![Ex MLA vallabhaneni vamsi Arrest Live Updates](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/vallabhaneni-vamsi.jpg.webp?itok=To4Z7nLC)
Vamsi Arrest Live Updates.. కూటమి సర్కార్ పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. అక్రమ కేసుల్లో భాగంగా తాజాగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(vallabhaneni vamsi)ని ఏపీ పోలీసులు.. హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. నాటకీయ పరిణామాల మధ్య వంశీని విజయవాడకు తరలిస్తున్నారు.
👉విజయవాడ చేరుకున్న వంశీ పోలీసుల ఎస్కార్ట్ వాహనం. ముందుగా భవానీపురం పోలీసు స్టేషన్‌కు వంశీని తరలించిన పోలీసులు.
👉అనంతరం, వాహనాన్ని మార్చి మరో చోటుకి తరలిస్తున్న పోలీసులు. కాసేపట్లో జడ్జీ మందు వంశీని హాజరుపర్చనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కృష్ణా జిల్లావ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన్ విధించారు. పోలీసు యాక్ట్ 30 అమలు చేసున్నట్టు తెలిపారు. ర్యాలీలు, నిరసనలపై నిషేధం విధించారు.
👉మరికాసేపట్లో వల్లభనేని వంశీని పటమట పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకురానున్న పోలీసులు. ఇప్పటికే పడమట పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న స్పెషల్ పార్టీ పోలీసులు, ఎస్‌బీ, ఇంటెలిజెన్స్, స్థానిక పోలీసులు.
👉పటమట పోలీస్ స్టేషన్ ఇరువైపులా బారికేడ్స్‌ను ఏర్పాటు చేస్తున్న పోలీసులు. డీసీపీ పర్యవేక్షణలో ఏసీపీ, సీఐలు. వంశీ అనుచరులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటారనే అనుమానంతో భారీ ఎర్పాట్లు. మూడు గంటల నుండే పటమట స్టేషన్‌లోనే ఉన్న పోలీసు అధికారులు
👉వంశీ అరెస్ట్ నేపథ్యంలో గన్నవరంలో పోలీసులు హై అలర్ట్ విధించారు. వైఎస్సార్‌సీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. పార్టీ శ్రేణులను బయటకు రానివ్వడం లేదు. ప్రధాన ప్రాంతాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్టీ కార్యకర్తలు బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.
👉చంద్రబాబు(Chandrababu) ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ(YSRCP) నేతలను టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించింది. ఇందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కూడా కేసులు పెట్టింది. దీంతో, ఆయనను అరెస్ట్ చేసేందుకు విజయవాడ పడమట పోలీసులు ప్లాన్ ప్రకారం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలో గురువారం ఉదయం గచ్చిబౌలిలోని వంశీ ఇంటికి చేరుకుని నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు.
👉ఈ సందర్భంగా బీఎన్‌ఎస్ సెక్షన్ 140(1), 308, 351(3) రెడ్‌విత్ 3(5) కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అలాగే, వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు సైతం పోలీసులు నమోదు చేశారు. ఇదే సమయంలో కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో అరెస్ట్ చేస్తున్నట్టు వంశీ భార్యకు పోలీసులు నోటీసుల్లో తెలిపారు. అనంతరం, వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు.
👉అయితే, గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్థన్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల కుట్రను మేజిస్ట్రేట్ ముందు సత్యవర్ధన్ బట్టబయలు చేశారు. ఈ నేపథ్యంలో వంశీని పోలీసులు టార్గెట్ చేశారు. కక్ష గట్టి మరో కేసు నమోదు చేశారు. సత్యవర్ధన్ ఫిర్యాదు వెనక్కి తీసుకున్న అనంతరం మరో అక్రమ కేసు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు.
ఇది కూడా చదవండి: చంద్రబాబు చీటర్ కాదా?: వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment