో ⇒ జమ్మూ కాశ్మీర్‌కు చెందిన హన్సాహుసేన్ హెస్టీ బంగారు పతకాన్ని గెలుచుకుంది. ⇒ మహారాష్ట్రకు చెందిన సాక్షి మార్గోడ్ సిల్వర్ పతకాన్ని గెలుచుకుంది. ⇒ పంజాబ్‌కు చెందిన హైరెట్ సందు బ్రౌజ్ (కాస్యం) పతకం గెలుపొందింది. ⇒ గుజరాత్‌కు చెందిన మెరికింజాల్ బ్రౌజ్ (కాస్యం) పతకం గెలుపొందింది. మైనస్ 37 కేజీల విభాగంలో ⇒ ఢిల్లీకి చెందిన ఐరామ్ బంగారు పతకాన్ని గెలుపొందింది. ⇒ మహారాష్ట్రకు చెందిన ఖుసిపెవ్ల్ సిల్వర్ పతకాన్ని గెలుపొందింది. ⇒ ఛత్తీష్గడ్కు చెందిన ప్రీతిచౌహాన్ బ్రౌజ్ (కాస్యం) పతకం గెలుపొందింది. ⇒ పంజాబ్‌కు చెందిన మహక్ ప్రీతికౌర్ బ్రౌజ్ (కాస్యం) పతకం గెలుపొందింది. మైనస్ 42 కేజీల విభాగంలో ⇒ మహారాష్ట్రకు చెందిన వైదేవి పవర్ బంగారు పతకాన్ని గెలుపొందింది. ⇒ తెలంగాణకు చెందిన మీనాక్షి సింగ్ సిల్వర్ పతకాన్ని కైవసం చేసుకుంది. ⇒ గుజరాత్‌కు చెందిన ఘరేత్య చేతన బ్రౌజ్ (కాస్యం) పతకం గెలుపొందింది. ⇒ ఛత్తీష్గడ్కు చెందిన ఆల్యాసేక్ బ్రౌజ్ (కాస్యం) పతకం గెలుపొందింది. -
జాతీయ స్థాయి క్రీడల్లో ఆటోడ్రైవర్ ఘనత
-
ఆర్చరీ సందడి ఆరంభం
– నేటి నుంచి మూడురోజుల పాటు జాతీయ పోటీలు – 4 కేటగిరీల్లో ఫీల్డ్ ఆర్చరీ నేషనల్స్ నిర్వహణ – 18 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు రాక కడప స్పోర్ట్స్: కడప నగరం మరో జాతీయస్థాయి టోర్నమెంట్‌కు సిద్ధమైంది. ఈనెల 17 నుంచి 19వరకు కడప నగరంలోని వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియంలో 7వ జాతీయ ఫీల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్–2017 నిర్వహించనున్నారు. మూడురోజుల పాటు నిర్వహించనున్న ఈ టోర్నమెంటకు సంబంధించిన ఏర్పాట్లను ఫీల్డ్ ఆర్చరీ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి సుభాష్‌చంద్ర నాయర్, ఉపాధ్యక్షుడు సంతోష్, ఏపీ కార్యదర్శి ఉదయ్కుమార్రాజు, ప్రతినిధులు పర్యవేక్షించారు. 4 కేటగిరీల్లో పోటీలు.. అండర్–10, అండర్–14, సీనియర్స్, వెటరన్ కేటగిరీల్లో రికర్వ్రౌండ్, కాంపౌండ్ రౌండ్, బార్బో రౌండ్, ఉడన్ రౌండ్ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. 17న సింగిల్ స్పాట్ రౌండ్, 18వ తేదీన 5 స్పాట్ రౌండ్, 19న మిక్స్డ్ స్పాట్ రౌండ్స్‌లో పోటీలు నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్ అనంతరం అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే భారతజట్టును ఎంపిక చేయనున్నారు. పలు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు రాక... ఈ పోటీలకు దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరవుతున్నారు. గురువారం కడప నగరానికి పలు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు చేరుకున్నారు. వీరికి నిర్వాహకులు తగిన వసతులు ఏర్పాటు చేశారు. -
జాతీయ ఆర్చరీ పోటీలకు తెలంగాణ జట్లివే
హైదరాబాద్: జాతీయ జూనియర్ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ జట్లను ఎంపిక చేశారు. మాసాబ్‌ట్యాంక్‌లోని హాకీ మైదానంలో అంతర్ జిల్లా అండర్-9, అండర్-14 పోటీల్లో రాణించిన క్రీడాకారులను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ పోటీల్లో ఎనిమిది జిల్లాల నుంచి 80 మంది ఆర్చర్లు పాల్గొన్నారు. జాతీయ ఆర్చరీ పోటీలు ఈనెల 11 నుంచి 16 వరకు తిరుపతిలో జరుగుతాయి. అండర్-14 ఇండియన్ రౌండ్ (బాలురు): వికాస్, ఆదిత్య (రంగారెడ్డి), ఎం.శ్రీకర్ (ఆదిలాబాద్), బి.అభిషేక్ (కరీంనగర్); బాలికలు: ఎన్.కావ్య, బి.నిఖిత (నిజామాబాద్), జి.వింధ్య, బి.మానసనయన (రంగారెడ్డి), ప్రతాప్ దాస్ (కోచ్). అండర్-14 రికర్వ్ రౌండ్ (బాలురు): జె.శ్రీరాజ్ (కరీంనగర్), మయాంక్ దీక్షిత్, వర్ధమాన్ గౌడ్, ఈవీఎస్ అభిషేక్ (హైదరాబాద్); బాలికలు: కె.సింధుజ (నిజామాబాద్, పి.ఐశ్వర్య (నిజామాబాద్), మౌలి జైన్, మనకన్ నేహా (హైదరాబాద్). కాంపౌండ్ రౌండ్ (బాలురు): బి.సాత్విక్ (రంగారెడ్డి), పాథి ఆర్యన్, టి.హర్ష (హైదరాబాద్), సి.సారుురామ్ గౌడ్ (మెదక్); బాలికలు: సీఎం ప్రాకృతి, కె.దేనుక, ఊర్జా ఇంజినీర్ (హైదరాబాద్), వినయ్ చక్రవర్తి (కోచ్), శివ కుమార్ (మేనేజర్). అండర్-9 ఇండియన్ రౌండ్ (బాలురు): విస్మయ్ ప్రభు (హైదరాబాద్), ఆద్య అగర్వాల్, మోదితశ్రీ, పల్లవి, అనన్య ఇవిత (హైదరాబాద్), రికర్వ్ రౌండ్ (బాలురు): ఎస్. ఆర్యన్, పి.సుహాస్ (రంగారెడ్డి), శ్రీహన్ కర్మ (హైదరాబాద్), బాలికలు: ఎ.మోక్షిత (రంగారెడ్డి), కాం పౌండ్ రౌండ్ బాలురు: జైదేవ్ (హైదరాబాద్). -
ఎస్జీఎఫ్ జాతీయ క్రీడలు షురూ
వరంగల్ స్పోర్ట్స్ : వ్యాయామ విద్య ద్వారా విద్యార్థులకు క్రమశిక్షణాయుత ప్రవర్తన అలవడుతుందని ద్రోణాచార్య అవార్డు గ్రహీత, శాయ్ అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్ అన్నారు. 62వ ఎస్జీఎఫ్ అండర్-19 నేషనల్ చాంపియన్‌షిప్ పోటీలు మంగళవారం హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, టెన్నిస్, వాలీబాల్ విభాగాల్లో జరుగనున్న పోటీల్లో పాల్గొనేందుకు 29 రాష్ట్రాల నుంచి వెయ్యి మందికిపైగా క్రీడాకారులు జిల్లాకు చేరుకున్నారు. ఈ పోటీలను ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం క్రీడాకారుల నుంచి మార్చ్ఫాస్ట్ ద్వారా గౌరవ వందనం స్వీకరించారు. నాగపురి రమేష్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన దేశాన్ని సాధించాలంటే వ్యాయామ విద్యను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందన్నారు. సరైన గైడెన్స్ ఉంటే దేశం నుంచి ఎంతోమంది అంతర్జాతీయ క్రీడాకారులు తయారవుతారన్నారు. యూరి దాడిలో మృతిచెందిన భారత సైనికులకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం ప్రకటించారు. కార్యక్రమాన్ని పురస్కరించుకొని నిర్వహించిన పేరిణి నృత్య ప్రదర్శన, ప్రముఖ కూచిపూడి నృత్య శిక్షకురాలు రేణుక శిష్య బృందం ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. తెలంగాణ బతుకమ్మ ఆటపాటలు ఆకట్టుకున్నాయి. ఎస్జీఎఫ్ అండర్-19 జిల్లా సెక్రటరీ డాక్టర్ కోట సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ బాధ్యుడు వాంక్వా, , ఎస్జీఎఫ్ రాష్ట్ర అబ్జర్వర్ రామిరెడ్డి, ఇంటర్ ఆర్ఐఓ షేక్ అహ్మద్, డీఎస్డీఓ ఇందిర, సత్యనారాయణ, భారత జ్యోతి అవార్డు గ్రహీత జగన్మోహన్ మెల్టా, కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ జి పాణి, జూడో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కైలాష్ యాదవ్, బాబూరావు, డాక్టర్ జె.వెంకటేశ్వర్లు, పీడీ బరుపాటి గోపి తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ పోటీలకు జిల్లా క్రీడాకారులు
కల్లూరు: తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 4, 5వ తేదీల్లో జరిగే 28వ సౌత్‌జోన్ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపికైనట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి హర్షవర్దన్, సహాయ కార్యదర్శి లక్ష్మయ్య తెలిపారు. ఎం. సాగర్ 100 మీటర్స్ (మున్సిపల్ స్కూల్ ఆదోని), బి. నాగరజిత హైజంప్ (కర్నూలు), మధుకావ్య రెడ్డి 100 మీటర్స్ (శ్రీచైతన్య స్కూల్ కర్నూలు), అక్షిత 100, 200 మీటర్స్, స్టెప్ జంప్ (కర్నూలు), మనీషా లాంగ్‌జంప్, 200 మీటర్స్ (ఏపీ మోడల్ స్కూల్ క్రిష్ణగిరి), కె. శివ 300 మీటర్స్, ఎన్ సాయిక్రిష్ణ 110 మీటర్స్ హర్డిల్స్ (ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కర్నూలు), కె నరేష్ 100 మీటర్స్ (బాలశివ కాలేజ్ కర్నూలు), కిశోర్ 5000 మీటర్స్ వాక్ (ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నంద్యాల). -
జాతీయ క్రీడలకు తెర
తిరువనంతపురం: పదిహేను రోజులపాటు అలరించిన జాతీయ క్రీడలకు శనివారం తెరపడింది. పురుషుల విభాగంలో స్విమ్మర్ సజన్ ప్రకాశ్, మహిళల విభాగంలో స్విమ్మర్ ఆకాంక్ష వోరా ‘ఉత్తమ అథ్లెట్స్’ పురస్కారాలను అందుకున్నారు. ఈ క్రీడల్లో ప్రకాశ్ ఆరు స్వర్ణాలు గెలిచాడు. సర్వీసెస్ జట్టు వరుసగా మూడోసారి ఓవరాల్ ట్రోఫీ గెల్చుకుంది. కేరళ గవర్నర్ జస్టిస్ (రిటైర్డ్) పి.సదాశివం ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ క్రీడలు ముగిశాయని ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ చదివి వినిపించారు. తమ ప్రతిభతో రాణించిన క్రీడాకారులందరికీ తన సందేశంలో ప్రధాని అభినందించారు. తదుపరి జాతీయ క్రీడలు వచ్చే ఏడాది గోవాలో జరుగుతాయి. -
మోహన్ లాల్ మాటంటే మాటే.. రూ.1.63 కోట్ల చెక్ వెనక్కు
తిరువనంతపురం: మళయాల సూపర్‌స్టార్ మోహన్‌లాల్ మాటంటే మాటే. జాతీయ క్రీడల ప్రారంభ వేడుకల్లో తన ఆధ్వర్యంలో సంగీత కార్యక్రమం నిర్వహించినందుకుగాను కేరళ ప్రభుత్వం నుంచి తీసుకున్న రూ.1.63 కోట్ల మొత్తాన్ని మోహన్‌లాల్ తిరిగి ఇచ్చేశారు. మోహన్ లాల్ ఈ మొత్తానికి చెక్ అందజేశారు. ఈ కార్యక్రమంపై విమర్శలు రావడంతో పారితోషకం వెనక్కు ఇస్తానని మోహన్ లాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా మోహన్ లాల్ ఇచ్చేస్తానన్న డబ్బు తీసుకోబోమని కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాంద్ ఇంతకుముందు చెప్పారు. నైతికంగా ఇది సమంజసం కాదని పేర్కొన్నారు. మోహన్ లాల్ చెక్ అందజేసినా దీన్ని అంగీకరించాలా వద్దా అన్న విషయం గురించి ప్రభుత్వం నుంచి ఏ విధమైన ఆదేశాలూ రాలేదని క్రీడల నిర్వాహకులు చెప్పారు. -
నేషనల్ గేమ్స్ విజేతలకు సీఎం అభినందనలు
సాక్షి, హైదరాబాద్: కేరళలో జరుగుతున్న నేషనల్ గేమ్స్‌లో ప్రతిభ కనబరిచిన తెలంగాణ క్రీడాకారులకు సీఎం కె.చంద్రశేఖరరావు అభినందనలు తెలిపారు. రోయింగ్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించిన మంజీద్‌సింగ్, దేవేందర్ సింగ్, అస్రార్ పాటిల్‌లతోపాటు ఐదు వెండి పతకాలు, ఒక కాంస్య పతకాన్ని గెలుచుకున్న క్రీడాకారులను అభినందించారు. జాతీయస్థాయి క్రీడల్లో తెలంగాణ ఆటగాళ్లు రాణించటంపట్ల ఆయన ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. -
తెలంగాణకు రెండు, ఏపీకి రెండు స్వర్ణాలు
జాతీయ క్రీడలు తిరువనంతపురం: జాతీయ క్రీడల్లో తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు పసిడి కాంతులు పూయించారు. గేమ్స్ ఐదో రోజు గురువారం ఏపీ, తెలంగాణ క్రీడాకారులు రెండేసి స్వర్ణాలు సాధించారు. రోయింగ్ పురుషుల సింగిల్ స్కల్ 500 మీటర్ల ఫైనల్లో అస్రార్ పాటిల్ (తెలంగాణ) 1ని.38 సెకన్లలో లక్ష్యాన్ని చేరి తొలి స్థానంలో నిలిచాడు. పురుషుల 500 మీటర్ల కాక్స్‌లెస్ పెయిర్ కేటగిరీలో దేవీందర్ సింగ్, మన్జీత్ సింగ్ ద్వయం 1ని.32 సెకన్ల టైమింగ్‌తో పసిడిని సొంతం చేసుకుంది. పురుషుల బీచ్‌వాలీబాల్ ఫైనల్లో తెలంగాణకు చెందిన రవీందర్ రెడ్డి-చైతన్య జోడి రన్నరప్‌గా నిలిచి రజతంతో సరిపెట్టుకుంది. ప్రస్తుతం తెలంగాణ ఖాతాలో రెండు స్వర్ణాలు, ఆరు రజతాలు, ఓ కాంస్యం ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ జిమ్నాస్ట్ మేఘన గుండాల్‌పలి వ్యక్తిగత ‘రిథమిక్ ఆల్‌రౌండ్ క్లబ్’ ఫైనల్లో స్వర్ణం గెలుచుకుంది. పురుషుల బీచ్వాలీబాల్లో సీహెచ్ రామకృష్ణంరాజు-నరేష్ జోడి పసిడిని కైవసం చేసుకుంది. ఫైనల్లో ఏపీ జంట 18-21, 21-17, 15-10తో తెలంగాణ టీమ్‌పై నెగ్గింది. మహిళల విభాగం ఫైనల్లో ఏపీ జోడి తిరుమహాలక్ష్మీ రాజన్-మహేశ్వరి రన్నరప్‌గా నిలిచి రజతంతో సరిపెట్టుకుంది. టేబుల్ వాల్ట్ జిమ్నాస్టిక్ విభాగంలో అరుణ బుడ్డా కాంస్యం దక్కించుకుంది. ఓవరాల్‌గా ఏపీ మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, ఐదు కాంస్యాలతో కొనసాగుతోంది. జీతూరాయ్‌కు రెండు స్వర్ణాలు ఆసియా గేమ్స్ చాంపియన్ జీతూ రాయ్ షూటింగ్ గురి అదిరింది. 10 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో, వ్యక్తిగత విభాగంలోనూ స్వర్ణాలు గెలిచాడు. వెయిట్ లిఫ్టింగ్‌లో 105 కేజీల విభాగంలో హిమాన్షు కుమార్ (ఉత్తరప్రదేశ్) మీట్ రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్‌గా 358 (153+205) కేజీల బరువు ఎత్తి స్వర్ణం చేజిక్కించుకున్నాడు. -
క్రీడాశ్వాస
నేషనల్ గేమ్స్‌పై అభిమానుల ఆశ రాష్ర్ట విభజన పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు ఆనందంతో ఎగిరి గంతేస్తున్నారు. విజయవాడ నగరంలో జాతీయ క్రీడలు నిర్వహిస్తే.. అపార నైపుణ్యం నిబిడీ కృతమై ఉన్న యువత తమ శక్తిసామర్థ్యాలను నిరూపించుకునేందుకు మంచి అవకాశం వస్తుందని భావిస్తున్నారు. పతకాలే కాదు.. పురస్కారాలు కూడా సొంతం చేసుకుంటామన్న కొండంత ఆశతో ఉన్నారు. నగరాన్ని క్రీడలకు వేదికగా మలచుకుంటే హైదరాబాద్‌ను తలదన్నే రీతిలో తయారవుతుందని క్రీడా నిపుణులూ విశ్లేషిస్తున్నారు. విజయవాడ స్పోర్ట్స్ : రాష్ట్ర విభజనకు ముందు జాతీయ క్రీడలు, ఆఫ్రో ఆసియా వంటి క్రీడలు ఒక్క హైదరాబాద్‌లోనే నిర్వహించేవారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అధునాతన స్టేడియాలు, సింథటిక్ ట్రాక్‌లు, ఆస్ట్రోటర్ఫ్ మైదానాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం దండిగా నిధులిచ్చింది. ఇప్పుడు రాష్ట్రం రెండుగా విడిపోయింది. వెనక్కితిరిగి చూస్తే.. సీమాంధ్రకు మిగిలింది శూన్యమనే చెప్పాలి. మనకున్న వనరులు, సౌలభ్యాలను సద్వినియోగం చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో విజయవాడను మరో హైదరాబాద్‌గా తీర్చిదిద్ది క్రీడాపతాకాన్ని రెపరెపలాడించవచ్చు. 2017 జాతీయ క్రీడలు ఇక్కడే.. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో 2017లో జరగాల్సిన జాతీయ క్రీడల్ని నగరంలో ఏర్పాటు చేసుకోవడం ద్వారా మాత్రమే క్రీడా మౌలిక సదుపాయాలు సాధించుకోవచ్చని క్రీడాసంఘాలు, నిపుణులు చెబుతున్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు కోరింది. కేంద్రం కరుణించి జాతీయ క్రీడలు కేటాయించి ప్రత్యేక నిధులిస్తే విజయవాడతో పాటు విశాఖపట్నం, తిరుపతి, కాకినాడల్లోనూ అంతర్జాతీయ స్టేడియాలు, క్రీడా మౌలిక సదుపాయాలు ఏర్పాటవుతాయి. గతంలో హైదరాబాద్‌లో జాతీయ క్రీడలు నిర్వహించినప్పుడు కంటితుడుపు చర్యగా విశాఖపట్నంలో మాత్రమే ఒకట్రెండు ఆటలు నిర్వ హించారు. 2017 జాతీయ క్రీడలు విజయవాడను బేస్ చేసుకుని తిరుపతి, విశాఖపట్నం, కాకినాడ, కర్నూలుల్లో కూడా నిర్వహించాలని నిర్ణయించారు. నగర స్వరూపమే మారిపోతుంది జాతీయ క్రీడల కోసం కనీసం రూ.2వేల కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. 39వ జాతీయ క్రీడలు విజయవాడకు కేటాయిస్తే నగర స్వరూపమే మారిపోతుందనడంలో సందేహం లేదు. సింథటిక్ ట్రాక్‌లు, ఆస్ట్రోటర్ఫ్ మైదానాలు, స్విమింగ్ పూల్స్, డైవింగ్ పూల్స్, కృష్ణానదిలో వాటర్ స్పోర్ట్స్‌తోపాటు మంచి రోడ్లు, నగర సుందరీకరణ జరుగుతుంది. విజయవాడ కేంద్రంగా 32 క్రీడాంశాల్లో ఆతిథ్యం ఇవ్వొచ్చు. భవానీపురంలో దాదాపు 10 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థకు అప్పగించారు. అక్కడ స్టేడియం నిర్మిస్తే అంతర్జాతీయ స్థాయి సింథటిక్ రన్నింగ్ ట్రాక్, మల్టీపర్పస్ ఇండోర్ స్డేడియం రూపుదిద్దుకుంటాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అథ్లెటిక్ ట్రాక్ వేసుకోవచ్చు. అజిత్‌సింగ్‌నగర్‌లోని ఎంబీపీ మున్సిపల్ స్టేడియంలో హాకీ కోసం ఆస్ట్రోటర్ఫ్ హాకీ ఫీల్డ్ ఏర్పాటుచేసుకోవచ్చు. మైలవరంలో అవుట్డోర్ స్టేడియంలో ఫుట్‌బాల్, ఇండోర్ స్టేడియంలో తైక్వాండో, వెయిట్‌లిఫ్టింగ్ వంటి పోటీలు నిర్వహించవచ్చు. మచిలీపట్నంలో బీచ్ వాలీబాల్, యాచింగ్, సెయిలింగ్ వంటివి నిర్వహించుకోవచ్చు. పొరుగునే ఉన్న గుంటూరు జిల్లాలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కూడా జాతీయ క్రీడలు నిర్వహించుకోగలిగిన మైదానం ఉంది. కృష్ణా నదిలో వాటర్ స్పోర్ట్స్ నిర్వహిస్తే విజయవాడ క్రీడా, పర్యాటక రంగంగా మారిపోతుంది. క్రీడావిలేజ్ నిర్మాణంతో నిధులే నిధులు.. జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు, అధికారులు, టెక్నికల్ స్టాఫ్ వసతి కోసం కోట్లాది రూపాయిలతో క్రీడా విలేజ్ నిర్మించాల్సి ఉంటుంది. గచ్చిబౌలీలో మాదిరిగా అధునాతన అపార్టుమెంట్లు కడతారు. పోటీలు ముగిసిన తరువాత వాటిని వేలం ద్వారా ప్రభుత్వం అమ్మకానికి పెడుతుంది. దీంతో భారీగా నిధులు సమకూరతాయి. ఆగిరిపల్లి -గన్నవరం మధ్య ఈ క్రీడా విలేజ్ నిర్మించేందుకు అవకాశం ఉందని క్రీడానిపుణలు చెబుతున్నారు. ఆభివృద్ధి చెందాలంటే జాతీయ క్రీడలే మార్గం జాతీయ క్రీడలు నిర్వహించడం ద్వారా స్థానిక వర్థమాన క్రీడాకారుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. కొత్త రాష్ట్రం పేరు ప్రఖ్యాతులు ఇప్పటికిప్పుడు దేశానికి, ప్రపంచానికి చాటి చెప్పాలన్నా అది కేవలం క్రీడారంగంతోనే సాధ్యం. నగరానికి కొత్త రూపు వస్తుంది. -
సై...అంటే సై..
జిల్లాకేంద్రంలోని క్రీడా మైదానంలో ప్రారంభమైన ‘పైకా’ జాతీయ క్రీడలు రసవత్తరంగా సాగుతున్నాయి. వివిధ జట్లలో తలపడుతున్న బాలురు, బాలికలు సై..అంటే సై అని ఢీకొడుతున్నారు. ప్రేక్షకులకు ఉత్కంఠ రేకెత్తేలా సాగిన మహిళా,పురుషుల వాలీ బాల్ టోర్నమెంట్లలో ఒకరి బంతులకు మరొకరు దీటైన సమాధానం ఇచ్చారు. సమయోచితంగా హిట్‌కొట్టి చప్పట్ల వాన కురిపించుకున్నారు. రన్నింగ్, హైజంప్‌లో పాల్గొన్న క్రీడాకారులు తమ విన్యాసాలతో చూసేవారికి నోరెళ్ల బెట్టేలా చేశారు. ఈ రోజు ఉత్తరాఖండ్ జట్లు స్వర్ణపతకాలతో దూకుడు చూపాయి.