GMR
-
యూకేలో ఓయో పెట్టుబడులు
ఆతిథ్య రంగంలో ఉన్న ఓయో తాజాగా యూకేలో సుమారు రూ.540 కోట్లు వెచ్చించనున్నట్టు తెలిపింది. ప్రీమియం హోటల్ పోర్ట్‌ఫోలియో విస్తరణకు వచ్చే మూడేళ్లలో ఈ మొత్తాన్ని ఖర్చు చేయనుంది. తద్వారా యూకే ఆతిథ్య రంగంలో 1,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించింది. విస్తరణలో భాగంగా దీర్ఘకాలిక లీజు, నిర్వహణ ఒప్పందాలను కుదుర్చుకుంటున్నట్టు తెలిపింది. 2018లో యూకే మార్కెట్లో అడుగుపెట్టినట్టు కంపెనీ వివరించింది. 200లకుపైగా హోటళ్లు ఓయో జాబితాలో ఉన్నాయి. యూకేలో 65 నగరాల్లో ఇవి విస్తరించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40 ప్రీమియం హోటళ్లను అందుబాటులోకి తేనున్నట్టు కంపెనీ గతంలో ప్రకటించింది. ఇందులో ఇప్పటికే 18 తెరుచుకున్నాయి. యూఎన్ గ్లోబల్ కాంపాక్ట్‌లో జీఎంఆర్ ఎయిర్పోర్ట్కార్పొరేట్ల సుస్థిర అభివృద్ధి ప్రణాళికల అమలుకు సంబంధించిన యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కాంపాక్ట్‌లో (యూఎన్‌జీసీ) చేరినట్లు జీఎంఆర్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(జీఏఎల్) వెల్లడించింది. మానవ హక్కులు, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపరంగా యూఎన్‌జీసీ నిర్దేశించుకున్న పది సూత్రాలకు, అలాగే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు (ఎస్డీజీ) అనుగుణంగా తమ వ్యూహాలు, కార్యకలాపాలను నిర్వహించనున్నట్లు వివరించింది. తమ విమానాశ్రయాలన్నింటికీ యూఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ లేదా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సర్టిఫికేషన్ ఉన్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: అక్రమ జామర్స్‌తోనే కాల్ డ్రాప్స్పర్యావరణహిత ఏవియేషన్‌లో అంతర్జాతీయంగా అగ్రగామిగా ఎదిగే దిశగా ఇదొక కీలక అడుగని జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ సీఈవో కిరణ్ కుమార్ గ్రంధి తెలిపారు. హైదరాబాద్, ఢిల్లీ, గోవా, మెడాన్ (ఇండొనేషియా) విమానాశ్రయాలను జీఏఎల్ నిర్వహిస్తోంది. అలాగే, విశాఖలోని భోగాపురం, గ్రీస్‌లోని క్రెటెలో విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తోంది. ఫిలిప్పీన్స్‌లోని మక్టాన్ సెబు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి సాంకేతిక సేవలు అందిస్తోంది. -
ఎయిర్‌బస్ @ ఓరుగల్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విమానాశ్రయ నిర్మాణానికి మార్గం సుగమమైంది. వరంగల్ శివారులోని మామునూరులో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో ఎయిర్పోర్ట్ రూపొందబోతోంది. ఐదారేళ్ల తర్వాత ఎట్టకేలకు అవరోధాలు పరిష్కారం కావటంతో విమానాశ్రయ నిర్మాణం చేపట్టేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) సంసిద్ధత ప్రకటించింది. దీనిని సొంతంగానే నిర్మించాలని నిర్ణయించగా, అనుమతులు, ఇతర అధికారిక ప్రక్రియను ఆరునెలల్లో పూర్తి చేసి టెండర్లు పిలవబోతోంది. ఎయిర్‌బస్ దిగేలా.. నాలుగేళ్ల క్రితం ఏఏఐ ఆధ్వర్యంలో జరిగిన టెక్నో ఎకనమిక్ ఫీజిబిలిటీ సర్వే రెండు రకాల నివేదికలు సమర్పించింది. చిన్న విమానాశ్రయం నిర్మించేందుకు 724 ఎకరాల భూమి, రూ.248 కోట్ల వ్యయం అవుతుందని, పెద్ద విమానాలను ఆపరేట్ చేసే స్థాయిలో నిర్మించాలంటే 1053 ఎకరాల భూమి, రూ. 345 కోట్ల వ్యయం అవుతుందని పేర్కొంది. తొలుత చిన్న విమానాశ్రయంగానే నిర్మించాలని నాటి ప్రభుత్వం సూచించింది. కానీ భవిష్యత్‌లో విస్తరణ ఇబ్బందిగా ఉంటుందని, కనీసం 30 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఒకేసారి పెద్ద విమానాశ్రయమే నిర్మించాలని గతేడాది చివరలో ఏఏఐ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనికి ప్రభుత్వం సరే అనటంతో పెద్ద విమానాశ్రయమే రూపొందబోతోంది. ఇక్కడ ఎయిర్‌బస్ విమానం దిగేలా దాదాపు 2,800 మీటర్ల పొడవైన్ రన్‌వే నిర్మించబోతున్నారు. మామునూరులో నిజాం ప్రభుత్వం నిర్మించిన ఎయిర్‌్రస్టిప్ శిథిలం అయినా, నాటి రెండు రన్‌వేల ఆనవాళ్లు ఉన్నాయి. అందులో పెద్దది దాదాపు 1,400 మీటర్ల పొడవు ఉంది. ఇప్పుడు అదే డైరెక్షన్లో దానిపైనే కొత్త రన్‌వే నిర్మించనున్నారు. దాని పక్కన గ్లైడర్స్ దిగేందుకు మరో చిన్న రన్‌వే కూడా ఉంది. దానిని కూడా పునరుద్ధరించే యోచనలో ఉన్నారు. సొంతంగానే నిర్మాణం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీఎమ్మార్ సంస్థ నిర్మించింది. ఎయిర్‌పోర్టుకు 150 కి.మీ. పరిధిలో మరో విమానాశ్రయం నిర్మించకూడదన్న నిబంధన ఉంది. వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఇది అడ్డంకిగా మారటంతో జీఎమ్మార్ సంస్థతో సంప్రదింపులు జరిపారు. వరంగల్ విమానాశ్రయాన్ని కూడా దానికే కేటాయించేలా కూడా చర్చలు జరిగాయి. చివరకు ఆ నిబంధనపై అభ్యంతరం పెట్టకూడదన్న దిశలో చర్చలు సానుకూలంగా జరిగాయి. ఆ మేరకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్ఓసీ తీసుకుంది. ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు కేటాయించకుండా సొంతంగానే వరంగల్ ఎయిర్‌పోర్టును చేపట్టాలని అది నిర్ణయించింది. – విమానాశ్రయానికి 700 మీటర్ల దూరంలో ఉన్న వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిని మళ్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. దాదాపు కిలోమీటరు నిడివితో భారీ సొరంగమార్గం నిర్మించి వాహనాలను దాని గుండా మళ్లించాలని ప్రతిపాదించారు. కానీ దీనికి భారీ ఖర్చు అవుతున్నందున, దాని బదులు బైపాస్‌రోడ్డు నిర్మించాలన్న ప్రత్యామ్నాయ ప్రతిపాదనపై ఇప్పుడు పరిశీలిస్తున్నారు. – వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కులో జపాన్, తైవాన్ లాంటి విదేశీ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. ఇవి కార్గో ఫ్లైట్ సేవలు కోరుతున్నాయి. కార్గో ఫ్లైట్ ఆపరేషన్ జరగాలంటే పెద్ద రన్‌వే ఉండాలి. దీంతో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయంగానే దీనిని రూపొందించబోతున్నారు. మూడేళ్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్.. మామునూరు విమానాశ్రయాన్ని ‘ఉడాన్’లోని రీజినల్ కనెక్టివిటీ స్కీంతో అనుసంధానించనున్నారు. ఇందులో మూడేళ్ల కాలానికి కేంద్రం వయబిలిటీ గ్యాప్ ఫండ్ అందిస్తుంది. రూట్ల వారీగా బిడ్డింగ్ నిర్వహిస్తే వాటిల్లో ఎంపికైన ఆపరేటర్లకు ఆయా రూట్లు కేటాయిస్తారు. ఆ ఆపరేటర్లు మాత్రమే ఆ రూట్లలో మూడేళ్లపాటు విమాన సర్వీసులు నిర్వహిస్తారు. ఈ కాలంలో సీట్ల వారీగా నష్టాలను బేరీజు వేసి.. డిమాండ్ అంచనా–వాస్తవ డిమాండ్.. ఈ రెంటి మధ్య ఉండే గ్యాప్‌ను కేంద్రం భర్తీ చేస్తుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. వేయి ఎకరాలు అవసరం కొత్త విమానాశ్రయానికి వేయి ఎకరాలు కావాలి. నిజాం కాలం నాటి పాత విమానాశ్రయానికి చెందిన 696 ఎకరాలు ప్రస్తుతం ఏఏఐ అధీనంలోనే ఉన్నాయి. మిగతా భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించాల్సి ఉంది. విమానాశ్రయం నిర్మించేందుకు రూ. 800 కోట్లు ఖర్చవుతాయని అంచనా. త్వరలో ఏఏఐ డీపీఆర్ సిద్ధం చేయనుంది. -
ఇంజినీర్ల నైపుణ్యాలకు ప్రత్యేక అకాడమీ
ఇంజినీర్లకు నైపుణ్యాలు అందించేందుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ సంస్థ ప్రత్యేక అకాడమీ ప్రారంభిస్తున్నట్లు సంస్థ ప్రెసిడెంట్, అకౌంటబుల్ మేనేజర్ అశోక్ గోపీనాథ్ తెలిపారు. జీఎంఆర్ గ్రూప్ ఆధ్వర్యంలోని ఈ అకాడమీ కోసం రూ.50 కోట్లు వెచ్చించనున్నట్లు ఆయన తెలిపారు. ‘దేశంలోని విమానయాన సంస్థలకు శిక్షణ పొందిన మానవ వనరుల కొరత ఎదురవుతోంది. ఎయిర్‌క్రాఫ్ట్ నిర్వహణలో భాగంగా భవిష్యత్తులో ఇంజినీర్లకు గిరాకీ ఏర్పడుతుంది. వారికి నైపుణ్యాలు అందించేందుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఆధ్వర్యంలో జీఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్‌ను ఏర్పాటు చేస్తున్నాం. జులై నెలలో కోర్సులు ప్రారంభించాలని ఇన్స్టిట్యూట్ యోచిస్తోంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌తో 10+2 పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరడానికి అర్హులు. కొత్త అకాడమీను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేస్తున్నాం. కోర్సులో భాగంగా రెండు సంవత్సరాలపాటు అకడమిక్ స్టడీ ఉంటుంది. మరో రెండేళ్లు ఉద్యోగ శిక్షణ అందిస్తాం. ఇండిగో, ఎయిరిండియా, ఆకాసా వంటి విమానయాన సంస్థలు ఇప్పటికే 1,200 కంటే ఎక్కువ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఆర్డర్ చేశాయి. పరిశ్రమల అంచనా ప్రకారం, వచ్చే ఐదేళ్లలో భారతదేశానికి దాదాపు 5,000 మంది ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్లు అవసరం’ అన్నారు. దిల్లీ, హైదరాబాద్, గోవా విమానాశ్రయాలను జీఎంఆర్ నిర్వహిస్తోంది.ఇదీ చదవండి: పైలట్ల కొరత తీర్చేందుకు ప్రత్యేక శిక్షణఇదిలాఉండగా, పైలట్లుగా స్థిరపడాలనుకునే వారికి ఎయిరిండియా ఇప్పటికే ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. అందుకోసం మహారాష్ట్రలోని అమరావతిలో ఏడాదికి 180 మందికి శిక్షణ ఇచ్చేందుకు అకాడమీను ఏర్పాటు చేస్తోంది. అందులో ట్రెయినింగ్ పూర్తిచేసిన వారిని నిబంధనల ప్రకారం నేరుగా సంస్థలో పైలట్లుగా నియమించుకుంటామని ప్రకటించింది. -
హైవేపై పెరిగిన టోల్‌ఫీజు
కేతేపల్లి: హైదరాబాద్–విజయవాడ 65 నంబరు జాతీయ రహదారిపై టోల్గేట్ల వద్ద వాహనదారుల నుంచి వసూలు చేస్తున్న టోల్ ఫీజును రహదారి విస్తరణ కాంట్రాక్టు సంస్థ జీఎమ్మార్ యాజమా న్యం పెంచింది. ఒక్కో వాహనానికి ఒక వైపు, ఇరు వైపులా కలిపి రూ. 5నుంచి రూ. 40 వరకు, స్థాని కుల నెలవారీ పాస్‌ను రూ.330 నుంచి రూ.340 కి పెంచింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండల ఆంథోల్ మైసమ్మ దేవాలయం నుంచి ఏపీలోని కృష్ణా జిల్లా చిల్లకల్లు వరకు గల 181.5 కి.మీ మేర రెండులేన్లుగా ఉన్న రహదారిని దాదాపు రూ.2000 కోట్ల వ్యయంతో 2012లో బీవోటీ పద్ధతిన జీఎమ్మార్ సంస్థ నాలుగు లేన్లుగా విస్తరించింది. ఈ విస్తరణ పనులకు అయిన వ్యయాన్ని రాబట్టుకునేందుకు 65 నంబరు జాతీయ రహదారిపై ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలోని కృష్ణా జిల్లా చిల్లకల్లు వద్ద ఒకొక్కటి చొప్పున మూడు టోల్‌ప్లాజాలను జీఎమ్మార్ సంస్థ ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 2012 నుంచి టోల్‌ఫీజు వసూళ్లను కాంట్రాక్టు సంస్థ ప్రారంభించింది. ఎన్హెచ్ఏఐ సూచించిన నిబంధనల మేరకు వార్షిక సవరణల పేరిట ఏడాదికి ఒకమారు వాహనాల నుంచి వసూలు చేస్తున్న టోల్‌ఫీజు ధరలను పెంచుకునే వెసులుబాటు జీఎమ్మార్ సంస్థకు ఎన్హెచ్ఏఐ కల్పించింది. ఆయా టోల్‌ప్లాజాల వద్ద ఈనెల 31(ఆదివారం) అర్ధరాత్రి 12 గంటల తర్వాత అంటే ఏప్రిల్ 1 నుంచి పెంచిన టోల్ ధరలు అమల్లోకి రానున్నాయి. ఏడాది కాలం పాటు ఇవే ధరలు అమల్లో ఉంటాయి. -
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు అంతర్జాతీయ పురస్కారం
జీఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం లభించింది. ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు గాను ఈ అవార్డు అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) వార్షిక అవార్డుల్లో భాగంగా ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ (ఏఎస్‌క్యూ) విభాగంలో 2023కు గాను ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ‘హైదరాబాద్’ ఉత్తమ విమానాశ్రయంగా నిలిచింది. ఏడాదికి 1.5-2.5 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 400 విమానాశ్రయాలు ఈ పురస్కారం కోసం పోటీ పడ్డాయి. 30కి పైగా పనితీరు సూచికల ఆధారంగా అంతిమ విజేతను నిర్ణయించారు. ఇదీ చదవండి: ఎన్నికల ఎఫెక్ట్.. హెలికాప్టర్లకు పెరిగిన డిమాండ్.. ఈ పురస్కారం సాధించడంపై జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ సీఈఓ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ విమానాశ్రయ నిర్వహణలో భాగం పంచుకుంటున్న అందరికీ దీన్ని అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ విస్తరణ ప్రణాళికలు దాదాపు పూర్తయినట్లు తెలిపారు. టెర్మినల్, ఎయిర్‌సైడ్ ప్రాంతాల్లో కొత్త సౌకర్యాలు, మౌలిక వసతులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. -
హైదరాబాద్ ఎయిర్పోర్ట్.. టైమ్ అంటే టైమే..!
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల టైమింగ్ బావుందని నివేదిక వెల్లడైంది. నిర్వహణ, పనితీరు, సమయపాలన (ఆన్‌టైమ్ పర్ఫార్మెన్స్-ఓటీపీ)లో అంతర్జాతీయంగా హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. 2023లో ఆన్‌టైమ్ పర్ఫార్మెన్స్ను సమీక్షించిన విమానయాన అనలిటిక్స్ సంస్థ సిరియమ్ రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. టాప్-10 విమానాశ్రయాల్లో మన దేశంలోని కోల్‌కతా విమానాశ్రయం కూడా స్థానం దక్కించుకుంది. టాప్ 1లో అమెరికాకు చెందిన మిన్నేపొలిస్-సెయింట్ పాల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇది ఓటీపీ అధికంగా 84.44% ఉంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 84.42% ఓటీపీతో రెండో స్థానం సాధించింది. బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం 84.08% ఓటీపీతో మూడో స్థానంలో నిలిచింది. పెద్ద విమానాశ్రయాల్లోనూ ఈ రెండు స్థానం సాధించాయి. మధ్య స్థాయి విమానాశ్రయాల విభాగంలో కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయం 83.91 శాతం ఓటీపీతో అంతర్జాతీయంగా తొమ్మితో స్థానం దక్కించుకుంది. ఇదీ చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో మన బ్యాగ్ మనమే చెక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే.. సంస్థల వారీగా.. అంతర్జాతీయంగా దేశంలోని పెద్ద విమానయాన సంస్థ ఇండిగో 82.12% ఓటీపీతో ఎనిమిదో ర్యాంకు సాధించింది. ఆసియా పసిఫిక్ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికాకు చెందిన సఫైర్ 92.36% ఓటీపీతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆసియా పసిఫిక్ విభాగంలో జపాన్‌కు చెందిన ఆల్ నిప్పాన్ ఎయిర్వేస్ 82.75% ఓటీపీతో అగ్ర స్థానం దక్కించుకుంది. జపాన్ ఎయిర్‌లైన్స్ (82.58% ఓటీపీ), థాయ్ ఎయిరేషియా (82.52% ఓటీపీ) రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. విమానం నిర్దేషించిన సమయానికి 15 నిమిషాలు ముందే వస్తే ఆన్‌టైమ్ షెడ్యూల్ అని సిరియమ్ నివేదిక తెలిపింది. -
ఎయిర్‌పోర్ట్‌లో మన బ్యాగ్ మనమే చెక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాదాపు అన్ని సంస్థలు సాంకేతికతలో వస్తున్న మార్పులకు అనువుగా తమనుతాము నిత్యం అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాయి. నూతన టెక్నాలజీని ప్రవేశపెట్టడంలో ఎల్లప్పుడూ ముందుండే హైదరాబాద్‌లోని జీఎమ్మార్ అంతర్జాతీయ విమానాశ్రయం మరో ముందడుగు వేసింది. తనిఖీలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా సెల్ఫ్ చెక్ కియోస్క్, సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికులు టర్మినల్లోకి ప్రవేశించడానికి ముందే తనిఖీలు చేయడం, బ్యాగేజీ చెక్ ఇన్, బోర్డింగ్ పాస్‌ల జారీ వరకు అన్ని సదుపాయాలను ఒకేచోట అందిస్తున్నట్టు జీఎమ్మార్ ఎయిర్పోర్ట్ ఈడీ ఎస్జీకే కిశోర్ అన్నారు. విమానాశ్రయంలో ఆధునిక సదుపాయాలు కల్పించడంలో భాగంగా ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయకుండా సెల్ఫ్ చెక్ కియాస్క్, సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు. దీంతో టర్మినల్ వద్ద రద్దీ తగ్గడంతోపాటు ప్రయాణికులు మరింత సులభంగా రాకపోకలు సాగించవచ్చని తెలిపారు. ఇదీ చదవండి: వరుసగా మూడోనెల తగ్గిన ఫ్యూయెల్ ధర.. ఎంతంటే.. కొత్తగా ఏర్పాటు చేసిన కియాస్క్‌ల వద్ద ప్రయాణికులు వారి బ్యాగ్‌లను వారే చెక్ చేసుకోవచ్చు. అక్కడే బోర్డింగ్ పాస్, బ్యాగ్ ట్యాగ్‌లను తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ సేవలు విమానం ప్రారంభమయ్యే గంట ముందు వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. -
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో రూ. 675 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురంలో అభివృద్ధి చేస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టులో నేషనల్ ఇన్వెస్ట్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్) రూ. 675 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయనుంది. విమానాశ్రయ నిర్మాణానికి ఏర్పాటైన జీఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (జీవీఐఏఎల్)లో ఈ మొత్తాన్ని పెట్టుబడి పెట్టేందుకు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ (జీఏఎల్), ఎన్ఐఐఎఫ్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. సీసీడీల రూపంలో.. కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్స్ రూపంలో ఎన్ఐఐఎఫ్ ఇన్వెస్ట్ చేయనున్నట్లు జీఎంఆర్ గ్రూప్ తెలిపింది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ప్రాజెక్టులకు సంబంధించి ఇది తమ రెండో పెట్టుబడని ఎన్ఐఐఎఫ్ మాస్టర్ ఫండ్ మేనేజింగ్ పార్ట్నర్ వినోద్ గిరి తెలిపారు. హైదరాబాద్ తరహాలో భోగాపురం ఎయిర్పోర్ట్ మరో ప్రపంచ స్థాయి విమానాశ్రయంగా ఉండగలదని జీఎంఆర్ గ్రూప్ బిజినెస్ చైర్మన్ (ఎయిర్‌పోర్ట్స్) జీబీఎస్ రాజు తెలిపారు. డిజైన్, నిర్మాణం, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన 40 ఏళ్ల వ్యవధికి భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రాజెక్టును 2020లో జీవీఐఏఎల్ దక్కించుకుంది. ఏపీలోనే అతి పెద్ద విమానాశ్రయంగా ఆవిర్భవించనున్న ఈ ఎయిర్ పోర్టు వార్షిక ప్రయాణికుల సామర్థ్యం తొలి దశలో 60 లక్షలుగా ఉంటుంది. తర్వాత 4 కోట్లకు చేరనుంది. -
Vizag Green Field Airport: వైజాగ్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌కు రూ.4వేల కోట్లు
వైజాగ్‌లో గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కోసం జీఎంఆర్ సంస్థ రూ.4,000 కోట్ల రుణాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ (ఐఐఎఫ్‌సీఎల్) నేతృత్వంలోని కన్సార్టియం ఈ నిర్మాణ సమూహానికి నిధులు సమకూరుస్తుంది. ఐఐఎఫ్‌సీఎల్ 14 ఏళ్లకు 10 శాతం వడ్డీ చొప్పున ఈ రుణాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఎయిర్పోర్ట్ నిర్మాణ సమయంలో, కార్యకలాపాలు మొదలైన ఏడాది వరకు రుణం చెల్లింపుపై మారటోరియం అవసరం అవుతుందని ఐఐఎఫ్‌సీఎల్ తెలిపింది. ఆర్ఈసీ, పీఎఫ్సీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంకింగ్ కన్సార్టియంలో భాగమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. భవిష్యత్తులో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల అభివృద్ధికి నిధులు సమకూర్చడానికి సంస్థ ఆసక్తిగా ఉన్నట్లు ఐఐఎఫ్‌సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పీఆర్ జైశంకర్ తెలిపారు. వైజాగ్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని 2200 ఏకరాల్లో భోగాపురంలో నిర్మిస్తున్నారు. దీన్ని ప్రధానంగా సాయుధ దళాల అవసరాలను తీర్చడానికి ప్రస్తుత విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తున్నారు. -
యూనివర్సిటీలు సామాజిక బాధ్యత పెంచే కేంద్రాలు
సాక్షి, విశాఖపట్నం: విశ్వవిద్యాలయాలు జ్ఞానాన్ని పెంచడమే కాకుండా విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంచే కేంద్రాలుగా నిలుస్తున్నాయని ఏపీ గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఏయూ కట్టమంచి రామలింగారెడ్డి కాన్వొకేషన్ హాల్లో శనివారం నిర్వహించిన ఆంధ్ర విశ్వ విద్యాలయం స్నాతకోత్సవానికి చాన్స్‌లర్ హోదాలో గవర్నర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పరిశ్రమలు–శాస్త్ర రంగంలో జీఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జున, అవంతి ఫీడ్స్ సంస్థ ఎండీ అల్లూరి ఇంద్రకుమార్, సాహిత్యం–కళా రంగాలలో ఎస్వీ యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి ఆచార్య కొలకలూరి ఇనాక్‌లకు గౌరవ డాక్టరేట్లను గవర్నర్ అందించారు. 690 మంది డాక్టరేట్లను, 600 మంది మెడల్స్‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య హాస్టల్, భారత్–ది జీ20 ప్రెసిడెన్షియల్ హాస్టల్, శతాబ్ది క్లాసిక్ హాస్టల్ భవనాల్ని గవర్నర్ ప్రారంభించారు. అనంతరం గవర్నర్ నజీర్ మాట్లాడుతూ.. జ్ఞానం అంతఃదృష్టి కలిగి ఉండాలని, దానికి నైతికత జోడిస్తేనే విలువ ద్విగుణీకృతమవుతుందని వ్యాఖ్యానించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉన్నత విద్య జ్ఞాననిధిగా మారిందని.. దేశంలోని అత్యంత పురాతన విశ్వవిద్యాలయాలలో ఒకటిగా నిలుస్తోందని అన్నారు. శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్న ఈ విశ్వవిద్యాలయం సర్ సీఆర్ రెడ్డి, సర్వేపల్లి, డాక్టర్ వీఎస్ కృష్ణ వంటి వారి సారథ్యంలో ఎంతో ప్రగతి సాధించిందని కొనియాడారు. ఏయూ అమలు చేస్తున్న నూతన విధానాలను ఇతర విశ్వవిద్యాలయాలు సైతం అమలు చేస్తే ప్రతిభ కలిగిన యువతను దేశంలో స్థిరపడే విధంగా చేయడం సాధ్యమన్నారు. నాక్‌లో ప్రతిసారి అత్యుత్తమ గ్రేడ్ సాధించడం శుభపరిణామమని అభినందించారు. ఏయూ తెలుగు ప్రజలందరిదీ: బొత్స రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు ప్రజలందరిదీ అన్నారు. విద్యావ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని.. విద్య కోసం ఏ రాష్ట్రం చేయనంత ఖర్చు చేస్తున్నామని వివరించారు. ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య, నైపుణ్యాలు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. ఏయూ వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. సమగ్రాభివృద్ధి, విద్యా నైపుణ్యం దిశగా ఏయూ అడుగులు వేస్తోందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దార్శనికతకు అనుగుణంగా ఇంజినీరింగ్, సైన్స్, ఫార్మసీ రంగాల్లో ఆవిష్కరణలు జరిపే సౌలభ్యంతో కూడిన మౌలిక వసతులు కలి్పస్తూ ప్రోటో టైప్, కమర్షియలైజేషన్ దిశగా నడిపిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నెలకొలి్పన నాస్కామ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ 17 స్టార్టప్స్‌కు స్థానం కలి్పంచిందన్నారు. ఏయూ పరిశోధన, మౌలిక వసతుల అభివృద్ధికి ఉపయుక్తంగా 54 ఎంఓయూలు చేసుకున్నట్టు చెప్పారు. ఏయూ రిజిస్ట్రార్ కృష్ణమోహన్, వివిధ విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
జీఎంఆర్ పవర్‌కు భారీ ఆర్డరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ పవర్ అనుబంధ సంస్థ జీఎంఆర్ స్మార్ట్ ఎలెక్ట్రిసిటీ డి్రస్టిబ్యూషన్ (జీఎస్ఈడీపీఎల్)కు పూర్వాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ నుంచి రూ. 5,123 కోట్ల విలువ చేసే ఆర్డర్లు లభించాయి. వీటి కింద ఉత్తర్‌ప్రదేశ్‌లోని పూర్వాంచల్ (వారణాసి, ఆజమ్గఢ్ జోన్, ప్రయాగ్‌రాజ్, మీర్జాపూర్ జోన్)లో 50.17 లక్షల స్మార్ట్ మీటర్ల ఇన్స్టాలేషన్, నిర్వహణ పనులు చేయాల్సి ఉంటుంది. ఇందులో ప్రయాగ్‌రాజ్–మీర్జాపూర్ జోన్ కాంట్రాక్టు విలువ రూ. 2,387 కోట్లుగాను, వారణాసి–ఆజమ్గఢ్ జోన్ కాంట్రాక్టు విలువ రూ. 2,736.65 కోట్లుగాను ఉంటుందని సంస్థ తెలిపింది. త్వరలోనే దక్షిణాంచల్ (ఆగ్రా, అలీగఢ్ జోన్)లో 25.52 లక్షల స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టుకు సంబంధించి దక్షిణాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ నుంచి కూడా కాంట్రాక్టు లభించే అవకాశం ఉందని పేర్కొంది. -
భగవంతుడి నిర్ణయమో తెలీదు కానీ.. సీఎం జగన్‌పై జీఎంఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, విజయనగరం: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు మాట్లాడుతూ, సీఎం జగన్ విజన్, లీడర్షిప్, పాలసీలు, ఆలోచనలు, మౌలికసదుపాయాల కల్పనపై పెడుతున్న దృష్టిని ఆయన అభినందించారు. జీఎంఆర్ ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే.. అందరికీ నమస్కారం.. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రపంచంలో చాలా ఎయిర్‌పోర్ట్‌లు కట్టాను. కానీ మా సొంత ఊరు రాజాం. వైజాగ్ రెండో ఊరు. నా ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫౌండేషన్ వేశారు. ఆయనే సీఎంగా ఉండగానే ప్రారంభించారు.. రెండు మా ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇనాగ్యురేషన్కి కూడా వైఎస్సార్ వచ్చారు.. ఈ రోజున భగవంతుడి నిర్ణయమో తెలీదు కానీ ఆయన తనయుడు జగన్ తన అమృత హస్తాలతో శంకుస్ధాపన చేయడం, వారే మళ్లీ ఇనాగ్యురేట్ చేయాలని భగవంతున్ని కోరుకుంటున్నాను. చదవండి: అటు అదానీ డేటా సెంటర్.. ఇటు భోగాపురం ఎయిర్‌పోర్టు సీఎం జగన్ విజన్, లీడర్షిప్, పాలసీలు, ఆలోచనలు, మౌలికసదుపాయాల కల్పనపై పెడుతున్న దృష్టి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీ, సీ పోర్ట్‌లు, ఎయిర్‌పోర్ట్‌ల కనెక్టివిటీపై చేసిన పాలసీ, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో వచ్చిన పెట్టుబడులపై సీఎం గారికి నా అభినందనలు. ఆ సమావేశం ఒక అద్భుతం. నేను కూడా అందులో భాగస్వామ్యం అయ్యాను. ప్రపంచంలో మాకిది 12వ ఎయిర్పోర్ట్.. హైదరాబాద్, గోవా తర్వాత మేం నిర్మిస్తున్న మూడో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ప్రపంచస్ధాయి ప్రమాణాలతో మేం నిర్మిస్తాం. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చేసిన కొత్తలో 1999–2000 లో 7 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉండగా, ఇప్పుడు 500కు చేరాయి. దీనివల్ల తెలంగాణ రాష్ట్ర ఎకానమీనే మారిపోయింది. అదే విధంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను కూడా కడతాం.. ఇక్కడ కార్గో కూడా ఉండడం వల్ల రైతులకు, మత్స్యకారులకు, ఫార్మా ఇండస్ట్రీకి ఎగుమతులకు ఉపయోగకరంగా ఉంటుంది.. ఇక్కడి సంస్కృతిని చూసి ఈ ఎయిర్పోర్ట్ డిజైన్ చేశాం. మేం ఢిల్లీ ఎయిర్పోర్ట్ తీసుకున్నప్పుడు అధ్వానంగా ఉండేది.. దానిని నెంబర్ వన్ ఎయిర్‌పోర్ట్‌గా మార్చాం.. అదే విధంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను చేస్తాం, భగవంతుడు కూడా వర్షం రూపంలో మనల్ని దీవించారు.. నేను జీఎంఆర్ తరపున 36 నెలల్లో నెంబర్ వన్ ఎయిర్పోర్ట్ కడతానని హామీ ఇస్తున్నాను, మీరే మళ్ళీ ప్రారంభించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చిరకాల వాంఛ నెరవేరింది: నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అందరికీ నమస్కారం, భోగాపురం ఎయిర్పోర్ట్ చిరకాల వాంఛ. గత ప్రభుత్వం 15 వేల ఎకరాల భూసేకరణ కావాలని ప్రజలందరినీ ఇబ్బంది పెడితే నాడు సీఎం జగన్ మన ప్రాంతానికి వచ్చి మన పక్షాన పోరాడి.. అన్ని వేల ఎకరాలు అవసరం లేదని, 3 నుంచి 5 వేల ఎకరాలతో ఎయిర్పోర్ట్ కట్టవచ్చని మన తరుపున పోరాడారు. 2019లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎంగారి చొరవతో అందరికీ నష్టపరిహారం ఇచ్చి, కేసులు ఎత్తివేసి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్ధాపన చేస్తున్నారు. సీఎం మాట తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నారు. గతంలో వైఎస్సార్ ఉన్నప్పుడు తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్ట్ ఆవశ్యకత చెప్పగానే ఆయన మంజూరు చేశారు. చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు కూడా శంకుస్ధాపన చేస్తున్నారు. స్ధానికంగా ఉన్న కొన్ని సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరుకుంటున్నాను. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌గా ప్రకటించాలని.. మా ప్రాంత ప్రముఖులు కొమ్మూరు అప్పడుదొర, పెనుమత్స సాంబశివరాజు గారి పేర్లు పెట్టేందుకు అవకాశం ఉంటే పరిశీలించాలని కోరుతున్నాను. చదవండి: ‘మార్గదర్శి’ జూమ్ మీటింగ్‌లో ఏం జరిగింది?.. బ్లాక్ మనీ వైట్‌గా ఎలా మారుతోంది? పాలకులు మంచి వారు అయితే ప్రజలు బాగుంటారు, ఆర్ధిక సమస్యలు ఉన్నా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్, సీఎంగా చిరకాలం సీఎంగా ఉంటే మన ప్రాంత సమస్యలు పరిష్కారం అవుతాయి. మల్లికార్జునరావు మన ప్రాంత వాసి. ఆయన సొంత ఊరు రాజాం కూడా విజయనగరం జిల్లాలో ఉంది. జీఎంఆర్ గారు కూడా ఇప్పుడు మా జిల్లా వాసే, ధన్యవాదాలు. -
‘మార్కెట్’లో సౌందర్యలహరి
అందానికి దాసోహమవని వారు ప్రపంచంలో ఉంటారా? సౌందర్యారాధన లేని వారు ఉంటారా? అందుకే సౌందర్య ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ పెరుగుతోంది. పట్టణాల్లోనే కాదు గ్రామాల్లోనూ బ్యూటీ పార్లర్లు, స్టైలిష్ హబ్‌లు వెలుస్తున్నాయి. ఫేస్వా ష్లు, మాయిశ్చరైజర్ల నుంచి కంటి క్రీమ్‌లు, ఫేస్ మాస్‌్కలు, సన్‌స్క్రీన్ లోషన్‌తో అన్నింటినీ మహిళలు, పురుషులు, పిల్లల కోసం కంపెనీలు ప్రత్యేకంగా తయారు చేస్తున్నాయి. 2018లో ప్రపంచ వ్యాప్తంగా సౌందర్య ఉత్పత్తుల మార్కెట్ 134.8 బిలియన్ డాలర్లు ఉంటే, 2021 నాటికి 532 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2024 నాటికి 893 బిలియన్ డాలర్లకు చేరుతుందని జియాన్ మార్కెట్ రీసెర్చ్(జీఎంఆర్) విభాగం అంచనా వేసింది. 2020 నుంచి భారతదేశంలో ప్రీమియం సౌందర్య ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్నట్టు గుర్తించింది. ప్రస్తుతం చర్మ, సౌందర్య ఉత్పత్తుల వినియోగంలో 80 శాతం మంది మహిళలే ఉన్నారు. వచ్చే ఐదేళ్లలో పురుషుల సౌందర్య, గ్రూమింగ్ ఉత్పత్తులు కూడా భారీగా పెరుగుతాయని, దాంతో యునిసెక్స్ ఉత్పత్తుల తయారీ విస్తరిస్తుందని జీఎంఆర్ అంచనా వేసింది. చర్మ సౌందర్య ఉత్పత్తులే అధికం ♦ 2021లో మొత్తం సౌందర్య ఉత్పత్తుల కొనుగోళ్లలో 148.3 బిలియన్ డాలర్లు కేవలం చర్మ రక్షణ ఉత్పత్తులదే. ♦ పర్సనల్ కేర్ మార్కెట్లో 42 శాతం స్కిన్ కేర్ ఉత్పత్తులే ఉన్నాయి. తర్వాత స్థానంలో హెయిర్ కేర్ 22 శాతం, బ్యూటీ అండ్ మేకప్ కేర్ 16 శాతం ఉన్నాయి. ♦ ప్రపంచ బ్యూటీ ఉత్పత్తుల మార్కెట్లో ప్రస్తుతం 7వ స్థానంలో ఉన్న భారత్.. వచ్చే మూడేళ్లలో 4వ స్థానానికి చేరుతుందని అంచనా. ♦ సర్వే ప్రకారం భారత్‌లో సహజ సౌందర్య ఉత్పత్తుల మార్కెట్ 2022లో 15 బిలియన్ డాలర్లు ఉండగా, 2024 నాటికి 22 బిలియన్ల డాలర్లకు, 2028 నాటికి 38 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని జీఎంఆర్ తెలిపింది. -
Global Investors Summit: ఏపీలో జిందాల్ స్టీల్ భారీ పెట్టుబడులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతోంది. ఈ సందర్బంగా ఏపీలో పెట్టుబడులపై వివిధ కంపెనీలు తన పెట్టుబడులను ప్రకటించారు. జిందాల్ కంపెనీ రానున్న రోజుల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నట్టు పేర్కొంది. జిందాల్ స్టీల్ అండ్ పవర్ చైర్మన్ నవీన్ జిందాల్ మాట్లాడుతూ.. ఏపీ ప్రగతిలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది. ఏపీలో మౌలిక వసతులు అద్భుతంగా ఉన్నాయి. ఏపీలో పారిశ్రామిక అనుకూల వాతావరణం భేష్. ఏపీలో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఎకో సిస్టమ్ ఉంది. 10వేల కోట్ల పెట్టుబడులతో 10వేల మందికిపైగా ఉపాధి కల్పించబోతున్నట్టు తెలిపారు. ఆర్థిక వృద్ధిలో ఏపీ నంబర్ వన్‌గా ఉందన్నారు. జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎం రావు మాట్లాడుతూ.. ఏపీలో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఎకో సిస్టమ్ ఉంది. సీఎం వైఎస్ జగన్ దార్శనికత ప్రశంసనీయం. సీఎం జగన్ విజన్ అద్భుతం. ఏపీలో కనెక్టివిటీ బాగా పెరిగింది. ఏపీ ప్రగతిలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఎయిర్ కనెక్టివిటీ పెరుగుతుండటంతో ఏపీకి మరిన్ని పరిశ్రమలు వస్తున్నాయి. రాష్ట్ర జీడీపీ సుస్థిరంగా ఉండటం ప్రశంసనీయం అని అన్నారు. సియాంట్ చైర్మన్ బీవీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. విశాఖలో మా కంపెనీలకు మరింత విస్తరిస్తాం. ఐటీ రంగంలో ఏపీ నిపుణుల పాత్ర ఆదర్శనీయం. విద్యారంగంలో ఏపీ కృషి అమోఘం. పలు రంగాల్లో సాంకేతిక పాత్ర వేగంగా జరుగుతోంది. అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యా దీవెన, విదేశీ విద్యాదీవెన పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి జరుగుతోందన్నారు. భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ.. ప్రపంచాలనికి ఉత్తమమైన మానవ వనరులను ఏపీ అందిస్తోందన్నారు. నైపుణ్యానికి ఏపీ చేస్తున్న కృషి అభినందనీయం. ఏపీలో వనరులు పుష్కలంగా ఉన్నాయి. వాటిని సమర్థవంతంగా వాడుకుంటే ఏపీలో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. -
పేరు మార్చుకున్న బడా కంపెనీ.. కారణం ఇదే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానాశ్రయాల అభివృద్ధి, నిర్వహణలో ఉన్న జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మారింది. ఇక నుంచి జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా వ్యవహరిస్తారు. విమానాశ్రయేతర వ్యాపారాలను విడదీసిన తర్వాత కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 15 నుంచి కొత్త పేరు కార్యరూపంలోకి వచ్చిందని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీతోపాటు ఫిలిప్పైన్స్‌లోని సెబు విమానాశ్రయాలు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ నిర్వహణలో ఉన్నాయి. ఇండోనేషియాలోని కౌలనాము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి, నిర్వహణ హక్కులను సంస్థ చేజిక్కించుకుంది. గోవా, ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం, గ్రీస్‌లోని క్రీతి విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తోంది. (క్లిక్ చేయండి: ఇన్‌స్ట్రాగామ్‌లో కొత్త ఫీచర్: చూశారా మీరు?) -
హైదరాబాద్ టు బాగ్దాద్
శంషాబాద్: హైదరాబాద్ నుంచి నేరుగా బాగ్దాద్ వెళ్లేందుకు విమాన సర్వీసు ప్రారంభమైంది. ఆదివారం మధ్యాహ్నం 3.17 గంటలకు ‘ఫ్లై బాగ్దాద్ ఎయిర్‌లైన్స్’కు చెందిన ఐఎఫ్–462 టేకాఫ్ తీసుకుని తొలి విమానం బయలుదేరింది. హైదరాబాద్–బాగ్దాద్‌ల మధ్య వారానికి రెండు రోజులు ఈ సర్వీసులు కొనసాగుతాయని ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. ఇక బాగ్దాద్ నుంచి వచ్చేవిమానం ప్రతి ఆదివారం ఉదయం 11.55 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. అదేరోజు మధ్యాహ్నం 12.55 గంటలకు తిరిగి ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. మంగళవారం బాగ్దాద్ నుంచి వచ్చే విమానం ఉదయం 9.55 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. అదేరోజు ఉదయం 10.55 కు ఇక్కడి నుంచి బాగ్దాద్ బయలుదేరుతుంది. పెరుగుతున్న మెడికల్ టూరిజం ఏటా ఇరాక్ నుంచి 10 శాతానికి పైగా మెడికల్ టూరిస్టులు హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నారని పర్యాటక మంత్రిత్వశాఖ చెబుతోంది. అంతేగాక ఇరాక్‌లోని బాగ్దాద్, కర్బలా ప్రాంతాలకు కూడా మనదేశం నుంచి పర్యాటకుల రాకపోకలు పెరిగాయి. ఈ నేపథ్యంలో డైరెక్ట్ విమాన సర్వీసులు ప్రారంభించారు. -
బ్లాక్‌చెయిన్ స్టార్టప్‌లకు అండగా జీఎంఆర్ ఇన్నోవెక్స్!
న్యూఢిల్లీ: బ్లాక్‌చెయిన్ విభాగంలో స్టార్టప్‌లకు తోడ్పాటు అందించేందుకు ఇన్ఫ్రా దిగ్గజం జీఎంఆర్ గ్రూప్‌లో భాగమైన జీఎంఆర్ ఇన్నోవెక్స్ తాజాగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)ను ఏర్పాటు చేసింది. విమానాశ్రయాలు, అనుబంధ వ్యాపారాల్లో బ్లాక్ చెయిన్ సాంకేతికత వినియోగానికి అవకాశాలను అధ్యయనం చేసేందుకు ఐడియాల్యాబ్స్, పాలిగాన్, కాయిన్ఎర్త్, ఇండియా బ్లాక్‌చెయిన్ ఫోరం, వెరోయిన్స్ సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వ్యాపార దిగ్గజాలు, పరిశ్రమ నిపుణులు, టెక్నాలజీ భాగస్వాముల సహాయంతో జీఎంఆర్ ఇన్నోవెక్స్–బ్లాక్‌చెయిన్ సీవోఈ .. అంకుర సంస్థలను గుర్తించి, అవి వృద్ధి చెందేందుకు అవసరమైన తోడ్పాటు అందిస్తుందని జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఈడీ (సౌత్) ఎస్జీకే కిషోర్ తెలిపారు. -
ఖో–ఖో లీగ్.. తెలుగు యోధాస్ కెప్టెన్ ఎవరంటే..?
న్యూఢిల్లీ: ఖో–ఖో లీగ్ ఫ్రాంచైజీ టోర్నీ ‘అల్టిమేట్ ఖో–ఖో’కు రంగం సిద్ధమైంది. రాష్ట్రానికి చెందిన కార్పొరేట్ సంస్థ జీఎంఆర్ ఇది వరకే హైదరాబాద్ నగరానికి చెందిన ఫ్రాంచైజీని చేజిక్కించుకోగా...ఆ జట్టు ‘తెలుగు యోధాస్’ పేరుతో బరిలోకి దిగుతోంది. అటాకింగ్ ప్లేయర్ ప్రజ్వల్‌కు జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించిన టీమ్ మేనేజ్మెంట్ ఆల్‌రౌండర్ ప్రతీక్ వాయికర్ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. ఆరు ఫ్రాంచైజీలు ముంబై, ఒడిశా, చెన్నై, రాజస్తాన్, గుజరాత్, హైదరాబాద్‌ల మధ్య ఈ సీజన్ పోటీలు ఈ నెల 14 నుంచి సెప్టెంబర్ 4 వరకు జరుగనున్నాయి. లీగ్ దశలో ఒక్కో జట్టు ఇతర ఫ్రాంచైజీలతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. అనంతరం ఐపీఎల్ తరహాలో ‘ప్లేఆఫ్స్’ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 4న జరిగే ఫైనల్‌తో ఈ సీజన్ ముగుస్తుంది. మ్యాచ్‌లన్నీ పుణేలోని ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తారు. సోనీ నెట్వర్క్ చానెల్లో, సోనీ లివ్ యాప్‌లో ఖో–ఖో పోటీలు ప్రసారం అవుతాయి. తెలుగు యోధాస్ జట్టు 14న తమ తొలి మ్యాచ్‌లో చెన్నైతో తలపడుతుంది. జట్టు వివరాలు అటాకర్: ఆదర్శ్ దత్తాత్రే, ఆదిత్య దాస్, కేసీ ధనుశ్, గవర వెంకటేశ్, పి.హేమచంద్రన్, కె.ప్రజ్వల్, రోక్సన్ సినమ్, సచిన్ భార్గో, సదానంద తోక్చోమ్, వి.సుబ్రమణి; డిఫెండర్: భరత్ అవధూత్, బొజ్జం రంజిత్, దీపక్ విఠల్, ధ్రువ్, వైభవ్ ప్రసాద్, సుదర్శన్; ఆల్‌రౌండర్: అనుకూల్ సర్కార్, అరుణ్ అశోక్, ఎస్.అరుణ్, సంబి బాల, కిరణ్ ప్రతీక్, రోహన్ తనాజీ -
తగ్గిన జీఎంఆర్ ఇన్ఫ్రా నష్టాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చి త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో రూ.129 కోట్ల నష్టం చవిచూసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.723 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. టర్నోవర్ రూ.1,698 కోట్ల నుంచి రూ.1,387 కోట్లకు వచ్చి చేరింది. మొత్తం వ్యయాలు రూ.1,361 కోట్ల నుంచి రూ.1,537 కోట్లకు ఎగశాయి. క్రితం ముగింపుతో పోలిస్తే జీఎంఆర్ ఇన్ఫ్రా షేరు ధర బీఎస్ఈలో మంగళవారం 4.59 శాతం ఎగసి రూ.36.45 వద్ద స్థిరపడింది. చదవండి: ఎల్ఐసీ లిస్టింగ్.. ప్చ్! -
శంషాబాద్ ఎయిర్‌పోర్టు.. మరో 30 ఏళ్లు జీఎంఆర్‌కే
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వాహాన బాధ్యతలు మరో ముప్పై పాటు జీఎంఆర్ సంస్థకు దక్కాయి. ఈ మేరకు సివిల్ ఏవియేష్ అథారిటీ ఇందుకు సంబంధించిన పత్రాలను జీఎంఆర్‌కు అందచేసింది. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టు ద్వారా ఏడాదికి 21 మిలియన్ మంది ప్రయాణిస్తుండగా 1.50 లక్షల టన్నుల సరుకు రవాణా జరుగుతోంది. గతంలో బేగంపేటలో ఎయిర్‌పోర్టు ఉండగా శంషాబాద్ వద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ)లో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు పనులు 2004లో ప్రారంభించారు. 31 నెలల పాటు నిర్మాణ పనులు పూర్తి చేసుకుని 2008లో ఈ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వచ్చింది. పీపీపీ ఒప్పందంలో భాగంగా అప్పటి నుంచి 2038 వరకు ఎయిర్‌పోర్టు నిర్వాహాణ బాధ్యతలు జీఎంఆర్ సంస్థకు దక్కాయి. తాజాగా మరో ముప్పై ఏళ్ల పాటు ఎయిర్‌పోర్టు నిర్వాహాణ బాధ్యతలు జీఎంఆర్‌కి కట్టబెడుతూ సివిల్ ఏవియేషన్ నిర్ణయం తీసుకుంది. దీంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు 2068 మార్చి 23 వరకు జీఎంఆర్ ఆధీనంలో ఉండనుంది. ఇటీవల ఎయిర్‌పోర్టు విస్తరణ పనులు భారీ ఎత్తున జీఎంఆర్ సంస్థ చేపట్టింది. ఏడాదికి 35 మిలియన్ మంది ప్రయాణించేలా ఇక్కడ సౌకర్యాలను మెరుగు పరుస్తోంది. చదవండి: విస్తరణ బాటలో ఫనాటిక్స్ -
ఇక నేరుగా అంతర్జాతీయ కొరియర్ నిర్వహణ
శంషాబాద్: ఇతర మెట్రోనగరాలపై ఆధారపడ కుండా ఇక అంతర్జాతీయ కొరియర్ నిర్వహణ జీఎంఆర్ ఎయిర్ కార్గో చేయబోతోంది. దీని కోసం అంతర్జాతీయ కొరియర్ ఎక్స్‌ప్రెస్ కార్గో నూతన కేంద్రాన్ని సంస్థ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ కస్టమ్స్ కమిషనర్ బి.విశనాగకుమారి, ఎయిర్‌పోర్టు సీఈఓ ప్రదీప్‌ఫణీకర్, చీఫ్ ఇన్నో వేషన్ అధికారి ఎస్జికే కిశోర్‌లు ఈ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సదుపాయంతో కార్గో రవాణా లో హైదరాబాద్ దక్షిణ భారత దేశానికి గేట్వేగా మారనుందని వారు చెప్పారు. కార్గో రంగంలో ఇదో కొత్త అధ్యాయమని, హైదరాబాద్ ఎయిర్ కార్గో తన పరిధి ఏటా విస్తరిస్తోందని తెలిపారు. కార్గో ఇటీవల సంచార శీతలీకరణ కూడాప్రారంభించిందని చెప్పారు. -
ఆంకజాతో జీఎంఆర్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్‌పోర్టుల వ్యాపారంలో ఉన్న జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ అనుబంధ కంపెనీ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ నెదర్లాండ్స్ తాజాగా ఆంకజా పురా–2తో షేర్‌హోల్డర్స్, షేర్ సబ్స్క్రిప్షన్ ఒప్పందం చేసుకుంది. ఇండోనేషియా మిడాన్లోని క్వాలనాము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి, కార్యకలాపాలకు సంబంధించిన ప్రాజెక్టును జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఈ ఏడాది నవంబర్‌లో చేజిక్కించుకుంది. ప్రాజెక్టులో జీఎంఆర్‌కు 49 శాతం, ఆంకజా పురా–2నకు 51 శాతం వాటాలు ఉంటాయి. కాంట్రాక్టు ప్రకారం 25 ఏళ్ల పాటు విమానాశ్రయ నిర్వహణ, అభివృద్ధి, విస్తరణ పనులు చేపట్టాల్సి ఉంటుంది. -
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఫీజుల మోత
హైదరాబాద్: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన ప్రయాణాలు చేసేవారికి చార్జీలు మరింత భారం కానున్నాయి. యూజర్ డెవలప్మెంట్ ఫీజు (యూడీఎఫ్)ను పెంచుకునేందుకు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (జీహెచ్ఐఏఎల్)కు ఎయిర్‌పోర్ట్స్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ (ఏఈఆర్ఏ) అనుమతించడం ఇందుకు కారణం. 2022 ఏప్రిల్ 1 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వస్తాయి. 2021 ఏప్రిల్ నుంచి 2026 మార్చి దాకా వర్తించే మూడో కంట్రోల్ పీరియడ్‌కు సంబంధించి జీహెచ్ఐఏఎల్ ప్రతిపాదన ప్రకారం టారిఫ్‌లను సవరిస్తూ ఏఈఆర్ఏ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం దేశీ రూట్ల ప్రయాణికుల నుంచి వసూలు చేసే యూడీఎఫ్‌ను రూ. 480కి (ప్రస్తుతం రూ. 281), అంతర్జాతీయ రూట్ల ప్రయాణికుల నుంచి వసూలు చేసే దాన్ని రూ. 700కి (ప్రస్తుతం రూ. 393) పెంచుకోవచ్చు. ఆ తర్వాత 2025 డిసెంబర్ 31 నాటికి దేశీ ప్రయాణికుల యూడీఎఫ్ రూ. 750 దాకా, విదేశీ ప్రయాణికులకు రూ. 1,500 దాకా యూడీఎఫ్ పెరుగుతుంది. -
రోజుకు 90,000 మంది ప్రయాణం!
ముంబై: ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఈ నెల 1–10 తేదీల్లో రోజుకు 90,000 మంది ప్రయాణించారు. జీఎంఆర్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మే నెల మధ్య కాలంతో పోలిస్తే ఇది అయిదురెట్లు అధికం. జూన్ చివరినాటికి ప్రయాణికుల సంఖ్య రోజుకు 62,000లకు చేరింది. కోవిడ్ పరిస్థితి మెరుగుపడడం, పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కారణంగా దేశీయ ట్రాఫిక్ 2023 మార్చినాటికి సాధారణ స్థితికి చేరుకుంటుంది. అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో ఇందుకు మరో ఏడాది పడుతుంది. జూలైలో 22.9 లక్షల మంది ఢిల్లీ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించారు. 2019 జూలైలో ఈ సంఖ్య 58 లక్షలు నమోదైంది. ఈ కాలంతో పోలిస్తే విమాన సర్వీసులు గత నెలలో 45% తగ్గి 20,800 ఉంది. సందర్శనీయ స్థలాలు తెరవడంతో టూరిస్టుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశీయ సామర్థ్యంలో 72.5 శాతం స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి విమానయాన సంస్థలను కేంద్రం ఆదేశించింది. చదవండి : జియో స్మార్ట్‌ఫోన్ ప్రీ బుకింగ్స్ ఎప్పుడంటే? -
వృత్తి విద్యతో మెరుగైన ఉపాధి అవకాశాలు
శంషాబాద్: వృత్తి విద్యతో మెరుగైన ఉపాధి లభిస్తుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. యువత నైపుణ్యంతో కూడిన శిక్షణ పొందడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని సూచించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్‌ను ఆదివారం ఆయన సందర్శించారు. జీఎంఆర్ సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జున్‌రావు స్వాగతం పలికారు. ఫౌండేషన్‌లో వివిధ కోర్సుల శిక్షణ తీరును ఉపరాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు. టైలరింగ్ శిక్షణ తీసుకుని అక్కడే పనిచేస్తున్న మహిళలతో ఉపరాష్ట్రపతి మాట్లాడారు. వృత్తి విద్యలో శిక్షణ ఇవ్వడం బాగుందని కితాబిచ్చారు. తర్వాత జీఎంఆర్, చిన్మయ సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల మైదానంలో వెంకయ్యనాయుడు మొక్కను నాటారు. -
డబ్ల్యూఎల్‌పీకి రెండో హబ్‌గా హైదరాబాద్
ముంబై: వర్ధమాన దేశాల మధ్య వాణిజ్య అవకాశాలను మెరుగుపర్చేందుకు ఏర్పాటైన వరల్డ్ లాజిస్టిక్స్ పాస్‌పోర్ట్(డబ్ల్యూఎల్‌పీ) భారత్‌లో తమ కార్యకలాపాలకు రెండో హబ్‌గా హైదరాబాద్‌ను ఎంచుకుంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జీఎంఆర్ గ్రూప్ అనుబంధ సంస్థల్లో రెండింటితో జట్టు కట్టింది. డబ్ల్యూఎల్‌పీ ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలిసారిగా భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, నావ షేవా ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్, ఎమిరేట్స్ స్కైకార్గోతో చేతులు కలిపింది. డబ్ల్యూఎల్‌పీకి దేశీయంగా ముంబై తొలి హబ్ కాగా, హైదరాబాద్ రెండోది కానుంది. ఎగుమతులపరంగా దేశీయంగా హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తోందని డబ్ల్యూఎల్‌పీ సీఈవో మైక్ భాస్కరన్ తెలిపారు. వరల్డ్ లాజిస్టిక్స్ పాస్‌పోర్ట్‌లో ప్రస్తుతం బ్రెజిల్, ఇండొనేషియా, దక్షిణాఫ్రికా తదితర 10 పైగా దేశాలు భాగంగా ఉన్నాయని ఆయన వివరించారు. అలాగే యూపీఎస్, ఫైజర్, సోనీ, జాన్సన్ అండ్ జాన్సన్, ఎల్జీ వంటి బహుళ జాతి సంస్థలతో కూడా భాగస్వామ్యం ఉందని పేర్కొన్నారు. చదవండి: ఏటీఎం: కార్డు లేకుండానే నగదు విత్ డ్రా -
అమెరికాలో చదువుకు శ్రీకాకుళం విద్యార్థులు ఎంపిక
రాజాం: అమెరికా విదేశాంగశాఖ స్పాన్సర్ చేసే కమ్యూనిటీ కాలేజ్ ఇనిషియేటివ్ ప్రొగ్రాం (సీసీఐపీ)నకు శ్రీకాకుళం విద్యార్థినులు ఇద్దరు ఎంపికయ్యారు. రాజాంలోని జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ నిర్వహిస్తున్న జీసీఎస్ఆర్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బెహరా మౌనిక, సోపేటి హేమశ్రీ ఈ ప్రొగ్రామ్‌కి ఎంపికయ్యారు. వీరు అమెరికాలో తమకు నచ్చిన కోర్సులు అభ్యసించే అవకాశాన్ని పొందారు. వీరిని హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ ఎంపిక చేసింది. అమెరికా విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో సీసీఐసీ కింద వివిధ దేశాలకు చెందిన అర్హులను ఎంపిక చేసి.. ఏదైనా ఒక అమెరికన్ కమ్యూనిటీ కాలేజీలో ఏడాది చదువుకునే అవకాశం కల్పిస్తారు. వీరి చదువుకయ్యే ఖర్చులు, వసతి సదుపాయం, ఇతర ప్రయాణ ఖర్చులు అమెరికాయే భరించడంతోపాటు నెలవారీ స్టయిఫండ్ కూడా చెల్లిస్తుంది. ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకున్న వారికి జీఎంఆర్ వీఎఫ్ ఉచితంగా శిక్షణ ఇస్తుంది. ఈ విధంగానే మౌనిక, హేమశ్రీ శిక్షణ పొందారు. పేద కుటుంబానికి చెందిన విద్యార్థి మౌనిక.. మౌనిక నిరుపేద మత్స్యకార కుటుంబానికి చెందిన విద్యార్థిని. జీఎంఆర్ వీఎఫ్ గిఫ్టెడ్ చిల్ర్డన్ కోటాలో ఆమె ఉచితంగా జీసీఎస్‌ఆర్‌లో చదువుతోంది. ఎన్విరాన్మెంటల్ హార్టికల్చర్ కోర్సును ఎంపిక చేసుకున్న మౌనిక ఇల్లినాయిస్ స్టేట్‌లో ఉన్న కాలేజ్ ఆఫ్ డూపేజ్‌లో చదువుకోనుంది. విజయనగరం జిల్లాకు చెందిన హేమ తండ్రి బ్యాంకులో మెసెంజర్‌గా పనిచేస్తున్నారు. హేమశ్రీ సస్టెయినబుల్ అగ్రికల్చర్ కోర్సును ఎంచుకుంది. ఫ్లోరిడా స్టేట్ ఓర్లాండ్లో వాలెన్సియా కాలేజీలో చదవనుంది. -
జీఎంఆర్‌కు ‘ఫిలిప్పీన్స్’ షాక్!
సాక్షి, హైదరాబాద్: ఫిలిప్పీన్స్ యాంటీ డమ్మీ చట్ట నిబంధనల ఉల్లంఘన ఆరోపణలను జీఎంఆర్ ఎదుర్కొంటోంది. ఇందుకు సంబంధించి అందిన ఫిర్యాదుపై ఫిలిప్పైన్స్‌లోని మక్టాన్–సెబూ అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ (ఎంసీఐఏఏ), అలాగే విమానాశ్రయ ఆపరేటర్ జీఎంఆర్ మెగావైడ్ సెబూ ఎయిర్పోర్ట్ కార్ప్ (జీఎంసీఏసీ) అధికారులపై చట్టపరమైన చర్యలు ప్రారంభమైనట్లు ఆ దేశ నేషనల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎన్‌బీఐ) తెలిపింది. ఈ ఫిర్యాదు విషయంలో న్యాయశాఖ అధికారుల ముందు తమ యాంటీ–ఫ్రాడ్ విభాగం ఆరోపణలు దాఖలు చేసినట్లు పేర్కొంది. వీరిలో ఐదుగురు ఫిలిప్పైన్స్కు చెందిన ఎంసీఐఏఏ ఉన్నత స్థాయి అధికారులు, జీఎంఆర్ గ్రూప్‌నకు చెందిన కొందరితోసహా పదకొండుమంది విదేశీయులు ఉన్నారని ఎన్‌బీఐ ఇటీవల ఒక ప్రకటన తెలిపింది. ఎన్‌బీఐ తెలిపిన వివరాల ప్రకారం ఐర్లాండ్, ఘనాలకు చెందిన వారూ యాంటీ డమ్మీ చట్ట నిబంధనల ఉల్లంఘన కేసులో ఉన్నారు. అయితే ఈ ఆరోపణలను జీఎంఆర్ ప్రతినిధి నిరాధారమైనవిగా పేర్కొన్నారు. కేసు నుంచి బయటపడతామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. చట్టం ఏం చెబుతోందంటే.. ఫారిన్ ఈక్విటీ విషయంలో నియంత్రణలు, జాతీయీకరణ చట్ట నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినవారిని శిక్షించడానికి ఫిలిప్పీన్స్ యాంటీ డమ్మీ చట్ట నిబంధనలను తీసుకువచ్చింది. మోసపూరిత ఒప్పందాలు, అవగాహనలను ఈ చట్టం తీవ్రంగా పరిగణిస్తోంది. కేసు వివరాల్లోకి వెళితే... అత్యధికంగా బిడ్ దాఖలు చేసిన జీఎంఆర్, ఫిలిప్పీన్స్ మెగావైడ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ కన్సార్షియంకు 2014లో విమానాశ్రయ కాంట్రాక్ట్ దక్కింది. నిర్మాణం, అభివృద్ధి, ఆధునికీకరణ, విస్తరణ, నిర్వహణకు సంబంధించి 25 సంవత్సరాల పాటు సేవలకుగాను 320 మిలియన్ డాలర్లకు ఈ కాంట్రాక్టును కన్సార్షియం దక్కించుకుంది. అయితే ఈ బిడ్డింగ్ ప్రక్రియలో ఫిలిప్పీన్స్ యాంటీ–డమ్మీ చట్ట నిబంధనలను ఉల్లంఘించినట్లు తాజాగా మీడియాలో ఆరోపణలు వచ్చాయి. దీనిపై న్యాయశాఖ అధికారుల ముందు ఫిర్యాదు దాఖలైంది. అయితే ఈ ఆరోపణలపై ఇంతవరకూ న్యాయ విభాగం నుంచి జీఎంసీఏసీకి సమాచారం లేదు. మక్టాన్–సెబూ అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ జనరల్ మేనేజర్ ఒకరిని ఈ ఆరోపణలపై ఇటీవలే ఫిలిప్పీన్స్ ప్రభుత్వం సస్పెండ్ చేసినట్లు సమాచారం. నిజానికి ఈ కాంట్రాక్ట్ కన్సార్షియంకు దక్కడంపై 2014లోనే ఫిలిప్పీన్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే అన్ని పత్రాలూ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత 2016లో ఈ పిటిషన్‌ను ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇదే విషయాన్ని తన తాజా ప్రకటనలో జీఎంఆర్ ప్రతినిధి ప్రస్తావిస్తూ.. ఈ కాంట్రాక్ట్ పక్రియ మొత్తం చట్టాలకు అనుగుణంగా ఉందని ఆ దేశ సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. పునర్నిర్మాణానికి ఓకే... ప్రతిపాదిత పునర్నిర్మాణ ప్రక్రియకు ఎక్సే్ఛంజీల అనుమతి లభించినట్టు జీఎంఆర్ ఇన్ఫ్రా (జీఐఎల్) సోమవారం తెలిపింది. పునర్నిర్మాణంలో భాగంగా ఎనర్జీ, అర్బన్ ఇన్ఫ్రా, ఈపీసీ సర్వీసెస్ విభాగాలను జీఐఎల్ నుంచి విడదీసి జీఎంఆర్ పవర్, అర్బన్ ఇన్ఫ్రాకు బదిలీ చేస్తారు. జీఐఎల్ పూర్తి స్థాయి ఎయిర్పోర్ట్ వ్యాపార సంస్థగా కార్యకలాపాలు సాగిస్తుంది. ఎయిర్‌పోర్టుల వ్యాపారాన్ని విడిగా లిస్ట్ చేయనున్న ట్టు ఈ ఏడాది ఆగస్టులో కంపెనీ వెల్లడించింది. (చదవండి: ‘మహీంద్రా’ శాంగ్యాంగ్ దివాలా) -
‘ప్రైవేటు రైళ్ల’ కోసం కంపెనీల క్యూ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రయాణికుల ప్రైవేటు రైలు సర్వీసుల కోసం పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ప్రైవేటు రైళ్ల నిర్వహణకు తమకు తగిన అర్హతలు ఉన్నాయని నిరూపించుకునేందుకు (రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్) దరఖాస్తులను ఆహ్వానించగా.. 12 క్లస్టర్లకు 15 కంపెనీల నుంచి మొత్తం 120 దరఖాస్తులు దాఖలైనట్టు రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది. వీటిల్లో ఒక్కటి మినహా మిగిలినవన్నీ భారతీయ కంపెనీలే. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా కూడా పాల్గొన్నది. పీపీపీ విధానంలో.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద దేశవ్యాప్తంగా 12కు పైగా క్లస్టర్లలో 140 మార్గాల్లో (రానుపోను) 151 అధునాతన రైళ్లను ఎంపికైన సంస్థలు నిర్వహించాల్సి ఉంటుంది. భారతీయ రైల్వే నెట్‌వర్క్‌పై ప్రయాణికుల రైళ్ల నిర్వహణకు ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించడం ఇదే మొదటిసారి. మొత్తం మీద రూ.30,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్(ఆర్ఎఫ్క్యూ) అన్నది మొదటి దశ. ఈ దశలో తగిన అర్హతలు కలిగిన సంస్థలను రైల్వే శాఖ ఎంపిక చేస్తుంది. వీటి నుంచి రెండో దశలో.. ప్రతిపాదనలను (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్/ఆర్ఎఫ్పీ) ఆహ్వానిస్తుంది. ‘‘దరఖాస్తుల మదింపు ప్రక్రియను రైల్వే శాఖ వేగంగా పూర్తి చేస్తుంది. అర్హత సాధించిన కంపెనీలకు ఆర్ఎఫ్పీ పత్రాలు 2020 నవంబర్ నాటికి అందుబాటులో ఉంటాయి. 2021 ఫిబ్రవరి నాటికి అన్ని క్లస్టర్ల కేటాయింపును పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నాము’’ అని రైల్వే శాఖ ప్రకటించింది. సికింద్రాబాద్ క్లస్టర్‌కు 10 దరఖాస్తులు సికింద్రాబాద్ క్లస్టర్‌కు 10 దరఖాస్తులు వచ్చాయని రైల్వే శాఖ తెలిపింది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌తోపాటు.. జీఎంఆర్ హైవేస్ లిమిటెడ్, ఐఆర్సీటీసీ, అరవింద్ ఏవియేషన్, బీహెచ్ఈఎల్, కన్స్ట్రక్షన్స్ వై ఆక్సిలర్ డీ ఫెర్రోక్యారైల్స్, ఎస్ఏ, క్యూబ్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 3, గేట్‌వే రైల్ ఫ్రయిట్ లిమిటెడ్, ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్, ఎల్అండ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, మాలెంపాటి పవర్ ప్రైవేటు లిమిటెడ్, పీఎన్సీ ఇన్ఫ్రాటెక్, సాయినాథ్ సేల్స్ అండ్ సర్వీసెస్, వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ సంస్థలు ఆర్‌ఎఫ్‌క్యూలు సమర్పించాయి. -
అరబిందో చేతికి కాకినాడ సెజ్
సాక్షి, అమరావతి: జీఎంఆర్ కాకినాడ సెజ్‌లో మెజార్టీ వాటాను అరబిందో గ్రూపు కొనుగోలు చేసింది. కాకినాడ సెజ్ (కేసెజ్) లిమిటెడ్‌లోని 51 శాతం వాటాను అరబిందో గ్రూపునకు చెందిన అరబిందో రియల్టీకి విక్రయిస్తున్నట్లు జీఎంఆర్ గ్రూపు శుక్రవారం ప్రకటించింది. కేసెజ్ అనుబంధ కంపెనీ కాకినాడ గేట్‌వే పోర్ట్ లిమిటెడ్‌కు చెందిన 100 శాతం వాటాను అరబిందో రియల్టీకి బదలాయిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరినట్లు పేర్కొంది. ఈ 51 శాతం వాటాను అప్పులతో కలిపి రూ.2,610 కోట్లకు విక్రయిస్తున్నామని, ఇందులో మొదటి విడతగా రూ.1,600 కోట్లు చెల్లించే విధంగాను మిగిలిన మొత్తం రూ.1,010 కోట్లు రెండు మూడేళ్లలో చెల్లించే విధంగా ఒప్పం కుదుర్చుకుంది. ఇంకా ఈ విక్రయానికి రెగ్యులేటరీ సంస్థల అనుమతులు లభించాల్సి ఉంది. అప్పుల భారం తగ్గించుకోవడంలో భాగంగా వాటా విక్రయించినట్లు జీఎంఆర్ గ్రూపు పేర్కొంది. మార్చి 2020 నాటికి జీఎంఆర్ గ్రూపునకు మొత్తం నికర అప్పులు రూ.26,300 కోట్లుగా ఉన్నాయి. సుమారు 10,400 ఎకరాల్లో జీఎంఆర్ మల్టీ ప్రోడక్ట్ సెజ్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇందులో 5,000 ఎకరాలు పోర్టు ఆథారిత సెజ్‌గా అనుమతులు తీసుకుంది. దీనికి తోడు కోన గ్రామం వద్ద వాణిజ్య అవసరాల కోసం ఓడ రేవును కూడా నిర్మిస్తోంది. ఫార్మా దిగ్గజం అరబిందో ఫార్మా 2019లో అరబిందో రియల్టీ పేరుతో రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టింది. ఇప్పటికే హైదరాబాద్‌లో పలు వాణిజ్య, నివాస సముదాయాలు నిర్మిస్తున్న అరబిందో రియల్టీ సంస్థ ఇప్పుడు కేసెజ్‌లో మెజార్టీ వాటాను దక్కించుకుంది. ఈ వార్తల నేపథ్యంలో శుక్రవారం ఎన్ఎస్ఈలో జీఎంఆర్ గ్రూపు షేరు క్రితం ముగింపు ధరతో పోలిస్తే 14.18 శాతం పెరిగి రూ.24.15 చేరుకొని చివరకు 11.11 శాతం వృద్ధితో రూ.23.50 వద్ద ముగిసింది. -
హైదరాబాద్ నుంచి దుబాయికి విమాన సర్వీసులు
సాక్షి, హైదరాబాద్: ఇతర దేశాలతో విమాన ప్రయాణ సౌకర్యాలు తిరిగి ప్రారంభించే దిశగా, భారత, యూఏఈ ప్రభుత్వాల మధ్య కుదిరిన ‘ఎయిర్ ట్రాన్స్పోర్ట్ బబుల్’ ఒప్పందం ప్రకారం జీఎంఆర్ ఆధ్వర్యంలోని (శంషాబాద్) హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయికి విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో కోలుకుంటున్న పౌర విమాన రంగానికి ఈ చర్య ఊతమివ్వనుంది. యూఏఈకి చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ప్రతి ప్రతి మంగళ, గురు, ఆదివారాలలో వారాని మూడు సర్వీసులను నిర్వహిస్తుంది. భారత ప్రభుత్వ హోమ్ వ్యవహారాల శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏ ప్రయాణికుడైనా హైదరాబాద్ నుంచి దుబాయికి టికెట్టును బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికులందరూ కోవిడ్-19 మార్గదర్శకాలకు లోబడి ఉండాల్సి ఉంటుంది.కోవిడ్ మహమ్మారి కారణంగా దెబ్బ తిన్న ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడానికి భారత ప్రభుత్వం అన్‌లాక్ 3.0 సందర్భంగా, వివిధ దేశాలతో ‘‘ట్రాన్స్పోర్ట్ బబుల్స్’’ లేదా ‘‘వాయు రవాణా ఒప్పందాలు’’ అనే తాత్కాలిక ఏర్పాట్లకు అనుమతించింది. దీని కింద ఏవైనా రెండు దేశాలు కోవిడ్-19 మహమ్మారి కారణంగా రద్దైన రెగ్యులర్ అంతర్జాతీయ సర్వీసులను పున:ప్రారంభించుకోవచ్చు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇప్పటికే పలు జాగ్రత్తల మధ్య అంతర్జాతీయ విమానాల రాకపోకలు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి అతి తక్కువ ప్రయాణ సమయంతో, అత్యంత జాగ్రత్తల మధ్య జరిగే విమాన ప్రయాణాలే అత్యంత సురక్షితమైనవిగా తేలింది. మే 25న హైదరాబాద్ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు పున:ప్రారంభమైన నాటి నుంచి జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సురక్షితమైన ప్రయాణం కొరకు డిపార్చర్ ర్యాంప్ నుంచి బోర్డింగ్ గేటు వరకు పూర్తి శానిటైజ్ చేసిన కాంటాక్ట్-లెస్ అనుభవాన్ని ప్రయాణికులకు అందిస్తోంది. -
జీఎంఆర్ పునర్వ్యవస్థీకరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (జీఐఎల్) పునర్వ్యవస్థీకరణ చేపడుతోంది. లిస్టెడ్ కంపెనీ అయిన జీఐఎల్ నుంచి ఎనర్జీ, అర్బన్ ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలను వేరు చేయనుంది. ఎయిర్‌పోర్ట్స్ వ్యాపారం మాత్రమే జీఐఎల్‌లో భాగం కానుంది. ఎనర్జీ, అర్బన్ ఇన్ఫ్రా, ఈపీసీ విభాగాలు కొత్తగా ఏర్పాటు చేసే కంపెనీ జీఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా లిమిటెడ్‌కు (జీపీయూఐఎల్) బదిలీ అవుతాయి. గురువారం సమావేశమైన బోర్డు ఈ మేరకు ఆమోదం తెలిపింది. పునర్వ్యవస్థీకరణ తర్వాత జీఐఎల్ వాటాదారులు జీపీయూఐఎల్‌లో అదే నిష్పత్తిలో వాటాదారులు అవుతారు. జీఐఎల్‌లో రూ. 1 ముఖ విలువ కలిగిన ప్రతి 10 షేర్లకుగాను రూ.5 ముఖ విలువ కలిగిన ఒక జీపీయూఐఎల్ షేరును అదనంగా జారీ చేస్తారు. జీపీయూఐఎల్ లిస్టింగ్ ప్రక్రియను త్వరలో చేపట్టనున్నారు. ఎయిర్‌పోర్టులపై మరింత దృష్టి... పునర్వ్యవస్థీకరణ ద్వారా ఎయిర్‌పోర్టుల వ్యాపారంపై మరింత ఫోకస్ చేసే అవకాశం లభిస్తుందని కంపెనీ అభిప్రాయపడింది. దేశీయంగా, అంతర్జాతీయంగా ఎయిర్‌పోర్టుల వ్యాపారం ఎన్నో రెట్లు వృద్ధి చెందింది. ఈ రంగంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ద్వారా ప్రయోజనం ఉంటుందని వివరించింది. ‘కొన్నేళ్లుగా జీఐఎల్ ఎన్నో రెట్లు వృద్ధి సాధించింది. ఈ కంపెనీ కింద విభిన్న వ్యాపారాలు కొనసాగుతున్నాయి. మౌలిక రంగ వ్యాపారంలో వృద్ధిని నడిపించడానికి ప్రత్యేక లిస్టెడ్ కంపెనీలు ఉండాలని వాటాదారులు సూచిస్తున్నారు. పలు విధానాలను మేం పరిశీలిస్తున్నాం. ఇందులో భాగంగానే తాజా నిర్ణయం తీసుకున్నాం. జీపీయూఐఎల్‌లో ఎయిర్పోర్టేతర వ్యాపారాలు వాటాదారులకు విలువ చేకూర్చేందుకు మెరుగైన స్థానంలో ఉన్నాయి’ అని జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ, సీఈవో గ్రంధి కిరణ్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. కాగా, ఎయిర్‌పోర్టుల రంగంలో భారత్‌లో అతిపెద్ద ప్రైవేటు కంపెనీ అయిన జీఎంఆర్.. ఫిలిప్పైన్స్, ఢిల్లీ, హైదరాబాద్‌లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. గోవా, గ్రీస్‌లో విమానాశ్రయాలను నిర్మిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో భోగాపురం విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణకు ఇటీవలే ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. జీఎంఆర్ ఇన్ఫ్రాకు రూ.834 కోట్ల నష్టం జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ.834 కోట్ల నష్టం మూటగట్టుకుంది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.336 కోట్ల నష్టం నమోదైంది. టర్నోవరు రూ.2,206 కోట్ల నుంచి రూ.1,224 కోట్లకు వచ్చి చేరింది. ఎయిర్‌పోర్ట్స్ విభాగం టర్నోవరు రూ.494 కోట్లకు పరిమితమైంది. గతేడాది ఇది రూ.1,460 కోట్లు నమోదైంది. మెరుగైన పనితీరుతో విద్యుత్ విభాగం టర్నోవరు రూ.116 కోట్ల నుంచి రూ.300 కోట్లకు ఎగసింది. -
జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ చేతికి జీఎంఆర్ కమళంగ ఎనర్జీ
న్యూఢిల్లీ: జీఎమ్ఆర్ ఎనర్జీకి చెందిన ఒడిషాలోని 1,050 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ను సజ్జన్ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ కొనుగోలు చేయనుంది. డీల్ విలువ రూ.5,321 కోట్లు. ఒడిశాలోని ఈ ప్లాంట్‌ను నిర్వహించే జీఎమ్ఆర్ ఎనర్జీకి చెందిన జీఎమ్ఆర్ కమళంగ ఎనర్జీ లిమిటెడ్‌లో వంద శాతం వాటాను కొనుగోలు చేయడానికి షేర్ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ తెలిపింది. ఈ ప్లాంట్ కొనుగోలుతో తమ మొత్తం స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 5,609 మెగావాట్లకు చేరుతుందని పేర్కొంది. ఈ ప్లాంట్ కొనుగోలుతో దేశపు తూర్పు ప్రాంతంలోకి విస్తరిస్తామని వివరించింది. కాగా ఈ కొనుగోలుకు వివిధ సంస్థల ఆమోదాలు పొందాల్సి ఉంది. ఈ ప్లాంట్ టే కోవర్ పూర్తయితే, జేఎస్డబ్ల్యూకి వంద శాతం అనుబంధ సంస్థగా జీఎమ్ఆర్ కమళంగ ఎనర్జీ లిమిటెడ్(జీకేఈఎల్) మారుతుంది. -
హైదరాబాద్‌లో జీఎంఆర్ బిజినెస్ పార్క్
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉన్న మిగులు స్థలాన్ని ఆదాయ వనరుగా మార్చుకునే క్రమంలో ఏరోడ్రోమ్‌లో ’బిజినెస్ పార్క్’ ఏర్పాటు చేయడంపై జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (జీహెచ్ఐఏఎల్) కసరత్తు చేస్తోంది. దీనిపై సుమారు రూ. 350 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నట్లు జీఎంఆర్ స్థల అభివృద్ధి విభాగం సీఈవో అమన్ కపూర్ తెలిపారు. ఇందులో దాదాపు పది లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్‌తో ఆరు భవంతులు నిర్మిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే ఒక టవర్ పూర్తయ్యిందని, అందులో కొంత భాగంలో జీఎంఆర్ గ్రూప్ సంస్థ ఒకటి కార్యకలాపాలు సాగిస్తోందని అమన్ చెప్పారు. మొత్తం ప్రాజెక్టు పూర్తయి, అందుబాటులోకి రావడానికి మరో రెండు, రెండున్నరేళ్ల సమయం పట్టవచ్చన్నారు. పెట్టుబడిలో కొంతభాగం నిధులను అంతర్గత వనరుల ద్వారా, మిగతాది రుణ మార్గంలోనూ సమీకరిస్తున్నట్లు చెప్పారురు. సిద్ధమవుతున్న రెండో టవర్‌లో ఆఫీస్ స్పేస్‌ను లీజుకిచ్చేందుకు పలు కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయని జీఎంఆర్ వర్గాలు తెలిపాయి. -
జీఎంఆర్ చేతికి క్రీట్ విమానాశ్రయ ప్రాజెక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణ రంగంలో ఉన్న జీఎంఆర్ అనుబంధ కంపెనీ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ చేతికి మరో విమానాశ్రయ ప్రాజెక్టు వచ్చి చేరింది. గ్రీస్‌లోని క్రీట్ రాజధాని నగరమైన హిరాక్లియోలో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కాంట్రాక్టును దక్కించుకుంది. గ్రీక్ కంపెనీ టెర్నా గ్రూప్‌తో కలిసి జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఈ ప్రాజెక్టును చేపడుతోంది. ఈ మేరకు ఇరు సంస్థలు కన్సెషన్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేశాయి. ఒప్పందం కింద విమానాశ్రయ రూపకల్పన, నిర్మాణం, పెట్టుబడి, కార్యకలాపాలు, నిర్వహణను రెండు సంస్థల జాయింట్ వెంచర్ కంపెనీ చేపడుతుంది. ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.4,034 కోట్లు. కన్సెషన్ పీరియడ్ 35 ఏళ్లు. ఈక్విటీ, ప్రస్తుత విమానాశ్రయం నుంచి అంతర్గత వనరులు, గ్రీస్ గవర్నమెంటు ఇచ్చే గ్రాంటు ద్వారా నిర్మాణం చేపడతారు. ఈ ప్రాజెక్టుకు రుణం అవసరం లేదని కంపెనీ తెలిపింది. రెండవ అతిపెద్ద విమానాశ్రయం.. అంతర్జాతీయంగా పర్యాటకులను ఆకట్టుకుంటున్న ప్రాంతాల్లో గ్రీస్ ముందు వరుసలో ఉంటుంది. ఏటా ఇక్కడికి 2.7 కోట్ల మంది పర్యాటకులు వస్తున్నారు. గ్రీస్‌లో ఎక్కువ మంది పర్యటిస్తున్న ద్వీపాల్లో క్రీట్ టాప్‌లో ఉంది. హిరాక్లియో విమానాశ్రయం గ్రీస్‌లో రెండవ అతిపెద్దది. మూడేళ్లుగా విమాన ప్రయాణికుల సంఖ్య ఏటా 10% వృద్ధి చెందుతోంది. ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్టుగా విమానాశ్రయ సా మర్థ్యం సరిపోవడం లేదు. యూరప్ ప్రాంతంలో కంపెనీకి ఇది తొలి ప్రాజెక్టు అని జీఎంఆర్ ఎనర్జీ, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ బిజినెస్ చైర్మన్ శ్రీనివాస్ బొమ్మిడాల ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతంలో మరింత విస్తరిస్తామని చెప్పారు. -
జీఎంఆర్ ఏరోకు ఈసా ధ్రువీకరణ రద్దు
హైదరాబాద్: విమానాల నిర్వహణ, మరమ్మతు సేవలు అందిస్తున్న జీఎంఆర్ ఏరో టెక్నిక్కు యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (ఈసా) ధ్రువీకరణను రద్దు చేసింది. నవంబరు 12 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. యూరోపియన్ యూనియన్ మెంబర్ స్టేట్స్లో నమోదైన విమానాలకు ఇక నుంచి ఈ సంస్థ సర్వీసు చేయడానికి వీల్లేదు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌తో సహా ఇతర సంస్థల నుంచి జీఎంఆర్ ఏరో టెక్నిక్ పొందిన ధ్రువీకరణలపైనా ఈ రద్దు ప్రభావం ఉంటుందని ఈసా స్పష్టం చేయడం గమనార్హం. -
హైదరాబాద్‌లో మల్టిసోర్బ్ ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌లో అమెరికాకు చెందిన మరో కంపెనీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కెమికల్, ఫార్మా రంగాల్లో అవసరమైన ఆక్సిజన్, తేమ ప్యాకేజింగ్ ఉత్పత్తులను తయారు చేసే మల్టిసోర్బ్.. జీఎంఆర్ హైదరాబాద్ ఏవియేషన్ సెజ్ (జీహెచ్ఏఎస్ఎల్)లో దేశంలోనే అతిపెద్ద తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ప్లాంట్ నిర్మాణం, తయారీ యంత్రాలు ఇతరత్రా వాటి కోసం తొలి దశలో రూ.44 కోట్ల పెట్టుబడులు పెట్టామని.. ప్రస్తుతం ఈ కేంద్రంలో 35 మంది ఉద్యోగులు పనిచేస్తారని మల్టిసోర్బ్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ ఎరిక్ అర్మీనట్ తెలిపారు. గురువారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఫిల్ట్రేషన్ గ్రూప్ జీఎం లక్ష్మికాంత్ కైటాన్, సీఓఓ మిచెల్ లిప్పాలతో కలిసి ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం అమెరికాలో రెండు తయారీ కేంద్రాలున్నాయని.. యూఎస్ తర్వాత తొలి తయారీ కేంద్రం హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్లాంట్‌లో రసాయన, ఫార్మా, మెడికల్ డివైజ్ రంగాలకు అవసరమైన మినిపాక్స్, స్ట్రిప్పాక్స్, ఇంటెలిసోర్బ్, స్టాబిలాక్స్ యాక్టివ్ ప్యాకేజ్ ఉత్పత్తులను తయారు చేస్తామని చెప్పారు. దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 30 కోట్ల ప్యాకేజ్లుంటుందని.. ఏడాదిలో 100 కోట్ల ప్యాకేజ్‌లకు పెంచుతామని ఆయన చెప్పారు. త్వరలోనే ఆర్అండ్డీ కూడా ఇక్కడికే.. ప్రస్తుతం దేశీయ కంపెనీలకు అవసరమైన ఉత్పత్తులను అమెరికాలో తయారు చేసి విమానాలు, సముద్ర మార్గాల ద్వారా ఎగుమతి చేస్తున్నాం. కానీ, ఇక నుంచి ఆయా ఉత్పత్తులను హైదరాబాద్ కేంద్రంలోనే తయారు చేస్తాం. త్వరలోనే పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రం (ఆర్అండ్డీ) కూడా ఇక్కడికే తరలిస్తామని ఎరిక్ తెలిపారు. 2 ఎకరాల్లోని ఈ తయారీ కేంద్రాన్ని జీఎంఆర్ ఏవియేషన్ సెజ్ నిర్మించిందని.. 38 ఏళ్ల పాటు లీజింగ్ ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన తెలిపారు. హెల్త్‌కేర్, ఫుడ్ అండ్ బేవరేజెస్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు ప్యాకేజ్డ్ ఆక్సిజన్, తేమ ఉత్పత్తులను అందించే ఫిల్ట్రేషన్ గ్రూప్ అనుబంధ సంస్థే ఈ మల్టిసోర్బ్ కంపెనీ. గత ఆర్ధిక సంవత్సరంలో ఫిల్ట్రేషన్ గ్రూప్ టర్నోవర్ 125 మిలియన్ డాలర్లు. ఇందులో 10 శాతం ఇండియా వాటా ఉంటుందని.. డాక్టర్ రెడ్డిస్, అరబిందో, సన్‌ఫార్మా వంటి దేశంలోని ప్రముఖ 60 కంపెనీలు మా క్లయింట్‌గా ఉన్నాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఏఎస్ఎల్ హెడ్ సౌరభ్ జైన్ కూడా పాల్గొన్నారు. -
జీఎంఆర్‌కు గ్రీస్ విమానాశ్రయ అభివృద్ధి కాంట్రాక్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ సంస్థ అయిన జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌కు గ్రీస్ విమానాశ్రయ అభివృద్ధి కాంట్రా క్ట్ దక్కింది. ఈ మేరకు గ్రీస్ ప్రభుత్వం లేఖను అందించిందని జీఎంఆర్ ఒక ప్రకటనలో తెలిపింది. క్రీటా ద్వీపంలోని హెరాక్లిఆన్ ఎయిర్పోర్ట్ డిజైన్, నిర్మాణం, ఫైనాన్స్‌తో పాటూ కార్యకలాపాల నిర్వహణ బాధ్యత కూడా జీఎంఆర్‌కే దక్కిందని జీఎంఆర్ గ్రూప్ ఎనర్జీ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ బిజినెస్ చైర్మన్ శ్రీనివాస్ బొమ్మిడాల తెలిపారు. మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయాన్ని ఈక్విటీ రూపంలో, గ్రీస్ ప్రభుత్వ గ్రాంట్స్ ఇతరత్రా మార్గాల ద్వారా సమీకరిస్తామని.. తొలి దశ నిర్మాణ వ్యయం సుమారు 520 మిలియన్ యూరోలు అవుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌లో జీఎంఆర్‌తో పాటూ జీఈకే టెర్నా పార్టనర్‌గా వ్యవహరిస్తుందని.. గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ రాయితీ తొలి దశ ఐదేళ్లతో కలిపి.. 35 ఏళ్ల వరకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
ఎన్సీఎల్టీకి జీఎంఆర్ ఛత్తీస్‌గఢ్ ఎనర్జీ ఎన్పీఏ కేసు!
ముంబై: జీఎంఆర్ ఛత్తీస్‌గఢ్ సహా 11 విద్యుత్ ప్రాజెక్టుల ఎన్పీఏ ఖాతాలను జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు (ఎన్సీఎల్టీ) నివేదించాలని బ్యాంకులు నిర్ణయించాయి. ప్రయాగ్‌రాజ్ పవర్ జనరేషన్, జై ప్రకాష్ పవర్ వెంచర్, ఎస్కేఎస్ ఇస్పాత్ పవర్, మీనాక్షి ఎనర్జీ, అథెనా ఛత్తీస్‌గఢ్ వపర్ జబువా, కేఎస్కే మహానంది, కోస్టల్ ఎనర్జెన్, జిందాల్ ఇండియా థర్మల్ పవర్ తదితర కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. రూ.2,000 కోట్లకు పైగా రుణాలు తీసుకుని, చెల్లింపుల్లో ఒక్కరోజు విఫలమైనా సరే వాటిని ఎన్పీఏలుగా గుర్తించాలన్నది ఆర్బీఐ ఆదేశాల సారం. ఇలా ఎన్పీఏలుగా గుర్తించిన కేసుల్లో 180 రోజుల్లోపు బ్యాంకులు పరిష్కారం కనుగొనాలి. లేదా పరిష్కారం కోసం ఎన్సీఎల్టీకి నివేదించాల్సి ఉంటుంది. దీంతో 11 ఎన్పీఏ ఖాతాలను ఎన్సీఎల్టీకి -
హైదరాబాద్ ఎయిర్‌పోర్టు విస్తరణ...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ పనుల కాంట్రాక్టులను ఎల్ అండ్ టీ, మెగావైడ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ దక్కించుకున్నాయి. ఇందులో ఎల్ అండ్ టీ కాంట్రాక్టు విలువ రూ.3,028 కోట్లు కాగా మెగావైడ్ దక్కించుకున్న కాంట్రాక్టు విలువ రూ.980 కోట్లు. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ మేరకు రెండు సంస్థలకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసినట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా ఎక్సే్చంజీలకు తెలిపింది. కాంట్రాక్టుల ప్రకారం టెర్మినల్ భవంతి విస్తరణతో పాటు ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులను 42 నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. తద్వారా ప్రస్తుతం వార్షికంగా 1.2 కోట్ల ప్రయాణికులుగా ఉన్న సామర్థ్యాన్ని 3.4 కోట్లకు పెంచనున్నట్లు జీఎంఆర్ పేర్కొంది. -
దత్తతకి తాజ్
చరిత్ర చెక్కిలిపై చెరగని సంతకంలా చిరకాలం మిగిలిపోవడానికి ఏం చేయాలి ? పండువెన్నెల్లో వెండికొండలా మళ్లీ మెరవాలంటే ఏం చర్యలుతీసుకోవాలి ? కాలుష్యంకోరల్లో చిక్కుకొని, అక్కడక్కడ పెచ్చులు ఊడిపోతూ ప్రమాదంలో ఉన్న మన చారిత్రక సంపద తాజ్‌మహల్ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం, పురావస్తు శాఖ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనట్టే ఉన్నాయి. అందుకే తాజ్‌ని దత్తతకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది ప్రవేశపెట్టిన వారసత్వ కట్టడాల దత్తత పథకం కింద తాజ్‌మహల్‌ని కూడా చేర్చింది. ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేసిన తరహాలోనే ఇప్పుడు తాజ్‌మహల్‌ని కూడా ఎవరైనా దత్తత తీసుకోవచ్చు. అలా తీసుకున్న వారు తాజ్ నిర్వహణ, , పర్యాటకులకు సదుపాయాల కల్పన, వారి భద్రత , తాగునీటి సౌకర్యం, పార్కింగ్ సౌకర్యం, పరిశుభ్రత, తాజ్ చుట్టూ పచ్చదనాన్ని పెంచడం వంటి చర్యలన్నీ తీసుకోవాలి.ఇప్పటికే తాజ్‌ని దత్తత తీసుకోవడానికి ఎన్నో కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చాయి. వాటిలో జీఎంఆర్ గ్రూప్, ఐటీసీ లిమిటెడ్‌లు రేసులో ముందున్నాయి. తాజ్‌ను దత్తతకిస్తే దాని పరిరక్షణలో ఇక పురావస్తు శాఖ పాత్ర పరిమితమైపోతోంది. వారసత్వ కట్టడాల దత్తత పథకంలో ఏముంది ? మన దేశంలో ఎన్నో వారసత్వ కట్టడాలు జీర్ణా వస్థకు చేరుకున్నాయి. వాటిని కాపాడుకోవడం పురావస్తు శాఖకు తలకు మించిన భారంగా మారింది. అందుకే మన వారసత్వ సంపదని కాపాడుకోవడానికి మోదీ ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ పథకాన్ని మొదలుపెట్టింది. కేంద్ర పర్యాటక శాఖ, పురావస్తు శాఖ సహకారంతో సంయుక్తంగా దీనిని ప్రారంభించాయి. దేశంలో ప్రముఖ కార్పొరేట్ కంపెనీలన్నీ ఈ కట్టడాల సంరక్షణను ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. కార్పొరేట్ కంపెనీలన్నీ తమకు వచ్చిన లాభాల్లో 2 శాతం సేవా కార్యక్రమాలకు తప్పనిసరిగా ఖర్చు చేయాలి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ బడ్జెట్‌ని చారిత్రక కట్టడాలపై కూడా ఖర్చు చేయాలని కేంద్రం సూచించింది. దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి, చారిత్రక కట్టడాల్లో ప్రపంచస్థాయి సదుపాయాలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. తాజ్‌పై జీఎంఆర్ విజన్ డాక్యుమెంట్ తాజ్‌మహల్‌కి ఉన్న చారిత్రక ప్రా«ధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని దానిని మొదట ఈ పథకం కింద చేర్చలేదు. అయితే ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు యజమాని జీఎంఆర్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తాజ్‌మహల్‌ని దత్తత తీసుకుంటామంటూ పర్యాటక శాఖకు దరఖాస్తు చేసుకుంది. దానిని పరిరక్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటామో వివరిస్తూ ఒక నివేదిక రూపొందించింది. తాజ్‌మహల్ నుంచి ఆగ్రా కోటని కలిపే తాజ్ కారిడార్ నిర్వహణ బాధ్యతలు తీసుకుంటామని ఆ నివేదికలో పేర్కొంది. మరోవైపు వినియోగదారుల ఉత్పత్తులు, సిగరెట్ల కంపెనీ ఐటీసీ కూడా తాజ్‌ని దత్తత తీసుకుంటామని ముందుకు వచ్చింది. పర్యాటక శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలోని ఒక అధికార బృందం వారి నివేదికలను పరిశీలించిన తర్వాత ఎవరికి దత్తతకివ్వాలో నిర్ణయిస్తుంది. తాజ్‌తో పాటుగా ఎర్రకోట, ఇతిమాద్–ఉద్–దౌలా కూడా దత్తతకివ్వాలని జీఎంఆర్ కోరుతోంది. మరోవైపు ఐటీసీ కంపెనీ హైదరాబాద్‌లో చార్మినార్, ఆంధ్రప్రదేశ్‌లోని రాతి ఆలయాలను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 75 వారసత్వ కట్టడాలను దత్తత తీసుకోవడానికి వివిధ కార్పొరేట్ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
శంషాబాద్ విమానాశ్రయం దశాబ్ది వేడుకలు
హైదరాబాద్ : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(జీఎంఆర్ హైదరాబాద్) ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చి పదేళ్లు పూర్తయిన సందర్భంగా జీఎంఆర్ సంస్థ ఏర్పాటు చేసిన దశాబ్ది వేడుకలను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. 2008లో ప్రారంభమైన విమానాశ్రమం క్రమక్రమంగా విస్తరిస్తూ వస్తోంది. హైదరాబాద్ కీర్తిని పెంచుతూ, సిటీ ఐకాన్‌గా నిలిచింది. ఈ దశాబ్ది వేడుకల్లో డెకెడ్ ఆఫ్ ఎక్సలెన్స్ స్టాంప్‌తోపాటు, ఎన్వలప్‌ని విడుదల చేశారు. జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ నిర్వహించే శిక్షణ కార్యక్రమాల కోసం ప్రభుత్వంతో మూడు ఎంవోయూలపై సంతకాలు చేశారు. విస్తరణ పనులకు శంకుస్థాపన: శంషాబాద్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో విస్తరించే పనులకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అదే విధంగా దేశంలో అతి పెద్ద కన్వెక్షన్ సెంటర్‌కు శిలాఫలకం ప్రారంభించారు. దేశంలోనే మెట్టమొదటి స్మార్ట్, గ్రీన్ ఫీల్డ్ సిటీని కూడా ఆయన ప్రారంభించారు. ఏడాదికి కోటి ఇరవై లక్షల ప్రయాణికుల సామర్థ్యంతో విమానాశ్రయం ప్రారంభమైన భవిష్యత్తులో ఏడాదికి నాలుగు కోట్ల మందిని తట్టుకునేలా విస్తరణ చేపడతామని జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ వేడుకల్లో జీఎంఆర్ చైర్మన్ గ్రంధి మలికార్జునరావు, మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, సినీ నటుడు రామ్‌చరణ్ పాల్గొన్నారు. -
అప్పుల కుప్పలు... ఈ పవర్ ప్రాజెక్టులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దాదాపు 34 విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు భారీ రుణాల భారంతో సతమతమవుతున్నాయి. వీటిలో ల్యాంకోకి చెందిన ప్రాజెక్టులు 4, జీఎంఆర్ ఎనర్జీకి చెందినవి మూడు, జీవీకే ఇండస్ట్రీస్ ప్రాజెక్టు ఒకటి ఉన్నాయి. విద్యుత్ రంగంలో తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్న/నిరర్థక ఆస్తులుగా మారిన ప్రాజెక్టులపై పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో స్టాండింగ్ కమిటీ (విద్యుత్ రంగం) ఈ విషయాలు పొందుపర్చింది. 2017 జూన్ నాటికి ఆర్బీఐ గణాంకాల ప్రకారం వీటి విలువ సుమారు రూ. 1.74 లక్షల కోట్లుగా ఉంది. అదానీ, ఎస్సార్, జేపీ ప్రాజెక్టులు కూడా వీటిలో ఉన్నాయి. నివేదిక ప్రకారం ల్యాంకోకి చెందిన అమర్ కంటక్ ప్రాజెక్టు రుణ బకాయి రూ.8,782 కోట్లు, అన్పారా (రూ. 3,071 కోట్లు), విదర్భ (రూ. 4,762 కోట్లు), బాబంధ్ రుణాలు రూ. 6,976 కోట్లు మేర ఉన్నాయి. అటు జీఎంఆర్ ఎనర్జీ వరోరా ప్రాజెక్టు రుణభారం రూ. 2,905 కోట్లు, రాయ్ఖేడా (రూ. 8,174 కోట్లు), కమలాంగా ప్రాజెక్టు రుణం రూ. 4,100 కోట్లుగా ఉంది. జీవీకే ఇండస్ట్రీస్‌కి చెందిన గోయింద్వాల్ సాహెబ్ ప్రాజెక్టు బకాయిలు రూ. 3,523 కోట్ల మేర ఉన్నాయి. కేఎస్కే మహానది పవర్ కంపెనీకి చెందిన అకల్తారా ప్రాజెక్టు రుణభారం ఏకంగా రూ. 17,194 కోట్లు ఉంది. అదానీ గ్రూప్, జేపీ గ్రూప్‌కి చెందిన కొన్ని ప్రాజెక్టుల రుణ బాకీలు రూ. 11,000 కోట్ల పైగా ఉన్నాయి. -
జీఎంఆర్ నష్టం రూ. 566 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ దిగ్గజం జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 566 కోట్ల నికర నష్టం (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో కంపెనీ రూ. 643 కోట్ల లాభం నమోదు చేసింది. ఇక తాజా క్యూ3లో ఆదాయం కూడా రూ. 2,587 కోట్ల నుంచి రూ. 2,296 కోట్లకు క్షీణించింది. అటు మొత్తం వ్యయాలు రూ. 2,624 కోట్ల నుంచి రూ. 2,488 కోట్లకు తగ్గాయి. బుధవారం బీఎస్ఈలో జీఎంఆర్ షేరు 1.75 శాతం నష్టంతో రూ. 19.70 వద్ద ముగిసింది. -
జీహెచ్‌ఐఏఎల్‌లో జీఎంఆర్ వాటా పెంపు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో (జీహెచ్ఐఏఎల్) జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ (జీఏఎల్) 11 శాతం వాటా పెంచుకుంటోంది. మలేసియన్ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్, ఎంఏహెచ్‌బీ (మారిషస్) నుంచి ఈ వాటాను కొనుగోలు చేస్తోంది. డీల్ విలువ సుమారు రూ.484 కోట్లు. మూడు నెలల్లో ఈ లావాదేవీ పూర్తి కానుందని సమాచారం. డీల్ పూర్తి అయితే జీహెచ్‌ఐఏఎల్‌లో జీఏఎల్ షేరు 74 శాతానికి చేరనుంది. జీహెచ్‌ఐఏఎల్‌లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 13 శాతం, తెలంగాణ ప్రభుత్వానికి 13 శాతం వాటా ఉంది. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని స్పెషల్ పర్పస్ వెహికిల్ అయిన జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్వహిస్తోంది. -
భోగాపురంలో ఏఏఐ టెండర్లు రద్దు
-
లోయెస్ట్ బిడ్డర్... జీఎంఆర్–మెగావైడ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ జీఎంఆర్ ఇన్ఫ్రా, మనీలాకు చెందిన మెగావైడ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ల సంయుక్త భాగస్వామ్య సంస్థ... ఫిలిప్పైన్స్‌లోని విమానాశ్రయ ప్రాజెక్టుకు తక్కువ కోట్ చేసిన బిడ్డర్‌గా నిలిచింది. క్లార్క్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ నిర్మాణానికి ఫైనాన్షియల్ బిడ్ దాఖలుకు 5 కంపెనీలు ఎంపిక కాగా.. వీటిలో ఇదొకటి. కాంట్రాక్టు దక్కించుకునే విషయంలో బాగా పోటీ ఉందని బేసెస్ కన్వర్షన్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చైర్ జేక్ బిన్కాంగ్ తెలిపారు. మెగావైడ్–జీఎంఆర్ జేవీ ఆఫర్‌ను పరిశీలిస్తామని చెప్పారు. డిసెంబరు 18న ఎంపికైన కంపెనీని ప్రకటిస్తారు. డిసెంబరు 20న కొత్త టెర్మినల్‌కు శంకుస్థాపన చేసే అవకాశముంది. ప్యాసింజర్ టెర్మినల్ నిర్మాణానికి కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుంది. ఆపరేషన్స్, మెయింటెనెన్స్ కాంట్రాక్టుకు టెండర్లను 2018లో పిలుస్తారు. ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.1,614 కోట్లు. 2020 నాటికి విస్తరణ పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏటా 40 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యం ఈ విమానాశ్రయానికి ఉంది. దీనిని 1.2 కోట్ల ప్రయాణికుల స్థాయికి చేరుస్తారు. ఇప్పటికే జీఎంఆర్ ఫిలిప్పైన్స్‌లోని మక్టన్ సెబు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విస్తరణ ప్రాజెక్టును మెగావైడ్తో కలిసి చేపట్టింది. -
జీఎంఆర్ కాకినాడ పవర్ ప్లాంటు రూ.400 కోట్లకు విక్రయం
హైదరాబాద్: కాకినాడ వద్ద ఉన్న 220 మెగావాట్ల గ్యాస్ ఆధారిత పవర్‌ప్లాంటును సుమారు రూ.400 కోట్లకు ఓ కంపెనీకి విక్రయిస్తున్నట్టు జీఎంఆర్ గ్రూప్ తెలిపింది. త్వరలో ఆ కంపెనీతో ఒప్పందం చేసుకోనున్నట్టు వెల్లడించింది. జీఎంఆర్ ఈ ప్రాజెక్టుకు చేసిన వ్యయం రూ.600 కోట్లు. ఈ ప్లాంటు 2001లో ప్రారంభం అయింది. సహజవాయువు కొరత కారణంగా 2013 నుంచి ప్లాంటులో విద్యుత్‌ఉత్పత్తి నిలిచిపోయింది. -
గోవా ఎయిర్‌పోర్టుకు రుణాలు ఓకే: జీఎంఆర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గోవాలో జీఎంఆర్ ప్రతిపాదించిన మోపా ఎయిర్పోర్ట్ ప్రాజెక్టుకు నిధుల సమీకరణ పూర్తయింది. విమానాశ్రయ అభివృద్ధికై యాక్సిస్ బ్యాంకు రూ.1,330 కోట్ల రుణాన్ని సమకూరుస్తోంది. ఉత్తర గోవాలోని మోపా ఎయిర్‌పోర్టు అభివృద్ధి ప్రాజెక్టును 2016 నవంబరులో జీఎంఆర్ దక్కించుకుంది. డిజైన్, నిర్మాణం, ఫైనాన్స్‌తోపాటు విమానాశ్రయాన్ని 40 ఏళ్లపాటు జీఎంఆర్ నిర్వహిస్తుంది. మరో 20 ఏళ్లపాటు నిర్వహణ కాంట్రాక్టు పొడిగించేందుకు అవకాశం కూడా ఉంది. ట్రాఫిక్‌కు అనుగుణంగా దశలవారీగా విస్తరణ చేపడతామని జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ చైర్మన్ శ్రీనివాస్ బొమ్మిడాల తెలిపారు. -
టి20 గ్లోబల్ లీగ్‌లో జీఎంఆర్, షారుక్ జట్లు
లండన్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల యజమానులుగా ఉన్న పారిశ్రామికవేత్త గ్రంధి మల్లికార్జున రావు (జీఎంఆర్), బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ ఇప్పుడు దక్షిణాఫ్రికా లీగ్‌పై కన్నేశారు. క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) ఆధ్వర్యంలో ఎనిమిది జట్ల మధ్య అక్టోబరు–నవంబరులో జరిగే టి20 గ్లోబల్ లీగ్‌లో వీరిద్దరూ ఫ్రాంచైజీలను కొనుగోలు చేశారు. జొహన్నెస్‌బర్గ్ సిటీకి ప్రాతినిధ్యం వహించే జీఎంఆర్ జట్టులో పేసర్ రబడ స్టార్ ఆటగాడిగా ఉన్నాడు. ఇక కేప్‌టౌన్ ఆధారంగా ఉండే షారుక్ జట్టులో బ్యాట్స్‌మన్ డుమిని స్టార్ ఆటగాడు. డర్బన్, బెనోని, ప్రిటోరియా, స్టెలెన్‌బాష్, బ్లోమ్‌ఫోంటీన్, పోర్ట్ ఎలిజబెత్ ఈ లీగ్‌లోని మిగతా జట్లు. ఆగస్టు 19న ఆటగాళ్ల వేలం జరగనుండగా దీంట్లో అందుబాటులో ఉండేందుకు 10 దేశాల నుంచి 400 మంది ఆసక్తి చూపుతున్నారు. -
డేవో ఎయిర్పోర్ట్ రేసులో జీఎంఆర్
ప్రీ–క్వాలిఫైడ్ బిడ్డర్‌గా నిలిచిన కంపెనీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ జీఎంఆర్ మరో ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు రేసులో ముందంజలో ఉంది. ఫిలిప్పైన్స్‌లోని డేవో ఎయిర్పోర్ట్ విస్తరణ ప్రాజెక్టుకు జీఎంఆర్–మెగావైడ్ కన్సార్షియం ప్రీ–క్వాలిఫైడ్ బిడ్డర్‌గా నిలిచింది. ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.5,200 కోట్లు. కాంట్రాక్టులో భాగంగా ఎయిర్పోర్ట్ అభివృద్ధి, కొత్తగా ప్యాసింజర్ టెర్మినల్ నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన, కార్యకలాపాల నిర్వహణ చేపట్టాల్సి ఉంటుంది. అలాగే ఆప్రాన్, రన్ వే, ట్యాక్సీ వే వంటివి విస్తరించాలి. ప్రాజెక్టుకు పోటీపడుతున్నట్టు జీఎంఆర్ ధ్రువీకరించింది. డేవోతోసహా 5 ప్రాంతీయ విమానాశ్రయాలను ప్రైవేటు పరం చేయాలని ఫిలిప్పైన్స్ ప్రభుత్వం నిర్ణయించింది. 2016లో 35 లక్షల మంది డేవో విమానాశ్రయం నుంచి ప్రయాణించారు. ప్రయాణికుల సంఖ్య ఏటా 10 శాతం పెరుగుతోంది. జీఎంఆర్–మెగావైడ్ కన్సార్షియం ఇప్పటికే ఫిలిప్పైన్స్‌లోని మక్టన్ సెబూ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తోంది. -
జీఎంఆర్ ఎయిర్‌పోర్టులు ఇక ప్రత్యేక కంపెనీ!
లిస్టింగ్ కోసం సన్నాహాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానాశ్రయాల వ్యాపారాన్ని విడదీయడంతోపాటు వేరుగా లిస్టింగ్ చేసే పనిలో జీఎంఆర్ ఇన్ఫ్రా నిమగ్నమైనట్టు సమాచారం. ఈ మేరకు రుణదాతల నుంచి అనుమతి కోరినట్టు తెలిసింది. ప్రస్తుతం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను జీఎంఆర్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫిలిప్పైన్స్‌లోని మక్టన్ సెబు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సైతం సంస్థ ఖాతాలోనే ఉంది. ఉత్తర గోవాలోని మోపా అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి ప్రాజెక్టును చేజిక్కించుకుంది కూడా. అయితే జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌ను రూ.20,000 కోట్లుగా విలువ కట్టాలని జీఎంఆర్ ఇన్ఫ్రా భావిస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా కంపెనీకి విలువ చేకూర్చడంతోపాటు రుణ భారం తగ్గించుకోవాలన్నది సంస్థ ఆలోచన. ఎయిర్‌పోర్ట్స్ విభాగాన్ని విడదీయడం, లిస్టింగ్ వార్తలను సంస్థ ఖండించింది. అయితే జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిస్టింగ్ చేయనున్నట్టు గతంలోనే కంపెనీ తెలిపింది. జీఎంఆర్ ఇన్ఫ్రా మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.9,271 కోట్లుగా ఉంది. ఎయిర్‌పోర్ట్స్ విభాగంలో జీఎంఆర్ ఇన్ఫ్రాకు 97 శాతం వాటా ఉంది. బీఎస్ఈలో జీఎంఆర్ షేరు శుక్రవారం ముగింపు ధర రూ.14.39. సోమవారం రూ.14.50 దగ్గర ప్రారంభమై తాజా వార్తల నేపథ్యంలో రూ.15.82 దాకా వెళ్లిన షేరు, చివరకు రూ.15.36 దగ్గర స్థిరపడింది. -
జీఎంఆర్ రాజమండ్రి ఎనర్జీలో అమ్మకానికి వాటా
న్యూఢిల్లీ: జీఎంఆర్ ఇన్ఫ్రాకు చెందిన జీఎంఆర్ రాజమండ్రి ఎనర్జీలో ఉన్న 55 శాతం వాటాను విక్రయించేందుకు ఐడీబీఐ బ్యాంకు నేతృత్వంలోని కంపెనీలు ముందుకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి వద్ద ఉన్న 768 మెగావాట్ల సహజ వాయువు ఆధారిత విద్యుత్ ప్లాంటుకై ఇచ్చిన అప్పులో కొంత మొత్తాన్ని రుణమిచ్చిన కంపెనీలు...ఆ రుణంలో కొంత భాగాన్ని గతేడాది ఈక్విటీగా మార్చుకున్నాయి. ఇప్పటికీ ఈ ప్రాజెక్టుపై రూ.2,366 కోట్ల అప్పు ఉంది. రుణ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ వాటాను విక్రయిస్తున్నాయి. స్తోమత కలిగిన కంపెనీలు బిడ్డింగ్‌లో పాల్గొని 55 శాతం వాటాను దక్కించుకోవచ్చని, మేనేజ్మెంట్ కంట్రోల్ చేపట్టవచ్చని ప్రీ–బిడ్ డాక్యుమెంట్లో ఐడీబీఐ క్యాపిటల్ తెలిపింది. విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం 2012లో పూర్తి అయినప్పటికీ గ్యాస్ కొరత కారణంగా 2015 అక్టోబరులో పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభమైంది. -
జీఎంఆర్ ఇన్ఫ్రాకు రూ.700 కోట్ల నష్టం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సెప్టెంబరు త్రైమాసికం స్టాండలోన్ ఫలితాల్లో రూ.700 కోట్ల నష్టం వాటిల్లింది. అనుబంధ కంపెనీల్లో పెట్టిన పెట్టుబడుల విలువ తగ్గడమే ఇందుకు కారణమని కంపెనీ వెల్లడించింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీకి రూ.7.4 కోట్ల నష్టం వచ్చింది. క్యూ2లో టర్నోవరు క్రితంతో పోలిస్తే రూ.281 కోట్ల నుంచి రూ.330 కోట్లకు చేరింది. -
‘మాలె ’ వివాదంలో జీఎంఆర్‌కు ఊరట
• ఎయిర్‌పోర్టుపై ఆర్బిట్రేషన్‌లో మాల్దీవుల ప్రభుత్వానికి చుక్కెదురు • జీఎంఆర్‌కు 270 మిలియన్ డాలర్లు • చెల్లించాలని ట్రిబ్యునల్ ఆదేశాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మాలె అంతర్జాతీయ విమానాశ్రయ వివాదంలో ఇన్ఫ్రా దిగ్గజం జీఎంఆర్ అనుబంధ సంస్థ జీఎంఆర్ మాలె ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (జీఎంఐఏఎల్)కు ఊరట లభించింది. ఎయిర్పోర్ట్ కాంట్రాక్టు రద్దు నిర్ణయాన్ని తోసిపుచ్చుతూ జీఎంఐఏఎల్‌కు 270 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 1,800 కోట్లు) పరిహారం చెల్లించాలని మాల్దీవుల ప్రభుత్వాన్ని ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. రుణ మొత్తం, ప్రాజెక్టుపై పెట్టిన పెట్టుబడి, లీగల్ ఖర్చులు మొదలైనవన్నీ ఇందులో ఉంటాయని జీఎంఆర్ వెల్లడించింది. మాల్దీవుల ప్రభుత్వం .. ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేయడం సరికాదన్న తమ వాదనలే గెలిచాయని జీఎంఆర్ ప్రతినిధి పేర్కొన్నారు. ‘ట్రిబ్యునల్ ఆదేశాలు.. మా కార్పొరేట్ గవర్నెన్స్, అత్యున్నత స్థాయి ప్రమాణాలు, వ్యాపార విలువల పట్ల జీఎంఆర్ గ్రూప్ నిబద్ధతను నిరూపించేవిగా ఉన్నాయి’అని వ్యాఖ్యానించారు. ఇబ్రహీం నాసిర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఆధునీకరణ, పాతికేళ్ల పాటు నిర్వహణకు సంబంధించి మాల్దీవుల ప్రభుత్వం (జీవోఎం) మాల్దీవ్స్ ఎయిర్పోర్ట్ కంపెనీ (ఎంఏసీఎల్)తో జీఎంఐఏఎల్ 2010లో ఒప్పందం కుదుర్చుకుంది. జీఎంఆర్ ప్రణాళికల ప్రకారం ఈ ప్రాజెక్టులో సుమారు 500 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంది. ఈ నిధుల్లో సింహభాగం 358 మిలియన్ డాలర్లు యాక్సిస్ బ్యాంకు రుణంగా అందించేలా జీఎంఆర్ ఏర్పాట్లు చేసుకుంది. అయితే, ఎయిర్పోర్ట్ అభివృద్ధి ఫీజు కింద 25 డాలర్ల వసూలుపై వివాదం తలెత్తడం, ప్రాజెక్టు కేటాయింపు ప్రక్రియలో గత ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదంటూ ఆరోపణలు రావడం తదితర పరిణామాల మధ్య 2012లో జీఎంఐఏఎల్ ప్రాజెక్టును మాల్దీవుల ప్రభుత్వం రద్దు చేసింది. ఇది ఏకపక్షంగా జరిగిందని, దీన్ని సవాల్ చేస్తూ జీఎంఆర్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. నష్టపరిహారం ఇప్పించాలంటూ కోరింది. ఈ నేపథ్యంలోనే త్రిసభ్య అంతర్జాతీయ ట్రిబ్యునల్ తాజాగా తుది ఆదేశాలు ఇచ్చింది. -
ఢిల్లీ విమానాశ్రయానికి మరో ఘనత
న్యూఢిల్లీ: జీఎంఆర్ ఆధ్వర్యంలోని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (డీఐఏఎల్) తాజాగా మరో ఘనతను సొంతం చేసుకుంది. డీఐఏఎల్ కార్బన్ అక్రిడిటేషన్‌ను ‘లెవల్ 3+, తటస్థ స్థితి’కి ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ అప్‌గ్రేడ్ చేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కార్బన్ తటస్థ స్థితిని పొందిన తొలి విమానాశ్రయం డీఐఏఎల్ అని సంస్థ ఓ ప్రకటన లో తెలిపింది. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ సర్టిఫికెట్‌ను డీఐఏఎల్ సీఈవో ఐ ప్రభాకర్‌రావు కెనడాలోని మాంట్రియల్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో స్వీకరించారు. -
జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్‌కు అనుమతి
ఐఆర్బీ, ఎంఈపీ ఐఎన్విట్లకూ సెబీ గ్రీన్ సిగ్నల్ ముంబై: మౌలికరంగ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఐఎన్‌విట్)లకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసి రెండేళ్లు గడిచిన తర్వాత ఒకేసారి మూడు సంస్థలు ఐఎన్‌విట్‌ల ఏర్పాటుకు సెబీ అనుమతి పొందాయి. తొలిగా ఐఆర్బీ ఐఎన్విట్కు సెబీ అనుమతి జారీ చేయగా, ఆ వెంటనే జీఎంఆర్, ఎంఈపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలకు సైతం అనుమతి మంజూరు చేసింది. దీంతో ఇవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐఎన్‌విట్‌ల ఏర్పాటు ద్వారా ఐపీవో మార్గంలో నిధులు సమీకరించడంతోపాటు ఎక్స్ఛేంజ్లలో లిస్ట్ అవుతాయి. ఇప్పటికే ఐఆర్బీ ఐఎన్‌విట్ రూ.4,300 కోట్ల నిధుల సమీకరణకు సంబంధించిన ఐపీవో దరఖాస్తు పత్రాలను సెబీ వద్ద దాఖలు చేసింది. ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లనేవి మ్యూచువల్ ఫండ్స్‌లా పనిచేస్తాయి. వీటిల్లో రిటైల్, ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆ ప్రాజెక్టులపై వచ్చే లాభాలను సొంతం చేసుకోవచ్చు. కంపెనీలు ప్రాజెక్టులపై నిధులను పొందడానికి వీలు కల్పిస్తాయి. ఐఎన్‌విట్, ఆర్ఈఐటీల మార్గదర్శకాలను సెబీ 2014 ఆగస్ట్‌లో జారీ చేసింది. పన్ను పరమైన అంశాలతో ఒక్క కంపెనీ ముందుకు రాలేదు. దీంతో మార్గదర్శకాలను సరళతరం చేయనున్నట్టు సెబీ ఇటీవలే ప్రకటించింది. -
విమానాశ్రయ ప్రాజెక్టులకు రూ.4,650 కోట్లు: జీఎంఆర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : కొత్తగా చేపడుతున్న విమానాశ్రయ ప్రాజెక్టులకు వచ్చే మూడేళ్లలో సుమారు రూ.4,650 కోట్లు ఖర్చు చేయనున్నట్టు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఫైనాన్స్, బిజినెస్ డెవలప్మెంట్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ కపూర్ వెల్లడించారు. ఫిలిప్పైన్స్‌లోని సెబూతోపాటు ఉత్తర గోవాలోని మోపా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి ప్రాజెక్టులను జీఎంఆర్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. -
జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ‘మసాలా’ బాండ్లు..!
న్యూఢిల్లీ: జీఎంఆర్ ఆధ్వర్యంలోని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (డీఐఏఎల్) రుణ భారం తగ్గించుకునే యత్నాల్లో ఉంది. రూ.3,000 కోట్ల నిధుల సమీకరణకు మసాలా బాండ్ల జారీ సహా పలు అవకాశాలను పరిశీలిస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ కపూర్ ఈ విషయమై మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. డీఐఏఎల్ రుణాన్ని తక్కువ వ్యయం రుణాలతో తీర్చివేయాలనుకుంటున్నట్టు తెలిపారు. రూ.3వేల కోట్లను మసాలా బాండ్లు లేదా డాలర్ ఆధారిత బాండ్ల జారీ ద్వారా సేకరించి పాత రుణాలను తీర్చివేయనున్నట్టు చెప్పారు. వచ్చే రెండు నుంచి మూడు నెలల్లో వీటి జారీ ఉంటుందన్నారు. మసాలా బాండ్లు అనేవి విదేశీ మార్కెట్లో జారీ చేసే రూపాయి బాండ్లు. తక్కువ వ్యయానికే రుణాల సేకరణకు ఇదొక మార్గం. ఇప్పటికే హెచ్డీఎఫ్సీ బ్యాంకుతోపాటు పలు సంస్థలు మసాలా బాండ్లను జారీ చేశాయి. నిధుల లేమితోచిన్న పరిశ్రమల కటకట... న్యూఢిల్లీ: లఘు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) నిధుల లేమితో తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నాయని క్రిసిల్-అసోచామ్ సంయుక్త అధ్యయనం తెలిపింది. మధ్యకా లికంగా ఈ రంగం నుంచి రూ.45 లక్షల కోట ్లకు రుణ డిమాండ్ ఉంటుందని పేర్కొన్న నివేదిక, సమీపకాలంలో రూ.5.15 లక్షల కోట్లు అవసరమని విశ్లేషించింది. నిధుల సమీకరణ సైతం ఎం ఎస్ఎంఈలకు క్లిష్టమైన సమస్యని పేర్కొంది. -
జీఎంఆర్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ రేటింగ్‌లో కోత
దీనికిచ్చే రుణాలకు రిస్కుంది: మూడీస్ న్యూఢిల్లీ: రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్... మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ కన్సార్షియం సారథ్యంలోని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (డీఐఏఎల్) క్రెడిట్ రేటింగ్‌ను తగ్గిస్తూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. నిధుల లభ్యత విషయంలో ఆందోళనకర పరిస్థితుల కారణంగా .. రేటింగ్‌ను ‘బీఏ2’ నుంచి ‘బీఏ1’కి తగ్గిస్తున్నట్లు పేర్కొంది. రుణాలకు సంబంధించి గణనీయమైన రిస్కు ఉన్నట్టుగా ‘బీఏ’ సూచిస్తుంది. ‘‘ఈ కంపెనీకి నిర్వహణకు అవసరమైన నిధులను సమకూర్చుకోగలిగే సామర్థ్యం తగ్గింది. ఈ సామర్థ్యానికి సంబంధించి ఆందోళనకరమైన పరిస్థితి కొనసాగుతోందనేది తాజా డౌన్‌గ్రేడ్ సూచిస్తుంది’’ అని మూడీస్ వైస్ ప్రెసిడెంట్ అభిషేక్ త్యాగి తెలిపారు. ఎయిర్‌పోర్ట్స్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ (ఏఈఆర్ఏ) ఇటీవల ఇచ్చిన టారిఫ్ ఆర్డరు కారణంగా 2018 ఆర్థిక సంవత్సరం నుంచి వార్షిక ఏరోనాటికల్ ఆదాయాలు సుమారు రూ. 2,000 కోట్ల మేర (దాదాపు 70 శాతం) తగ్గవచ్చని మూడీస్ పేర్కొంది. ఇది కంపెనీ ఆదాయాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని అభిప్రాయపడింది. ఇక రాబోయే 3-5 ఏళ్లలో ప్రతిపాదిత విస్తరణ ప్రణాళికలతో ఆర్థికపర మైన ఒత్తిడి మరింతగా పెరగవచ్చని తెలిపింది. ఇలా విస్తరణ ప్రణాళికలు, నియంత్రణ వ్యవస్థపరమైన అనిశ్చితి తదితర అంశాల మూలంగా సమీప భవిష్యత్‌లో రేటింగ్ పెరిగే అవకాశాలు లేవని పేర్కొంది.. ప్రస్తుతానికి తగిన ంత లిక్విడిటీ ఉన్నందున స్థిరమైన అవుట్‌లుక్‌ను కొనసాగిస్తున్నట్లు మూడీస్ వివరించింది. జీఎంఆర్ గ్రూప్, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ (ఏఏఐ), జర్మనీకి చెందిన ఫ్రాపోర్ట్ కలిసి డీఐఏఎల్ను జాయింట్ వెంచర్‌గా ఏర్పాటు చేశాయి. -
రూ. 2,500 కోట్ల సమీకరణలో జీఎంఆర్ ఇన్ఫ్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తాజాగా ఈక్విటీ షేర్లు, ఈక్విటీ ఆధారిత సాధనాలు, డిబెంచర్లు మొదలైన వాటి జారీ ద్వారా రూ. 2,500 కోట్ల దాకా సమీకరించనుంది. వచ్చే నెల 14న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ప్రతిపాదనకు షేర్‌హోల్డర్ల అనుమతి కోరనున్నట్లు సంస్థ వెల్లడించింది. దాదాపు రూ. 40,000 కోట్ల పైచిలుకు ఉన్న రుణభారాన్ని తగ్గించుకునే దిశగా జీఎంఆర్ కొన్ని ప్రాజెక్టుల్లో వాటాలు విక్రయిస్తూ వస్తోంది. కొన్నాళ్ల క్రితమే విద్యుత్ విభాగానికి సంబంధించి 30 శాతం వాటాలను మలేషియాకి చెందిన టెనగా నేషనల్‌కి విక్రయించింది. హైదరాబాద్ విమానాశ్రయంలోనూ వాటాలు విక్రయించే ప్రయత్నాల్లో కంపెనీ ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. -
మాల్యా చెక్ బౌన్స్ కేసు మరోసారి వాయిదా
హైదరాబాద్ : వేలకోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగనామం పెట్టి, విదేశాలకు పారిపోయి, రుణాలు చెల్లించేందుకు ముప్పతిప్పలు పెడుతున్న లిక్కర్ కింగ్, పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా చెక్ బౌన్స్ కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. కింగ్ ఫిషర్ చెక్ బౌన్స్ కేసు విచారణను హైదరాబాద్ కోర్టు మంగళవారం ఆగష్టు 4 వరకు వాయిదా వేసింది. వాయిదాల వాయిదాలు పడుతూ వస్తున్న ఈ కేసు విచారణ ఇటీవల జులై అయిదుకి వాయిదా పడింది. దీంతో నేడు విచారణ చేపట్టిన హైదరాబాద్ ఎర్రమంజిల్ కోర్టు...తదుపరి విచారణను మరో నెలపాటు వాయిదా వేసింది. కింగ్‌ఫిషర్ విమానాల కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్టును వినియోగించుకున్నందుకుగాను జీఎంఆర్‌కు మాల్యా రూ. 50లక్షలు విలువ చేసే రెండు చెక్కులను ఇచ్చారు. బ్యాంక్ ఖాతాల్లో నగదు లేకపోవడంతో ఈ రెండు చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీనిపై జీఎంఆర్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. దీంతో మాల్యాను కోర్టులో హాజరుపర్చాలని కోర్టు గతంలో సమన్లు జారీ చేసింది. సమన్లు జారీ చేసిన చిరునామాలో ఉన్న నివాసాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై బ్రాంచ్ సీజ్ చేయడంతో సమన్ల జారీ ప్రక్రియ చిక్కుల్లో పడింది. ఆయన అక్కడ ఉండడం లేదని వివరిస్తూ మహారాష్ట్ర పోలీసులు కోర్టుకు నివేదించారు. దీంతో మాల్యా నివసిస్తున్న సరైన చిరునామా ఇవ్వాలని న్యాయవాది ఎం కృష్ణారావు ఈ సందర్భంగా జీఎంఆర్‌కు సూచించిన నేపథ్యంలో కేసు విచారణను వాయిదా వేసింది. జీఎంఆర్ సంస్థకు విజయ్ మాల్యా చెల్లించాల్సిన 8 కోట్ల రూపాయలకు గాను ఆయనపై మొత్తం 11 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. -
మాల్యా చెక్ బౌన్స్ కేసు జూలై 5కి వాయిదా
హైదరాబాద్ : బ్యాంకులను ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా చెక్ బౌన్స్ కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. కింగ్‌ఫిషర్ విమానాల కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్టును వినియోగించుకున్నందుకుగాను జీఎంఆర్‌కు మాల్యా రూ. 50లక్షలు విలువ చేసే రెండు చెక్కులను ఇచ్చారు. బ్యాంక్ ఖాతాల్లో నగదు లేకపోవడంతో ఈ రెండు చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీనిపై జీఎంఆర్ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో మాల్యను కోర్టులో హాజరుపర్చాలని కోర్టు గతంలో సమన్లు జారీ చేసింది. సమన్లు జారీ చేసిన చిరునామాలో ఉన్న నివాసాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై బ్రాంచ్ సీజ్ చేశారని, ఆయన అక్కడ ఉండడం లేదని వివరిస్తూ మహారాష్ట్ర పోలీసులు కోర్టుకు నివేదికను సమర్పించారు. దీంతో మాల్యా నివసిస్తున్న సరైన చిరునామా ఇవ్వాలని న్యాయవాది ఎం కృష్ణారావు ఈ సందర్భంగా జీఎంఆర్‌కు సూచించిన విషయం తెలిసిందే. అనంతరం కేసు విచారణను వాయిదా వేసిన విషయం తెలిసిందే. సరైన చిరునామాతో వస్తే మాల్యాకు ఫ్రెష్ వారెంట్ జారీ చేస్తామని కోర్టు పేర్కొంది. -
బ్యాంకుల చేతికి...జీఎంఆర్ రాజమండ్రి ఎనర్జీ!
♦ 55 శాతం మెజారిటీ వాటా... ♦ ఎస్డీఆర్ అమలుకు బ్యాంకుల కన్సార్షియం నిర్ణయం.. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో సంస్థ బ్యాంకుల చేతికి చేరింది. ఇన్ఫ్రా దిగ్గజం జీఎంఆర్ గ్రూప్‌లో భాగమైన జీఎంఆర్ రాజమండ్రి ఎనర్జీ (జీఆర్‌ఈఎల్)కి ఇచ్చిన లోన్లకు సంబంధించి వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక (ఎస్డీఆర్)ను అమలు చేయాలని బ్యాంకుల కన్సార్షియం నిర్ణయించింది. దీర్ఘకాలిక ఇంధన సరఫరా ఒప్పందాలు (ఎఫ్ఎస్ఏ), దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు లేకపోవడంతో బ్యాంకుల కన్సార్షియం ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా తెలిపింది. జీఆర్‌ఈఎల్ మొత్తం రుణ భారం (వడ్డీ బకాయిలు కూడా కలిపి) రూ. 3,780 కోట్లు ఉండగా, ఇందులో రూ. 1,414 కోట్ల మొత్తాన్ని బ్యాంకులు ఈక్విటీలు కింద మార్చుకున్నాయి. దీంతో జీఆర్ఈఎల్లో బ్యాంకుల కన్సార్షియంనకు 55 శాతం వాటాలు దక్కనుండగా, మిగతా 45 శాతం జీఎంఆర్ వద్ద ఉంటుంది. ఇందుకు సంబంధించి శుక్రవారం సమావేశంలో షేర్లను కేటాయించినట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా వెల్లడించింది. మిగతా రూ. 2,366 కోట్ల రుణ మొత్తాన్ని 10.75 శాతం వడ్డీ రేటుతో 20.5 సంవత్సరాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. 1.75 సంవత్సరాల మారటోరియం లభిస్తుందని వివరించింది. ఎస్డీఆర్ అనంతరం ప్రాజెక్టులో మొత్తం ఈక్విటీ విలువ రూ. 2,571 కోట్లుగా ఉంటుందని జీఎంఆర్ ఇన్ఫ్రా పేర్కొంది. రుణ భారంతో పాటు వడ్డీ వ్యయాలు కూడా తగ్గడమనేది దీర్ఘకాలికంగా ప్రాజెక్టు లాభదాయకతకు తోడ్పడగలదని తెలిపింది. రుణాల భారంతో కుదేలైన ఐవీఆర్సీఎల్ ఇప్పటికే బ్యాంకుల చేతికి చేరగా, మరోఇన్ఫ్రా సంస్థ ల్యాంకో గ్రూప్‌లోనూ బ్యాంకులు ఎస్డీఆర్ అమలు యోచనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జీఆర్ఈఎల్లో ఎస్డీఆర్ అమలు ప్రాధాన్యం సంతరించుకుంది. జీఆర్‌ఈఎల్ .. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో 768 మె.వా. గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి ప్లాంటును జీఆర్‌ఈఎల్ నిర్వహిస్తోంది. 2012లోనే ప్రాజెక్టు పూర్తి అయింది. అయితే, కేజీ-డీ6 క్షేత్రంలో గ్యాస్ ఉత్పత్తి అనూహ్యంగా పడిపోవడంతో ఇంధన సరఫరా లేక విద్యుదుత్పత్తి ప్రారంభించడంలో జాప్యం జరిగింది. ఫలితంగా వ్యయాలూ భారీగా పెరిగిపోయాయి. ఈ-ఆర్ఎల్ఎన్జీ బిడ్డింగ్ స్కీము కింద గ్యాస్ లభించడంతో 2015 అక్టోబర్‌లో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి ప్రారంభించింది. నిల్చిపోయిన గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్లకు గ్యాస్ సరఫరా చేసే ఉద్దేశంతో కేంద్రం ప్రతిపాదించిన ఈ-ఆర్ఎల్ఎన్జీ బిడ్డింగ్ స్కీములో మూడో దశ కింద గెయిల్ నుంచి సంస్థకు గ్యాస్ సరఫరాకు హామీ దక్కింది. దీంతో 30 శాతం దాకా పీఎల్ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) సామర్ధ్యం మేర విద్యుదుత్పత్తికి వీలు కానుంది. -
చెక్ బౌన్స్ కేసులో మాల్యాపై నేరం రుజువు
మే 5న కోర్టులో హాజరు పర్చాలంటూ వారెంట్ సాక్షి, హైదరాబాద్: చెల్లని చెక్కు ఇచ్చి జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ సంస్థను మోసం చేసిన కేసులో కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యాపై నేరం రుజువైంది. అన్ని ఆధారాలను పరిశీలించిన అనంతరం నేరం రుజువైందని బుధవారమిక్కడి మూడో ప్రత్యేక మేజిస్ట్రేట్ కోర్టు ప్రకటించింది. శిక్ష ఖరారు చేసే ముందు నిందితుడికి అవకాశం ఇవ్వాల్సి ఉన్నందున మే 5న మాల్యాను హాజరుపర్చాలంటూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అదే రోజున శిక్ష ఖరారు చేస్తామని న్యాయమూర్తి ఎం.కృష్ణారావు తన ఆదేశాల్లో పేర్కొన్నారు. జీఎంఆర్ విమానాశ్రయాన్ని వినియోగించుకున్నందుకు పన్నుల రూపంలో జీఎంఆర్ సంస్థకు కింగ్‌ఫిషర్ రూ.25 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే రాజీ ద్వారా రూ.22 కోట్లు ఇచ్చేందుకు కింగ్‌ఫిషర్ ముందుకు వచ్చిందని, ఇందుకు 45 చెక్కులు ఇచ్చిందని జీఎంఆర్ తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా రూ.50 లక్షల చొప్పున ఇచ్చిన రెండు చెక్కులు బౌన్స్ కావడంతో కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశామని ఆయన వివరించారు. -
ఢిల్లీ ఎయిర్ పోర్టులో సోలార్ ప్లాంట్ సామర్థ్యం పెంపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ) సౌర విద్యుత్ ప్లాంటు సామర్థ్యాన్ని 7.84 మెగావాట్లకు పెం చినట్లు జీఎంఆర్ కన్సార్షియం సారథ్యంలోని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (డీఐఏఎల్) తెలిపింది. 2020 నాటికి దీన్ని 20 మె.వా.కు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు సంస్థ సీఈఓ ఐ ప్రభాకరరావు పేర్కొన్నారు. ఇప్పటిదాకా ఈ ప్లాంటు 2.14 మె.వా. సామర్థ్యంతో పనిచేస్తోంది. యునెటైడ్ నేషన్స్ పర్యావరణ అనుకూల వ్యవస్థ (యూఎన్ఎఫ్సీసీసీ) కింద ప్రపంచంలోనే తొలిసారిగా నమోదైన ఎయిర్‌పోర్టు తమదేనని ప్రభాకరరావు పేర్కొన్నారు. -
జీఎంఆర్, జీవీకే, ల్యాంకో విద్యుత్ ప్లాంట్లకు గ్యాస్
పీఎస్డీఎఫ్ స్కీమ్ కింద ఈ-వేలంలో కేటాయింపు న్యూఢిల్లీ: గ్యాస్ సరఫరా లేక నిలిచిపోయిన గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు ప్రభుత్వం తాజాగా దిగుమతయ్యే గ్యాస్‌ను కేటాయించింది. ప్రభుత్వ రంగ ఎంఎస్టీసీ లిమిటెడ్ వెబ్సైట్ ద్వారా నిర్వహించిన ఈ-వేలంలో రోజుకు 7.72 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంఎంఎస్‌సీఎండీ) రీ-గ్యాసిఫైడ్ సహజ వాయువు(ఆర్-ఎల్ఎన్జీ)ను విద్యుత్ ఉత్పత్తి సంస్థలు దక్కించుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకూ ఈ గ్యాస్ సరఫరా జరుగుతుంది. దీనిద్వారా 6.79 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తికి మార్గం సుగమం కానుంది. బిడ్డింగ్‌లో రత్నగిరి గ్యాస్ అండ్ పవర్(దబోల్ ప్రాజెక్టు)కు అత్యధికంగా 2.35 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్ దక్కింది. కేటాయింపులు జరిగిన ఇతర సంస్థల్లో ల్యాంకో కొండపల్లి పవర్(1.58 ఎంఎంఎస్‌సీఎండీ), జీఎంఆర్ రాజమండ్రి ఎనర్జీ(1.09), కోనసీమ గ్యాస్ పవర్(0.71), పయనీర్ గ్యాస్ పవర్(0.55), జీఎంఆర్ వేమగిరి పవర్(0.52), గామా ఇన్ఫ్రాప్రాప్(0.35), జీవీకే ఇండస్ట్రీస్(0.32), స్రవంతి ఎనర్జీ(0.25), ఉన్నాయి. బిడ్డర్లు నెగటివ్ సబ్సిడీ లేదా ఒక్కో యూనిట్‌కు 3 పైసల వరకూ ప్రీమియం రేటును బిడ్ చేయడంతో ప్రభుత్వానికి ఈ-వేలం ద్వారా రూ.18 కోట్ల మేరకు సబ్సిడీ భారం తగ్గనుంది. పవర్ సిస్టమ్ డెవలప్మెంట్ ఫండ్(పీఎస్డీఎఫ్) కింద నిలిచిపోయిన గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు దిగుమతయ్యే గ్యాస్ కొనుగోళ్ల కోసం ఆర్థిక సహకారం అందుతుంది. 2015-16లో రూ. 3,500 కోట్లు, 2016-17లో రూ.4,000 కోట్ల చొప్పున ఈ ఫండ్ నుంచి నిధులను కేటాయించారు. -
జీఎంఆర్‌లో కువైట్ సంస్థ 2 వేల కోట్ల పెట్టుబడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్ కంపెనీ జీఎంఆర్ ఇన్ఫ్రా విదేశీ బాండ్ల ద్వారా రూ. 2,000 కోట్లు సమీకరించింది. కువైట్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ 60 ఏళ్ల ఫారన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్ ద్వారా 300 మిలియన్ డాలర్లు ( రూ. 2,000 కోట్లు) ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు ఇరు కంపెనీల మధ్య అవగాహనా ఒప్పందం కుదిరినట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 7.5 శాతం కూపన్ రేటు మీద ఈ నిధులను సేకరించారు. ఈ డిబెంచర్స్ కాలపరిమితి 60 ఏళ్లు అయినప్పటికీ 18 నెలల తర్వాత ఎప్పుడైనా ఈక్విటీగా మార్చుకునే వెసులుబాటు ఉంది. కంపెనీ చరిత్రలో ఇదో అతిపెద్ద ద్వైపాక్షిక ఒప్పందమని, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న దీర్ఘకాలిక ప్రణాళికలపై విదేశీయులు కనబరుస్తున్న నమ్మకానికి ఇదొక ఉదాహరణ అని జీఎంఆర్ గ్రూపు చైర్మన్ జి.ఎం.రావు పేర్కొన్నారు. ఈ విధంగా సేకరించిన మొత్తంలో రూ. 1,500 కోట్లు రుణాలను తీర్చడానికి జీఎంఆర్ వినియోగించనుంది. దీంతో కంపెనీ కన్సాలిడేటెడ్ రుణం రూ. 6,900 కోట్ల నుంచి రూ. 5,400 కోట్లకు తగ్గుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. గత రెండేళ్లలో జీఎంఆర్ ఇన్ఫ్రా రూ. 10,700 కోట్ల నిధులను సమీకరించింది. రానున్న కాలంలో దేశీయ ఇన్ఫ్రా రంగంలో మరింత ముందుకు పోవడానికి ముందుగా జీఎంఆర్‌ను ఎంచుకున్నట్లు కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథార్టీ ప్రతినిధి ఫరూఖ్ బస్తకి తెలిపారు. నిధుల సమీకరణ వార్తల నేపథ్యంలో శుక్రవారం జీఎంఆర్ ఇన్ఫ్రా షేరు బీఎస్ఈలో 15 శాతం నష్టపోయి రూ. 15.45 వద్ద ముగిసింది. -
శంషాబాద్ విమానాశ్రయం మరో ఘనత
హైదరాబాద్: శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరో ఘనత సాధించింది. మన దేశంలో పూర్తి స్థాయిలో ఎలక్ట్రానిక్ బోర్డింగ్ విధానాన్ని అమలుచేసిన మొట్టమొదటి విమానాశ్రయంగా రికార్డు నెలకొల్పింది. ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకున్న పౌర విమానయాన శాఖ.. ముందుగా గత ఏప్రిల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టులో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇందులో జెట్ ఎయిర్ వేస్ సహకారం కూడా ఉంది. ఈ మూడు నెలల కాలంలో దాదాపు 700 మంది ప్రయాణికులు ఈ- బోర్డింగ్ విధానాన్ని వినియోగించుకున్నారని, ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ఈ- బోర్డింగ్ విధానాన్ని సమర్థవంతంగా అమలుచేసినందుకు గానూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని బుధవారం జీఎంఆర్ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయం స్పూర్తితో మరిన్ని ఎయిర్ పోర్టుల్లో ఈ విధానాన్ని అమలుచేయనున్నట్లు విమానయాన శాఖ పేర్కొంది. -
జీఎంఆర్‌కు రూ. 262 కోట్ల నష్టం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్‌పోర్టులు, విద్యుత్, రోడ్లు తదితర ఇన్ఫ్రా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాండెలోన్ ప్రాతిపదికన మార్చితో ముగిసిన క్యూ4లో రూ. 262 కోట్ల నష్టాన్ని నమోదుచేసింది. గతేడాది ఇదేకాలంలో కంపెనీ రూ. 209 కోట్ల నికరలాభాన్ని సంపాదించింది. కంపెనీ మొత్తం ఉదాయం కూడా 206 కోట్ల నుంచి రూ. 180 కోట్లకు తగ్గింది. 2014-15 పూర్తి ఏడాదిలో రూ. 353 కోట్ల నికరనష్టం వచ్చినట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం రూ. 166 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. పూర్తి సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ. 791 కోట్ల నుంచి రూ. 669 కోట్లకు తగ్గింది. గ్రూప్ కంపెనీలతో కలిసి జీఎంఆర్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4లో రూ. 892 కోట్ల నష్టాన్ని చవిచూడగా, గతేడాది ఇదేకాలంలో రూ. 1,170 కోట్ల నికరలాభాన్ని తెచ్చుకుంది. కన్సాలిడేటెడ్ ఆదాయం రూ. 3,067 కోట్ల నుంచి రూ. 2,998 కోట్లకు తగ్గింది. 2013-14లో రూ. 10 కోట్ల స్వల్పలాభాన్ని నమోదుచేసిన జీఎంఆర్ గ్రూప్ 2014-15లో రూ. 2,733 కోట్ల భారీనష్టాన్ని చవిచూసింది. -
కాకినాడ సెజ్‌లో చైనా కంపెనీ పెట్టుబడులు
-
కాకినాడ సెజ్‌లో చైనా కంపెనీల భారీ పెట్టుబడులు
రూ. 3,000 కోట్లతో జీఐఐసీ పారిశ్రామిక పార్క్ ఏర్పాటు * జీఐఐసీతో జీఎంఆర్ ఒప్పందం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చైనాకు చెందిన విద్యుత్ ఉపకరణాలు తయారు చేసే గిజూ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్(జీఐఐసీ), జీఎంఆర్‌కు చెందిన కాకినాడ సెజ్‌లో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. చైనాకు చెందిన మూడు తయారీ రంగ సంస్థలు జీఐఐసీ పేరుతో కన్సార్టియంగా ఏర్పడి 2,000 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్నాయి. ఈ మేరకు షాంఘైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఇరు సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. దీని ప్రకారం తొలుత జీఐఐసీ రూ. 3,000 కోట్లతో (500 మిలియన్ డాలర్లు) విద్యుత్, ఎలక్ట్రానిక్స్, సోలార్, పవన విద్యుత్ తయారీకి చెందిన ఉపకరణాలను తయారు చేసే యూనిట్లను ఏర్పాటు చేయనుంది. చైనా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో కాకినాడసెజ్ ప్రెసిడెంట్ చల్లా ప్రశన్న, జీఐఐసీ ప్రతినిధులు సంతకాలు చేశారు. వచ్చే ఐదేళ్ళలో ఈ పారిశ్రామిక వాడ సుమారు రూ. 20,000 కోట్ల పెట్టుబడులను (3.5 బిలియన్ డాలర్లు) ఆకర్షించడమే కాకుండా.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 5,000 మందికి ఉపాధి కల్పించగలదని జీఎంఆర్ ఇన్ఫ్రా బిజినెస్ చైర్మన్ బి.బి. ఎన్ రావు తెలిపారు. జీఎంఆర్ ఇన్ఫ్రా కాకినాడ సమీపంలో 10,500 ఎకరాల్లో మల్టీ ప్రోడక్ట్ సెజ్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. -
జీఎంఆర్ అకాడమీకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా గుర్తింపు
హైదరాబాద్: ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏఓ) నుంచి జీఎంఆర్ ఏవియేషన్ అకాడమీకి రీజినల్ ట్రైనింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఆర్టీసీఈ) గుర్తింపు దక్కింది. భారత్‌లో జీఎంఆర్ ఏవియేషన్ అకాడమీకి మాత్రమే ఈ గుర్తింపు లభించినట్లు జీఎంఆర్ ఒక ప్రకటనలో తెలిపింది. జీఎంఆర్ ఏవియేషన్ అకాడమీ 3-6 నెలల సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్‌ను, ఐసీఏఓ మెంబర్షిప్ ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది. వీటికి ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ), ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) వంటి తదితర అంతర్జాతీయ సంస్థల గుర్తింపు ఉంది. ఏవియేషన్ రంగంలో, దానికి సంబంధించిన ఇతర రంగాలలో ప్రొఫెషనల్స్‌ను తయారుచేయటమే తమ అకాడమీ లక్ష్యమని జీఎంఆర్ గ్రూప్ బిజినెస్ చైర్మన్ (ఎయిర్‌పోర్ట్స్) శ్రీనివాస్ బొమ్మిడాల తెలిపారు. -
సికింద్రాబాద్ స్టేషన్లో వైఫై
♦ దశల వారీగా ఎ-1,బి స్టేషన్లకు విస్తరణ ♦ ఎయిర్‌పోర్టు కనెక్టివిటీకి జీఎమ్మార్ ససేమిరా ♦ వేసవి ప్రత్యేక రైళ్లకు మౌలాలిలో హాల్టింగ్ ♦ దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ సాక్షి, సిటీబ్యూరో : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నాలుగైదు రోజుల్లో వైఫై సదుపాయం అందుబాటులోకి రానుంది. ప్రయాణికులు అరగంట పాటు తమ మొబైల్ ఫోన్లలో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఈ ఏడాది బడ్జెట్లో ప్రతిపాదించిన విధంగా ఎ, ఎ-1, బి కేటగిరీ రైల్వేస్టేషన్లకు దశల వారీగా దీన్ని విస్తరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ తెలిపారు. ఈ నెల 10 నుంచి 16వ తేదీ వరకు జరుగనున్న రైల్వే వారోత్సవాలను దృష్టిలో ఉంచుకొని బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రయాణికుల సదుపాయా లు, భద్రత, రైళ్ల నిర్వహణ, ఇప్పటి వరకు చేపట్టిన ప్రాజెక్టుల పురోగతి, బోగీల కొరత, తదితర అంశాలను వివరించారు. ఎయిర్‌పోర్టు కనెక్టివిటీకి అడ్డంకి ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టును శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు విస్తరించేందుకు అనేకసార్లు జీఎమ్మార్ ప్రతినిధులతోనూ, ప్రభుత్వ ఉన్నతాధికారులతోనూ సంప్రదించినట్టు జీఎం వెల్లడించారు. కానీ జీఎమ్మార్ నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. దీనిపై మూడుసార్లు ప్రభుత్వ ఉన్నతాధికారులకు లేఖలు రాసినట్లు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో ఎయిర్‌పోర్టు, ట్రైన్, రోడ్డు కనెక్టివిటీ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. హైదరాబాద్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రోడ్డు మార్గంలో వెళితే రూ.400 నుంచి రూ.800 వరకు ఖర్చవుతుందని... గంటన్నరకు పైగా సమయం వెచ్చించాల్సి వస్తుందని చెప్పారు. రైలు అందుబాటులోకి వస్తే కేవల రూ.20 చార్జీతో, అరగంట వ్యవధిలో ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చునన్నారు. రూ.850 కోట్లతో చేపట్టిన రెండో దశ ప్రాజెక్టులోనే ఎయిర్‌పోర్టు వరకు రైలు మార్గం విస్తరణ పూర్తయితే ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. ఉందానగర్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు 6 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించేం దుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎంఎంటీఎస్‌తో కాకుం డా విడిగా ఆ ప్రాజెక్టు పూర్తి చేయడం కష్టమన్నారు. 2017 జూన్ నాటికి రెండో దశ పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. మల్కాజిగిరి ప్రాంతంలోని 4 కిలోమీటర్ల కంటోన్మెంట్ మార్గంలో ఆర్మీ నుంచి అభ్యంతరాలు వచ్చాయని, త్వరలో రక్షణ శాఖతో సంప్రదించి పనులు కొనసాగించనున్నట్లు చెప్పారు. కాజీపేట్ వ్యాగన్ ఫ్యాక్టరీకి బ్రేక్ కాజీపేట్‌లో నిర్మించ తలపెట్టిన వ్యాగన్ ఫ్యాక్టరీకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. త్వరలో రైల్వే బోర్టు నూతన వ్యాగన్ విధానాన్ని రూపొందించనున్న దృష్ట్యా దీనిని నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ‘ఏపీ ఎక్స్‌ప్రెస్’కు ‘తెలంగాణ ఎక్స్‌ప్రెస్’గా త్వరలోనే మార్పు వస్తుందని, కాజీపేట్ డివిజన్ ఏర్పాటుకూ రైల్వే శాఖ సుముఖంగా ఉందని చెప్పారు. అదనపు రైళ్లు నడపలేం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అదనపు రైళ్లు నడపడం చాలా కష్టంగా ఉందని జీఎం చెప్పారు. వేసవి ప్రత్యేక రైళ్లను మౌలాలి నుంచి నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మౌలాలీ నుంచి సిటీ బస్సులు నడపాలని, రోడ్డు వెడల్పు చేయాలని, వీధి లైట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ప్రభుత్వం ఈ సదుపాయాలను అందుబాటులోకి తెచ్చిన వెంటనే కాజీపేట్, బల్లార్ష, విజయవాడ మార్గాల్లో రాకపోకలు సాగించే కొన్ని ప్రత్యేక రైళ్లను మౌలాలీ నుంచి నడుపుతామనీ జీఎం చెప్పారు. ప్రయాణికుల విశ్రాంతి గదులు, ఫుడ్‌స్టాళ్లు ఏర్పాటు చేయడంతో పాటు స్టేషన్‌ను విస్తరించనున్నట్లు తెలిపారు. వట్టినాగులపల్లి, మౌలాలీలో టెర్మినళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదిస్తున్నామని పేర్కొన్నారు. సేవలు సంతృప్తికరం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌గా మూడేళ్లుగా విధులు నిర్వహిస్తున్న శ్రీవాస్తవ మరి కొద్ది నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు. తన పదవీ కాలంలో ప్రయాణికుల, ఉద్యోగుల సంక్షేమానికి తాను చేపట్టిన కార్యక్రమాలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. రూ.80 కోట్లతో ప్రయాణికుల సదుపాయాలను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. భద్రతకు ప్రాధాన్యం ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చినట్లు జీఎం శ్రీవాస్తవ చెప్పారు. అన్ని రైల్వేస్టేషన్లు, రైళ్లలో ఆర్పీఎఫ్, జీఆర్పీ బలగాలను పెంచామన్నారు. అయినప్పటికీ ఎక్కడో ఒక చోట చైన్‌స్నాచింగ్‌లు, అక్రమ రవాణా, దొంగతనాలు చోటుచేసుకుంటున్నాయని విచారం వ్యక్తం చేశారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాపలా లేని రైల్వే గే ట్లన్నింటినీ 2016 నాటికి తొలగించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కాపలా లేని 88 చోట్ల ‘గేట్ మిత్ర’లను నియమించామన్నారు. -
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పెరిగిన జీఎంఆర్ వాటా
10 శాతం వాటాను రూ. 492 కోట్లకు కొన్న జీఎంఆర్ పూర్తిగా వైదొలిగిన మలేషియా ఎయిర్పోర్ట్ లిమిటెడ్ దీంతో 64 శాతానికి పెరిగిన వాటా జీఎంఆర్ వాటా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(డీఐఏఎల్) నుంచి విదేశీ భాగస్వామ్య కంపెనీ మలేషియా ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ బెరహాద్ (ఎంఏహెచ్‌బీ) పూర్తిగా వైదొలిగింది. ఎంఏహెచ్‌బీ కలిగి ఉన్న 10 శాతం వాటాను సుమారు రూ. 492 కోట్లు (7.9 కోట్ల డాలర్లు) జీఎంఆర్ ఇన్ఫ్రా కొనుగోలు చేసింది. దీంతో డీఐఏఎల్‌లో జీఎంఆర్ వాటా 54 శాతం నుంచి 64 శాతానికి పెరిగింది. ప్రస్తుత చట్టాల ప్రకారం విదేశీ భాగస్వామ్య కంపెనీకి యాజమాన్య నిర్ణయాలు తీసుకునే అధికారం లేకపోవడంతో వైదొలుగుతున్నట్లు మలేషియన్ ఎయిర్‌పోర్ట్స్ ప్రకటించింది. సుమారు 22 మిలియన్ డాలర్ల లాభంతో ఎంఏహెచ్‌బీ వైదొలిగినట్లు అంచనా. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులో ఎంఏహెచ్‌బీ 57.6 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. మలేషియా ఎయిర్‌పోర్ట్స్ వైదొలగాలని నిర్ణయించుకోవడంతో కీలకమైన ఎయిర్‌పోర్ట్‌లో వాటా పెంచుకున్నట్లు జీఎంఆర్ ఎయిర్పోర్ట్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సిదార్థ కపూర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కానీ ఈ వాటా కొనుగోలుకు ఎయిర్పోర్ట్ అథార్టీ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి లభించాల్సి ఉంది. -
ఇన్ఫ్రాకు ఊరట
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పీకల్లోతు అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలుగు రాష్ట్రాల ఇన్ఫ్రా కంపెనీలకు ఆర్బీఐ నిర్ణయం కొంత ఊరట కలిగించింది. వడ్డీరేట్లను పావు శాతం తగ్గించడం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రధాన ఇన్ఫ్రా కంపెనీలకు సుమారు రూ. 400 కోట్ల వరకు వడ్డీ భారం తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్బీఐ రెపో రేటును మాత్రమే తగ్గించిందని, దీన్ని పూర్తిగా బ్యాంకులు కంపెనీలకు అందిస్తాయా లేదా అన్నదానిపైన ఈ ప్రయోజనం ఆధారపడి ఉంటుందని జీవీకే ఇన్ఫ్రా సీఎఫ్‌వో ఇసాక్ జార్జ్ తెలిపారు. పావుశాతం తగ్గింపు వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, కానీ వడ్డీరేట్ల తగ్గింపు దిశగా ఆర్బీఐ అడుగులు వేయడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది కాలంలో వడ్డీరేట్లు ఒక శాతం వరకు తగ్గుతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. జీవీకే ఇన్‌ఫ్రాకి సుమారు రూ. 22,000 కోట్లకు పైగా రుణాలున్నట్లు తెలిపారు. ఐవీఆర్సీఎల్ గ్రూపునకు రూ. 8,000 కోట్లకుపైగా రుణాలున్నాయని, ఈ పావు శాతం తగ్గింపు వర్తిస్తే ఏడాది మొత్తం మీద రూ. 25 కోట్ల నుంచి రూ. 30 కోట్ల భారం తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు ఐవీఆర్సీఎల్ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ ఆర్.బలరామిరెడ్డి తెలిపారు. ఈ తగ్గింపు ఆర్థిక వ్యవస్థ వృద్ధిని ప్రోత్సహిస్తుందని, ఈ పావు శాతం తగ్గింపుతో రూ. 6 కోట్లు, అదే ఒక శాతం తగ్గితే రూ. 24 కోట్ల వరకు ప్రయోజనం సమకూరుతుందని ఎన్సీసీ ఇన్ఫ్రా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వై.డీ మూర్తి తెలిపారు. షేర్ల పరుగులు: ఊహించని విధంగా ఆర్బీఐ ఒక్కసారిగా వడ్డీరేట్లను తగ్గించడంతో గురువారం తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇన్ఫ్రా కంపెనీల షేర్లు పరుగులు తీశాయి. అత్యధికంగా జీవీకే ఇన్ఫ్రా 10 శాతం పెరిగితే, ల్యాంకో, జీఎంఆర్, ఐవీఆర్సీఎల్ షేర్లు 6 నుంచి 7 శాతం వరకు పెరిగాయి. వడ్డీభారం తగ్గుతుందిలా... కంపెనీ పేరు గ్రూపు రుణ మొత్తం పావు % తగ్గితే 1% తగ్గితే జీఎంఆర్ ఇన్ఫ్రా 45,041 135 495 ల్యాంకో ఇన్ఫ్రా 36,705 110 404 జీవీకే ఇన్ఫ్రా 22,464 67 247 ఐవీఆర్సీఎల్ 8,334 25 92 గాయత్రీ ప్రాజెక్ట్స్ 6,650 20 75 ఎన్సీసీ 2,200 6 24 (గణాంకాలు రూ. కోట్లలో..అంచనాలు ఉజ్జాయింపుగా మాత్రమే) -
రైడ్.. ఎక్స్పీరియన్స్
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జీఎంఆర్ఎరీనా సరికొత్త డ్రైవింగ్ అనుభూతిని పంచింది. బీఎండబ్ల్యూ ఇండియా గురువారం ఇక్కడ నిర్వహించిన ‘ఎక్స్పీరియన్స్ టూర్ 2014’లో కార్ల అభిమానులు, వినియోగదారులు స్పోర్ట్స్ యాక్టివిటీ వెహికల్స్‌ను నడిపించి సంబరపడ్డారు. అన్ని రకాల రహదారుల్లో బీఎండబ్ల్యూ పనితీరును అనుభవజ్ఞులైన డ్రైవర్లు వివరించారు. దేశవ్యాప్తంగా 12 నగరాల్లో ఈ ఎక్స్పీరియన్స్ టూర్‌ను నిర్వహిస్తున్నారు. - శంషాబాద్ -
సెబు విమానాశ్రయంలో నిర్మాణ పనులు: జీఎంఆర్
సెబు(ఫిలిప్పైన్స్): మౌలిక రంగ కంపెనీ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెగావైడ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ల కన్సార్షియం ఫిలిప్పైన్స్‌లోని మక్టన్ సెబు అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి పనులను నవంబర్ 1 నుంచి ప్రారంభించనుంది. ఆరు నెలల్లో ఈ పనులను పూర్తి చేస్తారు. 2015 మార్చి నుంచి విమానాశ్రయంలో నూతన భవనాన్ని నిర్మిస్తారు. 36 నెలల్లో నిర్మాణం పూర్తి అవుతుందని జీఎంఆర్-మెగావైడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అడ్వైజర్ ఆండ్రూ హారిసన్ వెల్లడించారు. విస్తరణ పూర్తి అయితే అధిక సీట్లు, ఏరోబ్రిడ్జ్‌లు, హోటళ్లు, క్యాసినో, కార్యాలయాలు, స్పా, దుకాణ సముదాయాలతోపాటు ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు సమకూరనున్నాయని చెప్పారు. ప్రస్తుతం విమానాశ్రయానికి ఏటా 45 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యం ఉంది. విస్తరణ పూర్తి అయితే ఈ సంఖ్య 1.25 కోట్లకు చేరుకుంటుంది. జీఎంఆర్-మెగావైడ్ కన్సార్షియం సుమారు రూ.1,920 కోట్లకు ఈ ప్రాజెక్టును చేజిక్కించుకుంది. కన్సార్షియంలో జీఎంఆర్‌కు 40 శాతం వాటా ఉంది. -
విమానాశ్రయం వరకు ఎంఎంటీఎస్‌లు వద్దు!
* అక్కడికి 3.2 కి.మీ. ముందే ఆగిపోవాలి * ఎంఎంటీఎస్ విస్తరణలో జీఎంఆర్ మడతపేచీ * రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన దక్షిణ మధ్య రైల్వే * రైలు దిగాక మళ్లీ ప్రైవేటు వాహనాలను ఆశ్రయించే దుస్థితి ఏంటంటూ ఆగ్రహం * అలా చేస్తే రూ.180 కోట్ల కొత్తలైన్ నిరుపయోగమేనని వెల్లడి సాక్షి, హైదరాబాద్: నగరం నుంచి శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఎంఎంటీఎస్ రైళ్లు నడపాలనే దక్షిణ మధ్య రైల్వే ఆలోచనకు జీఎంఆర్ బ్రేకులు వేసింది. విమానాశ్రయం వరకు రైలు రావటానికి వీళ్లేదని, అక్కడికి 3.2 కిలోమీటర్ల దూరంలోనే స్టేషన్ నిర్మించి అక్కడి వరకే రైల్వే సేవలు పరిమితం చేయాలని మడతపేచీ పెట్టింది. ఇటీవల జీఎంఆర్-రైల్వే అధికారుల అంతర్గత భేటీలో ఈమేరకు షరతు విధించింది. సరిగ్గా ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు పట్టాలెక్కేవేళ ఈ వ్యవహారం తెరపైకి రావటంతో బిత్తరపోయిన దక్షిణ మధ్య రైల్వే దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. భారీ ఖర్చుతో ఎంఎంటీఎస్ లైనును విస్తరించి... విమానాశ్రయానికి 3.2 కిలోమీటర్ల దూరంలోనే ఆపేస్తే అసలు ఆ ప్రాజెక్టు లక్ష్యం నెరవేరదని, అక్కడ రైలు దిగే ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకోవాలంటే మళ్లీ ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంటుందని తాజాగా దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ తెలంగాణ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ దృష్టికి తేవ టంతో ఈ వ్యహారం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా జీఎంఆర్ షరతులు విధిస్తూ... ఎంఎంటీఎస్ రెండో దశ లక్ష్యాన్నే నీరుగారుస్తోందని ఆయన సీఎస్‌తో పేర్కొన్నారు. రైలు దిగగానే నేరుగా విమానాశ్రయంలోకి మార్గం ఉండాలని, సామగ్రి తరలించేందుకు అక్కడి నుంచే ట్రాలీల ఏర్పాటు ఉండాలని, అంతర్జాతీయంగా ఇదే పద్ధతి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. జీఎంఆర్ సంస్థ యూజవూన్యంతో మాట్లాడి విమానాశ్రయం వరకు ఎంఎంటీఎస్ రైలు వెళ్లే విధంగా చూడాలని కోరారు. ఇదీ సంగతి...: ప్రస్తుతం ఫలక్‌నుమా వరకు ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్నాయి. ప్రాజెక్టు విస్తరణ(రెండోదశ)లో భాగంగా ఫలక్‌నుమా నుంచి శంషాబాద్ సమీపంలోని ఉందానగర్ స్టేషన్ వరకు, అక్కడి నుంచి అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పనులు చేపట్టాల్సి ఉంది. పనులు ప్రారంభించేందుకు అంతా సిద్ధమవుతున్న వేళ జీఎంఆర్ నిబంధనతో గందరగోళం నెలకొంది. కొత్త లైను, ఎలక్ట్రిఫికేషన్ తదితరాలకు సంబంధించి కిలోమీటరుకు రూ.10 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఫలక్‌నుమా నుంచి ఉందానగర్ 13 కి.మీ., అక్కడి నుంచి విమానాశ్రయం దారిలో జీఎంఆర్ సూచిస్తున్న ప్రాంతం మరో 5 కి.మీ. ఉంటుంది. వెరసి 18 కి.మీ.మేర పనులు నిర్వహించేందుకు రూ.180 కోట్ల ఖర్చవుతుంది. ఇంత ఖర్చు చేసి రైలు విమానాశ్రయానికి 3.2 కి.మీ.దూరంలోనే నిలిచిపోతే ఉపయోగమేంటని రైల్వే వాదిస్తోంది. భవిష్యత్తు విస్తరణ అవసరాల దృష్ట్యా తనకు భూముల అవసరం ఉంటుందని, అం దులో రైల్వే స్టేషన్ నిర్మిస్తే సమస్యలు ఉత్పన్నమవుతాయనే కోణంలో జీఎంఆర్ వాదిస్తోంది. ఇందులో ప్రైవేటు టాక్సీ ఆపరేటర్ల ఒత్తిడి కూడా ఉండొచ్చని రైల్వే అభిప్రాయపడుతోంది. ఈ మొత్తం విషయాన్ని ప్రభుత్వం ముందుంచింది. ఇందులో స్పష్టత వస్తేనే పను లు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుందని, తాము పనులు చేపట్టేందుకు సర్వం సిద్ధం చేసుకున్నామని దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ గురువారం తెలిపారు. -
కాకినాడలో జీఎంఆర్ పోర్టు!
రూ.2,500 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్ 2,094 ఎకరాలు కేటాయింపు ఆరు నెలల్లో ప్రజాభిప్రాయ సేకరణ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్‌పోర్టులు, రోడ్లు, రైల్వే రంగాల్లో సేవలందిస్తున్న జీఎంఆర్ గ్రూపు తాజాగా ఓడ రేవుల వ్యాపారంలోకి కూడా అడుగుపెడుతోంది. ఆంధ్ర ప్రదేశ్‌లోని కాకినాడ సమీపంలో రూ.2,500 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు జీఎంఆర్ ప్రతినిధులు వెల్లడించారు. ఇందుకోసం జీఎంఆర్‌కు ఉన్న పోర్ట్ ఆధారిత సెజ్‌లో 2,094 ఎకరాలు కేటాయించారు. జీఎంఆర్ 10,500 ఎకరాల్లో కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్(కెసెజ్) పేరుతో మల్టీ ప్రోడక్ట్ సెజ్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న కాకినాడ రేవుకు సుమారు 30 కి.మీ. దూరంలో ఈ కొత్త రేవు రానుంది. తుని నియోజకవర్గం తొండంగి మండలం కోన ఏరియాలో ఈ రేవును ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే నాలుగు నుంచి ఆరు నెలల్లో దీనికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణను పూర్తి చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కి తెలిపారు. అన్ని అధికారిక అనుమతులు వచ్చిన తర్వాత మూడేళ్లలోగా ఈ కొత్త పోర్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. అయితే, ఎన్ని బెర్తులతో పోర్టు నిర్మించాలన్నది దానిపై ఇంక ఒక నిర్ణయం తీసుకోలేదన్నారు. దీనికి సంబంధించి పనులు వేగంగా జరుగుతున్నాయని, ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలకు సంబంధించి ప్రాథమిక అధ్యయనం పూర్తయ్యిందన్నారు. మరో నెలరోజుల్లో ప్రాజెక్టు రూపు రేఖలపై ఒక స్పష్టత వస్తుందని జీఎంఆర్‌కు చెందిన అధికారి ఒకరు చెప్పారు. రాష్ట్ర విభజనతో కీలకంగా కాకినాడ రాష్ట్ర విభజన తర్వాత పారిశ్రామికంగా కాకినాడ కీలకంగా మారుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని జీఎంఆర్ పోర్టు నిర్మాణం దృష్టిసారిస్తోంది. గత బడ్జెట్లో అరుణ్‌జైట్లీ కాకినాడను హార్డ్‌వేర్ హబ్‌గా ప్రకటించడం, ఇప్పటికే కాకినాడ-విశాఖ పెట్రోకెమికల్ హబ్‌గా వేగంగా వృద్ధి చెందడానికి తోడు, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) అభివృద్ధి చేస్తుండటంతో పారిశ్రామికంగా కాకినాడ కీలకంగా మారుతోంది. దీనికితోడు కాకినాడ, నెల్లూరు మధ్యలో మరో పోర్టు కూడా లేకపోవడం కలిసొచ్చే అంశం. విశాఖలోని రెండు పోర్టులు, కాకినాడ పోర్టు, నెల్లూరు కృష్ణపట్నం పోర్టులు పూర్తిస్థాయిలో వినియోగిస్తూ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీంతో కాకినాడ ప్రాంతంలో మరో కొత్త పోర్టుకు డిమాండ్ ఉంది. ఇక్కడ ఎలక్ట్రానిక్, హార్డ్‌వేర్ పార్క్ రానుండటంతో కార్గో హ్యాండ్లింగ్పైనే అధికంగా దృష్టిసారిస్తున్నామని జీఎంఆర్ అధికారులు తెలిపారు. దీనికి అనుగుణంగా కంటైనర్ కార్గోతో పాటు వివిధ ఎగుమతులు దిగుమతులకు అనుకూలంగా ఈ పోర్టును అభివృద్ధి చేయనున్నట్లు వారు పేర్కొన్నారు.