![Oyo Founder Ritesh Agarwal Wedding High Profile Invitees - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/5/oyo.jpg.webp?itok=Z9vfPu8z)
దేశీయ హాస్పెటాలిటీ చెయిన్ ఓయోను స్థాపించిన రితేష్ అగర్వాల్ పెళ్లి మార్చి 7న ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో అత్యంత వైభవంగా జరగబోతోంది. ఈ విలాసవంతమైన వివాహానికి అత్యంత ప్రముఖులు చాలా మందినే ఆహ్వానించారు. పెళ్లికి ప్రముఖులు ఎవవరెవరు హాజరవుతున్నారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
రితేష్ అగర్వాల్ ఇటీవల తన తల్లి, కాబోయే భార్యతో కలిసి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని పెళ్లికి ఆహ్వానించారు. ఈ పెళ్లికి ఆహ్వానితుల జాబితాలో ప్రధాని మోదీతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఓయో బిజినెస్ కి సహకారం అందించిన ఎయిర్ బీఎన్బీ, లైట్ స్పీడ్ కామర్స్ వంటి సంస్థల అధినేతలు కూడా ఉన్నట్లు సమాచారం.
అగర్వాల్ పెళ్లికి సాఫ్ట్‌బ్యాంక్ చైర్మన్ మసయోషి సన్ హాజరవుతున్నట్లు బ్లూమ్‌బర్గ్ సంస్థ నివేదిక చెబుతోంది. ఓయో బిజినెస్‌లో అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టిన వాటిలో జపాన్‌కి చెందిన సాఫ్ట్ బ్యాంక్ కూడా ఒకటి. అందుకే రితేష్ అగర్వాల్ పెళ్లికి సాఫ్ట్ బ్యాంక్ చైర్మన్ కూడా వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
చదవండి: Ex-Twitter employee: ఆఫీస్‌లో నేలపై పడుకుని అప్పట్లో వైరల్! అంతలా కష్టపడినా వేటు తప్పలేదు..
రితేష్ అగర్వాల్ ఒడిషాలోని రాయగడ్‌కు చెందిన మార్వాడీ కుటుంబంలో జన్మించారు. వారి కుటుంబం అక్కడ చిన్న కిరాణ దుకాణం నిర్వహించేది. రితేష్ సిమ్ కార్డ్స్ అమ్ముకునే వాడు. థీల్ ఫెల్లోషిప్‌లో తాను గెల్చుకున్న డబ్బుతో 2013లో ఓయో సంస్థను స్థాపించారు. ఈ వ్యాపారం అనతికాలంలోనే భారీగా విజయవంతమైంది. ఒకప్పుడు సాధారణ యువకుడైన రితేష్.. తన పెళ్లికి ఇప్పుడు పెద్ద పెద్ద వాణిజ్యవేత్తలు, ప్రముఖులు సైతం వచ్చేంత స్థాయికి ఎదిగారు.
చదవండి: Aadhaar-Pan Linking: తరుముకొస్తున్న గడువు.. కానీ వీరికి ఆ టెన్షన్ లేదు!
Comments
Please login to add a commentAdd a comment