
సాక్షి, కృష్ణా: ఏపీలో కూటమి సర్కార్ వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్ చేస్తూ పాలన చేస్తోంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అనంతరం రాష్ట్రంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.
వంశీ అరెస్ట్ నేపథ్యంలో మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం పేర్ని నాని ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. ఏఆర్ ఏఎస్పీ, డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మోహరించారు. ఈ క్రమంలో నానిని ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో, పోలీసుల తీరుపై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Comments
Please login to add a commentAdd a comment