
సాక్షి, సిటీబ్యూరో: హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ఈ నెల 6న గురువారం నగరంలో పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఉదయం 11.30 గంటలకు గౌలిగూడ రామమందిరం నుంచి ప్రదర్శన ప్రారంభం కానుంది. ఈ ర్యాలీ సికింద్రాబాద్ తాడ్‌బంద్ హనుమాన్ మందిర్ వరకు కొనసాగుతుంది. పుత్లిబౌలి క్రాస్‌రోడ్స్, కోఠీ ఆంధ్రబ్యాంక్ క్రాస్‌రోడ్స్, సుల్తాన్‌బజార్, రాంకోఠి, కాచిగూడ, నారాయణగూడ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, వైస్రాయ్ హోటల్, కవాడిగూడ, మహంకాళి టెంపుల్ తదితర ప్రాంతాల నుంచి తాడ్‌బంద్ చేరుకుంటుంది.
అలాగే కర్మన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్ నుంచి వచ్చే మరో ర్యాలీ చంపాపేట్, ఐఎస్ సదన్, దోభీఘాట్, మలక్‌పేట్, సైదాబాద్ కాలనీ, సరూర్‌నగర్, రాజీవ్‌గాంధీ స్టాచ్యూ, దిల్‌సుఖ్‌నగర్, మూసారాంబాగ్, నల్గొండ చౌరస్తా, కోఠీ విమెన్స్ కాలేజీ చౌరస్తా తదితర మార్గాల నుంచి వచ్చి ప్రధాన ర్యాలీలో కలుస్తుంది. ఈ మేరకు ఈ రెండు రూట్లలో రాకపోకలు సాగించే వాహనాల రాకపోకలపైన ఆంక్షలు విధించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment