aleru
-
నాకున్న ఇబ్బంది ఒక్కటే !..రేపు కేసీఆర్ గారినే నేరుగా అడుగుతా
-
జాతీయ స్థాయిలో ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ఆలేరు
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పోలీస్ స్టేషన్ 2021 సంవత్సరానికి జాతీయ స్థాయిలో ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ఎంపికైంది. దేశవ్యాప్తంగా కేంద్ర హోం శాఖ ఎంపిక చేసిన 10 పోలీస్ స్టేషన్లలో ఆలేరు నిలిచింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కేంద్ర హోం కార్యదర్శి సంతకాలతో కూడిన ప్రశంసా పత్రాన్ని గురువారం ఆలేరు పోలీసులకు పంపించారు. గ్రామీణ ప్రాంత పోలీస్‌స్టేషన్ కేటగిరీలో ఆలేరు పీఎస్ ఈ అవార్డుకు ఎంపికైంది. పోలీస్ స్టేషన్ పనితీరు, మహిళల రక్షణకు, నేరాల అదుపునకు తీసుకుంటున్న చర్యలు, ఫ్రెండ్లీ పోలీసింగ్ తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ఎస్ఐ ఇద్రీస్ అలీతోపాటు సిబ్బందిని అభినందించింది. జాతీయ స్థాయిలో అవార్డు రావడంపై రాచకొండ పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఆలేరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
సాక్షి, యాదాద్రి: ఆలేరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను హైవేపై పనిచేసే దినసరి కూలీలుగా గుర్తించారు. అంకర్ల లక్ష్మి, ఊరేళ్ల శ్యామ్ ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. అంకర్ల కవిత, ఊరేళ్ల లావణ్య తీవ్రంగా గాయపడటంతో ఆలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరంతా భువనగిరి మండలం రాయగిరికి చెందిన వారిగా గుర్తించారు. -
మంచినీళ్ల కోసమని వచ్చి..
సాక్షి, ఆలేరు : దుండగులు పట్టపగలే తెగబడ్డారు. ఓ మహిళను దారుణంగా హత్య చేసి బంగారు ఆభరణాలను దోపిడీ చేశారు. ఈ ఘటన ఆలేరులో శనివారం సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలానికి చెందిన నీలం నీలమ్మ(55) తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆలేరులోని క్రాంతినగర్ 4వ కాలనీలో నివాసం ఉంటోంది. నీలమ్మ ఇంల్లోనే ఉంటుండగా కూ తురు అంజుల అదే కాలనీలో ఒకరి వద్ద కుట్టు మిషన్ నేర్చుకుంటుంది. కాగా మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మంచినీళ్లు ఇవ్వమని లోనికి ప్రవేశించారు. ఆమె గొంతు నులిమి మె డలోని బంగారు గొలుసు, చెవి కమ్మలు అపహరించుకుపోయారు. కొద్ది సేపటి తర్వాత కూతు రు అంజుల ఇంటికి విషయం వెలుగులోకి వ చ్చింది. సమాచారం మేరకు 108 సిబ్బంది ఘటనాస్థలిని పరిశీలించగా అప్పటికే నీలమ్మ మృతిచెందినట్టుగా ధ్రువీకరించారు. ఆలేరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని పరీశీలించారు. దొంగల పనిగా అనుమానిస్తూ జాగిలాలను రప్పించారు. అయి తే జాగిలాలు కాలనీ నుంచి బహద్దూర్‌పేట రో డ్డు వరకు వెళ్లి నిలిచిపోయాయి. యాదగిరిగుట్ట సీఐ నర్సయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గొలనుకొండలో తీవ్ర ఉద్రిక్తత.. దారుణ హత్య
-
భార్య ఎదుటే భర్త హత్య.. ఇంటిని తగలబెట్టి
సాక్షి, యాదాద్రి భువనగిరి: ఆలేరు మండలం గొలనుకొండలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి చెందిన కన్రెడ్డి వెంకట్‌రెడ్డి(38) దారుణ హత్యను నిరసిస్తూ గ్రామస్థులు, మృతుడి బంధువులు పరుశరాములు అనే వ్యక్తి ఇంటిని తగులబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలేం జరిగిందంటే... గొలనుకొండ గ్రామానికి చెందిన కన్రెడ్డి వెంకటరెడ్డి... భార్య భాగ్యతో కలిసి సోమవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై జనగామకు వెళ్లాడు. తిరిగి సాయంత్రం సిరిపురం రోడ్డు గుండా స్వగ్రామానికి వస్తున్న క్రమంలో గుర్తుతెలియని దుండగులు వెంకటరెడ్డి వాహనాన్ని అటకాయించారు. దీంతో అతడు బైక్ దిగి పరుగులు తీయగా.. దుండగులు వెంబడించి కత్తితో పాశవికంగా అతడిని హత్య చేశారు. తన భర్తను చంపవద్దని భాగ్య ఎంతగా వేడుకున్నా కనికరించకుండా ఆమెపై కూడా దాడికి తెగబడటంతో స్వల్పగాయాలపాలైంది. ఈ నేపథ్యంలో గ్రామానికి చేరుకున్న భాగ్య... తమ గ్రామానికే చెందిన పరుశరాములు అనే వ్యక్తి తన భర్త వెంకటరెడ్డిని హతమార్చినట్లు గుర్తించింది. తన కళ్ల ముందే భర్తను పరశురాములు దారుణంగా కత్తితో చంపాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు, వెంకటరెడ్డి బంధువులు పరశురాములు ఇంటిని తగులబెట్టారు. ఘటనతో బెంబేలెత్తిన పరుశరాములు కుటుంబ సభ్యులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ క్రమంలో గొలనుకొండలో భారీగా పోలీసులను మోహరించారు. కాగా మృతుడు వెంకటరెడ్డికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు ఫంక్షన్ నిమిత్తం వస్త్రాలు కొనుగోలు చేసేందుకు వెళ్లి వస్తుండగా అతడి హత్య జరిగింది. -
జీవితాలకు పొ(సె)గ
సాక్షి, ఆలేరు : ‘పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్’ అని కన్యాశుల్కంలో గిరీశం అన్న మాటలను వల్లె వేస్తూ పొగబాబులు ఈ వ్యసనాన్ని వదల్లేక పోతున్నారు. సరదాగా మొదలయ్యే ధూమపానం జేబుతోపాటు ఊపిరితిత్తులకు చిల్లు వేస్తుంది. ఈ విషయం తెలిసే ధూమపానాన్ని అనేకమంది వదలడం లేదు. పొగాకు, ధూమపానం కారణంగా ప్రపంచంలో ప్రతి 6.5 సెకండ్లకు ఒకరు మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. అయితే చిన్నవయస్సులోనే సిగరేట్ తాగటం మొదలుపెట్టినవారు సాధారణ ఆరోగ్యవంతుల కన్నా వీరు 20–25 సంవత్సరాల ముందే చనిపోతున్నారని వెల్లడైంది. పొగాకులో నికోటిన్ అనే మత్తు పదార్థం ఉంటుంది. బహిరంగ ధూమపానం ఇతరులకు కూడా హాని కలిగిస్తుంది. వచ్చే జబ్బులు ధూమపానం ప్రమాదకరమైంది. ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. ఆయు ప్రమాణాలను తగ్గిస్తుంది. కళ్లు, ముక్కు, గొంతు మీద ప్రభావం కలిగిస్తుంది. ఊపిరితిత్తులకు సహజసిద్ధంగా శుభ్రపరిచే సామర్ధ్యం ఉంటుంది. పొగతాగడంతో శ్వాస స్థాయి పెరిగి ఊపిరితిత్తుల కణాలకు రసాయన హనీ కలుగుతుంది. దగ్గు, కఫం సమస్యలు మొదలవుతాయి. శ్వాసకోస వ్యాధులు వస్తాయి. శ్వాసనాళం మందంగా మారి క్యాన్సర్‌కు దారి తీస్తుంది. సోరియాసిస్ వ్యాధి కూడా వస్తుంది. శుక్లాలు కూడా వచ్చే అవకాశం ఉంది. దంతాలు రంగు మారడమే కాదు దెబ్బతింటాయి. చిగుళ్ల వ్యాధులు కూడా వస్తాయి. గుండె జబ్బులు, పక్షవాతం, పొట్టలో అల్సర్లు వస్తాయి. సంతాన, అంగస్తంభన సమస్యలు, వీర్యంలోని శుక్రకణాల స్వరూపం మారిపోతుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు తక్కువవుతాయి. అలాగే పొగతాగే స్త్రీలలో గర్భధారణ సమస్యలు, గర్భస్రావాల సమస్యలు తలెత్తుతాయి. రక్తపోటు మీద ప్రభావం. సిగరెట్ కాల్చే ప్రతిసారి 15శాతం రక్తపోటు అమాంతం పెరుగుతుంది. చర్మంలో రక్తకణాలు బిగుసుకుపోతాయి. పొగతాగితే నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఫ్యాషన్‌గా భావిస్తున్న యువత సిగరెట్ తాగడాన్ని యువత ఫ్యాషన్‌గా భావిస్తుంది. ఇంటర్ నుంచే అబ్బాయిలు సిగరెట్ అలవాటు చేసుకుంటున్నారు. అలవాటు లేకపోయిన తోటి స్నేహితుల ప్రోత్సాహంతో సిగరెట్లు తాగుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో నిషేధం బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని ప్రభుత్వం నిషేధించింది. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే రూ. 1000వరకు జరిమానా విధించవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ క్యార్యాలయాలు, బీజినెస్ సెంటర్లు, హోటళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, సినిమా థియేటర్లలో పొగతాగడాన్ని కేంద్ర ప్రభుత్వం 2008 సంవత్సరం అక్టోబర్ 8న నిషేధించింది. ధూమపానం చేస్తే జరిమానా విధించేందుకు పలువురు అధికారులకు అధికారం కల్పించారు. పొగ నిషేధ చిహ్నం ఉమ్మడి జిల్లాలో 1300 కిల్లీ షాపులు ఉమ్మడి జిల్లాలో 1300పైగా కిల్లీ షాపులు నడుస్తున్నాయి. నిత్యం ఈ షాపుల్లో రూ. 5.50లక్షల బీడీలు, సిగరెట్లు అ మ్ముడుపోతున్నాయని తెలిసిం ది. అలాగే జిల్లాలో హుక్కా పీల్చేవారి సంఖ్య కూడా లక్షకుపైగా ఉన్నట్టు తెలుస్తుంది. పేరుకే కమిటీలు బహిరంగ ప్రదేశాల్లో «ధూమపాన నిషేధాన్ని అమలు చేసేందుకు జిల్లా స్థాయిలో కమిటీ ఉంది. ప్రతి నెలలో కమిటీ సమావేశమై చట్టం అమలును సమీక్షించాలి. జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా, డీఎంహెచ్ఓ కన్వీనర్‌గా, అగ్నిమాపక అధికారి, పోలీస్, రవాణా, పురపాలక సంఘం, ఉన్నత పాఠశాల, రెవెన్యూ, విద్య, డ్రగ్ ఇన్స్పెక్టర్, ఫుడ్ ఇన్స్పెక్టర్, డీసీహెచ్ఎస్ కోఆర్డినేటర్లు సభ్యులుగా ఉం టారు. మొత్తం 12మంది ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఉందని చాలా మందికి తెలియదు. దాంతో కమిటీ నామమాత్రంగా మారింది. కుటుంబ సభ్యులకు హానికరమే.. సిగరెట్ తాగేవారితో పాటు కుటుంబ సభ్యులకు కూడా హానికరమే. పిల్లల వద్ద తాగితే సున్నితంగా ఉండే వారి ఊపిరితిత్తులకు మరింత ప్రమాదకరం. పొగతాగితే అనారోగ్యానికి గురవుతారు. 40 రకాల క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. ధూమపానం చేస్తే ఆయు ప్రమాణం తగ్గుతుంది. – డా. కె ప్రభాకర్, ఆలేరు -
వివాహమైన నెల రోజులకే..
సాక్షి, ఆలేరు : ఆలేరులో దారుణం చోటుచేసుకుంది. నవ వధువు మానస(21) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యాదాద్రి జిల్లా ఆలేరులోని కొల్లూరు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. నెల రోజుల కిందట హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లికి చెందిన అబ్బాయితో మానసకు వివాహమైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో మంగళవారం ఇంటికి వచ్చి ఉరివేసుకుని ఆత్మ చేసుకున్నట్టు తెలుస్తోంది. కట్నం విషయంలోనే ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులు ఆరోపిస్తున్నారు. -
ఎస్ఎంఎస్లను స్మార్ట్‌గా దాచుకోండి..
సాక్షి, యాదగిరిగుట్ట (ఆలేరు) : మొబైల్ మన వెంట ఉంటే ప్రపంచం అంతా మన చేతుల్లోనే ఉంటుంది. స్మార్ట్ ఫోన్లు వచ్చాక చాలా పనులు దానితోనే కానిచ్చేస్తున్నారు. వివిధ పనుల షెడ్యూల్, రిమైండర్, అనుకున్న సమయానికి మెసేజ్ వెళ్లేలా సెట్ చేసుకోవడం, టైం చూసుకోవడం, అలారం ఇలా ఒకటేమిటీ చాలా రకాల పనులను ఇట్టే చేసుకునే వీలు కలిగింది. అలాగే మనకు ప్రతి రోజు ఎస్ఎంఎస్లు వస్తుంటాయి. ఇందులో ముఖ్యమైనవి ఉంటాయి. వాటిని దాచుకోవడానికి, అనుకోకుండా మనకు కావాల్సి ఎస్ఎంఎస్లు డిలీట్ అయితే వాటిని తిరిగి బ్యాకప్ చేసుకోవడం వంటివి చాలా మందికి తెలియక ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని ప్రత్యేకమైన యాప్‌ల ద్వారా డెలిట్ అయిన మన ఫోన్ నంబర్లు, ఎస్ఎంఎస్లను తిరిగి పొందవచ్చు. కాంటాక్టు నంబర్లు, ఎస్ఎంఎస్, ముఖ్యమైన సమాచారం గుట్టుగా భద్రపరుకోవడం కోసం గూగుల్ ప్లేస్టోర్‌లో వందలాది అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మంచి రేటింగ్ ఉన్న యాప్‌ల గురించి తెలుసుకుందాం... ఎస్ఎంఎస్ల బ్యాకప్ ఇలా... సాధారణంగా మనకు రోజుకు ఎన్నో టెక్ట్స్స్ మెసేజ్‌లు వస్తుంటాయి. వాటిని రహస్యంగా స్టోర్ చేసి పెట్టుకోవాలనుకున్నా..ఫోన్ దెబ్బతిన్న సందర్భాల్లో అవసరమైన మెసెజ్‌లు పోగొట్టుకోకుండా ఉండాలన్నా తోడ్పడే కొన్ని యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో కొన్ని క్లౌడ్ స్టోరేజీలో, ఫోన్, మెమోరీ కార్డుల్లో ఎస్ఎంఎస్ డాటా స్టోర్ చేసుకునే అవకాశం ఉంది. మరికొన్నింటిలో అయితే నిర్ణిత సమయంలో మన ఎస్ఎంఎస్లను మన ఈ మెయిల్‌ను పంపిస్తాయి.మెయిల్ ఓపెన్ చేసుకుని వాటిని చూసుకోవచ్చు.రోజు,రెండు రోజులకోసారి,వారానికి ఒకసారి ఎలాగైనా మన బ్యాకప్ సెట్ చేసుకోవచ్చు. కొన్ని ఎస్ఎంఎస్ బ్యాకప్‌లలో కాల్ వివరాలు బ్యాకప్ తీసుకునే అవకాశం ఉంది. రేటింగ్ యాప్‌లు... ఎస్ఎంఎస్ బ్యాకప్ ప్లేస్, ఎస్ఎంఎస్ బ్యాకప్ రీస్టోర్, సీఎం బ్యాకప్, ఈజీ బ్యాకప్ అండ్ రీస్టీర్, సూపర్ బ్యాకప్, ఎస్ఎంఎస్ అండ్ కాల్ లాగ్ బ్యాకప్ మొదలైన యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ ఎస్ఎంఎస్ బాక్స్ యాప్... ఇందులో బ్యాకప్‌తో పాటు మరో అద్బుతమైన ఫీచర్ ఉంది. దీనిలో ఏవైనా కొన్ని కాంటాక్ట్‌లు జత చేసుకోవచ్చు. దానితో ఆ కాంటాక్ట్ నెంబర్ల నుంచి ఎస్ఎంఎస్లు ఫోన్ ఇన్‌బాక్స్‌లో కనిపించవు. వేరుగా ప్రైవేట్ ఎస్ఎంఎస్ బాక్స్ యాప్ ఓపెన్ చేసుకుని అందులో చూడవచ్చు. ఈ యాప్‌కు పాస్వర్డ్ కూడా పెట్టుకోవచ్చు. ఎస్ఎంఎస్ టూ టెక్టస్ యాప్... దీనిలో మరో అదనపు సౌకర్యం ఉంది. ఈ యాప్ ద్వారా మన ఇన్‌బాక్స్‌లోని ఎస్ఎంఎస్లు అన్నింటినీ టెక్టŠస్ ఫైల్ రూపంలో పొందవచ్చు. అంటే ఆ ఫైల్ మరో ఫోన్లో అయినా కంప్యూటర్లో అయినా ఓపెన్ చేసి చూసుకోవచ్చు.కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు. వందల రకాల యాప్‌లు గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. మన అవసరానికి అనుగుణంగా ఉండే యాప్‌లను డౌన్లోడ్ చేసుకుంటే మంచింది. -
పొంచి ఉన్న ప్రాణాంతక నిమోనియా ..
సాక్షి, ఆలేరు : చలిగాలుల తీవ్రత అధికమౌతుంది. దీంతో చిన్నారులతో సహా పెద్దలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సూర్యుడు అస్తమయం కాకుండానే చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. వాతావరణంలో వస్తున్న ఈ మార్పులు చర్మ సంబంధ వ్యాధులను కలగచేస్తాయి. అరికాళ్లు, పెదవులు పగలడం, చర్మం తెల్లగా పొడిబారినట్టుగా మారిన లక్షణాలు కనిపిస్తాయి. పొంచి ఉన్న నిమోనియా .. శీతాకాలంలో చిన్నారులకు ప్రాణాంతకమైన నిమోనియా వ్యాధి పొంచి ఉంది. వాతావరణంలో మార్పుల కారణంగా చిన్నారుల పాలిట ఈ వ్యాధి ప్రమాదకరంగా మారింది. మండలంలో ఇటీవల న్యుమోనియా కేసులు అక్కడ క్కడా నమోదవుతున్నాయి. ఇటీవల మండల పరిధిలో అనేక మంది చిన్నారులకు జలుబు, జ్వరం వచ్చి ఆస్పత్రిపాలు అయ్యారు. వైరస్ లేదా, బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. రోగ నిరోధక శక్తి, తక్కువగా ఉండే చిన్నారులను ఈ వ్యాధి వెంటాడుతుంది. మొదట జలుబుతో మొదలై దగ్గుతో చివరకు నిమోనియాగా మారుతుంది. న్యూమోనియా తీవ్రత పెరిగితే అస్తమా, ఫిడ్స్‌కు గురవుతారు. సూక్ష్మజీవుల ద్వారా 5 సంవత్సరాలలోపు ఉండే పిల్లలకు ఇన్ఫెక్షన్ సోకే అవకాశముంది. పిల్లలకు తీవ్ర జ్వరం, శ్వాస ఆడకపోవడం, దగ్గు, డొక్కలు ఎగరవేయడం, పెదాలు, చేతులు నీలం రంగులోకి మారడం తదితర వంటివి నిమోనియా లక్షణాలు. తేమశాతం తగ్గడం, పెరగడం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్లు వస్తాయి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆహార నియమాలు పాటించకపోవడం కూడా నిమోనియా బారిన పడే అవకాశముందని వైద్యులు చెపుతున్నారు. అందుబాటులోకి పెంటావాలెంట్ వ్యాక్సిన్: చిన్నారుల ప్రాణాంతక నిమోనియా బారిన పడకుండా పెంటావాలెంట్ టీకాను అందుబాటులోకి తీసుకొచ్చారు. నిమోనియా కారణంగా ప్రపంచంలో ఇప్పటి వరకు 3.70 లక్షల మంది చిన్నారులు మరణించారని 2009లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్థారించింది. అప్పటి నుంచి వ్యాధి తీవ్రతను గుర్తించి దశల వారీగా అన్ని ప్రాంతాలకు ఈ టీకాలు సరఫరా చేస్తున్నారు. పెంటావాలెంట్ టీకాతో హిమోíఫిలస్ ఇన్‌ఫ్లూయెంజా టైప్ బీ (íß బ్) బ్యాక్టీరియా వలన కలిగే నిమోనియా పూర్తిగా తగ్గిస్తుంది. జాగ్రత్తలు తప్పనిసరి .. పిల్లలు బయట తిరగకుండా చూసుకోవాలి. కాలుష్యం, అపరిశుభ్రత, ఆహార కాలుష్యం, పౌష్టికాహారలోపం లేకుండా చూసుకోవాలి, నిద్ర సమయంలో గురక, ఎక్కువగా చాతి కదలడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. చల్లటి పదార్థాలు, చల్లటి నీరు తాగించవద్దు. చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు అజాగ్రత్త వహించవద్దు. గోరువెచ్చటి నీటిని చిన్నారులకు తాగించాలి ఒకటి రెండు రోజుల్లో జలుబు, దగ్గు తగ్గకుంటే చిన్న పిల్లల వైద్యులను సంప్రదించాలి. -
మోత్కుపల్లికి తీవ్ర అస్వస్థత
సాక్షి, ఆలేరు: టీడీపీ మాజీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. గత అర్ధరాత్రి ఆయనకు వాంతులు, ఛాతినొప్పి రావడంతో హుటాహుటినా భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ సుప్రజ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అంబులెన్స్ రాకపోవడంతో సొంత వాహనంలో ఆయనను ఆస్పత్రికి తరలించారు. తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గం నుంచి బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. మోత్కుపల్లి అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు తనకు చేసిన అన్యాయాన్ని తట్టుకోలేక ఇటీవల టీడీపీ నుంచి మోత్కుపల్లి బయటకు వచ్చారు. పలు సందర్భాల్లో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. చంద్రబాబు మోసకారి, దుర్మార్గుడు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు తన దొంగతనాలను బయటపెడతాననే తనపై కక్ష కట్టారని, తనకు హాని తలపెట్టే అవకాశం ఉందని ఆరోపించారు. చంద్రబాబు ఇప్పటికైనా తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
కేసీఆర్‌కు ఓటమి భయం
సాక్షి, ఆలేరు : సీఎం కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని, ఇక ఫాంహౌస్‌కే పరిమితం కావాలని ఆలేరు కాంగ్రెస్ అభ్యర్థి బూడిద భిక్షమయ్యగౌడ్ విమర్శించారు. మండలంలోని రాఘవాపురం, గుండ్లగూడెం, శ్రీనివాసపురం, కందిగడ్డతండా, శివలాల్‌తండా, కొల్లూరు తదితర గ్రామాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఆకాంక్షలతో సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి మాటతప్పిన కేసీఆర్‌ను ఓడించి బుద్ధి చెప్పాలన్నారు. యువత, నిరుద్యోగులకు ఉపాధి కల్పించలేక, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరలు పెంచి రైతులతో పాటు సామాన్యుడి జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. అలాగే మిషన్‌భగీరథ, సాగునీటి ప్రాజెక్టులలో దోచుకున్న అవినీతి సొమ్ముతో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్‌ను గద్దె దించాలని కోరారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శాశ్వత ప్రాతిపాదికన చేపట్టేందుకు తనను గెలిపించాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ మేని ఫెస్టోను రూపొందించిందన్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో భిక్షమయ్యకు స్వాగతం పలికారు. కందిగడ్డతండాలో పలువురు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీ జనగాం ఉపేందర్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, నీలం పద్మ, దూసరి విజయ, దూసరి ఆంజనేయులు, పుట్ట మల్లేషం, సందుల సురేశ్, ముదిగొండ శ్రీకాంత్, జూకంటి ఉప్పలయ్య, జంపాల దశరథ, శ్రీను, హరిలాల్, కృష్ణ, రవి, మోతిలాల్, వెంకటేశ్, ప్రేం రాజు, భీంరాజు, రాజు, లక్ష్మీ, విజయ, అనిత, శాంతి, సుగుణ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలు.. ఎన్నో విశేషాలు..
సాక్షి, ఆలేరు : భారత ఎన్నికల సంఘం కాలక్రమేణ ఎన్నో సంస్కరణలు చేపట్టింది. ఎన్నికల సంఘం స్వంతంత్ర రాజ్యంగ వ్యవస్థ. నిర్ణయాలు స్వతంద్రంగా తీసుకుంటుంది. దేశ వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించే సమయంలో సుమారు 50లక్షల మంది ఉద్యోగుల సేవలను వినియోగించుకుంటోందని ఓ అంచనా. దేశంలో మొదటి సాధారణ ఎన్నికలు హిమాచల్‌ప్రదేశ్‌లోని ‘చిని’లో నిర్వహించారు దేశంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 17.30కోట్లు అని నివేదికలు తెలుపుతున్నాయి 1993లో జరిగిన 13వ సాధారణ ఎన్నికల్లో మొదటిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వినియోగించారు. గతంలో ఓటు హక్కుకు కనీస వయస్సు 21 సంవత్సరాలు కాగా 61వ రాజ్యాంగ సవరణలో18 సంవత్సరాలకు కుదించారు ఎన్నికల నిర్వహణలో సమూల సంస్కరణలు ప్రవేశపెట్టిన సమర్థుడిగా పదో ఎన్నికల సంఘం కమిషనర్‌గా టీఎన్ శేషన్ గుర్తింపు పొందారు. 1952లో 55పార్టీలు ఎన్నికల్లో పాల్గొనగా 2014 నాటికి ఆ సంఖ్య 370కి చేరింది. దేశంలో ఎంపీలుగా గెలిచిన వారిలో 30శాతం మందిపై పలు కేసులు నమోదయ్యాయని బీబీసీ నివేదిక పేర్కొంది. -
బూడిద భిక్షమయ్య గౌడ్ - లీడర్‌తో
-
'అభ్యర్థిని మార్చండి లేకపోతే ఓడిపోతాం'
సాక్షి, ఆలేరు (యాదాద్రి భువనగిరి జిల్లా) : ఆలేరు నియెజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిని మార్చాలంటూ ఆ పార్టీ సీనియర్ నాయకులు ఆధిష్టానాన్ని డిమాండ్ చేశారు. తాజా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని మార్చకుంటే ఓడిపోవడం ఖాయమని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆధిష్టానానికి చెప్పేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 'సునీత నిజమైన తెలంగాణ వాదులను అవమానించారు. ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యమకారులను పట్టించుకోలేదు. సునీత చేసిన అవినీతి, అక్రమాలు, ఆమె భర్త మహేందర్ రెడ్డి చేసిన గూండాయిజం, దాడులు, బెదిరింపులు వంటి చర్యలతో నియోజకవర్గ ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ప్రభుత్వపథకాలను సరైన రీతిలో అమలు చేయలేకపోయారు. దీని వల్ల నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా పూర్తిచేయలేకపోయారు. అధికారంలో ఉండి ఒక్క ఎకరానికైనా అదనంగా నీరు ఇవ్వలేకపోయారు. సునీతను మార్చాలని పార్టీలో అన్ని స్థాయిల వారు పోరాడుతున్నారు, సునీత అభ్యర్థిత్వాన్ని మార్చకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాము' అని సమావేశంలో సీనియర్ నాయకులు తెలిపారు. గౌరాయ పల్లిలో టీఆర్ఎస్ కార్యకర్త గొట్టం కృష్ణా రెడ్డిపై గొంగిడి మహేందర్ రెడ్డి, అతని అనుచరుల దాడిని ఖండిస్తున్నామన్నారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి,కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆలేరు నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ సుంకరి శెట్టయ్య, యాదగిరిగుట్ట మాజీ జెడ్పీటీసీ కొంతం మోహన్ రెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ వంచ వీరా రెడ్డి, గతంలో సునీత ఎన్నికల ఇన్ ఛార్జ్ బోళ్ల కొండల్ రెడ్డి,వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి, బొమ్మల రామరాం మాజీ ఎంపీపీ మంద సంజీవరెడ్డి, ఎంపీటీసీ, గుండాల ఉప్పలయ్య, వైస్ ఎంపీపీ రాజపేట రేణుక, గట్టు నరేందర్, బోరెడ్డి ఉపేందర్ రెడ్డి, కల్లూరి మనోహర్ రెడ్డి, పలుగుల శ్రీనివాస్, రాజమల్లయ్య, సింగిరెడ్డి నరోత్తం రెడ్డి, అంబల మల్లేశంలతోపాటూ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, వివిధ మండల నాయకులు పాల్గొన్నారు. -
రాజకీయంగా వాడుకుంటే 10సీట్లు గెలిపించే వాడ్ని
యాదగిరిగుట్ట : తనను రాజకీయంగా అణచివేయడానికి చంద్రబాబు నాయుడు కుట్ర చేశాడని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. తాను ఏనాడు రాజ్యసభ, గవర్నర్ పదవులు అడగలేదని, ఆశపెట్టి మోసం చేసిండని మండిపడ్డారు. యాదగిరిగుట్టలో గురువారం జరిగిన ‘మోత్కుపల్లి శంఖారావ’ బహిరంగసభలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడారు. ప్రజల కోసమే జీవితమంతా బతుకుతానని, ఓ దుర్మార్గుడు, ఓ పాపత్ముడు, ఓ నీచుడిని నమ్మి మోసపోయానని చంద్రబాబునాయుడిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాను రాజకీయాలపై, పేద ప్రజల పక్షాన మాట్లాడడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. ఓ మిత్రుడా.. కేసీఆర్... ఓ మిత్రుడా కేసీఆర్ నన్ను రాజకీయంగా వాడుకుని ఉంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 సీట్లకు గానూ 10 అసెంబ్లీ సీట్లు గెలిపించి, పువ్వుల్లో పెట్టి ఇచ్చే వాడినని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాలు తప్ప మిగతావి ఏవీ గెలవవని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. ఆలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఇక్కడి ప్రజలు ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే.. ఒక ఎమ్మెల్యే 2వందల ఎకరాల భూమి, మరొకరు 5వందల ఎకరాల భూమిని కోనుగోలు చేశారన్నారు. నేను ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న కానీ ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేదన్నారు. గతంలో ఆలేరులో ఎమ్మెల్యేగా ఉన్న బూడిద భిక్షమయ్యగౌడ్, తాజా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితను గెలిపించింది తనేనని మోత్కుపల్లి పేర్కొన్నారు. ఇవే నా చివరి ఎన్నికలు... నా వయస్సు 65 సంవత్సరాలు.. ఇవే నా చివరి ఎన్నికలు.. ఈ ఒక్క సారి ఆశీర్వదించండని ఉద్వేగంగా మోత్కుపల్లి విజ్ఞప్తి చేశారు. ఆలేరు ప్రజలు అసెంబ్లీకి పంపిస్తే నియోజకవర్గానికి సాగు జలాలు తీసుకుచచ్చే విధంగా కృషి చేస్తానన్నారు. సిద్దిపేటకు తరలుతున్న తప్పాసుపల్లి జలాలను రాజపేట, ఆలేరు ప్రాంతాలకు తీసుకువస్తానని, గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లను పూర్తి చేస్తానన్నారు. అంతే కాకుండా జిల్లాల విభజనలో జనగాంలో కలిసిన గుండాల మండలాన్ని తిరిగి యాదాద్రి జిల్లాలో కలిపే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ బహిరంగ సభలో ఎక్కడ కూడా కేసీఆర్‌ను విమర్శించకపోవడంతో స్థానికంగా చర్చ జరిగింది. కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి వెంకన్న, యాదగిరిగుట్ట మాజీ సర్పంచ్ కైరంకొండ శ్రీదేవి, దడిగె ఇస్తారి, గజం ఉప్పలయ్య, పాపయ్య, చంద్రారెడ్డి, కే.ఆంజనేయులు, అమరేందర్‌రెడ్డి, గుంటి మధుసూదన్‌రెడ్డి, శ్రీరామూర్తి, దానయ్య, వెంకట్‌రెడ్డి, మచ్చ లక్ష్మీనారాయణ, ప్రజా చైతన్య వారధి పాపట్ల నరహరి తదితరులున్నారు. -
మోత్కుపల్లి శంఖారావం.. ఇండిపెండెంట్‌గా పోటీ
సాక్షి, యదాద్రి : టీడీపీ బహిష్కిృత నేత మోత్కుపల్లి నరసింహులు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలువనున్నారు. తన సొంత నియోజకవర్గమైన ఆలేరు స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్లు మోత్కుపల్లి ప్రకటించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఆలేరు ప్రజల అభీష్టం మేరకు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఆలేరు నియోజకవర్గానికి గోదావరి జలాలను తీసుకురావడమే తన లక్ష్యమని ఆయన ప్రకటించారు. తన జీవితానికి ఇవే చివరి ఎన్నికలని ఆయన తేల్చిచెప్పారు. ఈ మేరకు రేపు యాదగిరిగుట్టలో ‘‘మోత్కుపల్లి శంఖరావం’’ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభ ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. సభ ఏర్పాట్లను తన మద్దతుదారులతో కలిసి బుధవారం పరిశీలించారు. కాగా టీడీపీలో సీనియర్‌నేతగా, మంత్రిగా వ్యవహిరించిన మోత్కుపల్లి చంద్రబాబు వ్యవహారంతో విభేదించి ఆయనపై ఇటీవల తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. టీడీపీకి రాజీనామా అనంతరం వివిధ పార్టీల్లో ఆయన చేరుతారని వార్తలు వచ్చినప్పటికీ ఆయన వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ మధ్య జనసేనాలో చేరుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని మధిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన మోత్కుపల్లి కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్క చేతిలో ఓటమి పాలైయ్యారు. టీడీపీ కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న సమయంలో కేంద్రంలో చంద్రబాబు సహాకారంతో ఏదోఒక పదవి వస్తుందని ఆశించిన మోత్కుపల్లి... చివరికి చంద్రబాబు హ్యాండ్ ఇవ్వడంతో తీవ్ర మనస్థాపం చెందారు. -
కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ
ఆలేరు : ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. మండలంలోని శ్రీనివాసపురంలో ఆదివారం ఆమె సమక్షంలో పలువురు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, ఎంపీపీ కాసగళ్ల అనసూయ, ఎంపీటీసీ పిక్క శ్రీనివాస్, పరుశురాములు, ఎల్లయ్య, మహేశ్, భాస్కర్ పాల్గొన్నారు. బొమ్మలరామారంలో.. బొమ్మలరామారం : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని రాంలింగంపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి సమక్షంలో ఆమె నివాసంలో 300 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలబెడతానన్నారు. మాజీ ఎంపీటీసీ యంజాల సత్యనారాయణ, ఎంపీపీ తిరుపతిరెడ్డి, సల్ల రవి పాల్గొన్నారు. పాఠశాలను పరిశీలించిన ప్రభుత్వ విప్ రాజాపేట : మండలంలోని రేణికుంట గ్రామంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆదివారం ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న గదుల సంఖ్యను తెలు సుకున్నారు. రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేయడం కోసం స్కూల్‌ను పరిశీలించినట్లు తెలి పారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు కోరె లలిత, మండల ప్రధాన కార్యదర్శి కోరుకొప్పుల వెంకటేశ్‌గౌడ్, నాయకులు చింతలాపురి వెంకట్రాంరెడ్డి, బోళ్ల రాఘవరెడ్డి, బుచ్చిరెడ్డి, మల్లయ్య, మాతయ్య, చామకూరు గోపాల్‌గౌడ్, లక్ష్మణ్‌గౌడ్, దాచపల్లి శ్రీను పాల్గొన్నారు. -
అందరికి ఆదర్శం ఈ సేవ...
ఆలేరు: రోడ్డుపై అనాథగా పడి ఉన్న వారికి కనీస సాయం అందించే ఆశయం ఎంతో ఉన్నతమైనది. సమాజానికి కొంతైనా సేవా చేయాలన్న సంకల్పం కొందరిలోనే ఉంటుంది. అలాంటి కోవలోకే వస్తారు ఆలేరుకు చెందిన జెల్ల శంకర్, దివ్య దంపతులు. వీరి అనాథలను ఆదుకునేందుకు 2016 జూన్ 19న అమ్మఒడి ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. శంకర్ చిన్నపాటి వ్యాపారం చేస్తుంటాడు. ఇతడి భార్య ఓ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. వీరికి వచ్చే ఆదాయం కొద్ది మాత్రమే అయినా ఎంతో ఉన్నత ఆశయంతో అమ్మ ఒడి అనాథాశ్రమాన్ని నెలకొల్పి ఎంతో మందికి సేవలు అందిస్తున్నారు. మతిస్థిమితం లేకుండా రోడ్లపై తిరుగుతున్న వారిని, అన్నీ కోల్పోయిన అభాగ్యులను అక్కున చేర్చుకొని వారికి అన్నీ తామై సేవలందిస్తున్నారు. ఇక్కడ ఆశ్రయం పొందిన ఎనిమిది మందిని బాగు చేయించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ ఆశ్రమంలో 10 మంది ఉన్నారు. తమకు వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే అభాగ్యులకు సేవ చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ దంపతులు. దాతలు చేయూతనందించాలి - జెల్ల శంకర్, ఆశ్రమ నిర్వాహకుడు అనాథలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పటివరకు సొంత డబ్బుతోనే నిర్వహణను చూసుకున్నాం. అనాథలకు సేవ చేసి వారిని బాగు చేయించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించడం సంతృప్తిని ఇస్తుంది. ఇప్పటి వరకు కరీంనగర్, బాలనగర్, జనగామ, పిడుగురాళ్ల, విజయనగరం, జమ్మికుంట, ఏలూరు చెందిన అనాథలను బాగు చేయించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించాం. ఎవరైనా దాతలు సహకరిస్తే మరింత మందికి సేవ చేస్తాం. ఆర్థికసాయం అందించే దాతలు 90525 63756 నంబర్‌ను సంప్రదించవచ్చు. -
ఆలేరులో కళ్లెం యువకుడి దుర్మరణం
కళ్లెం(లింగాలఘణపురం) : మండలంలోని కళ్లెం గ్రామానికి చెందిన బుషిగంపల శ్రీనివాసు(28) ఆదివారం నల్లగొండ జిల్లా ఆలేరు స్టేషన్లో రైలు ఎక్కుతూ జారిపడి దుర్మరణం పాలయ్యాడు. అతడు హైదరాబాద్‌లోని ఓ టీవీ చానల్లో పని చేస్తున్నాడు. అక్కడే ఉండే శ్రీనివాసు, గత రెండు నెలలుగా స్వగ్రామమైన కళ్లెం నుంచి హైదరాబాద్‌కు రైలులో వెళ్లి వస్తున్నాడు. సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్‌కు వెళ్లి తిరిగి ఉదయం కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో స్వగ్రామానికి బయలుదేరిన శ్రీనివాసు ఆలేరులో ట్రైను దిగి, తిరిగి ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడి మృత్యువాత పడ్డాడు. తండ్రి చనిపోవడంతో తల్లి, భార్య స్వప్న, ఏడాది కుమార్తె ఉన్నారు. శ్రీనివాస్ మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఇటీవలæఏడాది కూతురి పుట్టిన రోజు చేసిన శ్రీనివాసు గ్రామంలో అందరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవాడు. ఆయన మృతితో కళ్లెం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. విష జ్వరంతో వ్యక్తి మృతి ఏటూరునాగారం : మండలంలోని రొయ్యూర్ గ్రామానికి చెందిన కావిరి మల్లయ్య(40) విష జ్వరంతో ఆది వారం మృతి చెందాడు. ఆయన గత వారం రోజులుగా జ్వరంతో స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. అయినా జ్వరం తగ్గలేదు. ఆదివారం ఉదయం జ్వరం తీవ్రత పెరిగి కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్యాపిల్లలు ఉన్నారు. ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య నర్సింహులపేట : మండలంలోని దంతాలపల్లికి చెందిన బండి అశోక్(35) ఆదివారం ఇంట్లో ఉరివేసుకొని, అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అతడికి భార్య జ్యోతి, కుమార్తె ఉన్నారు. పీఎస్సై తిరుపతిరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. -
'ప్రాజెక్టులను అడ్డుకుంటే తరిమికొడతాం'
ఆలేరు (నల్లగొండ) : తెలంగాణ అభివృద్ధి కోసం నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులను అడ్డుకోవాలనుకుంటే ప్రతిపక్షాలను తరిమికొడతామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. శుక్రవారం ఆయన నల్లగొండ జిల్లా ఆలేరులో జరిగిన నియోజకవర్గ టీఆర్ఎస్ సమావేశంలో మాట్లాడారు. అంతకుమునుపు ఆయన స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్‌గా సుమలత ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
ఆలేరు : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. జిల్లాలోని ఆలే రు, మేళ్లచెరువు మండలాల పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు.. వరంగల్ జిల్లా ధర్మసాగరం మీదికొండకు చెందిన ఎల్లయ్య(42), మహేష్(25) తండ్రికొడుకులు. వీరు స్వగ్రామం నుంచి బైక్‌పై హైదరాబాద్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆలేరు శివారులో నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడిక్కడక్కడే మృతిచెందారు. సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆలేరు ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. శోభనాద్రిగూడెం(మేళ్లచెర్వు) : మండలంలోని పీక్లానాయక్‌తండా గ్రామానికి చెందిన కొండారు వెంకటాచారి(40),లకావత్ శంకర్ బైక్ మీద మల్లారెడ్డిగూడేనికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలో వెల్లటూరు గ్రామానికి చెందిన ట్రాక్టర్ మండలంలోని రెబల్లె వైపు వెళుతూ శోభనాద్రిగూడెం గ్రామ పరిధిలో బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటాచారికి తీవ్ర, శంకర్‌కు స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రికి తీసుకెళుతుండగా వెంకటాచారి మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ ఘటనపై రాత్రి వరకు పోలీసులకు ఫిర్యాదు అందలేదు. -
ఆలేరు వద్ద రోడ్డు ప్రమాదం
ఆలేరు: నల్గొండ జిల్లా ఆలేరు రైల్వే వతెన వద్ద బుధవారం ఉదయం ఓ ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలోనలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఆటో ముందరి చక్రం ఊడిపోవడంతో ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ సంఘటనలో డ్రైవర్ సహా నలుగురు గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ఆలేరు ప్రభుత్వల ఆస్పత్రికి తరలించారు. -
వడదెబ్బతో 20 మంది మృతి
ఆలేరు: భానుడి భగభగలు కొనసాగుతూనే ఉన్నాయి. వడదెబ్బ బారిన పడి శనివారం జిల్లా వ్యాప్తంగా 20 మంది మృతిచెందారు. పట్టణంలోని రాంశివాజీనగర్‌కు చెందిన కడకంచి సుశీ ల(70), ఆలేరులోని బంధువుల ఇంటికి వచ్చిన వరంగల్ జిల్లా వనపర్తికి చెందిన నర్సింగరావు(71) శనివారం వడదెబ్బకు గురై మృతిచెందారు. కేతేపల్లి: ఇనుపాములకు చెందిన రావుల లచ్చయ్య(75) ఇంటి వద్దనే చికిత్స చేయిస్తుండగా శుక్రవారం రాత్రి మృతి చెందాడు. అర్వపల్లి:మండలంలోని కాసర్లపహాడ్‌కు చెందిన మంచాల వెంకటనర్సయ్య (72), జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన బొల్లేపల్లి మొఘులయ్య (65) వడదెబ్బతో మృతిచెందారు. పిల్లలమర్రిస్టేజీ(సూర్యాపేటరూరల్) : రాయిని గూడెం గ్రామ పరిధి పిల్లలమర్రిస్టేజీ వద్ద నివా సం ఉంటున్న గుండా రంగమ్మ(85) వడదెబ్బతో మృతిచెందింది. నూతనకల్ : మండల పరిధిలోని జి.కొత్తపల్లి గ్రా మానికి చెందిన పగిళ్ల వీరయ్య(65) పెరిగిన ఉష్ణోగ్రతలకు అస్వస్థతకు గురయ్యాడు. ఇంట్లోనే చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. వేములపల్లి : మండలకేంద్రంలోని ఎన్ఎస్పీ క్యాంపునకు చెందిన సిలివేరు లక్ష్మమ్మ (70) వడద్బెతో మృతిచెందింది. ఆత్మకూర్(ఎస్) : మండల పరిధిలోని నశీంపేట కు చెందిన ముల్కలపెల్లి నర్సమ్మ (58) వడదెబ్బకు గురై మృతిచెందింది. మోత్కూరు : గట్టుసింగారం గ్రామానికి చెందిన చెరుకు నర్సమ్మ(71)ఎండి వేడికి తాళలేక తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందినట్లు తెలిపారు. ఆత్మకూర్(ఎం) : మండలంలోని పల్లెర్ల గ్రామానికి చెందిన గుర్రం తిరుపతమ్మ(70) ఉదయం గ్రా మంలో తిరిగి మధ్యాహ్నాం ఇంటికి వచ్చింది. దాహం వేయడంతో మంచి నీళ్లు తాగి అలాగే కుప్పకూలి మృతిచెందింది. మేళ్లచెర్వు : మండలంలోని హేమ్లాతండా గ్రామపంచాయతీ పరిధి రాఘవాపురం గ్రామానికి చెందిన దాసరి వీరస్వామి (75) వడదెబ్బతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. కనగల్ : మండలంలోని పొనుగోడు గ్రామానికి చెందిన మొండికత్తి హుస్సేన్(22) తుర్కపల్లి గ్రామ పరిధిలోని ఎం.గౌరారం గ్రామానికి చెందిన వికలాంగుడు బొమ్మపాల నాగరాజు(19) వడదెబ్బతో మృతిచెందారని బంధు వులు తెలిపారు. శాలిగౌరారం: మండలంలోని అంబారి పేటకు చెందిన పబ్బు అర్వపల్లి (65) వడ దెబ్బతో మృతిచెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. నల్లగొండ టుటౌన్ : నల్లగొండ పట్టణ పరిధి పానగల్‌కు చెందిన కుంచపు నాగమ్మ (30) ఎండకు జ్వరం వచ్చి మూడు క్రితం ఆసుపత్రిలో చేరింది. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందందని కుటుంబసభ్యులు తెలిపారు. మిర్యాలగూడ టౌన్ : పట్టణంలోని షాబునగర్‌కు చెందిన మిల్లు డ్రైవర్ విజయనగరం నారాయణమూర్తి(48) చిలువేరు లక్ష్మమ్మ(70) శాంతినగర్‌కు చెందిన తిరుపనేని నాగేశ్వర్రావు(52) వడదెబ్బతో మృతిచెందినట్టు బంధువులు తెలిపారు. -
అప్పులబాధ భరించలేక..
- పురుగులమందు తాగి రైతు బలవన్మరణం - ఆలేరులో ఘటన ఆలేరు పట్టణానికి చెందిన గుంటుక వేణుగోపాల్‌రెడ్డి(45)కి వ్యవసాయమే జీవనాధారం. తన కున్న నాలుగు ఎకరాల భూమితో పాటు, కొంత భూమికౌలు తీసుకుని పత్తి, వరి సాగు చేశాడు. పెట్టుబడులకు తెలిసిన వారి వద్ద రూ. 5 లక్షల వరకు అప్పు చేశాడు. రెండేళ్లుగా కాలం అనుకూలించలేదు. కుటుంబ అవసరాల కోసం యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూర్ గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ కంపెనీలో కార్మికునిగా పనిచేశాడు. ఇంటి అవసరాలు.. అప్పులు పెరిగిపోవడంతో తట్టుకోలేకపోయాడు. తీవ్ర మనస్తాపానికి గురైన వేణుగోపాల్‌రెడ్డి బుధవారం అర్ధరాత్రి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి వెంట తెచ్చుకున్న పురుగులమందు తాగాడు. తెల్లవారుజామున అటుగా వెళ్లిన రైతులు అపస్మారకస్థితిలో పడి ఉన్న వెంకట్‌రెడ్డి వద్దకు వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందాడు. సమాచారం అందుకుని ఘటన స్థలానికి కుటుంబ సభ్యులు చేరుకుని బోరున విలపించారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. మృతిడి భార్య సోమలక్ష్మి ఫిర్యాదు మేరకు ఏఎస్సై సలీం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.