సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్‌ఏయూ) విద్యార్థి వి. మానస రెడ్డి అంతర్జాతీయ స్థాయి టోర్నీలో ఆకట్టుకుంది. టర్కిష్ ఓపెన్ కిక్ బాక్సింగ్ టోర్నీలో పాల్గొన్న మానస రెండు పతకాలను సాధించింది.
టర్కీలో ఈనెల 4 నుంచి 7 వరకు జరిగి న ఈ టోర్నీలో సీనియర్ మ్యూజికల్ ఫామ్ వెపన్ కేటగిరీలో మానస రజతం గెలుచుకుంది. సీనియర్ మ్యూజికల్ ఫామ్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. ఈ సందర్భంగా పీజేటీఎస్‌ఏయూ వైస్ చాన్స్‌లర్ ప్రవీణ్ రావు, రిజిస్ట్రార్ సుధీర్ కుమార్, డీన్ విష్ణువర్ధన్ రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన మానసను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment