విశాఖపట్నం, సాక్షి: వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కూటమి ప్రభుత్వం మండిపడ్డారు. రెండు రోజుల్లో కూటమి ప్రభుత్వం 100 మందిని అరెస్టు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.
‘‘ సీఎం చంద్రబాబు చేసే పాపాలు నాగుపాములై లోకేష్‌ను కాటేస్తాయి. చంద్రబాబు చేసే పాపానికి పదింతలు శిక్ష లోకేష్ అనుభవిస్తారు. అధికారం శాశ్వతం కాదనే అంశాన్ని చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంగించి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది.
పవన్ కళ్యాణ్‌ను కూటమిలో ద్వితీయ శ్రేణి పౌరునిగా చూస్తున్నారు. అధికారంలోకి రాక ముందు పవన్ కళ్యాణ్ కాళ్లు లోకేష్ పట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పిన మాట వినోద్దు అంటూ అధికారులకు లోకేష్ చెబుతున్నారు. లోకేష్ కోసం పవన్ కళ్యాణ్‌ను, కాపు జాతిని చంద్రబాబు తొక్కి పెడుతున్నారు. పవన్‌పై మందకృష్ణ మాదిగ విమర్శలు చంద్రబాబు మార్కు రాజకీయానికి నిదర్శనం. లోకేష్ రాజకీయ ఎదుగుదల కోసం పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు తొక్కిపెడుతున్నారు.
లోకేష్‌ను సీఎం చేయడం కోసం 25 శాతం ఉన్న కాపులను పవన్ కళ్యాణ్‌ను ప్రణాళిక బద్ధంగా పక్కకుపెడుతున్నారు. ఋషికొండ అద్భుతమైన కట్టడం.. ఆ భవనం రాష్ట్రానికి తలమానికం. రుషికొండ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో తెలియని మూర్ఖుడు, అసమర్ధుడు చంద్రబాబు. ఋషికొండ భవనాలపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. జమిలీ ఎన్నికలు కచ్చితంగా వస్తాయి. పార్లమెంటు, ఎమ్మెల్యే స్థానాలు కచ్చితంగా పెరుగుతాయి. 2027 తర్వాత మేమే మళ్లీ అధికారంలోకి వస్తాం’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment