నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్న ధరలు
కేతేపల్లి: హైదరాబాద్–విజయవాడ 65 నంబరు జాతీయ రహదారిపై టోల్‌గేట్ల వద్ద వాహనదారుల నుంచి వసూలు చేస్తున్న టోల్ ఫీజును రహదారి విస్తరణ కాంట్రాక్టు సంస్థ జీఎమ్మార్ యాజమా న్యం పెంచింది. ఒక్కో వాహనానికి ఒక వైపు, ఇరు వైపులా కలిపి రూ. 5నుంచి రూ. 40 వరకు, స్థాని కుల నెలవారీ పాస్‌ను రూ.330 నుంచి రూ.340 కి పెంచింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండల ఆంథోల్ మైసమ్మ దేవాలయం నుంచి ఏపీలోని కృష్ణా జిల్లా చిల్లకల్లు వరకు గల 181.5 కి.మీ మేర రెండులేన్లుగా ఉన్న రహదారిని దాదాపు రూ.2000 కోట్ల వ్యయంతో 2012లో బీవోటీ పద్ధతిన జీఎమ్మార్ సంస్థ నాలుగు లేన్లుగా విస్తరించింది.
ఈ విస్తరణ పనులకు అయిన వ్యయాన్ని రాబట్టుకునేందుకు 65 నంబరు జాతీయ రహదారిపై ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలోని కృష్ణా జిల్లా చిల్లకల్లు వద్ద ఒకొక్కటి చొప్పున మూడు టోల్‌ప్లాజాలను జీఎమ్మార్ సంస్థ ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 2012 నుంచి టోల్‌ఫీజు వసూళ్లను కాంట్రాక్టు సంస్థ ప్రారంభించింది.
ఎన్‌హెచ్‌ఏఐ సూచించిన నిబంధనల మేరకు వార్షిక సవరణల పేరిట ఏడాదికి ఒకమారు వాహనాల నుంచి వసూలు చేస్తున్న టోల్‌ఫీజు ధరలను పెంచుకునే వెసులుబాటు జీఎమ్మార్ సంస్థకు ఎన్‌హెచ్‌ఏఐ కల్పించింది. ఆయా టోల్‌ప్లాజాల వద్ద ఈనెల 31(ఆదివారం) అర్ధరాత్రి 12 గంటల తర్వాత అంటే ఏప్రిల్ 1 నుంచి పెంచిన టోల్ ధరలు అమల్లోకి రానున్నాయి. ఏడాది కాలం పాటు ఇవే ధరలు అమల్లో ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment