జీవితాలకు పొ(సె)గ | Prohibition Of Outside Smoking And Causes Health Issues | Sakshi
Sakshi News home page

జీవితాలకు పొ(సె)గ

Published Mon, Mar 11 2019 12:04 PM | Last Updated on Mon, Mar 11 2019 12:04 PM

Prohibition Of Outside Smoking And Causes Health Issues - Sakshi

సాక్షి, ఆలేరు : ‘పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్‌’ అని కన్యాశుల్కంలో గిరీశం అన్న మాటలను వల్లె వేస్తూ పొగబాబులు ఈ వ్యసనాన్ని వదల్లేక పోతున్నారు. సరదాగా మొదలయ్యే ధూమపానం జేబుతోపాటు ఊపిరితిత్తులకు చిల్లు వేస్తుంది. ఈ విషయం తెలిసే ధూమపానాన్ని అనేకమంది వదలడం లేదు. పొగాకు, ధూమపానం కారణంగా ప్రపంచంలో ప్రతి 6.5 సెకండ్లకు ఒకరు మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. అయితే చిన్నవయస్సులోనే సిగరేట్‌ తాగటం మొదలుపెట్టినవారు సాధారణ ఆరోగ్యవంతుల కన్నా వీరు 20–25 సంవత్సరాల ముందే చనిపోతున్నారని వెల్లడైంది. పొగాకులో నికోటిన్‌ అనే మత్తు పదార్థం ఉంటుంది. బహిరంగ ధూమపానం ఇతరులకు కూడా హాని కలిగిస్తుంది.  
వచ్చే జబ్బులు 

  • ధూమపానం ప్రమాదకరమైంది. ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. 
  • ఆయు ప్రమాణాలను తగ్గిస్తుంది.
  • కళ్లు, ముక్కు, గొంతు మీద ప్రభావం కలిగిస్తుంది. 
  • ఊపిరితిత్తులకు సహజసిద్ధంగా శుభ్రపరిచే సామర్ధ్యం ఉంటుంది. పొగతాగడంతో శ్వాస స్థాయి పెరిగి ఊపిరితిత్తుల కణాలకు రసాయన హనీ కలుగుతుంది.  
  • దగ్గు, కఫం సమస్యలు మొదలవుతాయి. 
  • శ్వాసకోస వ్యాధులు వస్తాయి. శ్వాసనాళం మందంగా మారి క్యాన్సర్‌కు దారి తీస్తుంది. 
  • సోరియాసిస్‌ వ్యాధి కూడా వస్తుంది. శుక్లాలు కూడా వచ్చే అవకాశం ఉంది. 
  • దంతాలు రంగు మారడమే కాదు దెబ్బతింటాయి. చిగుళ్ల వ్యాధులు కూడా వస్తాయి.
  •  గుండె జబ్బులు, పక్షవాతం, పొట్టలో అల్సర్‌లు వస్తాయి. 
  •  సంతాన, అంగస్తంభన సమస్యలు, వీర్యంలోని శుక్రకణాల స్వరూపం మారిపోతుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు తక్కువవుతాయి. అలాగే పొగతాగే స్త్రీలలో గర్భధారణ సమస్యలు, గర్భస్రావాల సమస్యలు తలెత్తుతాయి.
  • రక్తపోటు మీద ప్రభావం.
  • సిగరెట్‌ కాల్చే ప్రతిసారి 15శాతం రక్తపోటు అమాంతం పెరుగుతుంది. 
  • చర్మంలో రక్తకణాలు బిగుసుకుపోతాయి. 
  • పొగతాగితే నోటి క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంది.  

ఫ్యాషన్‌గా భావిస్తున్న యువత  
సిగరెట్‌ తాగడాన్ని యువత ఫ్యాషన్‌గా భావిస్తుంది. ఇంటర్‌ నుంచే అబ్బాయిలు సిగరెట్‌ అలవాటు చేసుకుంటున్నారు. అలవాటు లేకపోయిన తోటి స్నేహితుల ప్రోత్సాహంతో సిగరెట్‌లు తాగుతున్నారు.  
బహిరంగ ప్రదేశాల్లో నిషేధం 
బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని ప్రభుత్వం నిషేధించింది. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే రూ. 1000వరకు జరిమానా విధించవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్‌ క్యార్యాలయాలు, బీజినెస్‌ సెంటర్లు, హోటళ్లు, బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్‌లు, సినిమా థియేటర్‌లలో పొగతాగడాన్ని కేంద్ర ప్రభుత్వం 2008 సంవత్సరం అక్టోబర్‌ 8న నిషేధించింది. ధూమపానం చేస్తే జరిమానా విధించేందుకు పలువురు అధికారులకు అధికారం కల్పించారు.  


పొగ నిషేధ చిహ్నం   

ఉమ్మడి జిల్లాలో 1300 కిల్లీ షాపులు 
ఉమ్మడి  జిల్లాలో 1300పైగా కిల్లీ షాపులు నడుస్తున్నాయి. నిత్యం ఈ షాపుల్లో రూ. 5.50లక్షల బీడీలు, సిగరెట్‌లు అ మ్ముడుపోతున్నాయని తెలిసిం ది. అలాగే జిల్లాలో హుక్కా పీల్చేవారి సంఖ్య కూడా లక్షకుపైగా ఉన్నట్టు తెలుస్తుంది.

పేరుకే కమిటీలు 
బహిరంగ ప్రదేశాల్లో «ధూమపాన నిషేధాన్ని అమలు చేసేందుకు జిల్లా స్థాయిలో కమిటీ ఉంది. ప్రతి నెలలో కమిటీ సమావేశమై చట్టం అమలును సమీక్షించాలి. జాయింట్‌ కలెక్టర్‌ చైర్మన్‌గా, డీఎంహెచ్‌ఓ కన్వీనర్‌గా, అగ్నిమాపక అధికారి, పోలీస్, రవాణా, పురపాలక సంఘం, ఉన్నత పాఠశాల, రెవెన్యూ, విద్య, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్, డీసీహెచ్‌ఎస్‌ కోఆర్డినేటర్లు సభ్యులుగా ఉం టారు. మొత్తం 12మంది ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఉందని చాలా మందికి తెలియదు. దాంతో  కమిటీ నామమాత్రంగా మారింది.

కుటుంబ సభ్యులకు హానికరమే.. 
సిగరెట్‌ తాగేవారితో పాటు కుటుంబ సభ్యులకు కూడా హానికరమే. పిల్లల వద్ద తాగితే సున్నితంగా ఉండే వారి ఊపిరితిత్తులకు మరింత ప్రమాదకరం. పొగతాగితే అనారోగ్యానికి గురవుతారు. 40 రకాల క్యాన్సర్‌ కారకాలు ఉన్నాయి. ధూమపానం చేస్తే ఆయు ప్రమాణం తగ్గుతుంది. 

 – డా. కె ప్రభాకర్, ఆలేరు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement