Kick Boxing
-
ఫైనల్ మ్యాచ్‌లో తలపడుతూ మృత్యు ఒడిలోకి..
24 ఏళ్ల భారత యువ కిక్ బాక్సర్ యోరా టేడ్ గురువారం రాత్రి(ఆగస్టు 25న) కన్నుమూశాడు. నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆదివారం చెన్నైలోని సదరన్ సిటీ వేదికగా కేశవ్ ముడేల్తో ఫైనల్ మ్యాచ్ జరిగింది. బౌట్లో భాగంగా ప్రత్యర్థి ముడేల్ ఇచ్చిన పంచ్ యోరా తలకు బలంగా తాకింది. దీంతో సృహతప్పిన యోరా రింగ్‌లోనే కుప్పకూలాడు. వెంటనే చెన్నైలోని రాజీవ్‌గాంధీ ఆసుపత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తూ రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన యోరా గురువారం కన్నుమూసినట్లు ఆసుపత్రి జనరల్ డైరెక్టర్ పేర్కొన్నారు. కాగా అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన యోరా టేడ్ ఇండియన్ ఎడిషన్ అయిన వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ కిక్‌బాక్సింగ్ ఆర్గనైజేషన్ టోర్నమెంట్లో తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించాడు. కాగా పోలీసులు టేడా మృతదేహాన్ని అరుణాచల్ ప్రదేశ్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా యోరా టేడా మృతిపట్ల అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమా ఖండూ విచారం వ్యక్తం చేశారు. ''యువ బాక్సర్ యోరా టేడా ఇంత తొందరగా మమ్మల్ని విడిచి స్వర్గాన్ని వెళ్లిపోతాడని ఊహించలేదు. కిక్ బాక్సింగ్‌లో అతనికి మంచి భవిష్యత్తు ఉందని ఆశించా. కానీ మృత్యువు అతన్ని వెంటాడింది ఇది నిజంగా దురదృష్టం. చెప్పడానికి మాటలు రావడం లేదు.. అతని ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. అతని కుటుంబసభ్యులకు, స్నేహితులకు నా ప్రగాడ సానుభూతి'' అని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. Jolted to learn that our bright Kickboxer Yora Tade left for his heavenly abode. Too early to leave us, dear Tade! No words to express my grief. You will ever be in our hearts. Condolences to bereaved family, friends & admirers. May your journey to ultimate abode be peaceful! 🙏 pic.twitter.com/d1wgHDoGAp — Pema Khandu པདྨ་མཁའ་འགྲོ་། (@PemaKhanduBJP) August 23, 2022 చదవండి: 11 ఏళ్లుగా సింగర్‌తో సహజీవనం, బ్రేకప్.. ఇప్పుడు ఇంకో అమ్మాయితో! 'లైగర్' సినిమా ఎమ్ఎంఏ ఫైట్.. క్రూరమైన క్రీడ నుంచి ఆదరణ దిశగా -
నిర్లక్ష్యం.. రింగ్‌లోనే కుప్పకూలిన కిక్ బాక్సర్
కిక్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో విషాదం చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగానే ప్రత్యర్థి ఇచ్చిన పంచ్‌కు కిక్ బాక్సర్ రింగ్‌లోనే కుప్పకూలాడు. ఈ దురదృష్టకర ఘటన జూలై 10న బెంగళూరులో చోటుచేసుకుంది. కాగా యువ బాక్సర్ మృతికి మేనేజ్మెంట్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు పేర్కొన్నారు. మృతి చెందిన బాక్సర్ 23 ఏళ్ల నిఖిల్ అని తెలిపారు. విషయంలోకి వెళితే..జూలై 10న బెంగళూరులోని జ్ఞానజ్యోతి నగర్‌లోని పై ఇంటర్నేషనల్ బిల్డింగ్‌లో స్టేట్ కిక్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ మ్యాచ్ నిర్వహించారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ప్రత్యర్థి మొహంపై పంచ్ ఇవ్వగానే వేగంగా కిందపడిన నిఖిల్ అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెంటనే అతన్ని నగరబావిలోని జీఎమ్ ఆసుపత్రికి తరలించారు. కోమాలోకి వెళ్లిపోయిన నిఖిల్ తలలో ఇంటర్నల్ బ్లీడింగ్ జరగడంతో బుధవారం రాత్రి మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. నిఖిల్ మృతిపై అతని తండ్రి సురేశ్ స్పందించాడు. ' పంచ్ దెబ్బకు నిఖిల్ తలలో బ్లీడింగ్ జరగలేదు. బాక్సింగ్ రింగ్‌పై ఉన్న మ్యాట్ నాసిరకం. మ్యాట్ కింద కూడా ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం.. మ్యాట్‌పై తల బలంగా తాకడంతోనే నిఖిల్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కనీసం ఫస్ట్ ఎయిడ్ కూడా చేయలేదని.. పారామెడికల్ యూనిట్ గాని.. నిఖిల్‌ను తీసుకెళ్లేందుకు స్ట్రెచర్ కూడా అందుబాటులో లేకపోవడంతోనే నా కొడుకు మృతి చెందాడంటూ'' ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా మ్యాచ్ నిర్వహించిన ఈవెంట్ ఆర్గనైజర్ నవీన్ రవిశంకర్ ఫోన్ స్విచ్చాఫ్ వస్తుందని.. అతను పరారీలో ఉన్నట్లు సురేశ్ పేర్కొన్నారు. నిఖిల్ తండ్రి ఫిర్యాదు మేరకు జ్ఞానభారతి పోలీసులు సెక్షన్ 304-ఏ కింద కేసు నమోదు చేసుకున్నారు. #Karnataka #Bengaluru Police have registered a negligence case against organisers after boxer Nithin died after he received a blow from opponent in state level kickboxing championship. @IndianExpress pic.twitter.com/PgiwkPK4Tp — Kiran Parashar (@KiranParashar21) July 14, 2022 -
వేషం ఉంది.. టాప్ తీసెయ్ అన్నాడు
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్త్రీలు పని చేసే వాతావరణంలో ఎన్ని అడ్డంకులు ఉన్నా పోరాటం ఆగదు అంటున్నారు టెలివిజన్ స్టార్ మల్హర్ రాథోడ్. ఢిల్లీకి చెందిన ఈ నటి కొన్ని చేదు అనుభవాల తర్వాత ముంబై నుంచి తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. ‘శక్తిని పుంజుకుంటాను... తిరిగి పోరాడతాను’ అంటున్నారామె. ‘హోస్టేజెస్’ (2019) వెబ్ సిరీస్‌లోనూ, ‘తేరే లియే బ్రో’ (2017) టీవీ సిరీస్‌లోనూ నటించిన మల్హర్ రాథోడ్ బాలీవుడ్లో ఒక నటిగా, మోడల్‌గా ఎదుర్కొనాల్సిన సవాళ్లన్నీ ఎదుర్కొన్నారు. స్త్రీలకు ఆత్మరక్షణ తెలిసి ఉండాలని చెప్పే ఈ నటి ప్రస్తుతం కిక్ బాక్సింగ్ నేర్చుకుంటున్నారు. ‘స్త్రీలు పోరాటం చేయాలి. అందుకు సన్నద్ధం కూడా అయి ఉండాలి’ అని ఆమె అంటారు. మల్హార్ రాథోడ్ అందరు వర్థమాననటులకు మల్లే తానూ బాలీవుడ్లో కష్టాలు పడ్డారు. ‘నటించాలనే నా కోరికను నా కుటుంబం కాదనలేదు. కాని ముంబైలో నాకు ఎదురయ్యే సవాళ్లు వాళ్ల నుంచి దాచాలంటే కష్టంగా ఉండేది’ అని ఆమె అంది. ‘ఒక నిర్మాత.. అతని వయసు 65 సంవత్సరాలు ఉంటాయి. సినిమాలో వేషం ఉందని ఆఫీసుకు పిలిపించాడు. నీకు వేషం ఉంది... ఒకసారి ఆ టాప్ తీసెయ్ అన్నాడు. నేను షాక్ అయ్యాను. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు. మెల్లగా అక్కడి నుంచి వచ్చేశాను. దీని నుంచి బయటపడటానికి చాలా రోజులు పట్టింది’ అని ఆమె ముంబైలో ఇటీవల ఏ.ఎఫ్.పి వార్తా సంస్థకు తెలియచేసింది. ‘బాలీవుడ్లో ఎవరైనా పని లేకపోవడం అనే కష్టాన్ని అనుభవిస్తారు. నెలల తరబడి పని దొరకదు. ఆడవాళ్లకు సెక్సువల్ హరాస్మెంట్స్ అదనం. అదృష్టవశాత్తు మీటు ఉద్యమం రావడం వల్ల కొంత చైతన్యం వచ్చింది. హాలీవుడ్లో బాలీవుడ్లో కొందరి బండారం బట్టబయలైంది. ఆ ఉద్యమం రాకపోయి ఉంటే జరిగేది జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో ఇలాంటి విషయాల పట్ల బహిరంగంగా బయట మాట్లాడరు. కాని తప్పక మాట్లాడాలని నేను అంటాను’ అందామె. కిక్ బాక్సింగ్ నేర్చుకుంటున్న మల్హర్ రాథోడ్ ‘మా కుటుంబానికి వ్యాపారాలు ఉన్నాయి. వాళ్లు నన్ను తమ వ్యాపారాలు చూసుకుంటే చాలని అనుకుంటున్నారు. బాలీవుడ్లో స్ట్రగుల్ అవుతూ ఉండటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కాని మన కలలు నెరవేర్చుకోవడానికి వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. నేను కొంత కాలం కోసం ఢిల్లీ వచ్చేశాను. మానసికంగా, శారీరకంగా మరింత దృఢమయ్యి తిరిగి ముంబై వెళతాను. అనుకున్నది సాధిస్తాను’ అందామె. మల్హార్ రాథోడ్ పాములు తిరిగే దారిలో కర్ర పట్టుకొని నడవాల్సిన అవసరాన్ని చెబుతున్నారు. పాములుంటాయని ఆ దారిలోనే వెళ్లడం మానేస్తే మణులు మన చేత చిక్కవు అని కూడా ఆ మాటలకు అర్థం. పోరాటం కొనసాగించే వారే విజయానికి చేరువవుతారు. లక్ష్యం చేరుకుంటారు. -
కొడుకు కోసం.. కిక్ బాక్సింగ్ చాంపియనై..
తన కుమారుడుని క్రీడల్లో ఉన్నతస్థితికి చేర్చాలనుకుంది. దాని కోసం తర్ఫీదు ఇప్పించాలని భావించింది. దగ్గరుండి మరీ శిక్షణకు తీసుకు వెళ్లేది. చివరికి ఆ క్రీడపై తానూ ఆసక్తి పెంచుకుంది. అంతే తనయుడితో పాటు తానూ శిక్షణ తీసుకుంది. అందులో రాణించి జాతీయస్థాయిలో ప్రతిభ చూపి స్వర్ణ పతకం సాధించింది. అంతేకాదు.. అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించింది. తనయుడి కోసం పీఈటీ కోర్సు పూర్తి చేసిన ఈమె కిక్ బాక్సింగ్‌లో కోచ్ కం రిఫరీ కావాలన్నది తన ఆశయమని చెబుతోంది. రాజమహేంద్రవరం రూరల్: బోను అపర్ణ నాగప్రియ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు. చిన్నతనంలో ఇంటర్ చదివే సమయంలో బాస్కెట్ బాల్, కబడీ ఆడేవారు. తండ్రి అనారోగ్యానికి గురికావడంతో ఇంటర్ తోనే చదువుకు ఫుల్స్టాప్ పెట్టి చిరుద్యోగాలు చేస్తూ కంప్యూటర్ నేర్చుకున్నారు. కొంతకాలం తరువాత పుప్పాల వినయ్‌కుమార్‌తో వివాహం జరిగింది. ఆ తరువాత కూడా ఖాళీగా ఉండడం ఇష్టం లేక హిందీ పండిట్ కోర్సు పూర్తిచేశారు నాగప్రియ. తన కుమారుడు పుప్పాల చేతన్చంద్షణ్ముఖ్నాయుడును మంచి క్రీడాకారుడిగా తీర్చిదిద్దాలని సంకల్పించిన ఆమె తాను పీఈటీ అయితే కుమారుడి భవితకు మెరుగులు దిద్దవచ్చని భావించారు. ఈ క్రమంలో నాగప్రియ గొల్లల మామిడాడ కళాశాలలో రెండేళ్ల పీఈటీ కోర్సు పూర్తి చేసి ఓ ప్రైవేటు పాఠశాలలో పీఈటీగా చేరి విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వేసవి సెలవుల్లో తన కుమారుడు చేతన్‌కు హ్యాండ్‌బాల్, స్కేటింగ్‌లో శిక్షణ ఇప్పించి, రెండేళ్ల క్రితం గ్రాండ్‌మాస్టర్ శామ్యూల్‌రాజ్, కోచ్‌లు పట్టపగలు సంతోష్, ఎం.గణేష్‌ల వద్ద కరాటే, బాక్సింగ్, కిక్‌బాక్సింగ్‌లో శిక్షణ ఇప్పించారు. చేతన్‌తో పాటు తాను బాక్సింగ్, కిక్‌బాక్సింగ్‌లో శిక్షణ పొందారు. గ్రాండ్‌మాస్టర్, కోచ్‌ల సహాకారంతో నాగప్రియ విశాఖపట్నంలో ఈ ఏడాది జూన్ 30న జరిగిన ఏపీ స్టేట్ కిక్‌బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించి, హర్యానాలో ఈనెల 18, 19, 20, 21 తేదీల్లో వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ కిక్‌బాక్సింగ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని అక్కడ కూడా స్వర్ణ పతకం సాధించారు. అంతే కాకుండా మెక్సికోలో జరిగే ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీలకు అర్హత సాధించింది. కోచ్ కం రిఫరీ కావాలన్న ఆకాంక్షతో కిక్‌బాక్సింగ్‌లో థియరీ, ప్రాక్టికల్స్‌లో రాణించి బ్లాక్‌బెల్ట్ కైవసం చేసుకున్నారు. కోచ్ కం రిఫరీకావాలన్నదే ఆకాంక్ష కిక్ బాక్సింగ్ కోచ్ కం రిఫరీ కావాలన్నదే తన ముందున్న లక్ష్యం. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ స్పెషలైజేషన్ చేసి కోచ్ కం రిఫరీ అవుతాను. తన కుమారుడిని చాంపియన్ చేయాలన్న ఆకాంక్షతో మొదలైన ప్రస్థానంలో భాగంగా తాను జాతీయస్థాయి కిక్‌బాక్సింగ్ పోటీల్లో పాల్గొని బంగారుపతకం సాధించడం ఆనందంగా ఉంది. తన కుమారుడు చేతన్‌ను జాతీయస్థాయి క్రీడాకారుడిగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం. – బోను అపర్ణ నాగప్రియ, బొమ్మూరు -
సిటీ కుర్రాడు.. బాక్సింగ్‌లో ఎదిగాడు
గచ్చిబౌలి: ఓ తాపీ మేస్త్రీ కొడుకు అంతర్జాతీయ క్రీడాకారుడిగా ఎదిగాడు. అంతేకాదు.. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఎన్నో పతకాలను సైతం సాధించొక్చాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా వెనుదిరగక దాతల సాయంతో ముందుకెళుతున్నాడు సుగునూరు ఉదయ్ సాగర్. కిక్ బాక్సింగ్‌లో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఈవెంట్లోనూ ఉదయ్ సాగర్ పతకం సాధించడం విశేషం. పదో తరగతిలో ఉండగా కిక్ బాక్సింగ్‌పై మక్కువ పెంచుకున్న ఇతడు ఒలింపిక్స్ లక్ష్యంగా ముందుకెళుతున్నాడు. ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు టర్కీలోని అంటాలియాలో జరిగిన 4వ ఇంటర్నేషనల్ యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున పాల్గొన్న ఒకే ఒక్క క్రీడాకారుడు ఉదయ్ కావడం గమనార్హం. అంతేకాదు.. ఈ పోటీల్లో పాల్గొన్న 22 దేశాలను తలదన్ని సూపర్ హెవీ వెయిట్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు. ఇది కాకుండా జాతీయ స్థాయిలో ఏడు బంగారు పతకాలు, రెండు రజత పతకాలు సాధించి కిక్ బాక్సింగ్‌లో తనకు ఎదరులేదని నిరూపిస్తున్నాడు. కుటుంబ నేపథ్యం ఇదీ వనపర్తి జిల్లా కేంద్రంలోని టీచర్స్‌కాలనీకి చెందిన ఉదయ్ సాగర్ తండ్రి సుగునరు రాము తాపీమేస్త్రి, తల్లి అరుణ గృహిణి. తండ్రి సంపాదనతోనే కుటుంబ పోషణ అధారపడి ఉంది. ఇంటర్ చదువుతుండగా వనపర్తిలోని కరాటే శేఖర్ వద్ద కిక్ బాక్సింగ్ శిక్షణ పొందాడు. ప్రస్తుతం ఉదయ్ తల్లిదండ్రులతో కలిసి మియాపూర్‌లోని ప్రగతి ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్నాడు. కిక్ నుంచి బాక్సింగ్ వైపు.. ఇప్పటి వరకు కిక్ బాక్సింగ్‌కు ఒలింపిక్‌లో అవకాశం కల్పించలేదు. వచ్చే 2024లో జరిగే క్రీడల్లోనూ కిక్ బాక్సింగ్‌కు చోటు దక్కుతుందనేది అనుమానమే. దీంతో ఉదయ్ కొంత కాలంగా బాక్సింగ్‌లోనూ శిక్షణ తీసుకుంటున్నాడు. ఎయిర్‌ఫోర్స్ రిటైర్డ్ ఆఫీసర్ చిరంజీవి వద్ద బాక్సింగ్‌లో శిక్షణ, మెళకువలు నేర్చుకుంటున్నాడు. ఒలింపిక్స్ పతకమే లక్ష్యం ఒలింపిక్స్‌లో కిక్ బాక్సింగ్‌కు చోటు కల్పిస్తే పతకం సాధించడమే నా లక్ష్యం. బాక్సింగ్‌లో ఒలింపిక్ మెడల్ సాధించిన విజేందర్ సింగ్ నాకు స్పూర్తి. రోజు నాలుగు గంటల పాటు ప్రాక్టీస్ చేస్తాను. ఒక్కో ఈవెంట్‌కు వెళ్లాలంటే కనీసం రూ.30 వేలు ఖర్చవుతుంది. శిరీష ఎస్టేట్స్ నిర్వాహకులు రఘునాథ్ యాదవ్ ఆర్థిక సాయం అందిస్తున్నారు. – ఉదయ్ సాగర్ సాధించిన పతకాలు ఇవే.. ♦ తొలిసారి 2013లో యాకూత్పురాలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకంసాధించాడు. ♦ 2015లో నగరంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకం ♦ వైజాగ్‌లో జరిగిన జాతీయ పోటీల్లో89 కిలోల విభాగంలో కాంస్య పతకం ♦ 2015 ఆగస్టులో కోల్‌కతాలో జరిగిన జాతీయ పోటీల్లో 90 కిలోల విభాగంలో రజత పతకం ♦ 2017 జనవరిలో ఢిల్లీలో జరిగిన నేషనల్ఫెడరేషన్ కప్‌లో బంగారు పతకం ♦ ఏప్రిల్‌లో మహారాష్ట్ర, సెప్టెంబర్లోచత్తీస్ఘడ్లో జరిగిన జాతీయ పోటీల్లో బంగారు పతకాలు ♦ 2018 ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన జాతీయ పోటీల్లో బంగారు పతకం. ఆగస్టులో సీనియర్ కిక్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో బగారు పతకం. -
మానసకు రెండు పతకాలు
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్ఏయూ) విద్యార్థి వి. మానస రెడ్డి అంతర్జాతీయ స్థాయి టోర్నీలో ఆకట్టుకుంది. టర్కిష్ ఓపెన్ కిక్ బాక్సింగ్ టోర్నీలో పాల్గొన్న మానస రెండు పతకాలను సాధించింది. టర్కీలో ఈనెల 4 నుంచి 7 వరకు జరిగి న ఈ టోర్నీలో సీనియర్ మ్యూజికల్ ఫామ్ వెపన్ కేటగిరీలో మానస రజతం గెలుచుకుంది. సీనియర్ మ్యూజికల్ ఫామ్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. ఈ సందర్భంగా పీజేటీఎస్ఏయూ వైస్ చాన్స్‌లర్ ప్రవీణ్ రావు, రిజిస్ట్రార్ సుధీర్ కుమార్, డీన్ విష్ణువర్ధన్ రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన మానసను అభినందించారు. -
భారత కిక్ బాక్సింగ్ జట్టులో మానస
సాక్షి, హైదరాబాద్: టర్కిష్ ఓపెన్ కిక్ బాక్సింగ్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టులో తెలంగాణ రాష్ట్ర అమ్మాయి బి. మానస రెడ్డి చోటు దక్కించుకుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని జగిత్యాల వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతోన్న మానస... భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. మొత్తం భారత జట్టుకు 14 మంది ఎంపికవగా... తెలంగాణ నుంచి మానస జట్టులో చోటు దక్కించుకుంది. టర్కీలోని అంటాల్యా వేదికగా ఈనెల 4 నుంచి 7 వరకు టర్కిష్ ఓపెన్ కిక్‌బాక్సింగ్ టోర్నీ జరుగుతుంది. ఈ సందర్భంగా జాతీయ జట్టుకు ఎంపికైన ఆమెను కోచ్ రామాంజనేయులు, విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ వి. ప్రవీణ్ రావు అభినందించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన మానస అంతర్జాతీయ టోర్నీలో దేశానికి ప్రాతినిధ్యం వహించడం తమకు గర్వంగా ఉందని వారు అన్నారు. ఢిల్లీ, కోల్‌కతా వేదికల్లో జరిగిన జాతీయ స్థాయి టోర్నీల్లో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా ఆమెను భారత జట్టుకు ఎంపిక చేశారు. ఈ జాతీయ స్థాయి టోర్నీల్లో మానస ఒక స్వర్ణం, రెండు రజత పతకాలు సాధించింది. -
తెలంగాణకు మూడు పతకాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ కిక్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్లు రాణించారు. హిమాచల్‌ప్రదేశ్ సోలంకి యూనివర్సిటీలో జరిగిన ఈ టోర్నీలో రెండు రజతాలు, ఒక కాంస్యా న్ని సాధించారు. రాష్ట్రానికి చెందిన నితీశ్ కుమార్, అక్షర రజతాలను గెలుచుకోగా, స్టాలిన్ కాంస్యాన్ని నెగ్గాడు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డిని రాష్ట్ర కిక్ బాక్సింగ్ బృందం శుక్రవారం కలిసింది. జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచిన బాక్సర్లను శాట్స్ చైర్మన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ రిఫరీ తిరుపతి, తెలంగాణ కిక్ బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు సి. రామాంజనేయ, కార్యదర్శి మహిపాల్ పాల్గొన్నారు. -
మట్టిలో మాణిక్యం
కటిక పేదరికం. అయినవాళ్లున్నా అనాథలా జీవనం. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు దూరం. కుటుంబ భారం మోయలేక చేతులెత్తేసిన తండ్రి. నిస్సహాయ స్థితిలో ఐదుగురు ఆడపిల్లల్ని స్వచ్ఛంద సంస్థలో చేర్చిన తల్లి... ఇదీ ప్రస్తుతం జాతీయ స్థాయిలో కిక్ బాక్సింగ్‌లో రాణిస్తోన్న ప్రియాంక జీవితం. కడుపునిండా తిండి లేకున్నా అత్యున్నత శిఖరాలకు చేరాలన్న ఆశయాన్ని వీడలేదు. ప్రతిభకు పేదరికం అడ్డుకాదంటూ క్రీడల్లో సత్తా చాటుతోంది. అమ్మాయిలు ఎవరికీ తీసిపోరని రుజువుచేస్తూ సాహసోపేతమైన కిక్ బాక్సింగ్‌ను కెరీర్‌గా ఎంచుకొని ముందడుగు వేస్తోంది. బన్సీలాల్‌పేట్: హైదరాబాద్ వీఎస్టీ సమీపంలోని నాగమయ్య కుంట మురికివాడలో జన్మించిన ప్రియాంక జీవితం కన్నీటి పర్యంతం. సంగీత, రాజేందర్ దంపతులకు కలిగిన ఐదుగురు ఆడ సంతానంలో ప్రియాంక నాలుగో అమ్మాయి. ఆడపిల్లలు భారమని భావించిన తండ్రి రాజేందర్ ఇల్లు విడిచి వెళ్లిపోవడంతో ఆ కుటుంబం కోలుకోలేకపోయింది. అప్పటికే పేదరికంలో మగ్గిపోతున్న తల్లి సంగీత నిస్సహాయురాలై పిల్లలందరినీ చిన్నతనంలోనే స్వచ్ఛంద సంస్థలో చేర్చింది. వీరికి అఫ్జల్‌గంజ్‌లోని అఫ్సా రెయిన్బో హోమ్ ఆశ్రయం ఇచ్చింది. ప్రస్తుతం ఇదే ఆశ్రమంలో తలదాచుకుంటోన్న ప్రియాంక చాదర్‌ఘాట్‌లోని డీఆర్ జిందాల్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతోంది. రెజ్లింగ్ నుంచి కిక్‌బాక్సర్‌గా... ప్రియాంక కిక్ బాక్సర్‌గా ఎదగడం వెనుక కోచ్‌లు అక్రముల్లా, శ్రీనివాస్‌ల ప్రోత్సాహం ఉంది. చిన్నప్పటి నుంచి క్రీడల్లో రాణించే ప్రియాంక తొలుత రెజ్లింగ్ వైపు ఆసక్తి చూపించింది. అయితే బెల్ట్ రెజ్లింగ్‌లో వయసు సరిపోకపోవడంతో అర్హత సాధించలేకపోయింది. దీంతో కోచ్‌లు ఆమెను కిక్ బాక్సింగ్ వైపు ప్రోత్సహించారు. ప్రాణాలను పణంగా పెట్టే కిక్ బాక్సింగ్‌లో రాణించాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. కానీ ఎలాగైనా ఉన్నత స్థాయికి చేరుకోవాలనే తపనతో ఆమె కిక్ బాక్సింగ్‌లో అడుగుపెట్టింది. ఆదిలోనే బంగారు పతకం... కిక్ బాక్సింగ్‌లో అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే ప్రియాంక జాతీయ స్థాయిలో రాణించింది. ఇటీవల ఎల్బీ స్టేడియంలో జరిగిన జాతీయ కిక్ బాక్సింగ్ టోర్నీలో స్వర్ణాన్ని సాధించింది. 48 కేజీల వెయిట్ కేటగిరీలో మధ్యప్రదేశ్ క్రీడాకారిణిని ఓడించి ప్రియాంక విజేతగా నిలిచింది. పోలీస్‌గా ఎదగాలనే కాంక్ష... సమాజాన్ని ప్రక్షాళన చేసేందుకు అవకాశం ఉన్న పోలీస్ అధికారిణిగా ఎదగడమే తన లక్ష్యమని ప్రియాంక చెబుతోంది. అందుకు అనుగుణంగానే క్రీడలతో పాటు, చదువులోనూ రాణిస్తోంది. అఫ్సా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న రెయిన్బో హోమ్ తనను అక్కున చేర్చుకుని తన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతోందని ఆమె చెప్పింది. ఆ సంస్థ ప్రేమను జీవితాంతం గుండెల్లో నిలబెట్టుకుంటానని ప్రియాంక కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేసింది. నిస్సహాయులకు అండగా ఉంటాం: అఫ్సా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి నగరంలోని నిరుపేదలకు ఆశ్రయాన్ని కల్పించి వారి జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని అఫ్సా స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. చదువుతో పాటు ఆసక్తి ఉన్న రంగాల్లో అవసరమైన శిక్షణను ఇప్పించడం ద్వారా మురికివాడల్లోని పేద యువతీ యువకులు అత్యున్నత శిఖరాలు అధిరోహించేలా తమ సంస్థ చేయూతనిస్తోందన్నారు. -
నువ్వా.. నేనా..
మెదక్ జోన్: జిల్లా కేంద్రంగా ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో అండర్–14 బాలబాలికల జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు గురువారం నాటికి మూడో రోజుకు చేరాయి. బాలికల పోటీలు గురువారం సాయంత్రానికి ముగిశాయి. తొమ్మిది రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు కిక్‌బాక్సింగ్‌లో ఒకరిపై ఒకరు పంచులు కొడుతూ, లెగ్షాట్లతో ప్రత్యర్థులను మట్టికరిపించే ప్రతిభ అందరిని ఆకట్టుకుంది. నున్వా..నేనా అనే విధంగా చిరవరి వరకు పోరాడారు. మూడు రోజులుగా కొనసాగిన బాలికల విభాగానికి సంబంధించి విజేతలు మైనస్46 కేజీల విభాగంలో మహారాష్ట్రకు చెందిన వైష్ణవిలింబో గోల్డ్ పతకాన్ని కైవసం చేసుకుంది. ఛత్తీష్గడ్కు చెందిన కె.వి. ప్రియసింగ్ సిల్వర్ పతకం గెలుచుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన అచ్చల్పట్టి, పంజాబ్‌కు చెందిన బలింధర్కౌర్ కాస్య పతకం గెలుచుకున్నారు. మైనస్50 కేజీల విభాగంలో పంజాబ్‌కు చెందిన అర్షిక్కౌర్ బంగారు పతకం గెలుచుకుంది. మహారాష్ట్రకు చెందిన ప్రీతిహాట్వేట్ సిల్వర్ పతకం గెలుపొందింది.ఢిల్లీకి చెందిన తమన్న కాస్య పతకం గెలుచుకుంది. ఛత్తీష్గడ్కు చెందిన వసుంధర స్లిన్మౌడ్ కాస్య పతకం గెలుచుకుంది. 50 కన్నా అధిక కేజీల బరువుగల విభాగంలో ⇒ పంజాబ్‌కు చెందిన సుక్లీన్కౌర్ బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ⇒ తెలంగాణకు చెందిన అక్షిత సిల్వర్ పతకాన్ని గెలుపొందింది. ⇒ ఛత్తీస్‌గడ్‌కు చెందిన శ్రీయసుక్ల కాస్య పతకం గెలుపొందింది. ⇒ గుజరాత్‌కు చెందిన పటేల్ యాసివ్ బ్రౌజ్ (కాస్యం) పతకం గెలుపొందింది. మైనస్ 24 కేజీల విభాగంలో ⇒ మహారాష్ట్రకు చెందిన పయాల్ సిర్కి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ⇒ ఢిల్లీకి చెందిన కహక్ష సిల్వర్ పతకాన్ని గెలుచుకుంది. ⇒ విద్యాభారతికి చెందిన ఇస్హ సకి బ్రౌజ్ (కాస్యం) పతకం గెలుపొందింది. ⇒ తెలంగాణకు చెందిన ఖతీజ సజియా బ్రౌజ్ (కాస్యం) పతకం గెలుపొందింది. మైనస్ 28 కేజీల విభాగంలో ⇒ మహారాష్ట్రకు చెందిన పయాల్వేర్ బంగారు పతకాన్ని గెలుపొందింది. ⇒ తెలంగాణకు చెందిన నబుస్రా సిల్వర్ పతకాన్ని గెలుపొందింది. ⇒ పంజాబ్‌కు చెందిన నూర్ప్రీత్కౌర్ బ్రౌజ్ (కాస్యం) పతకాన్ని గెలుపొందింది. ⇒ గుజరాత్‌కు చెందిన రాధిక బ్రౌజ్ (కాస్యం) పతకం గెలుపొందింది. మైనస్ 32 కేజీల విభాగంలో ⇒ జమ్మూ కాశ్మీర్‌కు చెందిన హన్సాహుసేన్ హెస్టీ బంగారు పతకాన్ని గెలుచుకుంది. ⇒ మహారాష్ట్రకు చెందిన సాక్షి మార్గోడ్ సిల్వర్ పతకాన్ని గెలుచుకుంది. ⇒ పంజాబ్‌కు చెందిన హైరెట్ సందు బ్రౌజ్ (కాస్యం) పతకం గెలుపొందింది. ⇒ గుజరాత్‌కు చెందిన మెరికింజాల్ బ్రౌజ్ (కాస్యం) పతకం గెలుపొందింది. మైనస్ 37 కేజీల విభాగంలో ⇒ ఢిల్లీకి చెందిన ఐరామ్ బంగారు పతకాన్ని గెలుపొందింది. ⇒ మహారాష్ట్రకు చెందిన ఖుసిపెవ్ల్ సిల్వర్ పతకాన్ని గెలుపొందింది. ⇒ ఛత్తీష్గడ్కు చెందిన ప్రీతిచౌహాన్ బ్రౌజ్ (కాస్యం) పతకం గెలుపొందింది. ⇒ పంజాబ్‌కు చెందిన మహక్ ప్రీతికౌర్ బ్రౌజ్ (కాస్యం) పతకం గెలుపొందింది. మైనస్ 42 కేజీల విభాగంలో ⇒ మహారాష్ట్రకు చెందిన వైదేవి పవర్ బంగారు పతకాన్ని గెలుపొందింది. ⇒ తెలంగాణకు చెందిన మీనాక్షి సింగ్ సిల్వర్ పతకాన్ని కైవసం చేసుకుంది. ⇒ గుజరాత్‌కు చెందిన ఘరేత్య చేతన బ్రౌజ్ (కాస్యం) పతకం గెలుపొందింది. ⇒ ఛత్తీష్గడ్కు చెందిన ఆల్యాసేక్ బ్రౌజ్ (కాస్యం) పతకం గెలుపొందింది. -
బాడీబిల్డర్ ప్రదీప్ దుర్మరణం..
సింగపూర్ : ప్రముఖ బాడీబిల్డర్, భారత సంతతికి చెందిన ప్రదీప్ సుబ్రమణియన్(32) అనూహ్యరీతిలో ప్రాణాలు కోల్పోయారు. కిక్ బాక్సింగ్ రింగ్‌లో ప్రత్యర్థి పంచ్‌ల ధాటికి కుప్పకూలిన ఆయన.. గుండెపోటుకు గురై ఆస్పత్రికి తరలించేలోపే తుదిశ్వాసవిడిచారు. కాగా, ప్రొఫెషనల్ బాక్సర్ కానప్పటికీ ప్రదీప్‌ను బరిలోకి దింపిన టోర్నీ నిర్వాహకులపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. సింగపూర్‌లోని మరీనా బే స్లాండ్స్ వేదికగా శనివారం ఆసియా ఫైటింగ్ చాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. తొలిరోజే ‘సెలబ్రిటీ బౌట్’ కేటగిరీలో యూట్యూబర్ స్టీవెన్ లిమ్, గాయకుడు సిల్వెస్టర్ సిమ్ల మధ్య మ్యాచ్ జరగాల్సిఉంది. అయితే నిబంధనల ప్రకారం ఇన్సురెన్స్(బీమా) లేకపోవడంతో సిల్వెస్టర్ మ్యాచ్ ఆడే అర్హతను కోల్పోయాడు. దీంతో నిర్వాహకులు హుటాహుటిన సిల్వెస్టర్ స్థానంలో ప్రదీప్‌ను బరిలోకి పంపారు. ఆయనకు ఇది తొలి మ్యాచ్. బౌట్ ఏ దశలోనూ ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేకపోయిన ప్రదీప్‌కు.. ఒక దశలో ముక్కువెంట రక్తం కారింది. చివరికి స్టీవెన్ మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. అంపైర్ విజేతను ప్రకటిస్తున్న తరుణంలోనే ప్రదీప్ రింగ్‌లో కూలబడిపోయాడు. ఆయనను సింగపూర్ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రదీప్ మరణానికి గుండెపోటే కారణమని ప్రాథమికంగా నిర్ధారించామని, అయితే పూర్తి వివరాలను మరో నెలరోజుల్లో వెల్లడిస్తామని వైద్యులు చెప్పారు. బాడీబిల్డర్ అయిన ప్రదీప్‌ను బాక్సింగ్ రింగ్‌లోకి దింపిన నిర్వాహకులపై అభిమానులతోపాటు నెటిజన్లు సైతం విమర్శలు చేశారు. అయితే జరిగింది దురదృష్టకర పరిణామమని, ప్రదీప్ కుటుంబానికి అండగా ఉంటామని బాక్సింగ్ టోర్నీ నిర్వాహకులు ప్రకటించారు. ఎవరిచేతిలో దెబ్బలు తిని ప్రాణాలు కోల్పోయాడో, ఆ స్టీవెన్ లిమ్ సైతం ప్రదీప్‌కు నివాళులు అర్పించారు. (ఫొటో స్లైడ్ చూడండి..) -
మనోళ్లకు 12 పతకాలు
సాక్షి, హైదరాబాద్: ఐర్లాండ్‌లో ఇటీవల జరిగిన ప్రపంచ కరాటే, కిక్ బాక్సింగ్ యూనియన్ చాంపియన్‌షిప్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు సత్తా చాటుకున్నారు. ఈ పోటీల్లో 12 పతకాలు సాధించారు. ఇందులో 4 రజతాలు, 8 కాంస్యాలు ఉన్నాయి. ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన డాక్టర్ విద్యాసాగర్ కాంస్యం గెలుపొందగా, వ్యక్తిగత విభాగంలో కావ్య మీనన్, ఆకాంక్ష పాటిల్, వెలువోలు సాకేత్, అన్మిశ్ శరత్ వర్మ రన్నరప్‌గా నిలిచి రజత పతకాలు సాధించారు. ఈ నలుగురితో కూడిన బృందం టీమ్ కుమిటేలో మూడో స్థానంలో నిలిచింది. అశ్విని ఆనంద్ వ్యక్తిగత, టీమ్ కుమిటేలో చెరో కాంస్యం గెలిచింది. విద్యాసాగర్, ప్రభు చరణ్ టీమ్ ఈవెంట్లో కాంస్యాలు గెలిచారు. ఈ జట్టుకు శిహాన్ సాయి కుమార్ కోచ్‌గా, విజయ్ కుమార్ మేనేజర్‌గా వ్యవహరించారు. ఐర్లాండ్‌లోని కెర్రీ సిటీలో ఐదు రోజుల పాటు జరిగిన ఈ ఈవెంట్లో ట్రెడిషనల్ కరాటే, లైట్ కాంటాక్ట్, ఫుట్ కాంటాక్ట్, కిక్ బాక్సింగ్, ఎమ్ఎమ్ఏ, వెపన్ కాంపిటీషన్ మ్యూజికల్, నాన్ మ్యూజికల్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. 32 దేశాలకు చెందిన 2000 మంది కరాటే క్రీడాకారులు పాల్గొన్నారు. -
సిటీలో సెన్సేషనల్ మిసైల్.. లెట్స్ మూవ్
- కిక్ బాక్సింగ్‌కు మహిళలు ఫిదా - ‘గిమ్మీ ఫైవ్’ అంటూ జిమ్స్‌కు పయనం - క్రేజీ వర్కవుట్స్‌తో ఉత్తేజం నగరవాసులకు ఆరోగ్యపరమైన సూత్రాలను ఇప్పుడు బాగా వంటబట్టించుకుంటున్నారు. ‘వినదగు నెవ్వరు చెప్పిన’ అన్నట్టు.. ఇలాంటివి ఎవరు చెప్పినా ఆసక్తిగా పాటిస్తున్నారు. చెప్పేది మిస్ ఇండియా అయినా మిషెల్ ఒబామా అయినా.. ‘ఫిట్నెస్’ అంటే సిటీ మహిళలు సై అంటున్నారు. అలాగే ‘లెట్స్ మూవ్’ అంటూ మిషెల్ సంధించిన మిసైల్ లాంటి పంచ్‌లకు ఫిదా అయిపోయి కిక్స్‌తో రఫ్ఫాడించేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రేజీగా మారిన వర్కవుట్ కిక్ బాక్సింగ్ విశేషాలవి.. గత నెలలో అమెరికా దేశపు ప్రధమ మహిళ మిషెల్ ఒబామా ఒక వర్కవుట్ వీడియోను ఆన్లైన్లో పోస్ట్ చేశారు. స్వల్ప కాలంలోనే కోటి మందికి పైగా వీక్షకుల్ని సంపాదించిన ఆ వీడియోలో తన వర్కవుట్స్‌ని ఆమె పరిచయం చేశారు. మిషెల్ చేసిన 5 ఎక్సర్సైజ్ల్లో.. జంపింగ్ రోప్, మెడిసిన్ బాల్‌తో అబ్డామినల్ క్రంచెస్, బెంచ్ స్క్వాట్స్, డంబెల్ ప్రెసెస్, బాక్సింగ్.. ఉన్నాయి. కేవలం రెండు నిమిషాలు మించి లేని ఈ క్లిప్‌లో మిషెల్‌తో పాటు ఆమె ఫ్యామిలీ ట్రైనర్ కార్నెల్ మెకెల్లన్ కూడా కనిపిస్తారు. స్క్వాట్స్, క్రంచెస్ అయిపోయాక మిషెల్ బ్లూ బాక్సింగ్ గ్లవ్స్ ధరించి కిక్స్ మొదలుపెట్టారు. ఆమె ఇందులో ఒక టు-పంచ్ కాంబోను చూపించి ఆ తర్వాత గిర్రున తిరుగుతూ బ్యాగ్‌పై ఓ రౌండ్ హౌజ్ కిక్ ఇచ్చారు. మిగతావి ఎలా ఉన్నా... ఆమె పంచ్ బ్యాగ్‌పై పంజా విసురుతూ ఇచ్చిన రౌండ్ హౌజ్ కిక్స్..ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. మిషెల్ వీడియో నగర మహిళల్లో కిక్ బాక్సింగ్ పట్ల అమాంతం క్రేజ్ పెంచేసింది. మరెందరికో ‘కిక్’.. తను ఏం తిన్నా తనను ఫిట్‌గా ఉంచే శక్తి కిక్ బాక్సింగ్‌కి ఉన్నట్టు గ్రహించానని టాలీవుడ్ సినీనటి రకుల్ ప్రీత్‌సింగ్ అంటోంది. ఫుడ్ డబుల్ అయినప్పుడు శాండ్బాగ్స్కి కిక్స్ ఇస్తూ రెట్టింపు సమయం గడుపుతానని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. మిషెల్ ఒబామా అప్లోడ్ చేసిన ‘లెట్స్మూవ్’ వీడియో మహిళల్ని ఎక్సర్సైజ్ల వైపు మళ్లించేలా స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు సిటీ సోషలైట్ సుశీలా బొకాడియా. తాను రోజూ 2 గంటల పాటు వర్కవుట్ చేస్తానని, తన వర్కవుట్‌లో ఇప్పుడు కిక్ బాక్సింగ్ ప్రధానమైన భాగమని చెప్పారు. యోగా ట్రైనర్‌గా రోప్ యోగా వంటి వెరైటీ శైలుల్ని పరిచయం చేసిన రినా హిందోచా కూడా తాను ఇటీవలే కిక్ బాక్సింగ్‌ను సాధన చేస్తున్నానన్నారు. ఇది మహిళల్ని శక్తివంతం చేయడం మాత్రమే కాకుండా ఆత్మరక్షణకు కూడా ఉపకరిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. మిక్స్ చేస్తే మస్తు మస్తే.. చూడ్డానికి కష్టంగా అనిపించినా ఈ కిక్స్, పంచ్‌లు తేలిగ్గా చేయగలిగినవేనని జరీర్ చెప్పారు. ఇది మోకాలు, లోయర్ బ్యాక్‌లపై తక్కువ భారాన్ని వేసే వ్యాయామం. ఎప్పటికప్పుడు ఆసక్తిని పెంచుకునేందుకు వీలుగా దీనిని విభిన్న మార్గాల్లో చేయవచ్చు. ఏరోబిక్స్, వెయిట్ ట్రైనింగ్‌ను కూడా జత కలిపి చేయడం అలాంటి ఒక వైవిధ్యమార్గం. అయితే, కొత్తగా సాధన చేసేవారు తప్పనిసరిగా మంచి కార్డియో కిక్ బాక్సింగ్ ట్రైనర్‌ను ఎంచుకోవాలి. కొంత కాలం పాటు ట్రైనర్ శిక్షణలో కొనసాగి పరిణితి సాధించాక ఒక పంచ్ బ్యాగ్‌ను మాత్రం ఏర్పాటు చేసుకుని స్వయంగా సాధన కొనసాగించవచ్చు. ఫటాఫట్.. బెని‘ఫిట్’ ఒక క్రీడగా చాలా మంది అభిమానించే బాక్సింగ్‌ను ఆరోగ్య సాధనంగా మార్చడం ద్వారా చక్కని ఫిట్- వర్కవుట్‌గా మార్చవచ్చు. ఇపుడు జిమ్‌లు, ఫిట్నెస్ సెంటర్లలో దీన్ని ‘కార్డియో కిక్ బాక్సింగ్’గా వ్యవహరిస్తున్నారు. కరాటే కిక్‌లు, బ్లాక్స్ పంచ్‌లు వంటివి సంప్రదాయ ఎరోబిక్స్‌తో మిళితం చేసిన ఫిట్నెస్ ప్రోగ్రామ్.. ఈ కార్డియో కిక్ బాక్సింగ్. కరాటే, బాక్సింగ్‌ను మేళవించిన ఏరోబిక్ వ్యాయామ శైలి ఇది. బాడీ బ్యాలెన్సింగ్‌కి ఉపకరిస్తుంది. దీని ద్వారా ప్రారంభంలో గంటకి 400 నుంచి 500 క్యాలరీలు, రెగ్యులర్‌గా చేసేవారికి 800-900 క్యాలరీల వరకూ ఖర్చవుతాయి. ఇది ఫ్యాట్‌ని కరిగించే అత్యుత్తమ సాధనగా నగరానికి చెందిన ఫిట్నెస్ గురు జరీర్ పటేల్ చెబుతున్నారు. ఈ వర్కవుట్ కదలికల్లో చురుకుదనాన్ని పెంచుతుంది. పొట్ట భాగాన్ని సున్నితంగా బిగించి కిక్స్, పంచ్‌లు ఇవ్వడం ద్వారా అబ్డామినల్ మజిల్ బాగా పటిష్టమవుతుంది. అప్పర్ కట్, జాబ్, ఎల్బోహుక్, స్నాచ్, రివర్స్కిక్, రౌండ్ కిక్.. నేర్చుకుంటే స్వీయ రక్షణకూ ఉపకరిస్తుంది. లెట్స్ మూవ్.. చిన్నారులు బయటకు వెళ్లాలి, యాక్టివ్‌గా మారాలి అనే ఉద్దేశంతో అమెరికా ఫస్ట్ లేడీ ప్రారంభించిన ‘లెట్స్ మూవ్’ క్యాంపెయిన్‌లో భాగంగా ఓ వీడియోను మిషెల్ అప్లోడ్ చేశారు. దీనిలోనే ఆమె ప్రముఖులను, సాధారణ ప్రజలను ‘గిమ్మీ ఫైవ్’ అంటూ కోరుతున్నారు. అంటే ఫిట్-యాక్టివ్‌గా ఉండేందుకు 5 సూత్రాల మార్గం ఇవ్వమని అర్ధం. దీనికి స్పందనగా బరాక్ ఒబామా సైతం తన వీడియోను పోస్ట్ చేశారు. అందులో యాక్టివ్‌గా ఉండడానికి తాను చేసేవి జాగింగ్, కూర్చుని కాకుండా ‘వాక్ అండ్ టాక్’ మీటింగ్స్ వంటివి ఆయన పొందుపరచారు. -
సిటీలో సెన్సేషనల్ మిసైల్.. లెట్స్ మూవ్
♦ కిక్ బాక్సింగ్‌కు మహిళలు ఫిదా ♦ ‘గిమ్మీ ఫైవ్’ అంటూ జిమ్స్‌కు పయనం ♦ క్రేజీ వర్కవుట్స్‌తో ఉత్తేజం నగరవాసులకు ఆరోగ్యపరమైన సూత్రాలను ఇప్పుడు బాగా వంటబట్టించుకుంటున్నారు. ‘వినదగు నెవ్వరు చెప్పిన’ అన్నట్టు.. ఇలాంటివి ఎవరు చెప్పినా ఆసక్తిగా పాటిస్తున్నారు. చెప్పేది మిస్ ఇండియా అయినా మిషెల్ ఒబామా అయినా.. ‘ఫిట్నెస్’ అంటే సిటీ మహిళలు సై అంటున్నారు. అలాగే ‘లెట్స్ మూవ్’ అంటూ మిషెల్ సంధించిన మిసైల్ లాంటి పంచ్‌లకు ఫిదా అయిపోయి కిక్స్‌తో రఫ్ఫాడించేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రేజీగా మారిన వర్కవుట్ కిక్ బాక్సింగ్ విశేషాలవి.. గత నెలలో అమెరికా దేశపు ప్రధమ మహిళ మిషెల్ ఒబామా ఒక వర్కవుట్ వీడియోను ఆన్లైన్లో పోస్ట్ చేశారు. స్వల్ప కాలంలోనే కోటి మందికి పైగా వీక్షకుల్ని సంపాదించిన ఆ వీడియోలో తన వర్కవుట్స్‌ని ఆమె పరిచయం చేశారు. మిషెల్ చేసిన 5 ఎక్సర్సైజ్ల్లో.. జంపింగ్ రోప్, మెడిసిన్ బాల్‌తో అబ్డామినల్ క్రంచెస్, బెంచ్ స్క్వాట్స్, డంబెల్ ప్రెసెస్, బాక్సింగ్.. ఉన్నాయి. కేవలం రెండు నిమిషాలు మించి లేని ఈ క్లిప్‌లో మిషెల్‌తో పాటు ఆమె ఫ్యామిలీ ట్రైనర్ కార్నెల్ మెకెల్లన్ కూడా కనిపిస్తారు. స్క్వాట్స్, క్రంచెస్ అయిపోయాక మిషెల్ బ్లూ బాక్సింగ్ గ్లవ్స్ ధరించి కిక్స్ మొదలుపెట్టారు. ఆమె ఇందులో ఒక టు-పంచ్ కాంబోను చూపించి ఆ తర్వాత గిర్రున తిరుగుతూ బ్యాగ్‌పై ఓ రౌండ్ హౌజ్ కిక్ ఇచ్చారు. మిగతావి ఎలా ఉన్నా... ఆమె పంచ్ బ్యాగ్‌పై పంజా విసురుతూ ఇచ్చిన రౌండ్ హౌజ్ కిక్స్..ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. మిషెల్ వీడియో నగర మహిళల్లో కిక్ బాక్సింగ్ పట్ల అమాంతం క్రేజ్ పెంచేసింది. మరెందరికో ‘కిక్’.. తను ఏం తిన్నా తనను ఫిట్‌గా ఉంచే శక్తి కిక్ బాక్సింగ్‌కి ఉన్నట్టు గ్రహించానని టాలీవుడ్ సినీనటి రకుల్ ప్రీత్‌సింగ్ అంటోంది. ఫుడ్ డబుల్ అయినప్పుడు శాండ్బాగ్స్కి కిక్స్ ఇస్తూ రెట్టింపు సమయం గడుపుతానని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. మిషెల్ ఒబామా అప్లోడ్ చేసిన ‘లెట్స్మూవ్’ వీడియో మహిళల్ని ఎక్సర్సైజ్ల వైపు మళ్లించేలా స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు సిటీ సోషలైట్ సుశీలా బొకాడియా. తాను రోజూ 2 గంటల పాటు వర్కవుట్ చేస్తానని, తన వర్కవుట్‌లో ఇప్పుడు కిక్ బాక్సింగ్ ప్రధానమైన భాగమని చెప్పారు. యోగా ట్రైనర్‌గా రోప్ యోగా వంటి వెరైటీ శైలుల్ని పరిచయం చేసిన రినా హిందోచా కూడా తాను ఇటీవలే కిక్ బాక్సింగ్‌ను సాధన చేస్తున్నానన్నారు. ఇది మహిళల్ని శక్తివంతం చేయడం మాత్రమే కాకుండా ఆత్మరక్షణకు కూడా ఉపకరిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. మిక్స్ చేస్తే మస్తు మస్తే.. చూడ్డానికి కష్టంగా అనిపించినా ఈ కిక్స్, పంచ్‌లు తేలిగ్గా చేయగలిగినవేనని జరీర్ చెప్పారు. ఇది మోకాలు, లోయర్ బ్యాక్‌లపై తక్కువ భారాన్ని వేసే వ్యాయామం. ఎప్పటికప్పుడు ఆసక్తిని పెంచుకునేందుకు వీలుగా దీనిని విభిన్న మార్గాల్లో చేయవచ్చు. ఏరోబిక్స్, వెయిట్ ట్రైనింగ్‌ను కూడా జత కలిపి చేయడం అలాంటి ఒక వైవిధ్యమార్గం. అయితే, కొత్తగా సాధన చేసేవారు తప్పనిసరిగా మంచి కార్డియో కిక్ బాక్సింగ్ ట్రైనర్‌ను ఎంచుకోవాలి. కొంత కాలం పాటు ట్రైనర్ శిక్షణలో కొనసాగి పరిణితి సాధించాక ఒక పంచ్ బ్యాగ్‌ను మాత్రం ఏర్పాటు చేసుకుని స్వయంగా సాధన కొనసాగించవచ్చు. ఫటాఫట్.. బెని‘ఫిట్’ ఒక క్రీడగా చాలా మంది అభిమానించే బాక్సింగ్‌ను ఆరోగ్య సాధనంగా మార్చడం ద్వారా చక్కని ఫిట్- వర్కవుట్‌గా మార్చవచ్చు. ఇపుడు జిమ్‌లు, ఫిట్నెస్ సెంటర్లలో దీన్ని ‘కార్డియో కిక్ బాక్సింగ్’గా వ్యవహరిస్తున్నారు. కరాటే కిక్‌లు, బ్లాక్స్ పంచ్‌లు వంటివి సంప్రదాయ ఎరోబిక్స్‌తో మిళితం చేసిన ఫిట్నెస్ ప్రోగ్రామ్.. ఈ కార్డియో కిక్ బాక్సింగ్. కరాటే, బాక్సింగ్‌ను మేళవించిన ఏరోబిక్ వ్యాయామ శైలి ఇది. బాడీ బ్యాలెన్సింగ్‌కి ఉపకరిస్తుంది. దీని ద్వారా ప్రారంభంలో గంటకి 400 నుంచి 500 క్యాలరీలు, రెగ్యులర్‌గా చేసేవారికి 800-900 క్యాలరీల వరకూ ఖర్చవుతాయి. ఇది ఫ్యాట్‌ని కరిగించే అత్యుత్తమ సాధనగా నగరానికి చెందిన ఫిట్నెస్ గురు జరీర్ పటేల్ చెబుతున్నారు. ఈ వర్కవుట్ కదలికల్లో చురుకుదనాన్ని పెంచుతుంది. పొట్ట భాగాన్ని సున్నితంగా బిగించి కిక్స్, పంచ్‌లు ఇవ్వడం ద్వారా అబ్డామినల్ మజిల్ బాగా పటిష్టమవుతుంది. అప్పర్ కట్, జాబ్, ఎల్బోహుక్, స్నాచ్, రివర్స్కిక్, రౌండ్ కిక్.. నేర్చుకుంటే స్వీయ రక్షణకూ ఉపకరిస్తుంది. లెట్స్ మూవ్.. చిన్నారులు బయటకు వెళ్లాలి, యాక్టివ్‌గా మారాలి అనే ఉద్దేశంతో అమెరికా ఫస్ట్ లేడీ ప్రారంభించిన ‘లెట్స్ మూవ్’ క్యాంపెయిన్‌లో భాగంగా ఓ వీడియోను మిషెల్ అప్లోడ్ చేశారు. దీనిలోనే ఆమె ప్రముఖులను, సాధారణ ప్రజలను ‘గిమ్మీ ఫైవ్’ అంటూ కోరుతున్నారు. అంటే ఫిట్-యాక్టివ్‌గా ఉండేందుకు 5 సూత్రాల మార్గం ఇవ్వమని అర్ధం. దీనికి స్పందనగా బరాక్ ఒబామా సైతం తన వీడియోను పోస్ట్ చేశారు. అందులో యాక్టివ్‌గా ఉండడానికి తాను చేసేవి జాగింగ్, కూర్చుని కాకుండా ‘వాక్ అండ్ టాక్’ మీటింగ్స్ వంటివి ఆయన పొందుపరచారు. -
ప్రస్తుతం నా జీవితం ఈ మూడింటికే అంకితం!
‘‘నేను చేసే ఏ పని అయినా సమాజానికి ఉపయోగపడాలన్నది నా ఆకాంక్ష’’ అని స్మిత అన్నారు. పాప్ గాయనిగా ఆమె తెచ్చుకున్న పేరు, ప్రఖ్యాతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, కొంత కాలంగా ఆమె ‘పాప్’ ఆల్బమ్స్ చేయడం లేదు. ఆధ్యాత్మిక బాటలో నడుస్తున్నారని తెలిసింది. అసలు స్మిత ఇప్పుడేం చేస్తున్నారు? ఆమె భవిష్యత్తు ప్రణాళిక లేంటి? వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? తదితర ప్రశ్నలకు సమాధానమే ఆమెతో జరిపిన ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ... ప్రస్తుతం ఏం చేస్తున్నారు? అసలు మీ లక్ష్యం ఏంటి? డిసెంబర్లో నేనో కార్యక్రమం చేయనున్నా. దాని గురించి ఇప్పుడు చెప్పను. కానీ, దాని కోసమే ప్రత్యేకంగా ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నా. ఇందులో భాగంగా ‘కిక్ బాక్సింగ్’ నేర్చుకుంటున్నా. ఇంకా హిందుస్తానీ మ్యూజిక్‌కి సంబంధించిన డాన్స్‌ని వేరే పద్ధతిలో జనం ముందు ప్రదర్శించాలన్నది నా కోరిక. అందుకు సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నా. ‘ఆలయం’, ‘బబుల్స్ హెయిర్ అండ్ బ్యూటీ’, ఎక్స్‌ప్రెస్’... ఇలా పలు వ్యాపారాలు కూడా చేస్తున్నారు. వాటి గురించి చెబుతారా? ‘ఆలయం’ అనేది పూర్తిగా చేనేత వస్త్రాలకు సంబంధించినది. చీరలు, డ్రెస్‌లు అన్నీ వుంటాయి. నవరాత్రులప్పుడు ప్రత్యేకంగా ఒక్కోరోజు ఒక్కోరకం చేనేత చీరలను కొత్తగా డిజైన్ చేసి, ప్రదర్శిస్తుంటాం. బబుల్స్ హెయిర్ అండ్ బ్యూటీకి సంబంధించి రాష్ర్టవ్యాప్తంగా ఇప్పటికే ఏడు శాఖలున్నాయి. ఇక, విజయవాడలో ఉన్న జిమ్ సెంటర్ ‘ఎక్స్‌ప్రెస్’ నిర్వహణ కూడా బాగుంది. ఇవే కాదు.. మ్యూజిక్‌కి సంబంధించి ‘మ్యాడ్’ అనే స్కూల్ కూడా నిర్వహిస్తున్నా. బేసిక్‌గా వ్యాపార కుటుంబానికి చెందిన అమ్మాయిని. నా చిన్నప్పుడు మా అమ్మా, నాన్న చేసే వ్యాపారాల మీద ఆసక్తి కనబర్చేదాన్ని. బహుశా ఇన్ని వ్యాపారాలతో బిజీగా ఉండటంవల్లే ‘పాప్’ మ్యూజిక్‌కి దూరంగా ఉంటున్నారేమో? పాప్ అంటే అదేదో వెస్ట్రన్ మ్యూజిక్ అనుకుంటారు చాలామంది. కానీ, ‘పాపులర్ అయిన మ్యూజిక్’ని పాప్ మ్యూజిక్ అంటారు. అలా చూస్తే.. మన భారతీయ జానపద గీతాలు కూడా ‘పాప్’ కిందకే వస్తాయి. పాప్కి ఒక జానర్ అంటూ లేదు. నేను చేస్తున్న భక్తి గీతాలు కూడా పాప్ కిందే లెక్క. ఆ మధ్య ‘ఐ క్యాండీ’ అనే సంస్థ ఆరంభించి, బుల్లితెర కోసం ‘షో’ చేశారు. ఆ తర్వాత మళ్లీ చేయకపోవడానికి కారణం? వాస్తవానికి రెగ్యులర్‌గా షోస్ చేయాలనే ఆలోచనతో ఆ సంస్థ ఆరంభించలేదు. ప్రతిభ గల నృత్యకళాకారులను ప్రోత్సహించాలనే ఆకాంక్షతోనే అది చేశాను. ఆ షో ముగిసింది. భవిష్యత్‌లో మంచి మ్యూజిక్ బేస్డ్ షో చేయాలనిపిస్తే అప్పుడు చేస్తా. కొంత కాలంగా ఆధ్యాత్మిక బాటలో వెళుతున్నట్లనిపిస్తోంది.. ముఖ్యంగా ‘ఇషా ఫౌండేషన్’పై మమకారం పెంచుకున్నట్లున్నారు? అవును. ఇషా గురించి నా స్నేహితురాలు చెబితే, కోయంబత్తూరు వెళ్లాను. అక్కడో మూడు రోజులున్నాను. ఆ మూడు రోజులూ నాకు లభించిన అనుభూతిని మాటల్లో చెప్పలేను. మాతా, పితా, దైవం కన్నా మంచి సద్గురువు ముఖ్యం. జగ్గీ వాసుదేవ రూపంలో సద్గురువు దొరికారు. ఇషా ఫౌండేషన్ నుంచి వచ్చిన తర్వాత నా ఆలోచన విధానం, జీవితాన్ని చూసే కోణం మారింది. నిర్ణయాలు తీసుకునే విషయంలో అంతకుముందుకన్నా వేగం, స్పష్టత వచ్చింది. జీవితంలో జరిగే ప్రతిదానికీ కారణం ఉంటుందనే నమ్మకం ఏర్పడింది. అక్కడ పొందిన అనుభూతి వల్లేనా ‘యోగేశ్వరాయ...’ ఆల్బమ్ చేశారు? అవును. నాకో మంచి అనుభూతి కలిగేలా చేసిన నా గురువు జగ్గీ వాసుదేవ కోసం నేనేమైనా చేయాలనుకున్నాను. ఆల్బమ్ చేస్తానని నా గురువు దగ్గర చెప్పాను. సరే అన్నారు. ఆరు నెలల్లో పూర్తి చేశా. ఆల్బమ్ ద్వారా వచ్చిన డబ్బు సేవా కార్యక్రమాలకు వినియోగించినట్లున్నారు? సంగీతానికి సంబంధించి నేనేం చేసినా.. నా ట్రస్ట్‌కి కొంత డబ్బు వెళ్లిపోతుంది. ముఖ్యంగా నా ముందున్న లక్ష్యం ఖమ్మంలోని ఓ సంస్థ. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్‌కి సంబంధించిన ఆ సంస్థ చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితురాలినయ్యాను. అందుకే, నా వంతుగా ఆర్థిక సహాయం చేస్తున్నా. ఈ మధ్యకాలంలో నేను ‘షో’స్ చేయలేదు. కానీ, ఈ సంస్థకు ఓ నిధి ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న సదాశయంతో ఈ 20న యూఎస్‌లో ఓ షోలో పాల్గొంటున్నా. మీ జీవన శైలి ఆధునికం. మీరేమో ఆధ్మాత్మికమంటున్నారు. పొంతన కుదరట్లేదే? ఆధ్యాత్మికం అంటే అన్నీ త్యజించాల్సిన అవసరం లేదు. జీవితాన్ని తెలుసుకోవడం. మంచి పనులపై మనసుని కేంద్రీకరించడం. మా కుటుంబంలో మా అమ్మమ్మ లక్ష్మీ కాంతమ్మ ఆధ్యాత్మిక బాటలోనే వెళ్లేవారు. రాజకీయ నాయకురాలిగా ఆవిడకున్న పేరు నాటి తరం వారికి తెలుసు. అప్పట్లో తను ధ్యానంలో ఎంత లీనం కాగలిగిందో, ఇప్పుడు నేనూ ఆ స్థాయిలో లీనం కాగలుతున్నాను. అంతా బాగానే ఉంది.. మరి మీ వ్యక్తిగత జీవితం సంగతేంటి? నా కుటుంబం అండదండలు లేకపోతే నేననుకున్నవన్నీ చేయగలిగేదాన్ని కాదు. పెద్దయిన తర్వాత మనం హౌస్‌వైఫ్ కావాలని, మంచి హోమ్ మేకర్ కావాలని నేను అనుకోలేదు. నా కాళ్ల మీద నేను నిలబడాలనుకునేదాన్ని. మా అమ్మమ్మ, అమ్మలా ఓ స్ట్రాంగ్ ఉమన్‌గా ఉండాలనుకునేదాన్ని. ఢిల్లీ యూనివర్శిటీకి జాయింట్ సెక్రటరీగా చేసేది. అప్పట్లో అమ్మని రాజకీయాల్లోకి రమ్మని ఒత్తిడి చేసినా తను ఒప్పుకోలేదు. అమ్మది మంచి గాత్రం. కానీ, గాయని కావాలనే తన కలను నెరవేర్చుకోలేకపోయింది. నేను గాయని అయినప్పుడు తన కలని నాలో చూసుకుంటుందేమో అనుకున్నాను. నా బలం మా అమ్మే. మీ భర్త గురించి... మీరిద్దరూ విడిపోయారనే టాక్ ఉంది? (నవ్వుతూ) ప్రముఖుల గురించి వదంతులు ప్రచారం చేసి, ‘నిప్పు లేనిదే పొగ రాదు’ అని చిన్న మెలిక పెడతారు. కానీ, ఇక్కడ నిప్పే లేదు.. ఇక పొగ ఎలా వస్తుంది? నేనూ, నా భర్త శశాంక్ హాయిగా ఉన్నాం. నేనేం చేసినా ఆయన కాదనరు. మాకో మూడేళ్ల పాప ఉంది. పేరు ‘షివి’. ‘షివి’ అంటే అర్థం ఏంటి? పాప పుట్టిన తర్వాత నా గురువు జగ్గీ వాసుదేవ్ ‘మీ అమ్మాయికి ఏం పేరు పెట్టాలనుకుంటున్నావ్’ అనడిగితే ఆయన సలహా కోరా. ‘షివి’ అన్నారు. నేను కోరుకున్నట్లు.. ఎస్ అక్షరంతోనే పేరు ఉండటం, ఆ పేరుకి శివుడిలో ఒక భాగం అనే అర్థం ఉండటంతో ఆనందంగా అంగీకరించాం. ‘మల్లీశ్వరి’ తర్వాత మళ్లీ సినిమాల్లో నటించకపోవడానికి కారణం? ఆ సినిమా ఒప్పుకోవడం నేను చేసిన పెద్ద తప్పు. యాక్ట్ చేయాలని ఉండేది కాదు. కానీ, ఎందుకు ఒప్పుకున్నానో ఇప్పటికీ తెలియదు. అయితే, ఆ సినిమా చేయడం ద్వారా ఛాయాగ్రాహకుడు సమీర్‌రెడ్డి వంటి అన్న దొరికాడు. ‘యోగేశ్వరాయ..’ ఆల్బమ్ చేయాలనుకున్నప్పుడు, కెమెరామేన్‌గా సమీర్ అయితే బాగుంటుందనుకున్నా. కానీ, తను ఫుల్ బిజీ. అందుకని, మొహమాటపడుతూనే అడిగా. ‘ఇది అడగడానికి నువ్వింతగా ఫీలవ్వాలా’ అంటూ డేట్స్ అడ్జస్ట్ చేసిచ్చారు. అలాగే... కెమెరా, లైట్.. అన్నీ ఉచితంగా ఇచ్చారు. అంటే.. ఇక నుంచి సినిమాల్లో అస్సలు నటించరా? కమర్షియల్ సినిమాలైతే చెయ్యను. గొప్ప సందేశం ఉన్న సినిమా అయితే ఓకే. ఆ సినిమా ద్వారా పది మందికీ ప్రయోజనం చేకూరుతుందనిపిస్తే చేస్తాను. ఆధ్యాత్మికం, దేశభక్తి, సేవ... మీ జీవితం వీటి చుట్టూ తిరుగుతోందన్నమాట? అవును. ఏ వ్యాపారం చేసినా కొంత సేవా కార్యక్రమాలకే వినియోగిస్తున్నా. ప్రస్తుతం నా జీవితం మీరు చెప్పిన ఈ మూడింటికీ అంకితమైపోయింది. నరేంద్ర మోదీకి మద్దుతుగా ‘వేకప్ ఇండియా’ ఆల్బమ్ చేశారు.. మీ అమ్మమ్మగారిలా రాజకీయాల్లోకి వస్తారా? రాజకీయాలపరంగా నాకు అజెండా ఏదీ లేదు. నాకు దేశభక్తి ఎక్కువ. అందుకే మోదీగారంటే అభిమానం. ఆ కారణంగానే ఆయనకు మద్దతు ఇచ్చాను. కానీ, ఇప్పుడు ప్రపంచం ఎలా తయారయ్యిందంటే.. ఎవరికైనా ఏదైనా చేస్తే, ఏదో ఆశించే చేస్తున్నారు. కాబట్టి, పదవుల కోసమే చేస్తున్నాననుకుంటున్నారు. ‘వేకప్ ఇండియా’ చేసిన తర్వాత నాలోని దేశభక్తిని గౌరవిస్తున్నారు. ఆ సమయంలో నాకు లభించే అనుభూతి ఏ పదవి ఇస్తుంది? డి.జి. భవాని