వివాహేతర సంబంధాలు కుటుంబాలను బజారుకీడుస్తున్నాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా వారి కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఓ వివాహితుడు.. తన ప్రేయసితో ఓయో హోటల్ రూమ్‌లో గొడవకు దిగి.. ఆమెను దారుణంగా చంపాడు.
వివరాల ప్రకారం.. నిందితుడు ప్రవీణ్‌కు కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. భార్య, పిల్లలతో ప్రవీణ్ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రవీణ్‌కు గీత అనే మరో మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వీరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో, వీరిద్దరూ పలుమార్లు ఢిల్లీలోని హోటల్స్‌లో కలుసుకునేవారు. ఈ క్రమంలోనే మంగళవారం కూడా వీరు ఓయో హోటల్‌లో రూమ్ అద్దెకు తీసుకున్నారు.
అనంతరం, రూమ్‌లో వారిద్దరూ వాదనలకు దిగారు. వీరి మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో నిందితుడు ప్రవీణ్.. గీత చాతిపై గన్‌తో కాల్చాడు. దీంతో, ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తర్వాత.. ప్రవీణ్ తనను తాను గన్‌తో కాల్చుకున్నాడు. కాగా, గన్ పేలిన శబ్ధం వినిపించడంతో హోటల్ సిబ్బంది వెంటనే రూమ్‌కు వెళ్లి చూడగా వారిద్దరూ కిందపడిపోయి ఉన్నారు. దీంతో, పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అక్కడకు చేరుకున్న పోలీసులు.. వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే గీత మృతిచెందినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రవీణ్.. గాయాలతో ప్రాణపాయం నుండి బయటపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment