
ఏపీలో వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి జన జీవనం స్తంభించి పోయింది. విజయవాడలో కనీవినీ ఎరుగని రీతిలో వరద బీభత్సం సృష్టించింది. కృష్ణమ్మ నీటి ప్రవాహం ధాటికి సిటీ జల దిగ్బంధమైంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరగుతోంది. పవన్ ఎక్కడ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా.. సీఎం చంద్రబాబు సహా పలువురు నేతలు వరద బాధిత ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షిస్తుంటే పవన్ ఎక్కడ అని అడుగుతున్నారు. గతంలో చిన్న చిన్న విషయాలకే గొంతు చించుకుని, చొక్కా ఎగరేసుకుంటూ పెద్దగా అరిచే పవనాలు సార్.. ఇలాంటి ఆపదలో ఎక్కడికి వెళ్లారని సూటిగా ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ సీఎం పదవిలో ఉండి ఇంతటి నిర్లక్ష్యం వహించడమేంటని నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

సరే ఈరోజు ఆయన పుట్టినరోజు. కుటుంబంతో ఒకవేళ బయటకు వెళ్లి ఉంటే తాను అందుబాటులో లేను అనే విషయామైన తెలియజేయాలి కదా?. సోషల్ మీడియా వేదికగా అయినా ప్రజల బాగోగులు అడుగవచ్చు కదా? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్‌లో విషెస్ తెలిపిన వారిని కృతజ్ఞతలు చెప్పే సమయం ఉంది కానీ.. ప్రజలను పరామర్శించే టైమ్ లేదా? అని మండిపడుతున్నారు. విపత్కర పరిస్థితుల్లో అందరికీ అందుబాటులో ఉండి.. ముందుండి నడిపించాల్సిన పవన్.. ఎవరి ఆదేశాల మేరకు ఎక్కడ దాక్కున్నారో చెప్పాలి. సాధారణ రోజుల్లో తన ఆఫీసులో గంటల తరబడి అధికారులతో చర్చలు జరుపుతారు. ఇలాంటి సందర్భంలో మాత్రం బయటకు రాకపోవడమేంటి?. పవన్ ఎక్కడున్నా వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఒరే @murthyscribe నీ ఓవర్ యాక్షన్ నీ ఓనర్ మీద బాగానే చూపిస్తున్నావురా. మరి పిల్ల బత్తయి @naralokesh వదిలేసావే. అంటే @ncbn తోనే మన వ్యాపారవ్యవహారాల జరుగుతాయా ? మన షష్ఠి పూర్తి వీరుడు @PawanKalyan ఎక్కడ కనపడటం లేదే pic.twitter.com/WWN4MXCUJM
— Madhav (@nenunaaistam) September 2, 2024

Comments
Please login to add a commentAdd a comment