Oyo rooms
-
ఫ్రీగా ఓయో రూమ్స్‌లో బస
భారతదేశ ప్రముఖ ఆతిథ్య బ్రాండ్లలో ఒకటైన ఓయో రూమ్స్ వినియోగదారులకు హోలీ సందర్భంగా ఉచిత ఆఫర్‌ను ప్రకటించింది. ఇండియా క్రికెట్ టీమ్ ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సాధించండం, తర్వాత హోలీ పండుగ నేపథ్యంలో మార్చి 13 నుంచి 18 వరకు ఓయో దేశవ్యాప్తంగా 1,000 ప్రీమియం కంపెనీ సర్వీస్ హోటళ్లలో రోజూ 2,000 ఉచిత స్టేలను అందిస్తున్నట్లు పేర్కొంది. ఈమేరకు సంస్థ వ్యవస్థాపకులు రితేష్ అగర్వాల్ ఎక్స్ వేదికగా వివరాలు వెల్లడించారు.వినియోగదారులు ఈ పరిమిత ఓయో ప్రీమియం ఆతిథ్యాన్ని ఎటువంటి ఖర్చు లేకుండా ఆస్వాధించవచ్చని రితేష్ తెలిపారు. ఓయో యాప్ లేదా వెబ్సైట్ ద్వారా బుకింగ్ చేసేటప్పుడు కూపన్ కోడ్ ‘CHAMPIONS’ అని ఎంటర్ చేయాలని పేర్కొన్నారు. దాంతో కస్టమర్లు తమ కాంప్లిమెంటరీ స్టేను రెడీమ్ చేసుకోవచ్చని చెప్పారు. ఈ ఆఫర్ ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్(ముందుగా బుక్ చేసుకున్న వారికే వర్తించేలా) ప్రాతిపదికన పని చేస్తుందని స్పష్టం చేశారు.Some wins are bigger than just a trophy. India’s ICC Champions Trophy victory isn’t just about cricket—it’s about the unshakable spirit of a billion people, the collective cheers, the nail-biting finishes, and that electrifying moment when the whole country erupts in joy.And… pic.twitter.com/M0m6KAdHds— Ritesh Agarwal (@riteshagar) March 13, 2025ఇదీ చదవండి: రాత్రిపూట రైళ్లు ఎందుకు వేగంగా నడుస్తాయి?భారత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయాన్ని అందరూ అస్వాదిస్తున్నారని రితేశ్ తెలిపారు. ఈ నేపథ్యంలో హోలీ తోడవడం వినియోగదారులకు మరింత ఉత్తేజాన్ని ఇస్తుందన్నారు. ఈ తరుణంలో కంపెనీ కస్టమర్లకు ఉచిత ఆఫర్ ప్రకటించిందని చెప్పారు. ఈ వారాంతంలో మధురమైన జ్ఞాపకాలను సొంతం చేసేందుకు కంపెనీ తోడైందని తెలిపారు. ప్రయాణాలు చేయడం, ప్రియమైనవారిని కలవడం కంటే సంతోషకరమైన క్షణాలు ఏముంటాయన్నారు. అందుకోసం ఓయో రూమ్స్ ‘టౌన్ హౌస్, కలెక్షన్ ఓ’తో సహా 1000కి పైగా ఓయో కంపెనీ సర్వీస్ హోటళ్లలో మార్చి 13-18 వరకు ప్రతిరోజూ ఉచిత బసలను అందిస్తున్నట్లు చెప్పారు. -
యూకేలో ఓయో పెట్టుబడులు
ఆతిథ్య రంగంలో ఉన్న ఓయో తాజాగా యూకేలో సుమారు రూ.540 కోట్లు వెచ్చించనున్నట్టు తెలిపింది. ప్రీమియం హోటల్ పోర్ట్‌ఫోలియో విస్తరణకు వచ్చే మూడేళ్లలో ఈ మొత్తాన్ని ఖర్చు చేయనుంది. తద్వారా యూకే ఆతిథ్య రంగంలో 1,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించింది. విస్తరణలో భాగంగా దీర్ఘకాలిక లీజు, నిర్వహణ ఒప్పందాలను కుదుర్చుకుంటున్నట్టు తెలిపింది. 2018లో యూకే మార్కెట్లో అడుగుపెట్టినట్టు కంపెనీ వివరించింది. 200లకుపైగా హోటళ్లు ఓయో జాబితాలో ఉన్నాయి. యూకేలో 65 నగరాల్లో ఇవి విస్తరించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40 ప్రీమియం హోటళ్లను అందుబాటులోకి తేనున్నట్టు కంపెనీ గతంలో ప్రకటించింది. ఇందులో ఇప్పటికే 18 తెరుచుకున్నాయి. యూఎన్ గ్లోబల్ కాంపాక్ట్‌లో జీఎంఆర్ ఎయిర్పోర్ట్కార్పొరేట్ల సుస్థిర అభివృద్ధి ప్రణాళికల అమలుకు సంబంధించిన యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కాంపాక్ట్‌లో (యూఎన్‌జీసీ) చేరినట్లు జీఎంఆర్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(జీఏఎల్) వెల్లడించింది. మానవ హక్కులు, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపరంగా యూఎన్‌జీసీ నిర్దేశించుకున్న పది సూత్రాలకు, అలాగే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు (ఎస్డీజీ) అనుగుణంగా తమ వ్యూహాలు, కార్యకలాపాలను నిర్వహించనున్నట్లు వివరించింది. తమ విమానాశ్రయాలన్నింటికీ యూఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ లేదా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సర్టిఫికేషన్ ఉన్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: అక్రమ జామర్స్‌తోనే కాల్ డ్రాప్స్పర్యావరణహిత ఏవియేషన్‌లో అంతర్జాతీయంగా అగ్రగామిగా ఎదిగే దిశగా ఇదొక కీలక అడుగని జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ సీఈవో కిరణ్ కుమార్ గ్రంధి తెలిపారు. హైదరాబాద్, ఢిల్లీ, గోవా, మెడాన్ (ఇండొనేషియా) విమానాశ్రయాలను జీఏఎల్ నిర్వహిస్తోంది. అలాగే, విశాఖలోని భోగాపురం, గ్రీస్‌లోని క్రెటెలో విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తోంది. ఫిలిప్పీన్స్‌లోని మక్టాన్ సెబు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి సాంకేతిక సేవలు అందిస్తోంది. -
సకుటుంబ ఇమేజ్ కోసం తహతహ: ఓయో
‘‘ఓకే అని అంటివా ఓయోకి రమ్మంటడు'’.. అంటూ ఓ సినీ రచయిత హీరోయిన్‌తో పలికిస్తాడు. ఆఖరికి సినీరచనలను సైతం ప్రభావితం చేసేలా మారిపోయింది. ఓయో బ్రాండ్ అనే దానికి ఇదో నిదర్శనం.అన్ మ్యారీడ్ కపుల్స్‌కి ఆహ్వానం..ఓయో అనే సంస్థ.. పలు హోటల్స్‌తో ఒప్పందాల ద్వారా దేశవ్యాప్తంగా బస సౌకర్యాలను విస్తరించడం ప్రారంభించిన సమయంలో ఈ పరిస్థితి లేదు. అయితే ఆ తర్వాత తర్వాత.. అన్ మ్యారీడ్ కపుల్ వెల్కమ్ అనే లైన్ ఎప్పుడైతే ఓయో యాప్ ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించిందో.. అప్పటి నుంచే ఆ యాప్ డౌన్‌లోడ్స్‌తో పాటు బ్రాండ్ వాల్యూ కూడా అమాంతం పెరిగిపోతూ వచ్చింది.ఈ నేపధ్యంలోనే అకస్మాత్తుగా ఓయో బ్రాండ్ ఇటీవల తన పంధాను సంస్కరించుకోవడం ప్రారంభించింది. పెళ్లికాని జంటలకు గదులు అద్దెకు ఇవ్వడం అనే విధానం నుంచి వెనక్కు మళ్లుతున్నట్టు కనిపిస్తోంది. పెళ్లికాని జంటలకు స్నేహపూర్వక విడిదిగా ప్రసిద్ది చెందిన ఈ బ్రాండ్ గత కొన్ని నెలలుగా సకుటుంబ - ఆధారిత ప్లాట్‌ఫారమ్‌గా ఓయోను రీబ్రాండ్ చేయడానికి కృషి చేస్తోంది.పెళ్లికాని జంటలకు సంబంధించి తన చెక్ - ఇన్ విధానాన్ని సవరించడం మీరట్‌లో ప్రారంభం కావడం మొదలు.. ఓయో హోటల్ సోషల్ మీడియాలో చర్చోపచర్చలకు దారి తీసింది. ఈ నేపధ్యంలోనే సంస్థ వ్యవస్థాపకుడు 'రితేష్ అగర్వాల్' మీడియాతో మాట్లాడారు. తమపై పడిన బ్రాండింగ్‌ను ఉద్దేశించి.. ఇది ఎక్కువగా మీమ్స్‌తో ముడిపడిన ’సోషల్ మీడియా సృష్టిగా ఆయన అభివర్ణించాడు.తమ వ్యాపారంలో దాదాపు 70 - 80% కుటుంబాలు లేదా వ్యాపార ప్రయాణీకుల నుంచే వస్తుందనీ.. అయినప్పటికీ, సోషల్ మీడియా కొన్ని మీమ్‌ల ద్వారా తమపై మరో తరహా అభిప్రాయానికి ఆజ్యం పోసిందనీ ఆయన చెప్పారు. అయితే ఇదంతా కేవలం నగరాల్లో అదీ కొన్ని ప్రాంతాల్లో మాత్రమేనని తీసిపారేశారు. అయితే తాను ఓ రకంగా దీనిని అభినందిస్తున్నాననీ.. ఎందుకంటే ఇది (పెళ్లికాని జంటల బస) సమాజానికి కూడా ఒక సవాలుగా ఉంది కదా అన్నారాయన.తమ బ్రాండ్‌కు ఆథ్యాత్మిక ఇమేజ్ తేవడానికి కూడా ఆయన ప్రయత్నించినట్టు కనిపించింది. అయోధ్యలో 80 హోటళ్లను ప్రారంభించామనీ.. వారణాసి, రామేశ్వరం, అజ్మీర్ సహా దేశవ్యాప్తంగా ఆధ్యాత్మికప్రదేశాలలో తాము భాగస్వాములను కలిగి ఉన్నామనీ ఆయన చెప్పుకొచ్చారు. తమ బ్రాండ్‌పై సోషల్ మీడియా మీమ్‌లు సృష్టించిన అపోహల గురించి గుసగుసలాడే బదులు, మా బ్రాండింగ్‌కి ఎదరువుతున్న సవాలును ధైర్యంగా నేరుగా ఎదుర్కొని పరిష్కరించాలనుకుంటున్నాం.. అన్నారాయన.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డుతో అద్దె కడుతున్నారా.. ఈ విషయాలు తెలుసా?తమ కొత్త బ్రాండింగ్ వ్యూహం విజయవంతమైందని, గత మూడేళ్లలో కంపెనీ అత్యధిక యాప్ డౌన్లోడ్లు, రిపీట్ రేట్లు హోటల్ ఓపెనింగ్లను చూసిందన్నారు. మేం నిజంగా చాలా ప్రేమను పొందామని ఆయన పేర్కొన్నారు.సోషల్ మీడియాలో వచ్చిన మీమ్‌లు తనను ఇబ్బంది పెట్టాయా లేదా తన కంపెనీని ఎలా గుర్తించిందనే దాని గురించి బాధగా అనిపించిందా అని అడిగినప్పుడు.. అగర్వాల్ స్పందిస్తూ, అదేం లేదు, ఓయో.. కార్పొరేట్ ప్రపంచంలో అత్యంత గౌరవనీయమైన బ్రాండ్. ఇది అనేక ఉత్తమ కార్పొరేట్ అవార్డులను సాధించిందని ఆయన వెల్లడించారు. -
పెళ్లి కాని జంటలకు ఓయో రూమ్ కష్టమే
న్యూఢిల్లీ: ప్రముఖ ప్రయాణ బుకింగ్స్ వ్యాపార సంస్థ ఓయో కొత్తగా తమ భాగస్వామ్య హోటళ్లలో దిగే వినియోగదారులకు నూతన నిబంధనలను అమల్లోకి తెస్తోంది. తొలుత మీరట్ పట్టణంలో మాత్రమే ఈ కొత్త చెక్–ఇన్ నియమావళిని అమలుచేస్తోంది. పెళ్లికాని జంటలకు హోటల్ గది ఇవ్వడం ఇకపై కుదరదని తేల్చిచెప్పింది. సవరించిన నిబంధనావళి ప్రకారం ఎవరైనా జంట హోటల్ గదిని బుక్చేయాలనుకుంటే తమ వివాహబంధాన్ని ధృవీకరిస్తూ ఏదైనా గుర్తింపును చూపాల్సి ఉంటుంది. స్థానిక సామాజిక సున్నితాంశాలను పరిగణనలోకి తీసుకుని గదిని ఎవరికి ఇవ్వాలి ఇవ్వకూడదు అనే విచక్షణాధికారం ఆయా హోటళ్లకు ఉందని ఓయో ఒక ప్రకటనలో పేర్కొంది. కొత్త చెక్–ఇన్ నిబంధనలపై ఫీడ్‌బ్యాక్ తీసుకుని తదనుగుణంగా సవరించిన నియామావళిని దేశవ్యాప్తంగా త్వరలో అమలుచేసే యోచన ఉందని ఓయో పేర్కొంది. ‘‘అత్యంత సురక్షితమైన, భద్రమైన, మెరుగైన హోటల్ సేవలు అందించే లక్ష్యంతో కొత్త నిబంధనావళిని తెస్తున్నాం. వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు విలువ ఇస్తూనే పౌరసమాజాల విజ్ఞప్తులు, వినతులను పరిగణనలోకి తీసుకుని మేం పనిచేయాల్సి ఉంటుంది. కుటుంబాలు, విద్యార్థులు, ఒంటరిగా ప్రయాణాలు చేసే పర్యాటకులు, సందర్శకులు, వ్యాపారుల సౌకర్యార్థం కొత్త నియమావళిని తెస్తున్నాం’అని ఓయో నార్త్ ఇండియా రీజియన్ హెడ్ పవాస్ శర్మ చెప్పారు. ‘‘మెరుగైన, పటిష్ట నిబంధనల కారణంగా వినియోగదారుల్లో మా పట్ల విశ్వాసం మరింత పెరుగుతుంది. అప్పుడు ఎక్కువ రోజులు గదులు అద్దెకు తీసుకోవడం, మళ్లీ మళ్లీ బుక్ చేయడం వంటివి చేస్తారు’’అని ఆయన అన్నారు. అనైతిక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న హోటళ్లపై చర్యలు తీసుకోవడం, వాటిని నిషేధించడం, తమ బ్రాండ్ పేరును అనధికారికంగా వాడుకోవడం, దుర్వినియోగం చేయడం వంటి వాటిపై ఓయో సంస్థ.. హోటళ్ల భాగస్వాములు, పోలీసులతో కలిసి పనిచేస్తోంది. ఇందుకోసం సంస్థ ఇప్పటికే దేశవ్యాప్తంగా సంయుక్తంగా పలు సెమినార్లను నిర్వహించింది. -
ఓయో సంచలన నిర్ణయం.. ఆ జంటలకు నో రూమ్
ప్రముఖ ట్రావెల్, హోటల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఓయో (OYO) పెళ్లికాని జంటలకు షాకిచ్చింది. ఇకపై పెళ్లి కాని జంటలకు రూమ్స్ బుకింగ్స్ లేదంటూ తేల్చిచెప్పింది. ఈమేరకు తన భాగస్వామి హోటల్లకు చెక్ ఇన్ పాలసీలో కీలక మార్పులు తీసుకొచ్చింది.ఇకపై పెళ్లి కాని యువతీ, యువకులు ఓయో రూమ్స్ లో చెక్ ఇన్ చేసేటప్పుడు వారి రిలేషన్‌షిప్‌కు సంబంధించిన చెల్లుబాటు అయ్యే ఐడీ ప్రూఫ్స్ అడగనుంది. సరైన ఐడీ ప్రూఫ్ లేకపోతే బుకింగ్స్‌ను తిరస్కరించే అధికారాన్ని పార్టనర్ హోటల్స్‌కు ఇస్తున్నట్టు ఓయో చెప్పుకొచ్చింది.మొదటగా మీరట్ నుంచి..మొదటగా ఉత్తరప్రదేశ్ మీరట్‌లోని ఓయో భాగస్వామి హోటల్స్‌లో కొత్త చెక్ ఇన్ పాలసీని ప్రారంభించింది. అక్కడ నుంచి వచ్చే గ్రౌండ్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా కంపెనీ ఈ కొత్త రూల్‌ని దేశంలోని మరిన్ని నగరాలలో అమలు చేయనుంది. ఇటీవల కొత్త సంవత్సరం సందర్భంగా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం ఓయో రూమ్స్ ఉపయోగించిన వారి సంఖ్య 10 లక్షలు దాటింది. 2023తో పోలిస్తే ఈ సంఖ్య 58 శాతం పెరిగింది.పెళ్లికాని జంటలు విచ్చలవిడిగా ఓయో రూమ్స్‌ను దుర్వినియోగం చేస్తున్నారని, దీన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని పౌర సమాజ సమూహాల నుంచి అభ్యర్థనలు వచ్చాయి. ఓయో రూమ్స్ దుర్వినియోగంపై ముఖ్యంగా మీరట్‌లో పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వచ్చాయి. దీంతో అక్కడ నుంచే ఓయో కొత్త చెక్ ఇన్ పాలసీని ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఓయోపై ఉన్న పాత అభిప్రాయాలను మార్చడం, కుటుంబాలు, విద్యార్థులు, వ్యాపార వర్గాలు, మతపరమైన, ఒంటరి ప్రయాణీకులకు సురక్షితమైన అనుభూతిని అందించే బ్రాండ్‌గా తనను తాను రూపొందించుకోవడం లక్ష్యంగా కంపెనీ ఈ చొరవ తీసుకున్నట్లు ఓయో నార్త్ ఇండియా రీజియన్ హెడ్ పవాస్ శర్మ పేర్కొన్నారు.సురక్షితమైన ఆతిథ్య పద్ధతులపై పోలీసులు, హోటల్ భాగస్వాములతో కలిసి సదస్సులను నిర్వహించడంతోపాటు అనైతిక కార్యకలాపాలను ప్రోత్సహించే హోటళ్లను బ్లాక్‌లిస్ట్ చేయడం, ఓయో బ్రాండింగ్‌ని అనధికారిక ఉపయోగించే హోటళ్లపై చర్యలు తీసుకోవడం వంటి అనేక దేశవ్యాప్త కార్యక్రమాలను ఓయో ప్రారంభించింది. -
డిసెంబర్ 31న ఎన్ని ఓయో రూమ్స్ బుక్ అయ్యాయో తెలిస్తే షాక్..!
-
ఓయో రూమ్స్ బుకింగ్స్‌లో హైదరాబాద్ టాప్
సాక్షి, హైదరాబాద్: రాకపోకలతో కిక్కిరిసిపోతున్న మన హైదరాబాద్.. హోటల్ బుకింగ్స్‌లోనూ టాప్‌గా నిలుస్తోంది. మెట్రో నగరాలన్నింటి కన్నా మిన్నగా మన నగరం అత్యధిక బుకింగ్స్ సాధిస్తోంది. ఈ విషయాన్ని లీజ్, ఫ్రాంచైజీ మోడల్స్‌లో గదులు అద్దెకు ఇచ్చే ప్రముఖ హాస్పిటాలిటీ సంస్థ ఓయో తాజాగా విడుదల చేసిన ట్రావెలోపీడియా 2024’ వార్షిక నివేదిక వెల్లడిస్తోంది. నివేదిక వెల్లడించిన మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలు.. వరుసగా రెండో ఏడాదీ మనమే.. గతేడాది కూడా మన నగరం అత్యధికంగా బుకింగ్స్ కలిగిన నగరంగా నిలిచింది. తర్వాత స్థానాల్లో వరుసగా బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా వంటి నగరాలు బుకింగ్‌లలో అగ్రస్థానాలను పొందగా, విచిత్రంగా ముంబై బుకింగ్స్‌లో దిగజారింది. దీనికి కారణం ముంబైకి వెళ్లే పర్యాటకులు ఆ నగరానికి సమీప ప్రాంతాల్లోని విశ్రాంతికి, విహారానికి అనువుగా ఉండే ప్రదేశాలను ల్లో ఉండేందుకు ఇష్టపడటమేనని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ టాప్.. దేశంలోకెల్లా ఉత్తరప్రదేశ్ ప్రయాణానికి అత్యంత ప్రజాదరణ పొందిన రాష్ట్రంగా నిలిచింది. పూరి, వారణాసి, హరిద్వార్ తీర్థయాత్రల రంగానికి నాయకత్వం వహించడంతో, ఆధ్యాతి్మక పర్యాటకం భారతదేశ పర్యాటకానికి ప్రధాన చోదకశక్తిగా ఉందని నివేదిక పేర్కొంది. డియోఘర్, పళని, గోవర్ధన్ వంటి ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్యలో గణనీయమైన మార్పు కనిపించింది. ఇది గతంలో అంతగా తెలియని ఆధ్యాత్మిక ప్రదేశాలపై పెరుగుతున్న ఆసక్తిని తెలియజేస్తోంది. విహారం.. వ్యాపారం.. విశ్రాంతి, విహారాలతో పాటు వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన ప్రయాణాల్లోనూ హైదరాబాద్ గణనీయమైన పెరుగుదల చూసింది. ప్రయాణికుల సంఖ్యాపరంగా చూస్తే మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక వరుసగా తొలి మూడు స్థానాలు దక్కించుకున్నాయి. బీహార్‌లోని పాటా్న, ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, కర్ణాటకలోని హుబ్లీ వంటి చిన్న పట్టణాలు ఈ ఏడాది అద్భుతమైన వృద్ధితో బుకింగ్‌లు 48 శాతం పెంచుకున్నాయి. జైపూర్, గోవా, పాండిచ్చేరి, మైసూర్ అగ్ర పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి.మళ్లీ మనమే.. -
కొండాపూర్ ఓయో రూమ్ లో డ్రగ్స్ పార్టీ.. ఢీ కొరియోగ్రాఫర్ కన్హ మహంతి అరెస్ట్
-
శంషాబాద్ ఓయో హోటల్ లో సీసీ కెమెరాలు
-
శంషాబాద్ ఓయో హోటల్ లో సీసీ కెమెరాలు
-
ఓయో కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్
-
సూపర్ ఆఫర్.. డబ్బులు లేకుండా ఓయో రూమ్!
హాస్పిటాలిటీ టెక్నాలజీ కంపెనీ ఓయో (OYO) భారతీయ ప్రయాణికులకు అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. స్టే నౌ పే లేటర్ (SNPL) సౌకర్యాన్ని కల్పించింది. సాధారణంగా ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసే కస్టమర్లకు ఈ-కామర్స్ వెబ్సైట్లు, రిటైల్ షాపులు ఇలాంటి బై నౌ పే లేటర్ ఆఫర్లను అందిస్తుంటాయి. ఆఫర్ వివరాలు SNPL సౌకర్యం కింద కస్టమర్లకు రూ. 5,000 వరకు క్రెడిట్ పరిమితిని అందిస్తారు. 15 రోజుల బస తర్వాత మొత్తాన్ని సెటిల్ చేయాలి. ఈ ఫీచర్ కోసం క్రెడిట్ ఆధారిత చెల్లింపుల సేవ అయిన Simplతో ఓయో భాగస్వామ్యం కలిగి ఉంది. ఓయో యాప్ హోమ్ స్క్రీన్‌పై ఈ ఫీచర్‌ని యాక్సెస్ చేయవచ్చు లేదా చెల్లింపు మోడ్ ఎంపిక సమయంలో Simplని ఎంచుకోండి. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో iOS యూజర్లకు అందుబాటులోకి రానుంది. తరచూ ప్రయాణాలు చేసేవారికి ఈ SNPL ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుందని ఓయో గ్లోబల్ సీవోవో, చీఫ్ టెక్నాలజీ & ప్రోడక్ట్ ఆఫీసర్ అభినవ్ సిన్హా చెప్పారు. Simpl ద్వారా హోటల్ బుకింగ్ చేసుకునే కస్టమర్లకు 65 శాతం వరకు తగ్గింపుతోపాటు రూ. 50 క్యాష్‌బ్యాక్‌ను లభిస్తుంది. అయితే Simpl యాప్‌లో చెల్లింపును 15 రోజులకు మించి ఆలస్యం చేస్తే, మీ బిల్లు మొత్తాన్ని బట్టి వడ్డీ, రూ. 250 వరకు ఆలస్య రుసుముతోపాటు జీఎస్టీని విధిస్తుంది. ఇదీ చదవండి: Ritesh Agarwal: ఆ పని చేసినందుకు రూ.20 టిప్పు ఇచ్చారు: తొలినాళ్లను గుర్తు చేసుకున్న ఓయో ఫౌండర్ -
Hyderabad: ఓయో రూమ్స్ మేనేజర్ ఆత్మహత్య
హైదరాబాద్: ఓయో హోటల్లో మేనేజర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్ కుషమ్‌కాష్ గ్రామానికి చెందిన అనుర«ద్‌సింగ్, సచిన్‌సింగ్(30) ఇద్దరూ నాచారం మల్లాపూర్‌లో ఉంటూ ఓయో హోటల్లో పనిచేస్తున్నారు. మూడు నెలలుగా మల్కాజిగిరి మారుతీనగర్‌లోని సాయి మాన్సన్ ఓయో హోటల్ నిర్వహిస్తున్నాడు. 16వ తేదీ రాత్రి తన రూమ్‌లోకి వెళ్లిన సచిన్‌సింగ్ తలుపు తీయలేదు. తలుపు పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొనని దర్యాప్తు చేస్తున్నారు. -
కేపీహెచ్బీలో ఓయో రూమ్లపై పోలీసుల దాడులు..
సాక్షి, హైదరాబాద్: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సర్దార్ పటేల్ నగర్‌లోని బ్యూటిఫుల్ స్టే ఓయో రూమ్‌పై ఎస్వోటి పోలీసులు మంగళవారం దాడులు జరిపారు. వెస్ట్ బెంగాల్‌కి చెందిన 8 మంది మహిళలను పోలీసులు కాపాడి రెస్క్యూ హోమ్‌కి తరలించారు. ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి నుంచి 10 వేలు నగదు, 5 సెల్ ఫోన్లు, 130 కండోమ్ ఫ్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిన్న(సోమవారం) కూడా కేపీహెచ్‌బీలోని పలు ఓయో రూమ్లపై బాలానగర్ ఎస్వోటి పోలీసులు దాడులు చేశారు. 9 మంది యువతులను రక్షించారు. చదవండి: ఎమ్మెల్యే మోసం చేశారు.. మరో వీడియో విడుదల చేసిన యువతి -
ఓయో ఫౌండర్ రితేష్ అగర్వాల్ పెళ్లిలో ఆసక్తికర ఘటన!
ఆతిథ్యం, ప్రయాణ సేవల(ట్రావెల్ టెక్) కంపెనీ ఓయో అధినేత రితేష్ అగర్వాల్ (Ritesh Agarwal) వివాహం ఘనంగా జరిగింది. రితేశ్ అగర్వాల్- గీతాన్షా దంపతుల వివాహానికి సాఫ్ట్‌బ్యాంక్ చైర్మన్ మసయోషి సన్ హాజరయ్యారు. మసయోషితో పాటు ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్, పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ, లెన్స్ కార్ట్ సీఈవో పియోష్ బన్సాల్ వంటి కార్పొరేట్ దిగ్గజాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రితేష్ అగర్వాల్ దంపతులు సాఫ్ట్ బ్యాంక్ చైర్మన్ మసయోషి సన్ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం దేశీయ కార్పొరేట్ వరల్డ్‌లో ఆసక్తికరంగా మారింది. ఇక మసయోషి పర్యటనపై విజయ్ శేఖర్ శర్మ ట్వీట్ చేశారు. ఈ రోజు వెలకట్టలేని ఆనందం. మస నవ్వుతూ, సంతోషంగా ఉన్న ఈ ఆనంద సమయాల్లో భారత పర్యటన చేయడం..దేశీయ స్టార్టప్‌లపై అతనికి ఉన్న నమ్మకం, సపోర్ట్‌కు కృతజ్ఞతలు అంటూ మసయోషితో దిగిన ఫోటోల్ని ట్వీట్ చేశారు. కేంద్ర జల్‌శక్తిశాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ సైతం పెళ్లికి హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపారు. Ultimate joy today, seeing Masa smiling, happy and enjoying his India trip. Everyone of us had tons of gratitude for his belief and support given to our Startups. pic.twitter.com/pt33w0AwyE — Vijay Shekhar Sharma (@vijayshekhar) March 7, 2023 గత వారం తన వివాహ వేడుక ఆహ్వాన పత్రికను ప్రధాని నరేంద్ర మోదీకి అందజేశారు. ఢిల్లీలో తన తల్లి, కాబోయే భార్యతో కలిసి మోదీ వద్దకు వెళ్లిన రితేశ్.. ప్రధానికి పెళ్లి ఆహ్వానపత్రిక అందజేసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఆ ఫోటోలను రితేష్ అగర్వాల్ ట్విటర్లో షేర్ చేశారు. -
ఓయో ఫౌండర్ రితేష్ అగర్వాల్ పెళ్లి.. ఆహ్వానితుల్లో అత్యంత ప్రముఖులు!
దేశీయ హాస్పెటాలిటీ చెయిన్ ఓయోను స్థాపించిన రితేష్ అగర్వాల్ పెళ్లి మార్చి 7న ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో అత్యంత వైభవంగా జరగబోతోంది. ఈ విలాసవంతమైన వివాహానికి అత్యంత ప్రముఖులు చాలా మందినే ఆహ్వానించారు. పెళ్లికి ప్రముఖులు ఎవవరెవరు హాజరవుతున్నారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రితేష్ అగర్వాల్ ఇటీవల తన తల్లి, కాబోయే భార్యతో కలిసి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని పెళ్లికి ఆహ్వానించారు. ఈ పెళ్లికి ఆహ్వానితుల జాబితాలో ప్రధాని మోదీతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఓయో బిజినెస్ కి సహకారం అందించిన ఎయిర్ బీఎన్బీ, లైట్ స్పీడ్ కామర్స్ వంటి సంస్థల అధినేతలు కూడా ఉన్నట్లు సమాచారం. అగర్వాల్ పెళ్లికి సాఫ్ట్‌బ్యాంక్ చైర్మన్ మసయోషి సన్ హాజరవుతున్నట్లు బ్లూమ్‌బర్గ్ సంస్థ నివేదిక చెబుతోంది. ఓయో బిజినెస్‌లో అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టిన వాటిలో జపాన్‌కి చెందిన సాఫ్ట్ బ్యాంక్ కూడా ఒకటి. అందుకే రితేష్ అగర్వాల్ పెళ్లికి సాఫ్ట్ బ్యాంక్ చైర్మన్ కూడా వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. చదవండి: Ex-Twitter employee: ఆఫీస్‌లో నేలపై పడుకుని అప్పట్లో వైరల్! అంతలా కష్టపడినా వేటు తప్పలేదు.. రితేష్ అగర్వాల్ ఒడిషాలోని రాయగడ్‌కు చెందిన మార్వాడీ కుటుంబంలో జన్మించారు. వారి కుటుంబం అక్కడ చిన్న కిరాణ దుకాణం నిర్వహించేది. రితేష్ సిమ్ కార్డ్స్ అమ్ముకునే వాడు. థీల్ ఫెల్లోషిప్లో తాను గెల్చుకున్న డబ్బుతో 2013లో ఓయో సంస్థను స్థాపించారు. ఈ వ్యాపారం అనతికాలంలోనే భారీగా విజయవంతమైంది. ఒకప్పుడు సాధారణ యువకుడైన రితేష్.. తన పెళ్లికి ఇప్పుడు పెద్ద పెద్ద వాణిజ్యవేత్తలు, ప్రముఖులు సైతం వచ్చేంత స్థాయికి ఎదిగారు. చదవండి: Aadhaar-Pan Linking: తరుముకొస్తున్న గడువు.. కానీ వీరికి ఆ టెన్షన్ లేదు! -
చిన్న పట్టణాల్లో ఎక్కువ బుకింగ్‌లు
న్యూఢిల్లీ: ఈ ఏడాది చిన్న పట్టణాల్లో హోటల్ గదుల బుకింగ్‌లు ఎక్కువగా ఉన్నట్టు ఓయో తెలిపింది. హోటల్ బుకింగ్ సేవలను అందించే ఈ సంస్థ ఈ ఏడాదికి సంబంధించి గణాంకాలు విడుదల చేసింది. తెనాలి, హాత్రాస్, ససారామ్, కరైకుడి తదితర పట్టణాల్లో క్రితం ఏడాదితో పోల్చినప్పుడు ఈ ఏడాది ఎక్కువ బుకింగ్‌లు చూసినట్టు తెలిపింది. వ్యాపార పర్యటనలకు సంబంధించి బుకింగ్ల్లో హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై అగ్రస్థానాల్లో ఉన్నాయి. జూన్ 4న అత్యధిక బుకింగ్‌లు ఓయో ప్లాట్‌ఫామ్ ద్వారా నమోదయ్యాయి. భక్తులు ఎక్కువగా బుకింగ్ చేసుకున్న కేంద్రంగా వారణాసి నిలిచింది. తిరుపతి, పూరి, అమృత్సర్, హరిద్వార్ బుకింగ్‌ల పరంగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా చూస్తే యూరప్‌లో లగ్జెంబర్గ్ ప్రావిన్స్ ఎక్కువ మంది పర్యాటకులకు ఇష్టమైన కేంద్రంగా నిలిచింది. ఓయో ప్లాట్‌ఫామ్‌పై ఎక్కువ మంది ఇక్కడకు బుక్ చేసుకున్నారు. అమెరికాలో టెక్సాస్‌ను ఎక్కువ మంది సందర్శించారు. బ్రిటన్‌కు సంబంధించి లండన్, ప్లైమౌత్, మిడిల్స్‌బ్రో, లీచెస్టర్, బ్రైటాన్ పర్యాటకులకు ఇష్టమైన ప్రదేశాలుగా ఉన్నాయి. చదవండి: జియో..షావోమీ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త! -
హోటల్ రూమ్‌లో దారుణం.. మహిళతో వివాహేతర బంధం కాస్తా..
వివాహేతర సంబంధాలు కుటుంబాలను బజారుకీడుస్తున్నాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా వారి కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఓ వివాహితుడు.. తన ప్రేయసితో ఓయో హోటల్ రూమ్‌లో గొడవకు దిగి.. ఆమెను దారుణంగా చంపాడు. వివరాల ప్రకారం.. నిందితుడు ప్రవీణ్‌కు కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. భార్య, పిల్లలతో ప్రవీణ్ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రవీణ్‌కు గీత అనే మరో మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వీరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో, వీరిద్దరూ పలుమార్లు ఢిల్లీలోని హోటల్స్‌లో కలుసుకునేవారు. ఈ క్రమంలోనే మంగళవారం కూడా వీరు ఓయో హోటల్లో రూమ్ అద్దెకు తీసుకున్నారు. అనంతరం, రూమ్‌లో వారిద్దరూ వాదనలకు దిగారు. వీరి మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో నిందితుడు ప్రవీణ్.. గీత చాతిపై గన్‌తో కాల్చాడు. దీంతో, ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తర్వాత.. ప్రవీణ్ తనను తాను గన్‌తో కాల్చుకున్నాడు. కాగా, గన్ పేలిన శబ్ధం వినిపించడంతో హోటల్ సిబ్బంది వెంటనే రూమ్‌కు వెళ్లి చూడగా వారిద్దరూ కిందపడిపోయి ఉన్నారు. దీంతో, పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అక్కడకు చేరుకున్న పోలీసులు.. వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే గీత మృతిచెందినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రవీణ్.. గాయాలతో ప్రాణపాయం నుండి బయటపడ్డాడు. -
ఓయో గదుల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. జంటల వీడియోలు రికార్డ్ చేస్తూ..
లక్నో: ఓయో హోటల్ గదుల్లో సీక్రెట్ కెమెరాలు అమర్చి.. అక్కడికి వెళ్లే జంటల వీడియోలు తీస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. నలుగురు సభ్యులు వేర్వేరు గ్యాంగులతో కలిసి పనిచేస్తూ ఈ నేరాలకు పాల్పడుతున్నారు. సాధారణంగా వీళ్లు అవసరమైన వారికి ఓయో హోటల్స్‌లో రూమ్స్ బుక్‌చేసి కమిషన్ తీసుకుంటారు. క్రమంలోనే రూమ్స్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. అక్కడ ఉండేందుకు వచ్చిన జంటల ఏకాంతంగా గడిపిన క్షణాలను వీడియో రికార్డు చేస్తారు. అనంతరం ఆ వీడియోను సంబంధిత జంటలకు పంపి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. అడిగిన మొత్తం అప్పజెప్పకుంటే ఇవ్వకుంటే రహస్యంగా తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి వైరల్ చేస్తామని బెదిరింపులకు ప్పాలడుతున్నారు. అయితే డబ్బులు ఇవ్వకుంటే వేధింపులకు గురిచేస్తామంటూ నిందితులు బెదిరిస్తున్నారని ఓ బాధిత జంట పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన నోయిడా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అంతేగాక వీరు ఐఫోన్‌ను తక్కువ ధరకు విక్రయిస్తామంటూ అక్రమంగా ఓ ల్ సెంటర్‌ను కూడా నడుపుతూ ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను విష్ణు సింగ్, అబ్దుల్ వహవ్, పంకజ్ కుమార్, అనురాగ్ కుమార్‌లుగా గుర్తించారు. వీరి నుంచి 11 ల్యాప్‌టాప్‌లు, 21 మొబైల్ ఫోన్లు, 22 సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రస్తుతం ఈ స్కామ్‌లో పాల్గొన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. -
ఓయోకు నిర్వహణ లాభాలు
న్యూఢిల్లీ: ఆతిథ్యం, ప్రయాణ సేవల(ట్రావెల్ టెక్) కంపెనీ ఓయో ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో మొత్తం ఆదాయం రూ. 1,459 కోట్లను అధిగమించింది. రూ. 7.27 కోట్ల సర్దుబాటు తదుపరి నిర్వహణా(ఇబిటా) లాభం ఆర్జించింది. మార్చితో ముగిసిన గతేడాది (2021–22) ఆదాయం రూ. 4,781 కోట్లను తాకగా.. అంతక్రితం ఏడాది(2020–21) దాదాపు రూ. 3,962 కోట్ల టర్నోవర్ సాధించింది. గతేడాది దాదాపు రూ. 472 కోట్ల నిర్వహణా(ఇబిటా) నష్టం ప్రకటించింది. ఇక తాజా క్యూ1లో రూ. 414 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది రూ. 1,940 కోట్లమేర నికర నష్టం నమోదైంది. కాగా.. పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా కంపెనీ గతేడాది అక్టోబర్‌లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను సమర్పించిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా ఆర్థిక ఫలితాలను సెబీకి దాఖలు చేసింది. చదవండి: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు: కొనే ముందు ఇవి గుర్తుపెట్టుకోండి, లేదంటే బేబుకి చిల్లే! -
పాతబస్తీలో దారుణం.. కిడ్నాప్ చేసి ఓయో రూమ్‌లో గ్యాంగ్ రేప్!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో దారుణం జరిగింది. కొందరు దుండగులు.. అమ్మాయి(13)ని కిడ్నాప్ చేసిన, సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. కాగా, జూబీహిల్స్ మైనర్ అత్యాచార ఘటన ఇంకా మరువకముందే ఇలా మరో ఘటన చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. దబీర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో సెప్టెంబర్ 12వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో ఓ మైనర్ మెడికల్ షాపునకు వెళ్లిందేకు ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఈ సమయంలో ఇద్దరు యువకులు.. ఆమెను కిడ్నాప్ చేసి అదే ప్రాంతంలో ఉన్న ఓయో హోటల్ రూమ్‌కు తరలించారు. అక్కడే రెండు రోజులు ఉంచి ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం.. బాధితురాలని చాదర్‌ఘాట్ వదిలివెళ్లారు. నడవలేని స్థితిలో ఉన్న ఆమెను గుర్తించిన స్థానికులు ఇంటికి తీసుకువెళ్లారు. కాగా, అత్యాచారం సందర్భంగా బాధితురాలికి మత్తు మందు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. బాధితురాలు కుటుంబ సభ్యుల మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన నిందితులను రవేష్ మెహదీ, మహ్మదుల్లాగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు చెప్పారు. కిడ్నాప్‌కు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ, ఓయో రూమ్‌కు తరలిస్తున్న ఫుటేజీని పరిశీలిస్తున్నట్టు స్పష్టం చేశారు. కాగా, బాధితురాలు మైనర్ కావడంతో భరోసా సెంటర్‌కు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. అక్కడే బాధితురాలు, ఆమె పేరెంట్స్ స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నట్టు పోలీసులు వెల్లడించారు. -
ఓయో బంపరాఫర్..విద్యార్థినులకు మాత్రమే!
దేశీయ దిగ్గజ హాస్పిటాలిటీ సంస్థ ఓయో విద్యార్థినులకు భారీ ఆఫర్ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 497 నగరాలు, పట్టణాల్లో కలిపి నీట్ ఎగ్జామ్-2022ను 10లక్షల మంది విద్యార్ధులు రాయనున్నారు. ఈ తరుణంలో నీట్ ఎగ్జామ్ రాసే ప్రత్యేకంగా విద్యార్థినులకు ఓయో రూమ్స్ పై 60 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రతి ఏడాది జరిగే నీట్ ఎగ్జామ్ కోసం పట్టణ,గ్రామాల విద్యార్ధినులు వ్యయ ప్రయాసలకు ఓర్చి కేంద్రానికి చేరుకోవాల్సి వస్తుంది. కొన్ని సార్లు నిమిషాల వ్యవధిలోనే పరీక్ష రాసేందుకు వీలులేక ఎగ్జామ్ సెంటర్ నుంచి నుంచి వెనుదిరిగిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. అందుకే ఈ ఏడాది జులై 17న (ఆదివారం) జరిగే నీట్ ఎగ్జామ్ రాయనున్న విద్యార్ధులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా తక్కువ ప్రైస్‌లో విద్యార్ధినులకు ఓయో రూమ్స్ అందిస్తుంది. అందులో వైఫై, ఎయిర్ కండీషనింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (కన్జ్యూమర్) శ్రీరంగ్ గాడ్బోలే తెలిపారు. విద్యార్ధినులు ఓయో డిస్కౌంట్ పొందాలంటే! ♦ఓయో యాప్‌ను డౌన్లోడ్ చేయాలి ♦ఆ యాప్‌లో నియర్ బై ఐకాన్‌పై క్లిక్ చేయాలి. ♦ఆ ఆప్షన్‌పై ట్యాప్ చేస్తే ఎగ్జామ్ సెంటర్‌కు సమీపంలో ఉన్న ఓయో రూమ్స్ లిస్ట్ కనబడుతుంది. ఆ లిస్ట్‌లో మీకు కావాల్సిన ఓయో రూమ్స్ హోటల్‌ను సెలక్ట్ చేసుకొని 'నీట్ జేఎఫ్' కూపన్ కోడ్‌ను ఎంటర్ చేయాలి ♦ఆ తర్వాత బుక్ నౌ ఆప్షన్ క్లిక్ చేసి 40శాతం పేమెంట్ చేసి ఓయో రూంను వినియోగించుకోవచ్చు. -
మాదాపూర్: ఓయో రూంలో వ్యభిచారం చేస్తూ..
మాదాపూర్(హైదరాబాద్): వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న సంఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాదాపూర్‌లోని శిల్పారామం ఎదురుగా ఎన్ కన్వెన్షన్ వద్ద ఉన్న హైటెక్ టవర్ హోటల్ 4వ ఫ్లోర్ గది నంబర్ 401లో ఇద్దరు వ్యక్తుల సాయంతో దాడి చేశారు. చదవండి: ర్యాపిడో డ్రైవర్ అరాచకాలు.. కాలేజీ అమ్మాయిలకు అందులో ఓ మహిళ ఇతరులతో ఉండడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా బిహార్‌కు చెందిన అజిత్భగత్(25), ఓ కంపెనీలో హౌస్‌కీపింగ్ పనిచేస్తున్నాడు. అమీన్పూర్ బీరంగూడకు చెందిన పట్లోళ్ల రాహూల్‌రెడ్డి (24), ప్రైవేటు ఉద్యోగి. పశ్చిమ బెంగాల్‌కి చెందిన నున్నిహర్ ఖాతున్ ఫలెజ్ అలీ(34)కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. వీరితో కలసి అర్జున్ అలియాస్ కమలాకర్‌రెడ్డి హైదరాబాద్ నుంచి పలువురిని పిలిపించుకుని అజిత్ భగవత్ సాయంతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. ఈ సంఘటనలో అర్జున్ పరారీలో ఉండగా పట్టుబడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. సోదాలో రూ.1010 నగదు, తదితర సామగ్రితో పాటు రెండు సెల్పోన్లు, స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు -
ఓయో రూమ్స్ బంపరాఫర్, ఫ్రీగా హోటల్ రూమ్స్‌లో ఉండొచ్చు!
ఇండియన్ హోటల్ రూమ్స్ ఆగ్రిగ్రేటర్ ఓయో వినియోగదారులకు బంపరాఫర్ ప్రకటించింది. ట్రావెల్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఓయో రూమ్స్ ఫ్రీగా వినియోగించుకోవచ్చని అధికారికంగా తెలిపింది. ఇందుకోసం కొన్ని షరతులు విధించింది. పీటీఐ నివేదిక ప్రకారం..విజార్డ్ లాయల్టీ ప్రోగ్రామ్‌లోని గోల్డ్ సభ్యులు 5రాత్రులు(5రోజుల పాటు) ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఓయో విజార్డ్ దేశంలో తరుచూ ప్రయాణం చేసే వారికి అందుబాటులో ఉంది. ఇతర ప్రయోజనాల్ని అందించడంతో పాటు ఓయో రూమ్స్ విజార్డ్ సౌకర్యం ఉన్న హోటళ్లపై 10శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్ తో పాటు 92 లక్షలకు పైగా సభ్యులతో ఓయో విజార్డ్ అనేది అతిపెద్ద లాయల్టీ ప్రోగ్రామ్స్‌లో ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన ట్రావెల్ కష్టమర్లు ఎక్కువగా ఉన్నారు. వారికి అదనపు సౌకర్యాల్ని కల్పించేందుకు ఓయో విజర్డ్ బ్లూ, విజర్డ్ సిల్వర్, విజర్డ్ గోల్డ్ స్కీమ్‌లను అందుబాటులోకి తెచ్చింది. వారికే లాభం ఫ్రీ రూమ్ నైట్స్, తగ్గింపు ఆఫర్లు వంటి మా ప్రోత్సాహకాల వల్ల కస్టమర్లు ఓయోలో పదే పదే ఉండేందుకు మరొక అవకాశాన్ని అందుబాటులో ఉంచాం. 2021 మార్చి 31తో ముగిసిన ఏడాదిలో 70 శాతానికి పైగా రిపీట్ కస్టమర్లు ఉన్నారు. తాజా కొత్త లాయల్టీ సర్వీసుల వల్ల వీరికి ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నట్లు ఓయో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ప్రొడక్ట్), చీఫ్ సర్వీస్ ఆఫీసర్ శ్రీరంగ్ గాడ్బోలే వివరించారు. -
Hyderabad: ఉద్యోగం ఇప్పిస్తానని.. యువతిని ఓయో హోటల్‌కు తీసుకెళ్లి..
సాక్షి, అమీర్‌పేట: ఉద్యోగం ఇప్పిస్తానని యువతిని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సైదులు వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా కొలిమిగండ్ల మండలానికి చెందిన ఓ కుటుంబం జీవనోపాధి నిమిత్తం నగరానికి వచ్చి చైతన్యపురి కాలనీలో ఉంటున్నారు. ఆ కుటుంబానికి చెందిన 19 ఏళ్ల యువతి టెలీకాలర్‌గా పని చేస్తోంది. సదరు యువతి ఫోన్ నెంబర్ సంపాదించిన సిద్ధార్థరెడ్డి అనే యువకుడు ఆమెకు ఫోన్ చేసి తన కంపెనీలో ఉద్యోగం ఇచ్చి నెలకు రూ.18 వేల వేతనం ఇప్పిస్తానని నమ్మించాడు. ఈ నెల 9న కారులో దిల్సుఖ్నగర్ వెళ్లి యువతిని తీసుకుని ఎర్రగడ్డకు వచ్చాడు. మార్గమధ్యలో ఫొటోలు, గుర్తింపు కార్డులు, సర్టిఫికెట్ల జిరాక్స్ పత్రాలు తీసుకున్నాడు. ఎర్రగడ్డలోని ఓయోలో ఓ గదిని తీసుకుని అందులో దింపాడు. ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకొచ్చి హోటల్‌కు ఎందుకు తీసుకువచ్చావని ప్రశ్నించగా నియామకపత్రం రావడానికి ఆలస్యమవుతుందని, రాత్రి భోజనం చేశాక నియామకపత్రంతో పాటు కొన్ని డబ్బులు అడ్వాన్స్‌గా ఇస్తానని మాయమాటలు చెప్పాడు. ఆ తర్వాత యువతిపై అత్యాచారం చేసి జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే ఫొటోలు సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించాడు. హోటల్ నుంచి తప్పించుకుని ఇంటికెళ్లిన యువతి జరిగిన విషయాన్ని ఇంట్లో చెప్పి చైతన్యపురి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును ఎస్‌ఆర్‌నగర్‌కు బదిలీ చేశారు. చదవండి: తొమ్మిది పేజీల సూసైడ్ నోట్.. ఎనిమిది నెలలుగా లైంగిక సంబంధం.. -
ఓయో, జొమాటో, స్విగ్గీ !! నిమిషానికి ఎంత నష్టపోయాయో తెలుసా?
ఉదాహరణకు మనకు ఓ సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యకు ఇన్నోవేటీవ్‌గా పరిష్కారం చూపించే సంస్థల్ని స్టార్టప్స్ అంటారు. ఈ స్టార్టప్ లో లాభాలు ర్యాపిడ్‌గా గ్రో అవుతుంటాయి. మిలియన్ సంఖ్యలో యూజర్లు ఉంటారు. కోట్ల టర్నోవర్ జరుగుతుంటుంది. అలాంటి స్టార్టప్స్ కు కోవిడ్ మహమ్మారి వందల కోట్లు నష్టయేలా చేసింది. ►ఇటీవల విడుదల ఫైనాన్షియల్ ఇయర్ 2020-2021లో స్టార్టప్ కు ఎంత నష్టం వాటిల్లింది. నిమిషానికి నష్టపోయాయో తెలుపుతూ కొన్ని రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి. ఆ అధ్యయనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ►రితేష్ అగర్వాల్ స్థాపించిన స్టార్టప్ ఓయో రూమ్స్ ఫైనాన్షియల్ ఇయర్ 2020-21 రూ.3943.84 కోర్ల నష్టాలను చవిచూసింది. అంటే గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ప్రతి నిమిషానికి రూ.76,077కు పైగా నష్టపోయింది. ►ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,314 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఇదే సమయంలో కంపెనీ నిమిషానికి రూ.25,347కు పైగా నష్టపోయింది. ►పేమెంట్స్ సర్వీస్ స్టార్టప్ మోబీక్విక్ ఫైనాన్షియల్ ఇయర్లో రూ.111.3 కోట్లు నష్టపోయింది. అంటే ఆర్థిక సంవత్సరంలో స్టార్టప్‌కు నిమిషానికి రూ.2,147 నష్టాలు వచ్చాయి. ►మరో డిజిటల్ పేమెంట్ దిగ్గజం పేటీఎం డిసెంబర్ త్రైమాసికంలో రూ. 778.5 కోట్ల నష్టాన్ని చవిచూసింది. అంటే ఈ కాలంలో స్టార్టప్ ప్రతి నిమిషానికి రూ.60,069కి పైగా నష్టపోయింది. ►బీమా ప్లాట్‌ఫారమ్ పాలసీబజార్ డిసెంబర్ త్రైమాసికంలో రూ.298 కోట్లు నష్టపోయింది. ఈ కాలంలో కంపెనీ ప్రతి నిమిషానికి రూ. 22,995 నష్టపోతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. ► ఆన్లైన్ ఫుడ్ అగ్రిగేటర్ జొమాటో గత త్రైమాసికంలో రూ. 63.2 కోట్ల నష్టాన్ని నివేదించింది. నిమిషానికి రూ. 4,876 నష్టాన్ని నమోదు చేసింది. -
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్...ఓయోకు కాసుల వర్షం..! ఒక్క రోజులో..
వినియోగదారులకు హోటల్ రూములను సమకూర్చే అతిథ్య రంగ కంపెనీ ఓయోకు న్యూ ఇయర్-2022 వేడుకలు కాసుల వర్షాన్ని కురిపించాయి. ప్రపంచవ్యాప్తంగా కొత్త ఏడాది వేడుకలను జరుపుకునేందుకు కస్టమర్లు భారీ సంఖ్యలో ఓయో రూమ్స్‌ను తలుపు తట్టారు. 110 కోట్ల బిజినెస్..! న్యూ ఇయర్ 2022 వేడుకల కోసం హాస్పిటాలిటీ చైన్ ఓయోను ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది బుకింగ్స్ జరిపినట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ వీకెండ్లో సుమారు రూ. 110 కోట్ల విలువైన బుకింగ్‌లు జరిగాయని ఓయో వ్యవస్థాపకుడు, సీఈవో రితేష్ అగర్వాల్ ట్విటర్లో తెలిపారు. 2017 డిసెంబర్ తరువాత న్యూ ఇయర్ వీకెండ్లో ఈ స్థాయిలో బుకింగ్స్ జరగడం ఇదే తొలిసారి.2020 ఏప్రిల్ నుంచి 90 వారాల తరువాత అత్యధిక సంఖ్యలో బుకింగ్స్ జరిగాయని రితేష్ వెల్లడించారు. ఒక్క రోజే 69 శాతం బుకింగ్స్..! 2016లో సుమారు 1.02 లక్షలకు పైగా బుకింగ్స్ జరగ్గా, 2021 డిసెంబర్ 30, 31 తేదీల్లో గరిష్టంగా 5.03 లక్షల ఓయో రూమ్స్ బుక్ అయ్యాయని అగర్వాల్ చెప్పారు. 2021 డిసెంబర్ 31 ఒక్క రోజే 69 శాతం రూమ్స్ బుక్ అవ్వగా...2020లో 61 శాతం, 2019లో 57 శాతం, 2018లో 63 శాతం , 2017లో 55 శాతంగా ఉన్నట్లు తెలిపారు. 127 నగరాల నుంచి 35 దేశాల్లో... టెక్-ఆధారిత హాస్పిటాలిటీ సంస్థ ఓయో గణనీయమైన వృద్ధిని సాధించింది. కోవిడ్-19 రాకతో భారీ నష్టాలనే చవిచూసింది. ఆయా దేశాల్లో కరోనా ఉదృతి తగ్గడంతో పర్యాటక రంగం మెల్లమెల్లగా పుంజుకుంటూ వచ్చింది. ఈ ధోరణి ఓయోకు కలిసోచ్చింది. 2015లో కేవలం 127 నగరాల్లో మొదలవ్వగా అది ఇప్పడు 35 దేశాల్లో ఓయో తన సేవలను అందిస్తోంది. చదవండి: Microsoft CEO Satya Nadella: న్యూ బిజినెస్..! న్యూ అవతార్..! -
3,000 కిలోమీటర్లు ప్రయాణించి ఓయో దగ్గరికి వచ్చిన కస్టమరుకు సీఈఓ క్షమాపణలు
ఇటీవల పుదుచ్చేరికి 3000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ఓయో లాడ్జ్ కి వచ్చిన ఒక బృందానికి ఒక షాకింగ్ సంఘటన ఎదురైంది. పుదుచ్చేరిలో ఓయోలో రూమ్ బుక్ చేసిన ఈ బృందానికి తీర ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి అక్కడ ఆ ఓయో లాడ్జ్ లేదు. దీంతో వారందరూ ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యారు. ఈ బృందంలోని సభ్యుల్లో ఒకరైన అభినందన్ పంత్ ఈ అనుభవం గురించి లింక్డ్ ఇన్‌లో పోస్ట్ రాశారు. ఈ ఆసక్తికర పరిణామం గురించి వీడియో కూడా చిత్రీకరించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ తొమ్మిది మంది గల బృందం ఓయో 74612 రాయల్ ప్లాజా బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ లో గదులను బుక్ చేసుకున్నారు. కానీ, వారు 3000 కిలోమీటర్లు ప్రయాణించి ఓయో లాడ్జ్ ఉన్న ప్రదేశానికి డిసెంబర్ 24 రాత్రి చేరుకున్న తర్వాత అక్కడ ఉన్న అడవి మొక్కల ప్రదేశం చూసి అందరూ షాక్ కి గురి అయ్యారు. తాను, తన తోటి ప్రయాణికులు రాత్రి పూట నిర్మానుష్యమైన రహదారిపై చిక్కుకుపోయినట్లు ఆ వ్యక్తి చెప్పాడు. ఓయో కస్టమర్ సర్వీస్ కు కాల్ చేసినప్పుడు, తాము ఇతర లాడ్జింగ్ ఏర్పాటు చేయలేమని తనకు చెప్పినట్లు పంత్ పేర్కొన్నాడు. కానీ అతను ఆ నగరంలో తనిఖీ చేసినప్పుడు 50కి పైగా ఆస్తులు గల ఓయో లాడ్జ్ అందుబాటులో ఉన్నట్లు అతను అన్నాడు. చివరకు అక్కడ ఉండటానికి ఇతర హోటళ్లకు అనేకసార్లు కాల్స్ చేసినట్లు పంత్ చెప్పారు. అక్కడ ఉన్న ఒక హోటల్ లో బస చేశామని, క్రిస్మస్ వారాంతం కావడం వల్ల చివరి నిమిషంలో హోటల్ బుకింగ్ ఖర్చును రెట్టింపు చేసినట్లు తెలిపాడు. గత ఏడాదిగా ఉనికిలో లేని ఈ హోటల్ గురించి చాలా మంది వినియోగదారులు ఫిర్యాదు చేశారని తను అన్నాడు. తనకు అసౌకర్యానికి చింతిస్తూ ఓయోపై కేసు వేస్తానని ఆ వ్యక్తి చెప్పాడు. భారతదేశం & ఆగ్నేయ ఆసియా ఓయో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోహిత్ కపూర్ అభినందన్ పంత్ లింక్డ్ ఇన్ పోస్టుకు స్పందిస్తూ క్షమాపణలు చెప్పాడు. "అలాగే, ఆ లాడ్జ్ మా ప్రమాణాలను ఏమాత్రం చేరుకోలేదు. మీ అనుభవంతో మరిన్ని మార్పులు చేయడానికి దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి మేము సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నాము" అని కపూర్ పంత్ పోస్ట్ పై ఒక వ్యాఖ్యలో తెలిపారు. ఓయో సీఈఓ తను అసౌకర్యానికి గురైన ప్రాంతానికి సంబంధించిన లొకేషన్ పంపమని అభినందన్ ను కోరాడు. "అలాగే మీ అనుభవం నుంచి మరింత నేర్చుకుంటాను" అని ఆయన అన్నారు. (చదవండి: శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్‌పై ఎయిర్టెల్ కీలక నిర్ణయం..!) -
రూ.8,430 కోట్లకు ఓయో ఐపీవో
న్యూఢిల్లీ: హోటల్ బుకింగుల స్టార్టప్ దిగ్గజం ఓయో పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 7,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్‌చేసిన సంస్థలు మరో రూ. 1,430 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి. తద్వారా ఓయో మాతృ సంస్థ ఒరావెల్ స్టేస్ లిమిటెడ్ రూ. 8,430 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోలో సాఫ్ట్‌బ్యాంక్, ఏ1 హోల్డింగ్స్, చైనా లాడ్జింగ్ హాలిడేస్(హెచ్‌కే) తదితరాలు షేర్లను ఆఫర్ చేయనున్నాయి. 2013లో ఏర్పాటైన ఓయో ప్రపంచవ్యాప్తంగా 5,130 మంది ఉద్యోగులను కలిగి ఉంది. వీరిలో 71 శాతం మంది దేశీయంగా విధులు నిర్వహిస్తుండటం గమనార్హం! నష్టాలలోనే...: కంపెనీ ఏర్పాటైనప్పటి నుంచీ ఇప్పటివరకూ ప్రతీ ఏడాది నష్టాలనే నమోదు చేస్తున్నట్లు ఒరావెల్ స్టేస్ ప్రాస్పెక్టస్‌లో వెల్లడించింది. కొద్ది నెలలుగా కరోనా మహమ్మారి సవాళ్లు విసరడంతో బిజినెస్ మరింత డీలాపడినట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో ఓయోకు రూ. 3,944 కోట్ల నష్టాలు వాటిల్లగా.. అంతక్రితం ఏడాది(2019–20)లో రూ. 13,123 కోట్లుగా నమోదయ్యాయి. ఇక 2018–19లో దాదాపు రూ. 2,365 కోట్ల నష్టం ప్రకటించింది. జూలైకల్లా కంపెనీ రుణ భారం రూ. 4,891 కోట్లకు చేరింది. ఐపీవో నిధుల్లో కొంతమేర రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు సెబీకి దాఖలు చేసిన దరఖాస్తులో ఓయో తెలియజేసింది. ఓయోలో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ వ్యక్తిగత హోదాలో 8.21 శాతం, హోల్డింగ్ కంపెనీ ఆర్ఏ హాస్పిటాలిటీ ద్వారా మరో 24.94 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నారు. జపనీస్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ మరింత అధికంగా 46.62 శాతం వాటాను పొందింది. నిధుల వినియోగం ఇలా ఈక్విటీ జారీ ద్వారా సమీకరించనున్న నిధుల్లో అనుబంధ సంస్థల రుణ చెల్లింపులకు రూ. 2,441 కోట్లను వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో ఓయో వెల్లడించింది. మరో రూ. 2,900 కోట్లను కంపెనీ విస్తరణ, ఇతర సంస్థల కొనుగోళ్లకు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. మిగిలిన పెట్టుబడులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. కాగా.. ఇటీవల కొద్ది రోజులుగా యూనికార్న్ హోదా(బిలియన్ డాలర్ల విలువ) పొందిన పలు స్టార్టప్‌లు స్టాక్ ఎక్సే్ఛంజీలో లిస్టింగ్ బాట పడుతున్నాయి. ఇప్పటికే జొమాటో లాభాలతో లిస్ట్‌కాగా.. డిజిటల్ పేమెంట్ దిగ్గజం పేటీఎమ్, బ్యూటీ ప్రొడక్టుల ఆన్లైన్ రిటైలర్ నైకా, ఎడ్యుటెక్ దిగ్గజం బైజూస్ సైతం పబ్లిక్ ఇష్యూకి రానున్న సంగతి తెలిసిందే. వివిధ చర్యల ద్వారా స్థూల లాభ మార్జిన్లను 2020లో నమోదైన 9.7 శాతం నుంచి 2021 మార్చికల్లా 33.2 శాతానికి మెరుగుపరచుకున్నట్లు ఓయో తాజాగా తెలియజేసింది. చదవండి: ఐపీవోలతో స్టాక్ మార్కెట్ స్పీడు, అత్యంత సంపన్న దేశం దిశగా భారత్ -
నువ్వంటే క్రష్.. ‘ఓయో’లో కలుద్దామా: ఉద్యోగినికి బాస్ వేధింపులు
సాక్షి, హైదరాబాద్: మహిళలు, చిన్నారులపై వేధింపులు, అఘాయిత్యాల నివారణకు సైబరాబాద్ పోలీస్ విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. ఐటీ పరిధిలో ఉద్యోగినులు కూడా వేధింపులకు గురవుతున్నాయి. తమ భవిష్యత్... సమాజంలో గౌరవం వంటి విషయాలతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోతున్నారు. అలాంటి వారి కోసం వాట్సప్ నంబర్‌తో ఫిర్యాదు స్వీకరించేందుకు సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ఆ వాట్సప్‌కు స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో వాట్సప్‌కు వచ్చిన ఫిర్యాదు చూస్తుంటే పని ప్రాంతాల్లో ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అర్థమవుతుంది. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను కూడా సైబరాబాద్ మహిళ, చిన్నారుల రక్షణ వింగ్ ట్విటర్లో బహిర్గతం చేసింది. ఓ ఉద్యోగినికి వాట్సప్‌లో ఆమె బాస్ మెసేజ్ చేశాడు. హలో.. అంటూ ప్రాజెక్ట్ వర్క్‌పై మాట్లాడాడు. నీ పర్ఫామెన్స్ పూర్‌గా ఉందని చెప్పాడు. దీంతో ఆమె లేదు సార్ మొత్తం నేనే చేశానని చెప్పగా కాదు అని చెప్పాడు. దీంతో భయాందోళనకు గురయిన ఆమె నా భవిష్యత్ అంటూ వాపోయింది. హేం కంగారొద్దు.. నీకు ప్రమోషన్, జీతం పెంపు చేస్తా అని వరాలు కురిపించి కానీ అని గ్యాప్ ఇచ్చాడు. ఆ ‘కానీ’లో ఎంతో దురుద్దేశం దాగి ఉంది. (చదవండి: రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లెలు బంగారం అన్న చోరీ) కానీ ఏంటి సార్ అని అడగా అతడి వక్రబుద్ధి బయటపడింది. ఆమెను ఓయో రూమ్‌లో కలుద్దామని అడిగాడు. దీంతోపాటు మొదటి నుంచి నీపై క్రష్ ఉందని చెప్పాడు. దీనికి ఆ యువతి ‘క్షమించండి సార్’ అనగా సరే ‘నీ ప్రమోషన్, జీతం పెంపు విషయంలో కూడా సారీ’ అని ఆ బాస్ చెప్పేశాడు. అతడి స్పందనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ బాధితురాలు ‘నీ కెరీర్‌ను కాపాడుకో’ అంటూ పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం-2003 కింద కేసు నమోదు చేశా అని సమధానం చెప్పింది. అయితే అతడి వేధింపులు ఎప్పటి నుంచో ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే అతడి పేరు డైనో‘సార్’ అని పెట్టుకోవడం చూస్తుంటే అర్థమవుతోంది. (చదవండి: ప్రో కబడ్డీకి పాలమూరువాసి: ఏ జట్టుకు ఆడనున్నాడంటే..?) ఈ చాట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్ మహిళలకు కార్యాలయాల్లో కూడా భద్రత లేదని అర్థమవుతోంది. ‘నేను కూడా అలాంటి వాడిని కాదు. బట్.. నువ్వంటే క్రష్ ఉంది నాకు... ఫ్రమ్ ద ఫస్ట్ డే’ అని సైబరాబాద్ మహిళా, శిశు రక్షణ వింగ్ తన ఖాతాలో పోస్టు చేసింది. అయితే ఆ స్క్రీన్ షాట్ నిజమైన ఫిర్యాదా? లేక అవగాహన కల్పించేందుకు చేసిన చిత్రమా? అనేది తెలియలేదు. ఒకవేళ ఫిర్యాదు అయితే ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించలేదు. మహిళలను అప్రమత్తం.. అవగాహన కల్పించేందుకు సృష్టించిన చాటింగ్‌లా కనిపిస్తోంది. ఏది ఏమున్నా మహిళలు మీ రక్షణకు పోలీసులు ఉన్నారనే విషయం మరచిపోకండి. వేధింపులు ఎదుర్కొంటుంటే నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయలేకపోతే ఆన్లైన్లో కూడా చేయవచ్చు. మీ వివరాలను గోప్యంగా ఉంచుతారు. నేను కూడా అలాంటి వాడిని కాదు. But నువ్వంటే క్రష్ ఉంది నాకు... From the first day. #Dial100 #cyberabadsheteam #WomenSafety pic.twitter.com/LUpKRjucLa — Women & Children Safety Wing Cyberabad (@sheteamcybd) August 31, 2021 -
128 సార్లు ఓయో హోటల్స్ బుక్ చేసుకున్న ఒకే ఒక్కడు
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ కు బిజినెస్ పరంగా ఇండియా చాలా కీలకమని ఓయో పేర్కొంది. ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ తన మూడవ వార్షిక ట్రావెల్ ఇండెక్స్ ఓయో ట్రావెలోపిడియా 2020ను ఈ రోజు విడుదల చేసింది. అన్ని దేశాల్లో కెల్లా ఇండియాలోనే ఎక్కువగా యూజర్లు ఓయో ద్వారా రూమ్స్ బుక్ చేసుకున్నట్లు సంస్థ పేర్కొంది. 2020లో రూమ్ బుకింగ్స్ ను నగరాల వారీగా పరిశీలిస్తే ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. అలాగే వ్యాపార ప్రయాణికుల రూమ్ బుకింగ్స్ పరంగా హైదరాబాద్ తోలి స్థానంలో నిలిచింది. అదే విధంగా భారత్ లో అత్యధికంగా సందర్శించిన మూడు రాష్ట్రాలలో తెలంగాణ ఒకటిగా నిలిచింది.(చదవండి: ‘వాటిపై అదనపు చార్జీలు వసూలు చేయడం లేదు’) 2020లో ఒకే అతిధి 128 సార్లు తమ ఆతిథ్యం స్వీకరించారని ఓయో పేర్కొంది. ఈ కరోనా సమయంలో కూడా ఒక అతిధి ఇన్ని సార్లు బుకింగ్ చేసుకున్నాడంటే ఇక్కడ మేము తీసుకునే జాగ్రత్తలు, మార్కెట్ లో ఓయో బ్రాండ్ కు ఉన్న విలువ ఏంటో మీరే అర్థం చేసుకోవచ్చని ఓయో ప్రతినిధులు పేర్కొన్నారు. కొన్ని వందల సార్లు చెప్పినా "జాగ్రత్తగా వెళ్లిరండి" అనే మాటకు అసలైన అర్ధాన్ని నేడు తెలుసుకున్నామన్నారు. అలాగే మరో ఓయో కస్టమర్ ఏడాది పొడవునా సుమారు 50,000 సెకన్లు(13.88 గంటలు) యాప్ లో గడిపినట్లు పేర్కొంది. దీంతో బయటికి వెళ్లినప్పుడు ఓయో రూమ్ లో గడపాలనే తన కోరికను అర్ధం చేసుకోవచ్చు అని తెలిపింది. -
ఓయో లాడ్జ్‌లో గుట్టు చప్పుడు కాకుండా..
హస్తినాపురం: గుట్టు చప్పుడు కాకుండా లాడ్జ్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న లాడ్జ్ యజమానిని వనస్థలిపురం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆటోనగర్‌లో మదిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి (40) ఓయో లాడ్జీని నడిపిస్తున్నాడు. కొంతకాలంగా తన లాడ్జ్‌లో వ్యభిచారం చేయిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గతవారం లాడ్జ్‌పై దాడి చేసి మహిళలను,విటులను రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న రాఘవేందర్ రెడ్డిని గురువారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. (టిక్‌టాక్‌లో బాసలు చేశాడు.. ఆశలు రేపాడు) -
ఓయో నష్టాలు 335 మిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ కన్సాలిడేటెడ్ నష్టాలు మరింత అధికమయ్యాయి. 2019 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ 335 మిలియన్ డాలర్ల (రూ.2,390 కోట్లు) నష్టాలను ప్రకటించింది. 2018 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి నష్టాలు రూ.52 మిలియన్ డాలర్లుగానే (రూ.370 కోట్లు) ఉండడం గమనార్హం. 2018–19 ఆర్థిక సంవత్సరానికి ఆదాయం అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న 211 మిలియన్ డాలర్ల నుంచి 951 మిలియన్ డాలర్లకు పెరిగింది. అంతర్జాతీయంగా కార్యకలాపాల విస్తరణ నష్టాలు పెరగడానికి కారణమైంది. దేశీయ కార్యకలాపాలపై నష్టాలను మొత్తం ఆదాయంలో 24 శాతం నుంచి 12 శాతానికి సంస్థ తగ్గించుకుంది. -
టిక్‌టాక్‌లో బాసలు చేశాడు.. ఆశలు రేపాడు
బంజారాహిల్స్: టిక్‌టాక్‌లో పరిచయం.. ఆపై స్నేహం.. ఇంకాస్త ముందుకు వెళితే ప్రేమ.. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు.. పెళ్లి చేసుకుంటానని ప్రియుడు నమ్మించడంతో ఆ యువతి నమ్మింది. తీరా పెళ్లి చేసుకోమని అడిగేసరికి ముఖం చాటేశాడు. దీంతో బాధిత యువతి పోలీసుల ముందే గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన యెల్లపు వీరబాబు అలియాస్ వీర (21) కారు డ్రైవర్‌గా పని చేస్తూ జూబ్లీహిల్స్‌రోడ్ నంబర్ 46లోని మస్తాన్‌నగర్‌లో ఉంటున్నాడు. టిక్‌టాక్ ద్వారా అయిదు నెలల క్రితం బీహెచ్ఈఎల్కు చెందిన ఓ యువతితో (22) పరిచయం ఏర్పడింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. రెండుమూడుసార్లు మాదాపూర్ ఓయో రూమ్‌కు కూడా తనను తీసుకెళ్లాడని అక్కడ అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు అయిదు రోజుల క్రితం జూబ్లీహిల్స్‌పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వీరబాబును పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అయితే తనకు న్యాయం జరగలేదని వీరబాబుతో పెళ్లి చేయాలంటూ ఈ నెల 8న బాధితురాలు మళ్లీ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. వీరబాబును ఎస్ఐ యాదగిరిరావు పిలిపించి పెళ్ళి చేసుకోవాలని సూచించారు. అందుకు వీరబాబు ససేమిరా అన్నాడు. దీంతో మనస్తాపానికి గురైన యువతి పోలీసుల ముందే తనతో పాటు తెచ్చుకున్న బ్లేడ్‌తో గొంతు కోసుకుంది. రక్తం కారుతుండగా వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువతిని మోసగించిన ఘటనలో వీరబాబుపై ఐపీసీ సెక్షన్ 417, 420, 376 కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
ప్రియుడి కోసం రూం: వివాహిత దారుణ హత్య
న్యూఢిల్లీ : పుట్టిన రోజు వేడుకలు చేసుకునేందుకు హోటల్‌కు వెళ్లిన ఓ జంట కొద్ది సేపటికే వీరంగం సృష్టించింది. అప్పటి వరకు సంతోషంగా గడిపిన వారు ఒక్కసారిగా గొడవకు దిగి ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధపడ్డారు. ఈ ఘర్షణలో యువతి విగతా జీవిగా మారింది. ఈ విచారకర ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాలు.. ప్రియుడి విక్కిమన్ పుట్టినరోజును జరుపుకోడానికి ఓ వివాహిత సోమవారం అలీపూర్‌లో ఓ హోటల్లో రూమ్ బుక్ చేసింది. సరదాగా గడుపుతున్న సమయంలో ఇద్దరి మధ్య చిన్న వివాదం ఏర్పడింది. ఈ క్రమంలో ఒకరినొకరు దూషించుకుంటూ కొట్లాటకు దిగారు. గొడవ కాస్తా పెరగడంతో కోపాన్ని ఆపుకోలేని విక్కీ కత్తితో ప్రియురాలిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన అనంతరం వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా మంగళవారం ఉదయం టిఫిన్ ఇవ్వడానికి వెళ్లిన హోటల్ సిబ్బంది దారుణ పరిస్థితుల్లో.. రక్తపు మడుగుల్లో ఉన్న యువతిని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో హోటల్ రిసెప్షన్లో ఇచ్చిన వివరాలతో సంబంధిత కుటుంబీకులకు సమాచారం అందించారు. ఇక హోటల్ నుంచి పారిపోయిన నిందితుడిని మంగళవారం మధ్యాహ్నం అలీపూర్ ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పోలీసుల దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. పార్టీలో వివాహితతో కలిసి మద్యం సేవించిన అనంతరం.. ఆమె తనపై అకారణంగా చేయి చేసుకుందని విక్కి మన్ విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాదం పెరగడంతో కత్తితో ఆమెపై దాడి చేసినట్లు వ్యక్తి పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఇక వీళ్లిద్దరికి సోషల్ మీడియా ద్వారా ఏడాది క్రితం పరిచయమైనట్లు దర్యాప్తులో వెల్లడైంది. అంతేగాక బాధితురాలికి ఇంతకుముందే మరో వ్యక్తితో వివాహం జరిగినట్లు.. ఆమెకు ఇద్దరు సంతానం కూడా ఉన్నట్లు తేలింది. అయితే ఈ జంట గత ఐదు నెలల్లో ఆరు, ఏడు సార్లు హోటల్‌ను సందర్శించినట్లు సిబ్బంది తెలిపారు. తమ హోటల్లో ఇలాంటి ఘటన జరిగినందుకు చింతిస్తున్నామని సదరు హోటల్ అధికార ప్రతినిధి వెల్లడించారు. -
ఓయోతో ఇంటి యజమానులకు ఆదాయం
సాక్షి, హైదరాబాద్: పర్యాటకులకు విభిన్న రకాల బస సదుపాయాలను అందించే ఆన్లైన్ ఆధారిత సంస్థ ఓయో నగరంలోని భవన యజమానులకు ఆదాయవనరుగా మారిందని ఓయో ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. నగరవాసి ఐటి ఉద్యోగి అరవింద్ తన 30 ఏళ్ల నాటి భవనాన్ని ‘ఓయో 15141 టౌన్‌విల్లా గెస్ట్ హౌజ్’గా మార్చడం ద్వారా హోటల్ పరిశ్రమకు పరిచయం అవడంతో పాటు అనూహ్యమైన ఆదాయాన్ని కూడా పొందుతున్నారు. అలాగే మహ్మద్ హబీబ్ మొయినుద్దీన్ కూడా తన నివాసాన్ని స్పాట్ ఆన్ 47525 డెక్కన్ లాడ్జ్‌గా మార్చి తగిన ప్రతిఫలాన్ని అందుకుంటున్నారు. ఇలాగే మరెందరో ఓయోతో ప్రయోజనం పొందారని వివరించారు. ‘మాస్టర్ క్లాసెస్’ టూర్ ప్రస్తుతం హైస్కూల్ విద్యను అభ్యసిస్తూ భవిష్యత్తులో మెడిసిన్ చదవాలని ఆశిస్తున్న విద్యార్థుల కోసం వెస్టిండీస్‌కు చెందిన జారŠజ్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ దేశవ్యాప్తంగా ‘మాస్టర్ క్లాసెస్ ఫర్ హైస్కూలర్స్’ టూర్ నిర్వహిస్తోంది. నగరంలోని శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి ఈ కార్యక్రమం బుధవారం ప్రారంభం కానుందని నిర్వాహక సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. నగరంతో పాటు బెంగుళూరు, ముంబయి, ఢిల్లీలోనూ ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. నగరంలో ఈ టూర్‌కి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ న్యూరోసైన్స్ డా.కేశవకుమార్ మందలనేని శ్రీకారం చుట్టారని వివరించారు. -
రూ. 10 వేల కోట్ల సమీకరణలో ఓయో
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ సంస్థ ఓయో తాజాగా 1.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.10,650 కోట్లు) సమీకరించనున్నట్లు వెల్లడించింది. అమెరికాలో విస్తరణకు, యూరప్‌లో కార్యకలాపాలను మరింత మెరుగుపర్చుకునేందుకు ఈ నిధులను వినియోగించనున్నట్లు వివరించింది. ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్.. ఆర్ఏ హాస్పిటాలిటీ హోల్డింగ్స్ ద్వారా 700 మిలియన్ డాలర్లు సమకూర్చనుండగా, మిగతా 800 మిలియన్ డాలర్ల నిధులను ప్రస్తుతం ఉన్న ఇన్వెస్టర్లు అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది. నిధుల సమీకరణకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం కూడా లభించినట్లు అగర్వాల్ చెప్పారు. సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్, లైట్‌స్పీడ్, సెకోయా క్యాపిటల్ తదితర ఇన్వెస్టర్లు తమకు పూర్తిగా మద్దతునిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఓయో హోటల్స్ అండ్ హోమ్స్‌లో సుమారు 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆర్ఏ హాస్పిటాలిటీ హోల్డింగ్స్‌కు కొన్నాళ్ల క్రితం అనుమతులు లభించాయి. ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం 35,000 హోటల్స్.. 1,25,000 పైగా వెకేషన్ హోమ్స్ ఉన్నాయి. -
సైబర్ మోసాలపై టెకీల పోరు
బెంగళూరు: సైబర్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు టెక్నాలజీ సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి. ట్రావెల్ సేవల సంస్థలు మేక్మైట్రిప్ గ్రూప్, ఓయో హోటల్స్ అండ్ హోమ్స్.. మొబైల్ చెల్లింపుల సంస్థ పేటీఎం, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ, జొమాటోలతో పాటు ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ మొదలైనవి ఇందుకోసం జట్టు కట్టాయి. సైబర్ మోసాల తీరుతెన్నులు, నివారణ తీసుకోతగిన చర్యలపై చర్చించేందుకు ఈ సంస్థలు గతవారం రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కూడా సమావేశమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మోసపూరిత టోల్ ఫ్రీ నంబర్లు మొదలైన మార్గాల్లో మోసాలు జరుగుతున్న తీరును అవి వివరించినట్లు పేర్కొన్నాయి. అమాయక కస్టమర్లను మోసగించేందుకు ఉపయోగిస్తున్న 4,000 పైచిలుకు సిమ్ కార్డు నంబర్లు, 350–400 దాకా బ్యాంకు ఖాతాల వివరాలను రిజర్వ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో పాటు టెలికం కంపెనీలకు కూడా అందించినట్లు వివరించాయి. అటు నకిలీ టోల్ ఫ్రీ నంబర్లు పేజీలో ప్రముఖంగా పైన కనిపించే విధంగా నేరగాళ్లు ఏ విధంగా సెర్చి ఇంజిన్‌ను దుర్వినియోగం చేస్తున్నదీ టెక్ దిగ్గజం గూగుల్‌కు కూడా ఆయా టెక్ దిగ్గజాలు తెలియజేశాయి. సాధారణంగా ఇలా సెర్చి ఇంజిన్ పేజీలో పైన ప్రముఖంగా కనిపించే నకిలీ టోల్ ఫ్రీ నంబర్లను వినియోగదారులు అసలైనవిగా భావించి.. మోసాల బారిన పడుతున్న ఉదంతాలు అనేకం నమోదవుతున్నాయి. ఎస్బీఐకు లేఖ.. గత కొద్ది వారాలుగా ఈ ఇంటర్నెట్ కంపెనీలు.. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో పాటు టెలికం రంగానికి చెందిన ఎయిర్టెల్ తదితర సంస్థలతో కూడా సమావేశాలు జరుపుతున్నాయి. ప్రభుత్వ రంగంలోనే అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కూడా ఆన్లైన్ కంపెనీలు లేఖ రాశాయి. ఎస్బీఐ ఖాతాలను ఉపయోగించి భారీ స్థాయిలో జరుగుతున్న సైబర్ మోసాల గురించి తెలియజేశాయి. అమాయక ఖాతాదారులను మోసగించేందుకు.. కీలకమైన వారి అకౌంట్ల వివరాలను తెలుసుకునే నేరగాళ్లు చాలామటుకు ఎస్బీఐ ఖాతాలను ఉపయోగిస్తున్నట్లు వివరిం చాయి. ఎస్బీఐ భారీ బ్యాంకు కావడంతో ఇలాంటి వారిని పట్టుకోవడం కష్టతరం కావొచ్చని టెక్ సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఈ మోసాలను అరికట్టడానికి తగిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చాయి. రాబోయే రోజుల్లో మరిన్ని టెక్ కంపెనీలు ఈ సంస్థలతో జట్టు కట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మోసాలు ఇలా.. ఎక్కువగా పట్టణేతర ప్రాంతాల వారు, సీనియర్ సిటిజన్లు ఇలాంటి సైబర్ నేరాల బారిన పడుతున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అసలు ఖాతాగా భ్రమింపచేసే అకౌంటు నుంచి ఎస్ఎంఎస్లు పంపించడం ద్వారా నేరగాళ్లు మోసాలకు తెరతీస్తున్నారు. సిసలైన కంపెనీగా కనిపించినప్పటికీ.. ఇలాంటి పోర్టల్ పేర్లలో ఎక్కడో ఒకటో అరా తేడాలుంటున్నాయి. ఉదాహరణకు.. మేక్‌మై ట్రిప్ పోర్టల్ వంటి పోర్టల్స్ పేర్లలో నకిలీ సైట్లు అదనంగా మరో అక్షరం చేరుస్తున్నాయి. ఆకర్షణీయ బహుమతుల ఆఫర్లతో తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఇలాంటి మెసేజ్‌లను వినియోగదారులు పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో ఆయా లింక్‌లపై క్లిక్ చేయడం ద్వారా మోసాల బారిన పడుతున్నారు. -
పెళ్లికాని వాళ్ళే ఓయో రూమ్ బుక్ చేస్తున్నారు..
నాంపల్లి: ఓయో ఫ్రాంచైజీ, అసోసియేటెడ్ లాడ్జీలు ప్రేమోన్మాదులకు అడ్డాగా మారాయని సంఘ సేవకులు సీహెచ్.రాహుల్ ఆరోపించారు. వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్న యువకులకు లాడ్జిల్లో గదులను కేటాయిస్తున్నారన్నారు. ఎక్కువ శాతం పెళ్లికాని అమ్మాయి, అబ్బాయిలు ఆన్లైన్ ద్వారా గదులను బుక్ చేసుకుని పట్టణాల్లోని ఓయో లాడ్జిలలో దిగుతూ అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారు. ఈ మేరకు శుక్రవారం నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఓయో ఫ్రాంచైజీ, అసోసియేటెడ్ హోటల్స్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. ఈ హోటల్స్‌లో పెళ్లికాని వారిని అనుమతించకుండా చూడాలన్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన ప్రేమోన్మాది ఘటన కూడా ఓయో హోటల్లోనే జరిగిందని గుర్తు చేశారు. -
ఫేస్బుక్ ప్రేమ... విషాదాంతం
హస్తినాపురం: ఫేస్బుక్ ప్రేమ వికటించింది. తన కంటే చిన్నవాడైన యువకుడి కోసం కోల్‌కతా నుంచి వచ్చిన ఓ మహిళ లాడ్జి గదిలో అర్ధంతరంగా తనువు చాలించింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ ఘటన వనస్థలిపురం పరిధిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు చెందిన సంగీత ముఖర్జీ (43) వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఈమెకు గతంలోనే వివాహం కాగా... భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. మూడేళ్ల క్రితం ఫేస్బుక్ ద్వారా సంగీతకు పంజాబ్ వాసి లోకేశ్ (25) పరిచయమయ్యాడు. అప్పటి నుంచి ఫేస్బుక్లో చాటింగ్ చేసుకుంటున్న వీరిద్దరి మధ్యా ప్రేమ చిగురించింది. గత ఏడాది పంజాబ్ వెళ్ళిన సంగీత అక్కడ లోకేశ్‌ను కలిసి వచ్చింది. ఇద్దరూ కలిసి జీవించాలనే ఉద్దేశంతో మూడు నెలలు అక్కడే కలిసి ఉన్నారు. ఆపై కోల్‌కతాకు వెళ్ళిన వీళ్ళు కొన్నాళ్లు అక్కడా కలిసి ఉన్నారు. హైదరాబాద్‌లో ఉద్యోగం చూసుకుని స్థిరపడాలని, వివాహం చేసుకోవాలని భావించిన ఇద్దరూ సోమవారం సిటీకి వచ్చారు. వనస్థలిపురం పోలీసుస్టేషన్ పరిధిలోని అభ్యుదయనగర్ కాలనీలో ఉన్న ఓయో హోటల్లో గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. సంగీత గుర్తుతెలియని వ్యక్తులతో చాటింగ్ చేస్తోందనే ఉద్దేశంతో లోకేశ్ ఆమెతో ఘర్షణకు దిగాడు. మంగళవారం సాయంత్రం కూడా వీరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో లోకేశ్ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఉన్న తన స్నేహితుని వద్దకు వెళ్ళిపోయాడు. ఈ పరిణామంతో మనస్థాపం చెందిన సంగీత బుధవారం ఉదయం హోటల్ గదిలోనే బెడ్‌షీట్‌తో ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ గది దగ్గరకు వెళ్లిన సిబ్బంది డోర్ కొట్టినా ఎంతకీ డోర్ తీయకపోవడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వనస్థలిపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గది తలుపులు తెరిచి చూసేసరికి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. హోటల్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరంపై లోకేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా మొయినాబాద్‌లో ఉంటున్న లోకేష్ స్నేహితుడు కూడా కోల్‌కత్తాకు చెందిన వాడేనని, ఇతను నగరంలోని ఓ కళాశాలలో బీటెక్ చేస్తున్నాడని తెలిసింది. ఈ యువకుడితోనే సంగీత చాటింగ్ చేస్తుండగా వివాదం తలెత్తిందని తెలిసింది. ఈ నేపథ్యంలో లోకేష్, సంగీతలు తీవ్రంగా గొడవ పడుతున్నారని, వారిని ఓ కంట కనిపెట్టాలని కూడా ఆ యువకుడు హోటల్ సిబ్బందికి సూచించాడని తెలిసింది. -
నంబర్–1పై ఓయో కన్ను
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద హోటల్ బ్రాండ్‌గా అవతరించిన ఓయో... ప్రపంచంలోనూ టాప్ హోటల్ బ్రాండ్‌గా అవతరించాలన్న లక్ష్యంతో ముందుకెళుతోంది. గదుల సంఖ్య పరంగా దేశంలో ఓయో అగ్ర స్థానంలో ఉంది. వచ్చే నాలుగైదేళ్లలో అంతర్జాతీయంగా లక్షలాది హోటల్ గదులను తన నెట్వర్క్ పరిధిలో చేర్చుకోవడం ద్వారా మారియట్‌ను వెనక్కి నెట్టి ప్రపంచ నంబర్–1 హోటల్ బ్రాండ్‌గా అవతరించాలనే లక్ష్యం పెట్టుకుంది. ప్రస్తుతం అమెరికాకు చెందిన మారియట్ అంతర్జాతీయంగా అతిపెద్ద హోటల్ సంస్థగా ఉంది. ఈ సంస్థ పరిధిలో 14 లక్షల గదులున్నాయి. 2023కి మారియట్‌ను అధిగమించాలన్న లక్ష్యాన్ని విధించుకున్నట్టు ఓయో హోటల్స్ వ్యవస్థాపకుడు, సీఈవో రితేష్ అగర్వాల్ తెలిపారు. నాలుగున్నరేళ్లలోనే... ఓయో ఓ స్టార్టప్‌గా తన ప్రయాణం ఆరంభించిన నాలుగున్నరేళ్లలోనే దేశంలో అగ్రస్థానానికి చేరుకోవడం విశేషం. ఓ హోటల్ బ్రాండ్‌గా 20 గదులతో ప్రారంభించిన కంపెనీ ప్రస్తుతం భారత్, చైనా, బ్రిటన్ తదితర దేశాల్లో 3,30,000 హోటల్ గదులను నిర్వహించే అంతర్జాతీయ బ్రాండ్‌గా (ఫ్రాంచైజీ/సొంతంగానూ) అవతరించింది. ‘‘ప్రతి నెలా 50,000 గదులను పెంచుకుంటూ వెళుతున్నాం. దీన్ని బట్టి చూస్తే 2023 నాటికి అదనంగా 25 లక్షల గదుల స్థాయికి చేరతాం. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద హోటల్ చెయిన్ సామర్థ్యంతో పోలిస్తే ఇది రెండు రెట్లు అధికం’’ అని అగర్వాల్ తెలిపారు. ఓయో బడ్జెట్ హోటల్ చైన్‌గా తన వ్యాపారాన్ని ప్రారంభించగా, ప్రస్తుతం మధ్య స్థాయి, ఉన్నత స్థాయి పర్యాటకులకు సైతం విడిది సేవలు అందిస్తోంది. ప్రధానంగా ఓయోకు భారత్, చైనా మార్కెట్లో ఎక్కువ హోటల్ గదులుండగా, బ్రిటన్, యూఏఈ, ఇండోనేసియా, మలేసియా, నేపాల్‌కూ కార్యకలాపాలను విస్తరించింది. 2023 నాటికి మరిన్ని దేశాల్లోకీ అడుగుపెట్టాలనుకుంటోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో భాగమైన దుబాయ్, అబు ధాబి, షార్జా వంటి మార్కెట్లలో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు అగర్వాల్ చెప్పారు. ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, యూరప్ మార్కెట్లలో విస్తరించేందుకు ఈ మార్కెట్లు దోహదపడగలవని భావిస్తున్నట్లు వివరించారు. మరోవైపు, ప్రస్తుతం లావాదేవీల సంఖ్య మూడింతలు పెరిగిందని తెలిపారు. ఆక్యుపెన్సీ 65 శాతంగా ఉందని తెలిపారు. చైనాలో ప్రతి నెలా సుమారు 40,000 పైచిలుకు గదులు ఫ్రాంచైజీ, లీజ్డ్ విధానంలో అందుబాటులోకి తెస్తున్నామని అగర్వాల్ వివరించారు. తమ ప్లాట్‌ఫాంలో చేరిన తర్వాత ఆయా హోటల్స్‌లో ఆక్యుపెన్సీ రేటు 25 శాతం నుంచి సుమారు 70 శాతం దాకా పెరిగిందని పేర్కొన్నారు. సాఫ్ట్‌బ్యాంకు దన్ను కాలేజీ స్థాయి విద్యాభ్యాసాన్ని మధ్యలోనే విడిచిపెట్టిన రితేష అగర్వాల్ 2013లో ఓయోను ప్రారంభించారు. ఓయో వివిధ హోటల్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకుని, సిబ్బందికి తగిన శిక్షణనిస్తుంది. లినెన్ నుంచి బాత్రూమ్ ఫిటింగ్స్ దాకా అన్నింటినీ నిర్దిష్ట ప్రమాణాలకు అప్‌గ్రేడ్ చేస్తుంది. ఆ తర్వాత ఆయా హోటల్స్‌ను తమ వెబ్సైట్లో లిస్టింగ్ చేస్తుంది. తమ వెబ్సైట్ ద్వారా జరిగే బుకింగ్స్‌పై ఆయా హోటల్స్ నుంచి 25 శాతం కమీషన్ తీసుకుంటుంది. సాఫ్ట్‌బ్యాంకు సహా పలువురు ఇన్వెస్టర్ల నుంచి గత సెప్టెంబర్‌లో బిలియన్ డాలర్లను (రూ.7,000 కోట్లు) ఓయో సమీకరించింది. దీని ప్రకారం సంస్థ విలువ 5 బిలియన్ డాలర్లు (రూ.35,000 కోట్లు) అని అంచనా. 1.2 బిలియన్ డాలర్లను భారత్, చైనాలో కార్యకలాపాల విస్తరణపైనే కంపెనీ వెచ్చించింది. భారత్‌లో 180 నగరాల్లో ఓయో 1,43,000 గదులను నిర్వహిస్తోంది. గతేడాది నవంబర్‌లో చైనాలో కూడా కార్యకలాపాలు ప్రారంభించి.. ప్రస్తుతం 265 నగరాలకు విస్తరించింది. 1,80,000 గదులను నిర్వహిస్తోంది. గదుల సంఖ్యా పరంగా టాప్ టెన్ బ్రాండ్లలో ఓయో కూడా ఒకటి. తన భారీ విస్తరణ కోసం త్వరలో మరిన్ని నిధులను సమీకరించే ఆలోచనతోనూ ఉంది. భారత్‌తో పోలిస్తే చైనాలో మరింత విస్తరించేందుకు భారీ అవకాశాలున్నాయని అగర్వాల్ తెలిపారు. చైనాలో 3.5 కోట్ల అన్ బ్రాండెడ్ హోటల్ గదులు అందుబాటులో ఉండగా, అదే భారత్‌లో అందుబాటులో ఉన్న అన్‌బ్రాండెడ్ గదులు 43 లక్షలేనని పేర్కొన్నారు. ఇండిగో మాజీ ప్రెసిడెంట్ అయిన ఆదిత్యఘోష్ను భారత్, దక్షిణాసియా ప్రాంతాల్లో ఓయో సంస్థకు సీఈవోగా ఇటీవలే నియమించుకున్న విషయం గమనార్హం. చైనా సహా అంతర్జాతీయంగా విస్తరణపై ఘోష్ దృష్టిసారించనున్నారు. -
ఓయోరూమ్స్ తో పేపాల్ అవగాహన
హైదరాబాద్: భారత దేశపు అతిపెద్ద బ్రాండెడ్ నెట్వర్క్ హోటల్ సంస్థ ఓయో రూమ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని అంతర్జాతీయ ఓపెన్ డిజిటల్ చెల్లింపుల కంపెనీ పేపాల్ ఒక ప్రకటనలో తెలిపింది. భారత ఈ కామర్స్ రంగం జోరుగా వృద్ధి సాధిస్తోందని, అదే విధంగా ఆన్లైన్ చెల్లింపుల్లో రిస్క్ కూడా బాగా పెరుగుతోందని పేపాల్ రీజనల్ మర్చెంట్ సర్వీసెస్ హెడ్ హమిశ్ మోలైన్ పేర్కొన్నారు. ఓయోరూమ్స్ వంటి సంస్థలకు చెల్లింపుల విషయంలో రిస్క్‌ను తగ్గించేలా టెక్నాలజీ సొల్యూషన్లను అందిస్తామని తెలిపారు. వినియోగదారుల చెల్లింపులు సులభంగా, ఎలాంటి రిస్క్‌లు లేకుండా ఉండేందుకు గాను పేపాల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఓయోరూమ్స్ సీఓఓ అభివన్ సిన్హా పేర్కొన్నారు. -
మలేసియాలో ఓయో రూమ్స్
న్యూఢిల్లీ: బడ్జెట్ హోటల్స్ సర్వీసుల సంస్థ ఓయో రూమ్స్ విదేశాలకు కార్యకలాపాలు విస్తరించింది. తాజాగా మలేసియాలో కార్యకలాపాలు ప్రారంభించినట్లు సంస్థ వ్యవస్థాపక సీఈవో రితేష్ అగర్వాల్ తెలిపారు. మొబైల్స్, ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా ఉన్న మార్కెట్లలో ఒకటైనందున మలేసియాను ముందుగా ఎంచుకున్నట్లు వివరించారు. -
విస్తరణ బాటలో ఓయో!: కవికృత్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆతిథ్య రంగంలో ఉన్న ‘ఓయో రూమ్స్’ విస్తరణ బాటపట్టింది. ఈ ఏడాది ముగింపు నాటికి 500 హోటళ్లు... 5 వేల గదుల్ని తమ బుకింగ్స్ పరిధిలోకి తీసుకురానున్నట్లు సంస్థ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ కవికృత్ చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో సేవలను ప్రారంభించిన ఓయోకు... ప్రస్తుతం ఇక్కడి 134 హోటళ్లలో 1,162 గదులున్నాయని గురువారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు. గత ఆరునెలల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరంగల్, కర్నూల్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లో ఓయో సేవలను ప్రారంభించామని చెప్పారు. ‘‘మా సొంత హోటళ్లతో పాటు ఇతర హోటళ్లలో గదులను కూడా బుకింగ్ చేసుకునే వీలుండటం ఓయో ప్రత్యేకత. స్వాగత్, సితారా వంటి బడ్జెట్ హోటళ్లు ఓయోతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. గతేడాది డిసెంబర్లో ప్రారంభమైన ఓయో ఇప్పటివరకు 125 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. గతేడాది జనవరిలో జరిగిన సీడ్ రౌండ్లో లైట్ స్పీడ్ ఇండియా, జూన్‌లో జరిగిన సిరీస్-ఏ రౌండ్లో సెకోయా క్యాపిటల్ లు 8 మిలియన్ డాలర్లు, ఈ ఏడాది జనవరిలో గ్రీన్ ఓక్స్ 25 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి.