
సాక్షి, కృష్ణాజిల్లా : టీడీపీ ఒకప్పుడు గొప్ప పార్టీ అని, అయితే చంద్రబాబు ఆలోచనా సరళితో ఇప్పుడు పూర్తిగా దెబ్బతినిపోయిందని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. 'మంగళగిరిలో గెలవలేక మైండ్ పోయి తిరుగుతున్న లోకేష్ కోసం పార్టీని భ్రష్టుపట్టించాడు. చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకొన్న వాళ్ళు బట్రాజుల్లా బాబును పొగుడుతున్నారు. కరోనా భయంతో బయటకు రాని బాబుకు నిజాలు తెలియటం లేదు. వయసురీత్యా ఇబ్బందిపడుతున్న ఆయన ప్రజల తిరస్కారాన్ని జీర్ణించుకోలేక, దాన్ని ఒప్పుకోలేక సచ్చుదద్దమ్మలా ఆరోపణలు చేస్తున్నాడు.
మీడియా ,సోషల్ మీడియా చూస్తూ ఉంటాయా? బాబు ఆరోపణల్లో నిబద్దత ఉండదని జనాలకి బాగా తెలుసు. ఓడిపోయిన వాళ్ళు ఓటమికి వంద కారణాలు చెబుతారు.. చంద్రబాబు కూడా ఆ కోవకు చెందిన వ్యక్తే' అని వల్లభనేని పేర్కొన్నారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేకపోతే ఇక్కడ పోలీసులను ఎందుకు సెక్యురిటీగా పెట్టుకున్నారని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ గురించి చంద్రబాబు కేంద్రానికి ఒక్క లేఖ కూడా రాయలేదని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment