
డేవో ఎయిర్‌పోర్ట్ రేసులో జీఎంఆర్
ప్రీ–క్వాలిఫైడ్ బిడ్డర్‌గా నిలిచిన కంపెనీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ జీఎంఆర్ మరో ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టు రేసులో ముందంజలో ఉంది. ఫిలిప్పైన్స్‌లోని డేవో ఎయిర్‌పోర్ట్ విస్తరణ ప్రాజెక్టుకు జీఎంఆర్–మెగావైడ్ కన్సార్షియం ప్రీ–క్వాలిఫైడ్ బిడ్డర్‌గా నిలిచింది. ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.5,200 కోట్లు. కాంట్రాక్టులో భాగంగా ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి, కొత్తగా ప్యాసింజర్ టెర్మినల్ నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన, కార్యకలాపాల నిర్వహణ చేపట్టాల్సి ఉంటుంది.
అలాగే ఆప్రాన్, రన్ వే, ట్యాక్సీ వే వంటివి విస్తరించాలి. ప్రాజెక్టుకు పోటీపడుతున్నట్టు జీఎంఆర్ ధ్రువీకరించింది. డేవోతోసహా 5 ప్రాంతీయ విమానాశ్రయాలను ప్రైవేటు పరం చేయాలని ఫిలిప్పైన్స్ ప్రభుత్వం నిర్ణయించింది. 2016లో 35 లక్షల మంది డేవో విమానాశ్రయం నుంచి ప్రయాణించారు. ప్రయాణికుల సంఖ్య ఏటా 10 శాతం పెరుగుతోంది. జీఎంఆర్–మెగావైడ్ కన్సార్షియం ఇప్పటికే ఫిలిప్పైన్స్‌లోని మక్టన్ సెబూ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తోంది.