Vallabhaneni Vamshi
-
జైలులో వంశీకి ప్రాణహాని ఉంది: వల్లభనేని పంకజశ్రీ
సాక్షి, విజయవాడ: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని శారీరకంగా బాధపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన సతీమణి పంకజశ్రీ. అలాగే, తప్పుడు కేసులతో వంశీని పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. వంశీపై మోపిన అభియోగాలన్నీ అవాస్తవాలే అని క్లారిటీ ఇచ్చారు.విజయవాడ సబ్ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ఆయన భార్య పంకజశ్రీ శనివారం ములాఖత్ అయ్యారు. వారంలో రెండు సార్లు కుటుంబ సభ్యులకు కలిసే అవకాశం ఉండటంతో ఆమె.. ఈరోజు వంశీని కలిశారు. అనంతరం, పంకజశ్రీ మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ సబ్ జైల్లో వంశీకి ప్రాణహాని ఉంది. వంశీని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. వంశీపై తప్పుడు కేసులు పెట్టారు. వంశీ రిమాండ్‌లో ఉన్నారు.. కేసులు ఇంకా నిర్ధారణ కాలేదు. తప్పుడు కేసులతో వంశీని వేధిస్తున్నారు. వంశీకి ఎలాంటి వైద్య సదుపాయాలు కల్పించడం లేదు. వంశీ శ్వాస సమస్యతో బాధపడుతున్నారు. వంశీపై మోపిన అభియోగాలన్నీ అవాస్తవాలే.వంశీపై వెన్నపూస నొప్పితో, శ్వాసకోస సమస్యతో ఆయన బాధపడుతున్నారు. వంశీ కింద పడుకుంటున్నారు.. బెడ్ కావాలని రిక్వెట్ చేస్తాం. జైలులో ఎవ్వరినీ కలవనివ్వకుండా చేస్తున్నారు. ఆరోగ్యం బాగాలేని వంశీని.. మెంటల్‌గా టార్చర్ చేస్తున్నారు. మానసికంగా కుంగదీస్తున్నారు. వంశీ ఉన్న బారక్‌లో 60 సీసీ కెమెరాలు పెట్టారు. వంశీ ఆరోగ్యం బాగుందంటూ డాక్టర్లతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.ఈ వ్యవహారం మీద కోర్టుకు వెళ్తాం. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఫోన్ చేశారు.. నాకు ధైర్యం చెప్పారు. వంశీని కలుస్తానని జగన్ చెప్పారు. మాకు వైఎస్సార్సీపీ అన్ని రకాలుగా అండగా ఉంది. లీగల్ టీమ్‌ని కూడా ఏర్పాటు చేశారని తెలిపారు. ఇదే సమయంలో సత్యవర్ధన్‌ని పోలీసులు అదుపులో తీసుకొని మేజిస్ట్రేట్ ముందు ఎందుకు ప్రవేశపెట్టడం లేదు’ అని ప్రశ్నించారు. -
సత్యవర్థన్ని పోలీసులే వేధించి నిర్బంధించారు: తాటిపర్తి చంద్రశేఖర్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికార మదాన్ని తలకి ఎక్కించుకుందని ఆరోపించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. కూటమి ప్రభుత్వంలో దుర్మార్గాలు, అరచకాలు పెచ్చరిల్లాయి. ఎవరికీ రక్షణ లేకుండా పోయిందన్నారు. కక్షలనే కర్తవ్యంగా మార్చుకున్నారని ఘాలు విమర్శలు చేశారు. గన్నవరం కేసులో సత్యవర్థన్ని పోలీసులు వేధించి, అక్రమంగా నిర్బంధించారని చెప్పుకొచ్చారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో రాజ్యాంగం అమలు కావటం లేదు. కూటమి ప్రభుతం ఏర్పడిన తర్వాత దుర్మార్గాలు, అరాచకాలు పెరిగాయి. ఎవరికీ రక్షణ లేకుండా పోయింది. తిరుపతిలో జనసేన నేత కిరణ్ రాయల్ దుర్మార్గానికి లక్ష్మి అనే మహిళ బలైంది. చివరికి ఆమె మీదనే రివర్స్ కేసు పెట్టించి పక్క రాష్ట్రాల పోలీసులతో అరెస్టు చేయించారు. రాష్ట్రంలో అరెస్టులే తమ లక్ష్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కక్షలనే కర్తవ్యంగా మార్చుకున్నారుగన్నవరం కేసులో సత్యవర్థన్ని పోలీసులు వేధించి, అక్రమంగా నిర్బంధించారు. సత్యవర్ధన్ నిజంగా కిడ్నాప్ అయితే పోలీసులకు ఎలా దొరికాడు?. గన్నవరం కేసులో తనను సాక్షిగా పిలిచి, ఫిర్యాదుదారుడిగా చేశారంటూ సత్యవర్ధనే జడ్జికి చెప్పాడు. దీన్ని తట్టుకోలేక వల్లభనేని వంశీ మీద అక్రమంగా మరో కేసు పెట్టి జైలులో పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికార మదాన్ని తలకి ఎక్కించుకుంది. కూటమి నేతలకు ప్రజల మీద ఏమాత్రం ప్రేమ లేదు. చట్టం, న్యాయం అంటే వీరికి గౌరవం లేదు.గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడుతుంటే వారిని పట్టించుకోవడం లేదు. పరిపాలనను పూర్తిగా గాలికి వదిలేశారు. గన్నవరంలో టీడీపీ కార్యకర్తలే తమ పార్టీ ఆఫీసుపై దాడి చేసుకున్నారు. టీడీపీ నాయకుడు పట్టాభి ఏకంగా పోలీసుల మీద దాడులు చేయించాడు. వారి చేతిలో సీఐ కనకారావు గాయపడ్డారు. తర్వాత కేసు మొత్తాన్ని మార్చేశారు. వైఎస్సార్సీపీ పార్టీ ఆఫీసు మీద దాడి జరగటం, దగ్గర్లోనే అగ్ని ప్రమాదాలు జరగటంపై మాకు అనుమానాలు ఉన్నాయి. దోషులపై కనీస చర్యలు కూడా తీసుకోని చేతగాని ప్రభుత్వం ఇది. ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టడం దగ్గర్నుంచి జైలు పాలు చేయటం వరకు అన్నీ ప్రభుత్వ పెద్దలే నిర్ణయిస్తున్నారు అని వ్యాఖ్యలు చేశారు. -
వంశీ అరెస్ట్ పై భార్య న్యాయపోరాటం
-
ఎందుకు అరెస్ట్ చేశారో ఇప్పటికీ చెప్పలేదు: వంశీ భార్య పంకజశ్రీ
సాక్షి, విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు ఆయన భార్య పంకజశ్రీ. ఎందుకు అరెస్ట్ చేశారో, ఏ కేసులో అరెస్ట్ చేశారో ఇప్పటికీ చెప్పలేదు. వంశీకి ఆరోగ్యం బాగాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.గురువారం రాత్రి 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ ఇస్తూ 4th ACMM కోర్టు ఆదేశాలు జారీ చేశారు. కాగా విజయవాడ సబ్ జైల్‌కి పోలీసులు వంశీని తరలించారు. వల్లభనేని వంశీతో పాటు లక్ష్మీపతి, కృష్ణప్రసాద్‌ను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో వంశీ అరెస్ట్‌పై ఆయన భార్య పంకజశ్రీ స్పందించారు. ఈ క్రమంలో పంకజశ్రీ మాట్లాడుతూ..‘నా భర్త అరెస్టుపై న్యాయపోరాటం చేస్తా. అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉంది. వంశీకి ఆరోగ్యం బాగాలేదు. నేనే టాబ్లెట్స్ ఇచ్చాను. ఉదయం నుండి కనీసం కాఫీ కూడా తాగలేదు. ఎందుకు అరెస్ట్ చేశారో, ఏ కేసులో అరెస్ట్ చేశారో ఇప్పటికీ చెప్పలేదు. ఎక్కడికి తీసుకు వెళుతున్నారో కూడా కనీస సమాచారం ఇవ్వలేదు. హైకోర్టుకి కచ్చితంగా వెళ్తాం. న్యాయపరంగానే ఎదుర్కొంటాం అని కామెంట్స్ చేశారు. ఎఫ్ఐఆర్ అడిగితే ఇవ్వడంలేదు..నా భర్తపై నమోదుచేసిన కేసు ఎఫ్ఐఆర్ అడిగితే ఇవ్వడంలేదు. ఎందుకు అరెస్టుచేశారో చెప్పడంలేదు. రిమాండుకు తీసుకెళ్లినప్పుడు ఇస్తామంటున్నారు. ఎఫ్ఐఆర్ లేకపోతే లీగల్‌గా వెళ్లడానికి అవకాశం ఉండకూడదని ఇలా చేస్తున్నారు. హైదరాబాద్‌లో మా ఇంటికొచ్చి అరెస్టుచేశారు. నోటీసు ఇవ్వకుండా ఎందుకు అరెస్టుచేస్తున్నారని ప్రశ్నిస్తే అప్పటికప్పుడు పేపర్‌పై రాసిచ్చారు. అక్రమ కేసులో ఇరికించేందుకే ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వస్తుంటే తెలంగాణ సరిహద్దుల వద్దే ఏపీ పోలీసులు నన్ను అడ్డుకున్నారు. నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్మోహనరావు సహాయంతో ఇక్కడకు చేరుకున్నాను అని ఆవేదన వ్యక్తం చేశారు. -
HYD to Vjy: వల్లభనేని వంశీ అరెస్ట్.. అసలేం జరిగిందంటే?
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో కక్ష సాధింపు చర్యలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నారు. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారు. ఈ క్రమంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అక్రమ పెట్టి ఆయనను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీఎన్ఎస్ సెక్షన్ 140(1), 308, 351(3) రెడ్‌విత్ 3(5) కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.అలాగే, వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు సైతం పోలీసులు నమోదు చేశారు. ఇదే సమయంలో కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో అరెస్ట్ చేస్తున్నట్టు వంశీ భార్యకు పోలీసులు నోటీసుల్లో తెలిపారు. అనంతరం, వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు.వంశీ అరెస్ట్.. ఆపై ఇలా..5 AM: గచ్చిబౌలిలోని వంశీకి ఇంటికి చేరుకున్న పటమట పోలీసులు.5:15 AM: వంశీకి అరెస్ట్ నోటీసులు ఇచ్చిన పోలీసులు.6 AM: వంశీని అరెస్ట్ చేసి ఆయన భార్యకు నోటీసులు ఇచ్చిన పోలీసులు.7 AM: గచ్చిబౌలి నుంచి వల్లభనేని వంశీ విజయవాడకు తరలింపు. 10:45 AM: సూర్యాపేట వద్ద బ్రేక్‌ఫాస్ట్11:45 AM: నందిగామ దగ్గర వంశీ భార్య పంకజ శ్రీని అడ్డుకున్న పోలీసులు.12:30 PM: విజయవాడకు వంశీ తరలింపు. ఈ సందర్భంగా నగరంలో సెక్షన్ 144 విధింపు.12:45 PM: భవానీపురం పీఎస్‌లో వాహనం మార్పు.1:10 PM: కృష్ణలంక పీఎస్‌కు వంశీని తరలించిన పోలీసులు. పీఎస్‌లో వంశీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. -
వీడియో: పోలీసుల అత్యుత్సాహం.. పేర్ని నాని హౌస్ అరెస్ట్
సాక్షి, కృష్ణా: ఏపీలో కూటమి సర్కార్ వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ పాలన చేస్తోంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అనంతరం రాష్ట్రంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.వంశీ అరెస్ట్ నేపథ్యంలో మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం పేర్ని నాని ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. ఏఆర్ ఏఎస్పీ, డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మోహరించారు. ఈ క్రమంలో నానిని ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో, పోలీసుల తీరుపై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వంశీ అరెస్ట్ వెనుక కుట్రకోణం?
-
బాబూ.. ఇంకెన్ని రోజులు వైఎస్సార్సీపీ పేరు చెప్పుకుంటారు?: బొత్స
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి పాలనలో ఇష్టారీతిన అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఇదే సమయంలో వల్లభనేని వంశీ అరెస్ట్‌ను ఖండిస్తున్నట్టు తెలిపారు. అలాగే, కూటమి సర్కార్ పాలనపై సెటైర్లు వేశారు. ప్రభుత్వం గురించి ఎల్లో మీడియాలో గొప్పగా రాయడం తప్ప ఇంకేమీ లేదని ఎద్దేవా చేశారు.ఎమ్మెల్సీ బొత్స(Botsa Satyanarayana) విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి పాలనలో సమీక్షలు తప్ప క్షేత్రస్థాయిలో హామీలు అమలు కావడం లేదు. ప్రచారం చేసిన స్థాయిలో పనులు చేయడం లేదు. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. కరెంట్ చార్జీలు విపరీతంగా పెరిగాయి. ఒకొక్క డిపార్ట్మెంట్లో వేల సంఖ్యలో ఫైల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. అధికారులు ప్రజా ప్రతినిధులు మధ్య సమన్వయం లేదు. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం లేదు. విద్యార్థులు తల్లిదండ్రులు, రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై శాసన మండలిలో నిలదీస్తాం.వైఎస్సార్సీపీ హయాంలో చిత్తశుద్ధితో హామీలు అమలు చేశాం. వైఎస్ జగన్ మాటలతో పరిపాలన చేయలేదు. చేతలతో పరిపాలన చేశారు. కరోనా సమయంలో సంక్షేమ పథకాలు అందించారు. ఇంకెన్ని రోజులు వైఎస్సార్సీపీ పేరు చెప్పి బతుకుతారు. కూటమి పాలనలో ఏ తప్పు జరిగినా వైఎస్సార్సీపీపై తోసేస్తున్నారు. ఇష్టారీతిన అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. హైకోర్టు కూడా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గత టీడీపీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో వేసిన సీట్ నివేదికను విడుదల చేయాలి. ఫ్రీ హోల్డ్ భూముల్లో అవకతవకలు జరిగాయన్న కూటమి నేతలు ఎప్పుడు వాటిని బయటపెడతారు. మద్యం ధరలు తగ్గిస్తామని చెప్పి ధరలు పెంచుతున్నారు. కూటమి సర్కార్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరు’ అంటూ కామెంట్స్ చేశారు. -
‘చంద్రబాబు, లోకేష్ ప్రతీకారంలో భాగమే వంశీ అరెస్ట్’
సాక్షి, తాడేపల్లి: కూటమి సర్కార్ పాలనలో ప్రతీకారంతోనే వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని పార్టీ నాయకులు మండిపడ్డారు. ఈ క్రమంలోనే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌ను వైఎస్సార్సీపీ నేతలు ఖండించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు సంయమనంతో ఉండాలని కోరారు. మరోవైపు.. ఏపీలో వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. నేతల ఇళ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. విశాఖ: వల్లభనేని వంశీ అరెస్ట్‌పై బొత్స స్పందించారు. ఈ క్రమంలో బొత్స..‘వంశీ అరెస్టును ఖండిస్తున్నాము. ఉప సంహరించుకున్న కేసుపై అరెస్టు ఏమిటి?. కక్షపూరిత రాజకీయాలు ఉండకూడదు. ఇటువంటి రాజకీయాలు మంచిది కాదు. మరోసారి పునరావృతం కాకూడదు’ అంటూ హెచ్చరించారు.తిరుపతి: వంశీ అరెస్ట్‌పై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..‘వల్లభనేని వంశీ అరెస్టును ఖండిస్తున్నా. కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్ చేశారు. చంద్రబాబు, లోకేష్ ప్రతీకారంతోనే అరెస్ట్‌లు చేస్తున్నారు. వంశీ మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి సంతోషపడుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలందరిపై ప్రతీకార చర్యలకు దిగుతున్నారు. కార్యకర్తలు అందరూ సంయమనంతో ఉండాలని కోరారు.తాడేపల్లి: మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వంశీపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అన్యాయంగా అరెస్టు చేశారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 30 మంది పోలీసులు ఇంటికెళ్లి మరీ బెదిరించారు. చట్టాన్ని చేతిలో తీసుకుని తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తోంది. పౌర హక్కులను హరిస్తూ అక్రమ కేసులు పెడుతున్నారు. ఫిర్యాదు చేసిన వ్యక్తే విత్ డ్రా చేసుకుంటే మళ్లీ కేసు పెట్టడమేంటి?. అసలు ఏపీలో ఏం జరుగుతోంది?. న్యాయవ్యవస్థను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. తప్పుడు కేసులు పెడితే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికారం ఎప్పుడూ ఒకరి చేతిలో ఉండదని పోలీసు అధికారులు గుర్తించాలి. డీజీపీని కోర్టుకు పిలిపిస్తామని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందంటేనే వారి పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మానవ హక్కులను పోలీసులను ఉల్లంఘిస్తున్నారు. విశాఖ: కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. వంశీ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి. కక్ష సాధింపు చర్యలు మంచి పద్ధతి కాదు. కేసు విత్ డ్రా చేసుకున్న తరవాత అరెస్టులు చేయడమేంటి?.విశాఖ: ఎమ్మెల్సీ కుంభ రవిబాబు మాట్లాడుతూ.. వంశీ అరెస్టు అనాగిరిక చర్య. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. బెయిల్‌పై ఉన్న వ్యక్తిని ఏ విధంగా అరెస్టు చేస్తారు?. వైఎస్సార్సీపీ నేతలను భయభ్రాంతులకు గురిచేయాలని చంద్రబాబు సర్కార్ చూస్తోంది.చిత్తూరు: చిత్తూరు వైఎస్సార్సీపీ ఇంచార్జ్ విజయనందరెడ్డి మాట్లాడుతూ..‘గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు ఖండిస్తున్నా. వంశీ అరెస్టు అప్రజాస్వామికం, రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగము అమలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేసి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు.విజయవాడ: దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. కక్షపూరితంగా వంశీని అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది. కోర్టు వ్యాఖ్యలను కూడా కూటమి సర్కార్ పట్టించుకోవడం లేదు. కేవలం కక్ష సాధింపు కోసమే ఇలా ఇబ్బందులు పెడుతున్నారు. తప్పుడు కేసులపై కోర్టులు న్యాయం చేయాలి. భవిష్యత్ కాలంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఎవరైన తప్పుడు కేసులు పెట్టారో వారిపై చట్టపరంగా ముందుకు వెళ్లడం జరుగుతుంది. వారికి శిక్ష తప్పదు అంటూ హెచ్చరించారు. -
వంశీ అరెస్ట్..కృష్ణలంక పీఎస్ వద్ద హైడ్రామా
Vamsi Arrest Live Updates.. కూటమి సర్కార్ పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలను ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ(vallabhaneni vamsi)ని అక్రమ కేసులో ఇవాళ హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. విజయవాడకు ఆయన్ని తరలించే క్రమంలో నాటకీయ పరిణామాలెన్నో చోటు చేసుకున్నాయి. వల్లభనేని వంశీకి రిమాండ్..14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ ఇస్తూ 4th ACMM కోర్టు ఆదేశాలు. విజయవాడ సబ్ జైల్‌కి వంశీని తరలించిన పోలీసులు.విజయవాడ జీజీహెచ్‌లో వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు👉ఏ7 శివరామకృష్ణ, ఏ8 లక్ష్మీపతికి సైతం వైద్య పరీక్షలు👉వైద్య పరీక్షలు అనంతరం కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులువిజయవాడ జీజీహెచ్‌కు వల్లభనేని వంశీ తరలింపు👉కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 8 గంటలుగా కొనసాగిన వంశీ విచారణ👉కాసేపట్లో వంశీకి వైద్య పరీక్షలు👉వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులుస్లేషన్ బయటే వంశీ భార్య పంకజశ్రీ👉కృష్ణలంక పీఎస్‌కు చేరుకున్న వల్లభనేని వంశీ భార్య👉స్టేషన్లోకి అనుమతించని పోలీసులు👉పోలీసులు, వంశీ భార్య మధ్య వాగ్వాదం👉స్టేషన్ బయటే ఎదురుచూస్తున్న వంశీ భార్య పంకజశ్రీ వల్లభనేని వంశీ అరెస్ట్ చెల్లదు: అడ్వకేట్ చిరంజీవి👉కావాలనే వంశీని అరెస్ట్‌చేశారు👉ఏం కేసులు పెట్టారో తెలీదు👉పోలీస్ స్టేషన్ లో వంశీ లేరని అబద్దాలు చెపుతున్నారు👉ఎవరు ఫిర్యాదు చేశారు? కేసు ఎందుకు పెట్టారో చెప్పడం లేదు👉వంశీ లాయర్నని చెప్పినా లోపలకి అనుమతించడం లేదు..👉పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం ఏపీలో నడుస్తోంది.👉విజయవాడ: వల్లభనేని వంశీ వద్దకు ఎవ్వరిని అనుమతించని పోలీసులుఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ని స్టేషన్ బయటే ఉంచేసిన పోలీసులువంశీ భార్య ను నందిగామ లోనే అడ్డుకున్న పోలీసులు👉 వల్లభనేని వంశీని ప్రశ్నిస్తున్న కృష్ణ లంక పోలీసులు. టీడీపీ గన్నవరం కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్‌పై ఉన్న వంశీ. అయినా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసంటూ అక్రమంగా నిర్భంధించి మరీ వేధిస్తున్న పోలీసులు👉వల్లభనేని వంశీని కృష్ణ లంక పీఎస్‌కు తరలించిన పోలీసులు..👉విజయవాడ చేరుకున్న వంశీ పోలీసుల ఎస్కార్ట్ వాహనం. ముందుగా భవానీపురం పోలీసు స్టేషన్‌కు వంశీని తరలించిన పోలీసులు. 👉అనంతరం, వాహనాన్ని మార్చి మరో చోటుకి తరలిస్తున్న పోలీసులు. కాసేపట్లో జడ్జీ మందు వంశీని హాజరుపర్చనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కృష్ణా జిల్లావ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన్ విధించారు. పోలీసు యాక్ట్ 30 అమలు చేసున్నట్టు తెలిపారు. ర్యాలీలు, నిరసనలపై నిషేధం విధించారు. 👉మరికాసేపట్లో వల్లభనేని వంశీని పటమట పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకురానున్న పోలీసులు. ఇప్పటికే పడమట పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న స్పెషల్ పార్టీ పోలీసులు, ఎస్బీ, ఇంటెలిజెన్స్, స్థానిక పోలీసులు. 👉పటమట పోలీస్ స్టేషన్ ఇరువైపులా బారికేడ్స్‌ను ఏర్పాటు చేస్తున్న పోలీసులు. డీసీపీ పర్యవేక్షణలో ఏసీపీ, సీఐలు. వంశీ అనుచరులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటారనే అనుమానంతో భారీ ఎర్పాట్లు. మూడు గంటల నుండే పటమట స్టేషన్లోనే ఉన్న పోలీసు అధికారులు👉వంశీ అరెస్ట్ నేపథ్యంలో గన్నవరంలో పోలీసులు హై అలర్ట్ విధించారు. వైఎస్సార్సీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. పార్టీ శ్రేణులను బయటకు రానివ్వడం లేదు. ప్రధాన ప్రాంతాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్టీ కార్యకర్తలు బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. 👉చంద్రబాబు(Chandrababu) ప్రభుత్వం వైఎస్సార్సీపీ(YSRCP) నేతలను టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించింది. ఇందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కూడా కేసులు పెట్టింది. దీంతో, ఆయనను అరెస్ట్ చేసేందుకు విజయవాడ పడమట పోలీసులు ప్లాన్ ప్రకారం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలో గురువారం ఉదయం గచ్చిబౌలిలోని వంశీ ఇంటికి చేరుకుని నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. 👉ఈ సందర్భంగా బీఎన్ఎస్ సెక్షన్ 140(1), 308, 351(3) రెడ్‌విత్ 3(5) కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అలాగే, వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు సైతం పోలీసులు నమోదు చేశారు. ఇదే సమయంలో కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో అరెస్ట్ చేస్తున్నట్టు వంశీ భార్యకు పోలీసులు నోటీసుల్లో తెలిపారు. అనంతరం, వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు. 👉అయితే, గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్థన్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల కుట్రను మేజిస్ట్రేట్ ముందు సత్యవర్ధన్ బట్టబయలు చేశారు. ఈ నేపథ్యంలో వంశీని పోలీసులు టార్గెట్ చేశారు. కక్ష గట్టి మరో కేసు నమోదు చేశారు. సత్యవర్ధన్ ఫిర్యాదు వెనక్కి తీసుకున్న అనంతరం మరో అక్రమ కేసు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు. ఇది కూడా చదవండి: చంద్రబాబు చీటర్ కాదా?: వైఎస్ జగన్ -
టాస్క్ ఫోర్స్ పోలీసులు నన్ను చిత్ర హింసలకు గురి చేశారు
-
చంద్రబాబు పాపాలు కడిగేందుకే పూజలు: పేర్నినాని
సాక్షి,తాడేపల్లి:రాజకీయాల కోసం చంద్రబాబు దైవాన్ని కూడా వదల్లేదని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. పార్టీ నేతలు కొడాలినాని, వల్లభనేనివంశీతో కలిసి తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం(సెప్టెంబర్25) పేర్నినాని మీడియాతో మాట్లాడారు.‘తిరుమలలో నెయ్యిని వెనక్కి పంపామని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ మాత్రం అబద్ధాలు చెబుతున్నారు.లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. తన కుట్ర రాజకీయాల కోసం కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీశారు.లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు మాట్లాడారు.అలాంటిదేమీ లేదని ఈవో శ్యామలరావు చెప్తుంటే చంద్రబాబు అడ్డమైన ఆరోపణలు చేశారు.లోకేష్ అయితే ఏకంగా పందికొవ్వు కలిసిందన్నారు.పవన్ కళ్యాణ్ కూడా అదే దారిలో ఆరోపణలు చేశారు.ఈ కూటమి పాపాన్ని ప్రక్షాళన చేయాలని వైఎస్ఆర్సీపీ భావించింది. వారి పాపాలను క్షమించి వదిలేయమని శనివారం(సెప్టెంబర్28) రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు చేయాలని పిలుపునిస్తున్నాం.శరీరం, ఆత్మ వేరైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒకటే.అందుకే చంద్రబాబు మాట్లాడిన మలినపు మాటలకు పవన్ కూడా వత్తాసు పలికారు.ఎన్నికలకు ముందు చంద్రబాబు అనేక హామీలు ఇస్తే వాటికి పవన్ కూడా హామీ ఇచ్చారు.బస్సులో ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అమ్మకు రూ.18 వేలు.. ఇలా అనేక హామీలు ఇచ్చారుఅవేమీ అమలు చేయలేదు కాబట్టి వారంతా లోలోపల మదనపడుతున్నారు.అందుకే పాపపరిహార్ధం ప్రాయశ్చిత్త శిక్ష వేసుకున్నారు.తాను బాప్టిజం తీసుకున్నట్టు పవన్ చెప్పారు.జనం ఏదీ మర్చిపోరు.నెయ్యి వెయ్యి రూపాయలు ఉందని చంద్రబాబు అంటున్నారు.మరి ఆయన హయాంలో ఏనాడైనా వెయ్యి రూపాయలకు కొన్నారా?జగన్ ప్రభుత్వం కంటే తక్కువ ధరకే చంద్రబాబు హయాంలో కొనుగోలు చేశారు.హెరిటేజ్ లో ఆవునెయ్యి నాలుగు వందలకు ఎలా ఇస్తున్నారు’అని పేర్ని నాని ప్రశ్నించారు.చంద్రబాబు నిజంగా శ్రీవారి భక్తుడేనా: కొడాలి నానిస్వామివారి ప్రతిష్టను మంటకలిపేలా చంద్రబాబు ఆరోపణలు చేశారువైఎస్సార్సీపీ హయాంలో 18 సార్లు కల్తీ ట్యాంకర్లను వెనక్కు పంపాంప్రతి ట్యాంకర్‌ను నిబంధనలకు అనుగుణంగా టెస్టులు చేశాంవందల ఏళ్లుగా ఇలాంటి ఆనవాయితీ కొనసాగుతోందిజులై 17 న ఒక ట్యాంకర్లో నెయ్యి సరిగా లేదని వెనక్కి పంపారుఆ నెయ్యిని లడ్డూలో వాడలేదుకానీ చంద్రబాబు మాత్రం అడ్డమైన ఆరోపణలు చేశారుఅపవిత్రమైన లడ్డూలను భక్తులు తిన్నారని చంద్రబాబు అన్నారుజగన్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని ఇలాంటి దుర్మార్గపు ఆరోపణలు చేశారుచంద్రబాబుకు బుద్ది రావాలని వెంకటేశ్వర స్వామి ని కోరుకుంటున్నాంవెంకటేశ్వరస్వామిని కూడా రాజకీయాలకు వాడుకున్న దుర్మార్గుడు చంద్రబాబుఏ ల్యాబ్ కూడా కల్తీలు జరిగినట్టు రిపోర్టు ఇవ్వలేదుకల్తీ జరిగే అవకాశం ఉందని మాత్రమే చెప్పాయిదాన్ని పట్టుకుని చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశారుచంద్రబాబు అసలు వెంకటేశ్వర స్వామి భక్తుడేనా?నిజమైన భక్తుడే ఐతే ఎన్నిసార్లు తలీలాలు అర్పించారో చెప్పాలిసుప్రీంకోర్టు న్యాయమూర్తికి కూడా జగన్ లేఖ రాశారువిచారణ జరపాలని కోరాంసిట్ అంటే కూర్చునే, స్టాండ్ అంటే నిలపడే అధికారులతో సిట్ వేస్తే ఏం లాభం?టీడీపీ ఆఫీసులో లోకేష్ చెప్పినట్టు రిపోర్ట్ రాసే వారు ఇంకేం విచారణ చేస్తారు?చంద్రబాబు చేసిన పాపానికి ఆయనకే శిక్ష వేయాలిరాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలని కోరుతూ శనివారం ప్రత్యేక పూజల కార్యక్రమానికి పిలుపునిస్తున్నాఇదీ చదవండి: తాము తీసుకున్న గోతిలోనే బాబు అండ్ కో -
ఏపీ హైకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట లభించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. ఈ నెల 20 వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హూకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 20కి న్యాయస్థానం వాయిదా వేసింది.చదవండి: నాడు అత్యుత్సాహం.. నేడు అతి వినయం -
వల్లభనేని వంశీ అరెస్ట్ పై పేర్నినాని కామెంట్స్
-
కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు
-
ఆరోజు నేను అసలు అసెంబ్లీలోనే లేను: వల్లభనేని వంశీ
సాక్షి, కృష్ణా : పవన్ రాజకీయాలను మారుస్తానంటారని, రాజకీయ పార్టీ అధినేతగా సమాచారం తెలుసుకుని మాట్లాడాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ అన్నారు. ఎవరో చెప్పిన మాటలు విని గోబెల్స్ ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. గన్నవరం మండలంలో గురువారం వల్లభనేని వంశీ ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నారా భువనేశ్వరిని నేను ఎప్పుడూ ఒక్కమాట అనలేదు. నేను అన్నట్లు విన్నారా... చూశారా... వీడియో ఉందా?. లోకేష్ నన్ను, నా కుంటుంబ సభ్యులపై ఐటీడీపీతో సోషల్ మీడియాలో వార్తలు రాయించాడు. ఇలాంటి సంస్కృతి మంచిది కాదని లోకేష్‌కు చెప్పా. నేను అసెంబ్లీలో భువనేశ్వరి గురించి మాట్లాడారని పవన్ అంటున్నారు. ఆరోజు నేను అసలు అసెంబ్లీలోనే లేను. ఐఎస్బీ మొహాలీలో కోర్సు కోసం పంజాబ్‌లో ఉన్నా. పవన్ మాటలు హాస్యాస్పదం. ఎవరో చెప్పిన మాటలు విని పవన్ మాట్లాడటం సరికాదు. నేను అనని మాట నాకు ఆపాదించారు. నేను ఎవరినీ ఏమీ అనకపోయినా క్షమాపణ చెప్పాను. కానీ కొందరు లోకేష్ దగ్గరకు వెళ్లి మీ అమ్మను అన్నారంటూ తప్పుడు సమాచారం ఇచ్చారు’’ అని వంశీ తెలిపారు.చంద్రబాబు, టీడీపీ నేతలపై వంశీ సెటైర్లు‘‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం పార్లమెంట్లో పెట్టింది. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందాక రాష్ట్రాలు అంగీకరించాల్సిందే. చంద్రబాబు, టీడీపీ నేతలు ఇప్పుడే కళ్లు తెరిచినట్లు మాట్లాడుతున్నారు. పార్లమెంట్లో, అసెంబ్లీలో మద్దతిచ్చింది వీళ్లే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఏమీ లేదు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పని కూడా గుర్తుకురాదు. చంద్రబాబు విద్వేషంతో అబద్ధపు ప్రచారం చేస్తున్నాడు. గత మూడు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేశా. తొలిసారి వైసీపీ తరపున పోటీచేస్తున్నా. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఎన్నికల్లో చంద్రబాబు ఏం చెబితే అదే ప్రజలకు చెప్పేవాళ్లం. అధికారంలోకి వచ్చాక ఏం చేయలేకపోయేవాళ్లం. చంద్రబాబు రుణమాఫీ చేస్తానన్నాడు... చేయలేదు. బ్యాంకుల్లో బంగారం విడిపిస్తానన్నాడు... చేయలేదు. బాబు వస్తే జాబు అన్నాడు... ఎవరికీ జాబు రాలేదు’’అని వంశీ మండిపడ్డారు. ఇక.. మానవ వనరుల అభివృద్ధితోనే సమాజం అభివృద్ధి అని సీఎం జగన్ నమ్మారు. దేశ రాజకీయాల్లో మేనిఫెస్టోను తూ.చా తప్పకుండా అమలు చేసిన ఒకే ఒక్కరు సీఎం జగన్ అని వంశీ అన్నారు. -
యార్లగడ్డకు వల్లభనేని స్ట్రాంగ్ వార్నింగ్
-
చంద్రబాబుకు వల్లభనేని వంశి మాస్ కౌంటర్
-
టీడీపీ ఆఫీస్ నుండి పట్టాభి నాపై దుష్ర్పచారం చేశారు: వంశీ
-
కృష్ణా జిల్లాలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ
-
సంకల్ప సిద్ధి కేసులో టీడీపీ అసత్య ఆరోపణలు
సాక్షి, విజయవాడ స్పోర్ట్స్: సంకల్ప సిద్ధి కేసుతో మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలకు ముడిపెట్టి టీడీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేయడం సమంజసం కాదని హైకోర్టు న్యాయవాదులు తాడికొండ చిరంజీవి, బర్రె శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసుపై త్వరగా విచారణ జరిపి దోషులను అదుపులోకి తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ డీజీపీకి ఇటీవల వినతిపత్రం ఇచ్చారన్నారు. కేవలం రాజకీయ కక్షతోనే టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఈ కేసులో అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. సీఐడీ చీఫ్ సునీల్, పోలీస్ కమిషనర్ టీకే రాణా పేర్లను ప్రస్తావించడాన్ని వారు ఖండించారు. సీఐడీ విచారణను చెంచా విచారణ అని సంబోధించడం పట్టాభి అహంకారానికి పరాకాష్ట అన్నారు. ఈ కేసుతో సంబంధం ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని వల్లభనేని వంశీ గతంలోనే ప్రకటించినట్టు గుర్తు చేశారు. అసత్య ఆరోపణలు చేస్తున్న పట్టాభికి లిఖిత పూర్వకంగా నోటీసులు ఇచ్చామన్నారు. పట్టాభిపై కేసు నమోదు చేసి రాష్ట్ర బహిష్కరణ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. (చదవండి: ఏకలవ్య జాతీయ క్రీడల ఏర్పాట్లపై రాజీ పడొద్దు ) -
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో " స్ట్రెయిట్ టాక్ "
-
'చంద్రబాబుకు లేని విద్యలేదు.. ఇది కూడా అలానే కనిపెట్టుంటాడు'
సాక్షి, విజయవాడ: పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో 90శాతం అమలు చేసిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. గత ప్రభుత్వంలో చేయలేని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను నేడు చేస్తున్నామని చెప్పారు. మంగళవారం విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వల్లభనేని వంశీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మరం గర్వంగా ప్రతి గడపకు తిరుగుతున్నాం. సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా అందరికీ అందుతున్నాయి. అర్హతే ప్రాధాన్యంగా సచివాలయ వ్యవస్థ పనిచేస్తోంది. గ్రామాల్లో 90 శాతం ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయి. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా సమానంగా సాగుతోందని' తెలిపారు. చంద్రబాబుకు లేని విద్యలేదని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ భవిష్యత్తు చెప్పేందుకు చంద్రబాబు జోతిష్యం నేర్చుకున్నాడా..? అని ప్రశ్నించారు. టీవీ, కంప్యూటర్, సెల్‌ఫోన్, హైదరాబాద్ కనిపెట్టిన చంద్రబాబు జోతిష్యం కూడా కనిపెట్టి ఉంటాడని ఎద్దేవా చేశారు. జనసేన లాంటి పార్టీలు కాలక్రమంలో చాలా రూపాంతరం చెందాయన్నారు. అలాంటి పార్టీల భవిష్యత్తు ప్రజలే నిర్ణయిస్తారు' అని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చెప్పారు. చదవండి: ('ఆయన ఉన్నంతకాలం టీడీపీ గుడివాడలో గెలిచే ప్రసక్తే లేదు') -
జూనియర్ ఎన్టీఆర్‌పై వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు
-
వల్లభనేని వంశీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
సాక్షి, కృష్ణా: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వంశీని వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు స్పష్టం చేశారు. ఆందోళన చెందాల్సిన పనిలేదని, రెండు రోజుల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని వంశీ కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు. ఇది కూడా చదవండి: గుండె ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధ