
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో కక్ష సాధింపు చర్యలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారు. ఈ క్రమంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అక్రమ పెట్టి ఆయనను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీఎన్‌ఎస్ సెక్షన్ 140(1), 308, 351(3) రెడ్‌విత్ 3(5) కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
అలాగే, వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు సైతం పోలీసులు నమోదు చేశారు. ఇదే సమయంలో కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో అరెస్ట్ చేస్తున్నట్టు వంశీ భార్యకు పోలీసులు నోటీసుల్లో తెలిపారు. అనంతరం, వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు.
వంశీ అరెస్ట్.. ఆపై ఇలా..
5 AM: గచ్చిబౌలిలోని వంశీకి ఇంటికి చేరుకున్న పటమట పోలీసులు.
5:15 AM: వంశీకి అరెస్ట్ నోటీసులు ఇచ్చిన పోలీసులు.
6 AM: వంశీని అరెస్ట్ చేసి ఆయన భార్యకు నోటీసులు ఇచ్చిన పోలీసులు.
7 AM: గచ్చిబౌలి నుంచి వల్లభనేని వంశీ విజయవాడకు తరలింపు.
10:45 AM: సూర్యాపేట వద్ద బ్రేక్‌ఫాస్ట్
11:45 AM: నందిగామ దగ్గర వంశీ భార్య పంకజ శ్రీని అడ్డుకున్న పోలీసులు.
12:30 PM: విజయవాడకు వంశీ తరలింపు. ఈ సందర్భంగా నగరంలో సెక్షన్ 144 విధింపు.
12:45 PM: భవానీపురం పీఎస్‌లో వాహనం మార్పు.
1:10 PM: కృష్ణలంక పీఎస్‌కు వంశీని తరలించిన పోలీసులు. పీఎస్‌లో వంశీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Comments
Please login to add a commentAdd a comment