మంచినీళ్ల కోసమని వచ్చి.. | Women Killed In Nalgonda | Sakshi
Sakshi News home page

మంచినీళ్ల కోసమని వచ్చి..

Published Sun, Feb 2 2020 8:51 AM | Last Updated on Sun, Feb 2 2020 1:15 PM

Women Killed In Nalgonda - Sakshi

సాక్షి, ఆలేరు : దుండగులు పట్టపగలే తెగబడ్డారు. ఓ మహిళను దారుణంగా హత్య చేసి బంగారు ఆభరణాలను దోపిడీ చేశారు. ఈ ఘటన ఆలేరులో శనివారం సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలానికి చెందిన నీలం నీలమ్మ(55) తన ఇద్దరు పిల్లలతో కలిసి  ఆలేరులోని క్రాంతినగర్‌ 4వ కాలనీలో నివాసం ఉంటోంది.  నీలమ్మ ఇంల్లోనే ఉంటుండగా కూ తురు అంజుల అదే కాలనీలో ఒకరి వద్ద కుట్టు మిషన్‌ నేర్చుకుంటుంది. కాగా మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మంచినీళ్లు ఇవ్వమని లోనికి ప్రవేశించారు. ఆమె గొంతు నులిమి మె డలోని బంగారు గొలుసు, చెవి కమ్మలు అపహరించుకుపోయారు. కొద్ది సేపటి తర్వాత కూతు రు అంజుల ఇంటికి విషయం వెలుగులోకి వ చ్చింది.

సమాచారం మేరకు 108 సిబ్బంది ఘటనాస్థలిని పరిశీలించగా అప్పటికే నీలమ్మ మృతిచెందినట్టుగా ధ్రువీకరించారు. ఆలేరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని పరీశీలించారు. దొంగల పనిగా అనుమానిస్తూ జాగిలాలను రప్పించారు. అయి తే జాగిలాలు కాలనీ నుంచి బహద్దూర్‌పేట రో డ్డు వరకు వెళ్లి నిలిచిపోయాయి. యాదగిరిగుట్ట సీఐ నర్సయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు.  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement