‘చంద్రబాబు, లోకేష్‌ ప్రతీకారంలో భాగమే వంశీ అరెస్ట్‌’ | YSRCP Leaders Serious On CBN Over Vamshi Arrest | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు, లోకేష్‌ ప్రతీకారంలో భాగమే వంశీ అరెస్ట్‌’

Published Thu, Feb 13 2025 10:28 AM | Last Updated on Thu, Feb 13 2025 1:03 PM

YSRCP Leaders Serious On CBN Over Vamshi Arrest

సాక్షి, తాడేపల్లి: కూటమి సర్కార్‌ పాలనలో ప్రతీకారంతోనే వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్ట్‌ చేస్తున్నారని పార్టీ నాయకులు మండిపడ్డారు. ఈ క్రమంలోనే గన్నవరం మాజీ ఎ‍మ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌ను వైఎస్సార్‌సీపీ నేతలు ఖండించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు సంయమనంతో ఉండాలని కోరారు. మరోవైపు.. ఏపీలో వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నారు. నేతల ఇళ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. 

విశాఖ: వల్లభనేని వంశీ అరెస్ట్‌పై బొత్స స్పందించారు. ఈ క్రమంలో బొత్స..‘వంశీ అరెస్టును ఖండిస్తున్నాము. ఉప సంహరించుకున్న కేసుపై అరెస్టు ఏమిటి?. కక్షపూరిత రాజకీయాలు ఉండకూడదు. ఇటువంటి రాజకీయాలు మంచిది కాదు. మరోసారి పునరావృతం కాకూడదు’ అంటూ హెచ్చరించారు.

తిరుపతి: వంశీ అరెస్ట్‌పై టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..‘వల్లభనేని వంశీ అరెస్టును ఖండిస్తున్నా. కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్‌ చేశారు. చంద్రబాబు, లోకేష్‌ ప్రతీకారంతోనే అరెస్ట్‌లు చేస్తున్నారు. వంశీ మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి సంతోషపడుతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలందరిపై ప్రతీకార చర్యలకు దిగుతున్నారు. కార్యకర్తలు అందరూ సంయమనంతో ఉండాలని కోరారు.

తాడేపల్లి: మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వంశీపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అన్యాయంగా అరెస్టు చేశారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 30 మంది పోలీసులు ఇంటికెళ్లి మరీ బెదిరించారు. చట్టాన్ని చేతిలో తీసుకుని తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి అనుగుణంగా పోలీస్‌ వ్యవస్థ పనిచేస్తోంది. పౌర హక్కులను హరిస్తూ అక్రమ కేసులు పెడుతున్నారు. ఫిర్యాదు చేసిన వ్యక్తే విత్‌ డ్రా చేసుకుంటే మళ్లీ కేసు పెట్టడమేంటి?. అసలు ఏపీలో ఏం జరుగుతోంది?. న్యాయవ్యవస్థను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. తప్పుడు కేసులు పెడితే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికారం ఎప్పుడూ ఒకరి చేతిలో ఉండదని పోలీసు అధికారులు గుర్తించాలి. డీజీపీని కోర్టుకు పిలిపిస్తామని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందంటేనే వారి పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మానవ హక్కులను పోలీసులను ఉల్లంఘిస్తున్నారు. 

విశాఖ: కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. వంశీ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి. కక్ష సాధింపు చర్యలు మంచి పద్ధతి కాదు. కేసు విత్ డ్రా చేసుకున్న తరవాత అరెస్టులు చేయడమేంటి?.

విశాఖ: ఎమ్మెల్సీ కుంభ రవిబాబు మాట్లాడుతూ.. వంశీ అరెస్టు అనాగిరిక చర్య. రాష్ట్రంలో రెడ్‌బుక్  రాజ్యాంగం అమలవుతోంది. వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. బెయిల్‌పై ఉన్న వ్యక్తిని ఏ విధంగా అరెస్టు చేస్తారు?. వైఎస్సార్‌సీపీ నేతలను భయభ్రాంతులకు గురిచేయాలని చంద్రబాబు సర్కార్‌ చూస్తోంది.

చిత్తూరు: చిత్తూరు వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్‌ విజయనందరెడ్డి మాట్లాడుతూ..‘గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు ఖండిస్తున్నా. వంశీ అరెస్టు అప్రజాస్వామికం, రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగము అమలు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్ట్‌ చేసి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు.

విజయవాడ: దేవినేని అవినాష్‌ మాట్లాడుతూ.. కక్షపూరితంగా వంశీని అరెస్ట్‌ చేశారు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది. కోర్టు వ్యాఖ్యలను కూడా కూటమి సర్కార్ పట్టించుకోవడం లేదు. కేవలం కక్ష సాధింపు కోసమే ఇలా ఇబ్బందులు పెడుతున్నారు. తప్పుడు కేసులపై కోర్టులు న్యాయం చేయాలి. భవిష్యత్‌ కాలంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఎవరైన తప్పుడు కేసులు పెట్టారో వారిపై చట్టపరంగా ముందుకు వెళ్లడం జరుగుతుంది. వారికి శిక్ష తప్పదు అంటూ హెచ్చరించారు.

కక్షతోనే వంశీ అరెస్ట్: Devineni Avinash

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement