హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్‌పోర్టుల వ్యాపారంలో ఉన్న జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ అనుబంధ కంపెనీ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ నెదర్లాండ్స్ తాజాగా ఆంకజా పురా–2తో షేర్‌హోల్డర్స్, షేర్ సబ్‌స్క్రిప్షన్ ఒప్పందం చేసుకుంది. ఇండోనేషియా మిడాన్‌లోని క్వాలనాము ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి, కార్యకలాపాలకు సంబంధించిన ప్రాజెక్టును జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఈ ఏడాది నవంబర్‌లో చేజిక్కించుకుంది. ప్రాజెక్టులో జీఎంఆర్‌కు 49 శాతం, ఆంకజా పురా–2నకు 51 శాతం వాటాలు ఉంటాయి. కాంట్రాక్టు ప్రకారం 25 ఏళ్ల పాటు విమానాశ్రయ నిర్వహణ, అభివృద్ధి, విస్తరణ పనులు చేపట్టాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment