
సాక్షి, విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamshi) పోలీసు కస్టడీ ముగిసింది. కస్టడీ అనంతరం పోలీసులు వంశీని విజయవాడ జిల్లా కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ వద్ద వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు.
సత్య వర్ధన్‌కు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహిస్తే ఈ కేసులో అసలు నిజాలు బయటకు వస్తాయన్నారు. తనను కేసుతో సంబంధం లేని ప్రశ్నలు అడిగారని న్యాయమూర్తికి తెలిపారు. జైల్లో తనను ఒంటరిగా సెల్‌లో ఉంచారని,తనకు ఆస్తమా సమస్య ఉందని ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఇబ్బందని అని అన్నారు. అందుకే తనతో పాటు వేరే వారిని కూడా సెల్‌లో ఉంచాలని కోరారు.
వంశీ విజ్ఞప్తిపై స్పందించిన న్యాయమూర్తి ఇప్పటికే మీకు దగ్గరలో అటెండర్ సౌకర్యం కల్పించారు కదా? అని ప్రశ్నించారు. అందుకు వంశీ భద్రత దృష్ట్యా మాత్రమే సెల్‌లో ఒంటరిగా ఉంచామని జైలు అధికారులు వివరణిచ్చారు. హెల్త్ పరిశీలనకు ఒక వార్డెన్‌ను ఏర్పాటుకు తమకు అభ్యంతరం లేదని చెప్పారు. దీంతో వంశీతో పాటు వేరే వారిని సెల్ ఉంచేందుకు న్యాయమూర్తి జైలు అధికారులకు జారీ చేశారు.
