మెదక్ జోన్: జిల్లా కేంద్రంగా ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో అండర్–14 బాలబాలికల జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు గురువారం నాటికి మూడో రోజుకు చేరాయి. బాలికల పోటీలు గురువారం సాయంత్రానికి ముగిశాయి. తొమ్మిది రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు కిక్‌బాక్సింగ్‌లో ఒకరిపై ఒకరు పంచులు కొడుతూ, లెగ్‌షాట్లతో ప్రత్యర్థులను మట్టికరిపించే ప్రతిభ అందరిని ఆకట్టుకుంది. నున్వా..నేనా అనే విధంగా చిరవరి వరకు పోరాడారు. మూడు రోజులుగా కొనసాగిన బాలికల విభాగానికి సంబంధించి విజేతలు మైనస్46 కేజీల విభాగంలో మహారాష్ట్రకు చెందిన వైష్ణవిలింబో గోల్డ్ పతకాన్ని కైవసం చేసుకుంది. ఛత్తీష్‌గడ్‌కు చెందిన కె.వి. ప్రియసింగ్ సిల్వర్ పతకం గెలుచుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన అచ్చల్‌పట్టి, పంజాబ్‌కు చెందిన బలింధర్‌కౌర్ కాస్య పతకం గెలుచుకున్నారు. మైనస్50 కేజీల విభాగంలో పంజాబ్‌కు చెందిన అర్షిక్‌కౌర్ బంగారు పతకం గెలుచుకుంది. మహారాష్ట్రకు చెందిన ప్రీతిహాట్‌వేట్ సిల్వర్ పతకం గెలుపొందింది.ఢిల్లీకి చెందిన తమన్న కాస్య పతకం గెలుచుకుంది. ఛత్తీష్‌గడ్‌కు చెందిన వసుంధర స్లిన్‌మౌడ్ కాస్య పతకం గెలుచుకుంది.
50 కన్నా అధిక కేజీల బరువుగల విభాగంలో
⇒ పంజాబ్‌కు చెందిన సుక్లీన్‌కౌర్ బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.
⇒ తెలంగాణకు చెందిన అక్షిత సిల్వర్ పతకాన్ని గెలుపొందింది.
⇒ ఛత్తీస్‌గడ్‌కు చెందిన శ్రీయసుక్ల కాస్య పతకం గెలుపొందింది.
⇒ గుజరాత్‌కు చెందిన పటేల్ యాసివ్ బ్రౌజ్ (కాస్యం) పతకం గెలుపొందింది.
మైనస్ 24 కేజీల విభాగంలో
⇒ మహారాష్ట్రకు చెందిన పయాల్ సిర్కి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.
⇒ ఢిల్లీకి చెందిన కహక్ష సిల్వర్ పతకాన్ని గెలుచుకుంది.
⇒ విద్యాభారతికి చెందిన ఇస్‌హ సకి బ్రౌజ్ (కాస్యం) పతకం గెలుపొందింది.
⇒ తెలంగాణకు చెందిన ఖతీజ సజియా బ్రౌజ్ (కాస్యం) పతకం గెలుపొందింది.
మైనస్ 28 కేజీల విభాగంలో
⇒ మహారాష్ట్రకు చెందిన పయాల్‌వేర్ బంగారు పతకాన్ని గెలుపొందింది.
⇒ తెలంగాణకు చెందిన నబుస్రా సిల్వర్ పతకాన్ని గెలుపొందింది.
⇒ పంజాబ్‌కు చెందిన నూర్‌ప్రీత్‌కౌర్ బ్రౌజ్ (కాస్యం) పతకాన్ని గెలుపొందింది.
⇒ గుజరాత్‌కు చెందిన రాధిక బ్రౌజ్ (కాస్యం) పతకం గెలుపొందింది.
మైనస్ 32 కేజీల విభాగంలో
⇒ జమ్మూ కాశ్మీర్‌కు చెందిన హన్సాహుసేన్ హెస్టీ బంగారు పతకాన్ని గెలుచుకుంది.
⇒ మహారాష్ట్రకు చెందిన సాక్షి మార్‌గోడ్ సిల్వర్ పతకాన్ని గెలుచుకుంది.
⇒ పంజాబ్‌కు చెందిన హైరెట్ సందు బ్రౌజ్ (కాస్యం) పతకం గెలుపొందింది.
⇒ గుజరాత్‌కు చెందిన మెరికింజాల్ బ్రౌజ్ (కాస్యం) పతకం గెలుపొందింది.
మైనస్ 37 కేజీల విభాగంలో
⇒ ఢిల్లీకి చెందిన ఐరామ్ బంగారు పతకాన్ని గెలుపొందింది.
⇒ మహారాష్ట్రకు చెందిన ఖుసిపెవ్‌ల్ సిల్వర్ పతకాన్ని గెలుపొందింది.
⇒ ఛత్తీష్‌గడ్‌కు చెందిన ప్రీతిచౌహాన్ బ్రౌజ్ (కాస్యం) పతకం గెలుపొందింది.
⇒ పంజాబ్‌కు చెందిన మహక్ ప్రీతికౌర్ బ్రౌజ్ (కాస్యం) పతకం గెలుపొందింది.
మైనస్ 42 కేజీల విభాగంలో
⇒ మహారాష్ట్రకు చెందిన వైదేవి పవర్ బంగారు పతకాన్ని గెలుపొందింది.
⇒ తెలంగాణకు చెందిన మీనాక్షి సింగ్ సిల్వర్ పతకాన్ని కైవసం చేసుకుంది.
⇒ గుజరాత్‌కు చెందిన ఘరేత్య చేతన బ్రౌజ్ (కాస్యం) పతకం గెలుపొందింది.
⇒ ఛత్తీష్‌గడ్‌కు చెందిన ఆల్యాసేక్ బ్రౌజ్ (కాస్యం) పతకం గెలుపొందింది.
నువ్వా.. నేనా..
Published Fri, Jan 12 2018 11:23 AM | Last Updated on Tue, Oct 16 2018 3:15 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment