- పురుగులమందు తాగి రైతు బలవన్మరణం
- ఆలేరులో ఘటన
ఆలేరు పట్టణానికి చెందిన గుంటుక వేణుగోపాల్‌రెడ్డి(45)కి వ్యవసాయమే జీవనాధారం. తన కున్న నాలుగు ఎకరాల భూమితో పాటు, కొంత భూమికౌలు తీసుకుని పత్తి, వరి సాగు చేశాడు. పెట్టుబడులకు తెలిసిన వారి వద్ద రూ. 5 లక్షల వరకు అప్పు చేశాడు. రెండేళ్లుగా కాలం అనుకూలించలేదు. కుటుంబ అవసరాల కోసం యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూర్ గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ కంపెనీలో కార్మికునిగా పనిచేశాడు. ఇంటి అవసరాలు.. అప్పులు పెరిగిపోవడంతో తట్టుకోలేకపోయాడు.
తీవ్ర మనస్తాపానికి గురైన వేణుగోపాల్‌రెడ్డి బుధవారం అర్ధరాత్రి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి వెంట తెచ్చుకున్న పురుగులమందు తాగాడు. తెల్లవారుజామున అటుగా వెళ్లిన రైతులు అపస్మారకస్థితిలో పడి ఉన్న వెంకట్‌రెడ్డి వద్దకు వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందాడు. సమాచారం అందుకుని ఘటన స్థలానికి కుటుంబ సభ్యులు చేరుకుని బోరున విలపించారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. మృతిడి భార్య సోమలక్ష్మి ఫిర్యాదు మేరకు ఏఎస్సై సలీం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అప్పులబాధ భరించలేక..
Published Fri, May 1 2015 5:49 AM | Last Updated on Sun, Sep 3 2017 1:14 AM
Advertisement