ఆలేరు : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. జిల్లాలోని ఆలే రు, మేళ్లచెరువు మండలాల పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు.. వరంగల్ జిల్లా ధర్మసాగరం మీదికొండకు చెందిన ఎల్లయ్య(42), మహేష్(25) తండ్రికొడుకులు. వీరు స్వగ్రామం నుంచి బైక్‌పై హైదరాబాద్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆలేరు శివారులో నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడిక్కడక్కడే మృతిచెందారు. సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆలేరు ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
శోభనాద్రిగూడెం(మేళ్లచెర్వు) : మండలంలోని పీక్లానాయక్‌తండా గ్రామానికి చెందిన కొండారు వెంకటాచారి(40),లకావత్ శంకర్ బైక్ మీద మల్లారెడ్డిగూడేనికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలో వెల్లటూరు గ్రామానికి చెందిన ట్రాక్టర్ మండలంలోని రెబల్లె వైపు వెళుతూ శోభనాద్రిగూడెం గ్రామ పరిధిలో బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటాచారికి తీవ్ర, శంకర్‌కు స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో హుజూర్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తీసుకెళుతుండగా వెంకటాచారి మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ ఘటనపై రాత్రి వరకు పోలీసులకు ఫిర్యాదు అందలేదు.
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
Published Tue, Jun 7 2016 1:56 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement
Advertisement