యూకేలో ఓయో పెట్టుబడులు | OYO recently announced plans to invest 50 million euros approximately Rs 539 crore in UK over the next three years | Sakshi
Sakshi News home page

యూకేలో ఓయో పెట్టుబడులు

Published Wed, Feb 5 2025 9:01 AM | Last Updated on Wed, Feb 5 2025 9:11 AM

OYO recently announced plans to invest 50 million euros approximately Rs 539 crore in UK over the next three years

ఆతిథ్య రంగంలో ఉన్న ఓయో తాజాగా యూకేలో సుమారు రూ.540 కోట్లు వెచ్చించనున్నట్టు తెలిపింది. ప్రీమియం హోటల్‌ పోర్ట్‌ఫోలియో విస్తరణకు వచ్చే మూడేళ్లలో ఈ మొత్తాన్ని ఖర్చు చేయనుంది. తద్వారా యూకే ఆతిథ్య రంగంలో 1,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించింది. విస్తరణలో భాగంగా దీర్ఘకాలిక లీజు, నిర్వహణ ఒప్పందాలను కుదుర్చుకుంటున్నట్టు తెలిపింది. 2018లో యూకే మార్కెట్లో అడుగుపెట్టినట్టు కంపెనీ వివరించింది. 200లకుపైగా హోటళ్లు ఓయో జాబితాలో ఉన్నాయి. యూకేలో 65 నగరాల్లో ఇవి విస్తరించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40 ప్రీమియం హోటళ్లను అందుబాటులోకి తేనున్నట్టు కంపెనీ గతంలో ప్రకటించింది. ఇందులో ఇప్పటికే 18 తెరుచుకున్నాయి.  

యూఎన్‌ గ్లోబల్‌ కాంపాక్ట్‌లో జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్‌

కార్పొరేట్ల సుస్థిర అభివృద్ధి ప్రణాళికల అమలుకు సంబంధించిన యునైటెడ్‌ నేషన్స్‌ గ్లోబల్‌ కాంపాక్ట్‌లో (యూఎన్‌జీసీ) చేరినట్లు జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌(జీఏఎల్‌) వెల్లడించింది. మానవ హక్కులు, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపరంగా యూఎన్‌జీసీ నిర్దేశించుకున్న పది సూత్రాలకు, అలాగే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు (ఎస్‌డీజీ) అనుగుణంగా తమ వ్యూహాలు, కార్యకలాపాలను నిర్వహించనున్నట్లు వివరించింది. తమ విమానాశ్రయాలన్నింటికీ యూఎస్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ లేదా ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ సర్టిఫికేషన్‌ ఉన్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి: అక్రమ జామర్స్‌తోనే కాల్‌ డ్రాప్స్‌

పర్యావరణహిత ఏవియేషన్‌లో అంతర్జాతీయంగా అగ్రగామిగా ఎదిగే దిశగా ఇదొక కీలక అడుగని జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ సీఈవో కిరణ్‌ కుమార్‌ గ్రంధి తెలిపారు. హైదరాబాద్, ఢిల్లీ, గోవా, మెడాన్‌ (ఇండొనేషియా) విమానాశ్రయాలను జీఏఎల్‌ నిర్వహిస్తోంది. అలాగే, విశాఖలోని భోగాపురం, గ్రీస్‌లోని క్రెటెలో విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తోంది. ఫిలిప్పీన్స్‌లోని మక్టాన్‌ సెబు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌కి సాంకేతిక సేవలు అందిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement