Hanuman shobha yathra
-
Hyd: ప్రశాంతంగా ముగిసిన హనుమాన్ శోభాయత్ర
హైదరాబాద్: నగరంలో జరిగిన హనుమాన్ జయంతి శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది. ఈరోజు(శనివారం) గొలిగూడ నుంచి తాడ్ బండ్ వరకు కొనసాగిన హనుమాన్ శోభాయత్ర కాషాయమయంతో నిండిపోయింది. సుమారు 12 కిలోమీటర్ల మేర విజయవంతంగా కొనసాగింది హనుమాన్ శోభాయాత్ర. అడుగడునా పటిష్ట బందోబస్తు నడుమ శోభాయాత్ర జరగ్గా, బైక్ ర్యాలీలతో భక్తులు ఇందులో పాల్గొన్నారు. హనుమాన్ శోభాయాత్రకు ఇళ్ల దగ్గర ఉన్న భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ శోభాయత్రం అంతా జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో హోరెత్తింది.. -
Alert: హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ఈ నెల 6న గురువారం నగరంలో పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఉదయం 11.30 గంటలకు గౌలిగూడ రామమందిరం నుంచి ప్రదర్శన ప్రారంభం కానుంది. ఈ ర్యాలీ సికింద్రాబాద్ తాడ్బంద్ హనుమాన్ మందిర్ వరకు కొనసాగుతుంది. పుత్లిబౌలి క్రాస్‌రోడ్స్, కోఠీ ఆంధ్రబ్యాంక్ క్రాస్‌రోడ్స్, సుల్తాన్‌బజార్, రాంకోఠి, కాచిగూడ, నారాయణగూడ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, వైస్రాయ్ హోటల్, కవాడిగూడ, మహంకాళి టెంపుల్ తదితర ప్రాంతాల నుంచి తాడ్బంద్ చేరుకుంటుంది. అలాగే కర్మన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్ నుంచి వచ్చే మరో ర్యాలీ చంపాపేట్, ఐఎస్ సదన్, దోభీఘాట్, మలక్‌పేట్, సైదాబాద్ కాలనీ, సరూర్‌నగర్, రాజీవ్‌గాంధీ స్టాచ్యూ, దిల్సుఖ్నగర్, మూసారాంబాగ్, నల్గొండ చౌరస్తా, కోఠీ విమెన్స్ కాలేజీ చౌరస్తా తదితర మార్గాల నుంచి వచ్చి ప్రధాన ర్యాలీలో కలుస్తుంది. ఈ మేరకు ఈ రెండు రూట్లలో రాకపోకలు సాగించే వాహనాల రాకపోకలపైన ఆంక్షలు విధించనున్నట్లు తెలిపారు. -
రేపు హనుమాన్ శోభాయాత్ర... ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: నగరంలో శనివారం హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్టు సీటీ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు శోభాయాత్ర సాగనుంది. గౌలిగూడ రామమందిర్ నుంచి తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వరకు ఈ యాత్ర కొనసాగనుంది. అయితే గౌలిగూడ నుంచి ప్రారంభమై రామకోటి, ఎక్స్ రోడ్, కాచిగూడ, వైఎమ్‌సీఏ, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, గాంధీనగర్, కవాడీగూడ, బాటా ఎక్స్‌రోడ్, రాంగోపాల్ పేట్ ల మీదుగా హనుమాన్ శోభాయత్ర సాగుతుందని కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు.