
చంద్రబాబు చెప్పగానే నిమ్మగడ్డ చర్యలు తీసుకుంటారా? ఎస్ఈసీ చర్యలకు అన్నీ సరిపెడతాం.
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు పిచ్చి ముదిరిందని, నియంతృత్వ పోకడలకు పోతున్నారని టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘ ఫిర్యాదులు వస్తే పరిశీలించాలి కానీ.. గృహ నిర్బంధం విధించడం ఏమిటి?. విచారణ జరపకుండా అనామకుల కంప్లైంట్లపై నిమ్మగడ్డ ఎలా స్పందిస్తారు? చంద్రబాబు చెప్పగానే నిమ్మగడ్డ చర్యలు తీసుకుంటారా? ఎస్ఈసీ చర్యలకు అన్నీ సరిపెడతాం. ఏకగ్రీవాలనేవి కాసు బ్రహ్మానంద రెడ్డి కాలం నుంచే ఉన్నాయి. ఏకగ్రీవాలకు ప్రోత్సహకాల జీవో ఇచ్చింది చంద్రబాబే. కొత్తగా ఈ రోజే ఏకగ్రీవాలు జరుగుతున్నట్టు చంద్రబాబు మాట్లాడుతున్నారు. టీడీపీ ఏకగ్రీవాలు కూడా బలవంతమేనా?. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్థులు లేరు’ అని ఎమ్మెల్యే వంశీ పేర్కొన్నారు.
( నిమ్మగడ్డ.. చంద్రబాబు ఏజెంట్: గౌతమ్‌రెడ్డి )