సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు సతీష్‌ అరెస్ట్‌ | CM Jagan Stone Hit Case: A1 Satish Arrested | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు సతీష్‌ అరెస్ట్‌

Published Thu, Apr 18 2024 3:42 PM | Last Updated on Thu, Apr 18 2024 4:06 PM

CM Jagan Stone Hit Case: A1 Satish arrested - Sakshi

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడి కేసులో సతీష్‌ అనే వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. హత్యాయత్నం కేసులో సతీష్‌ ఏ1గా ఉన్నాడు. నిందితుడు సతీష్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

కాగా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో శనివారం రాత్రి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్‌పై ఒక ఆగంతకుడు హత్యాయత్నానికి తెగబడిన విషయం తెలిసిందే. సీఎం జగన్‌ కణతకు గురిచూసి పదునైన వస్తువుతో దాడి చేశాడు. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్‌ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ పై భాగాన బలమైన గాయమైంది.

గాయం నుంచి కారుతున్న రక్తాన్ని సీఎం జగన్‌ అదిమిపట్టుకున్నారు. బాధను పంటిబిగువన భరిస్తూనే ప్రజలకు అభివాదం చేశారు. సీఎం జగన్‌ ఎడమ కంటి పై భాగాన గాయమయ్యాక.. ఆ పదునైన వస్తువు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కూ తగలడంతో ఆయనకు కూడా గాయమైంది. ప్రాథమిక చికిత్స తర్వాత సీఎం జగన్‌ యాత్ర కొనసాగించారు. అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement