Oyo
-
రూ. 1,100 కోట్ల లాభం వస్తుంది.. ఓయో అంచనా
న్యూఢిల్లీ: రానున్న ఆర్థిక సంవత్సరం(2025–26)లో రూ. 1,100 కోట్ల నికర లాభం ఆర్జించగలమని ట్రావెల్ టెక్ స్టార్టప్ ఓయో అంచనా వేసింది. ఈ బాటలో రూ. 2,000 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) సాధించగలమని భావిస్తున్నట్లు యూనికార్న్ సంస్థ ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇందుకు ఆదాయంలో వృద్ధి దోహదపడగలదని అభిప్రాయపడ్డారు.ఇటీవల కొనుగోలు చేసిన మోటెల్ 6 తాజా అంచనాలకు దన్నుగా నిలవనున్నట్లు తెలియజేశారు. ఈ కాలంలో మోటెల్ 6 ఇబిటా రూ. 630 కోట్లకు చేరగలదని ఓయో ఊహిస్తోంది. ఓయో కొనుగోలు చేశాక తొలిసారి మోటెల్ 6 పూర్తి ఏడాది పనితీరును వెల్లడించనుంది. వెరసి ఓయో సంయుక్త ఇబిటా రూ. 2,,000 కోట్లను తాకనున్నట్లు సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఈ ఏడాది క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో ఓయో రూ. 166 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో నమోదైన రూ. 25 కోట్లతో పోలిస్తే నికర లాభం ఆరు రెట్లు ఎగసింది. వెరసి ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి 9 నెలల్లో(ఏప్రిల్–డిసెంబర్) రూ. 457 కోట్ల నికర లాభం ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో రూ. 111 కోట్ల నష్టం ప్రకటించింది. -
యూకేలో ఓయో పెట్టుబడులు
ఆతిథ్య రంగంలో ఉన్న ఓయో తాజాగా యూకేలో సుమారు రూ.540 కోట్లు వెచ్చించనున్నట్టు తెలిపింది. ప్రీమియం హోటల్ పోర్ట్‌ఫోలియో విస్తరణకు వచ్చే మూడేళ్లలో ఈ మొత్తాన్ని ఖర్చు చేయనుంది. తద్వారా యూకే ఆతిథ్య రంగంలో 1,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించింది. విస్తరణలో భాగంగా దీర్ఘకాలిక లీజు, నిర్వహణ ఒప్పందాలను కుదుర్చుకుంటున్నట్టు తెలిపింది. 2018లో యూకే మార్కెట్లో అడుగుపెట్టినట్టు కంపెనీ వివరించింది. 200లకుపైగా హోటళ్లు ఓయో జాబితాలో ఉన్నాయి. యూకేలో 65 నగరాల్లో ఇవి విస్తరించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40 ప్రీమియం హోటళ్లను అందుబాటులోకి తేనున్నట్టు కంపెనీ గతంలో ప్రకటించింది. ఇందులో ఇప్పటికే 18 తెరుచుకున్నాయి. యూఎన్ గ్లోబల్ కాంపాక్ట్‌లో జీఎంఆర్ ఎయిర్పోర్ట్కార్పొరేట్ల సుస్థిర అభివృద్ధి ప్రణాళికల అమలుకు సంబంధించిన యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కాంపాక్ట్‌లో (యూఎన్‌జీసీ) చేరినట్లు జీఎంఆర్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(జీఏఎల్) వెల్లడించింది. మానవ హక్కులు, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపరంగా యూఎన్‌జీసీ నిర్దేశించుకున్న పది సూత్రాలకు, అలాగే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు (ఎస్డీజీ) అనుగుణంగా తమ వ్యూహాలు, కార్యకలాపాలను నిర్వహించనున్నట్లు వివరించింది. తమ విమానాశ్రయాలన్నింటికీ యూఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ లేదా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సర్టిఫికేషన్ ఉన్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: అక్రమ జామర్స్‌తోనే కాల్ డ్రాప్స్పర్యావరణహిత ఏవియేషన్‌లో అంతర్జాతీయంగా అగ్రగామిగా ఎదిగే దిశగా ఇదొక కీలక అడుగని జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ సీఈవో కిరణ్ కుమార్ గ్రంధి తెలిపారు. హైదరాబాద్, ఢిల్లీ, గోవా, మెడాన్ (ఇండొనేషియా) విమానాశ్రయాలను జీఏఎల్ నిర్వహిస్తోంది. అలాగే, విశాఖలోని భోగాపురం, గ్రీస్‌లోని క్రెటెలో విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తోంది. ఫిలిప్పీన్స్‌లోని మక్టాన్ సెబు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి సాంకేతిక సేవలు అందిస్తోంది. -
సకుటుంబ ఇమేజ్ కోసం తహతహ: ఓయో
‘‘ఓకే అని అంటివా ఓయోకి రమ్మంటడు'’.. అంటూ ఓ సినీ రచయిత హీరోయిన్‌తో పలికిస్తాడు. ఆఖరికి సినీరచనలను సైతం ప్రభావితం చేసేలా మారిపోయింది. ఓయో బ్రాండ్ అనే దానికి ఇదో నిదర్శనం.అన్ మ్యారీడ్ కపుల్స్‌కి ఆహ్వానం..ఓయో అనే సంస్థ.. పలు హోటల్స్‌తో ఒప్పందాల ద్వారా దేశవ్యాప్తంగా బస సౌకర్యాలను విస్తరించడం ప్రారంభించిన సమయంలో ఈ పరిస్థితి లేదు. అయితే ఆ తర్వాత తర్వాత.. అన్ మ్యారీడ్ కపుల్ వెల్కమ్ అనే లైన్ ఎప్పుడైతే ఓయో యాప్ ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించిందో.. అప్పటి నుంచే ఆ యాప్ డౌన్‌లోడ్స్‌తో పాటు బ్రాండ్ వాల్యూ కూడా అమాంతం పెరిగిపోతూ వచ్చింది.ఈ నేపధ్యంలోనే అకస్మాత్తుగా ఓయో బ్రాండ్ ఇటీవల తన పంధాను సంస్కరించుకోవడం ప్రారంభించింది. పెళ్లికాని జంటలకు గదులు అద్దెకు ఇవ్వడం అనే విధానం నుంచి వెనక్కు మళ్లుతున్నట్టు కనిపిస్తోంది. పెళ్లికాని జంటలకు స్నేహపూర్వక విడిదిగా ప్రసిద్ది చెందిన ఈ బ్రాండ్ గత కొన్ని నెలలుగా సకుటుంబ - ఆధారిత ప్లాట్‌ఫారమ్‌గా ఓయోను రీబ్రాండ్ చేయడానికి కృషి చేస్తోంది.పెళ్లికాని జంటలకు సంబంధించి తన చెక్ - ఇన్ విధానాన్ని సవరించడం మీరట్‌లో ప్రారంభం కావడం మొదలు.. ఓయో హోటల్ సోషల్ మీడియాలో చర్చోపచర్చలకు దారి తీసింది. ఈ నేపధ్యంలోనే సంస్థ వ్యవస్థాపకుడు 'రితేష్ అగర్వాల్' మీడియాతో మాట్లాడారు. తమపై పడిన బ్రాండింగ్‌ను ఉద్దేశించి.. ఇది ఎక్కువగా మీమ్స్‌తో ముడిపడిన ’సోషల్ మీడియా సృష్టిగా ఆయన అభివర్ణించాడు.తమ వ్యాపారంలో దాదాపు 70 - 80% కుటుంబాలు లేదా వ్యాపార ప్రయాణీకుల నుంచే వస్తుందనీ.. అయినప్పటికీ, సోషల్ మీడియా కొన్ని మీమ్‌ల ద్వారా తమపై మరో తరహా అభిప్రాయానికి ఆజ్యం పోసిందనీ ఆయన చెప్పారు. అయితే ఇదంతా కేవలం నగరాల్లో అదీ కొన్ని ప్రాంతాల్లో మాత్రమేనని తీసిపారేశారు. అయితే తాను ఓ రకంగా దీనిని అభినందిస్తున్నాననీ.. ఎందుకంటే ఇది (పెళ్లికాని జంటల బస) సమాజానికి కూడా ఒక సవాలుగా ఉంది కదా అన్నారాయన.తమ బ్రాండ్‌కు ఆథ్యాత్మిక ఇమేజ్ తేవడానికి కూడా ఆయన ప్రయత్నించినట్టు కనిపించింది. అయోధ్యలో 80 హోటళ్లను ప్రారంభించామనీ.. వారణాసి, రామేశ్వరం, అజ్మీర్ సహా దేశవ్యాప్తంగా ఆధ్యాత్మికప్రదేశాలలో తాము భాగస్వాములను కలిగి ఉన్నామనీ ఆయన చెప్పుకొచ్చారు. తమ బ్రాండ్‌పై సోషల్ మీడియా మీమ్‌లు సృష్టించిన అపోహల గురించి గుసగుసలాడే బదులు, మా బ్రాండింగ్‌కి ఎదరువుతున్న సవాలును ధైర్యంగా నేరుగా ఎదుర్కొని పరిష్కరించాలనుకుంటున్నాం.. అన్నారాయన.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డుతో అద్దె కడుతున్నారా.. ఈ విషయాలు తెలుసా?తమ కొత్త బ్రాండింగ్ వ్యూహం విజయవంతమైందని, గత మూడేళ్లలో కంపెనీ అత్యధిక యాప్ డౌన్లోడ్లు, రిపీట్ రేట్లు హోటల్ ఓపెనింగ్లను చూసిందన్నారు. మేం నిజంగా చాలా ప్రేమను పొందామని ఆయన పేర్కొన్నారు.సోషల్ మీడియాలో వచ్చిన మీమ్‌లు తనను ఇబ్బంది పెట్టాయా లేదా తన కంపెనీని ఎలా గుర్తించిందనే దాని గురించి బాధగా అనిపించిందా అని అడిగినప్పుడు.. అగర్వాల్ స్పందిస్తూ, అదేం లేదు, ఓయో.. కార్పొరేట్ ప్రపంచంలో అత్యంత గౌరవనీయమైన బ్రాండ్. ఇది అనేక ఉత్తమ కార్పొరేట్ అవార్డులను సాధించిందని ఆయన వెల్లడించారు. -
ఓయో సంచలన నిర్ణయం.. ఆ జంటలకు నో రూమ్
ప్రముఖ ట్రావెల్, హోటల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఓయో (OYO) పెళ్లికాని జంటలకు షాకిచ్చింది. ఇకపై పెళ్లి కాని జంటలకు రూమ్స్ బుకింగ్స్ లేదంటూ తేల్చిచెప్పింది. ఈమేరకు తన భాగస్వామి హోటల్లకు చెక్ ఇన్ పాలసీలో కీలక మార్పులు తీసుకొచ్చింది.ఇకపై పెళ్లి కాని యువతీ, యువకులు ఓయో రూమ్స్ లో చెక్ ఇన్ చేసేటప్పుడు వారి రిలేషన్‌షిప్‌కు సంబంధించిన చెల్లుబాటు అయ్యే ఐడీ ప్రూఫ్స్ అడగనుంది. సరైన ఐడీ ప్రూఫ్ లేకపోతే బుకింగ్స్‌ను తిరస్కరించే అధికారాన్ని పార్టనర్ హోటల్స్‌కు ఇస్తున్నట్టు ఓయో చెప్పుకొచ్చింది.మొదటగా మీరట్ నుంచి..మొదటగా ఉత్తరప్రదేశ్ మీరట్‌లోని ఓయో భాగస్వామి హోటల్స్‌లో కొత్త చెక్ ఇన్ పాలసీని ప్రారంభించింది. అక్కడ నుంచి వచ్చే గ్రౌండ్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా కంపెనీ ఈ కొత్త రూల్‌ని దేశంలోని మరిన్ని నగరాలలో అమలు చేయనుంది. ఇటీవల కొత్త సంవత్సరం సందర్భంగా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం ఓయో రూమ్స్ ఉపయోగించిన వారి సంఖ్య 10 లక్షలు దాటింది. 2023తో పోలిస్తే ఈ సంఖ్య 58 శాతం పెరిగింది.పెళ్లికాని జంటలు విచ్చలవిడిగా ఓయో రూమ్స్‌ను దుర్వినియోగం చేస్తున్నారని, దీన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని పౌర సమాజ సమూహాల నుంచి అభ్యర్థనలు వచ్చాయి. ఓయో రూమ్స్ దుర్వినియోగంపై ముఖ్యంగా మీరట్‌లో పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వచ్చాయి. దీంతో అక్కడ నుంచే ఓయో కొత్త చెక్ ఇన్ పాలసీని ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఓయోపై ఉన్న పాత అభిప్రాయాలను మార్చడం, కుటుంబాలు, విద్యార్థులు, వ్యాపార వర్గాలు, మతపరమైన, ఒంటరి ప్రయాణీకులకు సురక్షితమైన అనుభూతిని అందించే బ్రాండ్‌గా తనను తాను రూపొందించుకోవడం లక్ష్యంగా కంపెనీ ఈ చొరవ తీసుకున్నట్లు ఓయో నార్త్ ఇండియా రీజియన్ హెడ్ పవాస్ శర్మ పేర్కొన్నారు.సురక్షితమైన ఆతిథ్య పద్ధతులపై పోలీసులు, హోటల్ భాగస్వాములతో కలిసి సదస్సులను నిర్వహించడంతోపాటు అనైతిక కార్యకలాపాలను ప్రోత్సహించే హోటళ్లను బ్లాక్‌లిస్ట్ చేయడం, ఓయో బ్రాండింగ్‌ని అనధికారిక ఉపయోగించే హోటళ్లపై చర్యలు తీసుకోవడం వంటి అనేక దేశవ్యాప్త కార్యక్రమాలను ఓయో ప్రారంభించింది. -
పర్యాటకుల ఎంపిక హైదరాబాద్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది హైదరాబాద్‌ను సందర్శించేందుకు అత్యధికులు మొగ్గు చూపారు. ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ ప్లాట్‌ఫామ్‌పై హైదరాబాద్ అత్యధిక బుకింగ్స్ నమోదు చేసుకుంది. దేశంలో ప్రయాణ తీరుతెన్నులను తెలిపే ఓయో వార్షిక నివేదిక ట్రావెలోపీడియా 2024 ప్రకారం.. పూరీ, వారణాసి, హరిద్వార్ ప్రముఖ ఆధ్యాత్మిక గమ్యస్థానాలుగా నిలిచాయి. మతపర పర్యాటకం కీలకంగా కొనసాగింది. దేవఘర్, పళని, గోవర్ధన్ గణనీయ వృద్ధిని సాధించాయి.బుకింగ్స్ పరంగా హైదరాబాద్ తర్వాతి స్థానాల్లో బెంగుళూరు, ఢిల్లీ, కోల్‌కతా స్థానం సంపాదించాయి. ప్రయాణానికి అత్యంత ప్రజాదరణ పొందిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ తన స్థానాన్ని కొనసాగించింది. మహారాష్ట్ర, తెలంగాణ, కర్నాటక నుండి అధిక మొత్తంలో బుకింగ్స్ నమోదయ్యాయి. 48 శాతం వార్షిక వృద్ధితో పాటా్న, రాజమండ్రి, హుబ్లీ వంటి చిన్న పట్టణాలు అద్భుత వృద్ధిని కనబరిచాయి. ఈ సంవత్సరం విహార యాత్రల్లో జోరు కనిపించింది. జైపూర్ అగ్ర పర్యాటక స్థానంగా కొనసాగింది. వరుసలో గోవా, పాండిచ్చేరి, మైసూర్ ఉన్నాయి. ఆసక్తికరంగా బుకింగ్‌లలో ముంబై తగ్గుదల చవి చూసింది. జూలై నాల్గవ వారాంతంలో ఎక్కువగా బుకింగ్‌లు జరిగాయి. -
నువామా వెల్త్ చేతికి ఓయో షేర్లు
న్యూఢిల్లీ: ట్రావెల్ టెక్ యూనికార్న్ ఒరావెల్ స్టేస్ లిమిటెడ్‌లో నువామా వెల్త్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రూ. 100 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఓయో బ్రాండ్ కంపెనీ వాటాను షేరుకి రూ. 53 చొప్పున సొంతం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. సెకండరీ మార్కెట్లో లావాదేవీ ద్వారా కంపెనీ తొలి ఇన్వెస్టర్ల నుంచి వీటిని కొనుగోలు చేసినట్లు పేర్కొన్నాయి. మరోపక్క ఆతిథ్య రంగ కంపెనీలో వాటా కొనుగోలుకి ఇన్‌క్రెడ్ తదితర సంస్థలు సైతం ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించాయి. ఇందుకు షేరుకి రూ. 53–60 మధ్య ధరను చెల్లించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వెరసి కంపెనీ విలువను 5 బిలియన్ డాలర్లకుపైగా మదింపు చేసినట్లు వివరించాయి. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. వీటి ప్రకారం ఏప్రిల్–జూన్(క్యూ1)లో సుమారు రూ. 132 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2023–24) క్యూ1లో రూ. 108 కోట్ల నష్టాలు ప్రకటించింది. -
స్పోర్ట్స్ హాస్పిటాలిటీ వ్యాపారంలోకి ఓయో
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ టెక్ సంస్థ ఓయో తాజాగా స్పోర్ట్స్ హాస్పిటాలిటీ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. భారీ స్థాయి క్రీడల పోటీల నిర్వహణకు సంబంధించి ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, పుణె సహా 12 కీలక నగరాల్లో 100 హోటల్స్‌ను షార్ట్‌లిస్ట్ చేసింది. వివిధ స్పోర్ట్స్ ఈవెంట్లలో పాల్గొనే క్రీడాకారులు, అధికారులకు వసతి సదుపాయం కలి్పంచేందుకు ఇవి ఉపయోగపడగలవని సంస్థ తెలిపింది. స్పోర్ట్స్ టీమ్‌లు, పెద్ద బృందాల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ప్యాకేజీలు, గ్రూప్ బుకింగ్ ఆప్షన్స్ ఇస్తామని ఓయో వివరించింది. అలాగే క్రీడాకారులు, ఈవెంట్లను వీక్షించేందుకు వచ్చే వారి ఆహార, రవాణా అవసరాలను తీర్చే థర్డ్–పార్టీ ఏజెన్సీల సేవలను కూడా అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. -
న్యూ ఇయర్ ఎఫెక్ట్ - నిమిషానికి 1244 బిర్యానీలు.. ఓయో బుకింగ్స్ ఎన్నంటే?
2024 కొత్త సంవత్సరంలో జొమాటో, స్విగ్గీ, ఓయో వంటి సంస్థలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 31న ఒకే రోజు అత్యధిక ఆర్డర్స్ చేసినట్లు జొమాటో సీఈఓ దీపేందర్ గోయల్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించాడు. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. జొమాటో - 2015 నుంచి 2020 వరకు కంపెనీ ఎన్ని ఆర్డర్లను స్వీకరించిందో.. ఒక్క 2023 డిసెంబర్ 31న ఒకే రోజు స్వీకరించి గతంలో నెలకొన్ని అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. సుమారు 3.2 లక్షల మంది జొమాటో డెలివరీ పార్ట్నర్స్ ఈ డెలివరీలను చేసినట్లు తెలిపారు. దేశంలో ఎక్కువ ఆర్డర్స్ మహారాష్ట్ర నుంచి వచ్చినట్లు, కలకత్తాకు చెందిన ఓకే వ్యక్తి 125 ఐటెమ్‌లను ఆర్డర్ చేసుకున్నాడు. ప్రజలు 1.47 లక్షల చిప్స్ ప్యాకెట్లు, 68,231 సోడా బాటిళ్లు, 2,412 ఐస్ క్యూబ్స్ ప్యాకెట్లు, 356 లైటర్లను ఆర్డర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. జొమాటో డెలివరీ బాయ్స్ ఆ ఒక్క రోజులో పొందిన మొత్తం టిప్స్ ఏకంగా రూ. 97 లక్షలు కావడం గమనార్హం. Fun fact: We’ve delivered almost as many orders on NYE 23 as we did on NYE 15, 16, 17, 18, 19, 20 combined 🤯 Excited about the future! — Deepinder Goyal (@deepigoyal) December 31, 2023 Love you, India! You’ve tipped over ₹97 lakhs till now to the delivery partners serving you tonight ❤️❤️❤️ — Deepinder Goyal (@deepigoyal) December 31, 2023 స్విగ్గీ - స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ద్వారా రెండు లక్షల కిలోల ఉల్లిపాయలు, 1.80 లక్షల కిలోల బంగాళాదుంపలను ఆర్డర్ చేశారు. 200 ప్యాకెట్ల సింగిల్ కెచప్‌ను సూరత్‌లో డెలివరీ చేశారు. సుమారు 1.04 లక్షల మంది ప్రజలు ఫుడ్ డెలివరీ చేసినట్లు గణాంకాలు వెల్లడించాయి. గతంలో పోలిస్తే ఈ సేల్స్ చాలా ఎక్కువని చెబుతున్నారు. బిర్యానీ - న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్‌లోనే మొత్తం 4.8 లక్షల బిర్యానీలు డెలివరీ అయ్యాయని చెబుతున్నారు. అంటే ప్రతి నిమిషానికి 1244 ఆర్డర్స్ బిర్యానీ కోసం వచ్చినట్లు సమాచారం. ఓయో రూమ్ బుకింగ్స్ - న్యూ ఇయర్ సందర్భంగా ఫుడ్ మాత్రమే కాకుండా ఓయో రూమ్స్ బుకింగ్స్ కూడా రికార్డ్ స్థాయికి చేరాయి. గతేడాదితో పోలిస్తే ఈ సారి 37 శాతం లేదా 6.2 లక్షల బుకింగ్స్ జరిగాయి. డిసెంబర్ 30, 31 వ తేదీల్లో మాత్రమే 2.3 లక్షల రూమ్స్ బుక్ అయ్యాయని, ఇందులో కూడా ఎక్కువగా అయోధ్యలో ఎక్కువగా 70 శాతం, తరువాత స్థానాల్లో గోవాలో 50 శాతం అని తెలుస్తోంది. this year the numbers are almost 4 times higher. with 2,00,000 kilos of kaanda and 1,80,000 kilos of aloo stocked at @swiggyinstamart, uday shetty is spinning and shaking unable to control himself rn https://t.co/cVOmsKZf1n — Swiggy (@Swiggy) December 31, 2023 -
OYO Travelopedia: వరంగల్, గుంటూరులో ఎక్కువ హోటల్ బుకింగ్‌లు
న్యూఢిల్లీ: దేశంలో ఎక్కువ మంది హైదరాబాద్‌కు ప్రయాణాలు కడుతున్నారు. ఈ ఏడాది ఎక్కువగా హోటళ్లు బుక్ చేసుకున్నది హైదరాబాద్‌లోనే అని ఓయో ట్రెవెలో పీడియా 2023 నివేదిక ప్రకటించింది. హైదరాబాద్ తర్వాత బుకింగ్‌లలో బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది. ఢిల్లీ, కోల్‌కతా తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నాయి. గోరఖ్‌పూర్, ధిగ, వరంగల్, గుంటూరులకు సైతం ఎక్కువ బుకింగ్‌లు నమోదయ్యాయి. ఇక ఎక్కువ మంది సందర్శించిన (హోటళ్లు బుక్ చేసుకున్న) రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఆ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర ఉంది. ఈ ఏడాది సెపె్టంబర్ 30 నుంచి అక్టోబర్ 2 మధ్య వారాంతపు హోటళ్ల బుకింగ్‌లు ఎక్కువ నమోదయ్యాయి. విహార పర్యటనలకు జైపూర్ ప్రధాన కేంద్రంగా ఉంది. 2023లో ఎక్కువ మంది విహారం కోసం ఈ పట్టణాన్ని సందర్శించారు. గోవా, మైసూరు, పుదుచ్చేరి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఎక్కువ హోటళ్లు బుక్ చేసుకున్న ఆధ్యాతి్మక, భక్తి కేంద్రంగా ఒడిశాలోని పూరి పట్టణం నిలిచింది. ఈ విషయంలో అమృత్సర్, వారణాసి, హరిద్వార్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆధ్యాతి్మకంగా పెద్దగా తెలియని దియోగఢ్, పళని, గోవర్ధన్‌కు సైతం బుకింగ్‌లు 2022తో పోలిస్తే ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి. రాష్ట్రాల పరంగా ఎక్కువ బుకింగ్‌లలో యూపీ మొదటి స్థానంలో ఉంటే, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఎప్పటికీ గుర్తుండి పోతుంది.. ‘‘ప్రయాణాలకు సంబంధించి 2023 ప్రత్యేకంగా నిలిచిపోతుంది. కరోనా కారణంగా ఏర్పడిన సవాళ్ల తర్వాత పరిశ్రమ తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది. దేశీయంగా కొత్త ప్రాంతాలను చూసి రావాలన్న ధోరణి కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయంగా ప్రయాణాల వృద్ధిలో విహార యాత్రలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. భారత్‌లో వ్యాపార ప్రయాణాలు సైతం వృద్ధికి చెప్పుకోతగ్గ మద్దతునిస్తున్నాయి’’అని ఓయో గ్లోబల్ చీఫ్ సర్వీస్ ఆఫీసర్ శ్రీరంగ్ గాడ్బోలే వివరించారు. ఈ ఏడాది ఎక్కువ హోటల్ బుకింగ్‌లు చేసుకున్న రోజు సెపె్టంబర్ 30 కాగా, మాసాల వారీగా చూస్తే మేలో ఎక్కువ బుకింగ్‌లు నమోదైనట్టు ఓయో ట్రావెలోపీడియా నివేదిక తెలిపింది. ఇక అమెరికాలో ఎక్కువ మంది ప్రయాణించిన రాష్ట్రాల్లో టెక్సాస్, ఒరెగాన్, లూసియానా, ఓక్లహామా, ఫ్లోరిడా, హూస్టన్ టాప్‌లో ఉన్నాయి. యూకేలో లండన్, ప్లైమౌత్, మిడిల్స్‌బ్రో, షెఫీల్డ్, ఈస్ట్‌బోర్న్, యూరప్‌లో శాల్జ్‌బర్గ్, ఆ్రస్టియాలో టైరోల్‌ను ఎక్కువ మంది సందర్శించారు. -
మీతో పంచుకోవాల్సిందే, రికమెండేషన్స్ ప్లీజ్..సీరియస్లీ: రితేష్ ఎమోషనల్
ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ తన జీవితంలోని ఒక గుడ్ న్యూస్ తన అభిమానులతో పంచుకున్నారు. తన భార్య గీతాన్షా సూద్ గర్భం దాల్చినట్టు ప్రకటించారు. ఈ ఏడాది మార్చిలో పెళ్లి చేసుకున్న రితేష్ సోషల్ మీడియాలో తాము తొలిసారి తల్లిదండ్రులు కాబోతున్నామన్న వార్తను పంచు కున్నారు. టీనేజర్‌గా, సొంత కంపెనీ పెట్టాలన్న కలలతో కుటుంబాన్ని ఒప్పించేందుకు ప్రయత్నాల్లో ఉండగా, 11 ఏళ్ల క్రితం గీత్‌ను కలిశాను. అలా టీనేజర్లుగా తరువాత జంటగా, ఇపుడు తల్లిదండ్రులుగా మారబోతున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఈ విషయాన్ని మీతో పంచుకునేందుక సంతోషిస్తున్నామంటూ ఈ శుభవార్తను అందించారు. రికమెండేషన్స్ ప్లీజ్..సీరియస్లీ అంతేకాదు న్యాపీలు, స్ట్రోలర్లు, బొమ్మల కోసం సిఫార్సులను షేర్ చేయాలంటూ అగర్వాల్ నెటిజన్లను కోరారు. మీరు ఏదైనా వినూత్నమైన స్టార్టప్ అయితే ఇంకా మంచిది. తీవ్రంగా, తండ్రి స్థాయి జ్ఞానం కోసం మార్కెట్లో ఉన్నానంటూ రాశారు. ఈ సందర్భంగా తన పోస్ట్‌లో తన భార్యపై ప్రశంసలు కురిపించారు కూడా.కష్టాలు,కన్నీళ్లు, సంతోషం అనేక మైలురాళ్ల ప్రయాణంలో తన వెనుక గట్టి నిలబడ్డ ఏకైక వ్యక్తి గీత్ అంటూ రాసుకొచ్చారు రితేష్ అగర్వాల్. దీంతో ఈ జంటకు ప్రశంసల వెల్లువ కురుస్తోంది. "ఓహ్! కంగ్రాట్స్!" అంటూ పాపులర్ రచయిత చేతన్ భగత్ వ్యాఖ్యానించారు.“ఆల్ ది బెస్ట్ రితేష్. పేరెంట్‌హుడ్ ఉత్తమమైనది, ” అని ఎడెల్వీస్ సీఎండీ రాధికా గుప్తా అభినందలు తెలిపారు.మార్చి 7న రితేష్ అగర్వాల్ గీతాన్షా సూద్ వివాహం చేసుకున్నారు. రితేష అగర్వాల్ 2013లో ఓయోను ప్రారంభించిన సంగతి తెలిసిందే. I met Geet eleven years ago, when I was just a teenager chasing dreams, trying to convince my family that I wanted to build my own company from scratch. There was only one constant who was by my side through it all, and it was her. The highs of happiness and milestones, the lows… pic.twitter.com/cJKY2xcXPF — Ritesh Agarwal (@riteshagar) October 13, 2023 -
ప్రీమియం రిసార్ట్స్ విభాగంలోకి ఓయో.. కొత్త బ్రాండ్ ఆవిష్కరణ
న్యూఢిల్లీ: హాస్పిటాలిటీ టెక్నాలజీ సంస్థ ఓయో తాజాగా ప్రీమియం రిసార్టులు, హోటల్స్ విభాగంలోకి ప్రవేశించింది. పాలెట్ పేరిట కొత్త బ్రాండ్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతానికి హైదరాబాద్‌తో పాటు ముంబై, చెన్నై తదితర నగరాల్లో 10 రిసార్టులతో ఈ బ్రాండును ప్రారంభించినట్లు సంస్థ చీఫ్ మర్చంట్ ఆఫీసర్ అనుజ్ తేజ్‌పాల్ తెలిపారు. రెండో త్రైమాసికంలో దీని కింద మరో 40 రిసార్టులను చేర్చుకోనున్నట్లు వివరించారు. ప్రస్తుతం పర్యాటకులు మరింత విలాసవంతమైన పర్యటనల వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో పాలెట్ బ్రాండుకు మంచి ఆదరణ లభించగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఓయోలో ప్రస్తుతం టౌన్హౌస్ ఓక్, ఓయో టౌన్హౌస్, కలెక్షన్ ఓ, క్యాపిటల్ ఓ పేరిట పలు బ్రాండ్స్ ఉన్నాయి. 2023 ఆఖరు నాటికి తమ ప్రీమియం పోర్ట్‌ఫోలియోలోకి మొత్తం 1,800 ప్రాపర్టీలను చేర్చుకోవాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. -
సూపర్ ఆఫర్.. డబ్బులు లేకుండా ఓయో రూమ్!
హాస్పిటాలిటీ టెక్నాలజీ కంపెనీ ఓయో (OYO) భారతీయ ప్రయాణికులకు అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. స్టే నౌ పే లేటర్ (SNPL) సౌకర్యాన్ని కల్పించింది. సాధారణంగా ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసే కస్టమర్లకు ఈ-కామర్స్ వెబ్సైట్లు, రిటైల్ షాపులు ఇలాంటి బై నౌ పే లేటర్ ఆఫర్లను అందిస్తుంటాయి. ఆఫర్ వివరాలు SNPL సౌకర్యం కింద కస్టమర్లకు రూ. 5,000 వరకు క్రెడిట్ పరిమితిని అందిస్తారు. 15 రోజుల బస తర్వాత మొత్తాన్ని సెటిల్ చేయాలి. ఈ ఫీచర్ కోసం క్రెడిట్ ఆధారిత చెల్లింపుల సేవ అయిన Simplతో ఓయో భాగస్వామ్యం కలిగి ఉంది. ఓయో యాప్ హోమ్ స్క్రీన్‌పై ఈ ఫీచర్‌ని యాక్సెస్ చేయవచ్చు లేదా చెల్లింపు మోడ్ ఎంపిక సమయంలో Simplని ఎంచుకోండి. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో iOS యూజర్లకు అందుబాటులోకి రానుంది. తరచూ ప్రయాణాలు చేసేవారికి ఈ SNPL ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుందని ఓయో గ్లోబల్ సీవోవో, చీఫ్ టెక్నాలజీ & ప్రోడక్ట్ ఆఫీసర్ అభినవ్ సిన్హా చెప్పారు. Simpl ద్వారా హోటల్ బుకింగ్ చేసుకునే కస్టమర్లకు 65 శాతం వరకు తగ్గింపుతోపాటు రూ. 50 క్యాష్‌బ్యాక్‌ను లభిస్తుంది. అయితే Simpl యాప్‌లో చెల్లింపును 15 రోజులకు మించి ఆలస్యం చేస్తే, మీ బిల్లు మొత్తాన్ని బట్టి వడ్డీ, రూ. 250 వరకు ఆలస్య రుసుముతోపాటు జీఎస్టీని విధిస్తుంది. ఇదీ చదవండి: Ritesh Agarwal: ఆ పని చేసినందుకు రూ.20 టిప్పు ఇచ్చారు: తొలినాళ్లను గుర్తు చేసుకున్న ఓయో ఫౌండర్ -
ఆ పని చేసినందుకు రూ.20 టిప్పు ఇచ్చారు: ఓయో ఫౌండర్
కెరియర్ తొలినాళ్లలో తాను పడిన ఇబ్బందులు, ఎదురైన అనుభవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు ఓయో రూమ్స్ (OYO Rooms) ఫౌండర్ రితేష్ అగర్వాల్ (Ritesh Agarwal). కంపెనీకి బాస్‌గా మాత్రమే కాకుండా ఫ్రంట్ డెస్క్ మేనేజర్‌గా, అవసరమైనప్పుడు క్లీనింగ్ స్టాఫ్‌గా కూడా పనిచేసినట్లు వెల్లడించారు. అప్పుడు ఓయో ఇంకా ప్రారంభ దశలో ఉంది. రితేష్ అగర్వాల్ థీల్ ఫెలోషిప్ పూర్తి చేసుకుని అప్పుడే తిరిగివచ్చారు. ఈ సమయంలో తన సంస్థ అభివృద్ధికి ఆయన చాలా కష్టపడ్డారు. హోటల్ సిబ్బందిగా పనిచేశారు. కస్టమర్ కేర్, ఫ్రంట్ డెస్క్ మేనేజర్‌గా అవసరమైనప్పుడు క్లీనింగ్ పని కూడా చేశారు. బిజ్ టాక్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రితేష్ అగర్వాల్ హోటల్ గదిని శుభ్రం చేయడానికి వెళ్లిన సందర్భాన్ని వివరించారు. రూం క్లీనింగ్ ఆలస్యం కావడంతో ఓ కస్టమర్ చాలా కోపంగా ఉన్నాడు. అతనికి సర్దిచెప్పడానికి వెళ్లిన రితేష్ అగర్వాల్‌ను క్లీనింగ్ సిబ్బందిగా భావించి ఆ కస్టమర్ ఎడాపెడా తిట్టేశాడు. చివరికి రితేష్ అగర్వాల్ స్వయంగా ఆ గదిని శుభ్రం చేశాడు. దీంతో సంతృప్తి చెందిన కస్టమర్ తనకు రూ. 20 టిప్ ఇచ్చాడని రితేష్ అగర్వాల్ గుర్తు చేసుకున్నారు. హాస్పెటాలిటీ రంగంలో హౌస్కీపర్లు, డెస్క్ మేనేజర్లు వంటి సిబ్బంది పాత్రను, గొప్పతనాన్ని వివరిస్తూ తొలినాళ్లలో తనకు ఎదురైన అభువాన్ని వెల్లడించిన ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో క్లిప్‌ను ట్విటర్లో షేర్ చేశారు రితేష్ అగర్వాల్. హాస్పిటాలిటీ పరిశ్రమలో నిజమైన తారలు ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్లు, క్లీనింగ్ సిబ్బంది, రిసెప్షనిస్ట్‌లు, తెరవెనుక సిబ్బంది అంటూ అందులో రాసుకొచ్చారు. The real stars of the hospitality industry are the front office managers, cleaning crew, receptionists and behind-the-scenes staff who ensure guests have the best possible experience during their stay. Early on I got to experience this first-hand when a customer tipped me Rs… pic.twitter.com/M1Gre6NTUh — Ritesh Agarwal (@riteshagar) May 28, 2023 ఇదీ చదవండి: Prerna Jhunjhunwala: రూ. 330 కోట్ల యాప్.. ఈమె స్టార్టప్ పిల్లల కోసమే.. -
జీవితంలో ఎదగాలంటే? ఓయో ఫౌండర్ 'రితేశ్ అగర్వాల్' మాటల్లో..
'కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహా పురుషులవుతారు' అన్న మాటలు అక్షర సత్యం. అయితే జీవితంలో ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలంటే తప్పకుండా కొంత మంది అనుభవాలు చాలా అవసరం. అవి తప్పకుండా మనిషిలో మంచి స్ఫూర్తిని నింపుతాయి. దీనికి నిదర్శనం మా అమ్మ చెప్పిన మాటలు అంటూ ఓయో సంస్థ సీఈఓ 'రితేశ్ అగర్వాల్' ఇటీవల వెల్లడించారు. ఇటీవల ఐఐటీ నాగ్‌పూర్ గ్రాడ్యుయేషన్ వేడుకలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. వాళ్ళ అమ్మ చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నాడు. దీనికి సంబంధించి వీడియో కూడా ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఇందులో నా అనుభవాలు, నేను నేర్చుకున్న పాఠాలను విద్యార్థులతో పంచుకునే అవకాశం ఇప్పుడు దక్కిందని ''మీరు గొప్పస్థాయికి చేరుకునే క్రమంలో, ఉన్నత శిఖరాలను అధిరోహించే మార్గంలో మీరు మీ మూలాలు ఎప్పటికీ మర్చిపోవద్దని, జీవితంలో ఎంత పైకి ఎదిగితే అంత ఒదిగి ఉండాలనే మాటను మా అమ్మ దగ్గర విన్నానని'' చెప్పాడు. మీరు ఇప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ, ఇంతకు ముందు ఎక్కడ ఉన్నారనే సంగతి మర్చిపోకూడదని అన్నారు. జీవితంలో గొప్ప వ్యాపారాలను సాధించాలనే తపనను విడనాడకుండా ఉన్న మాదిరిగానే మీ మూలాలను ఎప్పటికి విడిచిపెట్టకూడదన్నారు. ఈ వీడియో చూసిన చాలా మంది మీ మాటలతో ఏకీభవిస్తున్నామని.. మీ కథ అందరికీ ఆదర్శమని కామెంట్స్ పెటుతున్నారు. (ఇదీ చదవండి: వైద్య వృత్తిలో వెయ్యికోట్లకంటే ఎక్కువ సంపాదిస్తున్న డాక్టర్ - ఈమె) సుమారు రూ. 7,253 కోట్లకు అధిపతి అయిన ఓయో ఫౌండర్ రితేశ్ ఒడిశాలోని రాయ్‌గఢ్‌లో జన్మించాడు. కేవలం 19 సంవత్సరాల వయసులోనే హోటల్ వసతి కల్పించే ఓయో రూమ్స్ ప్రారభించి అతి తక్కువ కాలంలోనే విజయవంతమయ్యాడు. ప్రస్తుతం 'ఓయో'కున్న క్రేజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. “Jo ped sabse bade hote hain, woh sabse zyada jhuke huye hote hain.” (The more successful you become in life, the more rooted you should be.) I recently got the opportunity to share some of my stories, experiences and lessons with the amazing students of @IIMNagpurIndia. This… pic.twitter.com/Dhs6BsD5Y7 — Ritesh Agarwal (@riteshagar) April 18, 2023 తక్కువ వ్యవధిలోనే భారతదేశంలో బిలియనీర్‌గా ఎదిగి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన రితేశ్ అగర్వాల్ ఓయో సంస్థను 800 నరగరాలకు పైగా విస్తరించాడు. అంతే కాకుండా ఇప్పుడు ఆయన ఈ సంస్థను ఇతర దేశాలలో కూడా విస్తరించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ సుమారు 1.1 బిలియన్ డాలర్లు. -
ఐపీవోకి ఓయో..సమీకరణ లక్ష్యం ఎన్ని వేలకోట్లంటే?
ఓయో పేరిట ఆతిథ్య సేవలను అందిస్తోన్న ఒరావెల్ స్టేస్ లిమిటెడ్ ఐపీఓకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓయో సీఈవో రితిష్ అగర్వాల్ మాట్లాడుతూ ఈ ఏడాది అక్టోబర్ - నవంబర్ నెలలో లిస్టింగ్‌కు వెళ్లే యోచనలో ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. మరోవైపు ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకుల నేపథ్యంలో ఐపీఓ విషయంలో ఓయో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈసారి ఆఫర్ ఫర్ సేల్ కింద ఎలాంటి షేర్లను విక్రయించబోదని తెలుస్తోంది. రూ.8,430 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఓయో 2021లోనే ఐపీఓకి దరఖాస్తు చేసుకుంది. కానీ, వివిధ కారణాల వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు మరోసారి ఓయో ఐపీవోకి ఫైల్ చేసినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలపై మాట్లాడేందుకు ఓయో అధికార ప్రతినిధులు విముఖత వ్యక్తం చేశారు. -
రెండు నెలల్లో 6 ఐపివోలకు చెక్: లిస్ట్‌లో ఓయో, షాక్‌లో పేటీఎమ్
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణకు వస్తున్న కంపెనీలపై క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కఠినంగా వ్యవహరిస్తోంది. డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్ ఐపీవో తదుపరి తలెత్తిన సవాళ్లరీత్యా అన్‌లిస్టెడ్ కంపెనీలు అందిస్తున్న సమాచారంపై మరింత ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి గత రెండు నెలల్లో ఆరు కంపెనీల ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను తిప్పి పంపింది. ఓయో బ్రాండుతో ఆతిథ్య రంగ సేవలందిస్తున్న ఒరావెల్ స్టేస్ ఈ జాబితాలో చోటు చేసుకోవడం గమనార్హం! మరింత లోతైన సమాచారంతో తిరిగి తాజా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేయమంటూ సెబీ ఆయా కంపెనీలను ఆదేశిస్తోంది. జాబితాలో..: ఓయోతోపాటు.. సెబీ ప్రాస్పెక్టస్‌లను వెనక్కి పంపిన జాబితాలో ఫెయిర్‌ఫాక్స్(కెనడా) గ్రూప్‌నకు పెట్టుబడులున్న గో డిజిట్ ఇన్సూరెన్స్ లిమిటెడ్, బీ2బీ పేమెంట్స్, సర్వీసుల సంస్థ పేమేట్ ఇండియా, మొబైల్ తయారీ దేశీ కంపెనీ లావా ఇంటర్నేషనల్, ఫైనాన్షియల్ సేవల సంస్థ ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇండియా, సమీకృత సర్వీసుల సంస్థ బీవీజీ ఇండియా ఉన్నాయి. 2021 సెపె్టంబర్ - 2022 మే నెల మధ్యలో ఈ 6 కంపెనీలు సెబీకి దరఖాస్తు చేశాయి. ఈ ఏడాది జనవరి - మార్చి10 మధ్య సెబీ వీటి ప్రాస్పెక్టస్‌లను తిప్పి పంపింది. ఈ కంపెనీలు ఉమ్మడిగా రూ. 12,500 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేశాయి. 2021లో నష్టాల ఎఫెక్ట్... 2021లో కొన్ని బడా కంపెనీల పబ్లిక్ ఇష్యూల ద్వారా ఇన్వెస్టర్లు భారీగా నష్టపోవడంతో సెబీ ఇటీవల కఠినంగా వ్యవహరిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రైమ్‌డేటాబేస్ గణాంకాల ప్రకారం 2022లో సగటున సెబీ ఐపీవోలకు 115 రోజుల్లోగా అనుమతిని ఇచ్చింది. కొత్తతరం డిజిటల్ కంపెనీలు పేటీఎమ్, జొమాటో, నైకా ఇష్యూలలో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోవడంతో సెబీ ఐపీవోకు అనుమతించడంలో కఠినంగా వ్యవహరిస్తున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నిపుణులు వీకే విజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల పరిరక్షణరీత్యా ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని వ్యాఖ్యానించారు. అయితే పబ్లిక్ ఇష్యూలలో ఇన్వెస్ట్ చేసేటపుడు ఇన్వెస్టర్లు ప్రధానంగా అధిక ధరను ఆశిస్తున్న కంపెనీలకు దూరంగా ఉండాలని సూచించారు. పేటీఎమ్ షాక్ పేటీఎమ్ బ్రాండుతో డిజిటల్ చెల్లింపుల సేవలు అందిస్తున్న వన్97 కమ్యూనికేషన్స్ 16 నెలల క్రితం పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. పీఎస్‌యూ దిగ్గజం కోల్ ఇండియా తదుపరి అత్యధికంగా రూ. 18,300 కోట్లు సమీకరించి 2021 నవంబర్‌లో లిస్టయ్యింది. తదుపరి ఇష్యూ ధరలో 72 శాతాన్ని కోల్పోయింది. కాగా.. సెబీ ఇటీవలి చర్యలు నిబంధనల అమలులో మర్చంట్ బ్యాంకర్లకు హెచ్చరికలుగా భావించవచ్చని మూలా వ్యవస్థాపక సీఈవో ప్రకార్ పాండే అభిప్రాయపడ్డారు. మార్కెట్ల హెచ్చుతగ్గులు, ఇన్వెస్టర్ల బలహీన సెంటిమెంటు నేపథ్యంలో ఈ ఏడాది ఇప్పటివరకూ 9 కంపెనీలు సెబీకి ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచీ డివ్జీ టార్క్‌ట్రాన్స్‌ఫర్ సిస్టమ్స్, గ్లోబల్ సర్ఫేసెస్ మాత్రమే పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. తద్వారా రూ. 730 కోట్లు సమీకరించాయి. రూ. 66 కోట్లు సమకూర్చుకునేందుకు ఉదయ్‌శివ్‌కుమార్ వచ్చే వారం ఐపీవోకు రానుంది. 2022లో ఓకే... గతేడాది(2022) మొత్తం 38 కంపెనీలు ఐపీవోకు వచ్చాయి. తద్వారా రూ. 59,000 కోట్లు సమీకరించాయి. అయితే 2021లో రికార్డ్‌స్థాయిలో 63 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు చేపట్టాయి. రూ. 1.2 లక్షల కోట్లు సమకూర్చుకున్నాయి. ఇక గతేడాది బీమా రంగ పీఎస్‌యూ ఎల్ఐసీ రూ. 20,557 కోట్లు సమీకరించడం ద్వారా స్టాక్ ఎక్స్చెంజీలలో లిస్టయ్యింది. వెరసి 2022 ఐపీవో నిధుల్లో 35 శాతం వాటాను ఆక్రమించింది. ఈ ఇష్యూని మినహాయిస్తే ప్రైమరీ మార్కెట్ నీరసించినట్లేనని విశ్లేషకులు పేర్కొన్నారు. ఆర్థిక మాంద్య భయాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు ప్రభావం చూపినట్లు తెలియజేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం(2023–24) ద్వితీయార్ధంలో ప్రైమరీ మార్కెట్ పుంజుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ధరలతోపాటు పెరుగుతున్న వడ్డీ రేట్లు, ఆర్థిక మందగమనం, షేర్ల అధిక విలువలు తదితర అంశాలు మార్కెట్లలో దిద్దుబాట్లకు కారణంకానున్నట్లు విశ్లేషించారు. -
నిన్నగాక మొన్న పెళ్లి: ఓయో ఫౌండర్ ఇంట తీవ్ర విషాదం
న్యూఢిల్లీ: ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. నిన్నగాక మొన్న రితేష్ అగర్వాల్ వివాహం వైభవంగా జరిగింది. కుటుంబమంతా ఈ సంతోషంలో ఉండగానే రితేష్ తండ్రి రమేష్ అగర్వాల్ దుర్మరణం విషాదాన్ని నింపింది. ఈ విషాద వార్తను రితేష్ స్వయంగా వెల్లడించారు. “మా కుటుంబం, నేను బరువైన హృదయంతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. మా తండ్రి రమేష్ అగర్వాల్ (మార్చి 10 శుక్రవారం) మరణించారు. నిండైన జీవితాన్ని గడిపిన ఆయన నాతోపాటు మనలో చాలామందికి స్ఫూర్తి. ఆయన మరణం మా కుటుంబానికి తీరని లోటు. ఆయన స్ఫూర్తి ఎల్లపుడూ మా వెన్నంటే ఉంటుంది. ఈ దుఃఖ సమయంలో ప్రతి ఒక్కరూ మా గోప్యతను గౌరవించాలని కోరుతున్నాం’’ అంటూ రితేష్ అగర్వాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో ఎత్తైన భవనంపై నుండి రమేష్ పడి మరణించినట్లు పోలీసులు తెలిపారు. గురుగ్రామ్‌లోని సెక్టార్ 54లో DLF ది క్రెస్ట్ సొసైటీ 20వ అంతస్తు నుండి పడిపోయారని సెక్యూరిటీ పోలీసులకు సమాచారం అంచారు. సంఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. పోస్ట్‌మార్టమ్ అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్టు పోలీసులు తెలిపారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా రితేష్ అగర్వాల్ ఫార్మేషన్ వెంచర్స్ డైరెక్టర్ గీతాన్షా సూద్‌ను న్యూఢిల్లీలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్లో ఇచ్చిన రిసెప్షన్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ సీఈఓ మసయోషి సన్తో సహా పరిశ్రమ ప్రముఖులు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. -
రితేష్ అగర్వాల్ భార్య కూడా వ్యాపారవేత్తేనా?
ఓయో (Oyo) వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ (Ritesh Agarwal) వివాహం గీతన్షా సూద్ (Geetansha Sood)తో ఇటీవల ఢిల్లీలో అంగరంగ వైభవంగా జరిగింది. సాఫ్ట్‌బ్యాంక్ చీఫ్ మసోయోషి సన్, భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ, లెన్స్‌కార్ట్ సీఈవో పెయుష్ బన్సాల్, ఫ్లిప్‌కార్ట్ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి తదితర ప్రముఖులందరూ హాజరయ్యారు. ఇదీ చదవండి: Flipkart Big Saving Days sale: మళ్లీ ఆఫర్లు.. ఖరీదైన ఫోన్లపై భారీ డిస్కౌంట్లు! రితేష్ అగర్వాల్ సతీమణి గీతన్షా సూద్ ఎవరు? ఆమె కూడా వ్యాపారవేత్తేనా? అనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తోంది. ఇంతకూ ఆమె ఎవరు.. ఆమెకు ఏవైనా వ్యాపార సంస్థలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. ఎవరీ గీతన్షా సూద్? గీతన్షా సూద్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో వాసి. ఫార్మేషన్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఆమె డైరెక్టర్‌గా ఉన్నారని తెలిసింది. మై కార్పొరేట్ ఇన్ఫో ప్రకారం.. ఈ కంపెనీ కాన్పూర్‌లో రిజిస్టర్ అయింది. 2020 ఆగస్ట్ 22న కాన్పూర్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో నమోదైంది. రూ. లక్ష అధీకృత మూలధనం, మరో రూ. లక్ష చెల్లించిన మూలధనం కలిగి ఉంది. ఈ కంపెనీకి ఆమెతోపాటు కుహూక్ సూద్ అనే మరో డైరెక్టర్ ఉన్నారు. -
ఓయో ఫౌండర్ రితేష్ అగర్వాల్ పెళ్లి.. ఆహ్వానితుల్లో అత్యంత ప్రముఖులు!
దేశీయ హాస్పెటాలిటీ చెయిన్ ఓయోను స్థాపించిన రితేష్ అగర్వాల్ పెళ్లి మార్చి 7న ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో అత్యంత వైభవంగా జరగబోతోంది. ఈ విలాసవంతమైన వివాహానికి అత్యంత ప్రముఖులు చాలా మందినే ఆహ్వానించారు. పెళ్లికి ప్రముఖులు ఎవవరెవరు హాజరవుతున్నారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రితేష్ అగర్వాల్ ఇటీవల తన తల్లి, కాబోయే భార్యతో కలిసి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని పెళ్లికి ఆహ్వానించారు. ఈ పెళ్లికి ఆహ్వానితుల జాబితాలో ప్రధాని మోదీతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఓయో బిజినెస్ కి సహకారం అందించిన ఎయిర్ బీఎన్బీ, లైట్ స్పీడ్ కామర్స్ వంటి సంస్థల అధినేతలు కూడా ఉన్నట్లు సమాచారం. అగర్వాల్ పెళ్లికి సాఫ్ట్‌బ్యాంక్ చైర్మన్ మసయోషి సన్ హాజరవుతున్నట్లు బ్లూమ్‌బర్గ్ సంస్థ నివేదిక చెబుతోంది. ఓయో బిజినెస్‌లో అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టిన వాటిలో జపాన్‌కి చెందిన సాఫ్ట్ బ్యాంక్ కూడా ఒకటి. అందుకే రితేష్ అగర్వాల్ పెళ్లికి సాఫ్ట్ బ్యాంక్ చైర్మన్ కూడా వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. చదవండి: Ex-Twitter employee: ఆఫీస్‌లో నేలపై పడుకుని అప్పట్లో వైరల్! అంతలా కష్టపడినా వేటు తప్పలేదు.. రితేష్ అగర్వాల్ ఒడిషాలోని రాయగడ్‌కు చెందిన మార్వాడీ కుటుంబంలో జన్మించారు. వారి కుటుంబం అక్కడ చిన్న కిరాణ దుకాణం నిర్వహించేది. రితేష్ సిమ్ కార్డ్స్ అమ్ముకునే వాడు. థీల్ ఫెల్లోషిప్లో తాను గెల్చుకున్న డబ్బుతో 2013లో ఓయో సంస్థను స్థాపించారు. ఈ వ్యాపారం అనతికాలంలోనే భారీగా విజయవంతమైంది. ఒకప్పుడు సాధారణ యువకుడైన రితేష్.. తన పెళ్లికి ఇప్పుడు పెద్ద పెద్ద వాణిజ్యవేత్తలు, ప్రముఖులు సైతం వచ్చేంత స్థాయికి ఎదిగారు. చదవండి: Aadhaar-Pan Linking: తరుముకొస్తున్న గడువు.. కానీ వీరికి ఆ టెన్షన్ లేదు! -
చిన్న పట్టణాల్లో ఎక్కువ బుకింగ్‌లు
న్యూఢిల్లీ: ఈ ఏడాది చిన్న పట్టణాల్లో హోటల్ గదుల బుకింగ్‌లు ఎక్కువగా ఉన్నట్టు ఓయో తెలిపింది. హోటల్ బుకింగ్ సేవలను అందించే ఈ సంస్థ ఈ ఏడాదికి సంబంధించి గణాంకాలు విడుదల చేసింది. తెనాలి, హాత్రాస్, ససారామ్, కరైకుడి తదితర పట్టణాల్లో క్రితం ఏడాదితో పోల్చినప్పుడు ఈ ఏడాది ఎక్కువ బుకింగ్‌లు చూసినట్టు తెలిపింది. వ్యాపార పర్యటనలకు సంబంధించి బుకింగ్ల్లో హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై అగ్రస్థానాల్లో ఉన్నాయి. జూన్ 4న అత్యధిక బుకింగ్‌లు ఓయో ప్లాట్‌ఫామ్ ద్వారా నమోదయ్యాయి. భక్తులు ఎక్కువగా బుకింగ్ చేసుకున్న కేంద్రంగా వారణాసి నిలిచింది. తిరుపతి, పూరి, అమృత్సర్, హరిద్వార్ బుకింగ్‌ల పరంగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా చూస్తే యూరప్‌లో లగ్జెంబర్గ్ ప్రావిన్స్ ఎక్కువ మంది పర్యాటకులకు ఇష్టమైన కేంద్రంగా నిలిచింది. ఓయో ప్లాట్‌ఫామ్‌పై ఎక్కువ మంది ఇక్కడకు బుక్ చేసుకున్నారు. అమెరికాలో టెక్సాస్‌ను ఎక్కువ మంది సందర్శించారు. బ్రిటన్‌కు సంబంధించి లండన్, ప్లైమౌత్, మిడిల్స్‌బ్రో, లీచెస్టర్, బ్రైటాన్ పర్యాటకులకు ఇష్టమైన ప్రదేశాలుగా ఉన్నాయి. చదవండి: జియో..షావోమీ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త! -
ఉద్యోగాల ఊచకోత..వందల మందిని తొలగిస్తున్న టెక్ కంపెనీలు..ఇదే బాటలో
ఆతిథ్య సేవల్ని అందించే ఓయో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్‌లో ఆర్ధిక మాంద్యం ప్రభావం ఎక్కువగా ఉంటుందనే ఆందోళనతో సంస్థకు చెందిన 600మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించింది. ఓయోలో దేశ వ్యాప్తంగా 3700 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో సంస్థ పున: నిర్మాణం (రీ బ్యాలెన్స్)లో భాగంగా ఇంజినీరింగ్,వెకేషన్ హోమ్ టీమ్స్ విభాగాలకు చెందిన ఉద్యోగులపై వేటు వేసింది. అదే సమయంలో పార్ట్నర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, బిజినెస్ డెవెలప్మెంట్ విభాగాల్లో ఉద్యోగుల్ని నియమించుకోనున్నట్లు తెలిపింది. ఇక యాప్‌లో గేమింగ్, సోషల్ కంటెంట్ క్యూరేషన్, పాట్రన్ ఫెసిలిటేట్ కంటెంట్ వంటి కాన్సెప్ట్‌లను అభివృద్ధి చేస్తున్న టీమ్ సభ్యుల్లో ఉద్యోగుల్ని తగ్గించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. -
వావ్.. ఓయో...ఐపీవోకు ముందు లాభాలే లాభాలు!
న్యూఢిల్లీ: ట్రావెల్ టెక్ కంపెనీ ఓయో ఈ ఆర్థిక సంవత్సరం(2022-23) తొలి అర్ధభాగం ఫలితాలు ప్రకటించింది. పబ్లిక్ ఇష్యూ యోచనలో ఉన్న కంపెనీ ఏప్రిల్-సెప్టెంబర్‌లో రూ. 63 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించింది. గతేడాది(2021-22) ఇదే కాలంలో రూ. 280 కోట్ల ఇబిటా నష్టం ప్రకటించింది. (హోండా, మారుతీ భాగస్వామ్యం: ఎందుకంటే?) మొత్తం ఆదాయం 24శాతం ఎగసి రూ. 2,905 కోట్లను తాకింది. ఫలితాలను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దాఖలు చేసింది. తాజా సమీక్షా కాలంలో సర్దుబాటు తదుపరి రూ. 63 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించింది. ఇవీ చదవండి: ఉద్యోగులను భారీగా పెంచుకోనున్న కంపెనీ షాకింగ్: 5.4 మిలియన్ల ట్విటర్ యూజర్ల డేటా లీక్! మస్క్ స్పందన ఏంటి? -
ఓయో గదుల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. జంటల వీడియోలు రికార్డ్ చేస్తూ..
లక్నో: ఓయో హోటల్ గదుల్లో సీక్రెట్ కెమెరాలు అమర్చి.. అక్కడికి వెళ్లే జంటల వీడియోలు తీస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. నలుగురు సభ్యులు వేర్వేరు గ్యాంగులతో కలిసి పనిచేస్తూ ఈ నేరాలకు పాల్పడుతున్నారు. సాధారణంగా వీళ్లు అవసరమైన వారికి ఓయో హోటల్స్‌లో రూమ్స్ బుక్‌చేసి కమిషన్ తీసుకుంటారు. క్రమంలోనే రూమ్స్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. అక్కడ ఉండేందుకు వచ్చిన జంటల ఏకాంతంగా గడిపిన క్షణాలను వీడియో రికార్డు చేస్తారు. అనంతరం ఆ వీడియోను సంబంధిత జంటలకు పంపి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. అడిగిన మొత్తం అప్పజెప్పకుంటే ఇవ్వకుంటే రహస్యంగా తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి వైరల్ చేస్తామని బెదిరింపులకు ప్పాలడుతున్నారు. అయితే డబ్బులు ఇవ్వకుంటే వేధింపులకు గురిచేస్తామంటూ నిందితులు బెదిరిస్తున్నారని ఓ బాధిత జంట పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన నోయిడా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అంతేగాక వీరు ఐఫోన్‌ను తక్కువ ధరకు విక్రయిస్తామంటూ అక్రమంగా ఓ ల్ సెంటర్‌ను కూడా నడుపుతూ ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను విష్ణు సింగ్, అబ్దుల్ వహవ్, పంకజ్ కుమార్, అనురాగ్ కుమార్‌లుగా గుర్తించారు. వీరి నుంచి 11 ల్యాప్‌టాప్‌లు, 21 మొబైల్ ఫోన్లు, 22 సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రస్తుతం ఈ స్కామ్‌లో పాల్గొన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. -
పండగ వేళ ఓయో, మేక్‌మై ట్రిప్‌లకు సీసీఐ భారీ షాక్
సాక్షి,ముంబై: ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ సంస్థలు మేక్‌మై ట్రిప్, గోఐబిబో, ఓయోలకు భారీ షాక్ తగిలింది. యాంటీ కాంపిటీటివ్, అక్రమ విధానాలకు పాల్పడుతున్నారంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)భారీ జరిమానా విధించింది. ఏకంగా రూ.392 కోట్ల మేర ఫైన్ విధిస్తూ బుధవారం సీసీఐ ప్రకటించిన నిర్ణయం వ్యాపార వర్గాల్లో కలకలం రేపింది. (జోయాలుక్కాస్‌లో దీపావళి క్యాష్‌బ్యాక్ ఆఫర్లు) హోటల్ విభాగంలో అన్యాయమైన వ్యాపార విధానాలకు పాల్పడినందుకు మేక్ మై ట్రిప్-గోఇబిబో. రూ. 223.48 కోట్లు, ఓయోకు రూ. 168.88 కోట్ల నగదు జరిమానాలు విధించింది. ఈ మేరకు సీసీఐ 131 పేజీల ఆర్డర్‌ను జారిచేసింది. పలు హోటళ్లు, రెస్టారెంట్లతో ఈ ఏజెన్సీల అక్రమ ఒప్పందాలు మార్కెట్లో పోటీని దెబ్బ తీసేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఈ ధోరణి వినియోదారుల హక్కుల్ని దెబ్బతీయడం తోపాటు, గుత్తాధిపత్యానికి తెర తీస్తుందని సీసీఐ చురకలేసింది. అంతేకాదు తమ ద్వారా బుక్ చేసుకున్న ధర కంటే తక్కువకు ఇతరులకు గదులను కేటాయించకుండా ఆంక్షలు విధించడంపై మండిపడింది. తక్షణమే దీన్ని సవరించుకోవాలని, ముఖ్యంగా, ధర, గది లభ్యతపై హోటళ్లు/గొలుసు హోటళ్లతో ఉన్న ఒప్పందాలను రద్ద చేసుకోవాలని కూడా ఆదేశించింది. ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీల మీద ఇంత భారీ మొత్తంలో ఫైన్ విధించడం ఇదే తొలిసారి. (ముందస్తు దీపావళి కాంతులు: ఐటీ ఉద్యోగులకు తీపి కబురు) నాస్డాక్-లిస్టెడ్ ఎంఎంటీ తన ప్లాట్‌ఫారమ్‌లో ఓయోకి అనుకూలంగా వ్యవహరిస్తోందని తేలిందని సీసీఐ ఆరోపించింది. ఇది ఇతర సంస్థ వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీస్తుందని తెలిపింది. ఓయో, మేక్‌మైట్రిప్‌ల మధ్య ఒప్పందాలు ఉన్నాయని, దీని కారణంగానే వారు తమ ప్లాట్‌ఫారమ్‌లో ఓయోకు ప్రాధాన్యతనిస్తూ, ఇతర సంస్థలను దెబ్బ తీస్తున్నాయని ఫెడరేషన్ ఆఫ్ హోటల్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా విమర్శించింది. కాగా మేక్‌మై ట్రిప్‌ను 2000 సంవత్సరంలో దీప్ కల్రా స్థాపించారు. 2017లో, ఎంఎటీ ఐబిబో గ్రూప్ హోల్డింగ్‌ని స్వాధీనం చేసుకుంది. అప్పటినుంచి మేక్ మై ట్రిప్ బ్రాండ్ పేరుతో తన వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. -
ఐపీవోకు వెళ్లేముందు ఓయోకు భారీ షాక్
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో ఉన్న ఆతిథ్య రంగ కంపెనీ ఓయో విలువ 8 బిలియన్ డాలర్ల నుంచి 6.5 బిలియన్ డాలర్లకు క్షీణించినట్లు తెలుస్తోంది. ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడి విలువలో 20 శాతంమేర కోత పెట్టినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి ఓయోలో పెట్టుబడుల విలువను 2.7 బిలియన్ డాలర్లుగా మదింపు చేసినట్లు తెలియజేశాయి. గతేడాది ప్రయివేట్ మార్కెట్లలో 8 బిలియన్ డాలర్ల స్థాయిలో లావాదేవీలు జరగ్గా.. ఇటీవల 6.5 బిలియన్ డాలర్ల విలువలో నమోదౌతున్నట్లు వివరించాయి. ఈ ప్రభావంతో సెప్టెంబర్ 30తో ముగిసిన వారంలో 12.3 లక్షల ఓయో షేర్లు విక్రయమైనట్లు తెలుస్తోంది. అంతక్రితం వారం 1.6 లక్షల షేర్లు మాత్రమే చేతులు మారాయి. కాగా.. నష్టాలను తగ్గించుకుంటూ నిర్వహణా లాభాలు ఆర్జించినట్లు ఫైనాన్షియల్స్పై గత నెలలో ఓయో ప్రాస్పెక్టస్‌ను ఆప్డేట్ చేసింది. దీంతో షేరు ప్రయివేట్ మార్కెట్లో రూ. 94ను తాకింది. తాజాగా ఈ విలువ రూ. 81కు క్షీణించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఓయో రూ. 8,430 కోట్ల సమీకరణకు వీలుగా గతేడాది అక్టోబర్‌లో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తదుపరి 2022 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 1,459 కోట్ల ఆదాయాన్ని, సర్దుబాటు తదుపరి రూ. 7.3 కోట్ల ఇబిటాను ఆర్జించినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఓయోకు నిర్వహణ లాభాలు
న్యూఢిల్లీ: ఆతిథ్యం, ప్రయాణ సేవల(ట్రావెల్ టెక్) కంపెనీ ఓయో ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో మొత్తం ఆదాయం రూ. 1,459 కోట్లను అధిగమించింది. రూ. 7.27 కోట్ల సర్దుబాటు తదుపరి నిర్వహణా(ఇబిటా) లాభం ఆర్జించింది. మార్చితో ముగిసిన గతేడాది (2021–22) ఆదాయం రూ. 4,781 కోట్లను తాకగా.. అంతక్రితం ఏడాది(2020–21) దాదాపు రూ. 3,962 కోట్ల టర్నోవర్ సాధించింది. గతేడాది దాదాపు రూ. 472 కోట్ల నిర్వహణా(ఇబిటా) నష్టం ప్రకటించింది. ఇక తాజా క్యూ1లో రూ. 414 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది రూ. 1,940 కోట్లమేర నికర నష్టం నమోదైంది. కాగా.. పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా కంపెనీ గతేడాది అక్టోబర్‌లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను సమర్పించిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా ఆర్థిక ఫలితాలను సెబీకి దాఖలు చేసింది. చదవండి: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు: కొనే ముందు ఇవి గుర్తుపెట్టుకోండి, లేదంటే బేబుకి చిల్లే! -
ఓయో బంపరాఫర్..విద్యార్థినులకు మాత్రమే!
దేశీయ దిగ్గజ హాస్పిటాలిటీ సంస్థ ఓయో విద్యార్థినులకు భారీ ఆఫర్ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 497 నగరాలు, పట్టణాల్లో కలిపి నీట్ ఎగ్జామ్-2022ను 10లక్షల మంది విద్యార్ధులు రాయనున్నారు. ఈ తరుణంలో నీట్ ఎగ్జామ్ రాసే ప్రత్యేకంగా విద్యార్థినులకు ఓయో రూమ్స్ పై 60 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రతి ఏడాది జరిగే నీట్ ఎగ్జామ్ కోసం పట్టణ,గ్రామాల విద్యార్ధినులు వ్యయ ప్రయాసలకు ఓర్చి కేంద్రానికి చేరుకోవాల్సి వస్తుంది. కొన్ని సార్లు నిమిషాల వ్యవధిలోనే పరీక్ష రాసేందుకు వీలులేక ఎగ్జామ్ సెంటర్ నుంచి నుంచి వెనుదిరిగిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. అందుకే ఈ ఏడాది జులై 17న (ఆదివారం) జరిగే నీట్ ఎగ్జామ్ రాయనున్న విద్యార్ధులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా తక్కువ ప్రైస్‌లో విద్యార్ధినులకు ఓయో రూమ్స్ అందిస్తుంది. అందులో వైఫై, ఎయిర్ కండీషనింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (కన్జ్యూమర్) శ్రీరంగ్ గాడ్బోలే తెలిపారు. విద్యార్ధినులు ఓయో డిస్కౌంట్ పొందాలంటే! ♦ఓయో యాప్‌ను డౌన్లోడ్ చేయాలి ♦ఆ యాప్‌లో నియర్ బై ఐకాన్‌పై క్లిక్ చేయాలి. ♦ఆ ఆప్షన్‌పై ట్యాప్ చేస్తే ఎగ్జామ్ సెంటర్‌కు సమీపంలో ఉన్న ఓయో రూమ్స్ లిస్ట్ కనబడుతుంది. ఆ లిస్ట్‌లో మీకు కావాల్సిన ఓయో రూమ్స్ హోటల్‌ను సెలక్ట్ చేసుకొని 'నీట్ జేఎఫ్' కూపన్ కోడ్‌ను ఎంటర్ చేయాలి ♦ఆ తర్వాత బుక్ నౌ ఆప్షన్ క్లిక్ చేసి 40శాతం పేమెంట్ చేసి ఓయో రూంను వినియోగించుకోవచ్చు. -
ఊపందుకున్న వ్యాపార ప్రయాణాలు
న్యూఢిల్లీ: కరోనా రెండేళ్ల ప్రభావం అనంతరం.. వ్యాపార పర్యటనలు క్రమంగా పెరుగుతున్నాయి. ఓయో ‘బిజినెస్ ట్రావెల్’ నివేదిక ప్రకారం.. 2022 జనవరి నుంచి అన్ని రంగాల్లోనూ వ్యాపార కార్యకలాపాలు ఊపందుకోవడం వల్ల వ్యాపార ప్రయాణాల్లోనూ స్పష్టమైన పెరుగుదల కనిపిస్తోంది. ‘‘వ్యాపార ప్రయాణాల్లో కార్పొరేట్ ఉద్యోగుల వాటా 29 శాతం, చిన్న వ్యాపారుల వాటా 17.7 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వాటా 12.3 శాతంగా ఉంది’’అని ఓయో నివేదిక తెలిపింది. ఈ ఏడాది జూన్ నెలలో 25–30 తేదీల మధ్య 1,300 మంది అభిప్రాయాలను సమీకరించి ఈ నివేదికను ఆతిథ్య సేవల కంపెనీ ‘ఓయో’ విడుదల చేసింది. వ్యాపార అవసరాల రీత్యా ప్రయాణించే వారికి ఢిల్లీ ప్రముఖ కేంద్రంగా ఉంటున్నట్టు, ఆ తర్వాత బెంగళూరు, ముంబై, హైదరాబాద్ ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. వ్యాపార ప్రయాణాలు చేసే వారిలో యువత(20–24 ఏళ్లు) 43 శాతంగా ఉంటున్నారు. ఆ తర్వాత 25–30 ఏళ్ల గ్రూపులోని వారు 34.5 శాతం, 31–45 వయసులోని వారు 18.6 శాతం మేర ఉన్నారు. ‘‘కొన్ని నెలల పాటు వర్చువల్ సమావేశాలు, టెలిఫోన్ల సంప్రదింపుల తర్వాత.. యువ వ్యాపార ప్రయాణికులు (ఇటీవలే ఉద్యోగాల్లో చేరిన వారు, ట్రేడర్లు, చిన్న సంస్థల అధినేతలు) ముఖాముఖి వ్యవహారాలకు ఆసక్తి చూపిస్తున్నారు’’అని ఓయో ప్రకటన విడుదల చేసింది. కంపెనీలు, చిన్న, మధ్య స్థాయి వ్యాపార సంస్థలు, ప్రభుత్వరంగం నుంచి చేసే ప్రయాణాలు పుంజుకున్నాయని, సమీప భవిష్యత్తులో ఈ ధోరణి ఇంకా పెరుగుతుందని ఓయో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీరంగ్ గాడ్బోలే తెలిపారు. నిర్మాణ రంగం నుంచి ఎక్కువ.. ► నెలకోసారి తాము వ్యాపార అవసరాల రీత్యా ప్రయాణిస్తామని ఈసర్వేలో 29 శాతం మంది చెప్పారు. ► మూడు నెలల్లో ఒక్కసారైనా వెళతామని 25 శాతం మంది తెలిపారు. ► 73 శాతం మంది తాము కనీసం మూడు రోజుల పాటు పర్యటన పెట్టుకుంటామని చెప్పగా, 19 శాతం మంది 3–7రోజులు, 4 శాతం మంది వారంకంటే ఎక్కువ రోజులు అవసరమవుతాయని చెప్పారు. ► నిర్మాణ రంగం నుంచి ఎక్కువగా 16 శాతం మేర వ్యాపార ప్రయాణాలు ఉంటున్నాయి. ఆ తర్వాత రవాణా, వస్త్ర రంగం, ఎలక్ట్రానిక్స్, ఐటీ, హెల్త్‌కేర్ రంగాల వారు వ్యాపార అవసరాలకు ఎక్కువగా పర్యటించాల్సి వస్తోంది. -
ఫ్యామిలీ వెకేషన్స్.. టాప్ 5 డెస్టినేషన్స్ ఇవే
న్యూఢిల్లీ: కుటుంబ సభ్యులంతా కలసి వేసవి సెలవుల్లో గడిపేందుకు వెళ్లాలనుకుంటున్న ప్రాంతాల్లో గోవా, నైనిటాల్, రిషికేశ్, గ్యాంగ్‌టక్, మౌంట్అబూ టాప్–5గా ఉన్నట్టు ఓయో నిర్వహించిన సర్వేలో తెలిసింది. ‘సమ్మర్ వెకేషన్ ఇండెక్స్ – ఫ్యామిలీ ఎడిషన్ 2022’పేరుతో తన సర్వే వివరాలను ఒక నివేదిక రూపంలో ఓయో విడుదల చేసింది. వేసవి సెలవుల్లో పిల్లలను ఆడించడం, వారినే అట్టిపెట్టుకోవడం కష్టమైన టాస్క్‌గా తల్లిదండ్రులు చెప్పారు. దీనికి బదులు కొన్ని రోజుల పాటు కుటుంబమంతా కలసి విహారయాత్రకు వెళ్లి రావాలనుకుంటున్నట్టు తెలిపారు. ‘‘65 శాతం తల్లిదండ్రులు తమ పిల్లలతో కలసి వేసవి సెలవులకు ట్రిప్ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నట్టు చెప్పారు. వరుసగా రెండేళ్లపాటు వేసవిలో లౌక్డౌన్లు ఉండడం కూడా ఈ ధోరణి పెరగడానికి కారణం’’అని ఓయో పేర్కొంది. జూన్ మొదటి రెండు వారాల్లో ఓయో ఈ సర్వే నిర్వహించింది. 1,072 మంది అభిప్రాయాలను సమీకరించింది. పిల్లలకు సదుపాయాలు ఇందులో 41 శాతం మంది తమ ఎంపిక గోవా అని చెప్పారు. పిల్లలు, కుటుంబ సభ్యులతో కలసి చూడతగ్గ ప్రదేశంగా దీన్ని భావిస్తున్నారు. ఆ తర్వా త నైనిటాల్, రిషికేశ్, గ్యాంగ్‌టక్, మౌంట్అబూ, పుదుచ్చేరి, మెక్లయోడ్ గంజ్, మహాబలేశ్వర్ ఎంపికలుగా ఉన్నాయి. ఈ ఎంపికలను పరిశీలిస్తే తల్లిదండ్రులు ప్రకృతి సహజత్వం ఎక్కువగా ఉన్న పర్వత ప్రాంతాలు, బీచ్‌లకు ప్రాధాన్యం ఇస్తున్న ట్టు ఓయో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీరంగ్ గాడ్ బోల్ పేర్కొన్నారు. హోటళ్లలో ఎంపికలను గమనిస్తే.. 56 శాతం మంది స్విమ్మింగ్ పూల్ ఉన్న హోటళ్లకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. పిల్లల కోసం వారు స్విమ్మింగ్ పూల్, ఆటలాడుకునే ప్లే ఏరియా ను హోటళ్లలో కోరుకుంటున్నారు. ఆ తర్వాత వాటర్ పార్క్‌లు, పెద్ద టెలివిజన్ ఇతర సదుపాయాలు ఉంటే బావుంటుందని చెప్పారు. సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది 1–3 రోజుల పాటు ట్రిప్‌కు వెళ్లొచ్చే ఆలోచనతో ఉన్నట్టు చెబితే.. 38 శాతం మంది ఒక వారం రోజులైనా జాలీగా గడిపి రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. -
ఐపీవోకి ఓయో..టార్గెట్ రూ.8వేల కోట్ల పైమాటే!
న్యూఢిల్లీ: ఆతిథ్యం, ట్రావెల్ టెక్ కంపెనీ ఒరావెల్ స్టేస్ లిమిటెడ్ ఈ క్యాలండర్ ఏడాది చివరి త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉంది. సెప్టెంబర్ తదుపరి ఐపీవోకు వెళ్లే ప్రణాళికల్లో ఉన్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా తాజాగా సవరించిన కన్సాలిడేటెడ్ ఆర్థిక ఫలితాల సమాచారాన్ని సెబీకి దాఖలు చేసింది. ఓయో బ్రాండ్ కంపెనీ గతేడాది అక్టోబర్‌లో షేర్ల విక్రయం ద్వారా రూ. 8,430 కోట్ల సమీకరణకు అనుమతి కోరుతూ సెబీకి ప్రాథమిక పత్రాలను సమర్పించిన సంగతి తెలిసిందే. అయితే తొలుత 11 బిలియన్ డాలర్ల విలువను లక్ష్యంగా పెట్టుకున్న కంపెనీ ఇటీవల 7–8 బిలియన్ డాలర్లకు లక్ష్యాన్ని సవరించుకున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక పనితీరులో మెరుగుపడే అవకాశం, మార్కెట్లలో ప్రస్తుతం నమోదవుతున్న హెచ్చుతగ్గులు వంటి అంశాలు క్యూ4లో ఐపీవో చేపట్టే యోచనకు కారణాలుగా సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. -
వేసవి ప్రయాణానికి రెడీ
న్యూఢిల్లీ: పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పర్యాటకులు చల్లటి ప్రదేశాలకు ప్రయాణం కడుతున్నారు. వరుసగా రెండు వేసవి సీజన్లలో కరోనా కారణంగా ప్రయాణం చేయలేని పరిస్థితులు.. ఈ విడత లేకపోవడం కూడా పర్యాటక రంగంలో సందడిని పెంచింది. గరిష్ట ఉష్ణోగ్రతల నుంచి సేదతీరేందుకు పట్టణ వాసులు మొగ్గు చూపిస్తున్నారు. పర్వత, కొండ ప్రాంతాల్లోని పర్యాటక కేంద్రాలకు ఈ విడత డిమాండ్ అనూహ్యంగా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. హోటళ్లు, ఫ్లయిట్ బుకింగ్‌లు జోరుగా జరుగుతున్నట్టు పేర్కొన్నాయి. ప్రతి ఇద్దరు భారతీయుల్లో ఒకరు ఈ వేసవిలో ప్రయాణం చేయాలని అనుకుంటున్నారు. ఇందులోనూ ఎక్కువ మంది విహార యాత్రలకే మొగ్గు చూపిస్తున్నట్టు ఓయో సర్వేలో తెలిసింది. 64 శాతం మంది వేసవిలో సెలవులు పెట్టేసి నచ్చిన ప్రదేశానికి వెళ్లొద్దామని అనుకుంటుంటే.. 94 శాతం మంది దేశీయంగా ఉన్న పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నారు. ఉత్తరాదిలో వీటికి డిమాండ్.. ఆన్లైన్లో వివిధ పోర్టళ్లపై బుకింగ్ తీరును పరిశీలిస్తే.. ఉత్తరాదిలో రిషికేష్, హరిద్వార్, సిమ్లా, ముస్సోరీ, డెహ్రాడూన్ ప్రాంతాలకు ఎక్కువ డిమాండ్ నెలకొంది. ఈ ప్రాంతాల్లోని హోటల్స్, రిసార్ట్‌ల్లో దాదాపు గదులన్నీ బుకింగ్ అయిపోయాయి. రూమ్ టారిఫ్‌లు కరోనాకు ముందుతో పోలిస్తే 10–15 శాతం అధికంగా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా రిషికేష్, హరిద్వార్‌లోని అన్ని ఇంటర్నేషనల్ బ్రాండెడ్ హోటళ్లలో మే నుంచి జూన్ చివరికి నాటికి బుకింగ్‌లు పూర్తిగా అయిపోయాయి. ఈ ఏడాది పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లకు డిమాండ్ కరోనా ముందు నాటి స్థాయికి చేరుకున్నట్టు, సగటు రూమ్ చార్జీలు 10 శాతం పెరిగినట్టు ఎస్సైర్ హాస్పిటాలిటీ గ్రూపు సీఈవో అఖిల్ అరోరా తెలిపారు. ఎస్సైర్ గ్రూపునకు బిమ్టల్, జిమ్‌కార్బెట్ ప్రాంతాల్లో హోటళ్లు ఉన్నాయి. కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నా ప్రయాణాలకు డిమాండ్ తగ్గలేదని అరోరా చెప్పారు. పుంజుకున్న బుకింగ్‌లు.. వేసవి కోసం కశ్మీర్, రాజస్తాన్, హిమాచల్‌ప్రదేశ్, గోవా, అరుణాచల్, మణిపూర్, త్రిపుర ప్రాంతాలు ఆకర్షణీయంగా (అధిక డిమాండ్) మారిపోయాయి. దేశం బయట దుబాయి, మాల్దీవులు, థాయిలాండ్, యూఎస్‌కు డిమాండ్ నెలకొంది. ‘‘మే, జూన్ నెలలకు సంబంధించి ముందస్తు బుకింగ్‌లు పెద్ద ఎత్తున పెరిగాయి. ప్రజలు ఎక్కువ రోజుల పాటు విడిది కోసం వెళ్లాలని చూస్తున్నారు’’అని ఈజ్‌మైట్రిప్ ప్రెసిడెంట్ హిమంక్ త్రిపాఠి తెలిపారు. ఫ్లయిట్ బుకింగ్‌లు కరోనా ముందు నాటికి చేరినట్టు మేక్మైట్రిప్ సీఈవో రాజేష్ మాగోవ్ వెల్లడించారు. సులభ వాయిదాల్లో రుణాలు లభించడం డిమాండ్‌కు తోడ్పడుతున్నట్టు ఆయన చెప్పారు. రికవరీ బలంగా.. 2022 ఏప్రిల్ నెలలో సగటు రోజువారీ ఫ్లయిట్ డిపార్చర్లు 2,726గా ఉన్నాయి. 2021 ఏప్రిల్‌లో రోజువారీ 2,000తో పోలిస్తే మంచి వృద్ధి కనిపిస్తోంది. మార్చి నెలలో రోజువారీ డిపార్చర్లు 2,588తో పోల్చి చూసినా ఏప్రిల్‌లో 5 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. విమానాల్లో ప్రయాణికుల భర్తీ కూడా గతేడాది ఇదే నెలతో పోలిస్తే 2022 ఏప్రిల్‌లో 36 శాతం అధికంగా ఉంది. గత నెలలో ఒక ఫ్లయిట్లో సగటు ప్రయాణికుల సంఖ్య 128గా ఉంది. కరోనాకు ముందు సగటు ప్రయాణికులు 135 కంటే కొంచెం తక్కువగా ఉంది. దేశీయంగా ప్రయాణికుల రద్దీ ఏప్రిల్‌లో వార్షికంగా చూస్తే 83 శాతం పెరిగి 10.5 మిలియన్లుగా ఉంది. కరోనాకు ముందున్న 11 మిలియన్ల కంటే ఇది స్వల్పంగానే తక్కువ. పెంటప్ డిమాండ్ ఈ ఏడాది పర్యాటక ప్రాంతాలు, విహార యాత్రా స్థలాలకు డిమాండ్ గణనీయంగా ఉండడానికి.. గత రెండు వేసవి సీజన్లలో ప్రయాణం చేయలేని వారు ఈ ఏడాది ప్రాధాన్యం ఇస్తుండడం వల్లేనని అనుకోవాలి. గుడ్ ఫ్రైడే, విసు వీక్ సందర్భంగా 8 లక్షల బుకింగ్‌లు నమోదయ్యాయని.. 2022లో ఇదే అత్యధికమని ఓయో చీఫ్ సర్వీస్ ఆఫీసర్ షీరంగ్ గాడ్బోల్ తెలిపారు. రానున్న కొన్ని నెలల్లో ఈ డిమాండ్ మరింత పెరుగుతుందని తాము అంచనా వేస్తున్నట్టు చెప్పారు. -
ఓయో ఖాతాలో డైరక్ట్ బుకర్
కరోనా తగ్గుముఖం పట్టి ప్రపంచ వ్యాప్తంగా విహార యాత్రలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో యూరప్‌లో మరింత బాగా పాగా వేసే పనిలో ఉంది ఓయో. యూరప్‌కి చెందిన ట్రావెల్ టెక్ ఫర్మ్ డైరక్ట్ బుకర్ అనే సంస్థను కొనుగోలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని కోసం ఓయో రూ. 40 కోట్లను వెచ్చించనుంది. డైరెక్ట్ బుకర్ ఓయో ఖాతాలో చేరడం వల్ల యూరప్‌లోని క్రోయేషియాలో కూడా ఓయో రూములు లభించే వెసులుబాటు కలుగుతుంది. యూరప్‌లో సుస్థిర స్థానం సాధించేందుకు ఓయో ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ఇప్పటికే బెల్విల్లా, ట్రామ్.. వంటి టెక్ ట్రావెల కంపెనీలు సొంతం చేసుకుంది. వీటి ద్వారా నెదర్లాండ్స్, డెన్మార్క్, బెల్జియం, జర్మనీ, ఆస్త్రియా వంటి దేశాల్లో సర్వీసులు అందిస్తుంది. కొత్త డీల్ ద్వారా క్రోయేషియా కూడా ఈ జాబితాలో చేరింది. ప్రపంచ వ్యాప్తంగా 1.40 లక్షల హోం స్టోర్‌ఫ్రంట్స్ సాధించడం తమ లక్ష్యంగా ఓయో సీఈవో రితేశ్ అగర్వాల్ తెలిపారు. చదవండి: ఒకప్పుడు స్టార్టప్‌ల అడ్డా .. ఇప్పుడు యూనికార్న్‌ల రాజ్యం -
ఓయోలో వ్యభిచారం.. ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా యువతులను తీసుకొచ్చి..
సాక్షి, అమీర్‌పేట: ఓయో హోటల్ ప్రధాన కేంద్రంగా వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తులను టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. బల్కంపేట ఎస్బీఐ బ్యాంకు సమీపంలోని తేనేటి టవర్స్‌లో ఉన్న ఓయో రూమ్‌లో వ్యభాచారం జరుగుతుందన్న సమాచారంతో టాస్క్ఫోర్సు పోలీసులు సోదాలు చేశారు. ఈ సమయంలో హోటల్ వద్ద ఉన్న నిర్వాహకుడు రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. గదిలో ఉన్న కాచికూడకు చెందిన ఆడీటర్ వేణుకుమార్, ఓ యువతిని అరెస్టు చేశారు. రమేష్‌ను విచారించగా తాను జనార్దన్ అనే వ్యక్తి వద్ద పని చేస్తానని చెప్పడంతో లీలానగర్‌లోని విద్యుత్ టవర్స్‌లో ప్రధాన నిర్వాహకుడు జనార్దన్‌ను అరెస్టు చేశారు. జనార్దన్ ఇచ్చిన సమాచారం మేరకు మరో నిర్వాహకుడు నాగుల్ మీరా, కో ఆర్టినేజర్ తిరుమల్‌రావుతో మరో నలుగురు విటులు, ఇద్దరు యువతులను అరెస్టు చేశారు. ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా యువతులను తీసుకువచ్చి వివిధ చోట్ల వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం కేసును ఎస్ఆర్నగర్ పోలీసులకు అప్పగించారు. చదవండి: ఇంతకుముందే పెళ్లి.. నాగరాజుతో సాన్నిహిత్యం.. కట్నం తేవాలంటూ.. -
‘కశ్మీర్ ఫైల్స్’ మూవీ ఎఫెక్ట్.. ఢిల్లీలో కశ్మీర్ వ్యక్తికి చేదు అనుభవం..
సాక్షి, న్యూఢిల్లీ: కశ్మీర్ పండిట్లపై 1990లో జరిగిన మారణకాండ ఆధారంగా ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమా రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అంచనాలకు మించి ఆడుతూ పలు రికార్డులను బద్దలుకొడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జమ్మూకశ్మీర్‌కు చెందిన ఓ వ్యక్తికి ఢిల్లీలో చేదు అనుభవం ఎదురైంది. ఐడీ ఫ్రూప్స్ ఉన్నప్పటికీ హోటల్లో అతడికి రూమ్ ఇచ్చేందుకు సదరు హోటల్ సిబ్బంది అంగీకరించలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. కశ్మీర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్లో ఓయో ద్వారా ఢిల్లీలోని హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నాడు. అనంతరం ఆ హోటల్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో హోటల్ రిసెప్షన్లో ఉన్న మహిళా ఉద్యోగి అతడికి రూమ్ ఇచ్చేందుకు నిరాకరించింది. సదరు వ్యక్తి తన ఆధార్ కార్డుతో సహా మరికొన్ని ఐడీ ఫ్రూప్స్ చూపించినప్పటికీ ఆమె అతడికి రూమ్ ఇవ్వలేదు. Impact of #KashmirFiles on ground. Delhi Hotel denies accommodation to kashmiri man, despite provided id and other documents. Is being a kashmiri a Crime. @Nidhi @ndtv @TimesNow @vijaita @zoo_bear @kaushikrj6 @_sayema @alishan_jafri @_sayema @manojkjhadu @MahuaMoitra pic.twitter.com/x2q8A5fXpo — Nasir Khuehami (ناصر کہویہامی) (@NasirKhuehami) March 23, 2022 అయితే, సదరు వ్యక్తి ఆమెను ప్రశ్నించడంతో.. ఆమె తన సీనియర్ అధికారికి ఫోన్ చేసి మాట్లాడిన అనంతరం.. కశ్మీర్‌కు చెందిన వ్యక్తులకు రూమ్ ఇవ్వకూడదని ఢిల్లీ పోలీసులు చెప్పినట్టు వివరణ ఇచ్చింది. దీంతో షాకైన సదరు వ్యక్తి తనకు జరిగిన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో వివరిస్తూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం తాను వేరే హోటల్లో రూమ్ తీసుకున్నట్టు తెలిపాడు. A purported video is viral on social media wherein a person is being denied hotel reservation due to his J&K ID. The reason for cancellation is being given as direction from police. It is clarified that no such direction has been given by Delhi Police.(1/3)@ANI @PTI_News — Delhi Police (@DelhiPolice) March 23, 2022 ఈ నేపథ్యంలో ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. జమ్మూ కశ్మీర్‌కు చెందిన వ్యక్తులకు రూమ్ ఇవ్వకూడదనే ఆదేశాలేవీ తాము ఇవ్వలేదని స్పష్టం చేశారు. పోలీసులపై ఇలాంటి తప్పడు ప్రచారాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇది చదవండి: గుడిలో దళితుడికి ఘోర అవమానం.. దేవుళ్లను కించపర్చాడని.. -
మాదాపూర్: ‘ఓయో’పై దాడి.. 8 మంది అరెస్ట్
సాక్షి, మాదాపూర్: ఓయో రూంలలో గుట్టుచప్పుడు కాకుండా అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్న నిందితులను ఆదివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్‌లోని జైహింద్ ఎన్క్లేవ్ రహదారిలో ఓయో క్వాలియాలో వ్యభిచారం నిర్వహిస్తున్నారని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఈనెల 20వ తేదీ రాత్రి పోలీసులు ఓయో రూంపై దాడి చేసి ఇద్దరు నిర్వాహకురాళ్ళు, ఓ విటుడితో పాటు 5 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద నుండి మొబైల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: భార్యపై అనుమానం, వేధింపులు.. ఎంతకీ భర్త మారకపోవడంతో.. మహిళపై హత్యాచారం? మాదాపూర్: మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ మహిళ(34)పై గుర్తుతెలియని దుండగులు అత్యాచారం చేసి..అనంతరం హత్య చేసినట్లు తెలుస్తోంది. మాదాపూర్ సిఐ రవీంద్రప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్ సమీపంలోని పాత ఔట్‌పోస్టు వద్ద సోమవారం ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఆదివారం రాత్రి ఆమెపై అత్యాచారం జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తలకు తీవ్రమైన గాయాలుండడంతో రాయితో బలంగా కొట్టినట్లుగా భావిస్తున్నారు. సంఘటనా స్థలంలో క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. మహిళకు సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈఘటనకు సంబంధించి అనుమానితులైన కొందర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. -
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్...ఓయోకు కాసుల వర్షం..! ఒక్క రోజులో..
వినియోగదారులకు హోటల్ రూములను సమకూర్చే అతిథ్య రంగ కంపెనీ ఓయోకు న్యూ ఇయర్-2022 వేడుకలు కాసుల వర్షాన్ని కురిపించాయి. ప్రపంచవ్యాప్తంగా కొత్త ఏడాది వేడుకలను జరుపుకునేందుకు కస్టమర్లు భారీ సంఖ్యలో ఓయో రూమ్స్‌ను తలుపు తట్టారు. 110 కోట్ల బిజినెస్..! న్యూ ఇయర్ 2022 వేడుకల కోసం హాస్పిటాలిటీ చైన్ ఓయోను ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది బుకింగ్స్ జరిపినట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ వీకెండ్లో సుమారు రూ. 110 కోట్ల విలువైన బుకింగ్‌లు జరిగాయని ఓయో వ్యవస్థాపకుడు, సీఈవో రితేష్ అగర్వాల్ ట్విటర్లో తెలిపారు. 2017 డిసెంబర్ తరువాత న్యూ ఇయర్ వీకెండ్లో ఈ స్థాయిలో బుకింగ్స్ జరగడం ఇదే తొలిసారి.2020 ఏప్రిల్ నుంచి 90 వారాల తరువాత అత్యధిక సంఖ్యలో బుకింగ్స్ జరిగాయని రితేష్ వెల్లడించారు. ఒక్క రోజే 69 శాతం బుకింగ్స్..! 2016లో సుమారు 1.02 లక్షలకు పైగా బుకింగ్స్ జరగ్గా, 2021 డిసెంబర్ 30, 31 తేదీల్లో గరిష్టంగా 5.03 లక్షల ఓయో రూమ్స్ బుక్ అయ్యాయని అగర్వాల్ చెప్పారు. 2021 డిసెంబర్ 31 ఒక్క రోజే 69 శాతం రూమ్స్ బుక్ అవ్వగా...2020లో 61 శాతం, 2019లో 57 శాతం, 2018లో 63 శాతం , 2017లో 55 శాతంగా ఉన్నట్లు తెలిపారు. 127 నగరాల నుంచి 35 దేశాల్లో... టెక్-ఆధారిత హాస్పిటాలిటీ సంస్థ ఓయో గణనీయమైన వృద్ధిని సాధించింది. కోవిడ్-19 రాకతో భారీ నష్టాలనే చవిచూసింది. ఆయా దేశాల్లో కరోనా ఉదృతి తగ్గడంతో పర్యాటక రంగం మెల్లమెల్లగా పుంజుకుంటూ వచ్చింది. ఈ ధోరణి ఓయోకు కలిసోచ్చింది. 2015లో కేవలం 127 నగరాల్లో మొదలవ్వగా అది ఇప్పడు 35 దేశాల్లో ఓయో తన సేవలను అందిస్తోంది. చదవండి: Microsoft CEO Satya Nadella: న్యూ బిజినెస్..! న్యూ అవతార్..! -
ఓయోలో ఉద్యోగులకు వాటా
న్యూఢిల్లీ: వినియోగదారులకు హోటల్ రూములను సమకూర్చే ఆతిథ్య రంగ కంపెనీ ఓయో.. ఉద్యోగులకు షేర్లను జారీ చేసింది. కంపెనీ ప్రస్తుత సిబ్బందిసహా మాజీ ఉద్యోగులు సైతం షేర్లను సొంతం చేసుకున్నట్లు ఓయో తాజాగా తెలియజేసింది. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్(ఇసాప్)లో భాగంగా 3 కోట్ల షేర్లను విక్రయించినట్లు ఓయో మాతృ సంస్థ ఒరావెల్ స్టేస్ లిమిటెడ్ పేర్కొంది. ఇసాప్‌ల మార్పిడి ద్వారా ఉద్యోగులు ఈక్విటీ షేర్లను పొందినట్లు వెల్లడించింది. కంపెనీ భారీ డిస్కౌంట్లో జారీ చేసిన ఇసాప్‌ల ద్వారా సిబ్బంది షేర్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కాగా.. కంపెనీ గతేడాది ఆగస్ట్‌లో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నుంచి 5 మిలియన్ డాలర్లను సమీకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఓయో విలువ 9.6 బిలియన్ డాలర్లకు చేరింది. వెరసి ఉద్యోగులు కొనుగోలు చేసిన షేర్ల విలువను రూ. 330 కోట్లుగా సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కంపెనీ ఇటీవల ఇసాప్‌ల జారీని 41 శాతానికి విస్తరించడంతో ప్రస్తుత సిబ్బందిలో 80 శాతం మందికి ఇవి లభించినట్లు తెలుస్తోంది. 2021 మార్చికల్లా ప్రపంచవ్యాప్తంగా కంపెనీ సిబ్బంది సంఖ్య 5,130కు చేరింది. వీరిలో దాదాపు 71 శాతం మంది దేశీయంగానే విధులు నిర్వహిస్తుండటం గమనార్హం! గతేడాది అక్టోబర్‌లో పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా కంపెనీ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసిన విషయం విదితమే. తద్వారా రూ. 8,430 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. ఐపీవోలో భాగంగా రూ. 7,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. మరో రూ. 1,430 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. -
2022లోనూ కొనసాగనున్న ఐపీవో క్రేజ్..!
గత క్యాలండర్ ఏడాది(2021)లో కొత్త రికార్డులకు నెలవైన ప్రైమరీ మార్కెట్ కొత్త ఏడాది(2022)లోనూ కళకళలాడనుంది. జనవరి-మార్చి త్రైమాసికంలో దాదాపు రెండు డజన్ల కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు రానున్నాయి. వెరసి ఉమ్మడిగా రూ. 44,000 కోట్లు సమీకరించే ప్రణాళికలు వేశాయి. వివరాలు చూద్దాం.. న్యూఢిల్లీ: సెకండరీ మార్కెట్‌కు ధీటుగా కొత్త ఏడాదిలోనూ ప్రైమరీ మార్కెట్లో సందడి కొనసాగనుంది. మర్చంట్ బ్యాంకర్ల సమాచారం ప్రకారం ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 23 కం పెనీలు ఐపీవోలకు రానున్నాయి. తద్వారా ఉమ్మడిగా రూ. 44,000 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నాయి. ఓవైపు కరోనా మహమ్మారి సమస్యలు సృష్టించినప్పటికీ 2021లో మొత్తం 63 కంపెనీలు రూ. 1.2 లక్షల కోట్లను సమకూర్చుకోవడం ద్వారా సరికొత్త రికార్డును నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇవికాకుండా పవర్‌గ్రిడ్ ఇన్విట్ రూ. 7,735 కోట్లు, బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్ రూ. 3,800 కోట్లు చొప్పున పెట్టుబడులను సమీకరించాయి. కాగా.. ఈ ఏడాది క్యూ1(జనవరి–మార్చి)లో అత్యధిక శాతం ఆధునిక తరం టెక్నాలజీ కంపెనీలు ఐపీవో మార్కెట్లలో ఆధిపత్యం వహించనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరిగిన లిక్విడిటీ, లాభాలతో లిస్టవుతున్న కంపెనీలు, రిటైల్ ఇన్వెస్టర్ల భారీ ఆసక్తి ప్రధానంగా ప్రైమరీ మార్కెట్లకు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు మరోసారి తెలియజేశారు. కంపెనీల క్యూ తాజా త్రైమాసికంలో నిధుల సమీకరణ బాట పట్టిన కంపెనీల జాబితాలో ప్రధానంగా హోటల్ రూముల సంస్థ ఓయో(రూ. 8,430 కోట్లు), సప్లై చైన్ కంపెనీ డెల్హివరీ(రూ. 7,460 కోట్లు), బాస్మతి బియ్యం, వంటనూనెల దిగ్గజం అదానీ విల్మర్(రూ. 4,500 కోట్లు), ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్(రూ. 4,000 కోట్లు), వేదాంత్ ఫ్యాషన్స్(రూ. 2,500 కోట్లు), పారదీప్ ఫాస్ఫేట్స్(రూ. 2,200 కోట్లు), ఇక్సిగో(రూ. 1,800 కోట్లు), మెడాంటా(రూ. 2,000 కోట్లు), ఇక్సిగో(రూ. 1,800 కోట్లు) ఉన్నాయి. వీటితోపాటు స్కాన్‌రే టెక్నాలజీస్, హెల్దియం మెడ్‌టెక్, సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ తదితరాలు సైతం పబ్లిక్ ఇష్యూ చేపట్టనున్నాయి. ఐపీవో నిధులను విస్తరణ, ఇతర సంస్థల కొనుగోళ్లు, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నాయి. అంతేకాకుండా కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలు వాటాల విక్రయం ద్వారా పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకూ ఐపీవోలు అవకాశమివ్వనున్నాయి. నిపుణులు ఏమంటున్నారంటే.. స్టాక్ ఎక్సే్ఛంజీలో లిస్టయితే లిక్విడిటీ పెరగడంతోపాటు.. విలువ మదింపునకు వీలుంటుందని కంపెనీలు పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు ఆసక్తి చూపుతాయని రికర్ క్లబ్ వ్యవస్థాపకుడు ఏకలవ్య పేర్కొన్నారు. అంతర్జాతీయంగా విస్తరించే ప్రణాళికలకు అవసరమైన పెట్టుబడుల కోసం కొన్ని కంపెనీలు ఐపీవో బాట పడుతుంటాయని లెర్న్‌యాప్.కామ్ సీఈవో ప్రతీక్ సింగ్ తెలియజేశారు. మరోవైపు యాంకర్ ఇన్వెస్టర్ సంస్థలు తమ పెట్టుబడులపై లాభార్జన కోసం వీటిని వినియోగించుకుంటాయని వివరించారు. అయితే ఇటీవల క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఐపీవో నిబంధనలను కఠినతరం చేసిన విషయం విదితమే. ప్రధానంగా నిధుల వినియోగాన్ని సెబీ పర్యవేక్షించనుండటంతో యూనికార్న్ సంస్థలు తగిన లక్ష్యం లేకుండా పబ్లిక్ ఇష్యూలను చేపట్టేందుకు వీలుండదని సైరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ యాష్ అషర్ అభిప్రాయపడ్డారు. -
ఐపీవో.. ఓయోకి భారీ ఝలక్!
Oyo Initial Public Offering: పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా సమీకరణకు సిద్ధమైన ఓయోకి భారీ ఝలక్ తగిలింది. ప్రత్యర్థి కంపెనీ జోస్టల్.. ఓయో ఐపీవో ప్రతిపాదనను తిరస్కరించాలంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఓ లేఖ రాసింది. డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్(DRHP) నిబంధనలకు విరుద్ధంగా ఉందని, దానిని పక్కనపెట్టడంతో పాటు ఓయో ఐపీవో ప్రతిపాదనను తిరస్కరించాలని సెబీకి జోస్టల్ విజ్ఞప్తి చేసింది. ఆతిథ్య సేవల సంస్థ ఓయో ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (Initial public offering) ద్వారా 1.2 బిలియన్ డాలర్ల( రూ.8,430 కోట్లు) సమీకరణకు సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే ఓయో మాతృ సంస్థ ఓరావెల్ స్టేస్.. క్యాపిటల్ స్ట్రక్చర్ తుది రూపానికి రాని తరుణంలో ఐపీవోకి వెళ్లడం ఎలా కుదురుతుందని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది జోస్టల్. ఈ మేరకు ఐపీవోకు అనుమతించకూడదంటూ సెబీకి విజ్ఞప్తి చేసింది. సెబీ గనుక ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం ఓయోకి చిక్కులు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది జులైలో ఫుడ్ యాప్ జొమాటో ఐపీవో విజయవంతమైన తర్వాత పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు ఓయో సిద్ధమైంది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చేందుకు ఓయో మాతృ సంస్థ ఓరావెల్ స్టేస్ వాటాదార్లు ఇటీవలె ఆమోదం తెలిపారు. దీంతో తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా రూ.8,430 కోట్లు సమీకరించడానికి సిద్ధమైంది. ఈ మేరకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద కంపెనీ ఈ నెల మొదట్లో ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ఇదిలా ఉంటే ఆతిథ్య సేవల రంగంలో జోస్టల్-ఓరావెల్ స్టేస్‌లు ప్రత్యర్థులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మొదట్లో జోస్టల్‌కు అనుకూలంగా సుప్రీంకోర్టు నియమించిన మధ్యవర్తి తీర్పును సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌తో పాటు ఓయోకి వ్యతిరేకంగా దాఖలు చేసిన మరో పిటిషన్‌పైనా సంయుక్తంగా ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం అక్టోబర్ 21న విచారణ చేపట్టాల్సి ఉంది. ఓయో ఐపీవో ముఖచిత్రం ► ప్రతిపాదిత ఇష్యూలో రూ.7,000 కోట్ల విలువైన తాజా షేర్లతో పాటు ఆఫర్ ఫర్ సేల్‌లో రూ.1,430 కోట్ల విలువైన షేర్లను కంపెనీ విక్రయించనుంది. ► ఆఫర్ ఫర్ సేల్‌లో ఎస్‌వీఎఎఫ్ ఇండియా హోల్డింగ్స్ లిమిటెడ్, ఏ1 హోల్డింగ్స్, చైనా లాడ్జింగ్ హోల్డింగ్స్, గ్లోబల్ ఐవీవై వెంచర్స్ ఎల్ఎల్పీ షేర్లను విక్రయించనున్నాయి. ► ప్రస్తుతం ఓయోలో ఎస్‌వీఎఎఫ్ 46.62%, ఆర్ఏ హాస్పిటాలిటీ హోల్డింగ్స్‌కు 24.94%, రితేశ్ అగర్వాల్‌కు 8.21% వాటాలు ఉన్నాయి. ► ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను రుణాల చెల్లింపునకు, వాణిజ్య విస్తరణకు కంపెనీ వినియోగించనుంది. ► ఈ పబ్లిక్ ఇష్యూ నిర్వహించేందుకు జేపీ మోర్గాన్, సిటీ, కోటక్ మహీంద్రా క్యాపిటల్ వంటి ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్‌లను ఓయో నియమించుకుంది. చదవండి: క్యూ3లో ఐపీవో స్పీడ్ -
ఓయోతో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ఆతిథ్య రంగ సంస్థ ఓయో తాజాగా వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ట్రావెల్, ఆతిథ్య రంగానికి అవసరమైన ఉత్పత్తులు, టెక్నాలజీలను కలిసి అభివృద్ధి చేసేందుకు ఇది తోడ్పడనుంది. హాస్పిటాలిటీ, ట్రావెల్ టెక్నాలజీ పరిశ్రమ కొత్త రూపు సంతరించుకునేలా క్లౌడ్ ఆధారిత ఆవిష్కరణలను రూపొందించేందుకు మైక్రోసాఫ్ట్ అజూర్‌ను ఓయో ఉపయోగించనుంది. సెల్ఫ్–చెకిన్, డిజిటల్ రిజిస్టర్, ఐవోటీ ఆధారిత స్మార్ట్ తాళాలు, వర్చువల్ అసిస్టెన్స్ మొదలైన సర్వీసులను గెస్టుల కోసం రూపొందిస్తుంది. చిన్న, మధ్యతరహా హోటళ్లకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని ఓయో తెలిపింది. ట్రావెల్, ఆతిథ్య రంగంలో నూతన ఆవిష్కరణలకు ఓయోతో భాగస్వా మ్యం తోడ్పడగలదని మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి తెలిపారు. మైక్రోసాఫ్ట్ సుమారు 5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 37 కోట్లు) ఓయోలో ఇన్వెస్ట్ చేసింది. -
ఓయోలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడి
న్యూఢిల్లీ: రూములు, హోటళ్ల చైన్ నిర్వహించే ఓయోలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ దాదాపు 5 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 37 కోట్లు) ఇన్వెస్ట్ చేసింది. ప్రైవేట్ ప్లేస్‌మెంట్‌కింద ఈక్విటీ షేర్లు, తప్పనిసరిగా మార్పిడయ్యే క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్లు రూపంలో పెట్టుబడులు చేపట్టింది. ఇందుకు జూలై 16న జరిగిన అసాధారణ వాటాదారుల సమావేశంలో ఓయో మాతృ సంస్థ ఒరావెల్ స్టేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా రూ. 10 ముఖ విలువగల 5 ఈక్విటీ షేర్లను ఓయో తాజాగా జారీ చేసింది. ఇదేవిధంగా రూ. 100 ముఖ విలువగల 80 సీసీసీ ప్రిఫరెన్స్ షేర్లను సైతం ఇష్యూ చేసింది. కాగా.. రుణ చెల్లింపులు, ఇతర బిజినెస్ పెట్టుబడుల కోసం గ్లోబల్ సంస్థల నుంచి 66 కోట్ల డాలర్లను(రూ. 4,920 కోట్లు) సమీకరించనున్నట్లు జూలైలో ఓయో పేర్కొన్న విషయం విదితమే. -
‘ఓయో’లో వాటాలపై మైక్రోసాఫ్ట్ ఆసక్తి
న్యూఢిల్లీ: ఆతిథ్య సేవల్లోని భారత్‌కు చెందిన బహుళజాతి సంస్థ ‘ఓయో’లో వాటాలు కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ ఆసక్తి చూపిస్తోందని సమాచారం. 9 బిలియన్ డాలర్ల విలువ ఆధారంగా (రూ.67,000 కోట్లు) వాటాల కొనుగోలుపై చర్చలు ముందస్తు దశలో ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కొనుగోలు ఒప్పంద పరిమాణం గురించి వివరాలను బయటపెట్టలేదు. ఓయో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు రావడానికి ముందుగానే మైక్రోసాఫ్ట్ వాటాలను కొనుగోలు చేయడం పూర్తవుతుందని పేర్కొన్నాయి. ఈ విషయమై మైక్రోసాఫ్ట్, ఓయో అధికారికంగా స్పందించలేదు. ఓయో ఈ నెల మొదట్లోనే 660 మిలియన్ డాలర్ల (సుమారు రూ.4,920 కోట్లు) నిధులను టర్మ్ లోన్ బి (టీఎల్‌బీ/రుణం) రూపంలో అంతర్జాతీయ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి సమీకరించింది. దీనికి ఇన్స్టిట్యూషన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. బిలియన్ డాలర్ల వరకు రుణాలను సమకూర్చేందుకు సంస్థలు అంగీకారం తెలిపాయి. ఓయోలో ఇప్పటికే సాఫ్ట్‌బ్యాంక్, విజన్ ఫండ్, సీక్వోయా క్యాపిటల్, లైట్‌స్పీడ్ వెంచర్స్, హీరో ఎంటర్ప్రైజ్ తదితర సంస్థలకు వాటాలున్నాయి. -
ఓయో రూమ్ తీసుకుందామనుకుంటే.. అంతలోనే!
సాక్షి, హైదరాబాద్: సిటీలోని ఉత్తర మండలానికి చెందిన ఓ వ్యక్తి ఓయో హోటల్లో రూమ్ బుక్ చేసుకోవాలని భావించాడు. ఆ సంస్థను సంప్రదించడానికి అవసరమైన నంబర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేసి నిండా మునిగాడు. నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి ఉమేష్ ఇటీవల కరోనా బారినపడ్డాడు. చికిత్స తీసుకున్న అతడికి నెగిటివ్ వచ్చింది. అయితే తన ఇంట్లో కుటుంబ సభ్యులు ఎక్కువ మంది ఉండటంతో ముందుజాగ్రత్త చర్యగా కొన్ని రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని భావించారు. దీని కోసం తమ ప్రాంతానికి సమీపంలోని ఓయో హోటల్ రూమ్ తీసుకుందామని భావించి ఆ సంస్థ ఫోన్ నంబర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేయగా ఒక నంబర్ లభించింది. అది నకిలీది అని తెలియక ఉమేష్ ఆ నంబర్‌ను సంప్రదించగా.. ఓయో సంస్థ ప్రతినిధుల మాదిరిగా సైబర్ నేరగాళ్లు మాట్లాడారు. మీకు కావాల్సిన రూమ్ బుక్ చేసుకోవడానికి సహకరిస్తామంటూ క్విక్ సపోర్ట్ (క్యూఎస్) యాప్‌ను డౌన్లోడ్ చేయించారు. తర్వాత బాధితుడి ఫోన్‌ను హ్యాక్ చేశారు. రూమ్ బుకింగ్ కోసం తమకు రూ.10 పంపాలన్నారు. ఉమేష్ ఆ మొత్తం తన ఫోన్ నుంచి బదిలీ చేస్తుండగా అతడి యూపీఐ వివరాలను క్యూఎస్ యాప్ ద్వారా తస్కరించారు. వీటిని వినియోగించి అతడి ఖాతా నుంచి రూ.3.08 లక్షలు తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకుని స్వాహా చేశారు. విషయం తెలుసుకున్న ఉమేష్ గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నిందితుల ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల ఆధారంగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గూగుల్‌ను ఆశ్రయించొద్దు ఇటీవల కాలంలో ఈ తరహా కేసులు పెరుగుతున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. సైబర్ నేరగాళ్లు ప్రముఖ సంస్థల కాల్ సెంటర్ల పేరుతో తమ నంబర్లను గూగుల్‌లో జొప్పిస్తున్నారని, ఈ విషయం తెలియక సంప్రదించిన అనేక మంది మోసపోతున్నారని పేర్కొన్నారు. ఏదైనా సంస్థకు సంబంధించిన ఫోన్, కాల్ సెంటర్ నంబర్లు అవసరమైతే నేరుగా దాని వెబ్సైట్ లేదా యాప్‌లనే సంప్రదించాలని సూచిస్తున్నారు. గూగుల్‌లో ఉన్న వాటిని గుడ్డిగా నమ్మితే నిండా మునుగుతారని హెచ్చరిస్తున్నారు. చదవండి: 128 సార్లు ఓయో హోటల్స్ బుక్ చేసుకున్న ఒకే ఒక్కడు -
ఎస్బీఐ యూజర్లకు మరోసారి బంపర్ ఆఫర్లు
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన వినియోగదారులకు గుడ్‌న్యూస్ అందించింది. ఎస్బీఐ ‘యోనో’ ద్వారా మరోసారి సూపర్ సేవింగ్ డేస్ ప్రకటించింది. ఏప్రిల్ 7వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఆఫర్స్ అందిస్తోంది. ఈ సేల్‌లో కస్టమర్లకు 50 శాతం దాకా భారీ డిస్కౌంట్లను అందుబాటులోకి తీసుకొచ్చామంటూ ఎస్బీఐ తన ట్వీట్లో తెలిపింది. అమెజాన్, అపోలో, ఈజ్‌మైట్రిప్, ఓయోలాంటి టాప్ బ్రాండ్ల భాగస్వామ్యంతో ఈ ఆఫర్లను అందిస్తోంది. గత మూడు నెలలకాలంలో యోనో సూపర్ సేవింగ్ డేస్ పేరుతో ఆఫర్స్ లావాదేవీలు బాగా పుంజుకోవడంతో వినియోగదారులను ఆకర్షించేందుకు మరోసారి సేల్ ప్రకటించడం విశేషం. గత మూడు నెలల్లో యోనో ద్వారా ఆఫర్లు ప్రకటించడం ఇది మూడో సారి. ఎస్బీఐ ఆఫర్స్ అమెజాన్: ఎస్బీఐ యోనో ద్వారా లావాదేవీల ద్వారా అమెజాన్‌లో 10 శాతం వరకు అదనంగా క్యాష్‌బ్యాక్ లబిస్తుంది. అపోలో : మెడిసిన్, చికిత్స నిమితం అపోలో ద్వారా 25 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. @హోం : ఇంటికి సంబంధించిన ఫర్నీచర్ కొనుగోలు చేయాలంటే @హోమ్‌లో ఎస్బీఐ యోనో కస్టమర్లకు 12 శాతం అదనంగా తగ్గింపు. ఈజ్‌మైట్రిప్ వెబ్సైట్లో ఎస్బీఐ యోనో ద్వారా డొమెస్టిక్ విమానాలు బుక్ చేస్తే రూ.850 వరకు తగ్గింపు లభిస్తుంది. ఓయో: ఓయో బుకింగ్స్‌పై 50 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. Make the most of YONO Super Saving Days! Upto 50% off* on big brands like Amazon, Apollo 24|7, @home, EaseMyTrip, and OYO. Download now: https://t.co/YibUVRB2OS#SuperSavingDays #YONOSBI #YONO #Shopping #Saving pic.twitter.com/HTi01tQ2lN — State Bank of India (@TheOfficialSBI) April 4, 2021 -
128 సార్లు ఓయో హోటల్స్ బుక్ చేసుకున్న ఒకే ఒక్కడు
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ కు బిజినెస్ పరంగా ఇండియా చాలా కీలకమని ఓయో పేర్కొంది. ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ తన మూడవ వార్షిక ట్రావెల్ ఇండెక్స్ ఓయో ట్రావెలోపిడియా 2020ను ఈ రోజు విడుదల చేసింది. అన్ని దేశాల్లో కెల్లా ఇండియాలోనే ఎక్కువగా యూజర్లు ఓయో ద్వారా రూమ్స్ బుక్ చేసుకున్నట్లు సంస్థ పేర్కొంది. 2020లో రూమ్ బుకింగ్స్ ను నగరాల వారీగా పరిశీలిస్తే ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. అలాగే వ్యాపార ప్రయాణికుల రూమ్ బుకింగ్స్ పరంగా హైదరాబాద్ తోలి స్థానంలో నిలిచింది. అదే విధంగా భారత్ లో అత్యధికంగా సందర్శించిన మూడు రాష్ట్రాలలో తెలంగాణ ఒకటిగా నిలిచింది.(చదవండి: ‘వాటిపై అదనపు చార్జీలు వసూలు చేయడం లేదు’) 2020లో ఒకే అతిధి 128 సార్లు తమ ఆతిథ్యం స్వీకరించారని ఓయో పేర్కొంది. ఈ కరోనా సమయంలో కూడా ఒక అతిధి ఇన్ని సార్లు బుకింగ్ చేసుకున్నాడంటే ఇక్కడ మేము తీసుకునే జాగ్రత్తలు, మార్కెట్ లో ఓయో బ్రాండ్ కు ఉన్న విలువ ఏంటో మీరే అర్థం చేసుకోవచ్చని ఓయో ప్రతినిధులు పేర్కొన్నారు. కొన్ని వందల సార్లు చెప్పినా "జాగ్రత్తగా వెళ్లిరండి" అనే మాటకు అసలైన అర్ధాన్ని నేడు తెలుసుకున్నామన్నారు. అలాగే మరో ఓయో కస్టమర్ ఏడాది పొడవునా సుమారు 50,000 సెకన్లు(13.88 గంటలు) యాప్ లో గడిపినట్లు పేర్కొంది. దీంతో బయటికి వెళ్లినప్పుడు ఓయో రూమ్ లో గడపాలనే తన కోరికను అర్ధం చేసుకోవచ్చు అని తెలిపింది. -
మేడ్చల్: ఓయో లాడ్జిలో దారుణం!
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ప్రియురాలు మృతి చెందగా.. ప్రియుడి పరిస్థితి విషమంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓయో లాడ్జిలో బుధవారం శ్రావణి, అజయ్ అనే ప్రేమజంట పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. ఈ ఘటనలో యువతి ప్రమాదస్థలంలోనే మృతి చెందగా, కొన ఊపిరితో ఉన్న యువకుడ్ని పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిరువురు ఆత్మహత్య చేసుకున్నారా లేక శ్రావణిని చంపి అజయ్ ఆత్మహత్యాయత్నం చేశాడా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ప్రేమజంట ఓయో లాడ్జిలోకి వెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ప్రేమిస్తే తాళి కట్టించుకో, లేదా కత్తితో పొడిపించుకో -
కోతలు తప్పవు..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో 10 బిలియన్ డాలర్ల విలువను అందుకున్న అతిపెద్ద హోటల్ చెయిన్ ఓయో... కరోనా దెబ్బకి విలవిల్లాడుతోంది. లాక్‌డౌన్‌తో గత రెండు నెలలుగా 60 శాతం ఆదాయాన్ని కోల్పోయింది. నిర్వహణ భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని తొలగించటంతో పాటు వేతనాల్లోనూ భారీగా కోతలు పెడుతున్నట్లు ‘ఓయో హోటల్స్ అండ్ హోమ్స్’ ఇండియా, దక్షిణాసియా సీఈవో రోహిత్ కపూర్ చెప్పారు. మరో నాలుగు నెలల పాటు ఇబ్బందులు తప్పవన్నారు. లాక్డౌన్ తీసేసినా.. గతంలో మాదిరి కస్టమర్లు అత్యవసరం కాని ప్రయాణాలు చేయరని, విలాసాలకు దూరంగా ఉంటారని, దీంతో హోటల్స్ ఆక్యుపెన్సీ తగ్గుతుందని చెప్పారాయన. ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్లడించారు. కరోనా ప్రభావం ఓయోపై ఏ మేరకు ఉంది? ప్రపంచ వ్యాప్తంగా ఆతిథ్య రంగం పీకల్లోతు కష్టాల్లో పడింది. దీనికి ఓయో మినహాయింపేమీ కాదు. ఆక్యుపెన్సీ పడిపోయి ఆదాయం 50–60 శాతం క్షీణించింది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఖర్చులు తగ్గించుకోవటం మినహా చేసేదేమీ లేదు. జూన్ నాటికి నెలవారీ ఖర్చుల్ని రూ.300 కోట్ల నుంచి రూ.185 కోట్ల స్థాయికి తగ్గించనున్నాం. కరోనా తర్వాత చైనాలో ఆతిథ్య రంగం కోలుకున్న సంకేతాల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇదే సానుకూలత ఉంటుందని ఆశిస్తున్నాం. ఉద్యోగుల తొలగింపులు, వేతనాల్లో కోతలు ఎలా ఉన్నాయి? రెగ్యులర్ ఆదాయం లేకుంటే ఏ కంపెనీ అయినా మొదట చేసేది నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవటమే. ప్రపంచ వ్యాప్తంగా ఓయోలో 17 వేల మంది ఉద్యోగులున్నారు. వీరిలో 8 వేల మంది ఇండియా, దక్షిణాసియాలో ఉన్నారు. పెద్ద స్థాయి ఉద్యోగులకు 25–50 శాతం, మిగతా ఉద్యోగులకు 25 శాతం జీతాల్లో కోత వేశాం. కొందరు ఉద్యోగులకు సెలవులిచ్చాం. వారికి జీతాల్లేకుండా వైద్య బీమా, ఫీజు రీయింబర్స్మెంట్ వంటివి అందిస్తాం. మరో నాలుగు నెలల పాటు ఇవి కొనసాగుతాయి. కరోనా కంటే ముందు ఇండియాలో 550 నగరాల్లో సేవలందించిన ఓయో.. ఇపుడు 400 నగరాలకు పరిమితమైంది. ఓయోతో ఒప్పందం చేసుకున్న హోటల్స్ పార్టనర్స్ సంగతేంటి? ఓయోలో అమెరికా, చైనా, మలేíసియా, ఇండోనేసియా, నేపాల్ వంటి 80 దేశాల్లో 43 వేల హోటల్స్, 10 లక్షల రూమ్స్ ఉన్నాయి. మన దేశంలో 18 వేల హోటల్స్, 2.70 లక్షల గదులున్నాయి. మా హోటల్స్ పార్ట్నర్స్కు ఓయో సంబంధ్ పేరిట ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తున్నాం. ఓయోను ఎంఎస్ఎంఈ కింద పరిగణించాలని కేంద్రాన్ని కోరారు... ఎందుకు? కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో ఆతిథ్య రంగానికి చిల్లిగవ్వ కూడా లేదు. లాక్డౌన్ ఎత్తేశాక.. హోటల్స్‌కు వర్కింగ్ క్యాపిటల్ అవసరం ఉంటుంది కదా? అందుకే ఓయో పార్టనర్ హోటల్స్, స్టార్టప్స్‌లను కూడా ఎంఎస్ఎంఈ విభాగంలోకి తెస్తే వారికి పూచీకత్తు లేని రుణాలు, తక్కువ వడ్డీ రేట్లు వంటి ప్రయోజనాలు అందుతాయనేది నా ఉద్దేశం. లాక్డౌన్ తర్వాత ఓయో హోటల్స్ ఎలా ఉండొచ్చు? పరిశుభ్రత, భద్రత, భౌతిక దూరం అనేవి ఓయో హోటల్స్ నిబంధనల్లో అతిముఖ్యమైనవిగా మారతాయి. రాబడి, వ్యయాల ఆడిట్లో వీటికీ చోటుంటుంది. ఈ నెలాఖరు నాటికి వెయ్యి హోటళ్లను, లాక్డౌన్ ఎత్తేశాక దేశంలోని 18 వేల హోటల్స్‌ను శానిటైజ్ చేస్తాం. ఇక నుంచి ఓయో ప్లాట్‌ఫ్లామ్‌లో ధర, వసతులతో పాటూ శానిటైజ్ ట్యాగ్ కూడా ఉంటుంది. సాధ్యమైనంత వరకు రూమ్ డైనింగ్కే ప్రాధాన్యమిస్తాం. ఉద్యోగులకు, కస్టమర్లందరికీ హెల్త్ స్క్రీనింగ్ చేశాకే లోపలికి అనుమతి ఉంటుంది. వృద్ధులు, వికలాంగ కస్టమర్లు మినహా ఎవరి లగేజీని వాళ్లే లోపలికి తెచ్చుకోవాలి. ఇన్వెస్టర్లతో మీ సంబంధాలెలా ఉన్నాయి? ఓయోలో జపాన్ సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్‌నకు 42% వాటా ఉంది. గ్రీన్ఓక్స్ క్యాపిటల్, సెకోయా ఇండియా, లైట్ స్పీడ్ ఇండియా, హీరో ఎంటర్ప్రైజ్, ఎయిర్ బీఎన్బీ, చైనా లాడ్జింగ్ గ్రూప్‌లకూ వాటాలున్నాయి. బోర్డ్ సభ్యులందరితో కలిసి పనిచేస్తున్నాం. తాజాగా అమెరికాకు చెందిన కాఫీ హౌజ్ కంపెనీ స్టార్‌బక్స్ మాజీ సీఓఓ ట్రాయ్ ఆల్స్టీడ్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ బెట్సీ ఆట్కిన్స్లు ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా బోర్డ్లోకి వచ్చారు. ఓయోపై నమ్మకం, సంస్థ సామర్థ్యం పెరగటానికి వీరి సేవలు ఉపయోగపడతాయి. -
ఓయో లాడ్జ్‌లో గుట్టు చప్పుడు కాకుండా..
హస్తినాపురం: గుట్టు చప్పుడు కాకుండా లాడ్జ్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న లాడ్జ్ యజమానిని వనస్థలిపురం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆటోనగర్‌లో మదిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి (40) ఓయో లాడ్జీని నడిపిస్తున్నాడు. కొంతకాలంగా తన లాడ్జ్‌లో వ్యభిచారం చేయిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గతవారం లాడ్జ్‌పై దాడి చేసి మహిళలను,విటులను రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న రాఘవేందర్ రెడ్డిని గురువారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. (టిక్‌టాక్‌లో బాసలు చేశాడు.. ఆశలు రేపాడు) -
మేక్మైట్రిప్, ఓయోలకు సీసీఐ షాక్
న్యూఢిల్లీ: అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ మేక్మైట్రిప్ (ఎంఎంటీ), హోటల్ సేవల సంస్థ ఓయోలపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలంటూ కంపిటీషన్ కమిషన్ (సీసీఐ) ఆదేశించింది. ఓయో ప్రత్యర్థి ట్రీబో హోటల్స్ మాతృసంస్థ రబ్టబ్ సొల్యూషన్స్ ఫిర్యాదు మేరకు సీసీఐ ఈ మేరకు ఆదేశాలిచ్చింది. పోటీ నిబంధనలను ఉల్లంఘించాయన్న ప్రాథమిక ఆధారాలతో ఈ రెండు సంస్థల మీద సీసీఐ విచారణకు ఆదేశించడం ఆరు నెలల వ్యవధిలో ఇది రెండోసారి. ఓయోతో ఒప్పందం కుదుర్చుకున్న ఎంఎంటీ.. తన పోర్టల్‌లో ట్రీబో భాగస్వామ్య హోటళ్లను లిస్ట్ చేయకుండా మినహాయించడం, పోర్టల్‌లో చార్జీలపరంగా పరిమితులు విధించడం తదితర అంశాలపై ట్రీబో ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన సీసీఐ.. మార్కెట్లో గుత్తాధిపత్యాన్ని ఎంఎంటీ దుర్వినియోగం చేస్తున్నట్లు ప్రాథమిక ఆధారాల బట్టి తెలుస్తోందని 13 పేజీల ఉత్తర్వుల్లో పేర్కొంది. -
ఓయోలో 1,000 మందికి ఉద్వాసన..!
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ సంస్థ ‘ఓయో’ 1,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. కంపెనీని వీడి ఇతర సంస్థల్లో ఉద్యోగాలను చూసుకోవాలంటూ పలువురికి ఈ–మెయిల్స్ అందినట్లు వెల్లడైంది. అయితే, దీనిపై ఇప్పటివరకు కంపెనీ అధికారిక ప్రకటన చేయలేదు.‘రైట్–సైజింగ్’ పేరిట ఈ ఉత్తరాలు అందినట్లు సమాచారం. ప్రస్తుత ఏడాది కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ అంశంపై సంస్థ సీఈఓ రితేష్ అగర్వాల్ స్పందిస్తూ.. ఉద్యోగులను బయటకు వెళ్లి మరో సంస్థలో చేరమని కోరడం అంత సులువైన విషయం కాదని వ్యాఖ్యానించారు. -
అయ్యో! ప్రమాదంలో 2 వేల ఉద్యోగాలు
సాక్షి, ముంబై: దేశంలో అతిపెద్ద హోటల్ బ్రాండ్ ఓయో దేశంలో కనీసం 2 వేల మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఉద్యోగాల్లో కోత పెట్టనుంది. ది ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం జనవరి చివరినాటికి 2 వేల మందిని తొలగించాలని కంపెనీ యోచిస్తోంది. ముఖ్యంగా అమ్మకాలు, సరఫరా, ఆపరేషన్స్ విభాగాల్లో ఉద్యోగులను తగ్గించుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. రితేష్ అగర్వాల్ నేతృత్వంలోని హాస్పిటాలిటీ సంస్థ ఓయో ప్రతి నెలా తన ఉద్యోగుల పనితీరు సమీక్షిస్తుంది. ఈ ఫలితాలు, గ్రేడ్స్ ఆధారంగా కొంతమంది అభ్యర్థులను పనితీరు మెరుగుదలకు సంబంధించిన శిక్షణా కార్యక్రమానికి పంపడం లేదా తొలగించడం చేస్తుంది. అయితే సంస్థ పునరుద్ధరణలో భాగంగా సంతృప్తికరమైన గ్రేడ్స్ వచ్చిన ఉద్యోగులను కూడా తీసివేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోందన్న అంచనాలు నెలకొన్నాయి. సాధారణంగా ‘డి’ రేటింగ్ ఉన్న ఉద్యోగులపై వేటు వేసే కంపెనీ, బీ అంతకంటే మెరుగైన రేటింగ్ ఉన్న ఉద్యోగులకు కూడా ఉద్వాసన పలకనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఉద్యోగుల సగటు జీతాలు రూ. 10 నుంచి 12 లక్షల పరిధిలో ఉంటాయని భావిస్తున్నారు. కాగా ఐపీవోకు రావాలని ఆలోచిస్తున్న ఓయో ప్రణాళికలకు భారీ నష్టం బ్రేక్ వేసింది. మార్చి 2019తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో, ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ నికర నష్టం రూ.2,384 కోట్లకు చేరింది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది ఆరు రెట్లు ఎక్కువ. నిర్వహణ వ్యయాలు, ఉద్యోగుల సంబంధిత ఖర్చులు పెరగడం వల్ల నష్టం పెరిగిందని కంపనీ అంచనా. ఖర్చులు వార్షిక ప్రాతిపదికన ఆరు రెట్లు పెరిగి రూ.1,539 కోట్లకు చేరుకోగా, నిర్వహణ ఖర్చులు ఐదు రెట్లు పెరిగి 6,131 కోట్లకు చేరుకున్నాయి. -
రూ. 10 వేల కోట్ల సమీకరణలో ఓయో
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ సంస్థ ఓయో తాజాగా 1.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.10,650 కోట్లు) సమీకరించనున్నట్లు వెల్లడించింది. అమెరికాలో విస్తరణకు, యూరప్‌లో కార్యకలాపాలను మరింత మెరుగుపర్చుకునేందుకు ఈ నిధులను వినియోగించనున్నట్లు వివరించింది. ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్.. ఆర్ఏ హాస్పిటాలిటీ హోల్డింగ్స్ ద్వారా 700 మిలియన్ డాలర్లు సమకూర్చనుండగా, మిగతా 800 మిలియన్ డాలర్ల నిధులను ప్రస్తుతం ఉన్న ఇన్వెస్టర్లు అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది. నిధుల సమీకరణకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం కూడా లభించినట్లు అగర్వాల్ చెప్పారు. సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్, లైట్‌స్పీడ్, సెకోయా క్యాపిటల్ తదితర ఇన్వెస్టర్లు తమకు పూర్తిగా మద్దతునిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఓయో హోటల్స్ అండ్ హోమ్స్‌లో సుమారు 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆర్ఏ హాస్పిటాలిటీ హోల్డింగ్స్‌కు కొన్నాళ్ల క్రితం అనుమతులు లభించాయి. ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం 35,000 హోటల్స్.. 1,25,000 పైగా వెకేషన్ హోమ్స్ ఉన్నాయి. -
ఇక ఓయో.. కాఫీ!
న్యూఢిల్లీ: చౌకగా హోటల్ గదులను అందుబాటులోకి తెచ్చిన ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ తాజాగా కొత్త విభాగాల్లోకి ప్రవేశిస్తోంది. ప్రీమియం కాఫీ చెయిన్, రెస్టారెంట్లు ప్రారంభించే ప్రయత్నాల్లో ఉంది. ది ఫ్రెంచ్ ప్రెస్ పేరుతో 50 పైగా ప్రీమియం కాఫీ షాప్‌లను ఏర్పాటు చేసేందుకు ఓయో సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే నాలుగు క్లౌడ్ కిచెన్స్ చేతిలో ఉన్నందున .. వాటి ఊతంతో రెస్టారెంట్ చెయిన్ కూడా ప్రారంభించాలని ఓయో భావిస్తున్నట్లు తెలుస్తోంది. హోటల్ రూమ్స్‌ను చౌకగా అందుబాటులోకి తెచ్చిన కారణంగా ఓయోపై ’చౌక’ బ్రాండ్ అనే ముద్ర పడిపోయిన సంగతి తెలిసిందే. కానీ ప్రీమియం కాఫీ చెయిన్‌పై ఈ ముద్ర పడకుండా చూసుకోవాలని ఓయో భావిస్తోంది. అందుకే తన బ్రాండ్ పేరు ఎక్కడా కనిపించకుండా ది ఫ్రెంచ్ ప్రెస్ బ్రాండ్ కింద ఈ కాఫీ చెయిన్‌ను ప్రారంభించాలని భావిస్తోంది. ‘ప్రీమియం కాఫీ చెయిన్ విభాగంలో ఎక్కువ సంస్థలు లేకపోవడంతో స్టార్‌బక్స్ వంటి దిగ్గజంతో పోటీపడొచ్చని, ఇందుకు కావల్సిన పూర్తి సామర్థ్యాలు తమకున్నాయని ఓయో భావిస్తోంది. అయితే, ఓయో అంటే చౌకైన, అందుబాటు ధర బ్రాండ్ అనే ముద్ర ఉన్న సంగతి కూడా దానికి తెలుసు. అందుకే కాస్త ఖరీదైన ఈ టార్గెట్ మార్కెట్ కోసం ఓయో బ్రాండింగ్ వాడకూడదని నిర్ణయించుకుంది‘ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ట్రయల్ రన్.. ఓయో ఇప్పటికే ఓయో టౌన్హౌసెస్ హోటళ్లలో ది ఫ్రెంచ్ ప్రెస్ ఔట్‌లెట్స్‌ను కొన్నింటిని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. పెద్ద మాల్స్, కాస్త ఖరీదైన ఏరియాల్లో మరికొన్నింటిని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అలాగే భారీ ఆఫీస్ కాంప్లెక్స్‌ల్లోని ఓయో కో–వర్కింగ్ స్పేస్‌లలోనూ వీటిని ప్రారంభించే యోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు, ఈ వార్తలను ధృవీకరించేందుకు ఓయో నిరాకరించింది. ఫుడ్ అండ్ బేవరేజెస్ వ్యాపారంలో కూడా తమ కార్యకలాపాలు ఉన్నాయని, ఫుల్ సర్వీస్ హోటల్స్‌లో నిర్వహించే కిచెన్స్ ద్వారా తమ ఆదాయంలో 25 శాతం వాటా వస్తోందని పేర్కొంది. ప్రస్తుతానికి మాత్రం మిగతా కార్యకలాపాల విస్తరణపై స్పందించబోమని వివరించింది. ప్రీమియం రెస్టారెంట్లపై దృష్టి.. ఓయో ఇప్పటికే అద్రక్, ఓ బిరియానీ, పరాఠా పండిట్, మాస్టర్ ఆఫ్ మోమోస్ పేరుతో నాలుగు క్లౌడ్ కిచెన్ బ్రాండ్స్ నిర్వహిస్తోంది. ది ఫ్రెంచ్ ప్రెస్ కాఫీ చెయిన్‌ను విస్తరించిన తర్వాత ప్రీమియం రెస్టారెంట్లు కూడా ఏర్పాటు చేయాలని ఓయో ప్రణాళికలు రూపొందిస్తోంది. తమ సొంత హోటళ్లు, కో–వర్కింగ్ ప్రాపర్టీలు, స్టాండెలోన్ రెస్టారెంట్లలోనూ వీటిని ప్రారంభించాలని భావిస్తోంది. ఈ రెస్టారెంట్ల కోసం క్లౌడ్ కిచెన్స్ సేవలను ఉపయోగించుకోవాలని ఓయో యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ఓయో చేతికి నెదర్లాండ్స్ కంపెనీ
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ సంస్థ ఓయో తాజాగా నెదర్లాండ్స్‌కి చెందిన వెకేషన్ రెంటల్ సంస్థ లీజర్ గ్రూప్‌ను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. యాక్సెల్ స్ప్రింగర్ నుంచి దీన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ డీల్ విలువ సుమారు 415 మిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 2,885 కోట్లు) ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ ఆతిథ్య రంగంలో కార్యకలాపాలు మరింతగా విస్తరించేందుకు ఇది ఉపయోగపడగలదని ఓయో వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈవో రితేష్ అగర్వాల్ పేర్కొన్నారు. యూరోపియన్ దేశాల్లో హాలిడే హోమ్స్, హాలిడే పార్క్‌లు, హాలిడే అపార్ట్మెంట్స్ నిర్వహణలో ః లీజర్ గ్రూప్ పేరొందింది. బెల్విల్లా, డాన్‌సెంటర్, డాన్ల్యాండ్ బ్రాండ్స్ కింద ః లీజర్ గ్రూప్.. యూరప్‌లోని 13 దేశాల్లో 30,000 పైగా గదులను అద్దెకిస్తోంది. అలాగే ట్రామ్ ఫెరీన్వోనుంజెన్ బ్రాండ్ పేరిట 50 దేశాల్లో 85,000 పైచిలుకు గృహాల యజమానులకు హోమ్ మేనేజ్మెంట్ సేవలు అందిస్తోంది. ః లీజర్ గ్రూప్ కొనుగోలుతో 24 దేశాల్లోని 800 నగరాల్లో ఓయో కార్యకలాపాలు విస్తరించినట్లవుతుంది. భారత్ సహా అమెరికా, బ్రిటన్, చైనా, సౌదీ అరేబియా, జపాన్ తదితర దేశాల్లో ఓయో కార్యకలాపాలు సాగిస్తోంది. -
ఫిలిప్పైన్స్‌లో ఓయో హోటల్స్ అండ్ హోమ్స్
న్యూఢిల్లీ: ఆతిధ్య రంగ దిగ్గజం ఓయో.. ఫిలిప్పైన్స్ దేశంలో ప్రవేశించింది. ఆ దేశంలో కార్యకలాపాల కోసం 21 ఫ్రాంచైజ్డ్, లీజ్డ్ హోటళ్లతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఓయో తెలిపింది. ప్రస్తుతం తాము భారత్‌తో పాటు చైనా, మలేషియా, నేపాల్, ఇంగ్లాండ్, యూఏఈ, ఇండోనేషియా... మొత్తం ఏడు దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ సీఓఓ అభినవ్ సిన్హా చెప్పారు. ఫిలిప్పైన్స్ తమకు ఎనిమిదో దేశమని వివరించారు. భవిష్యత్తులో ఈ దేశంలో 5 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నామని, వెయ్యికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు కల్పించనున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఫిలిప్పైన్స్ దేశంలో 500 రూమ్స్ ఆఫర్ చేస్తున్నామని, ఈ సంఖ్యను 2020 కల్లా పదివేలకు పెంచుకోవడం లక్ష్యమని వివరించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా తమ నెట్‌వర్క్‌లో 13,000 లీజ్డ్, ఫ్రాంచైజ్డ్ హోటళ్లు, 3,000 హోమ్స్ ఉన్నాయని పేర్కొన్నారు. -
నంబర్–1పై ఓయో కన్ను
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద హోటల్ బ్రాండ్‌గా అవతరించిన ఓయో... ప్రపంచంలోనూ టాప్ హోటల్ బ్రాండ్‌గా అవతరించాలన్న లక్ష్యంతో ముందుకెళుతోంది. గదుల సంఖ్య పరంగా దేశంలో ఓయో అగ్ర స్థానంలో ఉంది. వచ్చే నాలుగైదేళ్లలో అంతర్జాతీయంగా లక్షలాది హోటల్ గదులను తన నెట్వర్క్ పరిధిలో చేర్చుకోవడం ద్వారా మారియట్‌ను వెనక్కి నెట్టి ప్రపంచ నంబర్–1 హోటల్ బ్రాండ్‌గా అవతరించాలనే లక్ష్యం పెట్టుకుంది. ప్రస్తుతం అమెరికాకు చెందిన మారియట్ అంతర్జాతీయంగా అతిపెద్ద హోటల్ సంస్థగా ఉంది. ఈ సంస్థ పరిధిలో 14 లక్షల గదులున్నాయి. 2023కి మారియట్‌ను అధిగమించాలన్న లక్ష్యాన్ని విధించుకున్నట్టు ఓయో హోటల్స్ వ్యవస్థాపకుడు, సీఈవో రితేష్ అగర్వాల్ తెలిపారు. నాలుగున్నరేళ్లలోనే... ఓయో ఓ స్టార్టప్‌గా తన ప్రయాణం ఆరంభించిన నాలుగున్నరేళ్లలోనే దేశంలో అగ్రస్థానానికి చేరుకోవడం విశేషం. ఓ హోటల్ బ్రాండ్‌గా 20 గదులతో ప్రారంభించిన కంపెనీ ప్రస్తుతం భారత్, చైనా, బ్రిటన్ తదితర దేశాల్లో 3,30,000 హోటల్ గదులను నిర్వహించే అంతర్జాతీయ బ్రాండ్‌గా (ఫ్రాంచైజీ/సొంతంగానూ) అవతరించింది. ‘‘ప్రతి నెలా 50,000 గదులను పెంచుకుంటూ వెళుతున్నాం. దీన్ని బట్టి చూస్తే 2023 నాటికి అదనంగా 25 లక్షల గదుల స్థాయికి చేరతాం. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద హోటల్ చెయిన్ సామర్థ్యంతో పోలిస్తే ఇది రెండు రెట్లు అధికం’’ అని అగర్వాల్ తెలిపారు. ఓయో బడ్జెట్ హోటల్ చైన్‌గా తన వ్యాపారాన్ని ప్రారంభించగా, ప్రస్తుతం మధ్య స్థాయి, ఉన్నత స్థాయి పర్యాటకులకు సైతం విడిది సేవలు అందిస్తోంది. ప్రధానంగా ఓయోకు భారత్, చైనా మార్కెట్లో ఎక్కువ హోటల్ గదులుండగా, బ్రిటన్, యూఏఈ, ఇండోనేసియా, మలేసియా, నేపాల్‌కూ కార్యకలాపాలను విస్తరించింది. 2023 నాటికి మరిన్ని దేశాల్లోకీ అడుగుపెట్టాలనుకుంటోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో భాగమైన దుబాయ్, అబు ధాబి, షార్జా వంటి మార్కెట్లలో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు అగర్వాల్ చెప్పారు. ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, యూరప్ మార్కెట్లలో విస్తరించేందుకు ఈ మార్కెట్లు దోహదపడగలవని భావిస్తున్నట్లు వివరించారు. మరోవైపు, ప్రస్తుతం లావాదేవీల సంఖ్య మూడింతలు పెరిగిందని తెలిపారు. ఆక్యుపెన్సీ 65 శాతంగా ఉందని తెలిపారు. చైనాలో ప్రతి నెలా సుమారు 40,000 పైచిలుకు గదులు ఫ్రాంచైజీ, లీజ్డ్ విధానంలో అందుబాటులోకి తెస్తున్నామని అగర్వాల్ వివరించారు. తమ ప్లాట్‌ఫాంలో చేరిన తర్వాత ఆయా హోటల్స్‌లో ఆక్యుపెన్సీ రేటు 25 శాతం నుంచి సుమారు 70 శాతం దాకా పెరిగిందని పేర్కొన్నారు. సాఫ్ట్‌బ్యాంకు దన్ను కాలేజీ స్థాయి విద్యాభ్యాసాన్ని మధ్యలోనే విడిచిపెట్టిన రితేష అగర్వాల్ 2013లో ఓయోను ప్రారంభించారు. ఓయో వివిధ హోటల్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకుని, సిబ్బందికి తగిన శిక్షణనిస్తుంది. లినెన్ నుంచి బాత్రూమ్ ఫిటింగ్స్ దాకా అన్నింటినీ నిర్దిష్ట ప్రమాణాలకు అప్‌గ్రేడ్ చేస్తుంది. ఆ తర్వాత ఆయా హోటల్స్‌ను తమ వెబ్సైట్లో లిస్టింగ్ చేస్తుంది. తమ వెబ్సైట్ ద్వారా జరిగే బుకింగ్స్‌పై ఆయా హోటల్స్ నుంచి 25 శాతం కమీషన్ తీసుకుంటుంది. సాఫ్ట్‌బ్యాంకు సహా పలువురు ఇన్వెస్టర్ల నుంచి గత సెప్టెంబర్‌లో బిలియన్ డాలర్లను (రూ.7,000 కోట్లు) ఓయో సమీకరించింది. దీని ప్రకారం సంస్థ విలువ 5 బిలియన్ డాలర్లు (రూ.35,000 కోట్లు) అని అంచనా. 1.2 బిలియన్ డాలర్లను భారత్, చైనాలో కార్యకలాపాల విస్తరణపైనే కంపెనీ వెచ్చించింది. భారత్‌లో 180 నగరాల్లో ఓయో 1,43,000 గదులను నిర్వహిస్తోంది. గతేడాది నవంబర్‌లో చైనాలో కూడా కార్యకలాపాలు ప్రారంభించి.. ప్రస్తుతం 265 నగరాలకు విస్తరించింది. 1,80,000 గదులను నిర్వహిస్తోంది. గదుల సంఖ్యా పరంగా టాప్ టెన్ బ్రాండ్లలో ఓయో కూడా ఒకటి. తన భారీ విస్తరణ కోసం త్వరలో మరిన్ని నిధులను సమీకరించే ఆలోచనతోనూ ఉంది. భారత్‌తో పోలిస్తే చైనాలో మరింత విస్తరించేందుకు భారీ అవకాశాలున్నాయని అగర్వాల్ తెలిపారు. చైనాలో 3.5 కోట్ల అన్ బ్రాండెడ్ హోటల్ గదులు అందుబాటులో ఉండగా, అదే భారత్‌లో అందుబాటులో ఉన్న అన్‌బ్రాండెడ్ గదులు 43 లక్షలేనని పేర్కొన్నారు. ఇండిగో మాజీ ప్రెసిడెంట్ అయిన ఆదిత్యఘోష్ను భారత్, దక్షిణాసియా ప్రాంతాల్లో ఓయో సంస్థకు సీఈవోగా ఇటీవలే నియమించుకున్న విషయం గమనార్హం. చైనా సహా అంతర్జాతీయంగా విస్తరణపై ఘోష్ దృష్టిసారించనున్నారు. -
ఓయోలో రూ.700 కోట్ల గ్రాబ్ పెట్టుబడులు!
న్యూఢిల్లీ: ఆతిధ్య రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓయో సంస్థలో సింగపూర్ దేశానికి చెందిన రవాణా సేవలందించే సంస్థ, గ్రాబ్ రూ.700 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టనున్నది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయని, ఈ వారంలోనే ఈ డీల్ కుదరవచ్చని సమాచారం. గ్రాబ్, ఓయో కంపెనీలు తమ కీలక మార్కెట్లుగా ఇండోనేషియాను, ఆగ్నేయాసియాలను గుర్తించాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో ఇండోనేషియాలో కార్యకలాపాలు ప్రారంభించిన ఓయో... విస్తరణలో భాగంగా 10 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నామని అప్పుడే వెల్లడించింది. ఇండోనేషియాలో 35 నగరాలకు కార్యకలాపాలు విస్తరించనున్నామని ఓయో వ్యవస్థాపకులు, సీఈఓ కూడా అయిన రితేశ్ అగర్వాల్ గతంలో పేర్కొన్నారు. -
పేటీఎం, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీలకు భారీ నష్టాలు
సాక్షి, న్యూఢిల్లీ : పేటీఎం, ఫ్లిప్‌కార్ట్, మేక్‌మై ట్రిప్ ఇండియా, స్విగ్గీ, జొమాటో కంపెనీల పేర్లు మనం నిత్యం వింటూనే ఉంటాం. ఈ కంపెనీలు తమ తమ రంగాల్లో ప్రసిద్ధి చెందిన దిగ్గజ కంపనీలే. కనుక ఈ కంపెనీలకు భారీ ఎత్తున లాభాలు వస్తాయని ఎవరైనా అనుకోవచ్చు. కానీ అది పొరపాటు. ప్రతి ఏటా ఈ కంపెనీలకు నష్టాలే వస్తున్నాయి. ఈ కంపెనీలన్నింటికీ కలిపి ఉమ్మడిగా ఈ ఏడాదిలో అంటే, ఆర్థిక సంవత్సరం ముగిసే 2018, మార్చి నెల నాటికి 7,800 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఒక్క జొమాటో కంపెనీకి మినహా మిగతా అన్ని కంపెనీలకు గతేడాదితో పోలిస్తే భారీ నష్టాలు సంభవించాయని బిజినెస్ రీసర్చ్ ఫ్లాట్‌ఫామ్ ‘టోఫ్లర్’ డేటా తెలియజేస్తోంది. పేటీఎం, దాని మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్లు, పేటీఎం నుంచి విడిపోయిన పేటీఎం మాల్ కంపెనీలకు కలిపి ఈ ఏడాది 3,393 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. మార్కెట్ వృద్ధి రేటు గణనీయంగా పెరిగే వరకు ఈ కంపెనీల పరిస్థితి ఇంతే. అది ఇప్పట్లో జరుగుతుందన్న సూచనలు లేవు. లాభాల మీద దృష్టిని కేంద్రీకరించకుండా, ఖర్చులకు వెరియకుండా ముందుగా మార్కెట్లోకి దూసుకపోయి, మంచి గుర్తింపు పొందడమే లక్ష్యంగా ఈ కంపెనీలు పనిచేయడంతో లాభాల జాడ కనిపించడం లేదని నిపుణులు తెలియజేస్తున్నారు. అమెజాన్‌తో పోలిస్తే ఫ్లిప్‌కార్ట్ అతి పెద్దదిగా గుర్తింపు పొందింది. అలాగే ఉబర్ కన్నా ఓలా పెద్దిదిగా ఎదిగింది. పోటీ కంపెనీలను అధిగమించి మార్కెట్లోకి తాము దూసుకుపోవాలనే తాపత్రయం కారణంగానే ఈ కంపెనీలు మార్కెట్లో మంచి పేరు తెచ్చుకున్నాయిగానీ, పేరుకు తగ్గట్లు లాభాలు గడించలేకపోయాయి. పైగా పెద్ద ఎత్తున నష్టాలను పోగుచేసుకున్నాయ. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుదారులు ఉండడం వల్ల ఎంత నష్టాలొచ్చినా ఈ కంపెనీలు ప్రస్తుతం మనుగడ సాగించకలుగుతున్నాయి. ఆసియా నుంచి కొత్త తరానికి చెందిన ‘బైడు, టెన్సెంట్, సాఫ్ట్‌బ్యాంక్’ పెట్టుబడిదారులు రావడం ఈ సంస్థలకు కలిసి వస్తోంది. (ఫ్లిప్‌కార్ట్ బిన్నీ రాజీనామా!!) ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ఓయో, ఓలా కంపెనీలు, అమెజాన్‌కు పోటీగా డిస్కౌంట్లతో ముందుకు పోయినంత కాలం ఈ కంపెనీల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ‘ఎవరెస్ట్’ గ్రూపునకు చెందిన కన్సల్టింగ్, మార్కెటింగ్ పరిశోధనా సంస్థ ఉపాధ్యక్షుడు యుగల్ జోషి హెచ్చరించారు. ఎక్కడోచోట లాభాలకు బాట వేయకపోతే కంపెనీలతోపాటు పెట్టుబడిదారులు దారుణంగా మునిగిపోతారని నిపుణులు చెబుతున్నారు. -
కుర్రాళ్లోయ్! గుర్రాలోయ్!!
బిన్నీ, సచిన్... అంతర్జాతీయ కంపెనీకి గుడ్‌బై చెప్పి... ఆ కంపెనీకే పోటీ అయ్యారు. భారీ ఈ–కామర్స్ సామ్రాజ్యాన్ని నిర్మించారు. భవీష్... పనితో ప్రేమలో పడిపోయాడు. రోజుకు పద్దెనిమిది గంటలు దాంతోనే!! రొమన్ సైనీ... 21 ఏళ్లకే మెడిసిన్... తర్వాత ఏడాదికే సివిల్స్... అసిస్టెంట్ కలెక్టర్‌గా ఉద్యోగం!. అయినా... కిక్కు లేదని ఉద్యోగానికి గుడ్‌బై చెప్పేశాడు.!!రితేష్... కాలేజీ చదువు మధ్యలో వదిలేసి... దేశ మంతా తిరిగాడు. ఆ అనుభవాలతో.. 18 ఏళ్లకే కంపెనీ పెట్టేశాడు. నందన్... ఓ అద్భుతమైన ఐడియాతో ఫెయిలయ్యాడు. అక్కడ నేర్చుకున్న పాఠాలతో మరో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. విజయం సాధించాడు. అభిరాజ్ భాల్, వరుణ ఖైతాన్... చక్కని విదేశీ ఉద్యోగాన్ని వదిలేశారు. ఏం చేయాలో తేల్చుకోకుండానే ఇండియాకు తిరిగొచ్చేశారు. వచ్చాక తొలి ప్రయత్నం ఫెయిల్యూరే. మరో ప్రయత్నం భారీ సక్సెస్ ఇచ్చింది. ఇక శ్రీనుబాబు ఫ్రమ్ శ్రీకాకుళం... పాతికేళ్లకే యంగ్ సైంటిస్ట్. అది అందుకునేటపుడు పుట్టిన ప్రశ్న... కంపెనీగా పరిష్కారమయింది. కనిక... ఆలోచనలెప్పుడూ నింగిలోనే. 18 ఏళ్లకే విమాన సంస్థలో ఉద్యోగం. కానీ 22 ఏళ్లకే క్యాన్సర్. డాక్టర్లు కష్టమన్నారు. ఆమె ధైర్యం వదల్లేదు. శరీరం కీమోథెరపీని తట్టుకుంది. మనసు మాత్రం ఓ ఐడియాతో ఆకాశాన్ని అందుకుంది. ఇంతకీ ఎవరు వీళ్లంతా..? ఫ్లిప్‌కార్ట్... ఓలా... అన్అకాడెమీ... ఓయో... స్విగ్గీ... అర్బన్ క్లాప్... పల్సస్... జెట్ సెట్ గో... వంటి దిగ్గజాల ఆవిష్కర్తలు. ‘చేయకుండా ఉండటం కంటే... నచ్చింది చేసి ఫెయిలయినా ఓకే’ అనే సిద్ధాంతాన్ని మనసా వాచా నమ్మిన ఈ నాటి యువతకు ప్రతినిధులు. వీళ్లేకాదు!! పెద్దగా పెట్టుబడి లేకపోయినా.. స్నేహితులే సహోద్యోగులుగా స్టార్టప్‌లు పెట్టి విజయం సాధించిన యువతే నేటి భారత బ్రాండ్ అంబాసిడర్లు. చేసే పనేదో సీరియస్‌గా చెయ్యాలన్నదే వీరి సూత్రం. కాకపోతే వీరికి కలిసొస్తున్నదల్లా... రోజురోజుకూ మారిపోతున్న టెక్నాలజీ. దాని సాయంతోనే వీరు కొత్త సామ్రాజ్యాలు నిర్మిస్తున్నారు. తమ జీవితాన్ని మార్చుకోవటమే కాదు... భారత ముఖచిత్రాన్నే మారుస్తున్నారు. అయితే పైన ప్రస్తావించిన కంపెనీలన్నిటికీ ఒక ప్రత్యేకత ఉంది. అవన్నీ అగ్రిగేటర్లు. అంటే... అవసరం తీర్చేవారిని– అవసరం ఉన్నవారిని కలిపే మధ్యవర్తులన్న మాట. వీటికంటూ సొంత ఉత్పత్తులు, తయారీ కేంద్రాలు వంటివేవీ ఉండవు. ఉన్నదల్లా టెక్నాలజీయే. దాంతోనే ఇవి కొనుగోలుదార్లకు ఎలాంటి బాదరబందీ లేకుండా చేస్తున్నాయి. వారికీ, విక్రయదార్లకు మధ్య తాము ఉంటూ... అమ్మేవారికి సొమ్ము, కొనేవారికి సేవలు సరిగా దక్కేలా చేస్తున్నాయి. మొత్తంగా... ఓ అద్భుతమైన వ్యాపారాన్ని సృష్టిస్తున్నాయి. అలాంటి కొన్ని కంపెనీల సారథుల కథలే ఇవి... పదేళ్లు... 1.4 లక్షల కోట్లు!! పనిచేస్తున్న కంపెనీ... ఓ అంతర్జాతీయ దిగ్గజం. చేతిలో పెట్టుబడేదీ లేకుండా ఆ దిగ్గజాన్ని ఢీకొట్టాలంటే!!. ఎవరైనా నవ్విపోతారు.!!. సచిన్ బన్సల్– బిన్నీ బన్సల్ ఊరూ, పేరూ కలిసినా... ఎలాంటి బంధుత్వమూ లేదు. చండీగఢ్‌లో పుట్టి ఇద్దరూ అక్కడే చదువుకున్నారు. ఐఐటీ ఢిల్లీలో కలిశారు. ఇంజినీరింగ్ పూర్తయ్యాక ఐటీ రాజధాని బెంగళూరుకొచ్చారు. సచిన్ అమెజాన్‌లో చేరాడు. బిన్నీ బన్సల్ మాత్రం గూగుల్‌లో ఉద్యోగానికి రెండుసార్లు దరఖాస్తు చేసి ఫెయిలయ్యాడు. చివరకు తానూ అమెజాన్లోనే చేరాడు. కొన్నాళ్లు పనిచేశాక ఇద్దరికీ ఒకటే అనిపించింది. తాము పనిచేస్తున్న అమెజాన్ స్థాయిలో దేశీ ఈ–కామర్స్ కంపెనీలేవీ సేవలందించటం లేదని!!. అంతే... సేవింగ్స్‌గా దాచుకున్న రూ.2 లక్షలూ పెట్టి... తమ ఫ్లాట్‌లోనే 2007లో ‘ఫ్లిప్‌కార్ట్’ను ఆరంభించారు. పుస్తకాలు విక్రయించేవారిని లిస్ట్ చేసి... అమెజాన్ మాదిరే ఆరంభంలో తామూ ఆన్లైన్లో పుస్తకాలు విక్రయించారు. దాదాపు ఏడాదిన్నర పాటు ఇరువురి తల్లిదండ్రులూ నెలకు రూ.10 వేల చొప్పున ఇచ్చి ఆదుకున్నారు. అది ఆరంభం. తరవాత బుక్స్ నుంచి ఇతరత్రా వస్తువులమ్మే సెల్లర్లను తమ సైట్లో లిస్ట్ చేయటం మొదలెట్టారు. అమెజాన్‌కు పోటీగా దేశీ ఈ–కామర్స్ సంస్థ ఒకటి రూపుదిద్దుకుంటున్నది తెలిసి... విదేశీ ఇన్వెస్టర్లు ముందుకొచ్చారు. వరసగా ఇన్వెస్ట్ చేయటం మొదలెట్టారు. కంపెనీ విలువ పెరిగింది. ఇద్దరూ బిలియనీర్లయ్యారు. ఈ మధ్యే ఫ్లిప్‌కార్ట్‌ను రూ.1.4 లక్షల కోట్ల విలువతో అమెరికన్ దిగ్గజం వాల్‌మార్ట్ సొంతం చేసుకుంది. ‘‘మా కాన్సెప్ట్ కొత్తదేమీ కాదు. కాకపోతే ఈ–కామర్స్‌లో నాణ్యమైన సేవలందించటమే మా ప్రత్యేకతగా పనిచేశాం. దానిపైనే దృష్టిపెట్టాం. అందుకే నిలబడ్డాం’’ అంటారు బన్సల్ ద్వయం. క్యాబ్ డ్రైర్‌తో గొడవొస్తే...? ఉదయం ఏడుకు లేస్తే రాత్రి ఒంటి గంట వరకూ ఏదో ఒక పనిచేస్తూనే ఉంటాడు భవీష్ అగర్వాల్. ఖాళీ దొరికితే సైక్లింగ్ చేస్తాడు. స్క్వాష్ ఆడతాడు. సినిమాలకు, మొబైల్ గేమ్స్‌కు మాత్రం చాలా దూరం. పుట్టింది లుథియానాలో. 2008లో ఐఐటీ బోంబే నుంచి పట్టా అందుకున్నాక మైక్రోసాఫ్ట్‌లో మంచి ఉద్యోగమొచ్చింది. రెండేళ్లే పని చేశాడు. కంప్యూటర్‌కు అతక్కుపోయే ఆ ఉద్యోగంలో కిక్కు లేదనిపించింది. రాజీనామా చేసేశాడు. ముంబయిలో వెబ్సైట్ పెట్టి... ఆన్లైన్లో వివిధ ట్రావెల్ కంపెనీల టూర్ ప్యాకేజీలను విక్రయించటం మొదలెట్టాడు. ‘ట్రావెల్ ఏజెంటుగా మిగిలిపోతావేమో’ అన్నారు అమ్మానాన్నా. ‘పర్వాలేదు కదా!!’ అనుకున్నాడు. ఓసారి బెంగళూరు నుంచి క్యాబ్‌లో బండిపురా నేషనల్ పార్క్‌కు వెళుతున్నాడు భవీష్. దార్లో ఆపేసిన క్యాబ్ డ్రైవర్... ముందు మాట్లాడింది తక్కువని, కాస్త ఎక్కువివ్వాలని పేచీ పెట్టాడు. అలా దార్లో బేరమాడటం భవీష్కు నచ్చలేదు. కుదరదన్నాడు. దీంతో డ్రైవరు దార్లోనే భవీష్ను వదిలేసి వెళ్లిపోయాడు. ఆ క్యాబ్ డ్రైవరుపై ఫిర్యాదు చేసి, పోరాడమని సలహా ఇచ్చారు కొందరు. దాంతో లాభం లేదని గ్రహించాడు. ఇంకెవరికీ ఇలాంటివి జరగకుండా టెక్నాలజీతో పరిష్కారం చూపించాలనుకున్నాడు. అలా పుట్టిందే... ఓలా!!. 2010లో మిత్రుడు అంకిత్ భాటి తోడవటంతో... ఓలా కొత్త మలుపు తిరిగింది. భారీ పెట్టుబడులొచ్చాయి. ఈ కంపెనీ విలువ... దాదాపు రూ.50 వేల కోట్లు!!. క్యాన్సర్ ఇచ్చిన ధైర్యం... ‘జెట్ సెట్ గో’ ఏ విమానంలోనైనా చూడండి! ఎక్కువ మంది అమ్మాయిలే ఉంటారు. గ్రౌండ్ స్టాఫ్‌లోనూ ఆడవాళ్లే. కానీ ఆ విమాన సంస్థల అధిపతులో? అంతా మగవారే. అదీ పరిస్థితి. అలాంటి రంగంలో స్థిరపడాలనుకుంది కనిక టేక్రీవాల్. 18 ఏళ్లకు ఎయిర్వేస్లో ఉద్యోగం వచ్చింది. కొన్నాళ్లు చేశాక ఎంబీఏ కోసం యూకే వెళ్లింది. కానీ ఎంబీఏ పూర్తవుతూనే 2011లో ఆమెకు క్యాన్సర్ అని తేలింది. ఓ డాక్టర్‌ను కలిసింది. ‘నీకింకా కొన్నిరోజులే మిగిలున్నాయి’ అన్నాడాయన. కానీ ఆమె ముందు ఆ క్యాన్సరే ఓడిపోయింది.‘‘అది వరమో, శాపమో అని చెప్పను. నా జీవితంలో అదో క్లిష్టమైన దశ. చాలా ధైర్యాన్ని, ఖాళీ సమయాన్ని ఇచ్చిన దశ’’ అంటారు కనిక. అప్పట్లో దొరికిన ఖాళీ సమయాన్ని పూర్తిగా భవిష్యత్ ప్రణాళిక కోసం కేటాయించింది. అక్కడే.. ఛార్టర్డ్ విమానాలను, హెలికాప్టర్లను అద్దెకిచ్చే ‘జెట్‌సెట్‌గో’ రూపుదిద్దుకుంది. సొంత విమానాలు, హెలికాప్టర్లు ఉన్న వారితో ఓ నెట్‌వర్క్‌ను రూపొందించి... అద్దెకు కావాలనుకున్న వారితో సంధానించటమే ఈ సంస్థ పని. అంటే.. ‘గగనతల ఓలా’ అన్నమాట. తల్లిదండ్రులు ఈ ఆలోచనకు ససేమిరా అన్నారు. విమానయాన రంగంలో మహిళలు రాణించలేరన్నారు. కానీ క్యాన్సర్‌ను గెలిచిన ఈ మొండిఘటం వినలేదు. పునీత్ దాల్మియా, యువరాజ్ సింగ్ వంటి వారిని కలిసింది. 2014లో ఆరంభించిన కొన్నాళ్లకే వారు పెట్టుబడులు పెట్టడంతో జెట్ సెట్‌గో నిలదొక్కుకుంది. రెండేళ్లు తిరక్కుండానే లాభాల్లోకీ వచ్చింది. కాలేజీ చదువు మధ్యలో ఆపేసి... రితేష్ అగర్వాల్ పుట్టింది ఒడిశాలోని కటక్‌లో. స్కూల్ చదువు అక్కడే సాగింది. కాలేజీలో అడుగు పెట్టాడు కానీ... అక్కడ ఇమడలేకపోయాడు. క్లాసురూమ్‌లో కన్నా బయటే నేర్చుకోవాల్సింది చాలా ఉందనుకున్నాడు. చదువు మానేశాడు. గెస్ట్‌హౌస్‌లు, టూరిస్ట్ లాడ్జ్‌లు, బడ్జెట్ హాస్టళ్లను ఆన్లైన్లో లిస్ట్ చేయడానికి ‘ఓరావెల్’ పేరిట ఓ వెబ్సైట్ ఆరంభించాడు. దానికోసం దేశమంతా తిరిగాడు. చాలాచోట్ల బసచేశాడు. ఆయా హోటల్స్ లిస్ట్ చేస్తున్నపుడు... అక్కడ తను ఉండటానికి ఫ్రీగా గది ఇవ్వాలని అడిగేవాడు. ‘‘ఎవ్వరూ ఇవ్వలేదు. నేను వాళ్ల వ్యాపారాల్ని లిస్ట్ చేస్తున్నందుకు వాళ్లు ఆ మాత్రం కూడా ఇవ్వకపోవటం ఆశ్చర్యమనిపించింది’’ అంటాడు రితేష్. అయితే ఇలా దేశమంతా తిరగటంలో రితేష్‌కు పలు విషయాలు తెలిసొచ్చాయి. వాటిలో మొదటిది... చిన్న హోటళ్లు, బడ్జెట్ హోటళ్లలో గదులు ఏమాత్రం బాగులేవని.! ‘‘ఆన్లైన్లో హోటల్ గదిని ముందుగా బుక్ చేసుకోవాలనుకుంటే అది ఎలా ఉంటుందో తెలీదు. సిబ్బంది ఎలాంటివారో, భోజనం ఎలా ఉంటుందో... ఏమీ తెలీదు. ఇవన్నీ చూశాక... బడ్జెట్ హోటల్స్‌లో స్టార్ హోటల్ అనుభవాన్నిస్తే విజయం తథ్యమనిపించింది. ఇదే ఓయోకు బీజం వేసింది’’ అంటారు రితేష్. చిన్న బడ్జెట్ హోటల్స్‌తో ఒప్పందం చేసుకొని... వాటిలో కొన్ని గదుల్ని ఏసీతో, అందంగా, ఆరోగ్యకరంగా మార్చడం చేశాడు. ఫ్రీ వై–ఫై, టీవీ, బ్రేక్ ఫాస్ట్ ఏర్పాట్లు చేశాడు. ఆన్లైన్లో ఫోటోలు కూడా ఉండటంతో... వాటికి ఆదరణ పెరిగింది. ఓయో రూమ్స్‌తో మొదలై... ఐదేళ్లలో ఓయో టౌన్హౌస్, ఓయో హోమ్స్, ఓయో సిల్వర్ కీ వంటి పలు విభాగాల్లోకి విస్తరించారు. ప్రస్తుతం చైనా, మలేషియా, నేపాల్లోనూ ఓయో సేవలు అందిస్తోంది. అంతర్జాతీయ హోటల్ కంపెనీలతో సహా పలు ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఓయోలో పెట్టుబడులు పెట్టాయి. ఇపుడు ఓయో విలువ... బిలియన్ డాలర్లపైనే! అంటే రూ.6,800 కోట్లపైమాటే. ఆ ఓటమి... చాలా నేర్పింది! నందన్ రెడ్డిది కడప. శ్రీహర్ష మాజేటిది విజయవాడ. ఒకరు ఎమ్మెస్సీ.. మరొకరు ఇంజినీరింగ్. కాకపోతే ఇద్దరూ చదివింది మాత్రం బిట్స్ పిలానీలోనే. శ్రీహర్ష ఇంజినీరింగ్ చదువుతుండగానే క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి ఉద్యోగానికి సెలక్ట్ అయ్యాడు. ఎవరైనా చేరేవారేమో!! కానీ శ్రీహర్ష వద్దనుకున్నాడు. క్యాట్ రాసి ఐఐఎం కోల్‌కతాలో చేరాడు. పూర్తవుతూనే లండన్‌లోని ఓ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ పిలిచింది. లండన్ బాగుంటుందని వెళ్ళాడు. సిటీ నచ్చింది కానీ అక్కడి ఉద్యోగం నచ్చలేదు. రెండేళ్లు చేసి వెనక్కి వచ్చేశాడు. స్నేహితుడు నందన్ కలిశాడు. నందన్ అప్పటికే చిన్న వ్యాపారాల్లో ప్రయత్నాలు చేస్తున్నాడు. ‘టెక్నాలజీ, ఉద్యోగాలు, లాజిస్టిక్స్’ మూడూ కలిసి ఉండే కంపెనీని పెడదామనుకున్నారు. సొంత వెబ్‌సైట్లున్న వ్యాపారులు... డెలివరీ చేయలేక ఈ–కామర్స్ సంస్థల్లో నమోదు చేసుకుంటున్నారని గ్రహించి... వారిని, డీటీడీసీ– ఫెడెక్స్– తదితర కొరియర్ సంస్థలను కలిపేలా ‘డెమొక్రటిక్ షిప్పింగ్’కు రూపకల్పన చేశారు. దీనికోసమే 2013లో ‘బండిల్’ను ఆరంభించారు. కాకపోతే దీనికి తగ్గ టెక్నాలజీని అభివృద్ధి చేయటం వారి వల్ల కాలేదు. ఆ పనిని ఓ కంపెనీకి అప్పగించారు. అది పూర్తయ్యేసరికి ఏడాదిపైనే పట్టింది. తాము తయారు చేయదలచుకున్న ఉత్పత్తి బయటికొచ్చేసరికి మార్కెట్ పరిస్థితులు మారిపోయాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ–కామర్స్ కంపెనీలు సొంత డెలివరీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ‘‘మార్కెట్‌కు మా ఉత్పత్తి పనికిరాదని అర్థమైపోయింది. అదృష్టమేంటంటే మాకు వేరే ఉద్యోగులు లేరు. మేం తప్ప ఎవరూ ఇన్వెస్ట్ చేయలేదు కూడా. అప్పులు కూడా లేవు. ఏడాదిలోపే బండిల్‌ను మూసేశాం’’ అంటారు స్విగ్గీ ద్వయం.‘బండిల్’ ప్రయాణంలో వారికి కొన్ని విషయాలు తెలిసొచ్చాయి. దేశంలో లాజిస్టిక్ కంపెనీలు దయనీయంగా ఉన్నాయని, వాటికి టెక్నాలజీ ఏమాత్రం అందుబాటులో లేదని తెలిసింది. దీంతో 2014 సెప్టెంబర్‌లో రెస్టారెంట్లను, వినియోగదార్లను తమ సొంత డెలివరీ యంత్రాంగంతో కలుపుతూ బెంగళూరులో స్విగ్గీని ఆరంభించారు. తరవాత వారికి మరో స్నేహితుడు రాహుల్ జైమిని వారికి తోడయ్యాడు. ఇపుడు దేశంలోని 13 నగరాల్లో సేవలందిస్తున్న స్విగ్గీకి 50 లక్షల మంది కస్టమర్లున్నారు. 25 వేల రెస్టారెంట్లతో ఒప్పందాలున్నాయి. భారీగా నిధులూ వచ్చాయి. సంస్థ విలువ... దాదాపు రూ.17వేల కోట్లు!!. ఫెయిల్యూర్‌తో... గెలిచారు! కాలేజీ నుంచి స్నేహితులైన అభిరాజ్ భాల్, వరుణ్ ఖైతాన్ ఇద్దరిదీ అమెరికాలోని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌లో ఉద్యోగం. మంచి జీతం. కానీ ఇద్దరిదీ ఒకటే ఆలోచన. ఇండియాకి వెళ్లి ఏదో ఒక వ్యాపారం పెట్టాలని. ఎంత చర్చించుకున్నా ఏం వ్యాపారం పెట్టాలో మాత్రం తేల్చుకోలేకపోయారు. అలా చర్చిస్తుంటే... ఏమీ చెయ్యకుండానే మిగిపోతామని భయమేసి... 2013లో ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పి ఇండియాకు తిరిగి వచ్చేశారు. చాలా ఆలోచించిన మీదట.. బస్సులు, రైళ్లు, విమానాల్లో ఆన్‌డిమాండ్ సినిమాల్ని ప్రదర్శించే బాక్స్‌లను తయారు చెయ్యాలనుకుని... ‘సినిమాబాక్స్’ సంస్థను ఏర్పాటుచేశారు. ఆరునెలలు గడిచాయి. ఆ మార్కెట్ చాలా చిన్నదని, దాన్లో విస్తరణకు పెద్ద అవకాశాల్లేవని వారికి అర్థమైంది. అదేమీ జీవితాన్ని మార్చే టెక్నాలజీ కాదని భావించారు. బాధపడ్డా... మూసేశారు. ఇంతలో ‘బగ్గీ.ఇన్’ పేరిట రైడ్‌షేర్ సంస్థను నడుపుతున్న రాఘవ్‌చంద్ర కలిశాడు. తనదీ ఇలాంటి కథే. బగ్గీ పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో మూసేశాడు. అప్పుడు వీళ్ల దృష్టి దేశంలో అసంఘటితంగా ఉన్న వృత్తి పని కార్మికులపై పడింది. ప్లంబర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, యోగా ట్రెయినర్... ఇలా ఎవరు కావాలన్నా సామాన్యులు పడుతున్న బాధలు చూశారు. వారందరినీ ఆన్‌లైన్‌లోకి తెద్దామనుకున్నారు. ఈ ఆలోచనను చాలామందితో పంచుకున్నారు. అంతా నవ్వేశారు. అభిరాజ్, వరుణ్, రాఘవ్ మాత్రం ఎవరిమాటా వినలేదు. టెక్నాలజీ తోడుగా వృత్తి పనివాళ్లందరినీ ఒక వేదికపైకి తెస్తూ.. ‘అర్బన్‌క్లాప్’ను ఏర్పాటు చేశారు. ‘అవసరం నుంచి పుట్టిన ఏ ఆలోచనకైనా తిరుగుండదు’ అనే మాటను నిజం చేస్తూ అర్బన్ క్లాప్ ఇపుడు దేశంలోని ప్రధాన నగరాలన్నిటా విస్తరించింది. వృత్తి నిపుణుల వివరాలు ఇవ్వటానికే పరిమితం కాకుండా... మొదటి నుంచీ దాన్ని తగిన ఆదాయాన్నిచ్చే వ్యాపారంగా మార్చటానికి ప్రయత్నించారు. ఫలితం... రతన్ టాటా దీన్లో పెట్టుబడి పెట్టారు. అంతేకాదు! యాపిల్ సీఈఓ టిమ్‌కుక్ ఇండియాకు వచ్చినపుడు వీరిని కలిసి అర్బన్‌క్లాప్ సేవల్ని అడిగి తెలుసుకున్నారు కూడా. కంపెనీ విలువ ఇదమిత్థంగా తెలియకపోయినా... ఇప్పటికే ఇది దాదాపు రూ.40 కోట్ల నిధుల్ని సమీకరించింది. కలెక్టరు గిరీ... కాదనుకున్నాడు!! ఏ యువకుడైనా ఇలా ఉండాలి అని రోమన్ సైనీని చూపించొచ్చు!! ఇలా ఉండకూడదు అని కూడా సైనీని కొందరు చూపిస్తారేమో!! ఎందుకంటే మెడిసిన్ చదివిన వెంటనే... 22 ఏళ్లకే సివిల్స్ రాసి సెలక్టయిపోయాడు. శిక్షణ పూర్తయ్యాక మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లా సహాయ కలెక్టర్‌గా ఉద్యోగం కూడా వచ్చేసింది. పాతికేళ్లు కూడా రాకుండానే ఇలా సెటిలైపోతే ఇంకేం కావాలి..? సైనీని మాత్రం అసంతృప్తి తొలిచేస్తోంది. ఇంకేదో చెయ్యాలనే తపన కుదురుగా ఉండనివ్వటం లేదు. అంతే!!. ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు. ఇంట్లో వాళ్లు వద్దన్నారు. వినలేదు. తనకు మెడిసిన్, సివిల్ సర్వీస్ రాసిన అనుభవం ఉంది కనక వైద్యులు, ప్రోగ్రామర్లు, సివిల్ సర్వెంట్లు కావాలనుకున్న వారికి... పాఠాలు చెప్పి యూట్యూబ్‌లో పెట్టడం మొదలెట్టాడు. ఈ లెక్చర్లు చాలా మందికి పనికొచ్చాయి. ఓ పది మంది ఐఏఎస్‌లు తయారయ్యారు. తను ఉద్యోగం చేస్తే... ఒకడే! కానీ పది మంది ఐఏఎస్‌లను తయారు చేశాడు!! ఆ కిక్కు.. సైనీకి నచ్చింది. స్నేహితుడు గౌరవ్ ముంజల్‌తో కలిసి 2015 డిసెంబరు 15న లాంఛనంగా అన్అకాడెమీని ఆరంభించాడు. దానిపేరిట వందల వీడియోలు అప్లోడ్ చేశారు. తరవాత విద్యార్థులు, విద్యా నిపుణులు, లెక్చరర్లు తమ సొంత పాఠాల్ని ఎవరికి వారు అప్లోడ్ చేసేలా ఏర్పాట్లు చేశాడు. వీళ్లందరూ అందించే కంటెంట్... మారుమూల గ్రామాలకు చేరాలన్నది రోమన్ సైనీ ఆశయం. నాణ్యమైన విద్యకు దూరంగా ఉన్న పలు గ్రామాల్లోని విద్యార్థులు... నిపుణులైన విద్యావేత్తల తాలూకు పాఠాల్ని ఇలా ఆన్లైన్ ద్వారా అందుకోవచ్చన్నది తన ఆలోచన. ఈ మధ్యే అన్‌అకాడెమీలో అంతర్జాతీయ సంస్థలు రూ.15 కోట్లు పెట్టుబడి పెట్టాయి. సంస్థ విలువ దాదాపు రూ.75–80 కోట్లు!!. ఏ డాక్టర్నైనా కన్సల్ట్ చేయొచ్చు!! సతీష్ కణ్ణన్, దీనదయాళన్ ఇద్దరూ ఐఐటీ మద్రాస్‌లో స్నేహితులు. 2012లో ఇంజినీరింగ్ పూర్తయి బయటికొచ్చాక సతీష్ పుణెలోని ఫిలిప్స్ హెల్త్‌కేర్‌లో చేరాడు. దీనదయాళన్ మాత్రం ఐఐటీలోని ఇన్నోవేషన్ సెంటర్లో డయాబెటిక్ రెటినోపతిని కనుక్కునే పరికరం తయారీలో మునిగిపోయాడు. ఏడాది ఉద్యోగం చేసిన సతీష్... ఉద్యోగంలో భాగంగా హెల్త్‌కేర్ సేవల్ని బాగా గమనించాడు. స్పెషలిస్టు వైద్యుల సేవలు సామాన్యులకు అందటం చాలా కష్టమవుతోందని తెలుసుకున్నాడు. దీన్ని టెక్నాలజీ సాయంతో అధిగమించాలని భావించి... దీనదయాళన్‌తో చెప్పాడు. ఇద్దరూ కలిసి 2013లో పాసర్జ్ టెక్నాలజీస్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి తమ ఆలోచనను అమల్లోకి తేవటంపై దృష్టిపెట్టారు.దాదాపు రెండేళ్ల కృషి తరవాత వారిద్దరూ డాక్స్‌యాప్‌ను అభివృద్ధి చేయగలిగారు. 2015లో డాక్స్‌యాప్‌ను ఆరంభించారు. స్పెషలిస్ట్ వైద్యులు, పేషెంట్లను కలిపే యాప్ ఇది. చాట్ లేదా కాల్ ఆధారంగా ఎవరైనా సరే... దేశంలోని ఏ స్పెషలిస్టు వైద్యుడినైనా 30 నిమిషాల్లోపే సంప్రతించవచ్చు.కన్సల్టేషన్, మందుల డెలివరీ, ఇంటిదగ్గరే ల్యాబ్‌టెస్టుల వంటి సేవలందిస్తున్న డాక్స్ యాప్‌లో గైనిక్, సైక్రియాట్రీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, కార్డియాక్, ఆంకాలజీ, న్యూరో, ఇన్ఫెర్టిలిటీ, పీడియాట్రీ, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ వంటి విభాగాల్లో 1500కు పైగా వైద్యులున్నారు. ఇప్పటికే సంస్థలో పలు ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు దాదాపు రూ.50 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టాయి. లా చదివి... ఆరోగ్య రంగంలోకి!! నయ్యా సగ్గి గురించి ఆమె తల్లికెప్పుడూ ఆందోళనే. ఎందుకంటే స్కూలు స్థాయిలో సగ్గి మార్కులు అంతంత మాత్రంగానే ఉండేవి. ‘పెద్దయ్యాక ఏమవుతావో’ అని తల్లి ఎప్పుడూ బెంగపడుతూనే ఉండేది. ముంబైకి చెందిన సగ్గి... అందరు పిల్లల్లానే ఆ వయసులో ఎలాంటి భవిష్యత్ ప్రణాళికలూ లేకుండానే పెరిగింది. కాకపోతే అప్పుడప్పుడూ నేషనల్ లా స్కూల్లో చదివే తన సోదరి చెప్పే మాటలు మాత్రం ఆమెను ఆకర్షించేవి. ఒక దశలో... తానూ బెంగళూరులోని నేషనల్ లా స్కూల్లో చదవాలని ఫిక్సయిపోయింది. తల్లి ఆందోళన పెరిగిపోయింది. ‘తరవాత బాధ పడతావేమో!’ అని హెచ్చరించింది. సగ్గి తను గనక ఒక నిర్ణయం తీసుకుంటే... ఇక ఎవరి మాటా వినే ప్రసక్తే లేదు. కష్టమైన లా ఎంట్రన్స్ నెగ్గి... ఎన్‌ఎల్‌ఎస్‌లో సీటు సంపాదించింది. అదిగో... అక్కడే ఆమె జీవితం మలుపు తిరిగింది. ‘అదంతా వేరే ప్రపంచం. ఆడుతూ పాడుతూ గడిచిపోయింది. కెజి బాలకృష్ణన్ వంటి న్యాయ మూర్తులతో పాటు విదేశీ న్యాయ నిపుణులనూ కలిసే అవకాశం దక్కింది’ అంటారామె. చదువుతున్నపుడే స్వచ్ఛంద సంస్థ ‘ప్రథమ్’ కోసం పనిచేసింది సగ్గి. అదిగో... ఆ తపనే ఆమెకు ప్రతిష్ఠాత్మక ఫుల్బ్రైట్, హార్వర్డ్ స్కాలర్షిప్లు తెచ్చిపెట్టింది. హార్వర్డ్‌లో నాలుగేళ్లూ ఇట్టే గడిచిపోయాయి. ఆరోగ్య రంగంలో కొత్త ఆవిష్కరణలు, వాటిని భారీస్థాయికి తీసుకెళ్లటం వంటి అంశాలపై ఆమె ప్రాజెక్టు చేసింది. తరవాత ఇండియాకు తిరిగొచ్చింది. ‘ఏం చేసినా ఒక తరాన్ని ప్రభావితం చేయగలగాలి’ అనుకునే సగ్గి.. తన స్నేహితులు తల్లి కాబోయేటపుడు సరైన సమాచారం, ఉత్పత్తులు దొరక్క పడుతున్న ఇబ్బందులు గమనించింది. న్యూక్లియర్ కుటుంబాల కారణంగా... ఇంటర్నెట్లో టూర్ ప్యాకేజీలు, సినిమా టికెట్లు కూడా బుక్ చేసే తల్లిదండ్రులు... పిల్లల విషయంలో మాత్రం సరైన సలహా పొందలేకపోతున్నారని గ్రహించింది. పాత స్నేహితుడు మొహిత్కుమార్తో అన్నీ చర్చించింది. అదిగో... అక్కడే ‘బేబీ చక్ర’ రూపుదిద్దుకుంది. కాబోయే తల్లిదండ్రుల నుంచి.. బిడ్డను కన్న తల్లిదండ్రుల వరకూ వారికి కావాల్సిన సలహాలు, సూచనలు నిపుణుల ద్వారా ఇప్పిస్తూ... వారికి మార్గ దర్శకత్వం వహించటమే బేబీ చక్ర పని. అంతేకాదు. బేబీ ఉత్పత్తులు, ఇతరత్రా సర్వీసులు అందించేవారు కూడా దీన్లో లిస్టయ్యారు. మొత్తమ్మీద పిల్లల జీవితానికి కావాల్సిన అన్నిటినీ సంస్థ అందిస్తోంది. ఇటీవలే రెండు దశలుగా నిధులు కూడా వచ్చాయి. తొలినాళ్లలోనే ముంబై ఏంజిల్స్ పెట్టుబడి పెట్టగా... తరవాత విదేశీ నిధులొచ్చాయి. కాకపోతే ఇప్పటికీ సగ్గి తల్లికి కుమార్తె విషయంలో ఆందోళనే. వారానికోసారి ఫోన్ చేసి... ‘‘బేబీ చక్రలో కొత్తగా ఏం వచ్చాయి?’’ అని అడుగుతుంటుంది. వ్యాపారానికి ‘పల్స్’ దొరికింది..! శ్రీనుబాబుది శ్రీకాకుళం జిల్లా పాలకొండ. రోజూ స్కూలుకు 15 కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. అక్కడే ఇంటర్ పూర్తి చేశాడు. ఏయూలో బీఫార్మ్,. ఎంటెక్ బయోటెక్నాలజీ పూర్తయింది. పీహెచ్‌డీలో భాగంగా శరీరంలోని ప్రొటీన్లను విÔó్లషించి... మధుమేహ ముప్పును ముందే కనుక్కోవటంపై పరిశోధన చేశారు. 2006లో దక్షిణ కొరియాలోని సియోల్‌లో అంతర్జాతీయ ప్రొటియం ఆర్గనైజేషన్... ఈ పరిశోధన చేసినందుకు శ్రీనుబాబుకు యంగ్‌సైంటిస్ట్ అవార్డిచ్చింది. అపుడాయన వయసు 24 ఏళ్లు. ఈ రీసెర్చ్కోసం తాను ఆంధ్రా వర్సిటీతో పాటు వారి సిఫారసుతో హైదరాబాద్‌లోని ఎన్ఐఎన్, సీసీఎంబీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పలు జర్నల్స్ చదివానని, అలాంటివి ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారాయన. చెప్పటమే కాదు! ప్రతి యూనివర్సిటీ ప్రచురించే పరిశోధన పత్రాల్ని అందరికీ అందుబాటులో ఉంచే ‘ఓపెన్ యాక్సెస్ జర్నల్’ను ఆరంభించారు కూడా. దానికి అంతర్జాతీయ సంస్థల అనుమతి పొందారు. అదే ఒమిక్స్ ఇంటర్నేషనల్‌కు నాంది. ఇక్కడ ఇంకో చిక్కుంది. ఈ జర్నల్స్‌ను ఎడిట్ చేయటానికి ఏటా ఎడిటోరియల్ బోర్డు సమావేశమవుతుంది. అంతా వివిధ రంగాల్లో నిపుణులే కావటంతో విదేశాల్లో వారికి ఆతిథ్యమివ్వటం... సమావేశం నిర్వహించటం బాగా ఖర్చుతో కూడుకున్న పని. అది ఇంకో వ్యాపారానికి నాంది పలికింది. ఎడిటోరియల్ బోర్డు సమావేశాలప్పుడు దానికి హాజరయ్యే నిపుణులతో అక్కడే సదస్సులు నిర్వహించటం మొదలెట్టారు శ్రీను బాబు. పల్సస్.కామ్ ద్వారా తాము ప్రచురించే జర్నల్స్‌ను చదివే 5 కోట్ల మంది పాఠకులకు ఆ సమాచారాన్ని చేరవేశారు. కావాల్సిన వారు ఆ సదస్సులకు హాజరు కావొచ్చన్నారు. అది ఊహించని విజయాన్నిచ్చింది. ఇపుడు ఏటా 3వేలకు పైగా సదస్సులు నిర్వహించే స్థాయికెళ్లారు. ‘ఒమిక్స్’కు ఇవన్నీ భారీ ఆదాయ మార్గాలుగా మారాయి. పరిశోధక జర్నల్స్‌ను జర్మన్, చైనీస్ తదిరత భాషల్లోకి అనువాదం చేస్తుండటంతో రెవెన్యూ బాగా పెరిగింది. టర్నోవర్ రూ.1,300 కోట్ల స్థాయికి చేరింది. ఉద్యోగుల సంఖ్య 4,800కి పెరిగింది. తాజాగా భారతీయ భాషల్లోకి ఈ జర్నల్స్‌ను అనువదించే ప్రాజెక్టుకూ శ్రీకారం చుట్టింది పల్సస్. ‘‘మన చుట్టూ వ్యాపారావకాశాలు ఉంటాయి. వాటిని చూడాలి. జనం సమస్యలకు పరిష్కారంగా ఏదైనా వ్యాపారాన్ని ఆరంభిస్తే... దానికి తిరుగుండదు’’ అంటారు శ్రీనుబాబు గేదెల. ఇవన్నీ ‘అగ్ర’గేటర్లు... అమెజాన్ ఒక్కవస్తువూ తయారు చెయ్యదు. ఏ వస్తువూ నేరుగా అమ్మదు. కానీ అమ్మేవారంతా ఈ సైట్లోనే ఉంటారు కనక ప్రపంచమంతా కొనేది అమెజాన్లోనే!! రైడ్ షేరింగ్ సంస్థ ఉబెర్దీ ఇలాంటి కథే. సొంతగా ఒక్క ట్యాక్సీ లేదు. కానీ ప్రపంచంలో అతిపెద్ద ట్యాక్సీ సర్వీస్ ఇదే! ఇటీవలే ఇది ప్రపంచ వ్యాప్తంగా 10వేల కోట్ల ట్రిప్పులను పూర్తిచేసుకుంది. ఇక సొంతగా ఒక్క హోటలూ లేని ‘ఎయిర్ బీఎన్బీ’... ప్రపంచంలోనే అతిపెద్ద హాస్పిటాలిటీ సంస్థ. ఇంటర్నెట్ దిగ్గజం, నెంబర్ వన్ వీడియో ఛానెల్ యూట్యూబ్‌కు సొంత వీడియో ఒక్కటీ ఉండదు. ఇదే అగ్రిగేటింగ్ కంపెనీల మహత్యం. అవసరం ఉన్నవారిని– ఆ అవసరాన్ని తీర్చేవారిని ఒకే వేదికపైకి తేవటమే ఇవి చేసే పని. ఇక్కడ ఇంకో గమ్మత్తు కూడా ఉంది. ఇంటర్నెట్ సాయంతో యావత్తు ప్రపంచాన్నీ ఏలుతున్న ఈ టాప్ అగ్రిగేటర్లన్నీ... అగ్రరాజ్యం అమెరికాలో పురుడు పోసుకున్నవే. అమెరికన్ కంపెనీలే!వీటి స్ఫూర్తితో భారతీయ యువత మరింత ముందుకు వెళుతోంది. ఇక్కడి స్థానిక సమస్యలకు వినూత్నమైన పరిష్కారాలు వెదుకుతోంది. చేతిలో సొమ్ము లేకున్నా వీరికి దమ్ము పుష్కలంగా ఉంది. అమ్మానాన్నలు అంబానీలు కాకున్నా... ఉన్న ఉద్యోగానికి సైతం గుడ్‌బై కొట్టేసేంత తెంపరితనమూ ఉంది. ఫ్లిప్‌కార్ట్, ఓలా వంటి యూనికార్న్‌లే కాదు. విద్యారంగంలో ఎడ్యుటర్, లెర్న్ సోషల్... రైడ్‌షేర్ రంగంలో జుగ్నూ, డ్రైవర్జ్... ట్రావెల్స్‌లో అభిబస్, రెడ్‌బస్... ఫుడ్ డెలివరీలో జొమాటో, హోలాషెఫ్... హెల్త్‌కేర్‌లో ప్రాక్టో, లైబ్రేట్... ఆతిథ్య రంగంలో నెస్ట్ ఎవే... గృహాలంకరణకు సంబంధించి లివ్ స్పేస్... లాజిస్టిక్స్‌లో లింక్, పోర్టర్... వినోద రంగంలో బుక్ మైషో... ఇవన్నీ ఆయా రంగాల్లో దేశీయంగా విజయం సాధించిన అగ్రిగేటర్లని చెప్పాలి. వీటిలో దాదాపు అన్ని కంపెనీల్లోకీ భారీగానే పెట్టుబడులొచ్చాయి. – మంథా రమణమూర్తి -
చైనాలోకి విస్తరించిన ఓయో
న్యూఢిల్లీ: ఆతిథ్య సేవల సంస్థ ‘ఓయో’ చైనాలోకి ప్రవేశించింది. విదేశాల్లో విస్తరణలో భాగంగా చైనాలోకి అడుగుపెట్టినట్లు ఓయో వ్యవస్థాపకుడు, సీఈఓ రితేశ్ అగర్వాల్ చెప్పారు. ఇప్పటికే మలేíసియా, నేపాల్‌లో విజయవంతంగా ప్రవేశించామని, చైనా తమకు మూడో దేశమని పేర్కొన్నారు. చైనాలోని 26 నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభించామని వివరించారు. హాంగ్జూ, క్సియాన్, నాన్జింగ్, గాంగ్జూ, చెంగ్డు, షెన్జెన్, కున్మింగ్ తదితర నగరాల్లో ఓయో సేవలు లభిస్తాయి. -
హైదరాబాద్‌లో ఓయో టెక్నాలజీ సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆతిథ్య రంగంలో ఉన్న ‘ఓయో’... హైదరాబాద్‌లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఈ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. వినియోగదారులు, భాగస్వాములు, ఉద్యోగుల కోసం వినూత్న ఉత్పాదనలను ఇక్కడ అభివృద్ధి చేస్తారు. వచ్చే ఏడాది చివరినాటికి ఈ డెవలప్మెంట్ సెంటర్ కోసం 300 మంది నిపుణులను కంపెనీ నియమించనుంది. ఆతిథ్య రంగాన్ని వృద్ధిపర్చడంతోపాటు మానవ వనరుల శిక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వంతో ఓయో అవగాహన ఒప్పందం కూడా చేసుకుంది. తెలంగాణ పర్యాటక శాఖ అధీనంలో ఉన్న వసతి గృహాలను నిర్వహించేం దుకు ఓయోతో ఒప్పందం కుదిరింది. దేశవ్యాప్తంగా 70,000 గదులను నిర్వహిస్తున్నట్టు ఓయో ఫౌండర్ రితేష్ అగర్వాల్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం నెలకు 10 వేల గదులు సంస్థ ఖాతాకు తోడవుతున్నాయని చెప్పారు. పాత భవనాలను ఆతిథ్యానికి అనువుగా 14 రోజుల్లో అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు తెలిపారు. నగరం, ప్రాంతం, గది స్థాయినిబట్టి చార్జీ రోజుకు రూ.750 మొదలుకుని రూ.5,000 వరకు ఉంది. -
ఇక పెళ్లికాని జంటలకు రూములిస్తారట
బెంగళూరు: ఇక పెళ్లికాని యువ జంటలకు కూడా రూములు అద్దెకు ఇస్తామని ఓయో సంస్థ ప్రకటించింది. రెండు నెలల కింద ప్రారంభించిన పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో ఇక దానిని అధికారికంగా ఆహ్వానిస్తున్నట్లు స్పష్టం చేసింది. దాదాపు దేశ వ్యాప్తంగా 200 నగరాల్లో 70 వేల గదులను అద్దెకు ఇస్తున్న ఈ సంస్థ వాటిల్లో 60శాతం గదులను పెళ్లికానీ యువజంటలకు కేటాయిస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం ప్రత్యేక సైట్, యాప్ ద్వారా కూడా వాటిని బుక్ చేసుకోవచ్చని తెలిపింది. రూమ్ కావాలని వచ్చిన వారు తమ స్థానికతకు సంబంధించిన దస్తావేజులు చూపించిన వెంటనే వారికి ఈ సౌకర్యం ఓయో కల్పించనుంది. అంతేకాకుండా.. కపుల్ ఫ్రెండ్లీ రూమ్స్ ను మెట్రో నగరాలతోపాటు ప్రముఖమైన 100 పట్టణాల్లో ప్రారంభించింది. ఓయో రూమ్స్‌ను ఓ జపాన్ టెలికం సంస్థ, ప్రముఖ ఇంటర్నెట్ సంస్థ సాఫ్ట్ బ్యాంక్ సహాయంతో ప్రారంభించారు.