
సాక్షి, ఆలేరు : ఆలేరులో దారుణం చోటుచేసుకుంది. నవ వధువు మానస(21) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యాదాద్రి జిల్లా ఆలేరులోని కొల్లూరు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. నెల రోజుల కిందట హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లికి చెందిన అబ్బాయితో మానసకు వివాహమైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో మంగళవారం ఇంటికి వచ్చి ఉరివేసుకుని ఆత్మ చేసుకున్నట్టు తెలుస్తోంది. కట్నం విషయంలోనే ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment