![Manasa In Indian Kick Boxing Team - Sakshi](/styles/webp/s3/article_images/2019/04/2/Manasa.jpg.webp?itok=LIeQlgFt)
సాక్షి, హైదరాబాద్: టర్కిష్ ఓపెన్ కిక్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టులో తెలంగాణ రాష్ట్ర అమ్మాయి బి. మానస రెడ్డి చోటు దక్కించుకుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని జగిత్యాల వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతోన్న మానస... భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. మొత్తం భారత జట్టుకు 14 మంది ఎంపికవగా... తెలంగాణ నుంచి మానస జట్టులో చోటు దక్కించుకుంది. టర్కీలోని అంటాల్యా వేదికగా ఈనెల 4 నుంచి 7 వరకు టర్కిష్ ఓపెన్ కిక్‌బాక్సింగ్ టోర్నీ జరుగుతుంది.
ఈ సందర్భంగా జాతీయ జట్టుకు ఎంపికైన ఆమెను కోచ్ రామాంజనేయులు, విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ వి. ప్రవీణ్ రావు అభినందించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన మానస అంతర్జాతీయ టోర్నీలో దేశానికి ప్రాతినిధ్యం వహించడం తమకు గర్వంగా ఉందని వారు అన్నారు. ఢిల్లీ, కోల్‌కతా వేదికల్లో జరిగిన జాతీయ స్థాయి టోర్నీల్లో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా ఆమెను భారత జట్టుకు ఎంపిక చేశారు. ఈ జాతీయ స్థాయి టోర్నీల్లో మానస ఒక స్వర్ణం, రెండు రజత పతకాలు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment