ఏబీఎన్‌ రాధాకృష్ణకు ఎంపీ విజయసాయిరెడ్డి సవాల్‌ | Mp Vijay Sai Reddy Slams Abn Radha Krishna | Sakshi
Sakshi News home page

ఏబీఎన్‌ రాధాకృష్ణకు ఎంపీ విజయసాయిరెడ్డి సవాల్‌

Published Tue, Nov 19 2024 9:20 PM | Last Updated on Tue, Nov 19 2024 9:24 PM

Mp Vijay Sai Reddy Slams Abn Radha Krishna

సాక్షి, తాడేపల్లి : ఏబీఎన్‌ రాధాకృష్ణకు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్‌ వేదికగా సవాల్ విసిరారు. రాధాకృష్ణ! బహిరంగ చర్చకు నేను రెడీ. నీ ఛాలెంజ్ స్వీకరిస్తున్నా! ఫేస్ టు ఫేస్.. కౌంటర్‌కు ఎన్ కౌంటర్..నేను సిద్ధం.. నువ్వు సిద్ధమా? అయినా నీ పక్షపాత టీవీ ఛానల్ ఆంధ్రజ్యోతికి నేను రావాలా!

ఢిల్లీలో ఎన్‌జీవోలు, మేధావులు, జర్నలిస్టులు, అన్ని టీవీ చానల్స్‌ అందరిని ఆహ్వానించి ప్రజావేదిక మీద విశ్రాంత న్యాయమూర్తుల సమక్షంలో చర్చించుకుందాం! నేను ఐక్యరాజ్యసమితి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎప్పుడైనా రెడీ!.ఎవరి చిత్తశుద్ధి  ఏంటో తేల్చుకుందాం. తగ్గేదేలే! భయపడేదేలే!. గత 5 ఏళ్లలో మద్యం, ఖనిజ సిండికేట్ బ్రోకర్లు,మిగతా ఇతరత్రా డీల్స్ లో మీ బాస్ పేరు చెప్పి వసూళ్లు చేసి వారికి ఇవ్వకుండా ఎంత తీసుకున్నావో అన్ని అంశాలు కూలంకషంగా చర్చిద్దాం! 

 జర్నలిస్ట్ కాలనీలో నువ్వుండే ప్యాలస్, నేనుండే బాడుగిళ్ళు కూడా చూపిద్దాం!. ఫిల్మ్ నగర్ మెయిన్ రోడ్డులో నువ్వు కొన్న నూరు కోట్ల విలువ చేసే స్థలం దాంట్లో ఇంకో  రెండు వందలకోట్లతో  కట్టుతున్న ఆఫీస్ భవంతి కూడా పరిశీలిద్దాం. రాధాకృష్ణ! నీ పత్రిక, టీవీని ఏ పునాదులపైన నిర్మించుకున్నావో మరువద్దు. నష్టాలు వస్తున్నాయని ఇప్పటికీ అమెరికా వెళ్లి ఎన్నారైల దగ్గర చందాలు తెచ్చుకోవడం వాస్తవం కాదా! కలర్ బ్లైండ్ నెస్ లాగా మీ కళ్లకు కొందరే కనిపిస్తారు. మిగతావాళ్లంతా నీవేం అన్నా పడాలి.

నీకోసం సెటిల్‌మెంట్ల సంపాదనకు ఉపయోగపడాలి అనుకొనే స్వార్ధపూరిత మైండ్ మీది.సుద్దులు చెప్పడం మానుకో. ఊసరవెల్లులు సిగ్గుపడుతున్నాయి!.రాధాకృష్ణా! ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కలంతో పోరాడి ఇందిరా గాంధీని వణికించిన ఇండియన్ ఎక్స్ ప్రెస్ వ్యవస్థాపకుడు రామ్ నాథ్ గోయెంకా గుర్తున్నాడా?.ఆనాడు ఆయన చేసిన సాహసం వల్లే దేశంలో కాంగ్రేసేతర ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ ఊపిరి పోసుకుంది. గోయెంకా వారసులు ఇప్పటికీ మీడియాను నమ్ముకుని సాధారణ జీవితాలు గడుపుతున్నారు. 92 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఆస్తులు, నీ నెల రోజుల సెటిల్ మెంట్ల సంపాదనతో సరిపోవంటే నీవెంత అవినీతిపరుడివో వేరే చెప్పాలా?’ అని ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement