Women killed
-
మూడేళ్ల క్రితం భర్త మృతి.. ఒంటరి మహిళపై అత్యాచారం ఆ తర్వాత..
మండ్య: వితంతు మహిళను దుండగులు అత్యాచారం జరిపి, హత్య చేసి కాల్చివేశారు. ఈ దారుణ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. ఈ షాకింగ్ ఘటన మద్దూరు తాలూకా మారసింగనహళ్లిలో సోమవారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన దివంగత కుమార ఆరాధ్య భార్య ప్రేమ (42)ను హతురాలిగా గుర్తించారు. వివరాల ప్రకారం.. మృతురాలికి ఒక కుమారుడు ఉండగా బెంగళూరులోని ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆమె కోడలు మండ్య మహిళా కాలేజీలో చదువుతోంది. మారసింగనహళ్లిలో టైలరింగ్ పనిచేస్తున్న ప్రేమ భర్త కుమార ఆరాధ్య పక్షవాతంతో మూడేళ్ల క్రితం మరణించాడు. తరువాత ప్రేమ గ్రామంలోని తన సొంతింట్లో చీటీలు నడుపుకుంటూ ఒంటరిగా జీవిస్తోంది. సోమవారం రాత్రి ఆమె ఇంట్లోకి నిద్రిస్తుండగా చొరబడిన దుండగులు తల దిండుతో ఊపిరి ఆడకుండా చేసి ఆమెను చంపేశారు. మంచంతో సహా మృతదేహాన్ని కాల్చివేసి పరారయ్యారు. ఇంట్లో నుంచి పొగలు వస్తుండడంతో.. మంగళవారం ఉదయం ప్రేమ ఇండి పడక గదిలో నుంచి పొగలు వస్తుండడాన్ని గమనించి ఇరుగుపొరుగు వాసులు వచ్చి చూడగా ప్రేమ మరణించి ఉండడం చూసి నిర్ఘాంత పోయారు. బేసగరహళ్లి పోలీసులు జాగిలాల సహాయంతో పరిశీలించారు. హత్యకు ముందు నిందితులు పడక గదిలోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారం జరిపి ఆ తర్వాత హత్య చేసినట్లు గుర్తించారు. మండ్య మిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ పుట్టస్వామి నేతృత్వంలోని సిబ్బంది మంగళవారం సాయంత్రం ఘటన జరిగిన స్థలంలోనే పోస్టుమార్టమ్ నిర్వహించారు. మద్దూరు రూరల్ సీఐ మనోజ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ ఎన్.యతీశ్, డీఎస్పీ నవీన్ కుమార్, పీఎస్ఐ నవీన్‌కుమార్ తదితరులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. -
నన్ను ఎందుకు పట్టించకోవడంలేదు.. వివాహేతర సంబంధం కారణంగా..
మొయినాబాద్: కీడును శంకించిన ఓ మహిళ తన హత్యకు ముందు కూతురుకు ఫోన్ చేసింది. ఓయమ్మో.. నా మానం పాయే.. ప్రాణం పాయే.. నన్ను సంపుతుండే అంటూ భయాందోళనతో చెప్పిన మాటలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మేస్త్రీ.. ఒంటరిగా ఉన్న సదరు మహిళను గొంతు నులిమి చంపాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌లో ఆదివారం వెలుగుచూసింది. ఈ ఘటనపై ఇన్స్పెక్టర్ డీకే లక్ష్మీరెడ్డి కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా దోమ మండలం మల్లేపల్లికి చెందిన పులుకుంట లక్ష్మి (50), రాములు దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. నాలుగేళ్ల క్రితం బతుకుదెరువు కోసం మొయినాబాద్‌కు వచ్చారు. అద్దె గదిలో ఉంటూ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మొగలమడక గ్రామానికి చెందిన హన్మంతు కొన్నేళ్లుగా మొయినాబాద్‌లో ఉంటూ మేస్త్రీ పని చేసేవాడు. మేస్త్రీ చేతి కింద పనికి వెళ్లిన లక్షి్మకి అతనితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఎనిమిది నెలల క్రితం లక్ష్మి భర్త రాములు మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె తన కొడుకుతో కలిసి సొంతూరు మల్లేపల్లికి వెళ్లి అక్కడే వ్యవసాయం చేసుకూంటూ జీవనం సాగిస్తోంది. పదిహేను రోజుల క్రితం కూలి పని కోసం మళ్లీ మొయినాబాద్‌కు వచ్చింది. అద్దె గదిలో ఉంటూ కూలి పని చేస్తోంది. విషయం తెలుసుకున్న హన్మంతు శనివారం రాత్రి ఆమె గదికి వచ్చాడు. అప్పటికే మద్యం తాగి ఉన్న అతడు తనను ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమెతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తుడైన హన్మంతు.. చీర కొంగుతో లక్ష్మి మెడకు చుట్టి గొంతు నులిమి హత్య చేశాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. కాగా, నిందితుడు హన్మంతును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. -
ఏపీలో దారుణం.. భర్తల సాయంతో తోడికోడళ్లను..
కాసింత ప్రేమను చూపిస్తే పులకించిపోయేవారు.. ఆత్మీయంగా పలకరిస్తే ఆనందించేవారు..ఒక తోడు దొరికిందని..మంచి నీడన హాయిగా బతకొచ్చని ఆశించారు. పుట్టినిల్లు వదిలి మెట్టినింట అడుగుపెట్టిన ఆ ఇద్దరు ఆడపడుచులకు మామ రూపంలో మూఢ నమ్మకం ఎదురైంది. తండ్రిలా చూసుకోవాల్సిన మామ, తన అనారోగ్యానికి కోడళ్లే కారణమని, చేతబడి చేశారని అనుమానించాడు. నాటు వైద్యుని మాటలు నమ్మి కుమారులనూ పక్కదోవ పట్టించి..అతి కిరాతకంగా కోడళ్లను హతమార్చారు. ఈ దారుణం పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. ఓర్వకల్లు: చేతబడి చేశారనే మూఢనమ్మకంతో ఇద్దరు కోడళ్లను మామ అతికిరాతకంగా హత్య చేశాడు. ఇందుకు కుమారుల సహాయం తీసుకున్నాడు. ఓర్వకల్లు పోలీసులు తెలిపిన వివరాల మేరకు నన్నూరు గ్రామానికి చెందిన కురువ మంగమ్మ, పెద్ద గోవర్ధన్(అలియాస్ గోవన్న)దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. పెద్ద కొడుకు పెద్ద రామ గోవిందుకు గూడూరు మండలం, గుడిపాడు గ్రామానికి చెందిన రామేశ్వరమ్మ(26)తో ఏడేళ్ల క్రితం పెళ్లయింది. చిన్న కొడుకు చిన్న రామగోవిందు, కల్లూరు మండలం, లక్ష్మీపురం గ్రామానికి చెందిన రేణుక(25)ను ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. కురువ గోవన్న 40 ఎకరాల భూస్వామి కావడంతో కుటుంబ సభ్యులు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గోవన్నకు చిన్న కోడలిపై మొదటి నుంచి ఇష్టం లేదు. కోడళ్లు ఇద్దరు అన్యోన్యంగా ఉండేవారు. గొవన్న అనారోగ్య సమస్యతో సతమతం చెందేవాడు. ఇతరుల సలహా మేరకు రెండు మూడు సార్లు జొహరాపురంలో ఉన్న నాటు వైధ్యుని వద్దకు వెళ్లి చూపించుకోగా సదరు వైద్యుడు పసురు మందు తాపించాడు. ఆ సమయంలో మందు పడినట్లు తెలిసింది. మందును మీ కోడళ్లే పెట్టించారని, చేతబడి చేశారని గోవన్నకు చెప్పాడు. దీంతో అప్పటి నుంచి కోడళ్లపై మామ అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయాన్ని కుమారులకు చెప్పి వారిని పక్కదోవ పట్టించాడు. ఇద్దరు కోడళ్లకు సంతానం కలుగకపోవడంతో వారిని హతమార్చాలని నిర్ణయించుకున్నారు. హత్య చేశారు ఇలా.. బుధవారం ఉదయం 11 గంటలకు గ్రామంలోని తడకనపల్లె రస్తాలో ఉన్న సొంత పొలంలో పనులు చేసేందుకు మామ గోవన్న కలిసి ఇద్దరు కోడళ్లు పొలానికి వెళ్లారు. వీరికి తోడుగా పెద్ద రామగోవిందు కూడా వచ్చాడు. పనులు ముగిశాక, పశువులకు మేతకోసుకరమ్మని గోవన్న ఇద్దరు కోడళ్లను పొరుగు పొలాల్లోకి పంపాడు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వ్యూహం ప్రకారం ఇద్దరు కొడుకులతో కలిసి గోవన్న గడ్డికోస్తున్న కోడళ్ల వద్దకు వెళ్లాడు. వేపకర్రతో పెద్ద కోడలు రామేశ్వరమ్మ తలపై బలంగా మోదగా అపస్మారక స్థితిలో పడిపోయింది. ఇది గమనించిన చిన్న కోడలు రేణుక అడ్డుపడగా అదే కర్రతో ఛాతిపై బలంగా మోదడంతో ఆమె కూడా కుప్పకూలింది. కోడళ్లు ఇద్దరూ కోలుకోలేక అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ప్రాణాలు విడిచారని గమనించిన తండ్రీ కొడుకులు ఇంటికి వెళ్లి స్నానాలు చేసి, దుస్తులు మార్చుకొని సాయంత్రం 6 గంటల సమయంలో పొలానికి వెళ్లి డ్రామా ఆడారు. దారుణం జరిగిపోయిందని విలపిస్తూ భార్యల తరఫున బంధువులకు ఫోన్ చేశారు. విషయం తెలుసుకున్న వెంటనే బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసు జాగిలాలను పిలిపించి ఘటన స్థలంలో పరిశీలించినా, ఎలాంటి ఆధారాలు లభించలేదు. గోవన్న ఆసుపత్రిలో చేరడంతో పోలీసులు అనుమానించారు. గోవన్నతోపాటు పెద్దరామగోవిందు, రామగోవిందును అదుపులోకి తీసుకుని విచారణ జరపడంతో వారు నేరం అంగీకరించారు. వీరితో పాటు, మూఢ నమ్మకాలతో అమాయక ప్రజలను మభ్యపెడుతూ, కాపురాల్లో చిచ్చులు పెడుతున్న నాటు వైద్యునిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. -
మరో ఆరు నెలల్లో పెళ్లి.. కాబోయే భార్య అనే సోయి లేకుండా..
యశవంతపుర: మూడుముళ్లు వేయకముందే మైనర్ యువతిపై కాబోయే భర్త అత్యాచారానికి పాల్పడి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. లైంగిక దాడి జరిగినట్లు పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూడటంతో పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో ఆ యువకుడు ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన కర్నాటకలోని హాసన తాలూకాలో జరిగింది. వివరాల ప్రకారం.. కోణనూరు సమీపంలోని రామన కొప్ప గ్రామానికి చెందిన యువతితో కడలూరు గ్రామానికి చెందిన దినేశ్‌కు ఇటీవల నిశి్చతార్థం చేశారు. 18 ఏళ్లు నిండటానికి మరో 6 నెలల సమయం ఉంది. కాగా దినేశ్ ఆ మైనర్ యువతి ఇంటికి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో నవంబర్ 28న మరోమారు ఆ మైనర్ యువతి ఇంటికి వెళ్లిన దినేష్..ఆమెను గొంతునులిమి హత్య చేశాడు. అయితే, పరువు పోతుందనే భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో దినేశ్ మూడు రోజుల క్రితం విషం సేవించి ఆత్మహత్యకు యత్నించాడు. హాసన ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. -
విశాఖ: మిస్టరీగా మహిళ మర్డర్.. ఆ ఇంట్లో ఏం జరిగింది?
పీఎంపాలెం (భీమిలి): మహిళ హత్య మిస్టరీ ఇంకా వీడలేదు. హత్య సంఘటనలో అంతులేని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో పాత్రధారులు, సూత్రధారుల నిగ్గుతేల్చే పనిలో 5 పోలీసుల బృందాలున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం, పర్లాకిమిడి ప్రాంతాల్లో మూడు బృందాలు విచారణకు పంపినట్టు సీఐ వై. రామృష్ణ తెలిపారు. కొమ్మాది వికలాంగుల కాలనీ లో సీలు వేసిన డ్రమ్ములో మహిళా మృతదేహం ఆదివారం బయటపడిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు...కొమ్మాదిలో ఉంటున్న నండూరి రమేష్ తన ఇంటిని రుషి అనే వ్యక్తికి 2019లో అద్దెకిచ్చాడు. రుషి తన భార్యతో ఆ ఇంట్లో ఉంటున్నాడు. ఇంటి యజమాని రమే‹Ùకు వెల్డింగ్ షాపు ఉంది. ఆ షాపులో రుషిని పనికి పెట్టుకున్నాడు. 2020లో రుషి భార్య డెలివరీ కోసమని పార్వతీపురం జిల్లా పాలకొండ దరి సీతంపేటకు తీసుకువెళ్లాడు. 2021 ఏప్రిల్‌లో ఒక్కడే తిరిగొచ్చాడు. రెండు రోజుల అనంతరం మళ్లీ తిరిగి వెళ్లి పోయాడు. ఇంట్లో ఎవరూ లేకపోయినా పెరిగిన కరెంట్ బిల్లు అద్దెకు ఇచ్చిన ఇంట్లో ఎవరూ నివసించకపోయినా కరెంట్ బిల్లులు అధికంగా వస్తుండటంతో ఇంటి యజమాని రమేషకు అనుమానం వచ్చి వాస్తవం తెలుసుకోవడానికి ఆదివారం సాయంత్రం రుషికి అద్దెకు ఇచ్చిన ఇంటికి వెళ్లాడు. ఇంటో లైట్లు వెలిగి ఫ్యాను తిరుగుతూ కని పించింది. ఇంట్లో మాత్రం ఎవరూ లేరు. ఇంటి వద్ద వాటర్ డ్రమ్ముకు సీలు వేసి ఉండడంతో అదేంటో చూద్దామని మూత తొలగించడందో భరించరాని దుర్గంధం వెదజల్లింది. మహిళ అస్తిపంజరం కనిపించడంతో భయకంపితుడయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఆ మృతదేహం సుమారు 2 నెలల కిందటే ఆ డ్రమ్ములో పెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇంతకీ ఆ మహిళ ఎవరు? రెండు నెలలు క్రితం హత్యకు గురైన మహిళ ఎవరు? ఎక్కడో హత్య చేసి ఇక్కడకు తీసుకొచ్చి డ్రమ్ములో పెట్టి సీలు వేశారంటే ఎంతో పకడ్బందీగా చేసిన వ్యవహారంగా తెలుస్తోంది. అంతేకాకుండా రుషి 2021 నుంచి ఆ ఇంట్లో ఉండడం లేదని, ఇల్లు ఖాళీగా ఉందని ఇంటి ఓనర్ రమేష్ చెబుతున్నాడు. ఇంట్లో రుషి లేకపోయినా కరెంటు బిల్లు ఎక్కువ వస్తుండడంతో ఆ ఇంట్లో ఎవరు ఉన్నారు. రుషికి తెలిసే ఈ వ్యవహారం నడిచిందా. లేక ఇల్లు ఖాళీగా ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తులు హత్య కోసం వినియోగించారా? అనేది మిస్టరీగా ఉంది. అంతేకాకుండా రుషి 2021 ఏప్రిల్ నుంచి ఇంట్లో ఉండడం లేదని చెబుతున్న రమేష్ మరి ఆ ఇంటిని వేరే వాళ్లకు ఎందుకు అద్దెకు ఇవ్వలేదన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసుల అదుపులో రుషి? హత్య జరిగిన ఇంట్లో అద్దెకు ఉంటున్న రుషిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. అయితే పోలీసులు ఈ విషయాన్ని నిర్ధారించలేదు. -
హోటల్ రూమ్‌లో దారుణం.. మహిళతో వివాహేతర బంధం కాస్తా..
వివాహేతర సంబంధాలు కుటుంబాలను బజారుకీడుస్తున్నాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా వారి కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఓ వివాహితుడు.. తన ప్రేయసితో ఓయో హోటల్ రూమ్‌లో గొడవకు దిగి.. ఆమెను దారుణంగా చంపాడు. వివరాల ప్రకారం.. నిందితుడు ప్రవీణ్‌కు కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. భార్య, పిల్లలతో ప్రవీణ్ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రవీణ్‌కు గీత అనే మరో మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వీరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో, వీరిద్దరూ పలుమార్లు ఢిల్లీలోని హోటల్స్‌లో కలుసుకునేవారు. ఈ క్రమంలోనే మంగళవారం కూడా వీరు ఓయో హోటల్లో రూమ్ అద్దెకు తీసుకున్నారు. అనంతరం, రూమ్‌లో వారిద్దరూ వాదనలకు దిగారు. వీరి మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో నిందితుడు ప్రవీణ్.. గీత చాతిపై గన్‌తో కాల్చాడు. దీంతో, ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తర్వాత.. ప్రవీణ్ తనను తాను గన్‌తో కాల్చుకున్నాడు. కాగా, గన్ పేలిన శబ్ధం వినిపించడంతో హోటల్ సిబ్బంది వెంటనే రూమ్‌కు వెళ్లి చూడగా వారిద్దరూ కిందపడిపోయి ఉన్నారు. దీంతో, పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అక్కడకు చేరుకున్న పోలీసులు.. వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే గీత మృతిచెందినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రవీణ్.. గాయాలతో ప్రాణపాయం నుండి బయటపడ్డాడు. -
భార్యను చెల్లి అని పిలవమన్నాడు.. ఆ తర్వాత..
హిమాయత్‌నగర్: తన భార్యను పెళ్లి చేసుకున్నదే కాకుండా ఆమెను చెల్లి అని పిలవాలంటూ ఆర్తీ రెండో భర్త నాగరాజు.. నాగులసాయిని బెదిరించాడు. ఈ నెల 7న నారాయణగూడ మెట్రో రైల్వే స్టేషన్ వద్ద నాగులసాయిని అడ్డగించిన నాగరాజు తన భార్య ఆర్తీతో మాట్లాడినా, ఫోన్ చేసినా ఊరుకునేది లేదని హెచ్చరించాడు. ఇకపై ఆమె నీకు చెల్లెలి వరుస అవుతుంది కాబట్టి చెల్లి అని పిలవాలని చెప్పాడు. ఈ కారణంతోనే తాను అతడిపై దాడి చేశానంటూ నిందితుడు నారాయణగూడ పోలీసుల విచారణలో వెల్లడించాడు. మంగళవారం నిందితుడు నాగుల సాయిని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై ఇన్స్పెక్టర్ రాపోలు శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్‌పేట గోల్నాకకు చెందిన రావుల సాయి అలియాస్ నాగులసాయి వృతి రీత్యా బ్యాండ్ వాయిస్తుంటాడు. బ్యాండ్ పని లేనప్పుడు చిత్తు కాగితాలు ఏరుకుని జీవనం సాగించేవాడు. ఇతని స్నేహితుడి ద్వారా చిక్కడపల్లికి చెందిన ఆర్తీ పరిచయమైంది. దీంతో 2014లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు, వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. నిత్యం ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండటంతో వారు కొద్దిరోజుల వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆర్తీ అన్న జితేంద్రపై నాగుల సాయి దాడి చేసి ఏడాది పాటు జైలులో ఉన్నాడు. ఆ తర్వాత కోర్టు ధిక్కారం కేసులో మరో ఏడాది జైలుకు వెళ్లాడు. ఈ క్రమంలో జితేంద్ర భార్య ఆర్తీకి నాగరాజును పరిచయం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వారికి కుమారుడు విష్ణు జన్మించాడు. మంటల్లో గాయపడిన విష్ణు దాడి మరుసటి రోజు చనిపోయాడు. గర్భంలో ఉన్న శిశువు మృతి.. అందర్నీ ఒకేసారి చంపాలనే ఉద్దేశంతో కుమారుడితో సహా ఇద్దరూ ఒకేచోట ఉన్నప్పుడు పెట్రోల్ పోశాడు. ఈ దాడిలో పది నెలల విష్ణు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మూడు రోజుల క్రితం నాగరాజు సైతం చనిపోగా.. సోమవారం రాత్రి ఆర్తి గర్భంలో ఐదు నెలల శిశువు మృతి చెందింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని గాంధీ వైద్యులు వెల్లడించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
Khammam: వివాహేతర సంబంధమే ఆమె ప్రాణం తీసిందా..?
కొణిజర్ల : ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండల కేంద్రంలో శాంతినగర్ టీచర్స్ కాలనీలో ఓ ఉపాధ్యాయురాలు సోమవారం అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. వివరాల ప్రకారం.. దిద్దుపూడికి చెందిన లింగాల కుమారి అలియాస్ హర్షిత(40) తొర్రూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ శాంతినగర్ టీచర్స్ కాలనీలో నివాసముంటోంది. కాగా, భర్తతో విడిపోయి ఒంటరిగా జీవిస్తున్న ఆమె తెల్లవారుజామున అస్వస్థతగా ఉందంటూ, అదే కాలనీకి చెందిన మక్కా నరసింహారావు.. కుమారి సోదరుడైన భాస్కరరావు భార్యకు ఫోన్లో చెప్పి తన కారులోనే వైరాలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కాగా, కుమారి బంధువులు వచ్చేలోగా ఆమె మృతి చెందిందని వైద్యులు వెల్లడించారు. అయితే, కుమారి వద్ద మక్కా నరసింహారావు వడ్డీకి డబ్బు తీసుకుని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని, ఆదివారం ఇదే విషయమై నిలదీయడంతో నరసింహారావుతో పాటు ఆయన భార్య, తమ్ముడు కలిసి కొట్టినట్లు కుమారి దత్త పుత్రిక ఐదేళ్ల సైనీ తెలిపినట్లు ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యయాతి రాజు తెలిపారు. మరోవైపు, కుమారి తన భర్తతో విడిపోయి కొన్నేళ్లుగా నరసింహారావుతో సహజీవనం చేస్తున్నట్టు సమాచారం. వీరి మధ్య ఆర్థిక లావాదేవీలతో గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇక, ఆమె బాలిక సైనీను దత్తత తీసుకుని పెంచుతుండగా, ఇప్పుడు కుమారి మృతితో బాలిక ఒంటరిగా మిగిలింది. దీంతో, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘మా నాన్న 70 మంది మహిళలను చంపేశాడు.. నేనే సాక్ష్యం’
వాషింగ్టన్: అమెరికాలోని అయోవా, జెఫ్రీ డహ్మెర్, టెడ్ బండీ వంటి నరహంతకులకు పోటీగా మరో హర్రర్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. తన తండ్రి 30 ఏళ్లలో సుమారు 70 మంది మహిళలను హత్య చేసినట్లు ఓ మహిళ వెల్లడించటం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆ మహిళల మృతదేహాలను పూడ్చిపెట్టేందుకు తాను, తన సోదరులు సహాయ పడేవారమని లూసీ స్టడీ అనే మహిళ న్యూస్‌వీక్ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ మృతదేహాలను ఎక్కడ పాతిపెట్టారో తనకు తెలుసునని చెప్పటం గమనార్హం. ఈ క్రమంలో ఆమె తెలిపిన ప్రాంతాల్లో పోలీసు శునకాలు మానవ అవశేషాలను గుర్తించినట్లు న్యూస్‌వీక్ పేర్కొంది. నిందితుడు డొనాల్డ్ డీన్ స్టడీ 75 ఏళ్ల వయసులో 2013లో మరణించాడు. తాజాగా ఆ కిరాతకుడు చేసిన హత్యలపై అతడి కూతురు బయటపెట్టడం సంచలనంగా మారింది. మహిళలను హత్య చేసి వాటిని సమీపంలోని బావి, కొండ ప్రాంతంలోకి తీసుకెళ్లేందుకు తన పిల్లల సాయం తీసుకునేవాడు. మృతదేహాలను తీసుకెళ్లేందుకు తాము తోపుడు బండి లేదా టోబోగన్లను ఉపయోగించేవారమని నిందితుడి కూతురు వెల్లడించింది. బావిలో పడేశాక వాటిపై మట్టిపోసేవారమని చెప్పింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. చాలా మంది బాధితులను సమీపంలోని 100 అడుగుల లోతైన బావిలో పడేశారు. వారికి ఉన్న బంగారం దంతాలను ట్రోపీలవలే భావించి వాటిని తన తండ్రి దాచుకునేవారని చెప్పింది మహిళ. లూసీ స్టడీ తన తండ్రిపై ఆరోపణలు చేసిన క్రమంలో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. స్నిఫ్పర్ డాగ్స్‌తో ఆమె చెప్పిన బావి వద్ద సోదాలు చేపట్టినట్లు చెప్పారు. అయితే, ప్రస్తుతం మనుషులకు సంబంధించిన ఒక్క ఎముక సైతం కనిపించలేదని, కానీ, శునకాల ప్రవర్తన బట్టి ఇది పెద్ద శ్మశాన వాటికలా ఉందని తెలిపారు. నిందితుడు డొనాల్డ్ స్టడీ.. సెక్స్ వర్కర్లు, ఒమహా, నెబ్రస్కా ప్రాంతాల నుంచి మహిళలను మోసగించి తన 5 ఎకరాల విస్తీర్ణంలోని వ్యవసాయ క్షేత్రంలోకి తీసుకొచ్చి హత్య చేసి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. అమెరికా చరిత్రలోనే.. లూసీ స్టడీ చేసిన ఆరోపణలు నిజమని తేలితే.. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద సీరియల్ కిల్లర్‌గా డొనాల్డ్ స్టడీ నిలవనున్నాడని అధికారులు తెలిపారు. జెఫ్పెరి డహ్మెర్ 17 మందిని హత్య చేశాడు. అలాగే టెడ్ బండీ అనే కిరాతకుడు 36 మందిని పొట్టనబెట్టుకున్నాడు. మరోవైపు.. బావిలో పడేసిన బాధితులందరిని తీసి సరైన రీతిలో తిరిగి అంత్యక్రియలు నిర్వహించాలనే కారణంగానే తాను ఈ విషయాలను బయటపెట్టినట్లు చెప్పింది లూసీ స్టడీ. ఇదీ చదవండి: చాపకింద నీరులా విపత్తు.. దేశంలో ప్రతి 2 నిమిషాలకు ఒకరు దుర్మరణం..! -
నలుగురు ఆడపిల్లల జననం: అత్తామామ, భర్త కలిసి..
భోపాల్: ఆడపిల్లలనే కంటోందని.. అత్తామామలు కోడలిని తీవ్రంగా వేధించారు. ఒక మగబిడ్డకు జన్మనివ్వడం లేదనే ఆగ్రహంతో కోడలిని దారుణంగా హత్య చేసిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. శివపురి జిల్లా దిండోలి గ్రామానికి చెందిన సావిత్రి భగేల్, రతన్‌సింగ్ భార్యాభర్తలు. ఇంతకుముందే ముగ్గురు ఆడపిల్లలు ఉండగా ఇటీవల సావిత్రి నాలుగో కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో భర్త రతన్‌సింగ్, అతడి తల్లిదండ్రులు కిలోల్డ్ సింగ్, బేను భాయ్ తీవ్రంగా వేధించడం మొదలుపెట్టారు. ఆడపిల్లలను కనడంపై తీవ్రంగా దూషిస్తూ దాడి చేస్తుండేవారు. తాజాగా నాలుగో బిడ్డ కూడా ఆడపిల్ల కావడంతో సావిత్రిని గురువారం భర్తతో పాటు అత్తామామ ఆమె గొంతు నులిమి హత్య చేశారు. తన సోదరి మృతి చెందడంపై సావిత్రి సోదరుడు కృష్ణ భగేల్ అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అత్తామామ, భర్త చేసిన అఘాయిత్యం బయటపడింది. దీంతో రతన్‌సింగ్, కిలోల్డ్ సింగ్, బేను భాయ్‌లను అరెస్ట్ చేశారు. పెళ్లయినప్పటి నుంచి అదనపు కట్నం కోసం తన సోదరిని వేధించేవాడని కూడా అతడు పోలీసులకు చెప్పాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. చదవండి: ఈ-పాస్ కోసం అప్లై..‘సిక్స్’ తెచ్చిన తంటాతో పరేషాన్ చదవండి: అడవిలో 18 ఏనుగుల అనుమానాస్పద మృతి -
మంచినీళ్ల కోసమని వచ్చి..
సాక్షి, ఆలేరు : దుండగులు పట్టపగలే తెగబడ్డారు. ఓ మహిళను దారుణంగా హత్య చేసి బంగారు ఆభరణాలను దోపిడీ చేశారు. ఈ ఘటన ఆలేరులో శనివారం సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలానికి చెందిన నీలం నీలమ్మ(55) తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆలేరులోని క్రాంతినగర్ 4వ కాలనీలో నివాసం ఉంటోంది. నీలమ్మ ఇంల్లోనే ఉంటుండగా కూ తురు అంజుల అదే కాలనీలో ఒకరి వద్ద కుట్టు మిషన్ నేర్చుకుంటుంది. కాగా మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మంచినీళ్లు ఇవ్వమని లోనికి ప్రవేశించారు. ఆమె గొంతు నులిమి మె డలోని బంగారు గొలుసు, చెవి కమ్మలు అపహరించుకుపోయారు. కొద్ది సేపటి తర్వాత కూతు రు అంజుల ఇంటికి విషయం వెలుగులోకి వ చ్చింది. సమాచారం మేరకు 108 సిబ్బంది ఘటనాస్థలిని పరిశీలించగా అప్పటికే నీలమ్మ మృతిచెందినట్టుగా ధ్రువీకరించారు. ఆలేరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని పరీశీలించారు. దొంగల పనిగా అనుమానిస్తూ జాగిలాలను రప్పించారు. అయి తే జాగిలాలు కాలనీ నుంచి బహద్దూర్‌పేట రో డ్డు వరకు వెళ్లి నిలిచిపోయాయి. యాదగిరిగుట్ట సీఐ నర్సయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
క్షుద్రపూజల కోసం మహిళల నరబలి!
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని లంగర్ హౌజ్ పరిధిలోని మూసీనదిలో ఇద్దరు గుర్తుతెలియని మహిళల మృతదేహాలు బయటపడటం కలకలం రేపుతోంది. మహిళలను చంపిన దుండగులు మృతదేహాలను మూసీ నదిలో పారేశారు. మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిన్న రాత్రి మహిళల హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. తలపై బలమైన గాయాలు ఉండటంతో క్షుద్రపూజల కోసమే నరబలి ఇచ్చారని పోలీసులు అనుమానిస్తునారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. -
వివాహిత దారుణ హత్య!
టెక్కలి రూరల్: టెక్కలికి కూతవేటు దూరంలో మహిళ హత్యకు గురైంది. జనసంచారం లేని రహదారికి పక్కగా ఉన్న తోటల్లో వివాహిత మృతదేహాన్ని స్థానికులు సోమవారం ఉదయం గుర్తించారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లో అలజడి చెలరేగింది. మృతురాలు సారవకోట మండలం రామకృష్ణపురం పంచాయతీ పరిధి చరణ్ దాసుపురం గ్రామానికి చెందిన పందిరి నీలవేణి(39)గా నిర్ధారించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంధువుల ఇంటికి వెళతానని.. పోలాకి మండలంలోని ప్రియాగ్రహారానికి చెందిన లక్ష్మణరావుతో సారవకోట మండలంలోని చరణ్‌దాసుపురానికి చెందిన నీలవేణితో వివాహమైంది. వీరికి చిన్నారావు, సోదులు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. లక్ష్మణరావు ప్రైవేట్ బస్సు క్లీనర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవలే వీరు బతుకుదెరువు కోసం చరణ్‌దాస్‌పురం వచ్చి జీవిస్తున్నారు. పోలాకి మండలం ప్రియాగ్రహారంలోని బంధువుల ఇంటికి నీలవేణి ఆదివారం వెళ్లింది. సాయంత్రం చరణ్‌దాస్‌పురం బయలుదేరింది. చీకటి పడిపోవడంతో భర్త లక్ష్మణరావుకి ఫోన్ చేసింది. తాను కొత్తపేటలో ఉన్నానని, కురుడు గ్రామానికి ద్విచక్రవాహనంపై రావాలని సూచించింది. అమె చెప్పినట్లుగా లక్ష్మ ణరావు కురుడు వచ్చి నీలవేణికి ఫోన్ చేశారు. మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినట్లు రావడంతో చుట్టు పక్కల గాలించాడు. ఎంతకీ ఆచూకీ లభించకపోవడంతో సమీపంలోని కోటబొమ్మాళి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. సారవకోట మండలం కనుక.. అక్కడే ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు. రాత్రంతా లక్ష్మణరావుతో పాటు బంధువులు ఆమె కోసం గాలించారు. సోమవారం ఉదయం సారవకోటలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లబోతున్న సమయంలో.. టెక్కలి జీడితోటలో వివాహిత మృతదేహం ఉందని తెలిసింది. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న లక్ష్మణరావు.. మృతదేహాన్ని పరిశీలించి తన భార్య నీలవేణిగా గుర్తించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే? కాశీబుగ్గ డీఎస్పీ బర్ల ప్రసాదరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. టెక్కలి, కాశీబు గ్గ రూరల్ సీఐలు శ్రీనివాసరావు, తాతారావు, ఎస్ఐ–2 రమణ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహానికి సమీపంలో రక్తంతో నిండి ఉన్న పెద్ద రాయి, పగిలిన బీరు సీసాలు, కారం పొడి ప్యాకెట్టు, జేబు రూమాల్, సెల్‌ఫోన్ తదితర వస్తువులు పడి ఉన్నాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొత్తపేట జంక్షన్ నుంచి కురుడు వైపు వెళ్లాల్సిన అమె పోలవరం వైపు రావడంతో పాటు మృతదేహంపై కారం చల్లడం చూసిన పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుక్కలు వాసన గుర్తుపట్టకుండానే కారం చల్లారని, ప్రణాళిక ప్రకారమే చేశారని భావిస్తున్నారు. మృతదేహాన్ని సోమవారం సాయంత్రం శవపంచనామా నిమిత్తం టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి బంధువు టొంపర యర్రయ్య ఫిర్యాదు మేరకు సీఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలవరం, లింగాలవలస సమీపంలోని ఈ తోట అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. గతంలో ఇక్కడ పలు అసాంఘిక కార్యక్రమాలు చేపడుతుండగా గ్రామస్తులు మందలించిన ఘటనలు ఉన్నాయి. నిత్యం మద్యం తాగుతూ అనేక మంది కనిపిస్తుంటారని తెలిపారు. సారవకోట: మండలంలోని రామకృష్ణాపురం పంచాయతీలోని చరణ్‌దాసుపురం గ్రామానికి చెందిన పందిరి నీలవేణి టెక్కలి మండలంలో హత్యకు గురైందని తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
సహజీవనం చేసి నరికి చంపాడు.. ఆపై!
సాక్షి, చిత్తూరు: భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న మహిళ మరో వ్యక్తితో విహహేతర సంబంధం కొనసాగించడమే చివరికి ఆమె ప్రాణాలనే తీసింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. రధం మండంలోని తొప్పత్తిపల్లి పంచాయతీ మర్రిగుంటకు చెందిన పురుషోత్తం అనే వ్యక్తితో గుంటూరుకు చెందిన వనితకు వివాహం జరిగింది. వారికి సంతానం ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం కుటుంబ కలహాలతో పురుషోత్తం ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త ఆత్మహత్య చేసుకోవడంతో వనిత పుట్టింటికి వెళ్లిపోయింది. వనితకు అదే గ్రామానికి చెందిన భరత్ కుమార్ (23)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా సహజీవనానికి దారి తీసింది. కొన్ని రోజుల తర్వాత వారి మధ్య కలహాలు మొదలైయ్యాయి. గోడవలు ఎక్కువ కావడంతో భరత్.. వనితను, ఆమె కుమారుడిని అత్యంత దారుణంగా హత్యచేశాడు. శనివారం రాత్రి వనిత మవయ్య ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో తల్లీకొడుకులు రక్తపు మడుగులో కనిపించారు. వెంటనే ఇరుగు పొరుగు వాళ్లకు సమాచారం ఇవ్వడంతో తలుపులు పగలకొట్టి చూడగా భరత్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉన్నాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. తల్లీ, కొడుకుని హత్యచేసిన నిందితుడు భరత్ ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
భర్తతో చనువుగా ఉంటోందని.. వేడి నీళ్లు పోసిన భార్య
సాక్షి, హైదరాబాద్: భర్తతో చనువుగా ఉంటోందనే కోపంతో మహిళపై భార్య వేడి నీళ్లు పోయండంతో నాలుగు రోజుల పాటు చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన రాజు, రహమత్‌లు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి ఉప్పర్‌పల్లి సత్సంగ్ విహార్‌కాలనీలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నారు. వీరు ఉంటున్న ఇంటి పక్కనే ఉండే మహారాష్ట్రకు చెందిన చంద్రిక(25) రాజు వద్దే పనిచేస్తోంది. కొద్దిరోజుల క్రితం రహమత్ పుట్టింటికి వెళ్లడంతో రాజు, చంద్రిక మధ్య సాన్నిహిత్యం పెరిగింది. పుట్టింటి నుంచి తిరిగొచ్చిన రహమత్.. చంద్రిక తన భర్తతో చనువుగా ఉండటం చూసి తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో ఈ నెల 7న రాత్రి చంద్రికను మాట్లాడదామని ఇంట్లోకి పిలిచిన రహమత్ బాగా కాగిన వేడి నీళ్లను పోసింది. దీంతో చంద్రిక వీపు, ముఖం బాగా కాలడంతో ఆమెను రాజేంద్రనగర్ పోలీసులు స్థానికుల సహాయంతో ఉస్మానియాకు తరలించారు. ఆ రోజు నుంచి చికిత్స పొందుతున్న చంద్రిక శనివారం మృతిచెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నిప్పంటుకుని వివాహిత మృతి
మనుబోలు : వంట చేస్తుండగా ఒంటికి నిప్పంటుకుని వివాహిత మృతి చెందిన సంఘటన మనుబోలు దళితవాడలో గురువారం చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు... దళితవాడకు చెందిన మోచర్ల వెంకటరమణయ్య భార్య సురేఖ (28) ఇంట్లో వంట చేస్తుండగాప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకుంది. ఆమె అరుపులు విని చుట్టు పక్కల వాళ్లు మంటలను ఆర్పి 108కు సమాచారం అందించారు. అయితే అప్పటికే ఆమె శరీరం 80 శాతం పైగా కాలిపోయింది. 108 సిబ్బంది చికిత్స నిమిత్తం ఆమెను అంబులెన్స్‌లో నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. అంబులెన్స్ వచ్చేలోపు ఒళ్లు కాలి సురేఖ చేసిన హాహాకారాలు స్థానికులను కంట తడి పెట్టించాయి. సురేఖకు ఎనిమిదేళ్ల కుమారుడు జయసూర్య, ఆరేళ్ల కుమార్తె నందిని ఉన్నారు. సురేఖ మృతితో స్థానిక దళితవాడలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైద్యం అందక మహిళ మృతి
రాపూరు : రాపూరు ప్రభుత్వ వైద్యశాల ఆదివారం వైద్యులు లేని కారణంగా వైద్యం అందక ఓ మహిళ మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. సైదాపురం మండలం చీకవోలుకు చెందిన నక్కినేటి ఈశ్వరమ్మ (30) కొంత కాలంగా ఆయాసంతో బాధపడుతుంది. ఆదివారం చర్చిలో ప్రార్థనలు చేసుకునేందుకు వచ్చి తీవ్ర ఆయాసానికి గురికావడంతో ఆమెను తల్లి రామసుబ్బమ్మ రాపూరు వైద్యశాలకు ఆటోలో తీసుకు వచ్చింది. అయితే రాపూరు వైద్యశాలలో వైద్యులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఈశ్వరమ్మ కొద్దిసేపటికే మృతి చెందింది. వైద్యులు ఉంటే తమ బిడ్డ బతికేదని ఈశ్వరమ్మ తల్లి రామసుబ్బమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా రాపూరు ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు అందుబాటులో లేరని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
కుమార్తెను చూసేందుకు వచ్చి పరలోకాలకు...
బెంగళూరు(బనశంకరి) : నగరంలో మంగళవారం వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. చిక్కబళ్లాపుర జిల్లా గవిగానహళ్లి కి చెందిన లక్ష్మినారాయణాచారి, గాయత్రిదేవి(48) దంపతులు తుమకూరురోడ్డు మాదవారలో నివాసముంటున్న కుమార్తెను చూడటానికి నగరానికి చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో గవిగానహళ్లికి బైక్‌లో బయలుదేరారు. 8 వ మైల్ జంక్షన్ వద్ద వెనుకనుంచి లారీ ఢీకొంది. ప్రమాదంలో కిందపడిన గాయత్రీదేవిపై లారీ దూసుకెళ్లడంతో ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందగా లక్ష్మీనారాయణాచారి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఘటనపై పిణ్యాట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చిక్కజాల పోలీస్‌స్టేషన్ పరిధిలో...... బాగలూరుకు చెందిన భగవాన్‌దాస్, రూపా(50)దంపతులు మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో స్కూటర్లో బాగలూరు మెయిన్‌రోడ్డులో వెళ్తూ ఉన్నఫళంగా కుడివైపు తిప్పాడు. ఈక్రమంలో వెనుక నుంచి వచ్చిన స్కార్పియోవాహనం అదపు తప్పి స్కూటర్‌ను ఢీకొంది. ప్రమాదంలో కిందపడి తీవ్రంగా గాయపడిన రూపా ఘటనాస్దలంలోనే మృతిచెందింది. గాయపడిన భగవాన్‌దాస్‌ను లీగల్ ఆసుపత్రికి తరలించారు. ఘటన పై చిక్కజాల ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని కారు డ్రైవరు ఫిరోజ్ ను అరెస్ట్ చేశారు. -
చెట్టును ఢీకొన్న కారు.. మహిళ మృతి
దమ్మపేట : ఖమ్మం జిల్లా దమ్మపేట మండల శివారులోని పార్కలగండి సమీపంలో ఓ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పాల్వంచ పట్టణానికి చెందిన వరికూటి విజయలక్ష్మి(43) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా..మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాల్వంచ నుంచి గుబ్బల మంగమ్మగుడికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కాంపౌండ్ రైలింగ్ కూలి మహిళ మృతి
మర్పల్లి: రంగారెడ్డి జిల్లా మర్పల్లి గ్రామంలో ఎదురింటి కాంపౌండ్ వద్ద కూర్చుని ఉన్న మహిళలపై రైలింగ్ కూలింది. ఈ ఘటనలో పద్మ(30) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడే మరో వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. గమనించిన స్థానికులు గాయపడిన లక్ష్మమ్మను ఆస్పత్రికి తరలించారు. మృతురాలు పద్మకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
మిస్టరీ తేల్చిన ‘పోస్టర్’
వర్గల్: హతురాలి ఆచూకీ కోసం పోలీసులు అంటించిన వాల్‌పోస్టర్లు ఓ మిస్టరీని ఛేదించాయి. అడవిలో కనిపించిన మహిళ మృతదేహం ఎవరన్నదీ తేలిపోయింది. వివరాలివీ... మెదక్ జిల్లా వర్గల్ మండలం మీనాజీపేట అడవిలో ఈ నెల 6 న గుర్తు తెలియని మహిళ మృతదేహం స్థానికులకు కనిపించింది. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మృతదేహం పూసల దండ, ముక్కుపుడక, ధరించిన దుస్తులు మాత్రమే పోలీసుల దర్యాప్తుకు ఆధారంగా మిగిలాయి. దీంతో ఆ మహిళ ఎవరు అన్నది మిస్టరీగా మారింది. మిస్సింగ్ కేసుల ఆధారంగా గౌరారం పోలీసులు సాగించిన శోధన ఫలించలేదు. దీంతో వారు ఫొటోతో కూడిన వాల్‌పోస్టర్లను వర్గల్, తూప్రాన్, ములుగు, మేడ్చల్ తదితర మండలాల్లో అంటించారు. కేసు నమోదైన తరువాత 12 రోజులకు బుధవారం తూప్రాన్ మండలం పాలాటలో మృతురాలి బంధువులు పోస్టర్ చూసి మృతదేహాన్ని గుర్తుపట్టారు. మృతురాలు పాలాటకు చెందిన ఓలెం బాలమణి(45)గా నిర్ధారించారు. మృతురాలి వివరాలివీ.. తూప్రాన్ మండలం పాలాటకు చెందిన ఓలెం బాలమణి భర్త నర్సాపూర్‌కు చెందిన ముద్దగోలోల్ల రాములు గతంలోనే మృతి చెందాడు. ఆ తరువాత రోడ్డు ప్రమాదంలో కొడుకు కూడా చనిపోయాడు. దీంతో ఆమె తూప్రాన్‌లో ఓ అద్దె గదిలో ఉంటూ అక్కడి అభిరుచి హోటల్లో దినసరి వేతనంపై పనిచేస్తోంది. ఈ నెల 3న సాయంత్రం వరకు హోటల్లో పనిచేసిన ఆమె తరువాత రోజు నుంచి అదృశ్యమైంది. పని చేసిన రోజే వేతనం కావడంతో ఆమె ఎందుకు రాలేదో యజమాని పట్టించుకోలేదు. ఆమె అదృశ్యమైన విషయం బంధువులకు కూడా తెలియకపోవడంతో మీనాజీపేట అడవిలో బాలమణి శవం మిస్టరీగా మిగిలిపోయింది. అడవిలో ఏం జరిగింది..? ఆమె శవంగా ఎందుకు మారిందో ప్రశ్నార్థకంగా నిలిచింది. అడవిలో ఏం జరిగింది, ఎవరైనా అఘాయిత్యానికి ఒడిగట్టారా, అక్కడే అంతమొందించారా, లేదా ఎక్కడైనా హతమార్చి ఇక్కడకు తీసుకొచ్చి పడేశారా.. ఇలాంటి అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లోనే ఈ కేసును ఛేదిస్తామని గౌరారం ఎస్సై మధుసూదన్‌రెడ్డి అంటున్నారు. -
భర్తను విదేశానికి పంపేందుకు వెళుతూ..
హైదరాబాద్: భర్తను విదేశానికి సాగనంపేందుకు పిల్లలతో సహా ఎయిర్ పోర్టుకు బయలుదేరిన మహిళ మృత్యువాతపడింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం రాత్రి జరిగిన కారు ప్రమాదంలో మాధురి (28) అనే మహిళ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. కారులో ఉన్న భర్త, ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. కీసర సమీపంలోని నాగారంలో మాధురి కుటుంబం నివసిస్తోంది. ఆమె భర్త దక్షిణాఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. మంగళవారం ఆయనను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగబెట్టేందుకు పిల్లలతోపాటు కారులో బయలుదేరారు. ఔటర్ పై తుక్కుగూడ వద్ద.. ఎయిర్ పోర్టుకు వెళ్లే దారిని కనుగొనడంలో పొరపాటు తలెత్తడంతో రోడ్డు మధ్యనే బ్రేక్ వేశారు. దీంతో వెనుకనుంచి వస్తోన్న మరో కారు మాధురి కుటుంబం ప్రయాణిస్తోన్న కారును ఢీకొట్టింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సిఉంది. -
గ్యాస్ సిలిండర్ పేలుడు: మహిళ మృతి
అనంతపురం: అనంతపురం లోని నవోదయ కాలనీలో ఓ ఇంట్లో ప్రమాదవ శాత్తూ గ్యాస్ సిలిండర్ పేలింది. గురువారం జురిగిన ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పేలుడు ధాటికి ఇంటి పై కప్పు కూలిపోయింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. -
డివైడర్ ను ఢీకొన్న అంబులెన్స్
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ హైవేపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే పై వెళ్తున్న అంబులెన్స్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో అంబులెన్స్ లో ఉన్న పేషంట్ సుబ్బమ్మ మృతి చెందింది. ఈ ఘటనలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి
హైదరాబాద్: ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన నగరంలోని బోయిన్పల్లి చెక్‌పోస్టు వద్ద శనివారం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.