manasa
-
ఈ సినిమా ఇద్దరికీ అగ్నిపరీక్షే
‘‘చిన్న సినిమా.. పెద్ద సినిమా అని ఉండదు. మంచి సినిమానా? కాదా? అనేది ఉంటుంది. ‘దేవకి నందన వాసుదేవ’ వంద శాతం మంచి సినిమా అనిపించింది. ఈ చిత్రం అశోక్‌కి, అర్జున్‌కి అగ్ని పరీక్షే. ఈ పరీక్షని ఎదుర్కొని వారు నిలబడతారని కోరుకుంటున్నాను’’ అని డైరెక్టర్ బోయపాటి శ్రీను అన్నారు. అశోక్ గల్లా, వారణాసి మానస జంటగా నటించిన చిత్రం ‘దేవకి నందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకుడు. నల్లపనేని యామిని సమర్పణలో సోమినేని బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో బోయపాటి శ్రీను, హీరో సుధీర్ బాబు అతిథులుగా పాల్గొన్నారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ట్రైలర్, విజువల్స్, సాంగ్స్ చూసినప్పుడు అశోక్‌కి సరైన సినిమా అనిపించింది. తను కమర్షియల్ హీరోగా సక్సెస్ అవుతాడు’’ అన్నారు. ‘‘నేను రాసిన కథల్లో ఇది మాస్ ఎంటర్టైనర్. ఈ పాత్రకి అశోక్ కరెక్టుగా సరిపోయాడు. మహేశ్‌బాబుగారి ఫ్యాన్స్, ఆడియన్స్ ఈ చిత్రాన్ని చూసి, సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా’’ అని చిత్ర కథారచయిత ప్రశాంత్ వర్మ అన్నారు. ‘‘ఈ సినిమా నిర్మాణంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాను. నాలాంటి కొత్త నిర్మాతని బతికించాలి’’ అని బాలకృష్ణ కోరారు. -
గ్రీన్ చాయిసెస్..! ఎంపవర్ వాయిసెస్..!!
విశాఖపట్టణం పీ.ఎం పాలెంలోని ఈస్ట్రన్ ఘాట్స్ బయోడైవర్సిటీ సెంటర్లో మానస తిన్ననూరి, స్పందన అంచల చేతుల మీదుగా పురుడు పోసుకుంది ‘బి ఎర్త్లీ’ అంకుర సంస్థ. కోటి మంది జీవితాలకు చేరువ కావాలనే లక్ష్యంతో వీరు తమ ప్రయాణాన్ని ్రపారంభించారు. ఇటీవల తమ సొంత స్టోర్ ‘వన సంపద’ను తూర్పు కనుమల జీవవైవిధ్య కేంద్రంలో ్రపారంభించారు. డిఎఫ్ఓ అనంత్ శంకర్ అందించిన సహకారంతో తమ కలను సాకారం చేసుకున్నారు.మానస బయోకెమిస్ట్రీలో పీజీ, ఎంబిఏ పూర్తిచేసి హార్వర్డ్ యూనివర్శిటీలో ఇంటర్నేషనల్ హెల్త్ సిస్టమ్‌పై కోర్సు చేసింది. స్పందన ఇంజినీరింగ్ పూర్తిచేసి, ఎంఐటి బూట్ క్యాంప్ ్రపోగ్రామ్ చేసింది. గత పదమూడు సంవత్సరాలుగా ఈ ఇద్దరు సామాజికసేవా రంగంలో పనిచేస్తున్నారు. కోవిడ్ సమయంలో వాలెంటీలుగా పనిచేస్తూ పరిచయమయ్యారు.ప్లాస్టిక్‌ను నిరోధించాలి’ అనే నినాదంతో అగిపోకుండా ప్రత్యామ్నాయాలను అన్వేషించడానికి పరిశోధన చేసారు. దీనిలో భాగంగా చెట్ల నుంచి లభించే వివిధ ఉత్పత్తులను ఉపయోగించి, కార్యాలయాలు, ఇంటిలో ఉపకరించే వస్తువులను తయారుచేస్తున్నారు. రీసైకిల్డ్ పేపర్‌తో నోట్ పాడ్స్, డైరీలు, క్యాలెండర్లు తయారు చేస్తున్నారు. వీటిలో కంటికి కనిపించని చిన్న విత్తనాలను ఉంచుతారు. పెన్నులు, పుస్తకాలు వినియోగించిన తరువాత బయట పారవేసినా వాటిలో ఉండే విత్తనాలు సహజంగా మొలకెత్తుతాయి.రాఖీ పౌర్ణమి కోసం కొబ్బరి పెంకుతో సహజసిద్ధమైన రాఖీలు తయారుచేశారు. వెదురుతో టూత్ బ్రష్‌లు, దువ్వెనలు, పెన్‌స్టాండ్, మొబైల్ స్టాండ్, అందమైన రంగులతో కాటన్ చేతి సంచులు, మట్టి ప్రమిదలు, సీడ్ గణేష్, మట్టి, ఆవు పేడతో తయారు చేసిన కుండీలు...ఇలా పర్యావరణహితమైన ఎన్నో ఉత్పత్తులను వీరు తయారు చేసి విక్రయిస్తున్నారు. సంస్థ నినాదం గ్రీన్ చాయిసెస్.. ఎంపవర్ వాయిసెస్. వివిధ సందర్భాలలో బహుమతులుగా ఇవ్వడానికి ఉపయోగపడే ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఈ వస్తువులను విశాఖకు అతి చేరువలో ఉన్న ఆదివాసీ గ్రామం శంభువానిపాలెంకు చెందిన ఆదివాసీ మహిళలతో చేయిస్తు వారికి ఉపాధి కల్పిస్తున్నారు. – వేదుల నరసింహం, ఫోటోలు: ఎం.డి నవాజ్, విశాఖపట్నం -
సంక్రాంతి మాకెంతో ప్రత్యేకం
‘సంక్రాంతి పండగ అంటే ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి’ అంటున్నారు పాయల్ రాజ్‌పుత్. ‘సంక్రాంతికి ఫుల్ ఎనర్జీతో భోగి మంటలు వేస్తుంటాను’ అన్నారు మానసా చౌదరి. ‘సంక్రాంతికి గాలిపటాలు ఎగురవేయడమంటే చాలా ఇష్టం’ అంటున్నారు మాళవికా శర్మ. ఇలా సంక్రాంతిని తాము ఎలా జరుపుకొంటామో అంటూ ఈ కథానాయికలు సాక్షితో పంచుకున్న విశేషాలు.. ఎన్నో జ్ఞపకాలు ఉన్నాయి – పాయల్ రాజ్‌పుత్ నన్ను అభిమానించే తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. పంజాబీ ఆడియన్స్ కు హ్యాపీ లోహ్రీ. సంక్రాంతి పండగ అంటే నాకు ఎన్నో జ్ఞపకాలు గుర్తొస్తాయి. ప్రతి ఏడాది సంక్రాంతిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటాం. పూజలు చేస్తాం.. ఇష్టమైన వంటకాలు చేసుకుంటాం. చిన్న తనంలో సంక్రాంతి పండక్కి గాలిపటాలను ఎగరవేసేదాన్ని. కానీ, నా జీవితం ఇప్పుడు చాలా మారిపోయింది. కాబట్టి గాలిపటాలను ఎగరవేసే సమయంలో మనలో కలిగే ఆ ఆనందపు అనుభూతిని కొంతకాలంగా మిస్ అయ్యాను. ఈ సారి ఢిల్లీలో నా స్నేహితులతో కలిసి గాలిపటాలను ఎగర వేయాలని ప్లాన్ చేస్తున్నాను. నా సిబ్బందిలో కొంతమంది హైదరాబాదీలు ఉన్నారు. వారితో పాటు సంక్రాంతిని నేను సెలబ్రేట్ చేసుకున్న అనుభవాలు ఉన్నాయి. నేను భోజన ప్రియురాలిని. ప్యూర్ వెజిటేరియన్ ని. మసాలా కిచిడీ, లడ్డు అంటే చాలా ఇష్టం. ఇలా మా అమ్మగారు పండక్కి చేసిన వంటకాలను ఇష్టంగా తింటాను. ఇక నేను నటించిన తాజా చిత్రం ‘మంగళవారం’ మంచి విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు.. నా అభిమానులకు కూడా థ్యాంక్స్. ఓ నటిగా మంచి కథలను ఎంచుకోవాలనుకుంటున్నాను. గాలిపటాలు ఎగరవేయడం చాలా ఇష్టం – మాళవికా శర్మ సంక్రాంతి అంటే ముఖ్యంగా రైతుల పండగ. వారు ఎంతోకష్టపడి పండించిన పంటలు ఈ సంక్రాంతికి వారి చేతికి వస్తాయి. సూర్యభగవానుడికి పూజలు చేయడంతో మా సంక్రాంతి మొదలవుతుంది. మా అమ్మమ్మ మాకు ప్రతి సంక్రాంతికి కొత్త దుస్తులు ఇస్తుంటారు. నువ్వుల లడ్డూలు ఇస్తారు. లక్కీగా మా అమ్మమ్మగారి బర్త్ డే కూడా సంక్రాంతి రోజునే. మేము కూడా స్వీట్స్‌ను పంచిపెడతాం. మేం చేయగలిగినంతలో పేదలకు సాయం చేస్తుంటాం. సంక్రాంతికి గాలిపటాలు ఎగరవేయడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందరిలానే నాకు గాలిపటాలను ఎగరవేయడం చాలా ఇష్టం. ఆకాశంలో కనిపిస్తున్న రంగు రంగుల గాలిపటాలు.. భూమిపై రైతులు పండిస్తున్న వివిధ రకాల పంటలకు ప్రతీకగా నేను భావిస్తుంటాను. నాపై తెలుగు ప్రేక్షకుల ప్రేమ, అభిమానాలకు చాలా రుణపడి ఉంటాను. ముంబై నా జన్మభూమి అయితే హైదరాబాద్ నా కర్మభూమి. ఎందుకంటే.. నేను ఇక్కడే మూవీస్ చేస్తున్నాను. నేను నటించిన గోపీచంద్‌గారి ‘భీమా’, సుధీర్‌బాబుగారి ‘హరోంహర’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ సినిమాల్లో నా పాత్ర చాలా ఎగై్జటింగ్‌గా ఉంటుంది. ప్రేక్షకులకు నచ్చే సినిమాలే చేయాలనుకుంటున్నాను. సంక్రాంతి నాకు చాలా ప్రత్యేకం – మానసా చౌదరి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పుత్తూరు స్వగ్రామం. నాన్న మధుసూదన్ నాయుడు వ్యాపారం నిమిత్తం చెన్నైలో స్థిరపడ్డారు. మేము చెన్నైలో ఉన్నప్పటికీ ప్రతి ఏడాది సంక్రాంతికి కచ్చితంగా ఊరు వెళతాం. అక్కడ నాన్న, అమ్మ సుజాత, నేను, తమ్ముడు చేతన్ కలిసి మా బంధువులతో ఎంతో సంతోషంగా సంక్రాంతి జరుపుకుంటాం. కానీ, ఈ ఏడాది ఊరు వెళ్లలేకపోయాను. మా బంధువులు, కజిన్స్ ఫోన్ చేసి.. ‘ఏంటి? హీరోయిన్ అయిపోయావని ఊరికి రావా?’ అంటున్నారు. అయితే ఆదివారం భోగి పండగని చెన్నైలోనే జరుపుకొన్నాను. మేము ఉన్న వీధిలో ఎక్కువ మంది తెలుగువాళ్లు ఉంటారు.. సెలబ్రేట్ చేసుకుంటాం. ► సంక్రాంతి పండగలో తొలిరోజు వచ్చే భోగి అంటే మరీ ఇష్టం. తొలిరోజు కాబట్టి ఫుల్ ఎనర్జీతో ఉంటా. ఉదయాన్నే లేచి పెద్ద భోగిమంటలు వేసేవాళ్లం. ఆ తర్వాత ఆయిల్ బాత్ చేసి, కుటుంబమంతా కలిసి సరదాగా మాట్లాడుకునేవాళ్లం.. థియేటర్‌కి వెళ్లి సినిమాలు చూస్తాం. ఆ తర్వాత మకర సంక్రాంతిన పొంగల్ చేయడం ఇష్టం. నేను నాన్ వెజ్ బాగా తింటాను. ప్రత్యేకించి నాటుకోడి కూరతో రాగిసంకటి తినడం చాలా ఇష్టం. అలాగే మటన్ నా ఫేవరేట్. మా అమ్మ చాలా బాగా చేస్తుంది. ఎవరైనా గాలిపటాలు ఎగర వేస్తుంటే చూస్తుంటాను. కానీ నేను గాలిపటాలు ఎగరవేయలేదు. తెలుగులో ‘బబుల్గమ్’ సినిమాకి ముందే నాకు కొన్ని అవకాశాలు వచ్చాయి.. కానీ, చేయలేదు. ‘బబుల్గమ్’ తర్వాత కథలు వింటున్నాను. అయితే నటనకు మంచి అవకాశం ఉన్న పాత్రలే చేయాలనుకుంటున్నాను. ఈ ఏడాది కెరీర్లో ఫుల్ ఎనర్జీతో దూసుకెళ్లాలనుకుంటున్నాను. -
సినిమా చూసి నాన్న ఎమోషన్ అయ్యారు
‘‘నటన పరంగా అమ్మానాన్న (సుమ, రాజీవ్ కనకాల) సలహాలు తీసుకుంటాను. ‘బబుల్గమ్’ మూవీని వారు చూశారు.. బాగా నచ్చింది. ఆ టైమ్‌లో నేను అక్కడ లేను. కొన్ని సన్నివేశాలు చూస్తున్నప్పుడు నాన్న ఎమోషన్ అయి, ఏడ్చారని అమ్మ చెప్పింది. నాన్నని అడిగితే ‘బాగా చేశావ్’ అన్నారు. ఆయన్నుంచి ప్రశంస రావడం ఆనందంగా అనిపించింది’’ అని రోషన్ కనకాల అన్నారు. రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల, మానసా చౌదరి జంటగా నటించిన చిత్రం ‘బబుల్గమ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది.ఈ సందర్భంగా రోషన్ కనకాల మాట్లాడుతూ– ‘‘నా బాల్యం అంతా దాదాపుగా తాతగారి (దేవదాస్ కనకాల) నటనా శిక్షణ కేంద్రంలో గడిచింది. నాకు చిన్నప్పటి నుంచి నటనంటే ఇష్టం. అది తెలియని ఒక థ్రిల్ ఇస్తుంది. నటుడు కావాలనే నా కల ‘బబుల్గమ్’తో నెరవేరడం ఆనందంగా ఉంది. న్యూ ఏజ్ కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా అలరిస్తుందనే నమ్మకం ఉంది. సినిమా షూటింగ్‌కి వెళ్లే నెల రోజుల ముందే వర్క్ షాప్ నిర్వహించడం మాకు ప్లస్ అయింది. ఈ మూవీలో ఓ సీన్ కోసం దాదాపు మూడు గంటలు పాటు షర్టు లేకుండా తిరిగాను. మొదట్లో సిగ్గుపడ్డా... ఆ తర్వాత పోయింది (నవ్వుతూ). మా అమ్మానాన్నలకు పరిశ్రమలో చాలా మంచి పేరుంది. నేను హీరోగా వస్తుండటం బాధ్యతగా అనిపిస్తోంది. ఫలానా జోనర్ మూవీ చేయాలనే ఆలోచన నాకు లేదు. ప్రేక్షకులను అలరించే మంచి సినిమాలు చేయడం ఇష్టం’’ అన్నారు. -
అలా జడ్జ్ చేయడం బాధగా ఉంది
‘‘మంచి మ్యూజిక్ ఇవ్వడానికి ఖరీదైన మ్యూజిక్ పరికరాలు అవసరం లేదు. ‘క్షణం’, ‘మేజర్’లో కొన్ని సీన్లకు మేం ఫోన్లో రికార్డ్ చేసిన వాయిస్‌నే వాడాం. ఇక ఇప్పుడు యూ ట్యూబ్ వ్యూస్, ఇన్‌స్టా రీల్ వ్యూస్‌తో మ్యూజిక్ డైరెక్టర్స్‌ను జడ్జ్ చేయడం కాస్త బాధగా ఉంది. అందుకే ఇప్పుడు నేను సినిమాలు తగ్గించుకున్నాను. ఇండిపెండెంట్ మ్యూజిక్, ఆల్బమ్స్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నాను’’ అని అన్నారు సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల. రోషన్ కనకాల, మానస జంటగా రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రూ΄÷ందిన సినిమా ‘బబుల్గమ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ– ‘‘గడిచిన పదేళ్లలో నేను చేయాల్సింది చేశాను. ఇక నన్ను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. ‘బబుల్గమ్’తో ఈ ప్రయత్నం మొదలైంది. ఈ సినిమాలో హీరోది డీజే రోల్. నా ఫ్రెండ్స్‌లో ఎక్కువమంది డీజేలు ఉండటంవల్ల ఎలక్ట్రానిక్ మ్యూజిక్‌పై అవగాహన ఉంది. ట్యూన్ కంటే లిరిక్స్ ముఖ్యమని నమ్ముతాను. ‘బబుల్గమ్’ చూశాను. రోషన్ మంచి నటుడు, డ్యాన్సర్. డబ్బింగ్ కూడా బాగా చెప్పాడు. ప్రస్తుతం ‘సత్యభామ’, ‘గూఢచారి 2’ సినిమాలకు సంగీతం అందిస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘ప్రతి రంగంలోనూ సాంకేతిక విప్లవం వచ్చింది. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వల్ల మ్యూజిక్ కం΄ోజర్స్కు ప్రమాదం ఉండొచ్చు. కానీ ‘ఏఐ’ని అప్లై చేయడానికీ హ్యూమన్ టచ్ కావాలి. సప్తస్వరాలు ఏడే. సౌండింగ్ ఎలా ఇస్తున్నామన్నదే ముఖ్యం. ‘గూఢచారి’ వల్ల కాదు.. ‘కృష్ణ అండ్ హీజ్ లీల’ సినిమాలోని మ్యూజిక్ నచ్చి నాకు చాన్స్‌లు ఇచ్చినట్లుగా కొందరు నాతో చెప్పారు. నాకదో హ్యాపీ సర్ప్రైజ్’’ అని చెప్పుకొచ్చారు. -
ఇక స్పీడ్‌గా సినిమాలు చేస్తాను
రోషన్ కనకాల, మానసా చౌదరి జంటగా రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బబుల్గమ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకర్ల సమావేశంలో రవికాంత్ పేరేపు చెప్పిన విశేషాలు. ∙ప్రేమకథ ప్రధానంగా సాగే రిలేషన్షిప్ డ్రామా ‘బబుల్గమ్’. ఈ చిత్రంలో ఆది పాత్రలో రోషన్, జాన్వీ పాత్రలో తెలుగు అమ్మాయి మానస నటించారు. కొత్తవారితో చేయాల్సిన సినిమా ఇది. రోషన్ హీరోగా పరిచయమవుతున్నాడని తెలిసి, ఈ కథ చె΄్పాను. కాలేజీ చదువు పూర్తి చేసుకున్న తర్వాత యువకుల కెరీర్లో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. మనకు ఇష్టమైనది చేయాలా? సంపాదన కోసం ఏ ఉద్యోగమైనా చేయాలా? అనే అయోమయంలో ఉంటారు. అలాంటి ఓ కన్ఫ్యూజన్లో ఉన్న ఓ కుర్రాడు ప్రేమలో పడితే ఏం జరుగుతుంది? అన్నదే ఈ సినిమా కథాంశం. రోషన్‌కు ఇది తొలి సినిమా అయినా అతని తల్లిదండ్రులు సుమ, రాజీవ్ కనకాల ఈ సినిమాలో జోక్యం చేసుకోలేదు. ‘ప్రేమ బబుల్గమ్ లాంటిది. మొదట్లో తీయగా ఉంటుంది. ఆ తర్వాత చప్పగా ఉంటుంది. ఆ నెక్ట్స్ అతుక్కుంటే వదలదు’ అనే డైలాగ్ ఉంటుంది. కథానుసారం ఈ సినిమాకు ‘బబుల్గమ్’ టైటిల్ పెట్టాం. ఇక నా ‘క్షణం’, ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ ఇప్పుడు ‘బబుల్గమ్’ సినిమాలకు శ్రీ చరణ్ సంగీతం ఇచ్చాడు. మేమిద్దరం ఒకే ఊరివాళ్లం కాబట్టి కంఫర్ట్ కుదిరింది. ‘బబుల్గమ్’ ట్రైలర్‌ను చిరంజీవిగారికి చూపించాం. ఈ సినిమాలోని ‘ఇజ్జత్..’ సాంగ్ ఆయనకు బాగా నచ్చింది. ‘క్షణం’ మంచి విజయం సాధించింది. ఎందుకో కానీ ఆ సినిమా సక్సెస్ క్రెడిట్ నాకు అంతగా రాలేదు. దర్శకత్వంలో అడివి శేష్ ఇన్వాల్వ్మెంట్ ఉందనే ప్రచారం జరిగింది. నిజానికి ‘అడివి’ శేష్, శ్రీచరణ్ పాకాల ‘క్షణం’ క్రెడిట్ నాకే ఇస్తారు. ఓ అవుట్‌సైడర్‌గా ఇండస్ట్రీ పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకోవడానికి నాకు కొంత టైమ్ పట్టింది. ఇకపై దర్శకుడిగా స్పీడ్‌గా సినిమాలు చేస్తాను. -
పెళ్లయిన ఏడాదికే..
సాక్షి, కరీంనగర్: ఓ యువతి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని సీఐ రాజ్‌కుమార్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. వివరాల ప్రకారం పచ్చునూర్ గ్రామానికి చెందిన మానస (25)కు గట్టుదుద్దెనపల్లికి చెందిన పప్పు సంపత్తో ఏడాది క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో ఒప్పుకున్న కట్నకానుకలు ముట్టజెప్పారు. కానీ, ఆరు నెలలకే అదనంగా డబ్బులు తీసుకురావాలంటూ భర్త ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. దీపావళికి మానస తల్లి గారింటికి వచ్చింది. భర్త డబ్బులు కావాలని వేధిస్తున్నాడని తల్లిదండ్రులతో చెప్పింది. పండుగ మరుసటి రోజు సంపత్ పచ్చునూర్ వచ్చి, డబ్బులివ్వాలని గొడవపడి వెళ్లిపోయాడు. అప్పటినుంచి మానస పుట్టింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన ఆమె బుధవారం ఇంట్లో ఎవరూలేని సమయం చూసి, బయటకు వెళ్లిపోయింది. గురువారం తల్లిదండ్రులు వెతకగా గ్రామంలోని ఓ వ్యవసాయ బావిలో మానస మృతదేహం కనిపించింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి కూడా చదవండి: బంధువుల ఇంట్లో.. జరిగే శుభకార్యానికి వెళ్లొస్తూ.. -
నాకు డ్యాన్స్ చేయాలనిపించింది
‘‘బబుల్గమ్’ సినిమాలోని ‘ఇజ్జత్..’పాట చాలా హుషారుగా అనిపించింది. శ్రీచరణ్ పాకాల చక్కని సంగీతం అందించారు. ‘ఇజ్జత్..’ అనే ర్యాప్ సాంగ్‌లో రోషన్‌తో కలసి డ్యాన్స్ చేయాలనిపించింది. ప్రతి క్లబ్, పబ్, యూత్ వేడుకల్లో ఈ పాట మార్మోగుతుంది’’ అని హీరో చిరంజీవి అన్నారు. రోషన్ కనకాల, మానస చౌదరి జంటగా రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన చిత్రం ‘బబుల్గమ్’. మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 29న రిలీజ్ కానుంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఇజ్జత్..’ పాటను చిరంజీవి రిలీజ్ చేసి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ పాటకి ఎం.ఎస్. హరి సాహిత్యం అందించగా, రోషన్ కనకాల, ఎం.ఎస్. హరి పాడారు. -
ఆంధ్రాయూనివర్సిటీ టాపర్‌గా గవిడి మానస
చీపురుపల్లి: సాధారణ కుటుంబంలో జన్మించి చదువుల తల్లిగా ఎదిగింది. టాపర్‌గా నిలవడానికి కావాల్సింది బ్యాక్‌గ్రౌండ్ కాదని, కేవలం కష్టపడి చదవడమేనని రుజువు చేసింది. టాపర్‌గా నిలవడానికి అహర్నిశలు కృషి చేసి ఆంధ్రాయూనివర్సిటీ స్థాయిలో టాపర్‌గా నిలిచి నేటి యువతీ, యువకులకు ఆదర్శంగా నిలిచింది చీపురుపల్లి పట్టణానికి చెందిన గవిడి మానస. 2020–21 విద్యాసంవత్సరంలో మానస ఆంధ్రాయూనివర్సిటీలో ఎంఎస్సీ ఫిజిక్స్ పూర్తి చేసి టాపర్‌గా నిలిచింది. అయితే ఆ విద్యా సంవత్సరానికి మానస యూనివర్సిటీ స్థాయిలో టాపర్‌గా నిలవడంతో ఆమెను 18 అవార్డులు వరించాయి. వాటిలో 4 బంగారు పతకాలు ఉన్నాయి. యూనివర్సిటీల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు వివిధ సంస్థలు పతకాలు, ప్రశంసలు ఇస్తుంటాయి. అందులో భాగంగానే మానసకు 18 అవార్డులు లభించాయి. అయితే గత మూడేళ్లుగా ఆంధ్రాయూనివర్సిటీలో స్నాతకోత్సవాలు జరగకపోవడంతో వరుసగా మూడు స్నాతకోత్సవాలును శనివారం నిర్వహించారు. ఈ స్నాతకోత్సవానికి గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, జీఎంఆర్ సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జునరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా మానస మెరిట్ ధ్రువీకరణతో బాటు పతకాలు అందుకుంది. ప్రస్తుతం ఆంధ్రాయూనివర్సిటీలోనే భౌతికశాస్త్రంపై మానస పీహెచ్డీ చేస్తోంది. ఇదిలా ఉండగా మానస తండ్రి శాంతారావు ఇందిరక్రాంతి పథం(వెలుగు)లో సీసీ గా విధులు నిర్వహిస్తుండగా తల్లి పైడిరాజు వీఓ ఏగా పని చేస్తోంది. మానస ఒకేసారి 18 అవార్డులు తెచ్చుకోవడం, యూనివర్సిటీ టాపర్‌గా నిలవడంతో స్థానికంగా హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. -
ఖమ్మం మెడికో విద్యార్థిని ఆత్మహత్యపై అనుమానాలు!
సాక్షి, ఖమ్మం: మెడీకో విద్యార్థిని మానస మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం నగరంలోని మమత మెడికల్ కాలేజ్‌లో బీడీఎస్ నాలుగవ సంవత్సరం చదువుతున్న మానస ఆదివారం బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. హాస్టల్ గదిలో లోపల గడి పెట్టుకొని ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. 80శాతం గాయాలతో అక్కడికక్కడే మృతిచెందింది. మహబూబాబాద్ కేసముద్రానికి చెందిన మానస.. మానసిక ఒత్తిడి కుటుంబ పరిస్థితుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానాలు వ్యవక్తమవుతున్నాయి. ఆమెకు అంతకు ముందు సంవత్సరాలకు సంబంధించి కొన్ని బ్యాక్‌లాగ్‌లున్నట్లు సమాచారం. మరోవైపు మెడికో ఆత్మహత్యపై లోతైన విచారణ చేపట్టకుండా పోలీసులు ఆగమేఘాలపై మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చేతులు దులిపేసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత వార్త: ఖమ్మంలో మెడికో ఆత్మహత్య.. హాస్టల్ నిర్వాహకులు, సహచర విద్యార్థుల నుంచి వివరాలేమీ సేకరించకుండా హడావుడిగా వెళ్లిపోవడం చర్చనీయాంశమయ్యింది. మీడియాకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో మానస మృతికి దారితీసిన కారణాలపై కనీస స్పష్టత కొరవడింది. అదే విధంగా ఆత్మహత్య చేసుకున్న ప్రాంతానికి మీడియాను అనుమతించొద్దని పోలీసులు చెప్పారంటూ ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లిన విలేకరులను హాస్టల్ నిర్వాహకులు గేటు బయటే అడ్డుకోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఖమ్మం అర్బన్ సీఐ శ్రీహరిని వివరణ కోరగా.. తమ ఎస్సైలు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని మార్చురీకి తరలించారని తెలిపారు. మానస కుటుంబ సభ్యులు వస్తే తప్ప ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదని చెప్పారు. హాస్టల్ నిర్వాహకులే కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. అయితే ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు వారు ఖమ్మం చేరుకోలేదు. కాగా సమీపంలోని పెట్రోల్ బంక్ నుంచి బాటిల్లో పెట్రోల్ తెచ్చుకున్న మానస.. మానసిక ఒత్తిళ్లతోనే బలవన్మరణం చేసుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. చదవండి: అసమ్మతి నేతల ‘అల్టిమేటం’.. ‘బండి’ని ఢిల్లీ పిలిపించిన అధిష్టానం? -
ఊలుతో అల్లిన చిత్రాలు.. మానస చేతిలో దిద్దుకున్న అమ్మ మనసు రూపాలు
ఊలు ఉన్నది వెచ్చని స్వెట్టర్లు అల్లడానికే కాదు. చక్కగా చిత్రంగా బొమ్మలు వేయడానికి కూడా. ఊలు బొమ్మలంటే ఊలుతో అద్దిన బొమ్మలు కాదు. ఊలుతో అల్లిన చిత్రాలు... ఉలెన్ ఆర్ట్ కళారూపాలు. మానస చేతిలో దిద్దుకున్న అమ్మ మనసు రూపాలు. అది నవంబర్ 17. బెంగళూరు, కర్నాటక చిత్రకళా పరిషత్తోని దేవరాజ్ అర్స్లో ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్. అది సోలో ఎగ్జిబిషన్. అందులో వినూత్నమైన చిత్రాల ప్రదర్శన. రంగు అద్దుకున్న కుంచె నుంచి కాన్వాస్ మీద రూపుదిద్దుకున్న రూపమేనా? సందేహం కలుగుతుంది. కళ్లు భ్రమకు గురి చేస్తున్నాయా అనే అనుమానం కూడా. భ్రుకుటి ముడిచి నిశితంగా చూస్తే తెలుస్తుంది అది దారాలు చేసిన మాయ అని. పోరింగ్ ఆర్ట్‌ను తలపిస్తూ రంగుల దారాలు పెయింటింగ్ ఫ్రేమ్ నుంచి కిందకు జాలువారి ఉన్నాయి. మొత్తం 14 చిత్రాలవి. అన్నింటిలోకి పెద్ద చిత్రం పదకొండు అడుగుల ఎత్తు, ఏడున్నర అడుగుల వెడల్పు ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్‌తో ఉన్నాయి. కానీ ప్రధానంగా ‘అమ్మ’ మనసును ప్రతిబింబిస్తున్నాయి. అమ్మ బొమ్మ కనిపించదు, నిద్రపోతున్న బిడ్డను సంతృప్తిగా చూసుకునే భావం బొమ్మల్లో ద్యోతకమవుతుంది. ఆ చిత్రాల రూపకర్త ఓ తెలుగు మహిళ. పేరు మానసప్రియ. ఆమె ఈ కళారూపాల కోసం ఐదేళ్లు నిరంతరంగా శ్రమించారు. పిన్నికి ఇచ్చిన మాట కోసం ఆమె జీవించి ఉండగానే ప్రదర్శించడం కోసం రెండేళ్ల పాటు నిద్రను త్యాగం చేస్తూ పని చేశారు. ఆమె పని చేస్తున్న వేగం కంటే పిన్నిని ఆవరించిన క్యాన్సర్ ఇంకా వేగంగా విస్తరించింది. పిన్నిని తీసుకువెళ్లి పోయింది. పిన్ని సీత ప్రథమ వర్థంతికి మానస ప్రియ ఇచ్చిన కన్నీటి కళాసుమాంజలి ఈ ప్రదర్శన. తాను ఆర్టిస్ట్ అయిన నేపథ్యాన్ని, చిత్రకళలో చేస్తున్న ప్రయోగాలను సాక్షితో పంచుకున్నారామె. ప్రకాశం నుంచి బళ్లారి ‘‘మా తాతలు ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా నుంచి కర్నాటకలోని బళ్లారికి వచ్చి స్థిరపడ్డారు. అలా నేను బళ్లారిలో పుట్టాను. నాకు చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం ఇష్టం. పెన్సిల్‌తో చక్కటి రూపాన్ని తీసుకురాగలిగేదాన్ని. స్కూల్లో ప్రైజ్‌లు కూడా వచ్చాయి. అయితే నాకు పెద్ద అడ్డంకి చదువే. ఎంత ప్రయత్నించినా మార్కులు పెద్దగా వచ్చేవి కాదు. అందులో నా అదృష్టం ఏమిటంటే... మార్కులు రావడం లేదని చదువు మానిపించకుండా ఫైన్ ఆర్ట్స్‌లో (బి.ఎఫ్.ఏ) చేర్పించడం. హైదరాబాద్‌లో లాలాపేట నుంచి ఉదయం ఐదింటికి ఉప్పల్‌కి వెళ్లి అక్కడి ప్రకృతి దృశ్యాలను బొమ్మలు వేశాను. పదిరోజులు వైజాగ్‌లో కాలేజ్ బల్లల మీద పడుకుంటూ ప్రాజెక్ట్ చేశాను. బీఎఫ్ఏ పూర్తయిన తర్వాత బెంగళూరులో విజువల్ ఆర్ట్స్‌లో మాస్టర్స్ చేశాను. ఇవన్నీ చేసిన తర్వాత ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందే లోపే పెళ్లి. పిల్లల కోసం కొంత గ్యాప్ తీసుకున్నాను. తొమ్మిదేళ్ల విరామం తర్వాత రేఖ అనే ఫ్రెండ్ ఆహ్వానంతో కేరళ, ఫోర్ట్ కొచ్చిలో నా చిత్రాలను ప్రదర్శించాను. అప్పటికి ఉలెన్ పెయింటింగ్స్ మొదలు పెట్టలేదు. అయితే ఆర్టిస్ట్‌గా ఊరికే ఉండకుండా ఏదో ఒక ప్రయోగం చేసేదాన్ని. అలా టెర్రారియమ్ అని గాజు సీసాల్లో మొక్కలను పెంచడం వంటి హాబీలు ప్రాక్టీస్ చేశాను. ఆ తర్వాత పెయింటింగ్‌లో ఇప్పుడు మీరు చూస్తున్న ఉలెన్ ప్రయోగం మొదలు పెట్టాను. మా వారి ఉద్యోగరీత్యా ఇప్పుడు పూనాలో ఉంటున్నప్పటికీ నా ఆర్ట్ ప్రయోగాలు మానలేదు. నా పేరు మీద మొక్క బెంగళూరులో ఎగ్జిబిషన్ నాలుగు రోజులు సాగింది. ఓ రోజు అరవై దాటిన మహిళలు ఐదుగురు వచ్చారు. ‘మేము అక్కాచెల్లెళ్లం. ఓ సిస్టర్ ఈ రోజే కెనడా నుంచి వచ్చింది. ఈ ఎగ్జిబిషన్ చూసి తీరాలని తనను నేరుగా తీసుకువచ్చాం’ అని చెప్పారు. అలాగే ఎగ్జిబిషన్ చివరి రోజు ఆర్ట్ గ్యాలరీ ప్రెసిడెంట్‌గారు వచ్చి ‘వాళ్ల కాలేజ్‌లో రెండు రోజులు ఎగ్జిబిషన్ కావాల’ని అడిగారు. ఆరు వందల మంది విద్యార్థుల మధ్య నాతోనే ప్రారంభోత్సవం చేయించి, కాలేజ్ ప్రాంగణంలో నా పేరు మీద మొక్క నాటారు. ఐదేళ్లు నేను ఇంటి నాలుగ్గోడల మధ్య పడిన శ్రమ నాకో ప్రత్యేకతను తెచ్చింది. నేను అభ్యసించిన కోర్సుకి మరో కొత్త ఆర్ట్ ఫార్మ్‌ను జత చేయగలుగుతున్నాననే సంతృప్తి కలుగుతోంది’’ అన్నారు మానస ప్రియ. నా బొమ్మల్లో అమ్మ ఉంది నేను ఆర్టిస్ట్‌ని, తల్లిని. ఉలెన్ ఆర్ట్ మాధ్యమంగా అమ్మ మనసును ఆవిష్కరించే ప్రయత్నం చేశాను. పిల్లలు మెలకువగా ఉన్నప్పటికంటే నిద్రపోతున్నప్పుడు చాలా బాగుంటారు. ఎంత సేపు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. ఉలెన్ ఆర్ట్‌లో పిల్లల ముఖంలో ప్రసన్నత కోసం నేను శ్రద్ధగా పని చేయడాన్ని మా సీత పిన్ని చాలా ఇష్టంగా చూసేది. ‘ఈ కళాఖండాలతో ఎగ్జిబిషన్ పెడితే చూడాలని ఉంది’ అని చెప్పిందోసారి. ‘అలాగే చూస్తావు పిన్నీ’ అన్నాను. కానీ ఆ తర్వాత కొన్నాళ్లకే తెలిసింది పిన్నికి క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్‌లో ఉందని. అప్పటి వరకు మామూలుగా ప్రాక్టీస్ చేసిన నేను త్వరగా పూర్తి చేయాలని చాలా దీక్షగా పనిచేశాను. రెండేళ్లపాటు రోజుకు నాలుగు గంటలే నిద్రపోయాను. నేనెంత ఆత్రుత పడినప్పటికీ పిన్ని ఉండగా ఆ పని చేయలేకపోయాను. గత ఏడాది పిన్ని ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయింది. పిన్ని తొలి వర్ధంతి నాటికి ఎగ్జిబిషన్ పెట్టి తీరాలని ఈ ఏడాది నవంబర్‌లో ఆ పని చేయగలిగాను. ఈ ప్రక్రియలో నాకు చాలా మంది సహాయం చేశారు. అంజలి పట్వర్ధన్ నా ప్రతి బొమ్మకు ఒక పోయెమ్ రాశారు. ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటులో ఫ్రెండ్ తేజస్విని సహాయం చేసింది. – ధూళిపాళ్ళ మానస ప్రియ, ఉలెన్ ఆర్టిస్ట్ – వాకా మంజులారెడ్డి -
లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఇన్చార్జి తహసీల్దార్
సాక్షి, రామారెడ్డి(ఎల్లారెడ్డి): లంచం తీసుకుంటూ ఇన్చార్జి తహసీల్దార్, ధరణి ఆపరేటర్ ఏసీబీకి పట్టుబడ్డారు. నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాలు.. రామారెడ్డి ఇన్చార్జి తహసీల్దార్ మానస, ధరణి ఆపరేటర్ లక్ష్మణ్ ద్వారా అన్నారం గ్రామానికి చెందిన రైతు బన్నం బలరాం నుంచి రూ. 4వేలు లంచం తీసుకుంటుండగా గురువారం మధ్యాహ్నం ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్, ఇన్స్పెక్టర్లు నగేశ్, శ్రీనివాస్‌లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రైతు బలరాం తన పెద్దమ్మ పేరున ఉన్న భూమిని తన పేరు మీదకు మార్చాలని రామారెడ్డి తహసీల్దార్ కార్యాలయంలోని ధరణి ఆపరేటర్‌ను కలిశాడు. తన పెద్దమ్మకు ఎవరూ లేకపోవడంతో బాగోగులు తనే చూసుకునేవాడినని రెండేళ్ల క్రితం ఆమె మరణించడంతో ఆమె పేరిట ఉన్న 37 గుంటల భూమిని తన పేరు మీదకు మార్చాలని అర్జీ పెట్టుకున్నాడు. దీంతో ధరణి ఆపరేటర్ లక్ష్మణ్ ఆన్లైన్ ఫీజు రూ. 3వేలు, దాని తర్వాత లంచం రూపంలో రూ. 10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వలేనని రైతు ఇన్చార్జి తహసీల్దార్ మానసను కలవగా.. రూ. 4వేలు ఇవ్వాలని ఆమె సూచించారు. ఆ డబ్బులు కూడా ఇవ్వడం ఇష్టంలేక బలరాం నిజామాబాద్‌లోని ఏసీబీ అధికారుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. గురువారం మధ్యాహ్నం బలరాం రూ. 4వేలు లంచం డబ్బులను ధరణి ఆపరేటర్ లక్ష్మణ్‌కు ఇస్తుండగా అధికారులు రెడ్ హాండెడ్‌గా పట్టుకున్నారు. తదుపరి విచారణ చేస్తున్నామని ఇన్చార్జి తహసీల్దార్, ధరణి ఆపరేటర్‌పై చర్యలు ఉంటాయని డీఎస్పీ వెల్లడించారు. -
టైటిల్ పాజిటివ్‌గా ఉంది
‘‘హైవే’ టైటిల్ పాజిటివ్‌గా ఉంది. ట్రైలర్ చూడగానే ‘ఆవారా, రాక్షసుడు’ చిత్రాలు చూసినట్టుంది. ఇలాంటి మంచి సినిమాలు తీస్తున్నందుకు నిర్మాత వెంకట్‌గారికి థ్యాంక్స్’’ అని హీరో నాగశౌర్య అన్నారు. ఆనంద్ దేవరకొండ, మానస జంటగా కేవీ గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హైవే’. నార్త్‌స్టార్ సమర్పణలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్, వెంకట్ తలారి ప్రొడక్షన్స్‌లో రూపొందిన ఈ సినిమా ఈ నెల 19న ‘ఆహా’ ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను నాగశౌర్య విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నాకు లవర్ బాయ్ అని ప్రేక్షకులు ట్యాగ్ ఇచ్చారు. కానీ ఆనంద్కి ఎలాంటి ట్యాగ్ లేకపోవడంతో వేర్వేరు జానర్ల సినిమాలను చేస్తున్నారు.. అది చాలా గొప్ప లక్షణం’’ అన్నారు. ‘‘హైవే’ చక్కని ప్రయోగాత్మక చిత్రం’’ అన్నారు ఆనంద్ దేవరకొండ. ‘‘సరికొత్త కథాంశంతో రూపొందిన మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తా రని ఆశిస్తున్నాను’’ అన్నారు కేవీ గుహన్. ‘‘అద్భుతమైన థ్రిల్లర్ చిత్రం ఇది’’ అన్నారు నిర్మాత శరత్ మరార్. ‘ఆహా’ మార్కెటింగ్ హెడ్ కార్తీక్, హీరోయిన్ మానస మాట్లాడారు. -
భర్త సంసారానికి పనికి రాడని చెప్పి.. జాతరకు వెళ్లి..
సాక్షి, హస్తినాపురం (హైదరాబాద్): భర్త వేధింపులతో తన కూతురు మృతి చెందిందని తల్లిదండ్రులు, బంధువులు సోమవారం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. మృతురాలి భర్త దేవిరెడ్డి, మామ జంగారెడ్డి పోలీస్ స్టేషన్లో తలదాచుకోవడం ఏంటని బంధువులు పెద్దఎత్తున తరలివచ్చి స్టేషన్ ముందు బైఠాయించారు. వివరాలు ఇలా.. మాడ్గుల మండలం అర్కపల్లికి చెందిన మానసను వనస్థలిపురం క్రిష్టియన్‌కాలనీకి చెందిన దేవిరెడ్డితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. దేవిరెడ్డి మెడికల్ కంపెనీలో పని చేస్తుండగా మానస ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. అయితే... దేవిరెడ్డి సంసార జీవితానికి పనికిరాడని మానస తల్లిదండ్రులకు చెప్పగా కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో కోసం పెంచుకున్న దేవిరెడ్డి మానసను పలుమార్లు కొట్టడంతో పెద్దల సమక్షంలో ఇరువురికి నచ్చజెప్పారు. ఈ విషయమై 2021లో దేవిరెడ్డిపై మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చదవండి: (నవమి వేడుకల్లో ఘర్షణలు) నాటి నుంచి తల్లిదండ్రుల వద్ద ఉంటున్న మానస ఈ నెల 9న మెదక్ జిల్లాలోని ఏడుపాయల జాతరకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లింది. అక్కడ మానస అపస్మారక స్థితిలో వెళ్లడంతో వెంటనే అక్కడి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు నగరంలోని గాంధీ ఆసుపత్రికి తీసుకురాగా మానస అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. గత మూడ్రోజులుగా మానసిక క్షోభతో మృతి చెందిన మానస మృతదేహానికి భర్త దేవిరెడ్డి అంత్యక్రియలు జరపాలని డిమాండ్ చేయడంతో ఇంటికి తాళం వేసి వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో ఉండడంతో మృతురాలి బంధువులు స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. -
జూనియర్ ఆర్టిస్ట్ మానస మృతి.. అంత్యక్రియలకు డబ్బులు లేవు..
సాక్షి, జడ్చర్ల: బుల్లితెరపై చూద్దామనుకున్న తరుణంలో తన కూతురును రోడ్డు ప్రమాదం మింగేసిందని ఆ తండ్రి కన్నీరు మున్నీరయ్యారు. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో శనివారం ఉదయం జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్ట్‌లు మృత్యువాత పడిన సంఘటనలో మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లిలోని పాతబజార్‌కు చెందిన మానస (21) ఉంది. చదవండి: (ఒకే కాలేజీ.. ఫేస్బుక్లో దగ్గరై సహజీవనం.. పవిత్రకు నిజం తెలిసి..) స్థానికుల కథనం ప్రకారం.. ఈ యువతిది నిరుపేద కుటుంబం. ఆరేళ్ల క్రితం తల్లి బాలమణి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. తండ్రి రవీందర్ ఓ పెట్రోల్‌బంకులో పనిచేసేవాడు. అక్క వైష్ణవి కొరియర్ కార్యాలయంలో చిరుద్యోగిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో పదోతరగతి వరకు చదివిన మానస బుల్లితెరపై కనిపించాలన్న ఆశతో హైదాబాద్ మెట్లెక్కిందని ఈ సందర్భంగా తండ్రి వివరించాడు. షార్ట్ ఫిలింస్‌లో నటించేదని, షూటింగ్స్ లేనప్పడు ఇంటికి వచ్చేదన్నారు. చదవండి: (అసలే మత్తు.. ఆపై స్పీడు) ఇటీవల తన ఇంటిలోని ఓ గదికి మరమ్మతు చేయించి రేకులకప్పుతో పాటు కలర్స్ వేయించిందన్నాడు. ఈనెల 16వ రాత్రి తన చేతికి గాయమైన సమయంలో కట్టుకట్టి ప్రాథమిక వైద్యం చేసిందని గుర్తు చేసుకుని లబోదిబోమన్నాడు. తన కూతురు వారం రోజుల క్రితమే ఇంటికి వచ్చి తిరిగి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు బస్సులో వెళ్లిందన్నాడు. శనివారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందన్న వార్త వినాల్సి వచ్చిందని బోరుమన్నాడు. తన కూతురు అంత్యక్రియలకు డబ్బులు లేవని వాపోయాడు. దాతలు స్పందించి సహకరించాలని విజ్ఞప్తి చేశాడు. ఈ సంఘటనతో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చదవండి: (Hyderabad: వ్యభిచార గృహం గుట్టు రట్టు.. సోదరుడి ఇంట్లోనే..) -
మిస్ వరల్డ్ పోటీ వాయిదా
ముంబై/సాన్‌జువాన్: మిస్ వరల్డ్–2021 పోటీని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. మిస్ ఇండి యా మానస వారణాసి (23) సహా పలువురు పోటీదారులు, సిబ్బంది కోవిడ్ బారినపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్యూర్టోరికోలోని సాన్ జువాన్‌లో డిసెంబర్ 16న ప్రారంభం కావాల్సిన ఈ కార్యక్రమాన్ని రానున్న 90 రోజుల్లో రీషెడ్యూల్ చేస్తామని తెలిపారు. కరోనా బారిన పడిన పోటీదారులు, సిబ్బందిని ఆరోగ్య నిపుణుల సూచనల మేరకు వెంటనే క్వారంటైన్‌కు తరలించి, వైద్యపరీక్షలు, అవసరమైన చికిత్సలు చేపట్టినట్లు తెలిపారు. వీరందరూ కోలుకున్న తర్వాత, మరోసారి పరీక్షలు నిర్వహించి నెగెటివ్‌గా తేలితే వారి వారి దేశాలకు పంపిస్తామని ‘మిస్ వరల్డ్’ సీఈవో జులియా మోర్లే పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన మానస భారత్ తరఫున మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు ప్యూర్టోరికో వెళ్లారు. -
పక్కా ప్లాన్‌తో మానస హత్య.. క్యాబ్ డ్రైవర్ సాయంతో గన్ కొని..
కొచ్చి: గత నెలలో జరిగిన డెంటల్ విద్యార్ధిని మానస హత్య కేసులో కీలక విషయాలు బయటికొస్తున్నాయి. కేసుకు సంబంధించి బీహార్‌లోని మంగేర్ జిల్లాలో 21 ఏళ్ల సోను కుమార్ మోదీని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీవీ మానస(24) ఇందిరా గాంధీ కాలేజీలో డెంటల్ కోర్సు ఫైనల్ ఇయర్ చదువుతోంది. అక్కడే స్నేహితులతో కలిసి రూమ్‌లో ఉంటోంది. రాఖిల్ (32) కూడా అదే జిల్లాకు చెందిన వాడు. రెండేళ్ల క్రితం ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యారు. వారి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఆ తరువాత రాఖిల్ నువ్వు ఏ అబ్బాయితోనూ మాట్లాడొద్దు, చాటింగ్ చెయ్యొద్దంటూ కంట్రోల్ చెయ్యడం ప్రారంభించాడు. కొన్నాళ్లకు అతడు పెడుతున్న షరతులు భరించలేక బ్రేకప్ చెప్పింది. అతడిని అవాయిడ్ చేయడం మొదలు పెట్టింది. దీనిని భరించలేని రాఖిల్ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే.. నన్నే కాదంటుందా అని ఆమెపై పగ పెంచుకున్నాడు. మానస లేని జీవితం తనకి వద్దనుకున్నాడు. ప్రతి రోజూ మానసనే తలచుకుంటూ ఓ సైకోలా తయారయ్యాడు. తనకు దక్కని మానస ఇంకెవరికీ దక్కకూడదనుకున్నాడు. చివరికి ఓ ఉబర్ క్యాబ్ డ్రైవర్ సాయంతో బీహార్‌లో సోను కుమార్ మోదీ అనే వ్యక్తి దగ్గర నాటు తుపాకీ కొన్నాడు. కేరళలోని కొత్తమంగళంలో మానస రూమ్‌కు దగ్గర్లోనే ఓ రూమ్ అద్దెకు తీసుకున్నాడు. అక్కడే ఒక ప్లైవుడ్ కంపెనీలో పనిచేయడానికి వచ్చానని గది ఓనర్‌కి చెప్పాడు. అక్కడే మానసను ఎలా హతమార్చాలో పక్కా ప్లాన్ రచించాడు. గత వారం మానసను గన్‌తో కాల్చిన తర్వాత తనూ సూసైడ్ చేసుకున్నాడు. మరి రాఖిల్‌కి ఈ హత్యలో ఇంకెవరైనా సహకరించారా? అనేదానిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
గ్రేట్ జర్నీ... మానస చిత్రం
గిగిల్స్... లిల్లీపుట్ ల్యాండ్ పేరు పైన రెండు బుజ్జి పాదాలు. లోపలికి వెళ్తే ఓ గదిలో పదకొండు నెలల బాబు విహాస్ పియానో ముందు కూర్చుని కీ బోర్డుని పరీక్షగా చూస్తున్నాడు. ఆ బాబు దృష్టి తన వైపు మరల్చుకోవడానికి ప్రయత్నిస్తోందామె. ఇంగ్లిష్ రైమ్ మొదలు పెట్టగానే బాబు ఆమె వైపే చూడసాగాడు. ఓ అరనిమిషం పాటు అలాగే చూసి నోరంతా తెరిచి నవ్వాడు. అప్పుడు క్లిక్ మన్నది ఆమె చేతిలోని కెమెరా. ఆమె పేరు మానస అల్లాడి. కెమెరామన్ అనే మాటను సవరిస్తూ కెమెరా పర్సన్ అనే పదాన్ని నిర్ధారించేశారు. అందుకు మహిళలు వేసిన ఓ ముందడుగే కారణం. ఫొటోగ్రాఫర్‌గా మగవాళ్లు మాత్రమే ఉన్న రోజుల్లో నిర్ధారణ అయిన పదానికి జెండర్ స్పెసిఫికేషన్‌ను తుడిచేస్తున్నారు మహిళలు. ఫొటోగ్రాఫర్‌గా మహిళలు అరుదుగానే అయినా కనిపిస్తున్నారు. వాళ్లు కూడా ఫొటో జర్నలిస్టులు. ప్రైవేట్ ఫొటోగ్రాఫర్ల విషయానికి వస్తే... ఇంకా మహిళల ప్రస్థానం ఊపందుకోలేదు. అలాంటి సమయంలో ఓ సాహసం చేసింది మానస అల్లాడి. విహాస్ను ఫొటో తీస్తున్న ఉమన్ ఫొటోగ్రాఫర్ మానస ఫొటోగ్రఫీ మీద ఇష్టంతో కోర్సు చేయడంతోపాటు సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాన్ని వదిలి సొంతంగా ఫొటో స్టూడియో పెట్టింది. మరో ఐదుగురు ఫొటోగ్రాఫర్లకు, ఐదుగురు ఎడిటర్లకు ఉద్యోగం ఇచ్చింది. సొంత స్టూడియో ఆలోచనకు దారి తీసిన కారణం తనలోని తల్లి మనసేనంటోంది. తన పిల్లలను రకరకాల పోజుల్లో చూడాలని ముచ్చటపడింది. డెలివరీ అయిన ఐదో రోజున నిద్రలో నవ్వుతున్న తన బాబుని ఫొటో తీయాలనుకుంది. ఆ క్షణంలో తాను కదల్లేదు. ఫొటోలు తీయడానికి ఫొటోగ్రాఫర్లు అందుబాటులో లేరు. అలా ఆ కోరిక తీరకపోవడం వల్ల ఆ పని తానే మొదలు పెట్టింది. సొంతంగా డిజైన్ కరీంనగర్లో పుట్టి పెరిగిన మానస, ఇంజనీరింగ్ వరకు అక్కడే చదివింది. బీటెక్ పట్టాతో హైదరాబాద్‌కి వచ్చి ఇన్ఫోసిస్‌లో ఉద్యోగంలో చేరింది. ఏడేళ్లు ఉద్యోగం ఇవ్వని సంతృప్తి మూడేళ్ల ఫొటోగ్రఫీ ఇచ్చింది. ఉద్యోగం చేస్తూనే ఒక ప్రైవేట్ ఫొటోగ్రఫీ ఇన్స్టిట్యూట్లో చేరి డిప్లమో కోర్సు చేసింది. సీనియర్ దగ్గర మెళకువలు నేర్చుకుంది. అప్పటికి స్టూడియో పెట్టే ఆలోచన లేదు. కేవలం ఇష్టంతో మాత్రమే నేర్చుకున్నది. ‘‘మా అబ్బాయి ఐదు రోజుల బిడ్డగా ఉన్నప్పుడు ఫొటో తీయడానికి బేబీ ఫొటోగ్రఫీ ప్రొఫెషనల్స్ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో చాలా నిరుత్సాహం కలిగింది. నేను లేవగలిగినప్పటి నుంచి బాబుకి నేనే ఫొటోలు తీసుకున్నాను. ప్రతినెలా పుట్టినరోజు చేస్తూ ఒక్కో నెల డ్రెస్‌కి ఒక్కో థీమ్‌తో కుట్టించి మరీ ఫొటోలు తీశాను. రెండవసారి మెటర్నిటీ లీవ్‌లో ఉన్నప్పుడు సీరియెస్‌గా ఆలోచించాను. నేనే స్టూడియో పెడతాను. బేబీ ప్రతి మూమెంట్‌ని, రకరకాల నేపథ్యాలలో కెమెరాలో దాస్తానని ఇంట్లో చెప్పాను. ఇంట్లో ఎవరూ అడ్డు చెప్పలేదు. ‘ఏ ప్రయోగం చేయాలన్నా ఇదే సరైన వయసు’ అని ప్రోత్సహించారు. ఇక నేను ఏయే థీమ్స్‌తో పిల్లల్ని ఫొటో తీయాలని ముచ్చటపడ్డానో అన్ని సెట్టింగులూ చేయించుకున్నాను. మా స్టూడియోలో ఉన్నవేవీ మార్కెట్లో రెడీమేడ్‌గా దొరికేవి కాదు. ప్రతిదీ నేనే డ్రాయింగ్ వేసి కార్పెంటర్‌కి వివరించి చేయించుకున్నాను. మొత్తం ముప్పై నేపథ్యాలతో గదులు సిద్ధమయ్యాయి. అన్నీ త్రీ డైమన్షన్ సెటప్లే. ఇండియాలో పెద్ద బేబీ ఫొటో స్టూడియో ఇదే. ఈ ఏడాది మా కరీంనగర్లో కూడా ఓ స్టూడియో పెట్టాను. పిల్లలు మాలిమి అవుతారు ఉద్యోగం చేసినప్పుడు మిగుల్చుకున్న డబ్బు పదిలక్షలతో 2017లో హైదరాబాద్, బోయిన్‌పల్లిలో స్టూడియో పెట్టాను. అప్పటికి హైదరాబాద్‌లో న్యూ బార్న్ బేబీ స్టూడియో ఉంది. కానీ మహిళలు ఈ ప్రయత్నం చేయలేదు. నాకు అడ్వాంటేజ్ ఏమిటంటే... చిన్న పిల్లలు మగవాళ్ల కంటే ఆడవాళ్లకే త్వరగా మాలిమి అవుతారు. పిల్లలతో ఓ అరగంట గడిపితే ఆ బేబీకి ఏమిష్టమో అర్థమవుతుంది. అదే సమయంలో పిల్లలకు నేను అలవాటవుతాను. ఒక్కో పిల్లలు రైమ్స్ ఇష్టపడతారు, కొందరు బొమ్మలను ఇష్టపడతారు. ఇక షూట్ చేసేటప్పుడు వాళ్లకు ఇష్టమైనవి చేస్తూ ఉండాలన్నమాట. మగవాళ్లకు పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాదు. ఏం చేస్తే వాళ్ల ఏడుపును ఆపవచ్చనేది కూడా వెంటనే స్ఫురించదు. కాబట్టి ఈ ప్రొఫెషన్లో ముఖ్యంగా బేబీ ఫోటోగ్రఫీలో మహిళలకు మంచి అవకాశాలుంటాయి. హాబీగా నేర్చుకున్న వాళ్లు అక్కడితో ఆగిపోకుండా దీనిని ప్రొఫెషన్‌గా తీసుకోవచ్చు’’ అన్నది మానస. ఒక తొలి అడుగు మరికొన్ని అడుగులకు స్ఫూర్తి అవుతుంది. మానస ఇష్టంగా క్లిక్ మనిపించుకున్న జీవిత చిత్రమిది. ఈ దారిలో మరికొంతమంది యువతులు ఫొటోగ్రాఫర్లుగా ఎదగాలని ఆశిద్దాం. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : మోహనాచారి -
మానస స్వప్నం నిరుపేదలకు ఓపాడ్ ఇళ్లు
సొంతింట్లో నివసించాలని కోరుకునే వారు మన సమాజంలో చాలామంది ఉంటారు. పేద, మధ్యతరగతి వారి సొంతింటి కలను సాకారం చేసేందుకు 23 ఏళ్ల పేరాల మానస రెడ్డి సరికొత్త ఐడియాతో ముందుకొచ్చింది. డ్రైనేజి నీటి పారుదల కోసం ఉపయోగించే.. పైపుల్లో సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లను అతి తక్కువ ఖర్చుకే అందించనున్నట్లు మానస ప్రకటించింది. ప్రకటించినట్లుగానే రెండు వేల మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన కాంక్రీట్ పైపు (తూము)లో 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓపాడ్స్ లేదా మైక్రో ఇళ్లుగా పిలిచే ఇల్లును నిర్మించి ఔరా అనిపిస్తోంది. కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించింది మానస. తను మూడో తరగతి చదువుతున్న సమయంలో తండ్రి మరణించడంతో మానసను, ఆమె చెల్లిని తల్లి ఎంతో కష్టపడి పెంచింది. చిన్నప్పటి నుంచి తల్లి పడుతోన్న కష్టాలను దగ్గర నుంచి చూస్తూ పెరిగిన మానస... తల్లి ప్రోత్సాహంతో ‘లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ’లో సివిల్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ పూర్తిచేసింది. ఇంజినీరింగ్ అయిన తరువాత మరో ఆరు నెలలపాటు కొత్త కొత్త ఇళ్ల నిర్మాణ నమూనాలపై ఆమె పరిశోధనలు చేసింది. పరిశోధనలో భాగంగా జపాన్, హాంగ్‌కాంగ్, ఇతర ప్రదేశాల్లో అక్కడి వాతావరణ స్థితిగతులకు అనుగుణంగా నిర్మించిన ఇళ్ల నమూనాలపై లోతుగా అధ్యయనం చేసింది. వీటి ఆధారంగా మన దేశంలోని వాతావరణానికి తగ్గట్టుగా తక్కువ ఖర్చుతో ఎలాంటి ఇంటిని నిర్మించవచ్చో నిర్ణయించుకుని కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టడానికి రిజిస్టర్ చేసుకుంది. నిరుపేద కుటుంబాల కోసం 12 రకాల డిజైన్లు రూపొందించగా... ఇప్పుడు ఒక నమూనాతో ‘ఓపాడ్’ ఇంటిని నిర్మించింది. ఓపాడ్.. సిమెంటు తూములు (పైపు)ల్లో నిర్మించే ఈ ఇళ్లు చిన్నగా... చూడముచ్చటగా కనిపిస్తాయి. ఓపాడ్ లో ఒక బెడ్రూమ్, కిచెన్, హాల్, వాష్‌రూమ్‌లు ఉంటాయి. వస్తువులను పెట్టుకునేందుకు అల్మారాలు, ఎలక్ట్రిసిటీæ, వాటర్, డ్రైనేజీ సదుపాయాలు ఉంటాయి. పైపు పైన లాంజ్ లాంటి బాల్కనీ కూడా ఉంది. ఈ ఇంటిలో ఒకరు లేదా ఇద్దరు సౌకర్యంగా జీవించవచ్చు. ఇండియాలోనే తొలిసారి నిర్మించే ఈ ఓపాడ్ ఇళ్లు 40 నుంచి 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో 15 రోజుల్లో నివసించడానికి వీలుగా తయారవుతుంది. ‘‘అన్ని వాతావరణ పరిస్థితుల్లో అటూ ఇటూ కదపగల ఈ ఇళ్లæజీవిత కాలం వందేళ్లు అని, ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.3.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఖర్చవుతుందని మానస చెప్పింది. సరికొత్త ఓపాడ్ ఇళ్లలో డబుల్, త్రిబుల్ బెడ్రూమ్ ఇళ్లను త్వరలో నిర్మించనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా మానస మాట్లాడుతూ..‘‘పట్టణాలు, గ్రామాలు, స్లమ్స్‌లో నివసించే వారు ఎక్కువగా పూరి గుడిసె ల్లో నివసిస్తుంటారు. వర్షం పడిందంటే ఇళ్లలోకి నీరు చేరడం, పైకప్పు నుంచి వర్షం కురవడం, కొన్నిసార్లు నీటి ప్రవాహానికి ఇళ్లు కొట్టుకుపోవడం వంటివి సంభవిస్తుంటాయి. నేను బి.టెక్ చదివేటప్పుడు ఇటువంటి సందర్భాలెన్నింటినో దగ్గరగా గమనించాను. సమస్యలు ఏవీ ఎదురుకాని ఇళ్లను నిర్మించాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఈ క్రమంలోనే తక్కువ ఖర్చుతో తయారయ్యే ఓపాడ్ ఇళ్లను నిర్మిస్తున్నాను. ఈ ఇళ్లు ఎంతో చల్లగా ఉండడంతో పాటు ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. నిరుపేదలకోసం రూపొందించిన ఈ డిజైన్లలో కొన్ని రెస్టారెంట్లు, రిసార్టులు, మొబైల్ హోమ్స్, మొబైల్ క్లినిక్‌లు, గెస్ట్ హౌస్, గార్డులు నివసించే రూములుగా కూడా ఉపయోగపడతాయి’’ అని వివరించింది. మానస తల్లి రమాదేవి మాట్లాడుతూ.. మా అమ్మాయి మానసకు వచ్చిన ఐడియాను మొదట్లో ఎవరూ ప్రోత్సహించలేదు. కానీ ఇప్పుడు ఎంతోమంది తన డిజైన్స్ గురించి మెచ్చుకోవడం నాకెంతో సంతోషంగా, గర్వంగా ఉంది. మానస నిరుపేదలు ఖర్చుచేయగల సరసమైన ధరలకు ఇళ్లను నిర్మించాలని కోరుకుంటున్నాను’’ అని రమాదేవి చెప్పారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శి, సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... మానసకు వచ్చిన ఆలోచన కొత్త ఆవిష్కరణలకు పునాది వేసేదిగా ఉంది. ఇది తన విజయ ప్రస్థానంలో కేవలం ప్రారంభం మాత్రమే. ముందుముందు తను మంచి విజయాలను అందుకుంటుందని ఆశిస్తున్నాను’’ అని చెప్పారు. మానస చెంగిచెర్లలో డెమో కోసం నిర్మించిన ఓపాడ్ ఇల్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తల్లి రమాదేవితో మానస -
సాఫ్ట్వేర్ ఇంజనీర్ని.. గ్లామర్ రంగానికి కొత్త
‘హైదరాబాద్ నగరం నన్ను తీర్చిదిద్దింది. ఫుడ్ నుంచి ఫ్రెండ్స్ దాకా ఎన్నో ఇచ్చింది. నేను ఈ నగరంతో మమేకమైపోయా’’ అంటోంది నగరవాసి, తాజాగా ముంబయిలో జరిగిన పోటీల్లో మిస్ ఇండియా టైటిల్ గెల్చుకున్న మానస వారణాసి (23). గ్లామర్ రంగంతో ఏ మాత్రం సంబంధం లేకుండా నేరుగా బ్యూటీ కాంటెస్ట్‌లోకి అడుగుపెట్టిన సాఫ్ట్వేర్ ఇంజినీర్.. ఎంబ్రాయిడరీ నుంచి ట్రెక్కింగ్ దాకా భిన్న రకాల అభిరుచులు, చిన్న వయసులోనే పరిపక్వ ఆలోచనలతో అబ్బురపరిచే మానస ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే... సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న నేను గ్లామర్ రంగానికి చాలా కొత్త. కాలేజ్ డేస్‌లో మిస్ ఫ్రెషర్‌గా గెలవడం తప్ప.. గతంలో గ్లామర్ రంగంలో ఎప్పుడూ ఫుల్‌టైమ్ పనిచేసింది లేదు. అనుకోకుండా ఈ పోటీకి ఎంపికై, టైటిల్ గెలుచుకోవడం చాలా ఆనందాన్నిస్తోంది. పోటీ ఇప్పటికే.. సిస్టర్స్‌గా ఎప్పటికీ... మిస్ ఇండియా పోటీలో 31 మంది ఫైనలిస్ట్‌లు పలు రాష్ట్రాల నుంచి, కేంద్ర పాలిత ప్రాంతం నుంచి కూడా ప్రాతినిధ్యం వహించారు. కోవిడ్ కారణంగా ఈ పోటీ చాలా వరకూ వర్చువల్‌గానే సాగింది. వీరిలో 15 మంది ముంబయిలో జరిగిన ఫైనల్స్‌కు ఎంపికై హాజరయ్యారు. ఈ పోటీల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నా. అంతేకాదు స్టైలింగ్ నుంచి ఎక్సర్సైజ్ దాకా ఎన్నో మెళకువలు కూడా నేర్చుకున్నా. ఈ అనుభవం మర్చిపోలేనిది. పోటీ కేవలం ఇక్కడి వరకే. తర్వాత స్వంత సిస్టర్స్‌లా లైఫ్ లాంగ్ టచ్‌లో ఉంటాం. కుటుంబమే కీర్తి... మనుషులే స్ఫూర్తి... అమ్మమ్మ, తల్లిదండ్రులు, సోదరి ఇదే నా కుటుంబం. వాసవిలో ఇంజినీరింగ్ చదివా. సాధారణ జీవితం, అత్యున్నత ఆలోచనలు, విద్యకు ప్రాధాన్యం ఇచ్చే కుటుంబం మాది. అది నేర్పిన విలువలే నన్ను నిర్వచిస్తాయి. తమను తాము ఎప్పటికప్పుడు పునర్నిర్వచించుకుని, పునరావిష్కరించుకునే మనుషులే నాకు స్ఫూర్తి. జీవితాంతం వ్యక్తిగా పరిణతి సాధించుతూనే సాగుతాను. ఏ విషయంలోనైనా అంతిమంగా పశ్చాత్తాపం చెందాల్సిన అవసరం లేని సంపూర్ణ జీవితమే నాకు ప్రధానం. సినిమా... రమ్మంటే? భవిష్యత్తు మనకేమి ఇస్తుందో ఎవరికి తెలుసు? ఒక కొత్త ఆశలు..అవకాశాల ప్రపంచాన్ని సృష్టించుకోవడానికి నేను మిస్ ఇండియా పోటీలకు వచ్చాను. ఈ టైటిల్ నన్నెక్కడికి తీసుకెళుతుందో చూడాలని నేను ఉద్విగ్నంగా ఎదురు చూస్తున్నా. సినిమా రంగ ప్రవేశం అనే ప్రశ్నకు కాలం మాత్రమే సమాధానం చెబుతుంది. నా వరకూ నాకు ఎదురయ్యే ప్రతి అవకాశానికి తలుపులు తెరచి ఉంచాలనేది ఇప్పటిదాకా సాగిన నా ప్రయాణం నాకు నేర్పింది. అద్భుత యోగం.. అందం మానసికం.. శరీరంతో పాటు మనసు ఆత్మల మేలు కలయికే ఫిట్నెస్. అది అందించేదిగా నేను ఎంచుకున్న యోగా నా జీవితంలో అద్భుతాలు చేసింది. ఇతరుల్ని మెప్పించడానికి చేసే ప్రయత్నం కాక నిన్ను నువ్వు మెప్పించుకోవడమే ముఖ్యమనేది ఫ్యాషన్‌లో పాటించే సూచించే సూత్రం. నువ్వేమిటి అనే విషయంలో ఆత్మవిశ్వాసంతో ఉంటే నీకు నువ్వెప్పుడూ అందంగానే ఉంటావు. నీ గురించి నువ్వు సంతృప్తిగా భావించకపోతే అందంగా ఉండడం అనేదానిలో అర్ధం లేదు. అందాల భామ.. అభిరుచుల చిరునామా.. నగరానికి చెందిన మానస వారణాసి ప్రస్తుతం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్ ఎనలిస్ట్‌గా ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారు. మానస తండ్రి అనుమణి వారణాసి, తల్లి శైలజ వారణాసి. ఇన్స్ట్రా గ్రామ్ ద్వారా పెట్స్‌పై ప్రేమ నుంచి తన ఎంబ్రాయిడరీ స్కిల్స్ దాకా ఎన్నో ఆమె పంచుకుంటుంటారు. ట్రెక్కింగ్, స్కై గేజింగ్ తదితర సాహసాలు చేయడాన్ని ఇష్టపడే మానస సైన్ లాంగ్వేజ్ లో కూడా శిక్షణ పొందారు. ఒక సాధారణ యువతిగా నగరానికి చెందిన ఎన్జీవో ‘మేక్ ఎ డిఫరెన్స్’తో కలిసి పనిచేయడం నన్ను చాలా మార్చింది. నా అంతర్ముఖ వ్యక్తిత్వాన్ని అధిగమించడానికి, విద్యాపరమైన సమానత్వాన్ని అర్ధం చేసుకోవడానికి కూడా ఉపకరించింది. ఆ అనుభవాన్ని ఉపయోగించుకుని ఇక మిస్ ఇండియాగా సమాజానికి నా వంతు బాధ్యత స్వచ్ఛంగా, స్వచ్ఛందంగా నిర్వర్తిస్తాను. -
మంచి చిత్రాలను ఆదరించాలి
‘‘చిత్రం ఎక్స్’ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ఇటువంటి మంచి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా. హీరో రాజ్‌బాల, యూనిట్‌కి ఆల్ ద బెస్ట్’’ అన్నారు శ్రీకాంత్. రాజ్‌బాల, మానస జంటగా రమేష్ వీభూది దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘చిత్రం ఎక్స్’. శ్రీశ్రీశ్రీ చౌడేశ్వరి దేవీ మూవీ క్రియేషన్స్ పతాకంపై పొలం గోవిందయ్య నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ను శ్రీకాంత్ విడుదల చేశారు. రమేష్ వీభూది మాట్లాడుతూ– ‘‘14 సంవత్సరాలు దర్శకత్వ శాఖలో చేశాను. తేజాగారివద్ద సహాయ దర్శకుడిగా చేశా. మా సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది. పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘కరోనా కష్టకాలంలో పెద్ద మనసుతో శ్రీకాంత్‌గారు మా ట్రైలర్‌ని విడుదల చేసి, మమ్మల్ని ఆశీర్వదించడం హ్యాపీ. మా సినిమా అవుట్‌పుట్ చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నాను ’’ అన్నారు పొలం గోవిందయ్య. ‘‘40 రోజులు భయంకరమైన అడవిలో మేం పడ్డ కష్టాన్ని శ్రీకాంత్‌గారి అభినందనలతో మరిచిపోయాం’’ అన్నారు రాజ్‌బాల. ఈ చిత్రానికి సంగీతం: శివప్రణయ్, కెమెరా: ప్రవీణ్. కె. కావలి. -
మానస కేసులో చార్జిషీట్ దాఖలు
వరంగల్ క్రైం: అత్యాచారం, హత్యకు గురైన వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ దీన్‌దయాల్‌నగర్‌కు చెందిన గాదం మానస కేసులో సుబేదారి పోలీసులు గురువారం కోర్టులో చార్జి షీట్ దాఖలు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మం డలం నెమలిగొండకు చెందిన పులి సాయిగౌడ్.. నవంబర్ 27న మానసను ప్రేమ పేరుతో నమ్మించి అత్యాచారం, ఆపై హత్య చేసిన విషయం విదితమే. ఈ ఘటనలో పోలీసులు 24 గంటల్లో నిందితున్ని అరెస్టు చేశారు. అనంతరం వారం పాటు పోలీసు కస్టడీకి తీసుకుని శాస్త్రీయంగా వివరాలను సేకరించారు. మృతు రాలి దుస్తులపై ఉన్న రక్తం, వీర్యం మరకలతో పాటు, పోస్టుమార్టం నివేదిక, డీఎన్ఏ రిపోర్ట్, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు అన్నీ నిందితుడు సాయిగౌడ్ ఆధారాలతో సరిపోయినట్లు పోలీసులు తెలిపారు. కాగా, మానసపై అత్యాచారం, హత్యకు సంబంధించిన ప్రతి ఆధారాన్ని సేకరించామని సుబేదారి ఇన్స్పెక్టర్ సీహెచ్.అజయ్ తెలిపారు. నేరం జరిగిన 30 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేశామని, నిందితుడికి శిక్ష పడేందుకు అవసరమైన ప్రతి విషయాన్ని సేకరించామని పేర్కొన్నారు. -
ఆమరణ నిరాహార దీక్షకు దిగిన మానస తల్లి..
-
మానస కేసు : ఒకరికి ఉద్యోగం, ఇల్లు, తక్షణ న్యాయం..
హన్మకొండ: మానస తల్లి గాదం స్వరూప శనివారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ బాలసముద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ స్మృతి వనం వద్ద 8 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టినా ప్రభుత్వం స్పందించక పోవడంతో స్వరూప 9వ రోజు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. నవంబర్ 27న పుట్టిన రోజు సందర్భంగా గుడికి వెళ్లిన మానస.. అత్యాచారం, హత్యకు గురైన విషయం విదితమే. అనంతరం హైదరాబాద్‌లో దిశ ఘటన చోటుచేసుకుంది. (చదవండి : పరిచయం.. ప్రేమ.. అత్యాచారం.. హత్య ) అయితే.. దిశకు జరిగిన న్యాయం తన కూతురు విషయంలో జరగడం లేదని స్వరూప ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగి 18 రోజులు అవుతున్నా.. ప్రభుత్వం నుంచి స్పందన లేదంటూ సర్కారు తీరుపై ఆమె మండిపడ్డారు. న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. స్వరూపతో పాటు గొల్ల కురుమల నవ నిర్మాణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసరి నగేష్ యాదవ్, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి రుషికేష్వర్ రాజు దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వం హామీతో దీక్ష విరమణ.. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హామీతో మానస తల్లి గాదం స్వరూప దీక్ష విరమించారు. తన కూతురు చావుకు కారణమైన దోషులకు శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్వరూప గత 9 రోజులుగా ప్రొఫెసర్ జయశంకర్ స్మృతి వనం వద్ద దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. దీక్షాస్థలికి చేరుకున్న దాస్యం వినయ్ భాస్కర్ ప్రభుత్వం తరపున పూర్తి భరోసా ప్రకటించారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా తక్షణ న్యాయం జరిగేలా కృషి చేస్తామని చెప్పారు. -
మానసను చిత్రహింసలు పెట్టి ఆపై..
సాక్షి, వరంగల్ : పుట్టిన రోజు నాడే పరిచయం ఉన్న వ్యక్తి చేతిలో అత్యాచారం, హత్యకు గురైన గాదం మానస కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆమె మరణంపై తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరేలా కొత్త విషయాలకు బయటకు వస్తున్నాయి. గత నెల 27న తన పుట్టిన రోజున బయటకు వెళ్లిన మానస అత్యాచారం, హత్యకు గురి కావడం... ఆ వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల్లోనే ఘటనకు బాధ్యుడైన పులి సాయిగౌడ్ అలియాస్ సాయికుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన విషయం విదితమే. పోలీసులు ఈ కేసును హత్యగా పేర్కొన్నప్పటికీ.. రక్తస్రావం వల్ల మానస చనిపోవచ్చన్న ప్రచారం సాగింది. అయితే ముమ్మాటికీ గాదం మానసది అత్యాచారం, హత్యేనని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్లాన్ ప్రకారమే... అత్యాచారానికి ముందు మానసను నిందితుడు సాయికుమార్ తీవ్రంగా చిత్రహింసలకు గురిచేసినట్లు తెలుస్తొంది. నిందితుడు పక్కా ప్రణాళికతోనే బలవంతంగా మానసపై అత్యాచారానికి పాల్పడిన క్రమంలో ఆమె తీవ్రంగా ప్రతిఘటించిందని సమాచారం. ఈ మేరకు చిత్రహింసలకు గురిచేసినట్లు పోస్టుమార్టం సందర్భంగా గుర్తించినట్లు తెలిసింది. నిందితుడిపై మానస తిరుగుబాటు చేసే క్రమంలో ఆమె రెండు చేతులకు తీవ్ర గాయాలయయ్యాయని సమాచారం. అలాగే, తలపై సైతం తీవ్రంగా దాడి చేయగా ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో పాటు తలలో రక్తం సైతం గడ్డ కట్టినట్లు వైద్యులు గుర్తించారని తెలిసింది. నివేదిక కోసం ఎదురుచూపులు మానస అత్యాచారం ఘటనలో వెంటనే స్పందించిన పోలీసులు పులి సాయికుమార్‌ను అరెస్టు చేయగా.. ఈ ఘటనపై మానస ఆమె తల్లిదండ్రులు గాదం స్వరూప, మల్లయ్యలు మాత్రం సాయికుమార్‌తో పాటు ఇంకెవరైనా ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో మానసపై అత్యాచారం అత్యంత అమానవీయంగా జరిగిందని గుర్తించిన వైద్యులు.. ఈక్రమంలో మానసకు తీవ్ర రక్తస్రావం జరిగిందని తేల్చారని తెలిసింది. అలాగే, పూర్తిగా నిర్ధారించుకునేందుకు సెమెన్ శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. అక్కడి నుంచి అందే నివేదిక ఆధారంగా అత్యాచారం ఘటనలో ఒకరు లేదా అంతకు మించి ఉన్నారా అని నిర్ధారించనున్నట్లు తెలుస్తోంది. తద్వారా కేసులో స్పష్టత వస్తుందని అపోహలు తొలగిపోతాయని వైద్యులు పేర్కొంటున్నారు. కాగా, ఈ కేసులో పులి సాయికుమార్ అరెస్టుకు ముందు మానస ‘కాల్ డేటా’ ఆధారంగా ముగ్గురు ఉన్నతాధికారుల డ్రైవర్లు, అటెండర్లను కూడా పోలీసులు విచారించినట్లు తెలిసింది. అయితే, ఫోన్ చేస్తే ఆ ఆ అధికారుల ఇళ్లకు కూరగాయలు పంపే క్రమంలో... మానస ఫోన్లో కాల్స్ ఉండడంతో అనుమానించిన పోలీసులు ఈ కోణంలోనూ విచారణ జరిపినట్లు తెలిసింది. కాగా ఈ కేసులో త్వరలోనే మరిన్ని కీలకాంశాలు వెలుగుచూసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. చదవండి: పరిచయం.. ప్రేమ.. అత్యాచారం.. హత్య