
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆతిథ్య రంగంలో ఉన్న ‘ఓయో’... హైదరాబాద్‌లో టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఈ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. వినియోగదారులు, భాగస్వాములు, ఉద్యోగుల కోసం వినూత్న ఉత్పాదనలను ఇక్కడ అభివృద్ధి చేస్తారు. వచ్చే ఏడాది చివరినాటికి ఈ డెవలప్‌మెంట్ సెంటర్ కోసం 300 మంది నిపుణులను కంపెనీ నియమించనుంది.
ఆతిథ్య రంగాన్ని వృద్ధిపర్చడంతోపాటు మానవ వనరుల శిక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వంతో ఓయో అవగాహన ఒప్పందం కూడా చేసుకుంది. తెలంగాణ పర్యాటక శాఖ అధీనంలో ఉన్న వసతి గృహాలను నిర్వహించేం దుకు ఓయోతో ఒప్పందం కుదిరింది. దేశవ్యాప్తంగా 70,000 గదులను నిర్వహిస్తున్నట్టు ఓయో ఫౌండర్ రితేష్ అగర్వాల్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం నెలకు 10 వేల గదులు సంస్థ ఖాతాకు తోడవుతున్నాయని చెప్పారు. పాత భవనాలను ఆతిథ్యానికి అనువుగా 14 రోజుల్లో అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు తెలిపారు. నగరం, ప్రాంతం, గది స్థాయినిబట్టి చార్జీ రోజుకు రూ.750 మొదలుకుని రూ.5,000 వరకు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment