
హైదరాబాద్: నగరంలో జరిగిన హనుమాన్ జయంతి శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది. ఈరోజు(శనివారం) గొలిగూడ నుంచి తాడ్ బండ్ వరకు కొనసాగిన హనుమాన్ శోభాయత్ర కాషాయమయంతో నిండిపోయింది.


సుమారు 12 కిలోమీటర్ల మేర విజయవంతంగా కొనసాగింది హనుమాన్ శోభాయాత్ర. అడుగడునా పటిష్ట బందోబస్తు నడుమ శోభాయాత్ర జరగ్గా, బైక్ ర్యాలీలతో భక్తులు ఇందులో పాల్గొన్నారు. హనుమాన్ శోభాయాత్రకు ఇళ్ల దగ్గర ఉన్న భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ శోభాయత్రం అంతా జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో హోరెత్తింది..
