Vijayawada
-
విజయవాడ : అదరహో.. మిస్ బ్లాక్ షో, ర్యాంప్ వాక్‌తో సందడి (ఫొటోలు)
-
విజయవాడ : శ్రీ శృంగేరీ శారదా పీఠంలో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
భవానీపురం : కృష్ణానదిలో సీ ప్లేన్ ట్రయల్ రన్ (ఫొటోలు)
-
కార్తీకాన శివరూపం.. కమనీయం ఆ దర్శనం! (ఫోటోలు)
-
‘సాక్షి’ ఫొటోగ్రాఫర్లకు అవార్డులు
-
ఇంద్రకీలాద్రి : బెజవాడ దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
బెజవాడలో వ్యక్తి దారుణ హత్య
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ నగరం నడిరోడ్డున మంగళవారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మాట్లాడుకుందాం రమ్మని పిలిచిన స్నేహితుడే ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు తెలిపిన, సేకరించిన వివరాల ప్రకారం.. యనమలకుదురు డొంకరోడ్డులోని శ్రీనివాస అపార్ట్‌మెంట్స్‌లో మహ్మద్ రఫీ(54), అజ్మరీ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె సంతానం. రఫీ వారి ఇంటి సమీపంలోనే ఆదిల్ డిజిటల్ సేవా కేంద్రాన్ని నడుపుతూ జీవనం సాగిస్తూ పిల్లలిద్దరినీ ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. రఫీతో కలిసి లయోలా కళాశాలలో చదువుకున్న సాగి వెంకట నరసింహరాజు(54) అనే స్నేహితుడు హైదరాబాద్‌లో నివసిస్తూ ఓ ఫార్మసీ కంపెనీని నడుపుతున్నాడు. సోమవారం నగరానికి వచ్చిన నరసింహరాజు తన స్నేహితుడు రఫీకి ఫోన్ చేసి అయోధ్యనగర్‌లోని లోటస్ ల్యాండ్‌మార్క్‌లో ఉన్న తన ఫ్లాట్‌కు రమ్మని పిలిచాడు. దీంతో రఫీ సోమవారం తన స్నేహితుడు ఉన్న ఫ్లాట్‌కు వెళ్లాడు. రఫీకి మద్యం తాగే అలవాటు ఉంది. నరసింహరాజు మాత్రం మద్యం ముట్టడు. దీంతో నరసింహరాజు తన స్నేహితుడు రఫీకి మద్యం తెప్పించాడు. రఫీ మద్యం తాగాడు. అనంతరం రఫీకి, నరసింహరాజుకు మధ్య డబ్బుల విషయమై వివాదం నెలకొంది. ఈ క్రమంలో రఫీ సమీపంలో ఉన్న కత్తెరను తీసుకొని నరసింహరాజును పొడిచేందుకు ప్రయత్నించగా అతను తన మెడలో ఉన్న కండువాను తీసి రఫీ మెడకు గట్టిగా బిగించేయడంతో రఫీ ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయాడు. నరసింహరాజు విషయాన్ని 100కు ఫోన్ చేసి పోలీసులకు, 108కు ఫోను చేసి జరిగిన విషయాన్ని చెప్పగా వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని రఫీని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్థారించారు. కత్తితో దాడి చేయబోతే ప్రతిఘటించా... తన స్నేహితుడు రఫీ ఇటీవల బాగా అప్పులపాలయ్యాడని ఈ క్రమంలో తనను రూ.3 లక్షలు అప్పుగా అడగడంతో తాను నిరాకరించానన్నారు. ఆ విషయంలో తమ ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిందని, రఫీ పక్కనున్న కత్తెరతో తనపై దాడికి ప్రయతి్నంచగా తాను అతన్ని ఆపేందుకు కండువాతో గట్టిగా గొంతు నులిమానంటూ నిందితుడు నరసింహరాజు పోలీసులకు చెప్పుకొచ్చాడు. తన బాల్య స్నేహితుడిని తానెందుకు చంపుకొంటానంటూ వాపోయాడు. అన్నీ అబద్ధాలే.. కావాలనే నా భర్తను హతమార్చారు... నరసింహరాజు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని రఫీ భార్య అజ్మిరీ ఆరోపించింది. తన భర్త రఫీయే నరసింహరాజుకు డబ్బులు ఇచ్చాడని, వాటిని ఇవ్వమని అనేకసార్లు అడుగుతుంటే మాట దాట వేసుకుంటూ వస్తున్నాడన్నారు. ఈ విషయమే మాట్లాడేందుకు వారిద్దరూ కలిశారని తెలిపింది. పథకం ప్రకారమే తన భర్తకు ఫుల్‌గా మద్యం తాగించి, తన భర్త పైనే కత్తెరతో దాడిచేసి నైలాన్ కండువాతో గొంతు నులిమి హత్య చేశాడని ఆమె ఆరోపించింది. నరసింహరాజుతో పాటు మరో ఇద్దరు ముగ్గురు కలిసి తన భర్తను హతమార్చి ఉంటారని, పోలీసు ఉన్నతాధికారులు దీనిపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని ఆమె కోరింది. రఫీ బంధువుల ఆందోళన రఫీ కుటుంబ సభ్యులు, బంధువులు తమకు న్యాయం చేయాలని మంగళవారం సాయంత్రం రఫీ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చేందుకు ప్రయతి్నంచారు. పోలీసులు వారిని ప్రభుత్వ హాస్పిటల్ వద్దే అడ్డుకుని గేటు మూసేసి బయటకు రాకుండా నిలిపివేశారు. -
అర్జీలన్నీ అంతే సంగతులా!?
విజయవాడ కండ్రికలోని ఈమె ఇల్లు ఇటీవల బుడమేరు వరదల్లో పూర్తిగా మునిగింది. 12 రోజులు బిక్కుబిక్కుమంటూ గడిపింది. సర్వే సిబ్బంది వివరాలు రాసుకుని వెళ్లారు. అయితే, పరిహారానికి సంబంధించిన జాబితాలో మాత్రం ఈమె పేరులేదు. సచివాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితంలేదు. కలెక్టరేట్లో కూడా మరోసారి దరఖాస్తు చేసుకుంది. చివరికి.. ఎవరిని అడిగినా లాభంలేక సాయం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. సాక్షి ప్రతినిధి, విజయవాడ : బుడమేరు వరదతో విజయవాడలో నిండా మునిగిన బాధితులకు నష్టపరిహారం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వరదలు వచ్చి 45 రోజులకు పైగా గడిచినప్పటికీ, సాయం కోసం ఇంకా వేలాది మంది బాధితులు నిరీక్షిస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క బాధితుడికి సహాయం అందిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. రకరకాల సాకులతో బాధితుల జాబితాకు కోతేసి గతనెల 17న సచివాలయాల్లో ప్రదర్శించారు. కానీ, సర్వే అంతా తప్పుల తడకగా ఉందని, గ్రౌండ్‌ఫ్లోర్ అయితే, ఫçస్ట్ ఫ్లోర్ అని.. వాహనాలు నమోదు కాలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మరికొందరైతే తమ పేర్లు నమోదు చేయలేదంటూ రోడ్డెక్కి ధర్నా చేశారు. దీంతో బాధితుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు సచివాలయాల పరిధిలో దరఖాస్తులు తీసుకున్నారు. ఆ సమయంలో 18వేల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో కొన్నింటిని పరిష్కరించి, వరద బాధితుల ఖాతాల్లో నగదు జమచేశారు. అయినా ఇంకా తమకు పరిహారం అందలేదంటూ చాలామంది సెపె్టంబరు 27 వరకు సచివాలయాల చుట్టూ తిరిగారు. తామేమీ చేయలేమని అక్కడి సిబ్బంది చెతులేత్తేయడంతో సెప్టెంబరు 28 నుంచి బాధితులు దరఖాస్తులతో విజయవాడలోని కలెక్టరేట్ బాటపట్టారు. ఇలా వచ్చిన దరఖాస్తులు 21వేలకు పైగా ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. సాయం కోసం ఎదురుచూపులు.. సీన్ కట్‌చేస్తే.. ఇప్పుడీ దరఖాస్తుల గురించి సమా«ధానం చెప్పేవారే కరువయ్యారు. వీటిని అధికారులు పరిశీలించి, అర్హులైన జాబితాలు సచివాలయాల్లో ఉంచితే బాధితుల్లో గందరగోళం ఉండేది కాదు. అయితే, దరఖాస్తులు కంటితుడుపుగా తీసుకున్నారా లేక కాలయాపన చేసి వీటిని కోల్డ్‌స్టోరేజిలోకి నెడతారా అని బాధితులు అనుమానిస్తున్నారు. ఎవరి దగ్గర నుంచి సరైన సమాధానం రాకపోవడంతో, బాధితుల అర్జీలన్నీ బుట్టదాఖలు అయినట్లేనని వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం స్పందించి ఆదుకోకపోతే ఆందోళన తప్పదని హెచ్చరిస్తున్నారు. అంచనా బృందాల అరాచకం.. ఇక నష్టం అంచనా జాబితాలోనే ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందంటూ బాధితులు మండిపడుతున్నారు. అంచనా బృందాలు వచ్చినప్పుడు ఇంట్లోనే ఉన్నా డోర్‌లాక్ అని నమోదు చేశారని, గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉంటే నాలుగో అంతస్తు అని నమోదు చేశారని.. ఇల్లంతా బురదమయంగా కనిపిస్తున్నా.. నష్టం జరగలేదని నమోదు చేశారని, వాహనాలు పూర్తిగా పాడైనా.. ఎలాంటి నష్టం జరగలేదని నమోదు చేశారని, ఆధార్, బ్యాంకు ఖాతాలన్నీ సక్రమంగానే ఉన్నా నాట్ ట్రేస్డ్ అని నమోదు చేశారని బాధితులు దుమ్మెత్తిపోస్తున్నారు. సాయం చేసింది గోరంతే.. ఇదిలా ఉంటే.. వరద నష్టం అంచనా పూర్తయిన తరువాత ముంపు ప్రాంతాల్లో 2.68 లక్షల కుటుంబాలకు నష్టం జరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇందులో 2.32 లక్షల కుటుంబాలకు సంబంధించి 1,700 సర్వే బృందాలతో సర్వే చేయించారు. ఇందులో ఇప్పటివరకు 89,616 ఇళ్లు నీట మునిగినందున రూ.188.80 కోట్ల పరిహారం అందించారు. ఎంఎస్ఎంఈలు, వాహనాలు, వ్యవసాయరంగం, పశువులు, మత్స్యశాఖ, చేనేత, ఉద్యానవనం అన్ని శాఖలకు కలిపి రూ.97.66 కోట్ల సాయం మాత్రమే అందించారు. ఇందులో వ్యవసాయ రంగానికి సంబంధించే రూ.55.60 కోట్ల పరిహారం ఉంది. అంటే.. వరదకు సంబంధించి జిల్లాలో అన్ని రకాల సాయం కింద అందించింది కేవలం రూ.286.46 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఇక బాధితులకు ఇచ్చిన పరిహారం కంటే అగ్గిపెట్టెలు, భోజనాలు ఇతర ఖర్చుల కింద ఎక్కువగా ఖర్చుచేయడం విశేషం. అతీగతీలేని సాయం.. మేం రాజీవ్‌నగర్ ప్లాట్ నెంబరు 26లో ఉంటున్నాం. బుడమేరు వరదలో ఇల్లు పూర్తిగా మునిగింది. సర్వే సిబ్బంది వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు. నష్టపరిహారానికి సంబంధించిన జాబితాలో పేరున్నా డబ్బు మాత్రం పడలేదు. ఎవర్ని అడిగినా సమా«ధానం కరువైంది. చివరికి కలెక్టరేట్లో దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకు అతీగతీలేదు. – వెంగల సాయితేజ, రాజీవ్‌నగర్ -
విజయవాడ దసరా ఉత్సవాల్లో ఘోర అపచారం
-
ఇంద్రకీలాద్రి: శ్రీదుర్గాదేవి అలంకరణలో విజవాడ దుర్గమ్మ (ఫోటోలు)
-
దసరా మహోత్సవాల రెండో రోజు.. శ్రీ గాయత్రిదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు (ఫోటోలు)
-
విజయవాడ వరదలు : జనం కన్నీళ్లకు జవాబు ఇదేనా? (ఫొటోలు)
-
విజయవాడ : సిద్ధార్థ కళాశాలలో ఉత్సాహంగా నృత్యోత్సవం 2024 (ఫొటోలు)
-
విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా స్క్రూ బ్రిడ్జిలో దూకిన తల్లి
సాక్షి,విజయవాడ: విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. స్క్రూ బ్రిడ్జి వద్ద ఓ తల్లి తన ఇద్దరు ఆడపిల్లలతో కలిసి బందర్ కాలువలోకి దూకింది.ఈ ఘటనతో అప్రమత్తమైన స్థానికులు తల్లి,పిల్లల్ని కాపాడేందుకు ప్రయత్నించారు. సంవత్సరంలోపు వయసుగల పసికందును వెలికి తీశారు. అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.అయితే హాస్పటల్‌కు తరలించే లోపే పసికందు మృతి చెందినట్లు తెలుస్తోంది. తల్లి, కుమారుడు కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. -
విజయవాడ : సందడిగా దసరా సాంస్కృతికోత్సవాలు (ఫొటోలు)
-
ఇది సాయమా? మరో గాయమా!?
సాక్షి, అమరావతి: అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు.. అన్నట్లుగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం తీరు చూస్తుంటే. విజయవాడను వరదలు ముంచెత్తి 15 రోజులు పూర్తయినా బాధితులకు చిల్లిగవ్వ సాయం కూడా చేయని రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు వారి జేబులకు చిల్లులుపడే బాధ్యతను మాత్రం భుజానికెత్తుకుంది. బాధితులకు మేలు చేస్తున్నట్లు ఓ వైపు బిల్డప్ ఇస్తూనే మరోవైపు ఓ కార్పొరేట్ సంస్థకు మేలు చేకూర్చేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా.. బాధితుల ఇళ్లలో పనికిరాకుండా పోయిన గృహోపకరణాలతోపాటు ఇళ్లలో నీటి పైపులైన్లు, నీటి కుళాయిలు వంటి ప్లంబింగ్ పనులకు నిర్ణీత రేట్లతో మరమ్మతులు చేయించేందుకు ప్రభుత్వం ఓ కార్పొరేట్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈ మరమ్మతుల రేట్లు అవాక్కయ్యేలా ఉండడం ముంపు ప్రాంతాల్లో పెద్ద చర్చనీయాంశమవుతోంది. ఉదా.. స్విచ్‌బాక్స్ బిగించడానికి రూ.279, ఫ్యాన్ రెగ్యులేటర్ మార్చడానికి రూ.99, ఫ్యాన్ రిపేరుకు రూ.199, ఫ్యాన్ మార్చడానికి రూ.239, గీజర్ చెక్ చేయడానికి రూ.299, వాష్ బేసిన్ లీకేజీ రిపేరుకు రూ.169, సింక్ డ్రెయిన్ పైపు రిపేరుకు రూ.209, డ్రెయిన్ పైపులో అడ్డుతొలగించేందుకు రూ.169, వాటర్ ట్యాప్ రిపేరుకు రూ.139, ఫ్లష్ ట్యాంకు రిపేరుకు రూ.299, వెస్ట్రన్ టాయిలెట్ రిపేరుకు రూ.799, వెస్ట్రన్ టాయిలెట్ మార్చడానికి రూ.1,499, ఇండియన్ టాయిలెట్ బిగించడానికి రూ.1,699.. అంటూ సదరు సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుని ధరలను నిర్ణయించింది. అంటే.. ఈ ధరలను బాధితులు స్వయంగా డబ్బులు చెల్లించి రిపేర్లు చేయించుకోవాల్సి ఉంటుంది. నిజానికి.. బయట మార్కెట్లో ఈ ధరలు ఇంకా తక్కువగానే ఉన్నాయని బాధితులే స్వయంగా చెబుతున్నారు. మరోవైపు.. ఈ కార్పొరేట్ సంస్థకు అదనంగా అవసరమయ్యే టెక్నీíÙయన్లను స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ పొందిన వారిని ప్రభుత్వమే కేటాయించడం గమనార్హం. బాధితులకు యాప్ బాధ్యత ప్రభుత్వ సిబ్బందికి.. ఇదిలా ఉంటే.. వరద ముంపు బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 9–12 వరకు ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వ సిబ్బందితో ఇంటింటి సర్వే నిర్వహించింది. ఏ ఇంట్లో ఏ వస్తువులు పాడయ్యాయో వివరాలను సేకరించింది. ఇప్పుడు వీరి సమాచారం పరోక్షంగా ఆ సంస్థ చేతిలో ప్రభుత్వం పెట్టేసింది. అలాగే, పొదుపు సంఘాల కార్యక్రమాలను పర్యవేక్షించే ఉన్నతాధికారులు ఇటీవలే విజయవాడ పరిధిలోని మెప్మా సిబ్బందితో సమావేశం నిర్వహించి ముంపు ప్రాంతాల్లోని పొదుపు మహిళల ఫోన్లలో సదరు కార్పొరేట్ సంస్థ యాప్‌ను డౌన్లోడ్ చేయించే బాధ్యతను వారికి అప్పగించారు. కొన్నిచోట్ల సచివాలయాల ఉద్యోగులు ఈ బాధ్యతను చేపట్టినట్లు సమాచారం. అంతేకాక.. ‘మీ ఇంట్లో పాడైన వాటిని సంబంధిత కంపెనీతో తక్కువ ఖర్చుతో బాగుచేయించుకోండి’ అంటూ ఆ సంస్థ క్యూఆర్ కోడ్‌తో ప్రభుత్వమే కరపత్రాలను బాధితులకు అందిస్తూ ఆ సంస్థను ప్రోత్సహిస్తోంది.కళ్లుచెదిరేలా రిపేరింగ్ రేట్లు.. నిజానికి.. పాడైన వస్తువులను ఇంటి చుట్టుపక్కల ఉండే టెక్నీషియన్‌తో బాగుచేయించుకుంటే తక్కువ ఖర్చుతో అయిపోతుంది. కానీ, ప్రభుత్వ ఒప్పందం ప్రకారం నిర్ణయించిన రేట్లు చూస్తే బయట మార్కెట్ రేట్లు లేదా ఆ కార్పొరేట్ సంస్థ తన యాప్‌లో ప్రదర్శించే ధరల కన్నా ఎక్కువగా ఉన్నాయి. వీరిని ఆశ్రయిస్తే బాధితుల ఖర్చులు తడిసిమోపెడవడం ఖాయం. ఎందుకంటే.. ఒకే ఇంట మూడు ట్యూబ్లైట్లను ఆ కంపెనీ ద్వారా మార్చుకుంటే మొత్తం రూ.360 చెల్లించాల్సి ఉంటుంది. కానీ, బయట మెకానిక్‌లో చేయిస్తే 150–200 మించి కావు. అలాగే.. ఎలక్ట్రికల్ స్విచ్ బాక్స్ బిగించడానికి రూ.239లు అని యాప్‌లో పేర్కొనగా, వరద ప్రాంతాల్లో ఇదే సేవకు రూ.279లుగా ధరను ప్రభుత్వం నిర్ణయించింది. లోకల్‌గా ఉండే మెకానిక్‌లు ఇదే పనికి రూ.100 నుంచి రూ.250 వరకు వసూలు చేస్తామని చెబుతున్నారు. మరోవైపు.. ఫ్యాన్ మార్చడానికి యాప్ ధర రూ.199లు ఉంటే వరద ప్రాంతాల్లో రూ.239లుగా నిర్ణయించారు. అదే స్థానిక మెకానిక్‌లు ఈ పనికి కేవలం రూ.100–150ల చొప్పున తీసుకుంటామని చెబుతున్నారు. నీటి కుళాయి మార్చడానికి రూ.50 అని యాప్‌లో ఉంటే ఇదే పనికి వరద ప్రాంతాల్లో ప్రభుత్వం రూ.139లు నిర్ణయించింది. స్థానిక మెకానిక్‌లు ఈ పనికి రూ.100 తీసుకుంటున్నారు. వాస్తవానికి.. అనేక ప్రైవేట్ సంస్థలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి బాధితులకు ఉచితంగా సేవలందిస్తుంటే ప్రభుత్వం వీటిని ప్రోత్సహించకుండా కార్పొరేట్ సంస్థకు కొమ్ముకాయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక.. విపత్తు సమయంలో నిండా మునిగిన బా«ధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకుండా బాధితుల నుంచి కార్పొరేట్ కంపెనీలు అధిక ధరలు వసూలుచేసుకునేలా వీలు కల్పించడం విడ్డూరంగా ఉందని బాధితులు వాపోతున్నారు. ఆదుకుంటామని చెప్పి ఇలా చేస్తారా!? ఇక వరద తగ్గిన ప్రాంతాల్లో ఫైర్ ఇంజన్లతో నీట మునిగిన ఇళ్ల పరిసరాలు శుభ్రం చేయిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇంట్లోని సామాన్లు, దుస్తులు, గృహోపకరణాలు పాడైపోయిన వారిని ఏ విధంగా ఆదుకోవాలో కూడా ప్రకటిస్తామన్నారు. తీరా ఇప్పుడు బాధితులే డబ్బులు కట్టి బాగుచేయించుకోవాలని సూచించడంతో పాటు ఆయా పనులకు ప్రభుత్వం ధరలు నిర్ణయించి కార్పొరేట్ సంస్థతో ఒప్పందం చేసుకోవడంపై బాధితులు మండిపడుతున్నారు. సాయం మాట దేవుడెరుగు ఇది తమను మరింత గాయపర్చేలా ఉందని వారు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. -
నిర్లక్ష్యమే ముంచేసింది
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వరదల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని.. వరద హెచ్చరికలను పెడచెవిన పెట్టి విజయవాడను ముంచేసిన మాదిరిగానే ఏలేరు వరద విషయంలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించి రైతుల నోట్లో మట్టి కొట్టిందని మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఒక బాధ్యత లేని ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ఏలేరు రిజర్వాయర్‌కు వరద వస్తుందని, అది ప్రమాదకర స్థాయిలో ఉంటుందని ప్రభుత్వానికి ముందే సమాచారం అందినా కాలువ ద్వారా నీటిని వదలకుండా తాత్సారం చేసి చివరకు సామర్థ్యానికి మించి వదిలి ముంచేశారని ధ్వజమెత్తారు. ఇరిగేషన్, రెవెన్యూ, హోంశాఖలతో కనీసం సమీక్షించకుండా సీఎం చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని మండిపడ్డారు. విజయవాడ ఎలా అతలాకుతలమైందో అలాంటి నిర్లక్ష్యమే ఏలేరు విషయంలోనూ కనిపిస్తోందన్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ శుక్రవారం పర్యటించారు. మాధవాపురం, పాత ఇసుకపల్లి, నాగులాపల్లి, రమణక్కపేట తదితర గ్రామాల్లో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతులను ఓదార్చారు. దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. అనంతరం రమణక్కపేటలో మీడియాతో మాట్లాడారు. ప్రీమియం చెల్లించకుండా ఉచిత పంటల బీమాను గాలికొదిలేసి రైతులను ప్రభుత్వం నట్టేట ముంచేసిందని దుయ్యబట్టారు. ఈ క్రాప్ నమోదు చేయడం లేదని, ఆర్బీకేలను అడ్రస్ లేకుండా చేశారని, సచివాలయాలను నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రన్న వస్తాడు.. రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తాడన్న హామీ ఏమైందని నిలదీశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. మనుషుల విలువ తెలిసి ఉంటే.. ఏలేరు రిజర్వాయర్ దగ్గర పరిస్థితిని చూస్తే విజయవాడ గుర్తుకొస్తోంది. అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆగస్టు 31నే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఐఎండీ (భారత వాతావరణ విభాగం) అప్రమత్తం చేసింది. అలాంటి హెచ్చరిక అందగానే ప్రభుత్వం సమీక్ష నిర్వహించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. రెవెన్యూ, హోం, ఇరిగేషన్ కార్యదర్శులతో సమీక్ష చేయాలి. కానీ ముందే సమాచారం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. కలెక్టర్లతో మాట్లాడలేదు. సీఎస్ కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. సీఎం చంద్రబాబుకు మానవత్వం ఉంటే, మనుషుల విలువ తెలిసి ఉంటే స్పెషల్ ఆఫీసర్‌ను నియమించి ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకుని ముందు జాగ్రత్తలు చేపట్టే వారు. కానీ అవేమీ చేయలేదు. అన్నీ గాలి కొదిలేశారు. ఏలేరు ఆధునీకరణపై అబద్ధాలు.. అబద్ధాలు చెప్పడంలో సీఎం చంద్రబాబు గోబెల్స్‌కు తమ్ముడే. పచ్చి అబద్ధాలాడతారు. అబద్ధాలను సృష్టించడం, వాటిని అమ్మగలగడంలో చంద్రబాబును మించిన వారు ప్రపంచంలోనే లేరు. ఆయనకు వంత పాడే మీడియా నిత్యం అవే అబద్ధాలను ప్రచారం చేస్తోంది. ఏలేరు ఆ«ధునికీకరణపైనా చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. తొలుత ఏలేరు కాలువ ఆధునికీకరణను 2008లో దివంగత వైఎస్సార్ రూ.138 కోట్లతో చేపట్టారు. ఆ తర్వాత ఎవరూ ఆ పనులను పట్టించుకోలేదు. వర్షాలు, నీళ్లు లేనప్పుడు మాత్రమే కెనాల్ ఆధునికీకరణ చేయగలం. లేదంటే క్రాప్ హాలిడే ప్రకటిస్తే కానీ సాధ్యం కాదు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక అంచనాలు రూ.295 కోట్లకు పెంచడం మినహా పనులు చేయలేదు. నిజానికి అప్పుడు రిజర్వాయర్‌లో నీళ్లు కూడా పెద్దగా లేవు. నాడు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏటా కరువే. చంద్రబాబు – కరువు ఇద్దరూ కవలలే. అప్పుడు వర్షాలు కూడా లేవు. అయినా పనులు ఎందుకు చేయలేదు? 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక వరుసగా వర్షాలు కురవడంతో క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కాలువ ఆధునికీకరణ పనులు వేగంగా చేయలేకపోయాం. ఏం జరిగినా జగనే కారణం అంటాడుఏలేరు వరదలపై ప్రభుత్వానికి ముందే ఇంత సమాచారం ఉన్నా తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్లో చంద్రబాబు విఫలమై రైతులందర్నీ ఇబ్బంది పెట్టారు. వరదలు వస్తే రిజర్వాయర్లను ఎలా నిర్వహించాలో ఈ ప్రభుత్వానికి తెలియడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి దాదాపు నాలుగు నెలలు అయింది. ఎక్కడ ఏం జరిగినా దానికి కారణం జగనే కారణం అంటాడు. విజయవాడలో వరదలు వచ్చినా జగనే కారణం.. ! ఏలేరు రిజర్వాయర్ కింద వరదలు వచ్చినా జగ¯నే కారణం..! కోవిడ్ వచ్చినా జగనే కారణం.. అంటాడు! చంద్రబాబు చేయాల్సింది జగన్నామస్మరణ కాదు. ప్రతి దానికి జగన్‌పై అరవకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఇప్పటికైనా మమ్మల్ని నిందించడం మానుకుని ప్రజలకు క్షమాపణ చెప్పి నిజాయితీగా పాలన అందించాలి. సామర్థ్యానికి మించి ఒకేసారి నీటి విడుదలతో.. ఏలేరు రిజర్వాయర్ సామర్థ్యం దాదాపు 24 టీఎంసీలు కాగా 31వతేదీ నాటికే సుమారు 18 టీఎంసీలు ఉన్నాయి. సెపె్టంబర్ 1న ఏలేరు రిజర్వాయర్‌కు 9,950 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. ప్రభుత్వం జాగ్రత్త పడి ఉంటే, ఫ్లడ్ కుషన్ నిబంధన పాటించి ఉంటే ఆ మొత్తం వెంటనే కిందకు వదలాలి. ఎందుకంటే దిగువన కాలువ సామర్థ్యం 14 వేల క్యూసెక్కులు మాత్రమే. అలా అప్పుడే నీళ్లు దిగువకు వదిలి ఉంటే ఆ కాలువ పొంగకుండా ఉండేది. కానీ ప్రభుత్వం కేవలం 300 క్యూసెక్కులు మాత్రమే వదిలిపెట్టింది. సెప్టెంబరు 4న 5,400 క్యూసెక్కులు వస్తే బయటకు పంపింది కేవలం 300 క్యూసెక్కులు మాత్రమే. ఏమాత్రం ఫ్లడ్ మేనేజ్మెంట్ చేపట్టలేదు. ఫ్లడ్ ఫ్లో కుషన్ ఏర్పాటు చేయలేదు. పైనుంచి నీళ్లొస్తున్నా తీవ్ర నిర్లక్ష్యం వహించారు. కేవలం 300 క్యూసెక్కులు మాత్రమే వదులుతూ వచ్చారు. దీంతో 9వతేదీ నాటికి ఏలేరు రిజర్వాయర్ పూర్తిగా నిండింది. దీంతో గత్యంతరం లేక కిందకు 21,500 క్యూసెక్స్ వదిలారు. 10వ తేదీన 26,134 క్యుసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే ఏకంగా 27,275 క్యూసెక్స్ విడిచిపెట్టారు. అంటే కాలువ సామర్థ్యాన్ని మించి నీళ్లు వదలడంతో లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. మరి ఇది కచ్చితంగా ‘‘మేన్ మేడ్ ఫ్లడ్’’ కాకపోతే మరేమిటయ్యా! అని అడుగుతున్నా. ప్రజలు పట్ల మానవత్వం చూపని, ఏమాత్రం బాధ్యత లేని ప్రభుత్వం ఇది. వరదలు వస్తే ఎలా హ్యాండిల్ చేయాలో కనీసం ఇంగితం లేని ప్రభుత్వం ఇది! -
బడుగు జీవితాలు పదేళ్లు వెనక్కు!
సాక్షి ప్రతినిధి, విజయవాడ/పటమట/కృష్ణలంక: విజయవాడ ముంపు ప్రాంతాల్లోని పేదల జీవితాలు పదేళ్లు వెనక్కి వెళ్లిపోయాయి. బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముంపు తగ్గినా.. అక్కడి పేదలను కష్టాలు చుట్టుముట్టడంతో ఎలా బయటపడాలో తెలియక తమలో తామే కుమిలిపోతున్నారు. కష్టపడి సమకూర్చుకున్న ఇంటి సామగ్రి అంతా వరదపాలైంది. రెక్కలు ముక్కలు చేసుకుని బతికే ఒక్కో పేద కుటుంబం సైతం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల విలువైన సామాన్లను కోల్పోయింది. ఇంటి సామగ్రిని సమకూర్చుకోవాలంటే మరో పదేళ్లు శ్రమించినా కష్టమే అవుతుందని తల్లడిల్లిపోతున్నారు. పనులకు వెళ్లే అవకాశం లేకపోవడంతో మానసికంగా కుంగిపోతున్నారు. ముంపు కాలనీల్లో లక్ష మందికి పైగా ఆటో, మోటార్, హమాలీ, భవన నిర్మాణ కార్మికులు, షాపు వర్కర్లు, రోజువారీ కూలీలే కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ చాలామంది ఇంట్లో పొయ్యి వెలిగించలేని దుస్థితిలో ఉన్నారు. కనీసం వంట పాత్రలైనా సమకూర్చుకునే వరకు భోజనాల ప్యాకెట్లు సరఫరా చేయాలని పలువురు కోరుతున్నారు. ప్రభుత్వం వరద బాధితులకు సరఫరా చేసే భోజనం ప్యాకెట్లను సోమవారం నుంచే నిలిపివేసింది. దీంతో వారు దాతలు ఇచ్చే భోజనాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ కాలనీలను వీడని ముంపుజక్కంపూడి వైఎస్సార్ కాలనీ, రాజీవ్‌నగర్ కండ్రిక, కుందావారి కండ్రిక, ఉడా కాలనీ, అంబాపురం కాలనీల్లో ఇంకా వరద నీరు నిలిచే ఉంది. దీంతో కొందరు చర్చిలు, కమ్యూనిటీ హాళ్లలో తలదాచుకుంటున్నారు. జవసత్వాలు కూడదీసుకుని నెమ్మదిగా రోడ్డెక్కే ప్రయత్నం చేస్తున్నారు. సుందరయ్య నగర్లో ఇళ్లు దెబ్బ తినడంతో ఇంట్లో ఉండలేక వృద్ధ దంపతులైన బండి రమణమ్మ, ఆమె భర్త వెంకటేశ్వరరావు బయటే చిన్న గుడారం వేసుకుని ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ పది రోజులపాటు బయటే ఉన్నారు. రమణమ్మ దివ్యాంగురాలు కావడంతో మంచంపైనే ఉండిపోయింది. దాతలు ఇచ్చే ఆహారంతో కాలం వెళ్లదీస్తున్నారు. బుధవారం ఆమె భర్త ఆహారం తెచ్చేందుకు వెళ్లిన సమయంలో ఆ వృద్ధురాలు మృతిచెందగా.. ఈ ఘటన కాలనీవాసుల్లో విషాదం నింపింది. చాలా కాలనీల్లో మురుగు పేరుకుపోయింది. చెత్త ఎక్కడికక్కడ గుట్టలుగా పేరుకుపోవడంతో పలు కాలనీల్లోని రోడ్లు డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయి. తాగునీటి పైపులు మురుగులో ఉండటంతో నగరపాలక సంస్థ సరఫరా చేస్తున్న నీటిని తాగటం లేదు. ట్యాంకర్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. విష పురుగుల సంచారంతో బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు నిన్నటి వరకు వరద తమను వణికిస్తే... ఇప్పుడు దొంగలు భయపెడుతున్నారని.. మిగిలిన కొద్దిపాటి సామాన్లు కాపాడుకునేందుకు ఇంటిలో ఒకరు కాపలా ఉండాల్సి వస్తోందని ముంపు ప్రాంతాల ప్రజలు వాపోతున్నారు. మరోవైపు వరద నష్టంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సర్వే బృందాలు తమ ఇళ్లకు రాకుండా వీధి మొదట్లో ఉండి తమను ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని చెబుతున్నారని కండ్రిక ప్రాంత ప్రజలు వాపోతున్నారు.10 రోజులుగా పనుల్లేవు కండ్రిక ప్రాంతానికి చెందిన ఈమె పేరు ఎన్.నాగమణి. వరద ముంపు నుంచి ఇంట్లోని సామగ్రి కాపాడుకునే ప్రయత్నంలో ఆమె భర్త కాలు విరిగింది. ఆయన్ను ఆస్పత్రిలో చేర్చి, నాగమణి ఇంటికి వచ్చింది. ‘వరద తగ్గినా ఇంట్లోకి వెళ్లలేకపోతున్నాం. సర్వం కోల్పోయి పది రోజులుగా పనిలేకుండా ఉన్నాం. ఓ వైపు భర్త ఆస్పత్రి పాలయ్యాడు. వరదలో మునిగిన ఇంటిని చూస్తూ ఏడవటం తప్ప ఏమీ చేయలేకపోతున్నా. వరద వస్తుందని ముందుగా చెప్పి ఉంటే సామాన్లు సర్దుకుని వెళ్లిపోయేవాళ్లం. ఇలా మునిగిన ఇళ్లను కాపలాకాసే పరిస్థితి వచ్చేది కాదు. ఇంట్లో సామగ్రి సమకూర్చుకోవడం పదేళ్లకైనా మాలాంటోళ్లకు కష్టమే’ అని నాగమణి ఆవేదన చెందుతోంది.వంట పాత్రలైనా ఇవ్వండయ్యావరద వచ్చినప్పుడు ప్రభుత్వం మాకు సమాచారం ఇవ్వాలి కదా.. ఒక్కసారిగా వచ్చిన వరదతో సామాన్లన్నీ వదిలేసి ప్రాణాలు కాపాడుకునేందుకు వెళ్లాం. ఇంట్లో ఇంకా వరద తగ్గలేదు. ఒక్క సామాను కూడా పనికివచ్చేలా లేదు. ప్రభుత్వం స్పందించి వంట పాత్రలు, బకెట్లు వంటివి ఇవ్వాలి. – శైలజ, కండ్రిక ఇంట్లో ఉండలేం.. బయటకు వెళ్లలేం ఇల్లంతా వరద నీరు. నీరు తోడటానికి ఎవరూ ముందుకు రావటం లేదు. చర్చిలో తలదాచుకుంటున్నాం. మాకు ఆహారం ఇవ్వడం ప్రభుత్వం మానేసింది. దాతలు పంపిన ఆహారంతోనే కడుపు నింపుకుంటున్నాం. మా అమ్మకు బ్రెయిన్‌స్ట్రోక్ వచ్చింది. ఎక్కడికి వెళ్లలేని స్థితి. ఇంట్లో ఉండలేం. బయటకు వెళ్లలేం. – దేవర నాగమల్లేశ్వరి, కండ్రిక -
‘దేవుడా.. ఇంకెన్ని రోజులు’!.. విజయవాడ వరద బాధితుల ఆవేదన (చిత్రాలు)
-
ఆటో రిపేర్‌కు 3 నెలలు
ఆటోనగర్ (విజయవాడ తూర్పు): విజయవాడను ముంచెత్తిన వరదల కారణంగా ఇక్కడి ఆటోవాలాలకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. వరదలో మునిగిన ఆటోలు మరమ్మతులు చేయడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుందని, అప్పటి వరకు వేచి ఉండాలని, లేదంటే బయట మెకానిక్‌ల వద్ద రిపేర్లు చేయించుకోవాలని షోరూం యజమానులు తెగేసి చెబుతున్నారు. దీంతో కంగుతింటున్న ఆటోవాలాలు అన్ని రోజుల పాటు ఉపాధి కోల్పోతే కుటుంబ పోషణ, ఆటోల ఈఎంఐల చెల్లింపు ఎలా అని ఆందోళన చెందుతున్నారు. ఆటో యజమానులను మరింత ఆందోళనకు గురిచేసేలా షోరూం యజమానులు ఓ ప్రతిపాదన కూడా పెడుతున్నారు. వన్‌టైం సెటిల్మెంట్ చేసుకుని ఆటోను వెనక్కి ఇచ్చేస్తే.. కట్టిన వాయిదాలను, ఆటో కండిషన్‌ను బట్టి రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు నగదు ఇస్తామని చెబుతున్నారు. బయట రిపేర్లంటే కష్టమే.. బయట మరమ్మతులు చేయించుకోవాలంటే కష్టమేనని, తాము ఇబ్బంది పడతామని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. కొత్త మోడళ్ల ఆటోల రిపేర్లు బయట మెకానిక్‌లకు తెలియదని, సరిగా చేయకపోతే మళ్లీ మొరాయిస్తాయని వాపోతున్నారు. షోరూం వాళ్లు మూడు నెలల సమయం పెడితే ఈఎంఐ ఎలా చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదల కారణంగా ఇప్పటికే ఉపాధిలేక నానా ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడంలేదని చెబుతున్నారు. వన్‌టైం సెటిల్మెంట్ చేసుకోవాలంటే సంబంధిత ఫైనాన్స్ కంపెనీల నుంచి కచి్చతంగా క్లయిం నంబర్ తీసుకోవాలని, ఆ నంబర్ ఇవ్వడానికి కూడా ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులు రూ. 4 వేల నుంచి రూ. 5 వేలు డిమాండ్ చేస్తున్నారని ఆటోడ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులు, ఇతర ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పులు చేసి ఆటోలు కొనుక్కున్నామని, ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో తీవ్రంగా నష్టపోయామని, ఇప్పుడు షోరూం వాళ్ల తీరుతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నామని పలువురు ఆటో డ్రైవర్లు వాపోయారు. సమస్యను వారంలో పరిష్కరిస్తానని సీఎం చెప్పారు ఆటోల మరమ్మతులు వారం రోజుల్లో చేయిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇది ఆచరణలో సాధ్యం కాలేదు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ఆటో మరమ్మతుకు మూడు నెలల సమయం పడుతుందని షోరూం వారు చెబుతున్నారు.అప్పటి వరకు ఏమి చేసి కుటుంబాన్ని నడపాలి. ఏమి చేయాలో అర్థం కావడంలేదు. వన్‌టైం సెటిల్మెంట్ చేసుకోవడం కుదరదు. గతంలో చెల్లించిన కిస్తీల పరిస్థితి ఏంటో చెప్పడంలేదు. ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించి మమ్మల్ని ఆదుకోవాలి. – ఇ.సింహాచలం, జక్కంపూడి వైఎస్సార్ కాలనీ -
నిబంధనలు గాలికి..
సాక్షి, అమరావతి: విపత్తుల సమయంలో అనుసరించాల్సిన ప్రాథమిక నిబంధనలను సీఎం చంద్రబాబు గాలికి వదిలేయడంతో విజయవాడ ప్రజలు అష్టకష్టాలు అనుభవించారు. దేశవ్యాప్తంగా పాటించే విపత్తు నిర్వహణ విధానాలను ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడంతో ప్రజల నష్టం, కష్టం మరింత పెరిగిపోయిందని నిపుణులు సైతం పేర్కొంటున్నారు.ముందస్తుగా ప్రజలను హెచ్చరించి అప్రమత్తం చేయడం, సురక్షిత ప్రాంతాలకు తరలించడం, కష్ట సమయంలో ఆదుకుని తక్షణ ఆర్థిక సాయం అందించడం లాంటివి కీలకం. ఎన్డీఎంఎ (జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ) మాన్యువల్‌లో ఈ మూడు అంశాలు అత్యంత కీలకం. రాష్ట్రంలో ఏ విపత్తు తలెత్తినా ఇవే ప్రామాణికం. అందులోని అంశాల ప్రకారమే నివారణ చర్యలు, సహాయక చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ముందే హెచ్చరించినా..విజయవాడను ముంచెత్తిన తాజా వరదల్లో విపత్తు మాన్యువల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. బుడమేరు వరద గురించి కనీస సమాచారం ప్రజలకు ఇవ్వలేదు. ఆగస్టు 31వ తేదీన విజయవాడ పరిసరాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని మూడు రోజులు ముందే వాతావరణ శాఖ హెచ్చరించినా పట్టించుకోలేదు. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు శాఖలతో సీఎం కనీసం సమీక్ష నిర్వహించలేదు. జలాశయాలు నిండుకుండల్లా కనిపిస్తున్నా ‘ఫ్లడ్ కుషన్’ నిబంధన పాటించలేదు. తీరా బుడమేరుకు వరద పోటెత్తాక అర్థరాత్రి వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తేశారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలను కనీసం అప్రమత్తం చేయకపోవడంతో సగం విజయవాడ మునిగిపోయింది. 2.50 లక్షలకు పైగా కుటుంబాలు వరద నుంచి బయటపడే అవకాశం లేక తీవ్రంగా నష్టపోయాయి. వరదల్లో 60 మందికిపైగా మృత్యువాత పడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్ని నిండు ప్రాణాలు బలవ్వగా లక్షలాది కుటుంబాలకు రూ.వేల కోట్ల నష్టం వాటిల్లింది. ప్రభుత్వ ఆస్తులకు అపార నష్టం జరిగింది. విపత్తుల సమయంలో అనుసరించాల్సిన ప్రాథమిక సూత్రాన్ని ప్రభుత్వం పాటించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు స్పష్టమవుతోంది. ఏ దశలోనూ కళ్లు తెరవని బాబు ఆ తర్వాత దశలోనూ రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవకపోగా విపత్తు నిర్వహణ విధానాలను గమనించకుండా ప్రజలను వరదకు వదిలేసింది. వరదలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు అంటే వరద లేని ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడికి తరలించాలి.రెండున్నర లక్షల కుటుంబాలు మునిగిపోయినా కనీసం 50 పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయకపోవడాన్ని బట్టి ప్రభుత్వ అలసత్వం ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. దీంతో లక్షల మంది రోజుల తరబడి నీటిలో చిక్కుకుని విలవిల్లాడిపోయారు. వరద నుంచి బయటపడిన వారు చెట్టుకొకరు పుట్టకొకరుగా రైల్వే స్టేషన్, బస్టాండ్లు, కమ్యూనిటీ హాళ్లు, తెలిసిన వాళ్ల ఇళ్లలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మునిగిన లోతట్టు ప్రాంతాలకు నాలుగు రోజుల వరకు కనీసం ఆహారం, నీళ్లు కూడా ఇవ్వలేదు. విపత్తు నిర్వహణ మాన్యువల్‌లోని షెల్టర్ మేనేజ్మెంట్ను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ఉల్లంఘించి లక్షలాది మందిని తీవ్ర అవస్థలకు గురి చేసింది. 60 మంది చనిపోతే ఎక్స్‌గ్రేషియా ఏదీ? విజయవాడ వరదల్లో లక్షలాది మంది చిక్కుకుంటే పునరావాసం కల్పించకపోగా తక్షణ సాయం అందించలేదు. తన దగ్గర డబ్బులు లేవని సీఎం చంద్రబాబు ముందే చేతులెత్తేశారు. 60 మంది చనిపోతే ఎక్స్‌గ్రేషియా గురించి పట్టించుకోలేదు. విపత్తుల సమయంలో ప్రాథమిక సూత్రాలను పాటించకుండా ప్రజలను వారి ఖర్మకు వదిలేసిన సీఎం చంద్రబాబు ప్రచారాన్ని మాత్రం ఆకాశమంత స్థాయిలో చేసుకున్నారు. అన్ని దశల్లోనూ విఫలమైనా తాను బాగా పని చేస్తున్నట్లు హడావుడి, హంగామా చేసి మభ్యపుచ్చేందుకు రకరకాల ఫీట్లు నిర్వహించారు. తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు తప్పుడు ప్రచారాలకు తెర తీశారు. వరదల్లోనూ చంద్రబాబు తన మార్కు రాజకీయాన్ని వదలకపోవడంతో లక్షలాది మంది ప్రజలు పడరాని పాట్లు పడ్డారు. తక్షణ సాయం ఊసే లేదు.. జగన్ హయాంలో పక్కాగావిపత్తు బారిన పడిన వారిని పునరావాస కేంద్రాలకు తరలించి తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు తక్షణ సాయం అందించాలి. అసలు కేంద్రాలే ఏర్పాటు చేయని కూటమి సర్కారు తక్షణ సాయం ఊసే లేకుండా చేసింది. వరదలు, తుపానులు వచ్చినప్పుడు వైఎస్ జగన్ హయాంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు బాధితులు ఇళ్లకు తిరిగి వెళ్లేటప్పుడు ఆర్థిక సాయంగా రూ.2 వేలు చొప్పున పంపిణీ చేశారు. 2020లో కృష్ణా, గోదావరి వరదలు, 2023లో మిచాంగ్ తుపానుతోపాటు ప్రతి విపత్తులోనే ఇదే విధానాన్ని అనుసరించి బాధితులకు తక్షణ సాయం అందించారు. 2014కి ముందు తక్షణ సాయంగా రూ.వెయ్యి అరకొరగా ఇచ్చేవారు. వైఎస్ జగన్ హయాంలో దాన్ని రూ.2 వేలకు పెంచి బాధితులందరికీ అందేలా చర్యలు తీసుకున్నారు. -
పాడైన అన్నం పెడుతున్నారు.. బెజవాడను వెంటాడుతున్న వరద కష్టాలు..
-
కష్టాల ఊబిలో..
బెజవాడలో బుడమేరు వరద తగ్గింది. కానీ, ముంపు ప్రాంతాల్లోని ప్రజల కష్టాలు మాత్రం ఇప్పట్లో తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఏ వీధిలో చూసినా గుట్టలుగుట్టలుగా పేరుకుపోయిన వ్యర్థాలు... ఇళ్లలో చేరిన బురద... పాడైపోయిన వస్తువులు... వాటిని శుభ్రం చేసుకుంటున్న జనం... ఇళ్ల ముందు కంపు కొడుతున్న మురుగు... మొరాయిస్తున్న వాహనాలు... సర్వం కోల్పోయి షాపులను చూసి విలపిస్తున్న చిరు వ్యాపారులు... చేతి వృత్తులవారు... ఇలా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర కష్టాల్లో మునిగిపోయారు. ముంపు ప్రాంతాల్లో ఎవరిని కదిలించినా లక్షల రూపాయలు నష్టపోయామని చెబుతున్నారు. కుటుంబమంతా 10 నుంచి 15 ఏళ్లుగా కష్టపడి పని చేస్తూ పైసా పైసా కూడబెట్టుకుని కొనుక్కున్న వాహనాలు, టీవీ, ఫ్రిజ్, కంప్యూటర్, మంచాలు వంటి వస్తువులన్నీ పాడైపోయాయని కన్నీరుపెడుతున్నారు. ఇప్పుడు కోల్పోయినవన్నీ మళ్లీ సమకూర్చుకోవాలంటే మరో 10 నుంచి 15 ఏళ్లు పడుతుందని కుమిలిపోతున్నారు.మరోవైపు ప్రభుత్వం ఆహారం, తాగునీరుపంపిణీ చేస్తున్నా... అవన్నీ దాదాపు మెయిన్ రోడ్లకే పరిమితమయ్యాయని, చిన్న చిన్న వీధుల్లో ఉన్న తమకు అందడం లేదని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇళ్లను శుభ్రం చేసేందుకు సాయం అందిస్తున్న ఫైర్ సిబ్బంది సేవలు కూడా ప్రధాన వీధులకే పరిమితమయ్యాయని చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ముంపు ప్రాంతాల్లోని ప్రజలు అంటువ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.పాడి గేదెలను బలి తీసుకున్న వరద బుడమేరు వరద పశుపోషకులను నట్టేట ముంచింది. రూ. లక్షల విలువైన పశువులు వరదలో కొట్టుకుపోయి మృతిచెందాయి. దీంతో వాటిపై ఆధారపడినవారు అల్లాడిపోతున్నారు. సింగ్‌నగర్ లెనిన్ సెంటర్లో నివాసం ఉంటున్న వెల్లబోయిన నాగేశ్వరమ్మ, మల్లేశ్వరరావు దంపతులతోపాటు వారి కుమారుడు దుర్గాప్రసాద్, కుమార్తె రాజేశ్వరి కుటుంబాలు ఉమ్మడిగా ఉంటూ 9 గేదెలను పెంచుకుంటూ వాటి ద్వారా వచ్చే ఆదాయంతో జీవిస్తున్నారు. వారి 4 గేదెలు వరదలో కొట్టుకుపోయాయి. తాము చూస్తుండగానే గేదెలు కొట్టుకుపోయాయని, వాటి విలువ రూ.1.50లక్షలు ఉంటుందని నాగేశ్వరమ్మ కన్నీటిపర్యంతమయ్యారు.రైల్వేస్టేషన్.. బస్టాండ్‌లో బతికాంఈ వ్యక్తి పేరు ఉప్పు శ్రీను. విజయవాడ సింగ్‌నగర్‌లోని కృష్ణా హోటల్ సెంటర్లో నివాసం ఉంటున్నారు. తండ్రి ఇచ్చిన కొద్దిపాటి స్థలంలోనే పక్కపక్కన శ్రీను, అతని ఇద్దరు తమ్ముళ్లు ఇళ్లు నిర్మించుకుని తమ కుటుంబాలతో కలిసి జీవిస్తున్నారు. శ్రీను ఆటో నడిపితే.. భార్య, ఇద్దరు పిల్లలు మట్టి పనులు చేసుకుని పైసాపైసా కూడబెట్టుకున్నారు. శ్రీను తమ్ముళ్లు కూడా మట్టి పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. యథావిధిగా ఈ నెల ఒకటో తేదీ అందరూ పనికి వెళ్లగా, అకస్మాత్తుగా వారి ఇంటి చుట్టూ వరద వచ్చింది. ఇంట్లో ఉన్న మగ పిల్లలు శ్రీను తల్లిని, ఇతర కుటుంబ సభ్యులను పక్కింటి గోడ దూకించి సురక్షితంగా బయటకు చేర్చారు. కట్టుబట్టలతో కొంత మంది రైల్వేస్టేషన్, మరికొంత మంది బస్టాండ్‌లో వారానికిపైగా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. దొరికింది తింటూ ఆకలి తీర్చుకున్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో రెండు రోజుల కిందట తిరిగి ఇంటికి వచ్చి శుభ్రం చేసుకున్నారు. ఇప్పుడు ముగ్గురి ఇళ్లలోని మంచాలు, ఫ్రిడ్జ్‌లు, టీవీలు, వాషింగ్ మెషీన్లు మొత్తం పాడైపోయాయి. కొత్త బైక్ కాస్తా నీటిలోని ఇంజిన్ సీజ్ అయిపోయింది. ఆటోకు, బైక్‌కు ఇన్సూరెన్స్ కోసం ఫోన్లు చేస్తుంటే కంపెనీల ప్రతినిధులు మళ్లీ ఫోన్ చేస్తామంటూ పెట్టేస్తున్నారని శ్రీను ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఒక్క కుటుంబంలోనే రూ.4లక్షలకు పైగా నష్టం జరిగింది. ‘మేం మనుషులం మాత్రమే బతికున్నాం. సర్వస్వం కోల్పోయాం. వేసుకోవడానికి బట్టలు కూడా లేకుండా బురదలో కొట్టుకుపోయాయి..’ అని శ్రీను కుటుంబ సభ్యులు విలపించారు.నీటి కొరతతో ఇబ్బందులు కండ్రిక, జక్కంపూడి వైఎస్సార్ కాలనీ, సింగ్‌నగర్, డాబాకొట్లు.. ఇలా అనేక ముంపు ప్రాంతాల్లో బాధితులను నీటి కొరత వెంటాడుతోంది. పది రోజులపాటు జలదిగ్భందంలో ఆయా ప్రాంతాలు ఉండటంతో మున్సిపల్ వాటర్ పైప్లైన్లోకి మురుగు నీరు చేరింది. దీంతో చాలాచోట్ల నీటి సరఫరా పునరుద్ధరించినప్పటికీ కుళాయిల ద్వారా వస్తున్న నీటిని వాడుకోలేకపోతున్నామని ప్రజలు తెలిపారు. మరికొన్ని చోట్ల నీటి సరఫరా ఇంకా పునరుద్ధరించలేదు. విద్యుత్ సరఫరా మొదలైనప్పటికీ ఇళ్లలోకి నీరు చేరడంతో మోటార్లు సైతం దెబ్బతిని భూగర్భ జలాలను వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. నీళ్ల కోసం ముంపు ప్రాంతాల ప్రజలు నేటికీ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్న ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు.ప్రధాన వీధులకే ఫైర్ ఇంజన్ పరిమితంనీట మునిగిన ఇళ్లను ఫైర్ ఇంజన్ల సాయంతో శుభ్రం చేస్తున్నామని పదేపదే ప్రభుత్వం చెబుతోంది. వాస్తవ పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. సింగ్‌నగర్, ఉడా కాలనీ, వాంబేకాలనీ, కండ్రిక, జక్కంపూడి వైఎస్సార్ కాలనీతోపాటు చాలా ప్రాంతాల్లోని అనేక వీధుల్లో ఇప్పటి వరకు ఫైర్ ఇంజన్లు వచ్చి ఇళ్లు శుభ్రం చేసిన దాఖలాలు లేవు. కేవలం ప్రధాన వీధులకు మాత్రమే ఫైర్ ఇంజన్లు పరిమితమయ్యాయి. ఎక్కువ మంది ఇప్పటికీ రోడ్లపై ఉన్న మురుగు నీటితోనే ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు.దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరివరదల్లో కొట్టుకుని వచ్చిన చెత్తాచెదారంతో డ్రెయిన్లలో నీరు బయటకు వెళ్లడం లేదు. రాజీవ్‌నగర్, పాయకాపురం, ప్రకాష్‌నగర్, రాధానగర్, కండ్రిక, కృష్ణా హోటల్, డాబాకొట్లు సెంటర్, జక్కంపూడి వైఎస్సార్ కాలనీ, పాత, కొత్త రాజరాజేశ్వరీపేటలు... ఇలా అనేక ప్రాంతాల్లో రోడ్లపై చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. ఇళ్ల మధ్యలో మురుగు నిలిచిపోయింది. ఆయా ప్రాంతాల ప్రజలు దుర్వాసనతో అల్లాడుతున్నారు.కట్టుకోవడానికి బట్టల్లేవు... పొయ్యి వెలగడం లేదులోతట్టు ప్రాంతాల్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఇళ్లు వారం రోజులకు పైగానే నీట మునిగే ఉన్నాయి. ముంపు వీడాక ప్రజలకు అసలైన కష్టాలు మొదలయ్యాయి. చిరువ్యాపారులు, రోజువారీ కూలీలకు 10 రోజుల నుంచి ఉపాధి లేదు. దీంతో చేతిలో చిల్లిగవ్వ లేదు. బయట అప్పు కూడా పుట్టని దుస్థితి. కనీసం పాడైపోయిన గ్యాస్ స్టౌ రిపేరు చేయించుకోవడానికి డబ్బులు లేని దీనస్థితి అనేక కుటుంబాల్లో నెలకొంది. గ్యాస్ ఏజెన్సీలు ఉచితంగా సర్వీస్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నాయి. కానీ, స్పేర్ పార్ట్లు కావాలంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సి ఉంటోంది. వరద నీరు ఇంట్లో చేరడంతో బీరువాలు, ర్యాక్లలోకి దుస్తులు వేసుకోవడానికి వీల్లేకుండా పాడైపోయాయి. ఈ నెల ఒకటో తేదీన కట్టుబట్టలతో ఇళ్లు వదిలిన అనేక మంది బాధితులు నేటికీ వాటితోనే కాలం వెళ్లదీస్తున్నారు.ట్యాంకర్ల చుట్టూ పరుగెత్తుతున్నాం..నీళ్ల కోసం చీటీలు రాయించుకోవాలా? ఆడవాళ్లంబిందెలు పట్టుకుని రోడ్డు చివరకు ఎలా వెళ్తాం. ఇన్నీ రోజులు వరద నీటిలో మగ్గిపోయాం. బాగాలేని నీళ్ల కోసం కూడా ట్యాంకర్ల చుట్టూ పరుగెత్తాల్సి వస్తోంది. ఇంట్లో టైలరింగ్ చేసుకుంటూ జీవిస్తున్నా. నా కుట్టుమిషన్ కూడా వరదలో పొయింది. సరుకు మొత్తం మునిగిపోయింది. నా భర్త వాచ్‌మెన్‌గా పని చేస్తారు. పది రోజులుగా ఇద్దరి ఉపాధి పోయింది. తిండికి గతిలేని పరిస్థితి. మా ఇంటిలో చిన్న పాప (మనవరాలు) ఉంది. కనీసం దానికి స్నానం చేయించడానికైనా నీళ్లు కావాలి. లేకుంటే పాపకు ఎక్కడ ఇన్ఫెక్షన్ వస్తుందోనని భయమేస్తోంది. ఇప్పటి వరకు మాకు ప్రభుత్వం నుంచి ఎటుంటి సాయం అందలేదు. – కుమారి, జక్కంపూడి వైఎస్సార్ కాలనీమెకానిక్ షెడ్‌కు వెళ్లాలంటే గుబులువరద వస్తుందని ముందే తెలిసినప్పటికీ లోతట్టు ప్రాంత ప్రజలను ప్రభుత్వం కనీసం అప్రమత్తం చేసిన పాపాన పోలేదు. అలా చేసి ఉంటే ఇంట్లో వస్తువులు, బైక్‌లను అయినా సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకునే వాళ్లం అని బాధితులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. లక్షల సంఖ్యలో బైక్‌లు, స్కూటీలు వరద నీటిలో మునిగిపోయాయి. ప్రస్తుత రోజుల్లో ఇంటి నుంచి బయట అడుగు పెడితే బైక్ అనేది సర్వసాధారణం. అలాంటి బైక్ ముంపునకు గురై పనిచేయలేని దుస్థితిలో ఇంటి ముందే పడి ఉంది. దాన్ని మెకానిక్ షెడ్ వరకూ నెట్టుకుని వెళ్లి రిపేర్ చేయించడానికి ఎంత బిల్లు అవుతుందోనని భయపడుతున్నారు. ప్రస్తుత కష్టాల్లో అంత ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవని చాలా మంది అలాగే బైక్‌లను వదిలేశారు. 70 శాతం బైక్‌లకు ఇన్సూరెన్స్ ఉండదుఒకపక్క సీఎం చంద్రబాబు ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి పాడైపోయిన వాహనాలను రిపేర్ చేయించి పెడతామని పదే పదే ప్రకటిస్తున్నారు. అయితే పాడైపోయిన బైక్‌లలో ఎన్నింటికి ఇన్సూరెన్స్ ఫోర్స్‌లో ఉంటుంది? అనే చర్చ బాధితుల్లో నడుస్తోంది. సాధారణంగా బైక్‌ను కొత్తగా కొనుగోలు చేసినప్పుడు మాత్రమే యజమానులు ఇన్సూరెన్స్ చేయిస్తారు. అనంతరం 70 శాతం మంది సమగ్ర ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయించరని వాహన, ఇన్సూరెన్స్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం ప్రకటనలతో తమకు మేలు జరగదని చాలామంది బైక్ యజమానులు వాపోతున్నారు.రక్తం పీలుస్తున్న దోమలుముంపు ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన శానిటేషన్ పనులు చేపట్టాల్సి ఉంటుంది. లేదంటే దోమల వ్యాప్తి అధికమై డెంగీ, మలేరియా, చికున్ గున్యా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. కానీ ఆశించినంత వేగంగా ముంపు ప్రాంతాల్లో శానిటేషన్ పనులు సాగడం లేదు. మురుగు, చెత్త మేటలతో దోమల బెడద ఎక్కువగా ఉంటోంది. దోమల నియంత్రణకు ఫాగింగ్ కూడా సక్రమంగా చేయడంలేదని వరద బాధితులు చెబుతున్నారు. చీకటిపడితే చాలు దోమలు రక్తం పీల్చేస్తున్నాయని, ఇప్పటికే పుట్టెడు కష్టాల్లో ఉన్నామని, దోమ కాటుతో తమ ఆరోగ్యాలు కూడా గుల్ల అవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దాతల కోసం ఎదురు చూపులు ముంపు ప్రాంతాల్లో మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేసినట్టు ప్రచారం చేస్తోంది. పది రోజులుగా జలదిగ్భందంలో ఉండి చేతిలో చిల్లిగవ్వలేని రోజువారీ కూలీలు, చేతివృత్తిదారులు కూరగాయలు కొనుగోలు చేయలేకపోతున్నారు. కొందరు అప్పు చేసి కూరగాయలు, సరుకులు కొనుగోలు చేస్తున్నారు. అప్పు పుట్టని వారు దాతలు పంపిణీ చేసే ఆహారం కోసం ప్రధాన రహదారుల వెంబడి గంటల తరబడి ఎదురుచూస్తున్నారు.రాకపోకలకు అవస్థలే...అజిత్‌సింగ్‌నగర్ నుంచి కొత్త రాజరాజేశ్వరీపేట వైపు వచ్చేందుకు ఉన్న వంతెనపై గుర్రపు డెక్క, బురద పెద్ద పేరుకుపోయింది. దీంతో ఈ రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేదలు ఎక్కువగా నివాసం ఉంటున్న కొత్త రాజరాజేశ్వరీపేట ప్రాంత ప్రజలు ఎక్కువగా పని కోసం సింగ్‌నగర్ వెళుతుంటారు. అటువైపు నుంచి నగరంలోకి వస్తారు.దుర్వాసన భరించలేకపోతున్నాం..వరద తగ్గినా మురుగు సమస్య తీరలేదు. సైడు కాలువల్లో వరద ముందుకు పారకపోవడంతో దుర్వాసనవస్తోంది. ఆ వాసన భరించలేకపోతున్నాం. ఒకవైపు వరద నీటిలో ఇల్లు మునిగి వంట సామాన్లు, మంచాలు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్, పిల్లల పుస్తకాలు అన్నీ తడిసి పాడైపోయి బాధపడుతుంటే.. మరోవైపు ఈ మురుగు సమస్య వేధిస్తోంది. వరద గురించి ముందుగా హెచ్చరించి ఉంటే అప్రమత్తమయ్యేవాళ్లం. పగలు వరద వచ్చింది కాబట్టి బతికాం. అదే రాత్రివేళ అయితే ఊహించడమే కష్టం. – ఎం.దేవకుమారి, మసీదు రోడ్డు, శాంతినగర్పుస్తకాలన్నీ నీటిలో నానిపోయాయి తెల్లవారుజామున అకస్మాత్తుగా ఇంట్లోకి వరద నీరు రావడంతో ఏం చేయాలో పాలుపోలేదు. నా పుస్తకాలతోపాటు ఇద్దరు చెల్లెళ్ల పుస్తకాలు, రికార్డులను ఇంట్లో నుంచి తీసుకువెళ్లడం సాధ్యం కాలేదు. పుస్తకాలన్నీ వరద నీటిలోనే నానిపోయాయి. వరద తగ్గిన తర్వాత ఇప్పుడు వచ్చి చూస్తే అవి ఎందుకూ పనికి రాకుండాపోయాయి. స్కూలులో ఉన్నప్పుడు జగనన్న ఇచి్చన డిక్షనరీలు మా చదువులకు ఎంతో ఉపయోగంగా ఉన్నాయి. అవి నీళ్లలో నాని చిరిగిపోవడంతో ఇప్పుడు డబ్బులు పెట్టి కొనే పరిస్థితి లేదు. బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలనేది మా అక్కచెల్లెళ్ల లక్ష్యం. పుస్తకాలు మళ్లీ కొనాలంటే మా తల్లిదండ్రులకు ఇబ్బందే. – వర్ష, ఇంటర్ విద్యార్థిని, జక్కంపూడి వైఎస్సార్ కాలనీ, విజయవాడ -
సరుకులు లేవు..సమన్వయం లేదు
ఆరురోజులుగా విజయవాడ అతలాకుతలమవుతోంది. లెక్కలేనన్ని మరణాలు... అంతులేనంత నష్టం.. ఐదు లక్షల మంది ప్రజల జీవితాలు తల్లకిందులైపోయాయి.. ఇంతజరుగుతుంటే వరద నిండిన వీధుల్లో ముఖ్యమంత్రి రోడ్‌షోలు, తామేమీ తక్కువ తినలేదన్నట్లుగా జేసీబీల్లో మంత్రుల ఊరేగింపులే తప్ప బాధితులకు రవ్వంత ఉపశమనం కలిగించలేకపోయారు. సరుకులు పంచుతున్నామని ప్రచారం చేయడంతో శుక్రవారం జనం ఆశగా ఎదురుచూశారు.. యథాప్రకారం అదీ లేదు... ఇక బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశారు.. వీధిలో చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ నెపాన్ని ఒకరిపై ఒకరు నెట్టుకోవడం చూసి జనం విస్తుపోయారు..సాక్షి, అమరావతి: వరద సహాయక కార్యక్రమాల్లో చంద్రబాబు సర్కారు తీరు అజిత్ సింగ్ నగర్ వంతెన సాక్షిగా నవ్వుల పాలైంది. శుక్రవారం ఏరియల్ వ్యూ ముగించుకున్న తర్వాత అజిత్‌సింగ్‌నగర్‌లో నిత్యావసర సరుకుల పంపిణీలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రజలు నిలదీయడంతో ఆయన పక్కనే ఉన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ వీరపాండియన్ వైపు తిరిగారు. ‘ఈ రోజు అటు నిత్యావసర సరుకులు పంచలేకపోయారు.. ఇటు ఆహారం అందించలేకపోయారు... అక్కడ ఉన్న ముసలాయన నా గతి ఏంటి? అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి..’ అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ‘ఈ రోజు ఒక్కరి ముఖంలో కూడా కళ లేదు. ఎందుకంటే వారికి ఆహారం అందలేదు. కడుపులో ఎంతో కొంత పడితే వారు కష్టాన్ని మర్చిపోతారు. మనం వ్యవహరిస్తున్నది మనుషులతో.. యంత్రాలతో కాదు’ అని అన్నారు. ‘అప్పటి వరకు పాజిటివ్‌గా ఉన్న ప్రజలు కూడా ఇలాంటప్పుడు ఎక్కువ నెగిటివ్‌గా బయటకొస్తారు. ఈ రోజు ఇక్కడ అదే జరిగింది’ అని అన్నారు. ఈ రోజు ఎన్ని నిత్యావసర సరుకులు పంపిణీ చేశారని సీఎం అడగ్గా.. ఇప్పటి వరకు 9,000 పంపిణీ చేశామని, సాయంత్రానికి 15,000 చేస్తామని వీరపాండియన్ తెలిపారు. అంటే మనం పెట్టుకున్న 80,000 లక్ష్యంలో కనీసం 20 శాతం కూడా చేయలేదా? అని సీఎం నిలదీశారు. మధ్యలో కలగ చేసుకున్న మంత్రి నాదెండ్ల ఈ మొత్తం తప్పును పురపాలక శాఖ మంత్రి నారాయణ మీద తోసేశారు. సరుకుల పంపిణీ కోసం నారాయణ ట్రాక్టర్లను పంపిస్తామన్నారని, మా రేషన్ వాహనాలు సిద్ధం చేసి సరుకులు పంపిణీ మొదలు పెట్టడంతో ఆలస్యం అయ్యిందన్నారు. ‘సర్.. నేను మీకు ఫిర్యాదు చేయడం లేదు కానీ.. సరుకుల పంపిణీ నీకు సంబంధం లేదు.. నేను, మనోజ్ చూసుకుంటామని మంత్రి నారాయణ గురువారం రాత్రి ఫోన్ చేశారు’ అని నాదెండ్ల మనోహర్ చంద్రబాబుకు చెప్పారు. ఇలా నాదెండ్ల అసలు విషయాన్ని బహిరంగంగా చెప్పడంతో చంద్రబాబు అవాక్కయ్యారు. వెంటనే వీరపాండియన్‌తో మంత్రులుగా మేం పాలసీలు మాత్రమే ఇస్తాం. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు. ఏమి చేయాలో అది చేయండి అంటూ వ్యాన్ ఎక్కి వెళ్లిపోయారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చూసిన ప్రజలు ఇదేం ప్రభుత్వమంటూ నవ్వుకున్నారు. మరికొందరు ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. -
దాతలు, ప్రజలే ఆదుకోవాలి
సాక్షి, అమరావతి : వరద ముంపు తగ్గిన తర్వాత బాధితులకు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం అతిపెద్ద సమస్యగా మారిందని, ఖజనా చూస్తే అటువంటి పరిస్థితులు కనిపించడంలేదని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. వరదల్లో సర్వస్వం కోల్పోయిన వారికి ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలన్నా అప్పులుచేయడానికి ఎఫ్ఆర్బీఎం పరిధి అడ్డువస్తుండడంతో బ్యాంకులతో దీర్ఘకాలిక రుణాల ద్వారా ప్యాకేజీ ఇప్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి పూర్తిస్థాయిలో ఆదుకునే అవకాశంలేకపోవడంతో దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు సామాజికసేవలో భాగం పంచుకోవాలన్నారు. ప్రజలకు జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం కూడా ఉదారంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రెండ్రోజుల్లో అందరితో మాట్లాడి ఎంతవరకు ఆర్థికసాయం చేయగలమన్న దానిపై ఒక నిర్ణయానికి వస్తామన్నారు. అలాగే, రాష్ట్రంలో వరద నష్టం అంచనాపై నివేదికను శనివారం కేంద్రానికి పంపనున్నట్లు ఆయన తెలిపారు.రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాల పంపిణీ..ఆదివారం నుంచి నిత్యావసర వస్తువుల ప్యాకేజీని రేషన్ దుకాణాల ద్వారా అందిస్తామన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం 80,000 మందికి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ 15,000 మందికి కూడా ఇవ్వలేకపోయామన్నారు. ఇంటి వద్దకే అందించే విధంగా వాహనాలను అత్యధిక సంఖ్యలో తీసుకురావడం ఇబ్బందిగా మారిందన్నారు. బాధితులకు నిత్యావసర వస్తువులను అందించాక ఆహారం పంచే కార్యక్రమానికి పూర్తిగా స్వస్తి పలుకుతామన్నారు. ఇక బుడమేరు మూడో గండిని శుక్రవారం అర్థరాత్రి లేదా శనివారం ఉదయానికి పూడ్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకోసం ఆర్మీ కూడా రంగంలోకి దిగిందన్నారు. తాజాగా.. గురువారం కురిసిన వర్షాలతో బుడమేరులో వరద ప్రవాహం 9,000 క్యూసెక్కులకు చేరడంతో నగరంలోకి మళ్లీ నీరు వచ్చిందన్నారు. అంతకుముందు.. హెలికాప్టర్లో వరద ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించానన్నారు. ప్రకాశం బ్యారేజీ 15 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేందుకు కేంద్రంతో కలిసి ఒక ప్రణాళికను రూపొందించనున్నట్లు తెలిపారు. రాజధానిలో భాగమైన విజయవాడ కూడా వరదలను తట్టుకునేలా ఒక మాస్టర్‌ప్లాన్‌ను కూడా రూపొందిస్తామన్నారు. రాష్ట్రంలో గిగ్ ఎకానమీని విస్తరిస్తాం..ఇదిలా ఉంటే.. ఈ వరద సంక్షోభం గిగ్ ఎకానమీకి (నచ్చిన సమయంలో పనిచేసుకోవడం) ఒక చక్కటి అవకాశమని, ఈ అవకాశాన్ని తాను అందిపుచ్చుకుంటున్నానంటూ చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం చేయడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. వరదలపై సహాయక వివరాలను తెలియచేయడానికి ఏర్పాటుచేసిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడిన తీరుపై అందరూ విస్మయం వ్యక్తంచేశారు. ఇప్పుడు కాలం మారిందని.. నచ్చిన సమయంలో నచ్చిన చోట పనిచేసుకోవడానికి గిగ్ వర్కర్లు ముందుకొస్తున్నారని, వీరిని పెద్దఎత్తున ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ప్రతీ ఒక్కరికీ ఉబరైజేషన్ (ఆన్లైన్ ద్వారా సేవలు)తో తక్కువ ధరలో సేవలు అందించడం ద్వారా డిజిటల్ ఎంపవర్‌మెంట్‌ను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వరదల్లో కార్పెంటర్, ప్లంబర్, టీవీ మెకానిక్, ఆటోమొబైల్ మెకానిక్స్, పెయింటర్స్.. ఇలా నైపుణ్యం కలిగిన వారి అవసరముందని.. ఇంతమందికి ఇక్కడ సేవలు అందించేవారు సరిపడా లేకపోవడంతో గిగ్ వర్కర్ల సేవలను ఆన్లైన్ సేవల సంస్థల ద్వారా అందిపుచ్చుకుంటున్నట్లు తెలిపారు. ఈ సంక్షోభాన్ని అవకాశం తీసుకుని గిగ్ ఎకానమీని రాష్ట్రంలో విస్తరిస్తామన్నారు. ఎందుకీ సుత్తి అంటూ బాబుపై సెటైర్లు..ఇదిలా ఉంటే.. ప్రాజెక్టుల్లో ఎంత నీరు ఉంది, ఎంత వరద వస్తోందని ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా గతంలో తాను వాసర్ ల్యాబ్‌ను అభివృద్ధి చేశానని, కానీ గత ప్రభుత్వం వీరి సేవలను వినియోగించుకోకపోవడంతో తాను శిక్షణ ఇచ్చిన వారు వేరే రాష్ట్రాల్లో కన్సల్టెంట్లుగా ఉన్నారంటూ బాబు తన స్వోత్కర్షను చెప్పుకొచ్చారు. నిజానికి.. వాసర్ల్యాబ్ అనేది ప్రాజెక్టుల నీటి స్థితిగతులపై రియల్ టైమ్‌లో సేవలందించే విధంగా ఒక ఐటీఐ విద్యార్థి పెట్టుకున్న సంస్థ. ఇది మన రాష్ట్రంతోపాటు వేరే రాష్ట్రాల్లో కూడా సేవలందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం అయిపోవడంతో వారిప్పుడు వేరే రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్నారు. కానీ, అసలు వాసర్ల్యాబ్ను తానే సృష్టించినట్లు, వారికి తానే శిక్షణ ఇచ్చినట్లు చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడంతో విలేకరులు తెల్లమొహం వేశారు. వరదల సమయంలో అసలు విషయాలు వదిలి ఈ సుత్తి ఎందుకంటూ వారు సెటైర్లు వేసుకున్నారు.