Radha krishna
-
ఏబీఎన్ రాధాకృష్ణకు ఎంపీ విజయసాయిరెడ్డి సవాల్
సాక్షి, తాడేపల్లి : ఏబీఎన్ రాధాకృష్ణకు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా సవాల్ విసిరారు. రాధాకృష్ణ! బహిరంగ చర్చకు నేను రెడీ. నీ ఛాలెంజ్ స్వీకరిస్తున్నా! ఫేస్ టు ఫేస్.. కౌంటర్‌కు ఎన్ కౌంటర్..నేను సిద్ధం.. నువ్వు సిద్ధమా? అయినా నీ పక్షపాత టీవీ ఛానల్ ఆంధ్రజ్యోతికి నేను రావాలా!ఢిల్లీలో ఎన్జీవోలు, మేధావులు, జర్నలిస్టులు, అన్ని టీవీ చానల్స్ అందరిని ఆహ్వానించి ప్రజావేదిక మీద విశ్రాంత న్యాయమూర్తుల సమక్షంలో చర్చించుకుందాం! నేను ఐక్యరాజ్యసమితి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎప్పుడైనా రెడీ!.ఎవరి చిత్తశుద్ధి ఏంటో తేల్చుకుందాం. తగ్గేదేలే! భయపడేదేలే!. గత 5 ఏళ్లలో మద్యం, ఖనిజ సిండికేట్ బ్రోకర్లు,మిగతా ఇతరత్రా డీల్స్ లో మీ బాస్ పేరు చెప్పి వసూళ్లు చేసి వారికి ఇవ్వకుండా ఎంత తీసుకున్నావో అన్ని అంశాలు కూలంకషంగా చర్చిద్దాం! రాధాకృష్ణ! బహిరంగ చర్చ కు నేను రెడీ. నీ ఛాలెంజ్ స్వీకరిస్తున్నా! ఫేస్ టు ఫేస్.. కౌంటర్ కు ఎన్ కౌంటర్.. నేను సిద్ధం.. నువ్వు సిద్ధమా? అయినా నీ పక్షపాత టీవీ ఛానల్ ఆంధ్రజ్యోతి కి నేను రావాలా! ఢిల్లీ లో NGO లు, మేధావులు, జర్నలిస్టులు, అన్ని tv చానెల్స్ ని అందరిని ఆహ్వానించి…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 19, 2024 జర్నలిస్ట్ కాలనీలో నువ్వుండే ప్యాలస్, నేనుండే బాడుగిళ్ళు కూడా చూపిద్దాం!. ఫిల్మ్ నగర్ మెయిన్ రోడ్డులో నువ్వు కొన్న నూరు కోట్ల విలువ చేసే స్థలం దాంట్లో ఇంకో రెండు వందలకోట్లతో కట్టుతున్న ఆఫీస్ భవంతి కూడా పరిశీలిద్దాం. రాధాకృష్ణ! నీ పత్రిక, టీవీని ఏ పునాదులపైన నిర్మించుకున్నావో మరువద్దు. నష్టాలు వస్తున్నాయని ఇప్పటికీ అమెరికా వెళ్లి ఎన్నారైల దగ్గర చందాలు తెచ్చుకోవడం వాస్తవం కాదా! కలర్ బ్లైండ్ నెస్ లాగా మీ కళ్లకు కొందరే కనిపిస్తారు. మిగతావాళ్లంతా నీవేం అన్నా పడాలి.నీకోసం సెటిల్మెంట్ల సంపాదనకు ఉపయోగపడాలి అనుకొనే స్వార్ధపూరిత మైండ్ మీది.సుద్దులు చెప్పడం మానుకో. ఊసరవెల్లులు సిగ్గుపడుతున్నాయి!.రాధాకృష్ణా! ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కలంతో పోరాడి ఇందిరా గాంధీని వణికించిన ఇండియన్ ఎక్స్ ప్రెస్ వ్యవస్థాపకుడు రామ్ నాథ్ గోయెంకా గుర్తున్నాడా?.ఆనాడు ఆయన చేసిన సాహసం వల్లే దేశంలో కాంగ్రేసేతర ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ ఊపిరి పోసుకుంది. గోయెంకా వారసులు ఇప్పటికీ మీడియాను నమ్ముకుని సాధారణ జీవితాలు గడుపుతున్నారు. 92 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఆస్తులు, నీ నెల రోజుల సెటిల్ మెంట్ల సంపాదనతో సరిపోవంటే నీవెంత అవినీతిపరుడివో వేరే చెప్పాలా?’ అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. -
ABN రాధాకృష్ణ బెదిరింపులు..
-
ఏబీఎన్ రాధాకృష్ణ అండ్‌కో బెదిరిస్తోంది: పోసాని
సాక్షి, హైదరాబాద్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏబీఎన్ రాధాకృష్ణ అండ్‌కో.. ఇన్ డైరెక్ట్‌గా బెదిరింపులకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి మండిపడ్డారు.శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన కుటుంబాన్ని పవన్ అభిమానులు దూషించినా ఆయన కుటుంబాన్ని తానెప్పుడూ తిరిగి ఒక్క మాట కూడా అనలేదన్నారు. చంద్రబాబు, లోకేశ్‌ను పవన్ కల్యాణ్ చాలా సార్లు విమర్శించారని పోసాని కృష్ణమురళి గుర్తు చేశారు.ఇదీ చదవండి: పవన్ వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్ కౌంటర్ -
అందాల రాధగా తమన్నా..ట్రెడిషన్ లుక్ అదుర్స్!
కృష్ణాష్టమి వస్తున్న తరుణంలో టాలీవుడ్ నటి మిల్కీ బ్యూటీ అందమైన రాధలా మిస్మరైజ్ చేస్తుంది. రాధమ్మ ఇలానే ఉంటుందా అనేంతలా చూపు తిప్పుకోని అందంతో అలరించింది. తమన్నా భాటియా రీసెంట్ గా స్త్రీ 2 సినిమా ఆజ్ కీ రాత్ పాటలో కనిపించి హెడ్ లైన్లో నిలిచింది. ఎప్పుడూ గ్లామర్ పాత్రలే కాకుండా..ఐటమ్ లేడీ, విలన్ పాత్రల్లో కూడా యాక్ట్ చేస్తూ ట్రెండ్ సెట్ చేస్తోంది. అలాంటి తమన్నా ఈసారి సాంప్రదాయ లుక్‌లో కనిపించి సందడి చేసింది.అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. భారతీయ హస్తకళకు సంబంధించిన అల్లికలతో కూడిన లెహెంగాలో తమన్నా 'రాధారాణిలా' తలుక్కుమంది. ప్రముఖ డిజైనర్ కరణ్ టోరానీ ప్రేమకు చిహ్నమైన రాధ లుక్‌ని అత్యంత ప్రేమమయంగా ఆవిష్కిరించే ప్రయత్నం చేశారు. ఇక్కడ తమన్నా భాటియా ధరించిన లెహంగా అది వెల్లడించేలా అత్యంత అందంగా తీర్చిదిద్దాడు. రాధ కృష్ణులు మధ్య స్వచ్ఛమైన బంధాన్ని తెలిపేలే రాధ లుక్‌ని ఆవిష్కరించాడు. ఇక్కడ తమన్నా ‘చంద్రమల్లికా మన్మయి లెహంగా సెట్’లో ఉంది. ఈ లెహెంగా సెట్ “లష్ ఆర్గాన్జా, జెన్నీ సిల్క్" ఫ్యాబ్రిక్. నీలి గులాబి రంగుల కలయికతో కూడిన లెహంగా తమన్నాకి అందాన్ని రెట్టింపు చేసింది. దీనిపై ఉన్న ఈహెరిటేజ్ డబ్కా వర్క్, మోతీ గోల్డ్ సీక్విన్స్, సిగ్నేచర్ ఎంబ్రాయిడరీలతో అట్రాక్టివ్‌గా ఉంది.. ఈ లెహంగా సెట్ పూర్తి పర్పుల్ ఒద్నీతో అయితే ధర రూ. 435,500/-, అదే ఆక్వా ఒధ్నితో రూ. 399,500 ఉంటుందట. ఇక్కడ రాధా దేవిలా ఉన్న తమన్నా ఓ అందమైన చిలకతో సంభాషిస్తున్న స్టిల్ అత్యంత అద్భుతంగా ఉంది. View this post on Instagram A post shared by T O R A N I (@toraniofficial) (చదవండి: మిసెస్ సౌత్ ఇండియా వర్షారెడ్డి) -
తెలంగాణభవన్‌లో వేడుకలు.. బంగారు బోనమెత్తిన గవర్నర్ సీపీ రాధాకృష్ణన్
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ అమ్మవారికి సమర్పించారు.కాగా, తెలంగాణభవన్‌లో జరిగిన బోనాల ఉత్సవాల్లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. ఈ క్రమంలో లాల్ దర్వాజ బోనాల కమిటీ సభ్యులు గవర్నర్‌కు స్వాగతం పలికారు. ఇక, వేడుకల్లో భాగంగా ఆయన బంగారు బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించారు.అనంతరం, రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. దేవుడు ఒక్కడే. భిన్న రూపాల్లో మనం దేవుడికి కొలుస్తాము. అదే సెక్యులరిజానికి నిజమైన నిర్వచనం. బోనాల ఉత్సావాల్లో ఈ సంస్కృతి కనిపిస్తుంది అని కామెంట్స్ చేశారు. -
డబ్బులు పంచనందుకే ఎన్నికల్లో ఓడిపోయా: తెలంగాణ గవర్నర్
సాక్షి, హైదరాబాద్: మహత్మా గాంధీ టెంపుల్ ట్రస్ట్ (హైదరాబాద్) ప్రతినిధుల బృందం ఆదివారం తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణను కలిశారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ బృందం ఇటీవల జరిగిన ఎన్నికల్లో ‘‘ఒటర్ అవేర్నెస్ అండ్ ఎథికల్ ఓటింగ్ క్యాంపెయిన్’’ పేరుతో అవగాహన కార్యక్రమాన్ని మే 1 నుంచి మే 13 వరకు నిర్వహించామని గవవర్నకు తెలియజేశారు. ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించినందుకు వారికి గవర్నర్ అభినందనలు తెలిపారు. అదేవిధంగా మద్యపాన నిషేధంపై కూడా అవగాహాన కార్యక్రమం చేపట్టాలని గాంధీ టెంపుల్ ట్రస్ట్ బృందానికి ఆయన సూచించారు. ఇక.. ఎన్నికల్లో పోటీ చేసే నాయకులు, ఓటు వేసే ఓటర్లు.. మద్యం, డబ్బు ముట్టుకోమని ప్రతిజ్ఞ చేయాలన్నారు. అయితే తాను కూడా ఒకసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేశాని తెలిపారు. ఓటర్లకు ఎట్టిపరిస్థితులు డబ్బు పంచకూడదని ఒక నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అయితే ఆ ఎన్నికల్లో తాను ఓడిపోయినట్లు తెలిపారు.ఈ ట్రస్ట్ బృంద ఏపీ, తెలంగాణలోని 22 ప్రాంతాల్లో ఓటర్లకు అవగాహన కల్పించారు. తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో అవగాహన కల్పించారు. ఏపీలో వైజాగ్, రాజమండ్రీ, కాకినాడ, ఏలూరు, భీమవరం, విజయవాడ, గుంటూరు, తెనాలి, నార్సరావుపేట, ఒంగోల్, నెల్లూరు, కర్నూల్, తిరుపతి, చిత్తూరు, కడప ప్రాంతాలో గాంధీ టెంపుల బృందం ఎన్నికల అవగాహన కార్యక్రమం నిర్వహించింది.గవర్నర్ కలిసిన బృందంలో మహత్మా గాంధీ టెంపుల్ ట్రస్ట్ (హైదరాబాద్) అధ్యక్షులు భోపాల్ మోరా, సెక్రటరీ వీపీ కృష్ణారావు, సలహాదారులు వీపీ రావు, నగేంద్రరెడ్డి, ట్రస్టీలు డా. సీత, నర్సిరెడ్డిలు ఉన్నారు. -
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఇంట్లో తీవ్ర విషాదం
టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఇవాళ ఆయన మాతృమూర్తి సూర్యదేవర నాగేంద్రమ్మ (90) కన్నుమూశారు. హృదయ సంబంధిత వ్యాధితో ఆమె తుదిశ్వాస విడిచారు.కాగా.. సూర్యదేవర నాగేంద్రమ్మ (90)కు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు సంతానం. రాధాకృష్ణ రెండో కుమారుడు కాగా.. నిర్మాత సూర్యదేవర నాగవంశీకి ఆమె నాయనమ్మ అవుతారు. రేపు ఉదయం పది గంటలకు ఫిల్మ్ నగర్‌లోని విద్యుత్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా.. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ శుక్రవారమే రిలీజ్ కానుంది. ఈ సమయంలో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. -
కూటమి ఓటమిని ఒప్పుకున్న ABN రాధాకృష్ణ
-
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఏపీలో ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన తర్వాత జరిగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించిన తీరు చూస్తే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది. ఢిల్లీలో కూర్చున్న ఈసీ పెద్దలు తమ ఇష్టానుసారం తీసుకున్న నిర్ణయాల ఫలితమే రెండు, మూడు రోజుల పాటు జరిగిన హింస అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఎన్నికల ప్రవర్తన నియామవళి అమలులోకి వచ్చిన తర్వాత పోలీసు, పరిపాలన వ్యవస్థను తన చేతిలోకి తీసుకున్న ఎన్నికల సంఘం వారు స్వతంత్రంగా కాకుండా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు కోరిన రీతిలో పక్షపాతంగా వ్యవహరించారు. కూటమి కోరిన అధికారులను కోరిన చోట అప్పాయింట్ చేసింది. వారు కూటమికి విధేయతతో వ్యవహరించి అభాసు పాలయ్యారు. అంతిమంగా సస్పెన్షన్లు, బదిలీలకు గురి కావల్సి వచ్చింది.దీపక్ మిశ్ర అనే రిటైర్డ్ అధికారిని అబ్జర్వర్‌గా నియమిస్తే, ఆయన టీడీపీకి సంబంధించినవారు ఇచ్చిన విందులో పాల్గొన్నారట. ఆ విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలు బహిరంగంగానే చెప్పారు. ఇది ఎన్నికల సంఘానికి ఎంత సిగ్గుచేటైన విషయం. దీపక్ మిశ్ర ఎక్కడా గొడవలు జరగకుండా చూడాల్సింది పోయి తెలుగుదేశంకు అనుకూలంగా పనిచేయాలని పోలీసులపై ఒత్తిడి చేశారట. అలాగే సస్పెండైన ఒక పోలీసు ఉన్నతాదికారి టీడీపీ ఆఫీస్‌లో కూర్చుని ఆయా నియోజకవర్గాలలో పోలీసులను ప్రభావితం చేయడానికి కృషి చేశారట.ఇవన్ని వింటుంటే పెత్తందార్లుగా ముద్రపడ్డ చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరి, పవన్ కల్యాణ్‌లు ఎన్నికలలో గెలుపుకోసం ఎన్ని కుట్రలు చేయడానికైనా వెనుకాడలేదని అర్ధం అవుతుంది. తాడిపత్రిలో పోలీసులే ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిలో విద్వంసం సృష్టించడం, అది కనిపించకుండా ఉండాలని సీసీ కెమెరాలు పగులకొట్టడం వంటి సన్నివేశాలు చూసిన తర్వాత పోలీసు వ్యవస్థపై ప్రజలలో నమ్మకం ఎలా ఉంటుంది? మంత్రులు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పోన్ చేస్తేనే కనీసం సమాధానం ఇవ్వని పోలీసు అధికారులను విశ్వసించడం ఎలా? దీని ఫలితంగానే పల్నాడు ప్రాంతంలో బలహీనవర్గాల ఇళ్లపై దాడులు, అనేక మంది గుడులలో, ఇతరత్రా తలదాచుకకోవలసి వచ్చింది. ఆ మహిళలు రోదించిన తీరుచూస్తే ఎవరికైనా బాద కలుగుతుంది.గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా, దానిని బూతద్దంలో చూపుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఎల్లో మీడియా ప్రయత్నించింది. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి ఎల్లో మీడియా యజమానులు ఫ్యాక్షనిస్టులుగా మారి ప్రతి ఘటనకు రాజకీయ రంగు పులిమి, వైఎస్సార్సీపీకి అంటగడుతూ నీచమైన కధనాలు ఇస్తూ వచ్చారు. వారి అండ చూసుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాని, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు నోటికి వచ్చినట్లు మాట్లాడేవారు. పోలీసులను బెదిరించేవారు. అంగళ్లు, పుంగనూరుల వద్ద చంద్రబాబు రెచ్చగొట్టడంతో టీడీపీ కార్యకర్తలు దాడులు చేయడం, పోలీసు వాహనాన్ని కూడా వారు దగ్దం చేయడం, ఒక పోలీస్ కానిస్టేబుల్ కన్ను పోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అంత చేసిన తర్వాత కూడా చంద్రబాబు, లోకేష్‌లు అప్పటి చిత్తూరు ఎస్పి మీద తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఆయన పేరు రెడ్ బుక్‌లో రాసుకున్నామని, తాము అధికారంలోకి వస్తామని, ఆ తర్వాత నీ సంగతి చూస్తామంటూ బెదిరించేవారు.ఇలా అనేక మంది అధికారులను తరచూ భయపెట్టే యత్నం చేసినా, దురదృష్టవశాత్తు న్యాయ వ్యవస్థ కూడా ఈ అంశంపై తగు నిర్ణయాలు చేయలేదు. దాంతో టీడీపీ, జనసేన నేతలు చెలరేగిపోతూ వచ్చారు. ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు జనంలోకి వెళ్లడంతో వాటికి పోటీగా ఏమి చెప్పినా, తమకు మద్దతు లబించదని భావించిన చంద్రబాబు, పవన్‌లు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యకు ఏదో ప్రమాదం వాటిల్లిందన్న ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చారు. ష్ట్రంలో సైకో పాలన సాగుతోందని పిచ్చి-పిచ్చి ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించాలని యత్నించారు. పవన్ అయితే ఏకంగా ముప్పైవేల మంది మహిళలు అక్రమ రవాణా అయ్యారని, వలంటీర్లే దానికి బాధ్యులంటూ నీచమైన విమర్శలు కూడా చేశారు. నిప్పుకు వాయువు తోడైనట్లు, రామోజీరావు, రాధాకృష్ణలు ఉన్నవి, లేనివి కల్పించి గాలివార్తలు రాసి ప్రజలలో భయాందోళనలు సృష్టించడానికి యత్నించారు.ఎక్కడైనా ఇద్దరు వ్యక్తులు గొడవపడితే దానికి రాజకీయం పులిమి వీరు రాష్ట్రం అంతటా ప్రచారం చేసేవారు. వెంటనే చంద్రబాబో, లేక ఇతర టీడీపీ నేతలు అక్కడకు వెళ్లి హడావుడి చేసే యత్నం చేసేవారు. ఈ రకంగా గత ఐదేళ్లుగా ఏపీ ఇమేజీని దెబ్బతీయడానికి వీరు గట్టి కృషి చేశారు. ఏదైనా ఘటన జరిగితే రెండువైపులా ఉన్న వాదనలు, వాస్తవ పరిస్థితిని వివరిస్తూ వార్తలు ఇస్తే తప్పుకాదు. అలా కాకుండా టీడీపీ వారిని భుజాన వేసుకుని దారుణ కధనాలు ఇవ్వడం ద్వారా ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రజల దృష్టిలో పరువు కోల్పోయాయి. అయినా ఎన్నికల సమయం వచ్చేసరికి వీరు మరింత రెచ్చిపోయారు. ప్రభుత్వపరంగా, లేదా వైఎస్సార్సీపీ పరంగా ఏవైనా తప్పులు ఉంటే చెప్పవచ్చు. కాని.. వైఎస్సార్సీపీని ఓడించకపోతే తమకు పుట్టగతులు ఉండవన్నట్లుగా వీరు ప్రవర్తించారు.టీడీపీ ఒంటరిగా పోటీచేస్తే గెలుపు అవకాశాలు లేవన్న స్పష్టమైన అభిప్రాయానికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్‌ను తమ ట్రాప్‌లోకి తెచ్చుకుని తదుపరి బీజేపీని కాళ్లావేళ్లపడి పొత్తు పెట్టుకున్నారు. ఏపీలో ఒక్క శాతం ఓట్లు కూడా లేని బీజేపీతో పొత్తుకు ఎందుకు తహతహలాడుతున్నదన్నదానిపై అప్పుడే అంతా ఊహించారు. కేవలం కేంద్ర ప్రభుత్వం అండతో జగన్ ప్రబుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి, ఎన్నికల సమయంలో అధికార యంత్రాంగాన్ని భయపెట్టి తమదారిలోకి తెచ్చుకోవడానికి, వీరు పన్నాగం పన్నారు. అందుకు తగ్గట్లుగానే బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి ఈ పని పురమాయించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే కోడ్ అమలుకు వస్తుంది కనుక సహజంగానే ఈసీకే విశేషాధికారాలు ఉంటాయి. దానిని తమకు అడ్వాంటేజ్‌గా మార్చుకున్నారు.ఎన్నికల సంఘం అధికారులపై ఒత్తిడి తెచ్చి తమకు కావల్సిన అదికారులను నియమించుకునే ప్రక్రియ ఆరంబించారు. పురందేశ్వరి ఏకంగా 22 మంది అధికారుల జాబితాను ఇచ్చి వారందరిని తొలగించి, తాము సూచించినవారిని నియమించాలని కోరడం సంచలనం అయింది. బహుశా దేశ చరిత్రలో ఇంతత ఘోరమైన లేఖ ఎవరూ రాసి ఉండరు. అలా ఉత్తరం రాసినందుకు సంబంధిత రాజకీయ నేతను మందలించవలసిన ఎన్నికల సంఘం ఆమె కోరిన చందంగానే అధికారులను బదిలీ చేయడం ఆరంభించింది. పలువురు జిల్లా కలెక్టర్లు, ఎస్పిలను, ఇతర చిన్న అధికారులను కూడా బదిలీ చేయించారు. చివరికి డీజీపీని కూడా వదలిపెట్టలేదు. సిఎస్ ను కూడా బదిలీ చేయాలని గట్టిగానే కోరారు కాని ఎందుకో ఆ ఒక్క బదిలీ ఆగింది.ఈ బదిలీ అయిన వారిలో ఎవరికి ఫలానా తప్పు చేస్తున్నట్లు ఎక్కడా ఈసీ తెలపలేదు. కనీసం నోటీసు ఇవ్వలేదు. నేరుగా బీజేపీ నేతలు ఏమి చెబితే అదే చేశారన్న భావన ఏర్పడింది. ఈనాడు, ఆంద్రజ్యోతి వంటివి గట్టిగా ఉండే అధికారులపై చెడరాశాయి. వారందరిని బదిలీ చేయాలని ఒకసారి, బదిలీ చేస్తున్నారని మరోసారి రాసేవారు. వారు రాయడం, టీడీపీ, బీజేపీలు వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం, మరుక్షణమే ఈసీ స్పందించడం మామూలు అయింది. ఇక్కడ విశేషం ఏమిటంటే ముఖ్యమంత్రి జగన్ దీనిపై ఎక్కడా పెద్దగా విమర్ధలు చేయలేదు. 2019లో కేంద్ర ఎన్నికల సంఘంతో సంబంధం లేకుండా ఐటీ, సీబీఐ వంటి సంస్థలు తమ పార్టీ నేతల ఇళ్లలో సోదాలు జరిపితేనే చంద్రబాబు రెచ్చిపోయి కేంద్రంపై తీవ్ర విమర్శలు చేసేవారు. ఎన్నికల ముఖ్య అధికారి ద్వివేది కార్యాలయానికి వెళ్లి తగాదా ఆడారు.. ధర్నా చేశారు.. కాని జగన్ చాలా హుందాగా వ్యవహరించారు. రాజకీయ విమర్శలు చేశారే తప్ప ఎక్కడా స్థాయిని తగ్గించుకోలేదు.టీడీపీ, బీజేపీలు తాము కోరినట్లుగానే అధికారులను నియమించుకుని పెత్తనం చేశారు. అయినా జగన్ ఎక్కడా అదికారులను ఎవరిని తప్పుపట్టలేదు. జనాన్ని నమ్ముకుని తన ప్రచారం తాను చేసుకున్నారు. పోలింగ్ నాడు బలహీనవర్గాలు, పేద వర్గాలు పెద్ద ఎత్తున తరలిరావడంతో టీడీపీ వర్గాలు ఆందోళన చెందాయి. కొంత ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న పల్నాడు వంటి ప్రాంతాలలో పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి టీడీపీ కూటమి నేతలు ప్రయత్నించారు. అందువల్లే వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. లేదా బాగా ఆలస్యంగా స్పందించారు. అయినా ఆ రోజు అంతా చాలావరకు ప్రశాంతంగా ముగిసింది. తదుపరి పరిస్థితిని సమీక్షించుకున్న టీడీపీ క్యాడర్ ఓటమి భయమో మరేదో కారణం కాని, ఒక్కసారిగా వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారనుకున్నవారిపై దాడులు చేశారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి, తాడిపత్రిచంద్రగిరి మొదలైన చోట్ల వీరు నానా రభస చేశారు.ఎన్నికల సంఘం పనికట్టుకుని ఎక్కడైతే అధికారులను మార్చిందో అక్కడే ఈ గొడవలు జరగడంతో కుట్ర ఏమిటో బోధపడింది. ప్రత్యేకించి కొన్ని గ్రామాలలో దాడులు అమానుషంగా ఉన్నాయి. ఆ గ్రామాలలో మహిళలు, పిల్లలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న సన్నివేశాలు కనిపించాయి. వీటిని మాత్రం ఈనాడు, ఆంద్రజ్యోతి మీడియా కప్పిపుచ్చి వైఎస్సార్సీపీనే దాడులు చేసిందని ప్రచారం చేయడం దుర్మార్గం. ఒకవేళ వైఎస్సార్సీపీ వారిది కూడా ఏదైనా తప్పు ఉంటే రిపోర్టు చేయవచ్చు. అలాకాకుండా ఏకపక్షంగా వీరు వార్తలు కవర్ చేస్తూ తామూ ఫ్యాక్షనిస్టులమేనని రామోజీ, రాధాకృష్ణలు రుజువు చేసుకుంటున్నారు. ఎన్నికలు వారం రోజులు ఉండగా, ఇక రెండు రోజులలో జరుగుతాయనగా కూడా కొందరు పోలీస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. పలు చోట్ల తమకు కావల్సినవారిని కూటమి నియమింప చేసుకోగలిగింది. కొత్తగా వచ్చిన అధికారులకు అన్ని విషయాలపై అవగాహన తక్కువగా ఉంటటుంది. దానికి తోడు తెలుగుదేశంకు అనుకూలంగా వ్యవహరించడానికి సిద్దమై వచ్చినందున ఆయా ఘటనలపై సరిగా స్పందించలేదు. అందువల్లే పల్నాడు ప్రాంతంలో గొడవలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. బూత్ స్వాధీనం వంటివి జరిగినా చూసి, చూడనట్లు పోయారట.నిజానికి ఇంత తక్కువ వ్యవధిలో కొత్త అధికారులను నియమించినా ఉపయోగం ఉండదు. ఆ విషయం తెలిసి కూడా ఇలా వ్యవహరించడం అంటే కచ్చితంగా కూటమి పెత్తందార్లు చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరిల ఒత్తిడికి ఈసీ లొంగిందని అర్దం. తాడిపత్రిలో పోలీసులే ఎమ్మెల్యే ఇంటిలో రచ్చ సృష్టించారు. అది మరీ ఘోరంగా ఉంది. అలాగే జెసి ప్రభాకరరెడ్డి ఇంటిలో కొందరు పోలీసులు గొడవ చేశారని టీడీపీ మీడియా ప్రచారం చేసింది. ఎక్కడ ఎవరు చేసినా ఖండించవలసిందే. చర్య తీసుకోవల్సిందే. తాడిపత్రిలో ఏ స్థాయికి గొడవలు వెళ్లాయంటే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ జెండా ఎగురవేసే యత్నం వరకు. ఇది మంచిది కాదు. నిజంగానే ఈనాడు మీడియా రాసినట్లు టీడీపీ నేతలే ఘర్షణలలో దెబ్బతిని ఉన్నా, వైఎస్సార్‌సీపీవారు దాడులు చేశారన్న నిర్దిష్ట సమాచారం ఉన్నా చంద్రబాబు నాయుడు ఈ పాటికి అక్కడకు వెళ్లి మరింత అగ్గి రాజేసేవారు. ఆయన ఎక్కడకు వెళ్లలేదు.పెత్తందార్ల కొమ్ము కాస్తున్న కూటమి నేతలు గాయపడ్డ పేదలను పలకరించడానికి ఎందుకు వెళతారు! ఇప్పుడు ఈసీ ఏపీ ఛీఫ్ సెక్రటరీని, డీజీపీని పిలిచి వివరణ కోరినా ఏమి ప్రయోజనం ఉంటుంది. చేసిందంతా చేసి, తనపై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చుకోవడానికి ఈసీ ఇలా వ్యవహరిస్తున్నదన్న అనుమానం వస్తోంది. కేవలం ఎన్నికల సంఘం కొత్త అధికారులను నియమించిన చోటే ఈ ఘర్షణలు జరిగాయని, దీనికి ఈసీనే బాధ్యత వహించాలని ఈ అధికారులు వివరణ ఇచ్చి ఉండాలి. లేదా ఎన్నికల కమిషన్ తో ఎందుకు తలనొప్పిలే అనుకుంటే వారి వాదన ఏదో చెప్పి వచ్చి ఉండాలి. అందుకే పలువురు అధికారులపై కమిషన్ చర్చ తీసుకోక తప్పలేదు. ఏది ఏమైనా స్వతంత్రంగా ఉండవలసిన ఎన్నికల సంఘం కొన్ని రాజకీయ పార్టీల ఒత్తిడికి లొంగడం, శాంతి భద్రతలకు వారి చర్యలే విఘాతం కల్గించడం వంటివి ఏ మాత్రం సమర్దనీయం కాదు. దీనివల్ల ఈసీ విశ్వసనీయతపై మచ్చ పడిందని చెప్పక తప్పదు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
‘రైతుల భూ డాక్యుమెంట్లను బుగ్గిపాలు చేసింది బాబేగా!’
ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజల సెంటిమెంట్‌తో ఆడుకుంటున్నారు. ప్రత్యేకించి రైతుల మనోబావాలతో చెలగాటమాడుతున్నారు. ఎవరికైనా భూమితో ఉండే సంబంధం చెప్పనవసరం లేదు. అందులోను రైతులకు మరింతగా ఉంటుంది. వారు భూమిని దైవంగా పరిగణిస్తారు. ఎంతో పవిత్రంగా చూసుకుంటారు. ఆ భూముల డాక్యుమంట్లను చాలా జాగ్రత్తగా భద్రపరచుకుంటారు. వాటిని తమ కుటుంబ భవిష్యత్తుకు చిహ్నాలుగా చూసుకుంటారు. అలాంటి డాక్యుమెంట్లను చంద్రబాబు నాయుడు దగ్దం చేసే సాహసం చేశారు. ఆయన చేసింది చాలా పెద్ద తప్పు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఆయనకు ఎంత ద్వేషమైనా ఉండవచ్చు. ఎంత అక్కసు అయినా ఉండవచ్చు.కాని జగన్‌ను దూషించడానికి రైతుల డాక్యుమెంట్లను తగులబెట్టి దారుణమైన చర్యకు ఉపక్రమించారు. పైగా అదేదో గొప్ప పని మాదిరి ఏమి తమ్ముళ్లూ తగులబెట్టానా? అంటూ ఒకటికి రెండుసార్లు సభలో వికటాట్టహాసం చేయడం. ఈ మధ్యకాలంలో చంద్రబాబుకు ఎవరు ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలు ఇస్తున్నారో కాని, ఆయన చేష్టలన్నీ రోత పుట్టిస్తున్నాయి. జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని అర్ధం చేసుకోవచ్చు. బూతులు తిట్టడం, డాక్యుమెంట్లు కాల్చడం ఏమిటి? 2014-2019 టరమ్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులను పీడించి 33 వేల ఎకరాలను సమీకరించారు. కొందరు ఇష్టంతోనే ఇచ్చినా, చాలామంది అందుకు సిద్దపడలేదు. వారిపై రకరకాల కేసులు పెట్టి, చివరికి వారి పంటలను కూడా దహనం చేయించారన్న విమర్శలకు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం గురి అయింది. దాని ప్రభావంతో ఏపీలో ఆయన ఏకంగా అధికారాన్ని కోల్పోయి, కేవలం 23 సీట్లకే పరిమితం అయ్యారు. వైఎస్సార్సీపీకు 151సీట్లతో స్వీప్ వచ్చింది.అమరావతి రాజధాని గ్రామాలు ఉన్న తాడికొండ, మంగళగిరిలలో కూడా టీడీపీ ఓటమిపాలైంది. మంగళగిరిలో స్వయంగా చంద్రబాబు కుమారుడు లోకేష్ పోటీచేసినా ఫలితం దక్కలేదు. దానిని తట్టుకోలేక చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఏదో ఒక వివాదం సృష్టిస్తూ జగన్ ప్రభుత్వాన్ని సజావుగా నడవకుండా అడ్డుపడుతూ వచ్చారు. అలాగే మళ్లీ 2024 ఎన్నికల సమయంలో కూడా అనేక గొడవలు సృష్టించడానికి, అబద్దపు ప్రచారాలు చేయడానికి చంద్రబాబు బృందం పూనుకుంది. నిప్పుకు గాలి తోడైనట్లు పవన్ కల్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణ వంటి మరికొందరు ఆ బాచ్‌లో చేరి అడ్డగోలు ప్రచారాలకు దిగుతున్నారు. చంద్రబాబు నాయుడు నిజానికి తానేమి చేస్తున్నాననో అర్ధం చేసుకోలేని మానసిక స్థితిలో ఉన్నట్లు అనిపిస్తుంది.ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని నీ అమ్మమొగుడు, అమ్మమ్మ మొగుడు, నానామ్మ మొగుడు.. ఇలా పిచ్చి మాటలు మాట్లాడతారా? మైండ్ ఉన్నవాళ్లెవరైనా ఇలాంటి బూతులు మాట్లాడతారా? రెండు రోజుల క్రితమే మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఒక సమావేశంలో మాట్లాడుతూ బూతులు తిట్టే రాజకీయ నేతలను ఓడించాలని పిలుపు ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబును ఓడించాలని వెంకయ్య నాయుడు పిలుపు ఇస్తే బాగుంటుంది. ఎన్నికల సంఘం కూడా చంద్రబాబు పట్ల చాలా ఔదార్యంతో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది. తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రెండు రోజుల నిషేధం పెట్టిన ఎన్నికల సంఘం చంద్రబాబుపై మాత్రం ఆ స్థాయిలో చర్య తీసుకోవడం లేదు. జగన్‌ను చంపితే ఏమి అవుతుందని చంద్రబాబు ప్రశ్నించినా, ఎన్నికల సంఘం మాత్రం చూస్తూ ఊరుకుంటోంది. అదే సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు వైఎస్సార్సీపీ పైన, సీనియర్ అధికారులపై ఫిర్యాదు చేస్తే చాలు.. ఆఘమేగాల మీద చర్యలు చేపట్టి వారిని బదిలీ చేస్తోంది. తద్వారా చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్న లక్ష్యాన్ని ఎన్నికల సంఘం కూడా నెరవేర్చుతున్నట్లు అనిపిస్తుంది.కేంద్ర హోం మంత్రి అమిత్-షా వచ్చిన రోజున డీజీపీని బదిలీ చేసి, ప్రధాని మోదీ ఏపీకి వచ్చిన రోజున మరికొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసి కూటమి నేతలను సంతోషపెట్టినట్లు అనిపిస్తుంది. ఎన్నికల సంఘం ఏపీలో ఎప్పటి నుంచో అమలు అవుతున్న ఆయా స్కీములకు గాను ప్రజలకు వెళ్లవలసిన డబ్బు వెళ్లకుండా అడ్డుపడుతోంది. కూటమి నేతలు చంద్రబాబు, దగ్గుబాటి పురందేశ్వరి, పవన్ కల్యాణ్ వంటివారు చేసే ఫిర్యాదుల ఆధారంగా ఈసి పనిచేస్తున్నదన్న విమర్శలు వస్తున్నాయి. ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి జగన్ కూడా ఎన్నికల సంఘంపై విమర్శలు చేశారు. ఎన్నికలనైనా సజావుగా జరగనిస్తారా? అన్న సందేహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పక్కనబెడితే, రైతు భూమి డాక్యుమెంట్‌ను చంద్రబాబు దగ్దం చేయడానికి కారణం ఏమిటని పరిశీలిస్తే అందులోను చంద్రబాబు డబుల్ గేమ్ బయటపడుతుంది. రామోజీ జర్నలిజాన్ని ఎంతగా దిగజార్చింది అర్దం అవుతుంది.2019 జూలైలో శాసనసభలో లాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లును జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అది చాలా గొప్ప చట్టమని, కేంద్రం దీనిపై ఎప్పటినుంచో కసరత్తు చేస్తోందని, పలు దేశాలలో ఇప్పటికే ఈ తరహా చట్టాలు ఉన్నాయని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మెచ్చుకున్నారు. అప్పుడు చంద్రబాబు ఎక్కడా వద్దనలేదు. కాని శాసనసభ ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో దానిని కాంట్రవర్శీ చేసి రాజకీయ లబ్ది పొందడానికి యత్నిస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి. తదితర ఎల్లో మీడియా అడ్డగోలు కధనాలు రాసి ప్రజలలో భయాందోళనలు సృష్టించాలని తలపెట్టాయి. మొదట వైఎస్సార్సీపీ అంత సీరియస్‌గా తీసుకోలేదు. కాని ప్రజల్ని నమ్మించడానికి చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ, పవన్ కల్యాణ్‌లు కుయుక్తులు పన్నారన్న విషయం అర్దం చేసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు మేల్కొని అసలు విషయాలు చెప్పడం ఆరంభించారు. ఆ క్రమంలో అసెంబ్లీలో టీడీపీ ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన వీడియోని, రామోజీకి చెందిన టీవీలలో ఈ బిల్లు గొప్పదని చెప్పిన సంగతులను బయటపెట్టారు. దాంతో వారికి నోట మాటరాని పరిస్థితి ఏర్పడింది. వెంటనే ఈనాడు, ఆంద్రజ్యోతి వంటివి ప్లేట్ పిరాయించాయి. ఇంత తొందరేముంది అంటూ మరో చెత్త కధనాన్ని వండి యత్నం చేశాయి. చంద్రబాబు అయితే నిర్లజ్జగా ఆ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం మరింత వికృతంగా వ్యవహరించారు. అందులో భాగంగానే రైతుల సెంటిమెంట్ దెబ్బతినే విదంగా వారి భూ డాక్యుమెంట్‌ను దగ్దం చేశారు. ఆ పనేదో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్-షాల సభలలో వారి సమక్షంలోనే తగులబెడితే వారు ఏమి చెప్పేవారో తెలిసేది కదా? కాని ఆ పని చేయరు.కేవలం ప్రజలను మోసం చేయడానికి, తాను ఆత్మరక్షణలో పడిన విషయాన్ని కప్పిపుచ్చడానికి డాక్యుమెంట్లను దగ్దం చేసి రైతుల మనోభావాలను దారుణంగా దెబ్బతీశారని చెప్పాలి. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా డబుల్ గేమ్ ఆడారు. ఒకటికి రెండుసార్లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలం అంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖలు రాశారు. తీరా కేంద్రం తెలంగాణ ఏర్పాటుకు రెడీకాగానే సోనియాగాంధీని దెయ్యం, బూతం అంటూ బండబూతులు తిట్టారు. ఆంధ్రుల పొట్టకొట్టిందని అన్నారే తప్ప తాను సమైక్యవాదినని, తాను ఇచ్చిన లేఖను ఉపసంహరించుకుంటున్నానని మాత్రం చెప్పలేదు. తెలంగాణలో జరిగిన సభలలో తనవల్లే రాష్ట్రం వచ్చిందని గొప్పగా చెప్పుకున్నారు. ఇలా ఎన్నిసార్లు డబుల్ గేమ్ ఆడారో లెక్కలేదు. రెండు నాలుకల దోరణిలో బహుశా దేశంలోనే చంద్రబాబుకు అగ్రస్థానం ఉండవచ్చు. వలంటీర్ల వ్యవస్థను రకరకాలుగా దూషించారు. ఆ తర్వాత తాను అదే వ్యవస్థను కొనసాగిస్తానని, ఇంకా ఎక్కువ వేతనం ఇస్తానని అంటారు.జగన్ సంక్షేమ స్కీములు అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని అన్న చంద్రబాబు అంతకు రెట్టింపు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని హామీ ఇస్తుంటారు. ఈ డబుల్ టాక్‌తో రాజకీయ ప్రయోజనం కోసం ఆయన ఎంతకైనా దిగజారుతారు. అలాగే ఇప్పుడు లాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన డబుల్ టాక్ చేసి అప్రతిష్టపాలయ్యారు. అమలులోకి రాని చట్టంతో ఏదో ప్రమాదం జరిగినట్లు పచ్చి అబద్దాలను ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచారం చేయడం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ పిచ్చి ప్రసంగాలు చేయడం నిత్యకృత్యం అయింది. అందులో బాగంగా చంద్రబాబు రైతుల బూమి డాక్యుమెంట్ ను దగ్దం చేసి రైతుల సెంటిమెంట్‌ను దెబ్బతీశారు. గతంలో అమరావతిలో పంటపొలాలు దహనం చేయించిన తర్వాత ఘోర పరాజయం చెందారు. అలాగే ఈసారి రైతుల భూమి డాక్యుమెంట్‌ను బుగ్గిపాలు చేయడం ద్వారా కూటమి అదికారంలోకి వస్తే రాష్ట్రాన్ని కూడా అలాగే తగులబెడతామని ప్రజలకు వారికి తెలియకుండానే సంకేతం పంపించారు. కనుక భూ డాక్యుమెంట్ తగులబెట్టిన చంద్రబాబుకు మరోసారి ఓటమి తప్పదన్న భావన వ్యక్తం అవుతోంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
నగదు అక్రమ రవాణాపైనా సిట్ నజర్!
సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికల సందర్భంగా పోలీసు వాహనాల్లో నగదును అక్రమంగా తరలించిన విషయం ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సందర్భంగా వెలుగుచూడటంతో హైదరాబాద్ పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. దీనికి సంబంధించి మరో కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. ఈ కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా కొందరు ప్రజాప్రతినిధులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు నేతృత్వంలో సాగిన ఈ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే సిట్ అధికారులు పలు కీలక ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలోనే ఉప ఎన్నికలు, సాధారణ ఎన్నికల సమయంలో హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు ఆదేశాలు, సూచనల మేరకు పోలీసు బృందాలు ప్రతిపక్షాలకు చెందినవిగా అనుమానిస్తూ భారీ మొత్తంలో నగదు స్వా«దీనం చేసుకున్నాయి. విపక్షాల నగదుకు సంబంధించిన సమాచారం వారికి ట్యాపింగ్ ద్వారానే తెలిసినట్లు వెల్లడైంది. మరోపక్క ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు ఆదేశాల మేరకు పోలీసులే తమ వాహనాల్లో కొందరు అభ్యర్థులకు సంబంధించిన నగదును తరలించినట్లు సిట్ అధికారులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. దీనిపై ఆరా తీసిన పోలీ సులు ఆ నగదు మూలం, చేరిన ప్రాంతం తదితరాలు గుర్తించారు. ఎలక్షన్ సమయంలో తనిఖీలు ముమ్మరంగా ఉంటాయి. దీంతో ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావులు ఏర్పాటు చేసిన బృందాలు కొన్ని బడా సంస్థలతో పాటు వ్యాపారవేత్తలకు చెందిన నగదును పోలీసు వాహనాల్లో రవాణా చేసినట్లు అధికారులు తేల్చారు. టాస్క్‌ఫోర్స్, ఎస్ఐబీ వాహనాల్లో రవాణా అయిన ఈ నగదు కొందరు నేతలకు చేరినట్లు అనుమానిస్తున్నారు. సిట్ అధికారులు ఇప్పటికే ఆయా నగదు, అక్రమ రవాణా వాహనాల్లో ప్రయాణించిన ఎస్సైలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులతో పాటు డ్రైవర్లను ప్రశ్నించి వాంగ్మూలాలు నమోదు చేశారు. 2018 నుంచి.. గత ఏడాది డిసెంబర్ వరకు.. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2020లో జరిగిన దుబ్బాక, 2021 అక్టోబర్‌లో జరిగిన హుజూరాబాద్, 2022 అక్టోబర్ రెండో వారంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలతో పాటు గత ఏడాది డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో ఈ నగదు అక్రమ రవాణా ఎక్కువగా జరిగినట్లు తేల్చారు. పోలీసు కస్టడీ నేపథ్యంలో సిట్ అధికారులు రాధా కిషన్‌రావును ఈ నగదు అక్రమ రవాణా పైనా ప్రశ్నించారు. అయితే ఆయన నుంచి సరైన సమాధానం రాలేదని తెలిసింది. ఇప్పటికే ఈ నగదు అక్రమ రవాణాపై కీలక సమాచారం సేకరించిన అధికారులు రాధాకిషన్‌రావు సహా మరికొందరిపై మరో కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. గురువారం నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి మీరాలం ఈద్గా వద్ద మీడియాతో మాట్లాడుతూ, ట్యాపింగ్ కేసు దర్యాప్తు పూర్తి పారదర్శకంగా జరుగుతోందని అన్నారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చే అంశం పైనా త్వరలో వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
కిడ్నాప్ చేసి.. బెదిరించి
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: అక్రమ ఫోన్ ట్యాపింగ్, బెదిరింపు వసూళ్లు ఆరోపణలపై అరెస్టయిన హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పి.రాధాకిషన్‌రావుపై జూబ్లీహిల్స్ ఠాణాలో కిడ్నాప్ కేసు నమోదైంది. క్రియా హెల్త్‌కేర్ వివాదంలో తలదూర్చి దాని డైరెక్టర్ వేణుమాధవ్ చెన్నుపాటిని కిడ్నాప్ చేసి, షేర్లు, యాజమాన్య బదిలీ చేయించడంతో పాటు రూ.10 లక్షలు వసూలు చేసిన ఆరోపణలపై దీన్ని రిజిస్టర్ చేశారు. ఈ కేసులో ఇన్స్పెక్టర్లు బి.గట్టుమల్లు, ఎస్.మల్లికార్జున్ సైతం నిందితులుగా ఉన్నారు. ఇది సోమవారమే రిజిస్టర్ కాగా... బుధ వారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే రాధాకిషన్‌రావుపై కూకట్పల్లి ఠాణాలో బెదిరింపుల కేసు నమోదైన విషయం విదితమే. మరోపక్క అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన పోలీసు కస్టడీ బుధవారంతో ముగిసింది. వారం రోజుల పాటు ఆయ న్ను వివిధ కోణాల్లో ప్రశ్నించిన సిట్ అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు తెలిసింది. వ్యాపారవేత్త వేణును ఎలా ట్రాప్ చేశారంటే.. నగరానికి చెందిన వేణుమాధవ్ చెన్నుపాటి ప్రపంచ బ్యాంక్‌లో కొన్నాళ్లు పని చేసిన తర్వాత 2008లో తిరిగి వచ్చి 2011లో క్రియా హెల్త్‌కేర్ సంస్థను స్థాపించారు. 2014లో ఉమ్మడి రాష్ట్రంలో 165 పట్టణ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, టెలి మెడిసిన్ సౌకర్యాలు, అత్యవసర వాహనాలతో సహా ప్రధాన ప్రాజెక్టులను ఈ సంస్థ నిర్వహించేది. 2016 నాటికి క్రియా హెల్త్‌కేర్ మూడు ప్రధాన ప్రాజెక్ట్‌లను చేజి క్కించుకుని ఐదేళ్లల్లో తమ ప్రాజెక్టు విలువను రూ.250 కోట్లకు పెంచుకుంది. ఇది జరిగిన కొన్నాళ్లకు గోపాల్, రాజ్, నవీన్, రవి క్రియాలో పార్ట్ టైమ్ డైరెక్టర్లుగా చేరారు. 2015లో బాలాజీ ఈ సంస్థకు సీఈఓగా నియమితులయ్యారు. 2016–17 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి క్రియా హెల్త్‌కేర్‌లో ఆరుగురు డైరెక్టర్లు ఉండగా... వేణు 60, బాలాజీ 20, గోపాల్ 10, రాజ్ 10 శాతం చొప్పున షేర్లు కలిగి ఉన్నారు. వీరిలో వేణు, బాలాజీ మాత్రమే ఫుల్‌టైమ్ డైరెక్టర్లు. 2018లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నాన్ ఎమర్జెన్సీ మొబైల్ హెల్త్‌కేర్ క్లినిక్‌ల ఏర్పాటుకు బిడ్డింగ్‌కు పిలిచింది. అందులో పాల్గొన్న క్రియా హెల్త్‌కేర్ 1500 మొబైల్ అంబులెన్స్ హెల్త్ క్లినిక్‌లను నడిపే ప్రాజెక్టును తీసుకునే ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సంస్థ పార్ట్‌టైమ్ డైరెక్టర్లు నలుగురూ వేణుకు ఉన్న 60 శాతం షేర్లను తక్కువ విలువకు విక్రయించాలని పట్టుబట్టారు. సీఈఓ బాలాజీని కూడా వారి వైపు తిప్పుకున్నారు. రాధాకిషన్‌రావు తనదైన శైలిలో బెదిరించి.. అక్కడ రాధాకిషన్‌రావు ప్రోద్బలంతో అప్పటి వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ గట్టుమల్లు తీవ్రస్థాయిలో వేణును బెదిరించారు. దాదాపు రూ.100 కోట్ల విలువైన క్రియా హెల్త్‌కేర్ కంపెనీలోని షేర్లు, యాజమాన్యం వదులుకోవాలని హెచ్చరించారు. రాధాకిషన్‌రావుతో పాటు ఇతర నిందితుల సమక్షంలో నాటకీయ పరిణామాల మధ్య తుపాకులు, కర్రలతో బెదిరించడంతో గత్యంతరం లేక వేణు సెటిల్మెంట్ అగ్రిమెంట్‌పై సంతకం చేయాల్సి వచ్చింది. వేణు నుంచి రూ.10 లక్షలు వసూలు చేసి గట్టుమల్లు, మల్లికార్జున్‌తో కూడిన బృందం ఈ విషయాన్ని పోలీసులు, మీడియా, కోర్టుల్లో ఎవరి దృష్టికి తీసుకువెళ్లినా ప్రాణహాని ఉంటుందని హెచ్చరించి పంపింది. తాజా పరిణామాలతో ధైర్యం తెచ్చుకుని ఫిర్యాదు ప్రాణభయంతో ఇన్నాళ్లు మిన్నకుండిపోయిన వేణుమాధవ్‌కు ఇటీవల రాధాకిషన్‌రావు అరెస్టు విషయం తెలిసి ధైర్యంగా ముందుకు వచ్చి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా అధికారులు రాధాకిషన్‌రావు, చంద్రశేఖర్ వేగే, గట్టుమల్లు, మల్లికార్జున్, కృష్ణ, గోపాల్, రాజ్, రవి, బాలాజీ తదితరులపై ఐపీసీలోని 386, 365, 341, 120 (బీ), రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో రాధాకిషన్‌రావుపై కోర్టు ద్వారా పీటీ వారెంట్ తీసుకుని అరెస్టు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం గట్టుమల్లు రాచకొండ ఐటీ సెల్లో, మల్లికార్జున్ ఎస్ఐబీలో ఇన్స్పెక్టర్లుగా పని చేస్తున్నారు. మల్లికార్జున్ సుదీర్ఘకాలం వెస్ట్‌జోన్ టాస్‌్కఫోర్స్‌లో ఎస్సైగా పని చేశారు. పదోన్నతి తర్వాత రాధాకిషన్‌రావు సిఫార్సుతోనే ప్రభాకర్‌రావు ఎస్ఐబీలోకి తీసుకున్నారు. రూ.40కోట్ల షేర్లను రూ.40 లక్షలకే బదిలీ చేయించుకుని .. ♦ ఇదిలా ఉండగా.. గోల్డ్ ఫిష్ అబోడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేగే చంద్రశేఖర్ తన కంపెనీలో పెట్టుబడి కోసం 2018 మార్చిలో వేణుమాధవ్‌ను సంప్రదించారు. ఆ సందర్భంలోనే క్రియా హెల్త్‌కేర్ వివాదాలు తెలుసుకుని, పార్ట్‌టైమ్ డైరెక్టర్లతో మాట్లాడి విషయం సెటిల్ చేస్తానని చెప్పారు. ఇలా మార్కెట్లో రూ.40 కోట్ల విలువైన షేర్లను కేవలం రూ.40 లక్షలకే వేణు నుంచి బదిలీ చేయించుకున్నారు. నలుగురు పార్ట్‌టైమ్ డైరెక్టర్లతో అతడు మరో రహస్య ఒప్పందం కేసుకుని తనను మోసం చేసినట్లు వేణుకు తర్వాత తెలిసింది. వేణు మాధవ్ తన నలుగురు పార్ట్‌టైమ్ డైరెక్టర్ల వేధింపులపై 2018 అక్టోబర్ 3న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అదే నెల 12 నుంచి నలుగురి నుంచి వేణుకు వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో ప్రాజెక్టు ప్రారంభించడానికి గడువు సమీపిస్తుండటంతో 2018 నవంబర్‌లో చంద్రశేఖర్ వేగే, గోపాల్, రాజ్ తలసిల, నవీన్, రవి అప్పటి టాస్‌్కఫోర్స్ డీసీపీ పి.రాధా కిషన్ రావును ఆశ్రయించారు. కంపెనీకి సంబంధించిన మిగిలిన షేర్లనూ తమకు ఇప్పించమని వీళ్లు కోరా రు. దీంతో రాధాకిషన్‌రావు, అప్పటి టాస్్క ఫోర్స్ ఎస్సై మల్లికార్జున్ అదే నెల 22న ఉద యం 5.30 గంటలకు వేణును తమ సిబ్బందితో కలిసి కిడ్నాప్ చేసి సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. -
షర్మిల రాజకీయం.. ఘోరంగా మిస్ ఫైర్!
అనుకున్నది ఒకటి.. అయింది ఒకటి.. అని ఒక పాట ఉంది. ప్రస్తుతం ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పరిస్థితి అలాగే అయినట్లుగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి అయిన షర్మిలను ఏపీ రాజకీయాలలోకి తీసుకు వచ్చి ఆయనను ఇబ్బంది పెట్టాలని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ఆదరించే వర్గాలలో కొంత చీలిక తీసుకురావాలని చంద్రబాబు ఆలోచించారు. తదనుగుణంగా ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్లే తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టుకుని రాజకీయ కార్యకలాపాలలో ఉన్న షర్మిలను అక్కడ నుంచి ఏపీకి తీసుకురావడంలో పరోక్షంగా ఒక పాత్ర పోషించారు. చంద్రబాబు శిష్యుడుగా పేరొందిన తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆమెను ఏపీ రాజకీయాలలోకే వెళ్లాలని పట్టుబట్టారు. కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీ.కే శివకుమార్ వద్ద దీనిపై పంచాయతీ కూడా జరిగింది. ఆమె ఏపీ రాజకీయాలలోకి వెళ్లేలా ఒప్పందం కుదిరిన తర్వాతే ఆమె పార్టీ వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకున్నారు. తదుపరి షర్మిలను పీసీసీ అధ్యక్షురాలిని చేశారు. ఆమె కూడా చంద్రబాబు తరపునే పనిచేస్తూ అన్నను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తూ వస్తున్నారు. చంద్రబాబు కూడా తన ఉపన్యాసాలలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను విమర్శిస్తూ చెల్లెలుకు న్యాయం చేయడం లేదని అనేవారు. షర్మిల పట్ల, అలాగే విజయమ్మ పట్ల తనకు సానుభూతి ఉందన్నట్లు మాట్లాడేవారు. షర్మిల రాజకీయాలలోకి వస్తూనే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఇంటర్వ్యూ ఇవ్వడం ద్వారా తన వెనుక ఎవరు ఉంది ప్రపంచానికి పరోక్షంగా చెప్పేశారు. రాధాకృష్ణ అంటే చంద్రబాబు సొంత మనిషి కింద లెక్క. చంద్రబాబు తరపున ఆయా లావాదేవీలు నిర్వహిస్తుంటారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల కొనుగోలులో రాధాకృష్ణ క్రియాశీలక పాత్ర పోషించారని ఎక్కువ మంది నమ్ముతారు. అలాంటి వ్యక్తి చేసిన రాయబారం ఫలించి ఆమె కొంతకాలం తెలంగాణలో పార్టీ నడిపి, ఆ తర్వాత ఏపీ రాజకీయాలలోకి వచ్చారు. అంతవరకు తాను తెలంగాణ బిడ్డనని, ఈ మట్టిని వదలిపెట్టనని షర్మిల చేసిన శపధాలన్నీ గాలిలో కలిసిపోయాయి. షర్మిల క్రైస్తవ మతం ఆచరిస్తారు కనుక, ఆ ఓట్లను ఆమె కొంతవరకు చీల్చగలిగితే అది తమకు లాభిస్తుందని చంద్రబాబు, రాధాకృష్ణ అంచనా వేసుకున్నారు. ఆమె కూడా వారికి యధో శక్తి రాజకీయంగా ఉపయోగపడుతూ, తన అన్నను విమర్శిస్తున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో గతంలో మాట్లాడినదానికి భిన్నంగా ఆమె వ్యాఖ్యలు చేస్తున్న తీరు కూడా ఇంకో నిదర్శనంగా కనిపిస్తుంది. పీసీసీ అధ్యక్షురాలి హోదాలో ఆమె చంద్రబాబును సైతం కొంతమేర విమర్శించవలసి వస్తోంది. వాటిని ఎడిట్ చేసుకుని ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను విమర్శించిన మేర తమ మీడియాలో ప్రచారం చేశాయి. కాలం గడిచే కొద్ది చంద్రబాబుకు తత్వం బోధపడినట్లుగా ఉంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలు కొందరికి టిక్కెట్లు ఇవ్వడానికి నిరాకరించారు. వారిలో కొంతమంది పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఇది కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తమ వద్దకు రాకుండా కాంగ్రెస్‌లోకి ఎందుకు వెళ్లారా అని చంద్రబాబు మదనపడుతున్నారు. దీనివల్ల తమకు ఏమైనా నష్టం జరుగుతుందా అన్న ఆలోచనకు వచ్చారు. బహుశా షర్మిల వల్ల వైఎస్ జగన్మోహన్రెడ్డికు వచ్చే ఓట్లలో ఏమైనా గండి పడుతుందా అని సర్వేలు చేయించుకుని ఉండాలి. ఆ సర్వేలలో షర్మిల వల్ల వైఎస్ జగన్మోహన్రెడ్డికు ఎలాంటి నష్టం ఉండదని తేలి ఉండవచ్చు. పైగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి వైఎస్ జగన్మోహన్రెడ్డికు ఉపయుక్తంగా ఉంటుందన్న సమాచారం వచ్చి ఉండవచ్చు. దాంతో అంతవరకు షర్మిలను భుజాన వేసుకుని సానుభూతి వచనాలు పలికిన చంద్రబాబు మళ్లీ పెద్ద కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అంటూ పాత డైలాగులు చెప్పడం ఆరంభించారు. 2014లో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తదుపరి 2018లో తెలంగాణలో అదే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. 2019లో ప్రధాని నరేంద్ర మోదీని, వైఎస్ జగన్మోహన్రెడ్డిలను కలిపి విమర్శించేవారు. 2024 నాటికి అదే మోదీతో, బీజేపీతో ఆత్మగౌరవం వదలుకుని మరీ పొత్తు పెట్టుకున్నారు. డబుల్ స్టాండర్స్ కు పెట్టింది పేరు అయిన చంద్రబాబు నాయుడు ఇలా యూ టర్న్‌లు తీసుకోవడం కొత్తకాదు. ప్రస్తుతం కూడా అలాగే షర్మిల విషయంలో కూడా యు టర్న్ తీసుకుని మాట్లాడడం ఆరంభించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే షర్మిల వచ్చారని ఆయన చెబుతున్నారు. పెద్ద కాంగ్రెస్, వైకాపా పిల్ల కాంగ్రెస్ అని పాతపల్లవిని కొత్తగా ఎత్తుకున్నారు. ఈ రెండు కలిసి డ్రామాను రక్తి కట్టిస్తున్నాయని ఆయన అన్నారు. అక్కడితో ఆగకుండా రాజకీయాలకు దూరంగా ఇంటిలోనే ఉంటున్న విజయమ్మ పేరు ప్రస్తావించి.. మొన్నటివరకు కుమారుడికి ఆంధ్ర, కుమార్తెకు తెలంగాణ రాసిచ్చారని చెప్పిన విజయమ్మ ఇప్పుడేమో కుమార్తెను ఏపీలో యుద్దానికి పంపారని అన్నారు. పిల్లలకే న్యాయం చేయలేని తల్లి ఐదు కోట్ల మందికి ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. షర్మిలకు అన్యాయం జరిగితే ఇంటిలోనే పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు. దీనిని బట్టి ఏమి తెలుస్తుంది! తన రాజకీయ అవసరాల కోసం తన ప్రత్యర్ది పార్టీ అధినేత ఇళ్లలో ఉన్న ఆడవారిపై కూడా అసందర్భ, అనుచిత వ్యాఖ్యలు చేయడానికి చంద్రబాబు వెనుకాడరనే కదా! తన భార్యను ఎవరో ఏదో అన్నారంటూ అసెంబ్లీలో రచ్చ చేసి, బయటకు వచ్చి ఏడుపు లంఖించుకున్న ఆయన, విజయమ్మపై విమర్శలు చేయవలసిన అవసరం ఏముంది. అంటే ఏదో రకంగా రెచ్చగొడితే ఆమె కూడా కామెంట్ చేస్తే, ఈ విషయంపై చర్చ కొనసాగించాలన్న దురుద్దేశంతోనా అనే సందేహం వస్తుంది. ఒకవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానిఫెస్టోల గురించి సవాల్ చేస్తూ ప్రజా సమస్యల గురించి అధికంగా ప్రస్తావిస్తూ, యాత్ర సాగిస్తుంటే, చంద్రబాబు మాత్రం ఇలా వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలను డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. దీని అంతటికి ఒక కారణం కనిపిస్తుంది. వలంటీర్లు తదితర అంశాలలో ఆత్మరక్షణలో పడ్డ చంద్రబాబు వాటిని జనం మర్చిపోవాలన్న లక్ష్యంతో పనికి రాని ఉపన్యాసాలు చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే? షర్మిల వల్ల తనకు రాజకీయంగా కలిసి వస్తుందని ఆయన ఆశించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికు మద్దతు ఇచ్చే వర్గాలలో ఎలాంటి విభజన రాకపోగా, ప్రభుత్వ వ్యతిరేక ఓటే ఎంతో కొంత చీలుతుందని ఆయనకు అర్దం అయినట్లుగా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీచేస్తే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ఓడించలేమన్న భయంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ట్రాప్‌లో వేసుకున్నారు. ఆ తర్వాత బీజేపీతో పొత్తులోకి వెళ్లారు.కానీ దీనివల్ల మైనార్టీ వర్గాలలో తనపై వ్యతిరేకత ఏర్పడిందని చంద్రబాబు అర్ధం చేసుకుని ముస్లింలకు తన పాలనలో రక్షణ ఉందని చెప్పడం ఆరంభించారు. షర్మిల వల్ల చీలే ఓట్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం ఇలాంటి దిక్కుమాలిన వ్యూహాలపై ఆదారపడకుండా, తన ప్రభుత్వ పనితీరు, స్కీముల వల్ల ప్రజలకు జరిగిన మేలు మొదలైన విషయాలను చెబుతూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. బీజేపీ,జనసేనలతో నేరుగా పొత్తు పెట్టుకున్న చంద్రబాబు పరోక్షంగా కాంగ్రెస్, సీపీఐ వంటి పక్షాలతో అవగాహన పెట్టుకున్నారన్నది ఎక్కువ భావన. అయినా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ఓడించలేకపోతున్నామన్న ఆందోళన చంద్రబాబులో ఏర్పడింది. అందులో భాగంగానే షర్మిలపై చేసిన వ్యాఖ్యలుగా కనిపిస్తాయి. కొన్నాళ్ల క్రితం కూటమి సభ జరిగినప్పుడు మోదీ ఇలాగే అన్నా, చెల్లెళ్లు ఒకటేనని అన్నప్పుడు చంద్రబాబు సీరియస్‌గా తీసుకోలేదు. కానీ టీడీపీ ఓట్లకే గండిపడుతోందని సర్వేలు తెలపడంతో ఆయనలో మరింత కంగారు ఏర్పడింది. నిజానికి షర్మిల ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌కు ఇప్పటికి 99 శాతం నియోజకవర్గాలలో ఒక్క శాతం ఓట్లు కూడా లేవు. 99 శాతం సీట్లలో డిపాజిట్లు కూడా దక్కించుకోవడం కూడా కష్టమేనని చెబుతున్నారు. అయినా ఆమెను అడ్డుపెట్టుకుని తను లబ్ది పొందాలని చంద్రబాబు చూస్తే, ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి భవిష్యత్తే అయోమయంలో పడిందన్న అభిప్రాయం ఏర్పడింది. తత్ఫలితంగా చంద్రబాబు కొత్త స్వరం ఆలపిస్తున్నారు. అనుకున్నది ఒకటి.. అయింది మరొకటి అనే చందంగానే చంద్రబాబు పరిస్థితి ఏర్పడింది! - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
టీడీపీని పూర్తిగా ముంచేసిన రామోజీ రావు, ABN రాధాకృష్ణ
-
చంద్రబాబుకు దెబ్బేసిన ఎల్లో మీడియా!
ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలు టీడీపీని ముంచేశారు. వారిద్దరూ కలిసి ఏపీలో వేళ్లూనుకున్న వలంటీర్ల వ్యవస్థపై విషం కక్కుతూ రాసిన రాతలన్నీ నిజమేనని భ్రమపడి చంద్రబాబు నాయుడు ఇప్పుడు విలవిలలాడుతున్నారు. ఆయనకు తత్వం బోధపడేసరికి టైమ్ ముగిసిపోయింది. జరగవలసిన డామేజీ జరిగిపోయింది. అందుకే రామోజీ, రాధాకృష్ణలు స్వరం మార్చి తాము చేసిన తప్పును వైఎస్సార్సీపీపై నెట్టేస్తూ పూర్తిగా దొరికిపోయారు. వలంటీర్లు పెన్షన్లు తీసుకునే వృద్దుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ డబ్బు ఇవ్వరాదని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వగానే తమ పన్నాగం ఫలించిందని వారు చంకలు గుద్దుకున్నారు. కొద్ది గంటలలోనే తాము ఎంత బ్లండర్ చేసింది అర్ధం చేసుకుని దానిని కవర్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను టీడీపీ ఏజెంట్‌గా మార్చుకుని, ఆయన ద్వారా అకృత్యాలు చేయిస్తూ ఏపీ ప్రజలను పీడించడమే టీడీపీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి సంస్థలు పనిగా పెట్టుకున్నాయి. అందులో భాగంగానే ఆయన ద్వారా హైకోర్టులో వలంటీర్లకు వ్యతిరేకంగా పిటిషన్ వేయించడం, అది చాలదన్నట్లు ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయడం వంటివి చేయించారు. అంతేకాక బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కనుక, కేంద్రంలో ఎవరి ద్వారానో ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలమైన నిర్ణయాలను టీడీపీ తెప్పించుకుంటోందన్న అభిప్రాయం ఏర్పడింది. ఈ క్రమంలో వలంటీర్లు ఈ మూడు నెలలు తమ సేవలు అందించరాదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల సంఘం అయినా ఇందులో ఉన్న మతలబు ఏమిటి? వృద్దులకు అందుతున్న సదుపాయం రద్దు చేయడం వల్ల వారు పడే బాధలు ఏమిటి? అన్నవి ఆలోచించకుండా టీడీపీ ఏజెంట్ కోరిందే తడవుగా ఆదేశాలు ఇచ్చేసింది. నిజానికి మానవత్వం ఉన్నవారెవరూ ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదు. అసలు అలా ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేయకూడదు. ఈ ఆదేశాలు ఇవ్వడానికి ముందుగా ప్రభుత్వ అభిప్రాయాన్ని కూడా అడగవచ్చు కదా! ఇది ఎప్పటి నుంచో అమలు చేస్తున్న విధానం అయినా ఎన్నికల కమిషన్ వలంటీర్ల సేవలు అందకుండా చేసిందంటే రాజకీయ కుట్ర కూడా ఉండవచ్చన్న భావన కలుగుతుంది. వలంటీర్లు పెన్షనర్లను కలిసి డబ్బు ఇస్తేనే వైఎస్సార్సీపీకి ఓటు వేస్తారనుకుంటే, ఇప్పుడు మాత్రం వేయకుండా ఉంటారా? టీడీపీ కుట్ర చేసి పెన్షన్లు తమ ఇంటికి రాకుండా ఆపిందని వారు తెలుసుకోకుండా ఉంటారా? ఇప్పటికే తెలుసుకున్నారు కాబట్టి చంద్రబాబును వారు బండబూతులు తిడుతున్నారు. ఎవరైనా టీవీవారు దీని గురించి ప్రశ్నిస్తే టీడీపీపై విరుచుకుపడుతున్నారు. నడవలేని స్థితిలో ఉన్న తమను మళ్లీ ఆఫీస్‌ల చుట్టూ తిప్పుతారా అని నిలదీస్తున్నారు. దీంతో.. పరిస్థితి అర్ధం చేసుకున్న చంద్రబాబు నాయుడు వెంటనే యుటర్న్ తీసుకుని పెన్షన్ దారులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని కోరుతూ లేఖ రాశారు. ఆ రాసేదేదో ఎన్నికల సంఘానికి రాసి, వలంటీర్ల ద్వారానే పెన్షన్లు ఇళ్లకు పంపిణీ చేయాలని రాసి ఉంటే కాస్త గౌరవం అయినా మిగిలేది. కానీ అన్నిటిలోను డబుల్ స్టాండర్స్ పాటించే చంద్రబాబు ఇందులో కూడా ఆ ధోరణిలోనే వెళ్లారు. వలంటీర్లను గతంలో తిట్టింది ఆయనే. ఆయనకు తోడు పవన్ కల్యాణ్. మళ్లీ ఇద్దరూ యు టర్న్ తీసుకుని వలంటీర్లకు అనుకూలంగా మాట్లాడారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అంటూ ఒక బినామీ సంస్థను స్థాపించి వలంటీర్లకు, ఇతరత్రా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయించడం, కోర్టులలో, ఇతర వ్యవస్థలలో లిటిగేషన్ పెట్టించడం చేశారు. అందులో భాగంగానే ఈ వలంటీర్ల వ్యవస్థపై ఫిర్యాదులు అని చెప్పాలి. ఆ ఫిర్యాదుల ఫలితం తెలుగుదేశం మెడకే చుట్టుకుంటోందన్న విషయం తెలుసుకుని అంతే స్పీడ్‌గా రామోజీ, రాధాకృష్ణలు యుటర్న్ తీసుకుని చంద్రబాబును రక్షించడం కోసం కొత్త కథనాలు అల్లారు. వైఎస్సార్సీపీవారే పెన్షన్లను ఇళ్ల వద్ద ఇవ్వకుండా అడ్డుకున్నారని వీరు అడ్డగోలు కథనాలు రాశారు. వృద్దులు గ్రామ, వార్డు సచివాలయాలలో పెన్షన్ తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే, అమ్మో వారిని ఎండలో తిప్పుతారా అంటూ వారిపై ఏదో ప్రేమ ఉన్నట్లు నటిస్తూ బానర్ కథనాలు ఇచ్చేశారు. దీనిని బట్టే వారు ఎంత భయపడింది అర్దం అవుతుంది. తాము అతి తెలివితో వలంటీర్ల వ్యవస్థపై బురదచల్లి చంద్రబాబుకు ఏదో మేలు చేశామని వారు అనుకున్నారు. కానీ ఇప్పుడు అది రివర్స్ అయి టీడీపీకి ఉరితాడుగా మారడంతో మళ్లీ మాట మార్చి ప్రజలను ఏమార్చడానికి యత్నించారు. గ్రామ, వార్డు సచివాలయాలలో 1.35 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని, వారిని పెన్షనర్ల ఇళ్లకు పంపించి డబ్బు ఇప్పించవచ్చని ఈనాడు, ఆంధ్రజ్యోతి కలిసి కథనాలు వండాయి. బహుశా ఈ నాలుగేళ్లలో గ్రామ,వార్డు సచివాలయాలలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని రామోజీ, రాధాకృష్ణ అంగీకరించారు. 'చిత్రమేమిటంటే.. వలంటీర్లు పెన్షన్ దారుల ఇళ్లకు వెళ్లి డబ్బు ఇస్తే ఎన్నికలను ప్రభావితం చేసినట్లటా! అదే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వృద్దుల ఇళ్లకు వెళ్ళి డబ్బు ఇస్తే అది ఎన్నికలను ప్రభావితం చేయడం కాదట. ఇవేమి పిచ్చి రాతలు, ఈ సచివాలయాల ఉద్యోగులు సైతం వైఎస్ జగన్మోహన్రెడ్డి టైమ్‌లో వచ్చినవారే కదా! వీరు వెళ్లి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పెన్షన్ ఇచ్చింది అనికాక, చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిందని చెబుతారా? వలంటీర్లను నిలుపుదల చేయడంతో వృద్దులంతా టీడీపీని బండబూతులు తిడుతుండడంతో భయపడి రామోజీ, రాధాకృష్ణలు ఏమి చేయాలో దిక్కుతోచక ఇలాంటి కథనాలు రాసి వైఎస్సార్సీపీపై పడి ఏడ్చారు. పైగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బాధ్యతలు వేరుగా ఉంటాయి. ఒకవేళ వీరు కోరుకున్నట్లు వృద్దుల ఇళ్ల వద్దకు వీళ్లను పంపుతూ ఉత్తర్వులు ఇచ్చి ఉంటే అప్పుడు మళ్లీ ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి దానిని కూడా విమర్శిస్తూ డబ్బును వృద్దుల చేతికి ఇస్తున్నారని, ఇదంతా వైఎస్ జగన్మోహన్రెడ్డి కుట్ర అని రాసి ఉండేవి. గతంలో టీచర్లను స్కూళ్ల బాగు చేతకు సంబంధించిన విధులలో పెడితేనే, వారిని అలా వాడతారా? ఇలా వాడతారా? అంటూ ఇదే మీడియా నానా యాగి చేసింది. సచివాలయ ఉద్యోగులను మాత్రం ఇప్పటికిప్పుడు వారికి సంబంధం లేని డ్యూటికీ వేయాలట. అంతా రామోజీ ఇష్టం అన్నమాట! ఎన్నికల సంఘం పవిత్రతపైన బురద చల్లేలా వైఎస్సార్సీపీ ఏదో చేసింది అంటూ ఆ వ్యవస్థపై ఏదో తెలుగుదేశంకు అంత గొప్ప అభిప్రాయం ఉన్నట్లు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకోకపోతే, అదే సంస్థను ఈనాడు, ఆంధ్రజ్యోతి తెగ తిట్టిపోసేవి. జగన్మోహన్రెడ్డి వారిని మేనేజ్ చేసేశారని ఏకిపారేసేవారు. '2019 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముఖ్య అధికారి గోపాలకృష్ణ కార్యాలయానికి వెళ్లి ఎంత రచ్చ చేశారో గుర్తు లేదా?' అప్పుడు మాత్రం ఎన్నికల సంఘం పవిత్రమైనదని ఈనాడు రాయలేదే! బీజేపీతో పొత్తు పెట్టుకుందే ఎన్నికల కమిషన్‌ను కేంద్రం ద్వారా ప్రభావితం చేయడానికే అన్న సంగతి బహిరంగ రహస్యమే. ఎన్నికలు 2019లో తొలిదశలో ఏప్రిల్ పదకొండున ఎందుకు జరిగాయి. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టిన తర్వాత ఎన్నికలు మే పదమూడు వరకు ఎందుకు వెళ్లాయి? ఇందులో మేనేజ్మెంట్ లేదని ఎవరైనా అనుకుంటారా? అందులోను చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ వంటివారు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తారో తెలియదా! లేకుంటే వారికి కావల్సినట్లు ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఎలా ఇస్తుంది? కనీసం ఏపీ ప్రభుత్వ అభిప్రాయం అయినా తీసుకుందా? కేసు వేసిన నిమ్మగడ్డ రమేష్‌కు ఈ వ్యవహారంలో బాద్యత లేదట! ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి, దారుణమైన ఆదేశాలు తెప్పించిన రమేష్ ఉత్తముడట! ఎన్నికల కమిషన్ ఆదేశాలు పాటించిన ఏపీ ప్రభుత్వ అధికారులు చెడ్డవారట. వలంటీర్ల వ్యవస్తపై నీచమైన విమర్శలు చేస్తూ పలు కదనాలు రాసిన రామోజీ గొప్పవాడట. ఆ విమర్శలను సమర్దించిన చంద్రబాబు,పవన్‌లు గొప్ప నాయకులట. అంత గొప్పగా ఫీల్ అయితే వలంటీర్ల పై ఆంక్షలు పెట్టిన కొద్ది గంటలలోనే చంద్రబాబు కానీ, ఈ మీడియా సంస్థలు కానీ తమకు జరుగుతున్న నష్టాన్ని తెలుసుకుని వెంటనే ప్లేట్ ఫిరాయించేశారు. రామోజీ, రాధాకృష్ణలు తనకు ఎంత డామేజీ చేశారో చంద్రబాబుకు అర్దం అయ్యే ఉంటుంది. కానీ ఆయన నిస్సహాయుడిగా మిగిలారు. వారి చేతిలో ఒక బందీగా ఉండి, వారు చెప్పినట్లు ఆడే పరిస్థితికి చంద్రబాబు చేరుకున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసే తప్పుడు వార్తలు, అబద్దాలనే మహా ప్రసాదంగా భావించి చంద్రబాబు ప్రచారం చేస్తుంటారు. ఇప్పుడు గట్టి ఎదురుదెబ్బ తగిలేసరికి లబోదిబో అంటున్నారు. ఇంటింటికి పంపీణీ సులువేనని టీడీపీవారు కానీ, 'ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి కానీ కొత్త రాగం ఎందుకు అందుకున్నారో ప్రజలు అర్ధం చేసుకోలేరా? ఇంటింటికి పెన్షన్ ఇచ్చేటప్పుడు వలంటీర్లు అయితేనేమి? గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అయితేమి?' ఈ మాత్రం ఇంగితం లేకుండా వలంటీర్లపై విషం కక్కిన ఎల్లో మీడియా, తాము చేసిన దిక్కుమాలిన చర్యవల్ల, తాము జాకీలేసి లేపుతున్న తెలుగుదేశంకు కోలుకోలేని దెబ్బ తగిలిందని అర్ధం అయిందని అనుకోవాలి. కొన్నిచోట్ల వలంటీర్లు టీడీపీ తీరుకు నిరసనగా రాజీనామా చేస్తున్నారు. ఒక్క మచిలీపట్నంలోనే 1227 మంది వలంటీర్లు రాజీనామా చేశారట. ఇదంతా టీడీపీకి తల బొప్పి కట్టించేదే. అసలే చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లు ప్రచార సభలలో ఏమి మాట్లాడుతున్నారో అర్ధం కాక పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. టిప్పర్ డ్రైవర్‌కు వైఎస్ జగన్మోహన్రెడ్డి టిక్కెట్ ఇస్తారా అని చంద్రబాబు అన్న ఫలితంగా లక్షల సంఖ్యలో ఉన్న డ్రైవర్లకు ఆగ్రహం తెప్పించారు. ఇప్పుడు వృద్దాప్య పెన్షన్లు ఇళ్లకు ఇవ్వకుండా ఆపి పాపం మూటకట్టుకోవడంతో అరవై లక్షలమంది టీడీపీకి, చంద్రబాబుకు శాపనార్ధాలు పెడుతున్నారు. దీని అంతటికి కారణం ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి వారేనని కూడా ప్రజలకు తెలిసిపోయింది. చంద్రబాబుకు కూడా అవగతమైంది కానీ, ఆయన ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. దెబ్బమీద దెబ్బపడుతుండడంతో ఏపీలో టీడీపీ గెలవడం అసాద్యమన్న భావన సర్వత్రా ఏర్పడడంతో దానిని కవర్ చేయడానికి ఎల్లో మీడియా రకరకాల విన్యాసాలు, యుటర్న్‌లు చేస్తోంది. టీడీపీని ఆకాశానికి జాకీలతో ఎత్తాలని ప్లాన్ చేసిన వారిద్దరూ చివరికి పెద్ద గోతిలో పడేశారు. తెలుగుదేశం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆ గోయినుంచి పైకి లేవడం అంత తేలిక కాదు. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
Ramoji, RK: సైకోల నుంచి సైతాన్లుగా ప్రమోషన్!
రోజు-రోజుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియాలు దిగజారిపోయి పాఠకులను హింసిస్తున్నాయి. రాజకీయ పరిభాషలో చెప్పాలంటే ఈ రెండు సంస్థల యజమానులు రామోజీరావు, రాధాకృష్ణలు సైకోల నుంచి సైతాన్ల స్థాయికి ప్రమోషన్ పొందినట్లు అనిపిస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రడ్డిపై విద్వేషంతో ఏపీపై పగబట్టి రాస్తున్న వార్తలు దారుణంగా ఉంటున్నాయి. ఈ శాసనసభ ఎన్నికల వరకు ఈ బాధ తప్పదని తెలిసినా, మరీ నీచంగా మారడం అత్యంత శోచనీయం అని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ఈనాడు పచ్చి మోసపూరిత వార్తలు రాసింది. రామోజీరావు ఈ విధానం కరెక్టు అని భావిస్తే దానినే ధైర్యంగా రాసి బీజేపీని తీవ్రంగా విమర్శించాలి. కాని అంత ధైర్యం లేదు. పైగా వారు ఈయనకు పద్మ విభూషణ్ బిరుదు కూడా ఇచ్చారు కదా! దానికి సదా కృతజ్ఞతగా లొంగి ఉండాలి కదా! బీజేపీ తనకు ఎన్నికల నిధులు ఇవ్వడం లేదనుకున్నవారిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఆదాయపన్ను శాఖ వంటివాటిని ప్రయోగిస్తోందన్న ఆరోపణ వస్తోంది. అది నిజమా? కాదా? కొన్ని ఆంగ్ల పత్రికలలో ఏ ఏ కంపెనీలపై దాడులు జరిగాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు ఏ కంపెనీలు బాండ్లు కొనుగోలు చేశాయి. వాటిలో అత్యధిక భాగం బీజేపీకే దక్కాయా? లేదా? అన్నది ఆ వార్తల సారాంశం. బీజేపీకి మొత్తం విరాళాలలో ఏభై శాతం నిధులు దక్కితే ఆ తర్వాత టీఎంసీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎమ్‌కే వంటి పార్టీలు ఉన్నాయి. తదుపరి వైసీపీ, టీడీపీ ఉన్నాయి. ఈ విరాళాలపై విశ్లేషిస్తే బీజేపీకి నిదులు ఇచ్చిన కంపెనీలు ఏవి? స్వచ్చందంగా ఇచ్చాయా? లేక భయపడి ఇచ్చాయా? అన్న అంశాలపై పరిశోధన చేయవచ్చు. కొన్ని ఆంగ్ల పత్రికలు ఈ విషయంలో వివరణాత్మక స్టోరీలు ఇచ్చాయి. ఈనాడు మీడియాకు, దాని అదినేత రామోజీరావుకు దేశం అంతా ఎటు పోయినా ఫర్వాలేదు. ఎవరికి ఎన్నివేల కోట్ల రూపాయల నిధులు వచ్చినా ఇబ్బంది లేదు.. కాని ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ ఆర్ కాంగ్రెస్‌కు నిదులు వస్తే మాత్రం ఏదో ఒక చెత్తరాసి బురదచల్లుతారు. ఈ కధనంలో అవేవో కంపెనీలకు భూములు ఇచ్చి ఫేవర్ చేసినందుకే అవి విరాళాలు ఇచ్చాయని రాశారు. వైసీపీకి అందుకే ఇచ్చారని అనుకుందాం. మరి తెలుగుదేశంకు ఎందుకు విరాళాలు ఇచ్చారు. అధికారంలో ఉన్న వైసీపీకి 499 కోట్లు విలువైన బాండ్లు వస్తే, తెలుగుదేశంకు 320 కోట్ల మేర బాండ్లు వచ్చాయి. అంటే ఆయాకంపెనీలను తెలుగుదేశం బ్లాక్ మెయిల్ చేసి ఆ డబ్బును సంపాదించిందా? తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా తెలుగు రాష్ట్రాలలోని కంపెనీలే ఎందుకు వచ్చాయి? చంద్రబాబు అంటే భయపడి ఇచ్చాయా? లేక ఆయన బెదిరించి సంపాదించారా? ఉదాహరణకు షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిది అని పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేశారు కదా? వారు ఎక్కడ ఏ పరిశ్రమ పెడుతున్నా అటు తెలుగుదేశం కాని, ఇటు ఈనాడు రామోజీరావు కాని దానిని అడ్డుకోవడానికి నానా ప్రయత్నాలు చేసేవారు కదా! ఎంతో విషం చిమ్మేవారు కదా! అదే కంపెనీ నుంచి తెలుగుదేశం పార్టీకి నలభై కోట్ల విరాళం ఎలా అందింది. నిజంగానే అది వైఎస్సార్సీపీ సంబందించిన వారిది అనుకుంటే టీడీపీ తిరస్కరించి ఉండవచ్చుకదా! అంటే బ్లాక్ మెయిల్ చేసి ఆ కంపెనీ నుంచి విరాళం రాగానే టీడీపీ నోరు మూసేసుకుందా? బీజేపీకి రూ.8,250 కోట్ల బాండ్లు, కాంగ్రెస్‌కు రూ.1,951 కోట్లు, టీఎమ్‌సీకి రూ.1,716 కోట్లు, బీజేడీకి రూ.1,019 కోట్లు, డీఎంకేకి రూ.656 కోట్ల విలువైన బాండ్లు వచ్చాయి. బీఆర్ఎస్కు రూ.1,408 కోట్ల బాండ్లు లబించాయి. చివరికి ఒక్క అసెబ్లీ సీటు మాత్రమే గెలుచుకున్న జనసేనకు కూడా 21 కోట్లు వచ్చాయని లెక్కలు చెబుతున్నాయి కదా! వీరందరికి ఏ రకంగా వచ్చాయో ఎందుకు విశ్లేషించలేదో రామోజీ చెప్పగలరా! టైమ్స్ ఆఫ్ ఇండియా చేసిన ఒక విశ్లేషణ ప్రకారం డీఎమ్‌కే , వైఎస్ ఆర్ కాంగ్రెస్‌లకు వాటికి రావాల్సిన వాటా రాలేదని వెల్లడించింది. వైఎస్సార్సీపీ, డీఎంకేల కన్నా చిన్న పార్టీ అయిన బీఆర్ఎస్కు రెండు, మూడు రెట్ల నిదులు ఎందుకు వక్కువ వచ్చాయి? వైసీపీకి 23 మంది లోక్ సభ, తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా రావల్సినంత రాలేదన్నది దీని అర్ధం. అదే టైమ్‌లో కేవలం 23 మంది ఎమ్మెల్యేలు, 3 లోక్ సభ , ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్న టీడీపీకి 320 కోట్ల బాండ్లు ఎలా దక్కాయో చెప్పాలి కదా! కొన్ని కంపెనీలపై ఐటీ, ఈడీ దాడులు జరిగిన తర్వాతే అవి బీజేపీకి బాండ్ల రూపంలో నిదులు సమకూర్చిన విషయాన్ని కొన్ని ఆంగ్ల పత్రికలు సమగ్రంగా ఇచ్చాయి. ఇవన్ని పక్కనబెట్టి రామోజీరావు వైసీపీపైనే పడి ఎందుకు ఏడుస్తున్నారు? విశేషం ఏమిటంటే ఒకపక్క వైఎస్ జగన్మోహన్రడ్డి అధికారంలోకి వచ్చాక పరిశ్రమలను తరిమేశారని పదే, పదే రాస్తుంటారు కదా? అదంతా అబద్దమని శనివారం నాడు రాసిన పత్రికలో రాసిన ఈ బాండ్ల కధనంతో తేలిపోయింది. వైసీపీకి 96 కంపెనీల నుంచి విరాళాలు అందితే అందులో 26 విద్యుత్ కంపెనీలు అని ఈ పత్రిక రాసింది. అంటే కొత్తగా కేవలం విద్యుత్ రంగంలోనే 26 కంపెనీలు వస్తున్నట్లు ఒప్పుకున్నట్లే కదా? వారు విరాళం ఇచ్చారంటే రాష్ట్రంలో పరిశ్రమలు పెడుతున్నట్లే కదా! 30826 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి, ముఖ్యంగా సౌర, పవన, పంప్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చారని తెలిపింది. వీటి స్థాపనకు లక్ష ఎకరాలు అవసరమని అంచనా. ఈ ప్రాజెక్టుల వల్ల ఏపీకి ఉపయోగం లేదని మరో దిక్కుమాలిన రాత రాసింది. అదే వార్తలో మెగావాట్‌కు లక్ష రూపాయల చొప్పున గ్రీన్ టాక్స్ వస్తుందని తెలిపింది. విషయం ఏమిటంటే ఈ ప్రాజెక్టులు దేనికి కూడా భూమిని ప్రభుత్వం కేటాయించలేదు. రైతుల నుంచి ఈ పరిశ్రమలవారు లీజుకు తీసుకుని ఏటా ఏకరాకు ముప్పైవేల రూపాయల చొప్పున రైతులకు చెల్లించాలని ఆదేశించింది. దీనివల్ల రాష్ట్రంలో, ప్రత్యేకించి రాయలసీమలో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇలా రైతులకు మేలు చేస్తే, అదేదో తప్పు అయినట్లు ఈ పత్రిక దరిద్రపు గొట్టు వార్త రాసింది. ఈ భూములు ఇచ్చారు కనుక విరాళాలు పొందిందని నీచమైన విశ్లేషణ చేసింది. గ్రీన్కో కంపెనీకి 1500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ఇస్తే, ఆ కంపెనీ వైసీపీకి పది కోట్లు ఇచ్చిందట. ఏమన్నా మతి ఉండి ఈనాడు రామోజీ ఇలా రాస్తారా? కొన్ని వేల కోట్ల కంపెనీ కేవలం పది కోట్లు ఇస్తే అది కూడా ఫేవర్ చేసినట్లా? ఇక మెఘా కంపెనీ ఇచ్చిన 37 కోట్ల మీద కూడా ఇలాంటి చెత్తనే రాశారు. ఆ కంపెనీ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లకు కలిపి సుమారు 900 కోట్లు ఇచ్చింది. అదే వైసీపీకి 37 కోట్లే. కాని టీడీపీకి 25 కోట్లు ఇచ్చింది. దీనిపై ఈనాడు రాసిన వార్త చదివితే ఎంత బుద్ది, జ్ఞానం లేకుండా ఈ పత్రిక విషం చిమ్ముతోందా అనిపిస్తుంది. సీలేరు, పోలవరం హైడల్ ప్రాజెక్టులతో పాటు తాజాగా 12 వేల కోట్ల రూపాయల విలువైన ఎగువ సీలేరు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టును ఇచ్చినందుకే ఈ విరాళం ఇచ్చిందని రాశారు. మరి తెలుగుదేశం కూడా మరి పాతిక కోట్లు ఎందుకు ఇచ్చింది రాయలేదు. ఏమీ లేని జనసేనకు 21 కోట్లు ఎలా వచ్చాయని ఈ పత్రిక ప్రశ్నించలేదు. తెలుగుదేశంకు భారత్ బయోటెక్ పది కోట్లు, పశ్చిమ యుపి పవర్ ఇరవై కోట్లు, నాట్కో పద్నాలుగు కోట్లు, రెడ్డి లాబ్స్ పదమూడు కోట్లు ఎందుకు ఇచ్చాయో విశ్లేషించాలి కదా! అధికారం లేదు కనుక ప్రతిపక్షంగా ఉండి టీడీపీ వారిని బ్లాక్ మెయిల్ చేసిందని రామోజీ ఎందుకు చెప్పడం లేదు? ఇక టీడీపీ నుంచి బీజేపీకి వెళ్లిన రాజ్యసభ సబ్యుడు సీఎమ్.రమేష్ కాంగ్రెస్, జేడీఎన్లకు కలిపి 40 కోట్లు ఎలా ఇచ్చారు? టీడీపీకి ఐదు కోట్లు ఎలా ఇచ్చారు. అంటే ఈ పార్టీలతో కూడా సంబంధ బాంధవ్యాలు మెయిటెన్ చేస్తున్నట్లే కదా! రామోజీ వికృత రాతలకు, పక్షపాత కధనాలకు ఇదో పెద్ద ఉదాహరణగా తీసుకోవాలి. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
అసత్య కథనాలతో జగన్ పాలనపై విషం కక్కుతోన్న రామోజీ, రాధాకృష్ణ
-
అయ్.. పాయె! ఎన్నికలకు ముందే బాబు ఓటమి! సాక్ష్యం ఇదే..
'2024 ఎన్నికల నోటిఫికేషనింకా రాకముందే చంద్రబాబు ఓటమి ఖరారైపోయింది!! అదెలా? ఎవరన్నారు? ఎవరో అనడం కాదు. చంద్రబాబు చేతికింది రెండు న్యూస్ పేపర్లు రాసింది అదే. బాబు పనైపోయిందని! ‘‘ఏడాదిలో 30 లక్షల ఓట్లు తొలగించేశారు’’ – అని ‘ఛీనాడు’ రాసింది. ‘‘జడ్జికి వజ్రాలు పొదిగిన బంగారు వాచ్’’ – అని బాధాకృష్ణ రాశాడు. వీటికి చంద్రబాబుకు సంబంధమేంటీ? మరి చంద్రబాబు ఓటమి ఖాయం అవడం ఏమిటి? సమాధానం సింపుల్.' చంద్రబాబు ఓటమి ఖాయం అని డిసైడ్ చేసుకున్నప్పుడే ‘ఛీమోజీ’ గానీ, ‘బాధాకృష్ణ’గాని ఇలాంటి కుళ్లు, కక్కుళ్ల వార్తలు మొదలుపెడతారు. 2019 ఎన్నికలకు ముందు కూడా వీళ్లద్దరు చేసింది ఇదే. ఆనాడు ఛీమోజీ తప్పుడు వార్తలు రాస్తే, బాధాకృష్ణ చిల్లర వార్తలు రాశాడు. చంద్రబాబును లేపడానికి వీళ్లు ఎన్ని కట్టెలు పెట్టి, ఎన్ని కట్టుకథలు అల్లినా చివరికి జనం జగన్మోహన్రెడ్డికే పట్టం కట్టటం, చంద్రబాబు పార్టీకి పటం కట్టి పూలదండ వేయటం ఈ కళ్లతోనే చూశాం కదా. ఏపీ సీఎంగా జగన్మోహన్రెడ్డి 2019 మే 30న ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజు నుంచి, ఇప్పటి వరకు.. గత ఐదేళ్లుగా జగన్మోహన్రెడ్డిపై తప్పుడు రాతలు, చిల్లర కథనాలు కక్కుతున్న ఛీమోజీ, బాధాకృష్ణ.. ఇప్పుడు మరింతగా దిగజారి దగుల్బాజీ రాతలు రాయడం ప్రారంభించారంటే.. చంద్రబాబును ఎంత లేపి ప్రయోజనం లేదని వాళ్లకు లేటెస్టుగా ఉప్పో, టిప్పో అందిందని అర్థం. అయినా ‘దింపుడుకల్లం’ ఆశ ఎక్కడికిపోతుంది. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ప్రతిష్టను దెబ్బతీయడం ద్వారా చంద్రబాబుకు వెంటిలేటర్ పై ఊపిరి ఎక్కించే వృధా ప్రయత్నాలు ప్రారంభించారు ఛీమోజీ, బాధాకృష్ణ. ‘బాధాకృష్ణ’వి చెల్లని చిల్లర కథనాలు. వాటిని పట్టించుకునే పని లేదు. ‘ఛీమోజీ’ కల్పనలు చిరిగిపోయిన కాగితాలు. అవీ చెలామణి అయ్యేవి కావు. కానీ ఆ చిరుగులకు సెలో టేప్ అంటించి ప్రజల్లోకి తోసేశాలని ఛీమోజీ చూస్తున్నారు కాబట్టి.. ఆయన ఇవాళ రాసిన 'ఓట్ల తొలగింపు’ ఏడుపుగొట్టు వ్యథపై మనం మాట్లాడుకోవలసిందే. చంద్రబాబు ‘బోగస్’ బతుకు ఏంటో కూడా తెలుసుకోవలసిందే. చంద్రబాబు పెద్ద బ్లఫ్ మాస్టర్. తను ఓడిపోతున్నాని తెలిస్తే, లేదా తను గెలవలేనని తెలిస్తే ఎన్నికలకు ముందు నకిలీ ఓట్లతో తన బలం పెంచేసుకుంటారు. అందులో ఆయన ఎక్స్పర్ట్. అందుకు సాక్ష్యాధారాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పాత ఫైళ్లలో దొరుకుతాయి. ఓటమి ఖాయం అని ఇప్పుడు తేలిపోయినట్లే.. (కొత్త మలుపు తిరిగిన ఛీమోజీ, బాధాకృష్ణల దిగజారుడు కథనాలను బట్టి), 2004 ఎన్నికలకు ముందూ.. చంద్రబాబు ఓడిపోయేది ఖాయం అని సర్వేలు తేల్చేశాయి. వెంటనే చంద్రబాబు ‘ఓట్ల జోడింపు’ వ్యూహం మొదలైంది. అంటే బోగస్ ఓటర్లను చేర్చడం! ఆ చేర్పులపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. ప్రదర్శనలు జరిపాయి. ‘‘బాబు ప్రకటించిన ప్రోగ్రెస్ రిపోర్టులే కాదు, ఆయన హయాంలో స్టాంపులు, మెడికల్ కాలేజీలు, ఆఖరికి ఓట్ల జాబితాలు కూడా నకిలీవే.. ’’ అని ప్రతిపక్షనేత వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఎద్దేవా చేశారు. ‘‘అధికారాన్ని అంటిపెట్టుకుని ఉన్న తెలుగుదేశం పార్టీ, గద్దె మీద కొనసాగడానికి ఎంతకైనా దిగజారేందుకు సిద్ధంగా ఉంది..’’ అని నాటి టీఆర్ఎస్ నేత కేసీఆర్.. బోగస్ ఓట్లపై చంద్రబాబును తూర్పారా పట్టారు. ‘‘ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని గాడి తప్పించింది. ఎన్నికలు జరపడానికి ముందే ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది..’’ అని బోగస్ ఓట్ల పై నాటి రాష్ట్ర సీపీఐ ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. చంద్రబాబుపై వాళ్ల విమర్శలను కానీ, ఎద్దేవాలను కానీ, హెచ్చరికలను ఛీనాడు లోపలి పేజీలలో నామ మాత్రంగా తప్ప ప్రముఖంగా ఎక్కడా ప్రచురించలేదు. ఎందుకంటే ‘తమవాడు’ మళ్లీ సీఎం అవడం కావాలి ఛీమోజీరావుకు. ప్రతిపక్షాలన్నీ కలసికట్టుగా ఆరోపణ చేస్తుంటే కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు మీద డౌట్ వచ్చి, రాష్టంలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరపటంతో చంద్రబాబు దొంగ ఓట్ల వ్యవహారం బయటపడింది! ఓటు నమోదు కోసం ఎన్నికల కమిషన్‌కు అందిన 53,95,550 ల దరఖాస్తులలో 19,40,387 దరఖాస్తులు నకిలీవని తెలిసి, తెల్లబోయి, కమిషన్ వాటిని తొలగించింది. అంతేకాదు, పాత జాబితాలోని 1.21 కోట్ల ఓటర్ల నుంచి 55,32,713 మంది ఓటర్ల పేర్లను తొలగించింది. పాత, కొత్త బోగస్ ఓటర్ల సంఖ్య 74.13 లక్షలకు చేరుకున్నట్లు ఎన్నికల సంఘం గుర్తించి తొలగించింది! అప్పుడు తొలగించినట్లే కమిషన్ ఇప్పుడూ తొలగించింది. అందుకే ఛీనాడు పెడబొబ్బలు. బాధాకృష్ణ ‘వజ్రాల వాచీ’ అంటూ బూడిద రాతలు. 2003లో చంద్రబాబు చేసిన బోగస్ ఓట్ల స్కామ్ చిన్న సంగతి కాదు. అందుకే ఎన్నికల కమిషన్ కూడా ఆ లెవల్లో బోగస్ ఓట్ల తొలగింపు ప్రక్షాళనను చేపట్టాల్సి వచ్చింది. కమిషన్‌కు ఎంతో శ్రమ, ఖర్చు అయ్యాక 2004 జనవరి మూడో వారానికి జిల్లా కలెక్టర్లు పూర్తిగా బోగస్ ఓట్లను తొలగించగలిగారు. బోగస్ ఓటర్లకు కారణమైన ఐదుగురు మండల రెవెన్యూ అధికారుల మీద చర్యలకు కమిషన్ సిఫారసు చేసింది. ఓటర్ల జాబితాలో అవకతవకలేమీ లేవని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదట బుకాయించినప్పటికీ కమిషన్ దర్యాప్తులో బోగస్ ఓట్ల సంఖ్య 75 లక్షలకు పైగా ఉన్నట్లు తేలడంతో ఆయనేమీ మాట్లాడలేకపోయారు. ఆయనే కాదు.. ‘ఛీమోజీ’ కూడా కుక్కిన పేనులా ఉండిపోయారు. ఇప్పుడేమో.. 30 లక్షల ఓట్లు తొలగించారని గుండెలు బాదుకుంటూ తీరూతెన్నూ లేని ఆంబోతు కథనాలు అచ్చోసి వదులుతున్నారు. ఇంతకీ ఛీమోజీ ఏమిటంటాడూ.. తటస్థులు, ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు తప్పుడు వివరాలతో వై.ఎస్.ఆర్.సీపీ ఫామ్–7 దరఖాస్తు చేసిందట! కమిషన్ అంత గుడ్డిగా తొలగిస్తుందా? ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డితో పాటుగా, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఆడిపోసుకోడానికి ఛీమోజీ అండ్ చంద్రబాబు తయారైనట్లే ఉంది. వారికి వంతగా బాధాకృష్ణ!! (అన్నట్లూ.. ‘అపద్ధర్మ ముఖ్యమంత్రి’ అనే మాట బాబుగారికి నచ్చదు. ఆ మాటను తీసేయించడానికి రాజ్యాంగాన్నే మార్పించే ఆలోచన కూడా 2003లో చేశారు!! ఇవి చదవండి: అజ్ఞాతవాసిగా నారా లోకేష్? -
TS: తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకోవడం కాదు.. ప్రజలివ్వడమే మేలు!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నెల రోజుల పాలన సంతృప్తి ఇచ్చిందని చెప్పారు. సంతోషమే. కాకలు తీరిన యోధుడుగా పేరొందిన బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించి, ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన రేవంత్ పాలన నెలరోజులు సాఫీగానే సాగిపోవడం వరకు ఓకే.కాని తన పాలనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకోవడం కాకుండా ప్రజల నుంచి పొందగలిగితే ఆయనకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. మీడియా లో రేవంత్ సంతృప్తి ప్రకటించడం తప్పు కాదు. తానే ఏదైనా ఆడ్వర్స్ వ్యాఖ్య చేస్తే దాని ప్రభావం ప్రభుత్వంపైన, మంత్రులపైన, ఎమ్మెల్యేలపైన ఉంటుంది.ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న అలాగే చెబుతారు. కాని ఒక్కసారి మొత్తం పరిస్తితిని సమీక్షిస్తే ప్రభుత్వం వచ్చిన కొత్త కనుక ఎవరికి వారు సర్దుకుపోతున్నట్లుగా అనిపిస్తుంది.ఎవరైనా కామెంట్ చేసినా వారిపై ఎదురు విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చి నెల రోజులే అయినా విమర్శలు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.మంత్రులు కాని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాని ప్రస్తుతానికి ఒకింత అయోమయ పరిస్థితిలో ఉన్నారనిపిస్తుంది. కెసిఆర్ ప్రభుత్వాన్ని ఓడించగలిగారు కాని, తాము ఈ ప్రభుత్వాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలా అన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నట్లుగా ఉంది. ఆయా నిర్ణయాలను మార్చుకోవలసి రావడం, ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలను అమలు చేయడం ఎలా అన్నది అర్ధం కాక తలపట్టుకుంటున్న తీరు కనిపిస్తూనే ఉంది. ఇవి ఒక ఎత్తు అయితే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి ముఖ్యమంత్రి పదవిపై చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించేవి. మల్లు భట్టి నేరుగా అనకపోయినా, ఆయన మనసులోని మాటను భార్య బయటపెట్టారని అనుకోవచ్చు. మరో వైపు ఇంకో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనకు క్యాబినెట్ లో బాగా ప్రాదాన్యం ఉందని చెప్పడంపై కూడా కాంగ్రెస్‌లో చెవులు కొరుక్కుంటారు. భవిష్యత్తులో ఇలాంటి ఘట్టాలు మరెన్నో వచ్చే అవకాశం ఉంది. కర్నాటకలో సైతం పదవుల పంచాయతీ తెగడం లేదు. తెలంగాణ కూడా అందుకు భిన్నంగా ఉండకపోవచ్చు. ఈ అంశాన్ని పక్కనబెడితే రేవంత్‌రెడ్డి కొన్ని తప్పులు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. రేవంత్ దురుద్దేశంతో పొరపాట్లు చేశారని చెప్పకపోయినా, ఆయన కొన్ని నిర్ణయాలలో కొంత అనుభవ రాహిత్యం తెలుస్తుంది. ఉదాహరణకు ఫార్మాసిటీ రద్దు ప్రకటన ప్రభుత్వానికి నష్టం చేసిందన్న అభిప్రాయం ఉంది.దాంతో సర్దుబాటు ధోరణికి వెళ్లి పార్మాసిటీని ఏదో విభజిస్తామని,ఇంకేదో చేస్తామని చెప్పినా, దానిలో స్పష్టత లేదు. ఫార్మాసిటీ ఆధారంగా జరిగిన రియల్ ఎస్టేట్ లావాదేవీలు దెబ్బతిన్నాయన్న భావన ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముందే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మందగించింది. ఈ ప్రభుత్వం వచ్చాక అది ఇంకా మెరుగు కాలేదు. కొద్ది రోజుల క్రితం కూడా మీడియాలో వచ్చిన కధనాలు చూస్తే వేలాది అపార్టుమెంట్ల అమ్మకాల కోసం ఎదురు చూస్తున్నాయి. భూముల క్రయ,విక్రయాల లావాదేవీలు ఆశించినంతగా పుంజుకోలేదు.గత ప్రభుత్వ టైమ్ లో అట్టహాసంగా ప్రచారం పొందిన ఎఫ్ 1 కార్ రేసింగ్ ఒప్పందాన్ని రద్దు చేయడం , ఆ సంస్థను తిరిగి డబ్బు చెల్లించాలని నోటీసు ఇవ్వడం ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది చూడాల్సి ఉంది. రేవంత్ పై దాడి చేసే మీడియా లేకపోయింది కాబట్టి సరిపోయింది కాని, ఈపాటికి గందరగోళం సృష్టించి ఉండేవి. ఉదాహరణకు ఎపిలో ఇలాంటి నిర్ణయాలు ఏవి జరిగినా ఈనాడు, ఆంద్రజ్యోతి తదితర ఎల్లో మీడియా రచ్చ,రచ్చ చేసి ఉండేవి. తాజాగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని సమాచారం వచ్చింది. దీని పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరం. గతంలో జగన్ ప్రభుత్వం ఎపిలో పిపిఎల సమీక్ష చేయాలని నిర్ణయం తీసుకుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయనకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా ఎంత రభస చేశాయో గమనిస్తే, ప్రస్తుతం తెలంగాణలో రేవంత్‌కు అలాంటి ఇబ్బందులు లేవని అర్ధం చేసుకోవచ్చు. దానికి కారణం ఈనాడు రామోజీరావుకు తెలంగాణలో ఆస్తులు అధికంగా ఉండడం, తాను భుజాన వేసుకుని తిరిగే తెలుగుదేశం పార్టీ కూడా రేవంత్‌కు పరోక్షంగా మద్దతు ఇస్తుండడంతో ఆయన నోరు మెదపడం లేదు. ఇక ఆంద్రజ్యోతి రాదాకృష్ణ అయితే ప్రస్తుతానికి రేవంత్ ప్రభుత్వాన్ని తెగ పొగిడేస్తున్నారు. దీనికి కూడా ఒక కధ లేకపోలేదు. మధ్యలో కొద్దిరోజులు రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావాలని కొన్ని కదనాలు ఇచ్చారట.దాంతో రేవంత్ దిగి వచ్చి రాధాకృష్ణ కోరినట్లు వ్యవహరించారన్న అభిప్రాయం వ్యాప్లిలోకి వచ్చింది. ముఖ్యంగా ఏ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా , ఆంధ్రజ్యోతికి మాత్రం ఇవ్వక తప్పలేదు.దానికి కారణం రాదాకృష్ణ బ్లాక్ మెయిలింగేనని రాజకీయవర్గాలలో ప్రచారం అయింది. పైగా రేవంత్‌ను ముఖ్యమంత్రిగా కాకుండా, అదేదో తన అదీనంలో ఉన్న వ్యక్తి మాదిరి ఆయన ఇంటర్వ్యూ చేశారని పలువురు వ్యాఖ్యానించారు. రాధాకృష్ణ ప్రవర్తన, బాడీ లాంగ్వేజ్, వ్యవహార శైలి అంత అహంకారపూరితంగా ఉన్నాయని అంటున్నారు. రేవంత్ వీటిని భరించడమే కాకుండా, రాధాకృష్ణ ట్రాప్‌లో పడి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని పరోక్షంగా కించపరుస్తున్నట్లుగా మాట్లాడారని సోషల్ మీడియాలో విస్తారంగా ప్రచారం అయింది.ప్రత్యేకించి ఎమ్మెల్యేల ఫిరాయింపులు, కొనుగోళ్ల లావాదేవీలు మొదలైనవాటికి సంబందించి అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తూ ప్రకృతి జవాబు ఇచ్చిందన్నట్లుగా వ్యాఖ్యానించడం నిజంగానే అభ్యంతరకరం అని చెప్పకతప్పదు. నిజానికి ఏపాటి కొద్ది అనుభవం ఉన్న జర్నలిస్టు అయినా ఒక ప్రశ్న కచ్చితంగా వేసి ఉండేవారు.రేవంత్ కూడా గతంలో ఒక నామినెటేడ్ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో పట్టుబడిన సంగతిని గుర్తు చేసేవారు.ఆ ప్రశ్న వేయకుండా వైఎస్ ఆర్ ను కించపరిచేలా రాధాకృష్ణ ప్రశ్నించడం, దానికి రేవంత్ సమర్ధించడం బాగున్నట్లు అనిపించదు.అయినా ప్రస్తుతం రేవంత్ నిస్సహాయుడని అనుకోవాలి. ఇదే రేవంత్ ఎన్నికల ప్రచార సమయంలో వైఎస్ ఆర్ ను పొగిడిన ఘట్టాలు మరచిపోయి మాట్లాడినట్లు అనిపిస్తుంది.ఎపి ముఖ్యమంత్రి జగన్ పట్ల కూడా అనుచిత వ్యాఖ్యలను రాధాకృష్ణ చేయించారు. జగన్ పోన్ చేసి అభినందించలేదని రాధాకృష్ణ అన్నప్పుడు అలా ఎందుకు! ఎక్స్ లో శుభాకాంక్షలు తెలిపారు కదా అని అనిఉండాల్సింది.అలాకాకుండా భిన్నంగా మాట్లాడడం అంత సరికాదనిపించింది. పైగా ఇదే రాధాకృష్ణ గతంలో జగన్ పోన్ చేస్తే రేవంత్ పోన్ ఎత్తలేదని, అదేదో గొప్ప విషయంగా రాశారు. రేవంత్‌ను రాదాకృష్ణే నడిపిస్తున్నారన్న భావన ప్రబలితే అది ఆయనకే నష్టం అని చెప్పాలి. ప్రజావాణి, ప్రజాపాలన వంటి విషయాలలో ప్రభుత్వానికి అంత మంచి మార్కులేమీ రాలేదు. ఆర్టిసి బస్ లలో మహిళలకు ఉచిత ప్రయాణం వరకు కాస్త పాజిటివ్ గా ఉన్నా దాని దుష్పరిణామాల ప్రభావం ఎక్కువగా కనిపించేలా ఉంది.ప్రజా పాలన పేరుతో సంబంధిత ఆరు గ్యారంటీల స్కీముల కోసం తెలంగాణ ప్రజలు లక్షల సంఖ్యలో రోడ్లపై క్యూ కట్టవలసి రావడం, ఆ దరఖాస్తులు ఒక చోట రోడ్లపై కనిపించడం కూడా అప్రతిష్టే అయింది.ఇక్కడే ఎపి తో పోల్చుకుని తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. రైతు భరోసా కింద గత నెల తొమ్మిదిన వేస్తామన్న పదిహేనువేల రూపాయలు రైతుల ఖాతాలలో పడకపోవడం అసంతృఫ్తికి దారి తీసింది.ఇళ్లకు ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్లను 500 రూపాయలకే ఇవ్వడం వంటివి ఇంకా మొదలు కాలేదు. ఇవన్ని ఒక రూపానికి వచ్చి ఎప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం సర్దుకుంటుందో ఎవరూ చెప్పలేరు. - కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడమీ చైర్మన్. -
దొంగ ఓట్లతో గెలవాల్సిన అవసరం మాకు లేదు: అంబటి రాంబాబు
-
వామ్మో ‘ఎల్లో' వైరస్.. తస్మాత్ జాగ్రత్త!
శాసనసభ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో ఈనాడు రామోజీరావు దగ్గర సలహాలు తీసుకోవాలి కాబోలు. వైఎస్సార్సీపీ రెండో జాబితాలో చేసిన మార్పులు, చేర్పులపై ఈనాడు ఒక చెత్త కథనాన్ని వండింది. ✍️ఇన్ చార్జీల నియామకంపై పద్దతి ప్రకారం సమీక్షిస్తే తప్పుకాదు. కాని నీచమైన రీతిలో ప్రతిదానిని తప్పుపడుతూ ఒకసారి, ఒకదానికిఒకటి విరుద్దంగా మరోసారి కథనాలు ఇస్తున్న తీరు చూస్తే, వీరు పత్రికలు నడపడం కంటే తెలుగుదేశం కరపత్రిక నడపడం బెటర్ అని చెప్పవచ్చు. వైసీపీ సీట్ల మార్పిడిలో బడుగు, బలహీనవర్గాలే బలి అని ఒక తప్పుడు వార్తను ఈనాడు పత్రిక అచ్చేసింది. ఈ వార్త చదివితే నిజంగానే ఈనాడు అచ్చోసిన ఆంబోతు మాదిరి తయారై పాఠకులను బెంబేలెత్తిస్తోందని అర్ధం అవుతుంది. ✍️ఆ పత్రిక చదివేవారి సహనాన్ని మెచ్చుకోవాలి. ఇంత ఛండాలంగా కూడా పత్రిక నడపవచ్చా! వార్తలు రాయవచ్చా! అని అందరూ ఆశ్చర్యపోయేలా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఒక మాట చెప్పాలి. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయా టూర్లలో కాని, ఆయన కుమారుడు లోకేష్ యువగళంలో కాని పలువురు టీడీపీ అభ్యర్ధులకు టిక్కెట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు పార్టీ అధ్యక్షుడు కనుక ఆయన ప్రకటన చేశారనుకున్నా, లేదా ఇన్చార్జీల నియామకం చేశారన్నా అర్ధం చేసుకోవచ్చు. ✍️అందులో తప్పొప్పుల సంగతి వేరే విషయం. కాని ఏ అధికారంతో లోకేష్ ఆయా చోట్ల ఫలానా వ్యక్తి తెలుగుదేశం అభ్యర్ధి అని ప్రకటిస్తూ వచ్చారు? అంటే అది పెత్తందారి ధోరణి కాదా! ఈనాడుకు అది ఎంత కమ్మగా కనిపించిందో! అంతేకాదు.. ఈ ఇద్దరు నేతలు ఆయా చోట్ల తిరుగుతూ దాదాపు వైసీపీ ఎమ్మెల్యేలందరిపైన ఎలాంటి ఆరోపణలు చేశారు?వాటిలో నిజం ఉన్నా, లేకపోయినా ఈనాడు, ఆంద్రజ్యోతి వంటివి పెద్ద,పెద్ద అక్షరాలతో రాసి, టీవీలలో చూపి ప్రచారం చేశాయి కదా! వారి ఆరోపణలే కాదు. ఇప్పటికీ ఈ ఎల్లో మీడియా పత్రికలు,టీవీలు రోజూ వైసిపి ఎమ్మెల్యేలపై అనేక తప్పుడు వార్తలు ఇస్తున్నాయి కదా! వారిలో కొందరిని పార్టీ అంతర్గత సర్వేల ఆధారంగా మార్చితే ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి మెచ్చుకోవాలి కదా! ఇప్పుడు కూడా ఎందుకు ముఖ్యమంత్రి జగన్‌పై పడి ఏడుస్తున్నారు? అంటే వీరు ఆశించిన విధంగా ఎవరిని మార్చకపోతే, అప్పుడు ఇంకేముంది.. కేసీఆర్ ఇలాగే మార్చలేదు. ఓడిపోయారు..ఇప్పుడు జగన్ పని అంతే అని ప్రచారం చేసేవారు. ✍️ఆయన మార్చుతుండేసరికి రాగం మార్చి అమ్మో అంత మందిని మార్చుతారా? ఇంత మందిని మార్చుతారా అని తెగ వాపోతున్నారు. అసలు వీరికి బుద్ది, జ్ఞానం లేదని పదే, పదే రుజువు చేసుకుంటున్నారు. ఎస్సీ,ఎస్టీ రిజర్డ్డ్ నియోజకవర్గాలలో కొందరిని మార్చితే బలహీనవర్గాలవారికి అన్యాయం జరగడం ఏమిటి?. కనీస ఇంగితం అయినా రామోజీరావుకు, రాధాకృష్ణకు ఉందా? ఆ నియోజకవర్గాలలో ఎస్సీ వారిని కాకుండా వేరే వారిని అభ్యర్ధులుగా చేయగలుగుతారా?. రేపు చంద్రబాబు నాయుడు ఎస్సీ నియోజకవర్గాలలో అభ్యర్ధులను మార్చితే అలాగే ప్రచారం చేస్తారా? అప్పుడేమని రాస్తారంటే చంద్రబాబు కాబట్టి, ఆయన అన్ని సర్వేలను దగ్గర పెట్టుకుని ప్రజాభిప్రాయం మేరకు మార్చారని వండుతారు. ✍️గత ఎన్నికలలో పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న వంగలపూడి అనిత ను కొవ్వూరు సీటుకు ఎందుకు మార్చారు. కొవ్వూరులో ఉన్న మంత్రి జవహర్‌ను తిరువూరుకు ఎందుకు తీసుకు వచ్చారు? తిరువూరులో ఉన్న ఎస్సి నేతను ఎందుకు గాలికి వదలివేశారు? దీనికి రామోజీ, రాధాకృష్ణలు సమాధానం ఇవ్వగలరా?వైసీపీ ఎమ్మెల్యే ఎమ్.ఎస్.బాబు ఏదో అన్నారట. అది ఇప్పుడు వారికి మహా ప్రసాదం అయింది. అదే ఎమ్మెల్యేపై లోకేష్ ఎన్ని విమర్శలు చేశారు? అయినా ఆయననే కొనసాగించాలని ఇప్పుడు ఈనాడు మీడియా రాయడంలోని దురుద్దేశం అర్ధం కాదా? ✍️ముగ్గురు రెడ్డి ఎమ్మెల్యేలను మార్చి బీసీ, ముస్లిం వర్గం నేతలకు జగన్ టిక్కెట్ ఇస్తే, రామోజీ, రాధాకృష్ణ వంటి తెలుగుదేశం ఏజెంట్లకు కనిపించలేదా? మంగళగిరి, ఎమ్మిగనూరులలో చేనేత వర్గం నేతలు చిరంజీవులు,మాచాని వెంకటేష్‌లకు, కదిరిలో ముస్లిం మైనార్టీకి టిక్కెట్లు ఇస్తే కూడా ఏడుపేనా! మంత్రి అమరనాథ్‌కు టిక్కెట్ ఇవ్వకపోయినా, ఆయనేమీ బాధపడలేదు. పైగా తాను వైసీపీకి ప్రచారం చేస్తానని చెబుతున్నారు. దానిని మాత్రం పట్టించుకోరు. మరో మంత్రి వేణుగోపాలకృష్ణకు రామచంద్రాపురం నుంచి రాజమండ్రి రూరల్‌కు మార్చి టిక్కెట్ ఇచ్చినా వీరికి బాధగానే ఉంది. రామచంద్రపురంలో ఆయన బదులు మరో బిసి వ్యక్తికే టిక్కెట్ ఇచ్చారు. రాజమండ్రి రూరల్ లో అగ్రవర్ణం బదులు బీసీ వ్యక్తిగా వేణుకు టిక్కెట్ లభించింది. దానిని మాత్రం చెప్పరు.ముగ్గురు ఎంపీలను మార్చారట. ఎల్లో మీడియాకు అది కూడా తప్పుగానే కనిపించింది. ✍️పోనీ వారి బదులు వేరేవారికి ఇచ్చారా అంటే అదేమీ కాదు. మళ్లీ బీసీ, ఎస్టీ నేతలకే టిక్కెట్లు లభించాయి. వైఎస్అ వినాష్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చేస్తున్నారని ఒకటే రొద చేస్తున్నారు. ఆయనపై వివేకా హత్య కేసులో ఆరోపణలు వచ్చాయి కనుక టిక్కెట్ ఇవ్వకూడదని అన్నారు. మరి ఇదే సూత్రం టీడీపీకి వర్తించదా! మాజీ మంత్రి పరిటాల రవిపై ఎన్ని హత్యకేసులు ఉన్నాయో రామోజీ,రాధాకృష్ణలకు తెలియదా? అయినా ఎందుకు అప్పట్లో టీడీపీ టిక్కెట్ పలుమార్లు ఇచ్చారు? పరిటాల రవి హత్యకేసులో స్వయంగా ఆయన భార్య సునీత మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డిపైనే ఆరోపణలుచేశారే. అయినా 2014లో చంద్రబాబు నాయుడు ఎలా ఎంపీ టిక్కెట్ ఇచ్చారు? వైసీపీలో ఉన్న గౌరు వెంకటరెడ్డి ఒక హత్యకేసులో జీవిత శిక్ష అనుభవించారు. ఆ టైమ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి జైలులో ఉన్న ఆయనను పరామర్శించడానికి వెళితే చంద్రబాబు తీవ్రంగా తప్పుపట్టి ప్రచారం చేశారే!. అలాంటి వ్యక్తిని టీడీపీలోకి ఎందుకు చేర్చుకున్నారు. ఆయన భార్యకు ఎలా టిక్కెట్ ఇచ్చారు? అంటే చంద్రబాబు ఏమి చేసినా సమర్ధించడం,జగన్ ఏమి చేసినా తప్పుడు ప్రచారం చేయడం. ✍️ఇదే నిత్యకృత్యంగా పెట్టుకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 వంటి మీడియాలను జనం నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి టీడీపీ నుంచి వైసీపీకి వెళ్లినా టిక్కెట్ ఇవ్వలేదని ఈనాడు ఏడ్చింది. ఒకే! మరి అదే విధంగా వైసీపీ నుంచి వెళ్లిన తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవికి, ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డికి లేదా మరొకరికి ఎవరికైనా టిడిపి టిక్కెట్ ఇవ్వకపోతే ఇలాగే ఏడుస్తారా? వార్తలు రాయకుండా ఏడుపుగొట్టుతనంతో స్టోరీలు ఇస్తున్న తీరును సభ్యసమాజం అసహ్యించుకుంటోంది. ✍️అయినా వారి తీరుమారడం లేదు.ఇంకో చిత్రమైన సంగతి. ఎమ్మిగనూరులో చెన్నకేశవరెడ్డికి టిక్కెట్ ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టిన ఈనాడు మీడియా, మళ్లీ ఆయన చెప్పినవారికే టిక్కెట్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తోంది? ఆయన పెత్తనాన్ని కొనసాగిస్తున్నారట.ఈ గొడవలన్ని ఎందుకు! వైసిపి వారు ముందుగా తాము ఎవరికి టిక్కెట్లు ఇస్తున్నది జాబితా సిద్దం చేసి రామోజీకి పంపితే ఆయన ఆమోద ముద్ర పడిన తర్వాత ప్రకటించాలేమో! ప్రస్తుతం జగన్ తన పార్టీతో వారితో మాట్లాడుకుంటూ, తన వద్ద నివేదికల ఆధారంగా టిక్కెట్లు కేటాయిస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేలను కొనసాగించినా ఈనాడు మీడియా ఇలాగే చెత్తగా రాస్తుంది. కొనసాగించకపోయినా ఆయా నేతలను రెచ్చగొట్టే యత్నం చేస్తుంది. ✍️ఇదంతా దేనికి ?తన ఎదుట కూర్చుని జీహుజూర్ అనే చంద్రబాబు కోసమే కదా? రామోజీరావు, రాధాకృష్ణలే పెత్తందారి బూర్జువా మనస్తత్వంతో దారుణంగా ఏపీ సమాజానికి శత్రువులుగా మారారు. ఇంతవరకు టీడీపీ, జనసేనల సీట్ల పంపిణీపై ఒక అవగాహనకురాలేదు. టీడీపీలో గతసారి పోటీ చేసిన ఎంతమందికి టిక్కెట్లు ఇస్తారో తెలియదు.టీడీపీ, జనసేన కార్యకర్తలు కొట్టుకున్నా కప్పిపుచ్చుతున్నారు. టీడీపీలో ఆయా చోట్ల రెండు,మూడు వర్గాలు ఘర్షణలుపడినా దాచేస్తున్నారు. తిరువూరులో ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్ని వర్గాలు తన్నుకున్నా దానిని జిల్లా పేజీకే పరిమితం చేసి మిగిలిన రాష్ట్రానికి తెలియకుండా చేయాలనుకున్న విషయం అర్ధం కాదా? ✍️జగ్గంపేటలో టీడీపీ, జనసేనలు ఎలా ఘర్షణ పడ్డాయన్నది బహిరంగ రహస్యమే అయినా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ఆ వార్తలను మొదటి పేజీలో ఎందుకు ఇవ్వలేదు?సోషల్ మీడియాలో ఇవన్ని క్షణాలలో వచ్చేస్తున్నాయి కదా?. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాబినెట్ లో ఏకంగా పదిహేడు మంది బలహీనవర్గాలవారికి అవకాశం ఇచ్చారు కదా! ఎన్నడైనా మెచ్చుకున్నారా? ✍️రాష్ట్రంలో ఉన్న వివిద పదవులలో ఏభై శాతం బడుగువర్గాలకు ఇచ్చిన నేత జగన్ కాకుండా మరెవరైనా ఉన్నారా? వాటినీ ఇంకో రకంగా తప్పుపడుతూ, తమ అగ్రవర్ణ దురహంకారాన్ని ఎల్లో మీడియా పెద్దలు ఎప్పటికప్పుడు బహిర్గతం చేసుకుంటూనే ఉన్నారు. జనం వీటిని గమనిస్తూనే ఉన్నారు. టిక్కెట్ల సమయంలో అన్ని పార్టీలలోను నిరసనలు ఉంటాయి.కాని వైసీపీలోనే ఇలాంటివి ఉన్నట్లు చెత్త రాతలు రాస్తున్న ఎల్లో మీడియా తీరే ఘోరంగా ఉంది.ఒక పద్దతి, పాడు లేకుండా విశ్లేషణలు ఇస్తున్న వీరి వైనం నీచాతినీచంగా ఉంది. అందువల్లే ఈనాడు, జ్యోతి వంటి వాటిని ఎల్లో వైరస్ గా జనం అనుకునే పరిస్థితి ఏర్పడింది. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్. ఇదీ చదవండి: చంద్రబాబుకు చెక్!.. కేశినేని నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ -
తప్పుడు రాతలను నిరసిస్తూ గుంటూరు ఈనాడు ఆఫీసు ముందు ధర్నా
-
ఈనాడు రామోజీతో ఏబీఎన్ రాధాకృష్ణ పోటీ పడుతున్నాడా?
తెలుగుదేశం పార్టీ తరపున పవర్ బ్రోకరిజం చేసే ఆంధ్రజ్యోతి యజమాని వి.రాధాకృష్ణ ప్రజలకు నీతులు చెబుతున్నారు. పచ్చి అబద్దాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. నిత్యం ఆంధ్రప్రదేశ్‌పై విషం చిమ్ముతున్న ఈనాడు రామోజీరావుతో ఈయన పోటీ పడుతున్నారు. కాకపోతే తాము బట్టలు లేకుండా తిరుగుతున్నారన్న సంగతి వారికి తెలియడం లేదు కాని, ఏపీ ప్రజలకు ఎప్పుడో తెలిసిపోయింది. జగన్ పరిపాలన వల్ల ఆంధ్రప్రదేశ్ పరువు పోయిందని హైదరాబాద్‌లో కూర్చుని ఈయన శాపనార్దాలు పెడుతున్నారు. ✍️ఈయన నెత్తిన పెట్టుకుని మోసే చంద్రబాబు నాయుడి ప్రభుత్వం చెత్తగా పాలిస్తోందని జపాన్‌కు చెందిన మాకి అనే సంస్థ ఏకంగా దేశ ప్రధానమంత్రికి లేఖ రాసిందే. దానిని కదా పరువు పోవడం అనాల్సింది. ఒకవైపు కేంద్రం నుంచి ఏపీకి అనేక ర్యాంకులు వస్తుంటే, ఈయనకు మాత్రం వెనుకబడి పోయినట్లు, అక్కడ ఏమీ జరుగుతున్నట్లు కనిపించడం లేదు. నిజమే చంద్రబాబు టైమ్‌లో వందల కోట్లు అప్పనంగా సంపాదించుకున్నారని చెబుతారు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు గిట్టుబాటు కాకపోతే రాష్ట్రం వెనుకబడిపోయినట్లు అనిపిస్తుంది. అధికారులు గంగిరెద్దుల్లా పనిచేస్తున్నారని ఈయన ఆరోపించారు. అంటే ఈయన ఆడమన్నట్లు ఆడితే మంచి ఎద్దు అవుతుందేమో! ✍️చంద్రబాబు టైమ్‌లో ఆనాటి ఇంటెలిజిన్స్ ఉన్నతాధికారి నేతృత్వంలో తెలుగు యువత అధ్యక్ష పదవికి ఎంపిక చేసినప్పుడు ఆ అధికారి గంగిరెద్దు కాదన్నమాట! తనతో కలిసి కొందరు ఐపీఎస్ అధికారులు ఆనాడు ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలను బేరసారాలాడి కొనుగోలు చేసినప్పుడు వారంతా బ్రహ్మాండంగా పనిచేశారని ఈయన సర్టిఫికెట్ ఇచ్చారు. టీడీపీ ఎంపి, ఒక ఎమ్మెల్యే మరికొందరు నేతలు రవాణా శాఖ కార్యదర్శిపై ఆ రోజుల్లో దౌర్జన్యం చేసినప్పుడు ఈయన గుడ్డి గుర్రం పళ్లుతోముతున్నారా?. తన పార్టీ వారిపై చర్య తీసుకోకుండా రాజీ చేసిన ఆనాటి చంద్రబాబు గంగిరెడ్లను ఆడించే వ్యక్తిలా ఆయనకు కనిపించలేదు. ✍️ఇప్పుడు అలాంటి ఘటనలు ఏమైనా జరుగుతున్నాయా?. అంతెందుకు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు తమ ఇసుక దోపిడీని అడ్డుకున్న ముసునూరు ఎమ్మార్యో వనజాక్షిని జుట్టుపట్టుకుని ఈడ్చినప్పుడు ఈయనకు చాలా కమ్మగా ఉందన్నమాట. పైగా తన ఎమ్మెల్యేని కాకుండా మహిళా అధికారిని మందలించిన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు వల్ల రాష్ట్రం పరువు పోలేదని ఈయన చెబుతున్నారు. చంద్రబాబుపై కేసులు పెట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారట. అది అసలు ఏడుపు! అంటే అవినీతికి పాల్పడి వందల కోట్లు అప్పనంగా తిన్నారన్న అభియోగాలు వచ్చినా చర్యలు తీసుకోరాదట. ✍️మరో వైపు తనను ఎవరూ ఏమీ పీకలేరని చంద్రబాబు సవాల్ చేసినప్పుడు అవునవును అని భాజాలు వాయించినప్పుడు ఈయనకు సమ్మగా ఉంది. అదే కేసులో చర్య తీసుకోగానే ఆయనతో పాటు ఈయన, రామోజీ నానా గగ్గోలు పెడుతూ, అవినీతికి తాము ఎలా కొమ్ము కాస్తున్నది ప్రజలకు తెలిసేలా చేశారు. గ్రామ సచివాలయాల వద్ద సంక్షేమ కార్యక్రమాల బోర్డులు పెడుతుంటే పెద్ద తప్పు జరిగిపోతున్నట్లు ప్రభుత్వ సిబ్బందిని దుర్వినియోగం చేస్తున్నట్లు తెగ ఏడ్చేస్తున్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో నిర్మించే రోడ్లు ఉన్న చోట ఒక బోర్డు పెట్టి అది ప్రధాని ఇచ్చిన నిధులతో అని ఎందుకు చెబుతున్నారు?. ✍️ఆ విషయాన్ని ఏనాడైనా ఈయన తప్పు పట్టారా? పూర్తికాని పోలవరం ప్రాజెక్టు వద్దకు కోట్ల రూపాయల వ్యయంతో జనాన్ని బస్‌లలో తరలించి జయము, జయము చంద్రన్న అని పాటలు పాడించి జనంలో నవ్వులపాలైనా, రాధాకృష్ణ, రామోజీ వంటివారికి మాత్రం తియ్యని పాటల్లా వినిపించాయి. మరో పెద్ద అబద్దం అలవోకగా చెప్పేశారు. జగన్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పుచేసిందట. అందులో రెండు లక్షల కోట్లు పంచారట. మిగిలిన ఐదు లక్షల కోట్లు ఏమయ్యాయని, అచ్చం టీడీపీ అధికార ప్రతినిధి మాదిరి ఆయన చండాలపు అసత్యాలు చెబుతున్నారు. ఇలా రాయడానికి ఏ మాత్రం సిగ్గుపడకపోవడం ఆయన విలక్షణ శైలి అని అనాలి. ✍️చంద్రబాబు టైమ్‌లో చేసిన అప్పుల గురించి ఎన్నడైనా వార్తలు ఇచ్చారా?పైగా చంద్రబాబు కాబట్టి అప్పులు వస్తున్నాయని డబ్బా కొట్టారే!. కేంద్రం ఏపీ అప్పు ఐదు లక్షల కోట్లకు చేరిందని పలుమార్లు చెప్పినా, ఈ రకంగా అసత్యాలు వెల్లె వేయడానికి వెనుకాడడం లేదంటే వీరు ఎంత గుండెలు తీసిన బంటో అర్ధం అవుతుంది. ఆ ఐదు లక్షల కోట్లలో చంద్రబాబు పాలన చేసిన రెండున్నర లక్షల కోట్లు, విభజన సమయంలో ఏపీకి కేటాయించిన లక్ష కోట్లు ఉన్నాయన్న సంగతిని కూడా దాచేస్తూ ఉండే వీరి నైజాన్ని ఏమనాలి?. నాసిరకం మద్యం అంటూ తప్పుడు ఆరోపణలు.. ఆ మద్యం బ్రాండ్లన్నీ చంద్రబాబు టైమ్ లో వచ్చినవే కదా! ✍️నిరుద్యోగులకు ఉపాధి లేదట. దేశంలో ఏ ప్రభుత్వం అయినా ఒక టరమ్‌లో రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చిందా?. అయినా దానిని కప్పిపుచ్చి ప్రజలను చీట్ చేయాలనుకునే చీటింగ్ మనస్తత్వం గురించి ప్రజలు ఆలోచించలేరనా వీరి ధైర్యం?. కాని ఆ రోజులు పోయాయి. ప్రతి ఒక్కరు వాస్తవాలు తెలుసుకుంటున్నారు. ఎవరు ముఖ్యమంత్రి అన్నది ముఖ్యం కాదట. చంద్రబాబా, పవన్ కళ్యాణ్ అన్నది కాదట. రాష్ట్రం గౌరవం నిలబడాలట. అంటే పవన్ కళ్యాణ్ పిచ్చోడు.. ఆయనకు సీఎం పదవి అవసరం లేదని చెప్పడమే రాధాకృష్ణ లక్ష్యం అన్న సంగతి తెలుస్తూనే ఉంది. ఏదో రకంగా పవన్ కళ్యాణ్‌ను వాడుకుని, పొరపాటున అధికారం వస్తే, ఆయనను పక్కకు తోసేయడమే వీరి కుట్ర అని పవన్ అభిమానులు అర్ధం చేసుకోకపోతే వారి ఖర్మ అనుకోవాల్సిందే. ✍️ఆంధ్రజ్యోతి, ఈనాడు వంటి మీడియా సంస్థలు ఎంత ఏడుస్తున్నా, ఎన్ని రకాలుగా అడ్డు తగులుతున్నా, కోర్టులను అడ్డం పెట్టుకుని ఎన్ని డ్రామాలు ఆడుతున్నా ముఖ్యమంత్రి జగన్ ఎక్కడా వెనక్కి తగ్గకుండా, తన మానిఫెస్టో ప్రకారం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చిన విషయం జనంలోకి వెళ్లకూడదన్నది వీరి తపన. చంద్రబాబు లక్ష కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసినా, 400 హామీలతో ఎన్నికల మానిఫెస్టో ఇచ్చి, ఆ తర్వాత వెబ్ సైట్ నుంచి దానిని తొలగించిన చంద్రబాబు వీరి దృష్టిలో గొప్పవాడు. 99 శాతం హామీలు అమలు చేసిన జగన్ ఏమో రాష్ట్రం పరువు తీసినవాడట! ✍️రాధాకృష్ణ నీచపు ఆలోచనకు ఇంతకన్నా వేరే ఉదాహరణ ఉంటుందా?. డబ్బు పంచడంతో రాష్ట్రం నాశనం అయిందని ప్రచారం చేసిన రాధాకృష్ణ, టీడీపీ వారు మిని మానిఫెస్టో పేరుతో అంతకు ఐదు రెట్లు పంచుతామని చెప్పినప్పుడు ఏమి రాశారు? జగన్‌పై శరాలు సిద్దం చేశారని కదా?. ఇక జగన్ ప్రభుత్వం పని అయిపోయిందని కదా! దీనిని బట్టే ఆంధ్రజ్యోతి, ఈనాడులు ఎంత నీచంగా మారింది. జర్నలిజాన్ని ఏ వ్యాపారంగా మార్చిందన్న దానిపై వస్తున్న విశ్లేషణలు వింటే వీరు సిగ్గుపడాలి. కాకపోతే వాటిని వదలివేసిన వారికి ఏమి చెబుతాం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి, రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు వంటివారు ఎంత ఏడ్చినా, ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కొని హీరోగా నిలబడుతున్న జగన్‌కు హాట్సాఫ్ చెప్పాలి. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
ABN రాధాకృష్ణకు అవినాష్ స్ట్రాంగ్ వార్నింగ్
-
రామోజీ రావు, రాధాకృష్ణ, నాయుడుపై సీఎం జగన్ రియాక్షన్
-
స్కిల్ స్కాంతో చంద్రబాబుకు సంబంధం లేదని ఎల్లో బ్యాచ్ దబాయింపు
-
ఉద్యోగులు సంతృప్తిగా ఉంటే రామోజీ, రాధాకృష్ణకు కడుపుమంట
-
చంద్రబాబు 118కోట్ల నొక్కేయడాన్ని విచిత్రంగా సమర్థించుకున్న రాధాకృష్ణ
-
యనమల, ఏబీఎన్ రాధాకృష్ణపై మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్
సాక్షి, కాకినాడ జిల్లా: యనమల అనే ముసలి నక్క ఆంధ్రజ్యోతిలో తనపై అసత్య కథనాలు రాయిస్తున్నాడని మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు. తునిలో గృహ సారధులు, వార్డు కన్వీనర్లతో మంత్రి దాడిశెట్టి శుక్రవారం సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వచ్చిన వార్తనే మళ్లీ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. రాధాకృష్ణ.. యనమల రామకృష్ణుడికి చెంచానో.. యనమలకు రాధాకృష్ణ చెంచానో అర్థం కావడం లేదన్నారు. ‘‘కోటనందూరులో నాకు, నా కుటుంబసభ్యులకు ఎకరం భూమి ఉన్నా.. అది యనమలకు, రాధాకృష్ణకు రాసిస్తానని’’ మంత్రి సవాల్ విసిరారు. దేశంలో ఉన్న ప్రముఖ నగరాల్లో యనమలకు ఆస్తులు ఉన్నాయని మంత్రి దాడిశెట్టి అన్నారు. చదవండి: బాబు కొత్త అవతారం.. ఫ్రీగా వరాలిస్తున్న చంద్రం బాబా.. -
దీని అర్థమేమి చంధ్రజ్యోతి!
-
దీని అర్థమేమి చంధ్రజ్యోతి!
సాక్షి, అమరావతి: ఎల్లో బ్యాచ్ పైత్యం మరోస్థాయికి చేరింది. తాటికాయంత అక్షరాలతో హెడింగ్స్ పెట్టి తమ దగ్గర తప్పుడు కంటెంట్ విరివిగా లభించును అన్న చందంగా బ్యానర్ స్టోరీలు వండివార్చడం ఈనాడు, ఆంధ్రజ్యోతికి కొత్తకాదు. కానీ, రోజురోజుకు శృతిమించుతున్న వారి రోతరాతలపై పాఠకులు ముక్కున వేలేసుకుంటున్నారు. తాజాగా ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో వచ్చిన కథనాలు పచ్చపైత్యానికి రుజువులుగా నిలిచాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్‌పై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న రాధాకృష్ణ అడ్డంగా దొరికిపోయారు. తప్పుడు కథనాల తీరును ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా కౌంటర్ అటాక్ చేసింది. ‘పులిహోర కథనాలు వండి వార్చడం అంటే ఏంటో ఇవాళ్టి రాధాకృష్ణ చంధ్రజ్యోతిలో రాసిన కథనాలను చూస్తే అర్థమవుతుంది. ఒకేరోజు వార్తలు కథనాలు.. వాటికి ఏమాత్రం పొంతన లేకుండా అబద్ధపు రాతలు రాశారు’ అంటూ ఓ వీడియోను ట్వీట్ చేసింది. సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు కూడా అబద్ధపు రాతల కథనాలపై ఆంధ్రజ్యోతిని ట్రోల్ చేస్తున్నారు. చదవండి: అసభ్యకర పోస్టులు.. సోషల్ మీడియా కట్టడి అవసరం: వాసిరెడ్డి పద్మ పులిహోర కథనాలు వండి వార్చడం అంటే ఏంటో ఇవాళ్టి రాధాకృష్ణ చంధ్రజ్యోతిలో రాసిన కథనాలను చూస్తే అర్థమవుతుంది. ఒకేరోజు వార్తలు కథనాలు.. వాటికి ఏమాత్రం పొంతన లేకుండా అబద్ధపు రాతలు రాశారు.#BanYellowMediaSaveAP#EndOfTDP pic.twitter.com/62HuEOMQ2R — YSR Congress Party (@YSRCParty) June 30, 2023 -
ఆంధ్రజ్యోతి సమర్పించు స్వర్గం నరకం
నరకంలో నాలుగేళ్లు ..అంటూ తెలుగుదేశం అనుకూల దినపత్రిక ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ఇచ్చింది. అది చదివితే అర్ధం అయిందేమిటంటే.. ఆ మీడియావారి కడుపు మంట, ద్వేషం,కుళ్లు ఆ స్థాయిలో ఉందని!. ఏ ప్రభుత్వానికి అయినా నాలుగేళ్లు పూర్తి చేసుకోవడం ఒక సందర్భం. మీడియాగా ఆ ప్రభుత్వ మంచి చెడులు విశ్లేషించవచ్చు. అలాకాకుండా పూర్తిగా ఏకపక్షంగా, పచ్చి పాపంగా కథనాలను ఇస్తే ప్రజలు విశ్వసిస్తారా?. నిజంగా ఏపీలో ఎలాంటి పరిస్థితి ఉన్నది?. ఇది పేదల, దిగువ మధ్య తరగతి ప్రజలకు స్వర్గసమానంగా ఉండడం ఆ పార్టీ పత్రికకు ఏ మాత్రం నచ్చడం లేదు. అందుకే ఇలాంటి దిక్కుమాలిన రాతలు రాస్తున్నారు. గతంలో టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలకు నరకం చూపించేవారు. లంచాలు ఇచ్చి, పదిసార్లు ఆ కమిటీల సభ్యుల చుట్టూ తిరిగినా పని జరుగుతుందో లేదో తెలిసేదికాదు. అది కదా నరకం అంటే!. మరి ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను తీసుకు వచ్చి ప్రజల అవసరాలను వారి ఇళ్ల వద్దే తీర్చుతోంది. దీనిని కదా స్వర్గం అనాల్సింది. అప్పట్లో వృద్దులు వారికి వచ్చే కొద్దిపాటి పెన్షన్ కోసం MRO ఆఫీస్ ల చుట్టూ తిరిగి వేసారిపోయేవారు. నిజంగానే వారు నరకం చూసేవారు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు వలంటీర్లు ప్రతి నెల మొదటి తేదీన తెల్లవారకముందే వృద్దులకు పెన్షన్ లు ఇస్తున్నారు. ఇది కదా స్వర్గం అంటే. అలా పెన్షన్ లు అందుకున్న వృద్దుల కళ్లలో ఆనందం చూస్తే తెలుస్తుంది ఆ పత్రికవారికి అది స్వర్గమన్న సంగతి. ఎక్కడో కళ్లుమూసుకుని కూర్చుని పిచ్చి రాతలు రాస్తే సరిపోతుందా?. ✍️ గతంలో రేషన్ కోసం షాపుల వద్ద క్యూలు కట్టాల్సి వచ్చేది. మరి ప్రస్తుతం రేషన్ బండే ప్రజల ముంగిటకు వస్తోంది. ఆ రోజుల్లో ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లాలంటే నరకమే!. పారిశుద్ద్యం లేక, సరైన అజమాయిషీ లేక స్కూళ్లు కునారిల్లేవి. అలాంటిది జగన్ ప్రభుత్వం రాగానే వాటిని స్వర్గం మాదిరి మార్చే యత్నం చేసింది. ఒక్కసారి ఆ స్కూళ్లకు వెళితే.. ఇంత మార్పా? చక్కని భవనాలు, ఫాన్ లు, చివరికి ఫైవ్ స్టార్ రేంజ్లో టాయిలెట్లు వచ్చాయి. ఆ సంగతిని కప్పిపుచ్చాలని ఆంధ్రజ్యోతి కుట్ర అన్నమాట. ఈ స్కూళ్లలో చదివే విద్యార్ధులకు ఆంగ్ల మీడియం బోధించినా ఈ మీడియాకు నచ్చదు. చంద్రబాబు పాలనలో ఫీజ్ రీయింబర్స్ మెంట్ అరకొరగా ఉన్నా అది ఆ పత్రికకు స్వర్గం. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తున్నా నరకమే!!. అమ్మ ఒడి కింద ఏటా పదిహేను వేలు ఇవ్వడం, విద్యార్దులకు మంచి ఆహారం, విద్యా దీవెన ఇలా పలు రకాల స్కీముల గురించి ఒక్క మాట రాయడానికి చేతులురాని ఆ మీడియాకు ఇదంతా నరకంగా కనిపించిందట. ఒక ప్రభుత్వ స్కూల్ విద్యార్ధి.. పరీక్షల్లో స్టేట్ ఫస్ట్ రాంకర్ అవడాన్ని బట్టి ఇది స్వర్గమో కాదో నిర్ణయించుకోవచ్చు. ✍️ ఆరోగ్యరంగాన్ని తీసుకుంటే ఆస్పత్రులను నాడు-నేడు కింద బాగు చేస్తుంటే అది నరకమట. గతంలో అసలు ఈ రంగాన్ని పట్టించుకోకుండా వదలివేస్తే అది స్వర్గమట!. ఆరోగ్యశ్రీ కింద పేదలు, మధ్యతరగతి , ఆ మాటకు వస్తే ధనిక వర్గాలు సైతం లబ్ది పొందుతుంటే అది నరకమట!. ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రం లో అయినా విద్య, ఆరోగ్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వాలే గొప్పవన్న విషయం ఆ పత్రికవారికి అర్దం కాకపోయినా, ప్రజలకు బాగానే అర్దం అవుతోంది. ✍️ ఒకప్పుడు రైతులు తమ కు అవసరమైన విత్తనాలు, ఎరువులు తదితరాల కోసం రోడ్డెక్కవలసి వచ్చేది. ఈ నాలుగేళ్లలో ఎక్కడైనా అలా జరిగిందా? రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు సదుపాయాలు కల్పించడమే కాకుండా, ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా నిధులను ఇస్తుంటే అది స్వరం అవుతుందా? నరకం అవుతుందా? అన్నిటికి మించి చంద్రబాబు పాలనలో ఏటా కరువుతో నరకాన్ని ప్రజలు చవి చూడవలసి వచ్చింది. అదృష్టవశాత్తు జగన్ పాలన ఆరంభమయ్యాక ఈ నాలుగేళ్లలో కరువు అన్న మాటే వినిపించలేదు. ఇదే రైతులకు పెద్ద స్వర్గం . ✍️ 31 లక్షల స్థలాలు పేదలకు ఇచ్చి ఇళ్లు నిర్మిస్తుంటే.. అది నచ్చని వీరు నరకం అంటూ చెడరాస్తున్నారనుకోవాలి. పేదవాడికి ఆ సెంటు భూమి కూడా స్వర్గం కిందే లెక్క. అందుకే జగన్ ప్రభుత్వాన్ని వారు అంతగా సొంతం చేసుకుంటున్నారు. బలహీనవర్గాల మహిళలకు చేయూత కింద రూ.18,500, కాపు నేస్తం ,చేనేత నేస్తం, వాహన మిత్ర ఇలా పలు విధాలుగా ఆర్దిక సాయం చేస్తుంటే వారికి అది స్వర్గం అవుతుందికాని నరకం ఎలా అవుతుంది?. వలంటీర్ల వ్యవస్థతో పాటు గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థలను తీసుకువచ్చి ప్రజల గడప వద్దకు పాలన చేర్చడం స్వర్గం అవుతుందా?నరకం అవుతుందా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కాకపోతే ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలకు ఇది నరకంగానే ఉంటుంది. ఎందుకంటే వారి పైరవీలకు, రియల్ దందాలకు, అరాచకాలకు అవకాశం ఇవ్వడం లేదు కదా? ప్రభుత్వం తమ చేతిలో ఉంటే తమకు ఏది కావాలనుకుంటే అది చేసుకునే వీలు ఉంటుందని వారి భావన. అది పోయిందన్నది వారి ఆక్రోశం. అందువల్ల వారికి ఇది నరకమే. ✍️ పరిశ్రమలు, అభివృద్ది గురించి చేతికొచ్చినట్లు రాశారు. రిలయన్స్ అంబానీ , అదాని తదితర ప్రముఖ పారిశ్రామికవేత్తలు విశాఖ వచ్చి జగన్ కు అండగా నిలబడడాన్ని వీరు చూడలేక కళ్లలో నిప్పులు పోసుకున్నారు. అందువల్ల ఆ మంటతో వారికి నరకంగా కనిపిస్తుంది. కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు, పలాస వద్ద కిడ్నీ పరిశోధన కేంద్రం, నాలుగు ఓడరేవులు, పది ఫిషింగ్ హార్బర్లు ఇలా అనేక రకాలగా నిర్మాణాత్మక పనులు జరుగుతుంటే అదంతా వారికి విధ్వంసగానే కనిపిస్తుంది. జగన్ తీసుకువచ్చిన స్కీములవల్ల రాష్ట్రం నాశనం అయిందని ఈ మీడియా ప్రచారం చేస్తుంటుంది. అదే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అంతకన్నా నాలుగైదు రెట్ల సంక్షేమ స్కీములను హామీ ఇస్తే అబ్బో అదిరిందని , వైఎస్సార్సీపీ వాళ్లు బిత్తరపోయారని చెత్త రాతలు రాస్తున్నారు. ✍️ ఇప్పుడు ఒక నరకం అనిరాస్తే.. చంద్రబాబు వస్తే నాలుగైదు నరకాలు చూపిస్తారని రాయాలి కదా! అలా కాదట. అవి బాణాలట. వైసిపి ప్రభుత్వంపై ఎక్కుపెట్టారట. అదిరిపోతుందని ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. మరో టిడిపి పత్రిక ఈనాడు ఆర్దిక అరాచతక్వం అంటూ మరోసారి తన ద్వేషాన్ని వెళ్లకక్కింది.ఎపి అప్పుల పాలవుతోందట. చంద్రబాబు టైమ్ లో తీసుకు వచ్చిన అప్పుల గురించి చెప్పరు. జగన్ ఈ స్కీములు అమలు చేయడం అరాచకం అయితే , చంద్రబాబు వస్తే మరిన్ని స్కీములు ఇస్తానంటున్నారు కదా? అప్పుడు ఇంకెంత అరాచకం అవుతుంది?దానిపై ఎందుకు సంపాదకీయం రాయరు. కేవలం తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఈ మీడియా సంస్థలు జర్నలిజాన్ని తాకట్టు పెడుతున్నాయి. ఈ ఏడాది అంతా వీరి కుట్రలను జగన్ ఎదుర్కోక తప్పదు కదా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
కల్యంపూడి రాధాకృష్ణారావుకు అంతర్జాతీయ స్టాటిస్టిక్స్ పురస్కారం
వాషింగ్టన్: ప్రఖ్యాత భారత్–అమెరికన్ గణిత శాస్త్రవేత్త, గణాంకశాస్త్ర(స్టాటిస్టిక్స్) నిపుణుడు కల్యంపూడి రాధాకృష్ణారావు(102)ను ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారం వరించింది. స్టాటిస్టిక్స్ రంగంలో నోబెల్ బహుమతితో సమానమైన ‘ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్’ను 2023 సంవత్సరానికి గాను రాధాకృష్ణారావుకు అందజేయనున్నట్లు ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. స్టాటిస్టిక్స్‌లో 75 ఏళ్ల క్రితం ఆయన చేసిన కృషి సైన్స్‌పై ఇప్పటికీ అమిత ప్రభావం చూపిస్తోందని ప్రశంసించింది. కెనడాలోని ఒట్టావాలో ఈ ఏడాది జూలైలో జరిగే ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ వరల్డ్ స్టాటిస్టిక్స్ కాంగ్రెస్‌లో అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ బహుమతి కింద 80,000 డాలర్లు అందజేస్తారు. ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ను ప్రతి రెండేళ్లకోసారి ప్రదానం చేస్తారు. 2017లో తొలిసారిగా ఈ అవార్డును డేవిర్ ఆర్ కాక్స్ అందుకున్నారు. 2019లో బ్రాడ్జీ ఎఫ్రాన్, 2021లో నాన్ లాయిర్డ్ స్వీకరించారు. ఏపీలో విద్యాభ్యాసం కల్యంపూడి రాధాకృష్ణారావు కర్ణాటకలోని హడగళిలో తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు, నూజివీడు, నందిగామ, విశాఖపట్నంలో విద్యాభ్యాసం సాగింది. ఆంధ్రా విశ్వావిద్యాలయం నుంచి గణితశాస్త్రంలో ఎంఎస్సీ చేశారు. 1943లో కలకత్తా యూనివర్సిటీ నుంచి స్టాటిస్టిక్స్‌లో ఎంఏ డిగ్రీ అందుకున్నారు. ఇంగ్ల్లండ్‌లో కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన కింగ్స్ కాలేజీలో పీహెచ్డీ చేశారు. 1965లో కేంబ్రిడ్జి వర్సిటీ నుంచి డీఎస్సీ డిగ్రీ స్వీకరించారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, తర్వాత కేంబ్రిడ్జిలోని ఆంత్రోపాలాజికల్ మ్యూజియంలో సేవలందించారు. పలు భారత, విదేశీ వర్సిటీల్లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1968లో పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్ అందుకున్నారు. -
ఎల్లో మీడియా రాతలపై జనసైనికుల ఆగ్రహం.. అయినా నోరు మెదపని పవన్
-
అడ్డగోలు రాతలు రాయడం ఎల్లోమీడియాకు అలవాటైపోయింది : మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
-
బిగ్ క్వశ్చన్ : తప్పుడు ప్రచారం చేసే ఎల్లో గ్యాంగ్ బుద్ధి మారదా ..?
-
గన్ షాట్ : ఎల్లో మీడియా రాతల్ని ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా..?
-
గన్ షాట్ : ఎల్లో పాయిజన్ ..
-
లేనిది ఉన్నట్టు ఎల్లో డప్పులు...
-
ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలపై సోము వీర్రాజు ఫైర్
-
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: ఎన్టీఆర్‌ను చంపిన దుర్మార్గులకు ఆయన గురించి మాట్లాడే అర్హత లేదని ఏపీ తెలుగు, సంస్కృతి అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో పేరు మార్పుపై ఎప్పుడూ కూడా ఆలోచించని వారు ఇప్పుడు రాద్దాంతం చేస్తుంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు, రాధాకృష్ణ ఓ వీడియోలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు తీసేయాలని మాట్లాడుకోలేదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు మారిస్తే మాత్రం వీళ్లు మరోలా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ‘ఎన్టీఆర్ పేరు.. హెల్త్ యూనివర్సిటీకి కావాలా? జిల్లాకి కావాలా? అంటే నేను జిల్లాకే పేరు ఉండాలని అంటాను. వర్శిటీ కంటే జిల్లా చాలా పెద్దది. జిల్లాకు పేరు పెట్టడంలోనే వైఎస్ జగన్‌కు ఎన్టీఆర్‌పై ఉన్న ప్రేమ ఏంటో తెలుస్తోంది. ద్వేషంతోనో, పగతోనో వర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చలేదు. రూపాయి వైద్యుడిగా వైఎస్సార్ పేరు పెట్టే విషయంలో సీఎం జగన్ చెప్పిన విషయం సబబుగా ఉంది. మరో గొప్ప ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టేలా నేను సీఎం వద్దకు వెళ్తాను. ఇక్కడ ఎన్టీఆర్‌ను అగౌరవపరిచింది ఏముంది? యూనివర్సిటీ ఉన్న జిల్లా పేరే ఎన్టీఆర్ ఉంది. సీఎం జగన్ ఎన్టీఆర్‌పై గౌరవం ఉందని అసెంబ్లీ వేదికగా స్పష్టంగా చెప్పారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వొద్దని వాజ్‌పేయికి చంద్రబాబే స్వయంగా చెప్పారు. ఎన్టీఆర్‌కు భారతరత్న రాకుండా అడ్డుకున్న దుర్మార్గుడు చంద్రబాబు’అని లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: (ఆ మర్డర్ వెనుక నువ్వు, రామోజీ లేరా?: లక్ష్మీపార్వతి) -
పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన నటుడు ఆర్కే
సాక్షి, చెన్నై: తాను రాజకీయాల్లోకి మాత్రం రానని నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త ఆర్కే అన్నారు. తొలిచిత్రం ఎల్లామ్ అవన్ సెయల్తోనే యాక్షన్ హీరోగా విజయం సాధించిన ఈయనకు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్‌గానూ గుర్తింపు ఉంది. పలు కొత్త కొత్త ప్రయోగాలతో ఉత్పత్తులను తయారు చేసి మార్కెటింగ్‌లో కొత్త పుంతలు తొక్కుతూ అంతర్జాతీయ స్థాయిలో సక్సెస్ పుల్ వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఈయన ఉత్పత్తుల్లో వీఐపీ హెయిర్ కలర్ షాంపూ ఒకటి. వ్యాపార రంగంలో తన అన్వేషణ కొనసాగుతుందంటున్న ఆర్కేను వివిధ రంగాలలో సాధనకు గాను 11 దేశాల నుంచి 18 గౌరవ డాక్టరేట్ పురస్కారాలు వరించాయి. ఈ అంశంపై గిన్నీస్ రికార్డులకెక్కింది. ఈయన సోమవారం చెన్నైలో మీడియాతో ముచ్చటించారు. వ్యాపార రంగంలో సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగడమే తన లక్ష్యం అన్నారు. ఎన్ని రంగాలలో ప్రవేశించినా రాజకీయ రంగంలోకి మాత్రం వచ్చే ప్రసక్తే లేదన్నారు. నిజానికి ఆ రంగంలో కుల, మత, స్వార్థం తప్ప సేవా రాజకీయాలు లేవన్నారు. అయితే సినీ రంగానికి మాత్రం దూరం కానని ఆర్కే స్పష్టం చేశారు. -
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ముద్రగడ బహిరంగ లేఖ
Mudragada Padmanabham Letter, సాక్షి, తూర్పుగోదావరి: ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఆ బహిరంగ లేఖలో రాధాకృష్ణకు పలు చురకలంటించారు. పేద పిల్లల విద్య, ఉద్యోగ అవకాశాల కోసమే తాను కాపు ఉద్యమం చేశానని ముద్రగడ తెలిపారు. లక్షాధికారిని కోటేశ్వరున్ని, కోటీశ్వరున్ని అపర కుబేరునిగా చేయడం కోసం కాదని స్పష్టం చేశారు. రాధాకృష్ణ ఆలోచనలను అమలు చేయడానికి తాను అసమర్థుడిని.. చేతకాని వాణ్ణి కాదని ముద్రగడ అన్నారు. రాధాకృష్ణలాగా.. ఎదుటి వాళ్లను ఏకవచనంతో మాట్లాడే పత్రిక యాజమానిని ఇంత వరకు చూడలేదన్నారు. ఆంధ్రజ్యోతి యాజమాని కేఎల్ఎన్ ప్రసాద్‌ను కూర్చిలోంచి కాళ్లుపట్టుకొని లాగి.. ఆ కుర్చిలో కూర్చున్న ఘనత రాధాకృష్ణది అని విమర్శలు గుప్పించారు. ఇలాంటి ఘన చరిత్ర ఏ కుల నాయకులకు ఉండదని దుయ్యబట్టారు. ‘‘నా చరిత్ర కంటే మీ చరిత్రను అందరూ చదవాలి. ఎందుకంటే మీలా అపర కోటేశ్వరులు అవ్వలేరు. నోట్ల రద్దు సమయంలో నేలమాళిగలో దాచిన నల్లధనాన్ని బంగారు షాపుల యాజమానులను బెదిరించి ఏలా చలమణిలోకి తెచ్చారో? రెండు తలలు కలిసి పుట్టిన పిల్లలను విడదీయడానికి ఎలా డబ్బు సంపాదించాలో తెలిపే విధానాన్ని మీరు(రాధాకృష్ణను ఉద్దేశిస్తూ) ప్రజలకు చెప్పాలి. అలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బెట్టింగ్‌లను ప్రోత్సహించి ఎలా కోట్లు సంపాదించింది కూడా నేర్పాలి అంటూ రాధాకృష్ణపై ముద్రగడ ఆ లేఖలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
'రాధేశ్యామ్' మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..
టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమా 'రాధేశ్యామ్' కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. తాజాగా సెన్సార్ కార్యాక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ (అని చెప్పుకునే) సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు రాధేశ్యామ్ సినిమా ఎలా ఉందో చెప్పుకొచ్చాడు.'రాధేశ్యామ్ సినిమా చూశాను. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రభాస్- పూజాల కెమిస్ట్రీ ఎలక్ట్రిఫైయింగ్గా అనిపించింది. క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంది. ఇది ఒక యూనిక్ సబ్జెక్ట్. ఒక్క మాటలో చెప్పాలంటే రాధేశ్యామ్.. క్లాసిక్, స్టైలిష్, థ్రిల్లింగ్, మిస్టరీ అండ్ రొమాంటిక్. రాధేశ్యామ్ ఒక ఎపిక్. ప్రభాస్ అదరగొట్టేశాడు. అతని డ్రెస్సింగ్, యాక్టింగ్ అద్భుతం. భారతదేశంలో ప్రభాస్ క్లాస్, స్టైల్‌ను బీట్ చేసేవాళ్లే లేరు' అంటూ యంగ్ రెబల్ స్టార్‌ను ఆకాశానికెత్తాడు. ఉమైర్ సంధు చేసిన ట్వీట్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని చెప్పొచ్చు. దీన్ని బట్టి చూస్తే రాధేశ్యామ్ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమంటున్నారు నెటిజన్లు. ఇప్పటికే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని స్థాయిలో జరుగుతున్నాయని సమాచారం. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ ప్రభాస్ తల్లిగా నటిస్తుండగా, జగపతి బాబు, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి పులికొండ, కునాల్ రాయ్ కపూర్, రిద్ధి కుమార్, సాషా చెత్రీ, సత్యన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గోపికృష్ణ మూవీస్,యువీ క్రియేషన్స్ సుమారు రూ. 300కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని నిర్మించారు. Nobody can beat Class & Style of #Prabhas in India ! He has Sexiest Swag in #RadheShyam ! Totally LOVED & LOVED his performance & wardrobes ❤❤❤ — Umair Sandhu (@UmairSandu) March 4, 2022 Done with Overseas Censor Screening of #RadheShyam ❤ — Umair Sandhu (@UmairSandu) March 4, 2022 Done First Half of #RadheShyam ! Outstanding VFX used in the movie. #Prabhas𓃵 & #PoojaHegde chemistry is Electrifying 🔥 ! Mystery continues in #RadheShyam. What a unique subject ❤ — Umair Sandhu (@UmairSandu) March 4, 2022 #RadheShyam is truly Cinematic Experience! Climax is the USP of film 🍿❤️🔥 — Umair Sandhu (@UmairSandu) March 5, 2022 -
'రాధేశ్యామ్'పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన తమన్
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్. మోస్ట్ అవైటెడ్‌గా నిలిచిన ఈ సినిమా ఈనెల11న రిలీజ్ కానుంది. రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రీసెంట్గా విడుదలైన మేకింగ్ వీడియోలో మ్యూజిక్ ఎంతలా ఆకట్టుకుందో తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ఇచ్చిన థమన్ ఈ సినిమాకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. చదవండి: పూజా హెగ్డేతో విబేధాలపై తొలిసారి స్పందించిన ప్రభాస్ మా నుంచి ఒక క్రేజియెస్ట్ స్కోర్‌ను మీరంతా వినబోతున్నారు. మున్ముందు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రానున్నాయి అంటూ ట్వీట్ చేశాడు. మరి ఆ అప్డేట్ ఏంటో తెలియాలంటే కాస్త సమయం ఆగాల్సిందే. చదవండి: ఆ ముగ్గురు హీరోలతో నటించాలనుంది : పూజా హెగ్డే Hope u loved our #TheSagaOfRadheShyam Ur goona Witness A Craziest Score Ever from Us 💥🦋 it’s all tat #Butterflies running in my Stomach a longgggg wait 🎧🎛🎛 More updates coming from us let’s make this big guys #RadheShyamOnMarch11th 🦋🦋🦋🦋🦋 pic.twitter.com/qXXOPWkZb4 — thaman S (@MusicThaman) March 6, 2022 -
తప్పుడు కథనాలు రాయడమే ఎల్లో మీడియా పనిగా పెట్టుకుంది: కొడాలి నాని
-
దోపిడీలో స్కిల్.. బాబు గ్యాంగ్ హల్'షెల్'
అధికారం అండగా గత ప్రభుత్వ పెద్దలు సాగించిన దోపిడీ పర్వంలో మరో కొత్త కోణం వెలుగు చూసింది. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు ‘స్కిల్ డెవలప్మెంట్’ అంటూ ‘షెల్ కంపెనీ’లతో ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. తూతూ మంత్రంగా ఒప్పందం చేసుకుని పనులు చేయకుండానే బిల్లులు చెల్లించేశారు. ఆ విధంగా రూ.241 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఈ కుంభకోణంపై 2018లోనే కేంద్ర జీఎస్టీ అధికారులు సమాచారం ఇచ్చినా, అప్పటి టీడీపీ ప్రభుత్వం స్పందించక పోగా, సంబంధిత ఫైళ్లను మాయం చేసింది. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)ను అడ్డుపెట్టుకుని గత టీడీపీ ప్రభుత్వ పెద్దలు భారీగా దోపిడీకి పాల్పడ్డారు. తాజాగా సీఐడీ అధికారుల దర్యాప్తులో ఈ వ్యవహారం బట్టబయలైంది. ఈ కేసులో అప్పటి ఏపీఎస్ఎస్డీసీ ఎండీ–సీఈవో గంటా సుబ్బారావు, డైరెక్టర్‌గా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీ నారాయణ, ఎస్‌డీఈఐ కార్యదర్శికి ఓఎస్డీగా ఉన్న నిమ్మగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్, ఇతర అధికారులు, సీమెన్స్, డిజైన్ టెక్, స్కిల్లర్, ఏఐసీ తదితర కంపెనీలకు చెందిన అప్పటి ఎండీలు, ఇతర ప్రతినిధులతో సహా మొత్తం 26 మందిపై సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లో శుక్రవారం తనిఖీలు నిర్వహిస్తున్న రాష్ట్ర సీఐడీ అధికారులను ఆంధ్రజ్యోతి–ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అడ్డుకోడానికి ప్రయత్నించడం విస్మయ పరిచింది. అవినీతికి పాల్పడ్డ వారి ఇళ్లల్లో అధికారులు దర్యాప్తు చేస్తుండగా వీరు అడ్డుకోవడానికి యత్నించడం చూస్తుంటే ఈ కుంభకోణంలో టీడీపీ పెద్దలు కీలకంగా వ్యవహరించారన్నది స్పష్టమైంది. సీఐడీ విస్తృత తనిఖీలు, నోటీసులు ‘ఏపీఎస్ఎస్డీసీ’లో అక్రమాలకు సంబంధించి టీడీపీ ప్రభుత్వంలో పని చేసిన పలువురు అధికారులతోపాటు పలు కంపెనీలపై రాష్ట్ర సీఐడీ అధికారులు శుక్రవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్, పూణే, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ నివాసాల్లో తనిఖీలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లతో పాటు వారు డైరెక్టర్లుగా ఉన్న ఇతర సంస్థలకు సంబంధించిన ఆడిటింగ్ ఫైళ్లు, ఇతర కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. విజయవాడలో ఈ నెల 13న సీఐడీ ముందు విచారణకు హాజరు కావాలని గంటా సుబ్బారావు, లక్ష్మీ నారాయణలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఏపీఎస్ఎస్డీసీ నిధులు కొల్లగొట్టడంలో కీలక పాత్ర పోషించిన ఢిల్లీ, ముంబాయి, పూణే తదితర నగరాల్లోని కంపెనీలు, షెల్ కంపెనీలలో కూడా తనిఖీలు నిర్వహించారు. సీఐడీ సోదాల సమయంలో లోబీపీతో పడిపోయిన లక్ష్మీనారాయణ. హడావుడి జీవో.. అందుకు విరుద్ధంగా ఒప్పందం 2014–19లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కాలేజీలు కలిపి మొత్తం 40 చోట్ల ‘స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అందుకోసం రూ.3,611.05 కోట్లతో సీమెన్స్, డిజైన్‌టెక్ సంస్థలతో ఏపీఎస్ఎస్డీసీ ఒప్పందం కుదుర్చుకుంది. సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 90 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూర్చాలి. ఈ మేరకు 2017 జూన్ 30న జీవో 4ను టీడీపీ ప్రభుత్వం జారీ చేసింది. కానీ జీవో 4కు విరుద్ధంగా ఒప్పందం చేసుకునేలా ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీ నారాయణ, ఎండీ–సీఈవోగా ఉన్న గంటా సుబ్బారావు మొత్తం కథ నడిపించారు. కేవలం రూ.100 స్టాంప్ పేపర్‌పై ఒప్పందం చేసుకున్నారు. అందులో తేదీ కూడా వేయలేదు. రూ.3,611.05 కోట్ల విలువ మేరకు కాంట్రాక్టును ఎలా నిర్ధారించారన్నదీ లేదు. సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలు సమకూర్చాల్సిన 90 శాతం నిధులను ఏ విధంగా లెక్కించారన్నదీ చెప్పనే లేదు. సంబంధిత మొత్తం వేయాల్సిన చోట ఖాళీగా వదిలేశారు. వైద్యం కోసం వస్తున్న డాక్టర్లు పనులు చేయకుండానే బిల్లుల చెల్లింపు జీవో ప్రకారం 90 శాతం నిధులు వెచ్చించాలన్న విషయాన్ని సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలు పట్టించుకోలేదు. అయినా సరే ప్రభుత్వం మాత్రం తన వాటాగా చెల్లించాల్సిన 10 శాతం నిధులను జీఎస్టీతో సహా మొత్తం రూ.371 కోట్లు చెల్లించేసింది. అసలు పనులు చేయకుండానే నిధులు ఎలా చెల్లిస్తారని అప్పటి ఆడిట్ అకౌంటెంట్ జనరల్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినా సరే చంద్రబాబు ప్రభుత్వం పట్టించు కోలేదు. షెల్ కంపెనీల ద్వారా బాబు అస్మదీయులకు రూ.371 కోట్లను అడ్డగోలుగా కొల్లగొట్టడానికి అప్పటి సీఎం చంద్రబాబు సన్నిహితులు ‘షెల్ కంపెనీల’ను ముందే సృష్టించారు. ఏపీఎస్ఎస్డీసీతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అందుకోసం ఢిల్లీ కేంద్రంగా ‘స్కిల్లర్’ అనే షెల్ కంపెనీని సృష్టించారు. ఆ కంపెనీకి సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ సరఫరా కోసం రూ.241 కోట్లకు సబ్ కాంట్రాక్టుకు ఇచ్చినట్టు చూపించారు. ఆ ‘స్కిల్లర్’ కంపెనీ ముంబయిలోని ‘అలైడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ (ఏఐసీ) అనే మరో షెల్ కంపెనీకి వర్క్ ఆర్డర్ ఇచ్చినట్టుగా కనికట్టు చేశారు. ఆ మేరకు ఏపీఎస్ఎస్డీసీకి సాఫ్ట్వేర్, హార్ట్‌వేర్ సరఫరా చేసినట్టుగా ఏసీఐ కంపెనీ నకిలీ ఇన్వాయిస్లు సృష్టించింది. ఢిల్లీకి చెందిన పాట్రిక్స్ ఇన్ఫో సర్వీసెస్, ఇన్‌వెబ్ ఇన్ఫో సర్వీసెస్, అరిహంట్ ట్రేడర్స్, జీఏ సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే షెల్ కంపెనీలు తెరపైకి వచ్చాయి. ఒక్కో ఇన్వాయిస్కు 5 శాతం కమిషన్ చొప్పున దాదాపు 50 నకిలీ ఇన్వాయిస్లను సమర్పించింది. ఆ నకిలీ ఇన్వాయిస్ల ఆధారంగా రూ.241 కోట్లు ఏసీఐకి చెల్లించారు. దాన్నుంచి ఏసీఐ కంపెనీ తన 5 శాతం కమిషన్‌ను తగ్గించుకుని మిగిలిన మొత్తాన్ని తిరిగి ఢిల్లీలోని డిజైన్ టెక్ కంపెనీకి చెల్లించింది. అంటే పనులు చేయకుండానే ప్రభుత్వం చెల్లించిన మొత్తం రెండు షెల్ కంపెనీల ద్వారా తిరిగి చంద్రబాబు సన్నిహితులకు చెందిన డిజైన్ టెక్ కంపెనీకి వచ్చి చేరింది. ఆ విధంగా ఏపీఎస్ఎస్డీసీ నిధులను పక్కా పన్నాగంతో కొల్లగొట్టారు. ఇలా గుట్టు రట్టు.. నోట్ ఫైళ్లు మాయం 2018లో పూణేలో పన్ను ఎగవేతకు పాల్పడుతున్న పలు కంపెనీలపై కేంద్ర జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించి దాదాపు 220 షెల్ కంపెనీల గుట్టు రట్టు చేశారు. వాటిలో ఏపీఎస్ఎస్డీసీ పనులను సబ్ కాంట్రాక్టుకు తీసుకున్నట్టు చూపించిన స్కిల్లర్, ఏఐసీ తదితర కంపెనీలు కూడా ఉండటం గమనార్హం. ఆ కంపెనీల ప్రతినిధులను జీఎస్టీ అధికారులు విచారించగా.. తాము ఏపీఎస్ఎస్డీసీకి ఎలాంటి సాఫ్ట్‌వేర్‌గానీ హార్డ్‌వేర్‌గానీ సరఫరా చేయలేదని తెలిపారు. డిజైన్ టెక్ కంపెనీకి తాము షెల్ కంపెనీగా వ్యవహరించామని అంగీకరించారు. జీఎస్టీ అధికారులు ఈ విషయాన్ని తెలిపినప్పటికీ అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా పట్టించుకోలేదు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీలో పాత్రధారులు జాగ్రత్తపడ్డారు. సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలతో కాంట్రాక్టుకు సమ్మతించిన జీవో 4కు సంబంధించిన నోట్ ఫైళ్లను సచివాలయంలో మాయం చేశారు. ఏపీఎస్ఎస్డీసీలో కూడా సంబంధిత ఫైళ్లు గల్లంతు కావడం గమనార్హం. అక్కడా, ఇక్కడా ఆయనే.. అప్పటి సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ ఏపీఎస్ఎస్డీసీ నిధులు కొల్లగొట్టడంలో అన్నీ తామై వ్యవహరించారు. ఏపీఎస్ఎస్డీసీ ఎండీ–సీఈవోగా ఉన్న గంటా సుబ్బారావు అదే సమయంలో ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి, అప్పటి సీఎం చంద్రబాబుకు ఎక్స్అఫీషియో కార్యదర్శిగా వ్యవహరించారు. అంటే ఆయనే ప్రతిపాదిస్తారు.. ఆయనే ఆమోదిస్తారు.. సీఎంవోను కూడా ఆయనే పర్యవేక్షిస్తారు. దీనికి ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్‌గా ఉన్న లక్ష్మీ నారాయణ అన్ని విధాల సహకరిస్తారు. తదనంతరం వచ్చిన ఏపీఎస్ఎస్డీసీ ఎండీలు కూడా ఈ అడ్డగోలు వ్యవహారం గురించి తెలిసినప్పటికీ మౌనంగా ఉండటం విస్మయపరుస్తోంది. అరెస్టులకు రంగం సిద్ధం ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం కేసులో కీలక ఆధారాలు సేకరించిన సీఐడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ అవినీతి బాగోతంలో కీలకంగా వ్యవహరించిన షెల్ కంపెనీల ప్రతినిధులు కొందరిని ఇతర రాష్ట్రాల్లో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అక్కడి న్యాయస్థానాల నుంచి అనుమతి తీసుకుని వారిని రాష్ట్రానికి తీసుకురానున్నారు. వారి నుంచి మరిన్ని వాస్తవాలను రాబట్టి ఈ కేసులో సూత్రధారుల అవినీతి బండారాన్ని నిరూపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలి 2014–19 మధ్య కాలంలో ఏపీఎస్ఎస్డీసీలో నిధులు దారి మళ్లినట్టు మేము గుర్తించాం. దీనిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించగా నిధులు దారిమళ్లిన విషయం నిర్ధారణ అయ్యింది. దాంతో మేము ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం ఈ కేసు సీఐడీకి అప్పగించింది. పూర్తి స్థాయిలో విచారించి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. – అజయ్ రెడ్డి, చైర్మన్, ఏపీఎస్ఎస్డీసీ హల్చల్ చేసిన రాధాకృష్ణ, పయ్యావుల – సీఐడీ అధికారుల తనఖీలను అడ్డుకునేందుకు యత్నం – దీటుగా బదులిచ్చిన సీఐడీ అధికారులు సాక్షి, హైదరాబాద్ : ఏపీఎస్‌ఎస్‌సీడీ నిధుల గోల్మాల్ కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లో పలువురు నిందితుల ఇళ్లల్లో ఏపీ సీఐడీ అధికారుల తనిఖీల సందర్భంగా ఆంధ్రజ్యోతి–ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ హల్ చల్ చేశారు. ఏకంగా సీఐడీ అధికారులను అడ్డుకునేందుకు వారు యత్నించడం విస్మయ పరిచింది. తమ విధులు నిర్వహించకుండా రాధాకృష్ణ అడ్డుకోవడంపై సీఐడీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐడీ అధికారులు నిందితుడు లక్ష్మీ నారాయణ నివాసంలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో రాధాకృష్ణ అక్కడే ఉండటం గమనార్హం. విధి నిర్వహణలో ఉన్న సీఐడీ అధికారులను అడ్డుకోవడంతోపాటు ఏబీఎన్ చానల్ కెమెరామెన్లతో తనిఖీలను వీడియో తీయించడం వివాదాస్పదంగా మారింది. దర్యాప్తు అధికారులను బెదిరింపులకు గురిచేసేలా ప్రవర్తించిన రాధాకృష్ణ వ్యవహారంపై సీఐడీ ఉన్నతాధికారులు ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది. రాధాకృష్ణతో పాటు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కూడా లక్ష్మీనారాయణ నివాసానికి కార్యకర్తలతో వచ్చి హడావుడి చేశారు. తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా తనిఖీలు ఎలా చేస్తారని రాధాకృష్ణ, పయ్యావుల కేశవ్ ప్రశ్నించగా సీఐడీ అధికారులు దీటుగా బదులిచ్చారు. ఎఫ్ఐఆర్తో పాటు సోదాలకు సంబంధించిన ప్రోసీడింగ్ కాపీని జూబ్లీ హిల్స్ పోలీసులకు ఒక రోజు ముందే అందించామన్నారు. దీనిపై జూబ్లీహిల్స్ పోలీసులు స్పందించి తనిఖీల సమయంలో తమకు సహకరిస్తున్న విషయాన్ని తెలిపారు. దాంతో వేమూరి రాధాకృష్ణ, పయ్యావుల కేశవ్ మౌనంగా ఉండిపోయారు. సోదాలు నిర్వహించే సమయంలో స్వల్ప అస్వస్థత ఉందని లక్ష్మీనారాయణ చెప్పడంతో పోలీసులు ఆయన్ను బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. గంటా సుబ్బారావు ఇంట్లో సీఐడీ సోదాలు షాబాద్: ఏపీఎస్‌ఎస్‌సీడీ నిధుల గోల్మాల్ కేసుకు సంబంధించి నిందితుడైన గంటా సుబ్బారావు ఇంట్లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆయన 34 ఎకరాల భూమిని కొనుగోలు చేసి.. వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసుకొని ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఈయన ఇంట్లో ఉదయం నుంచి రాత్రి వరకు సోదాలు కొనసాగాయి. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. -
యూట్యూబర్ మరోసారి అరెస్ట్.. పవిత్ర స్థలంలో వీడియో చిత్రీకరణ
మధుర: యూట్యూబర్లు పర్యటక ప్రాంతాలు, ట్రావెల్, టెంపుల్స్ సందర్శనకు సంబంధించిన వీడియోలను తీసి తమ యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేస్తుంటారు. అయితే ఓ యూట్యూబర్ తీసిన వీడియో అతన్ని వివాదంలోకి నెట్టడమే కాక అరెస్ట్ అయ్యేలా చేసింది. వివరాల్లోకి వెళ్లితే.. ఉత్తరప్రదేశ్ బృందవనంలోని పవిత్ర స్థలంగా భావించే ‘నిధివన్ రాజ్’ స్థలాన్ని గౌరవ్ శర్మా అనే యూట్యూబర్ వీడియో తీశాడు. చదవండి: మెక్‌డొనాల్డ్స్ ‘టాయిలెట్’ వివాదం ఆ స్థలం రాధాకృష్ణులకు సంబంధించిన ఏకాంత స్థలమని నిధివన్ రాజ్ పూజారుల నమ్మకం. అయితే అక్కడ రాత్రి సమయంలో వీడియోలు చిత్రీకరించడం నిషేధంలో ఉంది. గౌరవ్ శర్మా అక్కడ రాత్రి సమయంలో తీసిన వీడియోను తన యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మళ్లీ డిలీట్ కూడా చేశాడు. అయితే ఆ వీడియో అప్పటికే వైరల్‌గా మారటంతో కొంతమంది పూజారులు నిరసన తెలిపి అభ్యంతరం వ్యక్తంచేశారు. నిధివన్ రాజ్ పూజారి రోహిత్ గోస్వామి ఫిర్యాదు మేరకు బృందావనం పోలీసులు గౌరవ్శర్మాను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం గౌరవ్‌ను జ్యుడీషియల్ కస్టడికి తరలించినట్లు పోలీసు అధికారి మార్తాండ్ ప్రకాశ్‌సింగ్ వెల్లడించారు. నవంబర్ 6వ తేదీ తన సోదురుడు ప్రశాంత్, స్నేహితులు మోహిత్, అభిషేక్‌లో కలిసి గౌరవ్ శర్మా నిధివన్రాజ్ను చిత్రీకరించినట్లు పోలీసులు తెలిపారు. అయితే గౌవర్ శర్మా గతంలో తన పెంపుడు కుక్కకు బెలూన్లు కట్టి గాల్లోకి ఎగరవేసిన ఘటనలో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. -
ప్రాంతీయ చిచ్చుకు చంద్రబాబు కుట్ర
సాక్షి, అమరావతి: ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలతో రాయలసీమ లిఫ్ట్ ఆపించాలంటూ లేఖ రాయించడాన్ని తప్పుబట్టారు. చంద్రబాబు, ప్రసార మాధ్యమాల అధిపతులు రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు రాష్ట్రానికి దెయ్యాల్లా దాపురించారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ఆ జిల్లాల అభివృద్ధికి వైఎస్సే కారణం ప్రకాశం, గుంటూరు జిల్లాలను వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎన్ఎస్పీ ఆధునికీకరణతో అభివృద్ధి చేశారు. వెలిగొండ ప్రాజెక్టును తీసుకొచ్చారు. గుండ్లకమ్మ రిజర్వాయర్, రామతీర్థం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేశారు. కొర్సిపాడు లిఫ్ట్, సోమశిల నుంచి రాళ్లపాడుకు సామర్థ్యం పెంచడం వైఎస్సార్ కాలంలోనే జరిగాయి. ఈ జిల్లాలకు చంద్రబాబు చేసిందేంటి? వెలిగొండ పనులు వైఎస్సార్ కాలంలో 11.5 కిలోమీటర్లు పూర్తయితే.. చంద్రబాబు ఐదేళ్లలో 4 కిలోమీటర్లు మాత్రమే పూర్తిచేశారు. జగన్ 18 నెలల్లోనే మొదటి టన్నెల్‌ను 2.8 కిలోమీటర్లు, రెండో టన్నల్‌ను కిలోమీటరుకుపైగా పూర్తిచేశారు. రెండో టన్నెల్‌ను కూడా 2023లోగా పూర్తిచేసి నీరందించేందుకు కృషిచేస్తున్నారు. గోదావరి నుంచి నీరు తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజీ నుంచి ఎన్ఎస్పీ కెనాల్‌కు పంపేందుకు ఇప్పటికే రూ.500 కోట్లు ఖర్చుచేశారు. భయపడి తెలంగాణతో బాబు రాజీ తెలంగాణలో ఐదేళ్లలోనే పాలమూరు రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల ప్రాజెక్టులు కట్టారు. ఓటుకు కోట్లు కేసులో చిక్కుకున్న చంద్రబాబు తెలంగాణతో రాజీపడ్డాడు. అప్పట్లోనే చంద్రబాబు.. రాయలసీమ ఎత్తిపోతల ఆలోచన చేసి ఉంటే బాగుండేది కదా? పోతిరెడ్డిపాడులోంచి నీరు తీసుకెళ్తుంటే ఒకప్పుడు దేవినేని ఉమాతో ప్రకాశం బ్యారేజీ దగ్గర ధర్నా చేయించాడు. చిత్తూరు జిల్లాలో 3 రిజర్వాయర్లు కట్టి 8 నుంచి 10 టీఎంసీల నీరు నింపాలని వైఎస్ జగన్ ఆలోచిస్తే.. రాజకీయభిక్ష పెట్టిన జిల్లాకే ప్రాజెక్టులు రాకుండా కేసులు వేయించి అడ్డుకున్న దుర్మార్గుడు చంద్రబాబు. ఇంత దుష్ప్రచారమా? లేటరైట్‌ను బాక్సైట్ అంటూ చంద్రబాబు చేస్తున్నదంతా దుష్ప్రచారమే. ఈ ప్రభుత్వం లేటరైట్‌కు ఒక్క పర్మిషన్ ఇవ్వలేదు. కేవలం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులనే అమలు చేసింది. 2015లో పర్యావరణ అనుమతులు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే. 2018లో కోర్టు ఆర్డర్ ఇచ్చినా ఆయన ఎందుకు అడ్డుకోలేదు? తన పార్టీ వ్యక్తి అయ్యన్నపాత్రుడు, ఆయన కొడుకు గిరిజనుల పేరుతో మైన్లు తీసుకుని నడిపారు. వైఎస్ జగన్ అన్ని ప్రాంతాల అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు. నీటిహక్కు ఉన్నమేరే ప్రాజెక్టులు కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు ఇకనైనా నీచ రాజకీయాలు మానుకోవాలి. -
ఏబీఎన్ రాధాకృష్ణపై మంత్రి కొడాలి నాని ఫైర్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఏబీఎన్ అసత్యాలు ప్రచారం చేస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఏబీఎన్ రాధాకృష్ణ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలన్న కాంక్షతో పిచ్చి రాతలు రాస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబు తన కుటుంబసభ్యులను కూడా నమ్మరు. అధికారం కోసం క్షుద్ర పూజలు చేసిన దుర్మార్గుడు చంద్రబాబు’’ అంటూ కొడాలి నాని ధ్వజమెత్తారు. గత పదేళ్లుగా వైఎస్ జగన్ వ్యక్తిత్వంపై ఎల్లో మీడియా దాడులు చేస్తోందని.. పార్టీలో చేరడానికి కండిషన్స్ పెట్టే దుస్థితి సీఎం జగన్‌కు లేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లో అందరూ స్వచ్చందంగానే చేరారని.. ఎల్లో మీడియా పిచ్చిరాతలు రాస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. కోర్టుల్లో పరువునష్టం దావా వేస్తామని మంత్రి హెచ్చరించారు. ‘‘వైఎస్ జగన్ ఆత్మస్థైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరు. వైఎస్సార్, వైఎస్ జగన్‌ను తక్కువ చేయాలని తప్పుడు రాతలు రాసి.. ప్రజల్లో క్రెడిబిలిటి రాధాకృష్ణ పోగొట్టుకున్నాడు. ప్రజల గుండెల్లో వైఎస్ఆర్, వైఎస్ జగన్ ఉన్నతస్థాయిలో ఉన్నారని’’ మంత్రి నాని అన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ సంక్షేమ పాలన సాగుతోందని.. అది చూసి ఓర్వలేక ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. మూడు నెలలకోసారి ఏపీకి వచ్చే చంద్రబాబుకు పబ్లిసిటీ కోసం దీక్షలు చేయడం అలవాటేనని’’ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. చదవండి: రామోజీ హోటళ్లలో విదేశీ మద్యం అమ్మొచ్చా? ‘లోకేశ్.. మీరు పరీక్షలు కరెక్టుగా రాసి పాసయ్యారా?’ -
సినీ నిర్మాత సాగరికపై ఫిర్యాదు
పంజాగుట్ట: ఒప్పందం ప్రకారం రెమ్యునరేషన్ చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న సినీ నిర్మాతపై చర్యలు తీసుకోవాలంటూ ఓ నటుడు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడాలోని పడాల రామిరెడ్డి లా కాలేజీ సమీపంలో నివాసముంటున్న సినీ నటుడు కెప్టెన్ చౌదరీ 2018లో రాధాకృష్ణ అనే చిత్రంలో నటించాడు. ఇందుకుగాను నటించే సమయంలో రోజుకు 30000 రూపాయలు రెమ్యూనరేషన్ అందించడంతోపాటు రవాణా, అసిస్టెంట్లకు సైతం వేతనాలు చెల్లించాలని ఒప్పందం కుదుర్చుకున్నామని కెప్టెన్ చౌదరి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సినీమాలో 14రోజులపాటు నటించిన తనకు ఇప్పటి వరకు రెమ్యూనరేషన్ చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న సినీ నిర్మాత సాగరికపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అయన కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కెనడా నుంచి వచ్చి ఇంట్లో ఉరేసుకుని.. -
‘రాధాకృష్ణ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు..
-
ఎల్లో మీడియా, బాబుపై మంత్రి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం కొంతమందికి ఇబ్బందిగా ఉందని మంత్రి కొడాలి నాని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియాతో కుమ్మకై సొంత డబ్బా కొట్టుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు లాంటి దద్దమ్మ పాలనలో ఇష్టం వచ్చినట్లు రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు. బోగస్ న్యూస్ ఛానల్ (ఎబీఎన్)లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. సీఎం వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేందుకు పెద్ధిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టారని అసత్య ప్రచారం మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు లాంటి వెన్నుపోటు కార్యక్రమాలు మా పార్టీలో జరగవు అని స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగన్ రెక్కల కష్టంతో ప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు. (చదవండి: మీ నీచ రాజకీయాలు రాష్ట్రం మొత్తం తెలుసు బాబూ) మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. ‘బోగస్ న్యూస్ ఛానల్ ప్రచారంతో ఎంత ప్రయత్నించినా సీఎం జగన్‌ను ఏం చేయలేరు. వెన్నుపోటు పొడిచే సంస్కృతి మాకు లేదు. వెన్నుపోటుతో మామను చంపి అందలం ఎక్కిన చంద్రబాబుకు ఆందరూ తనలాగే ఉంటారని భావిస్తున్నాడు. సీఎం జగన్ ప్రజల కోసం పార్టీ పెట్టి కష్టపడి ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి. ఆయనను సీఎం నుంచి దించేస్తే ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో ఏం జరిగిందో ప్రజలకు తెలుసు. చంద్రబాబుకు రామోజీ రావు, రాధాకృష్ణ డైరెక్షన్ ఇచ్చి నడిపిస్తారు. డబ్బా ఛానెళ్ళు ద్వారా అసత్య ప్రచారాలు చేసినా ఉపయోగం లేదు. ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏం కావాలో సీఎం జగన్‌కు తెలుసు. ఆయనకు ఏం కావాలో ప్రజలకు తెలుసు. రామోజీ రావు, రాధాకృష్ణ, బిఅర్ నాయుడు, చంద్రబాబు ఎంత మంది కుట్ర దారులు వచ్చినా సీఎం వైఎస్ జగన్‌ను ఏం చేయలేరు. చంద్రబాబు పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎల్లో మీడియా పెద్దలు కోట్ల రూపాయల ప్రజాసొమ్ము కొల్లగొట్టారు. సచ్చే ముందు అయినా ఆ దుష్ట చతుష్టయం చిల్లర పనులు మానుకోవాలి. విశ్వాసం చూపి ఆంధ్రప్రజల ఋణం తీర్చుకోవాలి’ అని కొడాలి నాని హితవు పలికారు. (చదవండి: చంద్రబాబుకు తగిన శాస్తి చేస్తాం: కొడాలి నాని) -
యూట్యూబ్‌లో దూసుకుపోతున్న కలెక్టర్ భక్తి పాట
ఐఏఎస్ (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్) అధికారిణి, సీనియర్ సివిల్ సర్వెంట్ రాఖీ గుప్తా ఇటీవల విడుదల చేసిన భక్తి గీతం ‘మై తోహ్ రతుంగి రాధా నామ్’ ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. నాలుగన్నర నిడివి గల ఈ పాటను అక్టోబర్ 18వ తేదీన యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను లక్షకు పైగా వీక్షించారు. ఈ వీడియో రాధా కృష్ణలకు సంబంధించింది. ఇది కృష్ణుని పట్ల భక్తులకు ఉండే భావాన్ని తెలియజేస్తోంది. ఈ వీడియోని రాఖీ గుప్తా ఆమె తల్లికి, తన కుటుంబ సభ్యులకు అంకితమిచ్చింది. శ్రీకృష్ణుడు జన్మించిన బృందావనంలోనే ఈ వీడియోను చిత్రీకరించారు. ఈ వీడియో తీయాలని గత ఏడాదే అనకున్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడింది. దీనికి గౌరవ్ దేవ్, కార్తీక్ దేవ్ సంగీతమందించారు. ఆన్లైన్లో వైరల్ అవుతున్న ఈ వీడియోను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. చాలా బాగా నటించారు అని కొందరు నెటిజన్లు ప్రశంసించగా, మీ స్వరంతో మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేశారు మేడం అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. చదవండి: అక్కడ గెలిస్తే.. అధికారం చేతికొచ్చినట్టే -
‘రాధాకృష్ణ’ మూవీ స్టిల్స్
-
‘ఆ బాధ నీలో స్పష్టంగా కనిపిస్తోంది కిట్టన్నా’
సాక్షి, అమరావతి: ‘‘ఆంధ్రజ్యోతి కిట్టు గారూ.. జగన్ గారి ప్రభుత్వం ఏడాదిలోనే 90 శాతం హామీలను నెరవేర్చడంతో మీ పార్టనర్ చంద్రబాబుకు రాజకీయ జీవితం లేకుండాపోయిందన్న బాధ నీలో స్పష్టంగా కనిపిస్తోందంటూ’’ ట్విట్టర్ వేదికగా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చురకలు అట్టించారు. ఈ కడుపుమంటకు మందు లేదని.. మీ రాతలు నమ్మడానికి 1980 నాటి రోజులు కావని గుర్తుంచుకో కిట్టన్నా’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ('కెలికి తిట్టించుకోవడం బాబుకు అలవాటే') ‘‘టీడీపీ - బీజేపీ పొత్తు గురించి నీకెందుకు అంత ఆత్రం. టీడీపీ కి తలుపులు శాశ్వతంగా మూసేశామని అమిత్ షా గారు పదే పదే చెప్పారు. ఎన్నికలకు ముందు మోదీ తల్లిని, భార్యను సీబీఎన్ అసభ్యంగా అన్నమాటలను ఎవరూ మరిచిపోరమ్మా’’ అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు ‘‘వైఎస్సార్సీపీ ఎంపీల్లో అసమ్మతి అంటూ కట్టుకథలు, గాలి పోగేసి వార్తలు తర్వాత రాసుకోవచ్చు.. ముందు మీ ఉద్యోగుల్లో అసమ్మతి పెరిగి, టీవీ రేటింగ్స్ పాతాళానికెళ్లాయి చూసుకోమ్మా’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. -
నిర్మల్ కొయ్యబొమ్మల నేపథ్యంలో...
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న లక్ష్మీ పార్వతి తొలిసారి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘రాధాకృష్ణ’. అనురాగ్, ముస్కాన్ శెట్టి జంటగా నటించారు. ప్రసాద్ వర్మ దర్శకత్వం వహించారు. దర్శకుడు ‘ఢమరుకం’ శ్రీనివాస్ రెడ్డి సమర్పణలో హరిణి ఆరాధ్య క్రియేషన్స్ పతాకంపై పుప్పాల సాగరిక, శ్రీనివాస్ కానూరు నిర్మించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కనుమరుగవుతున్న నిర్మల్ కొయ్య బొమ్మల కథ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. అందరి హృదయాలను హత్తుకునే ఆప్యాయతలు ఉంటాయి. పల్లె వాతావరణంలోని అన్ని రకాల భావోద్వేగాలతో కూడిన ఒక అందమైన ప్రేమకథ ఇది. ఎక్కడా రాజీ పడకుండా అనుకున్న విధంగా చిత్రీకరించాం. నిర్మాణానంతర కార్యక్రమాలు అతి త్వరలో పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. సంపూర్ణేష్ బాబు, అలీ , కృష్ణ భగవాన్, చమ్మక్ చంద్ర ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా: టి.సురేందర్ రెడ్డి, సంగీతం: ఎమ్.ఎమ్.శ్రీలేఖ. -
భవంతిలో.. జ్ఞాపకాలలో...
యాభై ఏళ్ల క్రితం నాటి భవంతి అది. అందులో ఓ గదిలో పియానో, పక్కనే మెట్లు, గోడలపై జ్ఞాపకాలను గుర్తు చేసే ఫ్రేమ్స్.. ఆ లొకేషన్లోకి స్టైల్‌గా అడుగుపెట్టారు ప్రభాస్. అక్కడికి వెళ్లి ఏం చేశారు? అనే విషయం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ప్రభాస్ హీరోగా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘జాన్’ (వర్కింగ్ టైటిల్) అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై కృష్ణంరాజు, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1970 నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ మూవీ చిత్రీకరణ కోసం హైదరాబాద్‌లో భారీ సెట్స్‌ను తయారు చేయించారు. కొంత బ్రేక్ తర్వాత ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ శుక్రవారం ప్రారంభమైంది. భవంతి సెట్లో ప్రభాస్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. వారం రోజుల తర్వాత పూజా హెగ్డే కూడా ఈ చిత్రీకరణలో పాల్గొంటారు. ఆ సమయంలో కొన్ని ప్రేమ సన్నివేశాలతో పాటు ఓ పాటను కూడా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది. -
అల్లువారి జీవితాలు ప్రేక్షకులకు అంకితం
‘‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తర్వాత పూర్తి వినోదంతో ఉండే పెద్ద సినిమా చేయాలనుకున్నాను.. అప్పుడు నాకు గుర్తొచ్చిన పేరు త్రివిక్రమ్‌గారే. మేమిద్దరం కలుసుకొని ఆనందంగా ఓ సినిమా చేయాలనుకున్నాం. అలా చేసిందే ‘అల.. వైకుంఠపురములో..’. మా సినిమాను బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజాహెగ్డే జంటగా నటించిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. అల్లు అరవింద్, రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా ఆదివారం విడుదలైంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘రాధాకృష్ణ, త్రివిక్రమ్‌గార్లతో హ్యాట్రిక్ కొట్టాం. మా నాన్నగారికి(అల్లు అరవింద్) బాగా డబ్బులు రావాలని, అందులో నాకు వాటా ఇవ్వాలని కోరుకుంటున్నా(నవ్వుతూ). పూజాహెగ్డేతో ‘డీజే’ తర్వాత ఈ సినిమా చేశా.. తనతో మళ్లీ నటించాలనుంది. మేమెంత నటించినా, సాంకేతిక నిపుణులు ఎంత గొప్పగా పనిచేసినా సినిమాకి దర్శకుడు ప్రాణం లాంటివాడు. ఆ ప్రాణం లేకపోతే మేమెంత చేసినా శవానికి అలంకరించినట్టే. బంధుప్రీతి గురించి చాలా మంది కామెంట్ చేస్తుంటారు. దేవుడికి ఒక పూజారి తన జీవితం అంకితం చేస్తాడు.. ఆ తర్వాత వాళ్ల అబ్బాయి, ఆ తర్వాత వాళ్ల వాళ్ల అబ్బాయి.. ప్రేక్షక దేవుళ్లను వినోదపరచడానికి మా అల్లు కుటుంబం కూడా అంకితం. మా తాతగారు(అల్లు రామలింగయ్య) చేశారు, మా నాన్నగారు చేశారు, నేనూ చేస్తున్నాను.. ఉన్నంతకాలం చేస్తూనే ఉంటాం’’ అన్నారు. ‘‘కళామతల్లి పాదాల వద్ద సేద తీర్చుకుంటున్న కుటుంబం మాది. మమ్మల్ని ప్రేక్షకులు ఆశీర్వదిస్తున్నారు. ఈ సినిమా కలెక్షన్లు బన్నీ, త్రివిక్రమ్‌ల కెరీర్లోనే కాదు.. ఇండస్ట్రీలోనే బెస్ట్‌గా నిలబడతాయని అంటున్నారు. 18న వైజాగ్‌లో ఈ సినిమా సక్సెస్ మీట్ చేయబోతున్నాం’’ అన్నారు అల్లు అరవింద్. ‘‘ఈ సినిమాలో మేం దాచిన సర్ప్రైజ్లు రెండు.. ఒకటి శ్రీకాకుళం ‘సిత్తరాల సిరపడు’ పాట.. రెండోది బ్రహ్మానందంగారు. ఆయన కనపడగానే ప్రేక్షకులు బాగా గోల చేశారు. సుశాంత్ కథ వినకుండానే చేశాడు. రూపాయి అడిగితే రెండు రూపాయిలు ఇచ్చిన అరవింద్‌గారు, రాధాకృష్ణగారికి థ్యాంక్స్. బన్నీ చాలా తపన ఉన్న నటుడు.. తనలోని గొప్ప నటుడిని ఈ సినిమాలో చూపించారు. సచిన్‌కి ఫుల్ టాస్ వేసినా, బన్నీకి ఇలాంటి సినిమా వచ్చినా సిక్సరే’’ అన్నారు త్రివిక్రమ్. ‘‘బాధ్యత నన్ను మరింత బాగా పని చేయించింది. సంక్రాంతి రేసులో పరిగెత్తాం. కొంచెం బరువున్నా నేనే గెలిచేలా చేశారు’’ అన్నారు సంగీత దర్శకుడు తమన్. ‘‘డీజే: దువ్వాడ జగన్నాథమ్’ సినిమా టైమ్‌లో బన్నీగారికి ఫ్యాన్ అయ్యాను.. ఈ సినిమాతో త్రివిక్రమ్‌గారికి ఫ్యాన్ అయిపోయాను’’ అన్నారు పూజా హెగ్డే. ఈ కార్యక్రమంలో నటులు తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, సునీల్, సుశాంత్, నవదీప్, హర్షవర్ధన్, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్, ఎడిటర్ నవీన్ నూలి తదితరులు పాల్గొన్నారు. -
'రాజకీయ అవసరాల కోసమే ఇలాంటి కుట్రలు'
సాక్షి, తిరుమల : రాజకీయ అవసరాల కోసం తిరుమలలో చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణలు కలిసి కుట్రలు చేస్తున్నారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. కుట్రలో భాగంగానే టీటీడీలో అన్యమత ప్రచారమని దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ అవసరాల కోసం తిరుమలను వాడుకుంటూ రాష్ట్రంలో మత కల్లోలం సృష్టించాలని వారు భావిస్తున్నట్లు ధ్వజమెత్తారు. అతిపెద్ద హిందూ దేవస్థానమైన టీటీడీపై అన్యమత ముద్ర వేస్తూ ఒక ప్రముఖ దినపత్రిక ప్రచురణ చేయడం దురదృష్టమని పేర్కొన్నారు. మీడియా చేతిలో ఉందని తప్పుడు వార్తలు ప్రచారం చేయడాన్ని దేవుడు కూడా క్షమించడని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీని అన్ని మతాల వారు ఓట్లు వేసి గెలిపించారు. టీటీడీలో ఇతర మతాలకు సంబంధించిన గుర్తులు ఉన్నాయంటూ ఆరోపణలు చేయడం తగదన్నారు. టీటీడీ వెబ్సైట్లో ఎలాంటి అన్యమత ప్రచారం జరగడం లేదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై గూగుల్ నుంచి వివరణ కోరనున్నట్లు ఆయన తెలిపారు. గతంలో కూడా తిరుమలలోని ఏడు కొండలపై సిలువ గుర్తు ఉందంటూ, బస్సు టికెట్ లో ఇతర మతాల గుర్తులు ఉన్నాయంటూ దుష్ప్రచారం చేసారని మండిపడ్డారు. టీటీడీని భ్రష్టు పట్టించే విధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. టీటీడీ వెబ్సైట్లో దుష్ర్పచారం జరగకుండా ఉండేందుకు సైబర్‌క్రైమ్‌ను ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరతామని వెల్లడించారు. వివాదానికి కారణమైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి పాలకమండలిలో చర్చించి వాటిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. వైకుంఠ ద్వారాలు పదిరోజులు తెరుస్తామని టీటీడీ ఎలాంటి ప్రకటన చేయలేదని టీటీడీ ఈవో సింఘాల్ పేర్కొన్నారు. టీటీడీ పంచాంగంలో శ్రీయైనమః పదానికి బదులుగా గూగుల్ అనువాదంలో శ్రీయేసయ్య నమః అని వచ్చినట్లు తెలిపారు. ఫోటోగ్రాఫ్ లో ఉన్న పదాలను ప్రాంతీయ భాషల్లో అనువాదం చేయడంలో గూగుల్ లో పొరపాట్లు జరుగుతుంటాయని ఆయన పేర్కొన్నారు. అధికారికంగా ఏ నిర్ణయం తీసుకోకుండానే మీడియాలో చర్చలు పెడుతున్నారని వివరించారు. అసలు అన్యమత ప్రచారం చేస్తున్న విషయం టీటీడీ వెబ్సైట్లో లేదని, గూగుల్ సెర్చ్‌లో మాత్రమే అది కనిపిస్తోందని పేర్కొన్నారు. -
స్కూల్ టీచర్‌కి ప్రభాస్ ప్రేమ పాఠాలు!
స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పడానికి సిద్ధమవుతున్నారు పూజా హెగ్డే. చాక్‌పీస్, డస్టర్ తీసుకొని టీచర్‌గా మారడానికి రెడీ అవుతున్నారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా ‘జాన్’ (వర్కింగ్ టైటిల్) అనే చిత్రం తెరకెక్కుతోంది. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకుడు. 1960లలో ఇటలీలో జరిగే ప్రేమకథగా ఈ సినిమా కథాంశం ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో పూజా స్కూల్ టీచర్ పాత్రలో కనిపిస్తారనే వార్త ప్రచారంలో ఉంది. మరి ఈ స్కూల్ టీచర్‌కి ప్రభాస్ ఎలా ప్రేమ పాఠాలు చెప్పారో స్క్రీన్ మీద తెలుసుకోవడమే. యూవీ క్రియేషన్స్, గోపీ కృష్ణ మూవీస్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. -
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు అరెస్ట్ వారెంట్
సాక్షి, కృష్ణా: ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ రాధాకృష్ణకు జగ్గయ్యపేట కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసింది. అసత్య వార్తలు ప్రచురించారని ఆరోపిస్తూ.. జగ్గయ్యపేటకి చెందిన ముత్యాల సైదేశ్వరరావు.. పత్రిక ఎండీ రాధాకృష్ణ, ఎడిటర్ శ్రీనివాస్‌లపై గతంలో పరువునష్టం దావా వేశారు. అయితే కేసు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి పలుమార్లు నోటీసులు జారీచేసినా వారు హాజరుకాలేదు. దీంతో రాధాకృష్ణ, శ్రీనివాస్‌ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. బుధవారం వారిద్దరికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కేసు వివరాల ప్రకారం.. రెండేళ్ల క్రితం సైదేశ్వరరావు ఓ భూమిని కొనుగోలు చేసి రిజిష్ట్రేషన్ చేసుకున్నారు. అయితే దీనిపై ఆంధ్రజ్యోతి పత్రికలో ఓ కథానాన్ని ప్రచురించారు. ఆ కథనం పూర్తిగా అసత్యమైనదని ఆరోపిస్తూ.. సైదేశ్వరరావు జగ్గయ్యపేట కోర్టును ఆశ్రయించారు. ఎండీ రాధాకృష్ణ, ఎడిటర్ శ్రీనివాస్, జిల్లా ఇన్ఛార్జ్ మాధవి, స్థానిక విలేకర్లు వెంకట రమేష్, నాగేశ్వరరావు, అదే విధంగా తప్పుడు ప్రకటన చేసిన నారాయణం, కృష్ణారావులపై పరువునష్టం కేసు వేశారు. ఈ కేసు విచారణలో భాగంగా వారందరూ కోర్టుకు హాజరుకావాల్సింది న్యాయమూర్తి అనేక సార్లు నోటీసులు జారీ చేశారు. అయినా కూడా వారు వాయిదాలకు హాజరుకాకపోవడంతో కోర్టు అరెస్ట్ వారెంట్‌ను జారీచేసింది. వారెంట్‌ను రద్దు కోరుతూ.. రాధాకృష్ణ తరఫు న్యాయవాది కోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా న్యాయమూర్తి దానిని తిరస్కరించారు. -
‘ఏబీఎన్ రాధాకృష్ణ చెప్పిన వారికే టీడీపీ సీట్లు, కోట్లు’
సాక్షి, కాకినాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెప్పివారికే టీడీపీ సీట్లు, కోట్లు ఇచ్చారని ఆ పార్టీకి చెందిన కాపు ప్రజాప్రతినిధులు ఆరోపించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించడానికి టీడీపీ కాపు ప్రజాప్రతినిధులు గురువారం కాకినాడలో సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ టార్గెట్‌గా సాగినట్టు తెలుస్తోంది. లోకేశ్ తన సొంత సామాజిక వర్గానికే పార్టీలో పెద్దపీట వేస్తున్నారని నేతలు విమర్శించారు. చంద్రబాబు, లోకేశ్‌లు కాపులను అవమానంగా చూసేవారని తెలిపారు. ఎన్నికల సమయంలో నిధులు కూడా ఒక సామాజిక వర్గానికే ఎక్కువగా ఇచ్చారని తెలిపారు. కాపు ప్రజా ప్రతినిధులను కలవడానికి కూడా సమయం ఇవ్వలేదన్నారు. సూటు బూటు వేసుకున్న వారికే లోకేశ్ ఎక్కువ సమయం కేటాయించే వారని మండిపడ్డారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం నేతల కంటే కమ్మ సామాజిక వర్గం వారికే పార్టీ ఫండ్ ఎక్కువగా ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రభాస్ కొత్త సినిమా.. 30 కోట్లతో 8 సెట్లు
బాహుబలి స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే ప్రభాస్ హీరోగా తెరకెక్కే సినిమాలన్నీ అదే స్థాయిలో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం సాహోతో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్. సాహో షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాను హాలీవుడ్ స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్‌తో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. రాధకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను కూడా అదే స్థాయిలో రూపొందిస్తున్నారు. పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో పురాతణ ఇటలీని తలపించేలా 8 సెట్స్‌ను వేశారు. కేవలం ఈ సెట్స్ కోసం 30 కోట్ల వరకు ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను ప్రభాస్ పెదనాన సీనియర్ హీరో కృష్ణం రాజు గోపి కృష్ణ మూవీస్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. -
‘ఏబీఎన్ రాధకృష్ణపై ఫిర్యాదు చేస్తాం’
సాక్షి, విజయవాడ : ఉద్యోగుస్తులను కించపరిచేలా మాట్లాడిన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ మాటలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థించడం సిగ్గు చేటని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగస్తులను కించపరిచేలా మాట్లాడిన రాధాకృష్ణపై ఎన్నికల సంఘంతో పాటు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల పేరుతో ప్రభుత్వానికి తొత్తులుగా వారిపై ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల విధుల నిర్వహణకు డ్యూటీలు వేసి వారికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఎందుకు కల్పించడంలేదో సమాధానం చెప్పాలన్నారు. ఉద్యోగులకి ఓటు హక్కు లేకుండా చేస్తున్న వారిని ఉపేక్షించేది లేదన్నారు. ఎన్నికల నిర్వహణకు వెళ్లే ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకన్నతర్వాతే విధులకు హాజరు కావాలని సూచించారు. ఇది చదవండి : ఆ.. నా కొడుకులకు జీతాలివ్వడానికా పన్నులు వసూలు చేసేది? -
ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ నుంచి ‘వాడి’ పేరు తీసేస్తా
సాక్షి, అమరావతి : తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరు ఎక్కడా కనిపించకుండా చేసేందుకు చంద్రబాబు పన్నిన కుట్ర బట్టబయలైంది. తెలుగుదేశం వ్యవస్థాపకుడు, అన్న నందమూరి తారకరామారావు పేరును ఏ ప్రభుత్వ పథకానికీ లేకుండా చేసేందుకు చంద్రబాబు, తోకపత్రిక యజమాని రాధాకృష్ణతో కలసి ఎన్టీఆర్‌ను దూషించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకోవడమే కాకుండా.. అసలు ఆయన పేరే ఎక్కడా కన్పించకుండా చేసేందుకు ఇద్దరూ కలసి పన్నిన కుట్రపై ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని పేరు ఇంకా ఎందుకు మార్చలేదు అన్న తోకపత్రిక ఎండీ రాధాకృష్ణతో.. తెలుగుదేశం వ్యవస్థాపకుడు అన్న ఎన్టీ రామారావును ఉద్దేశించి ‘‘వాణ్ణి అనవసరంగా క్యారీ చేస్తున్నాం.. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీలోంచి వాడి పేరు ఎత్తేసి మన మీడియాలో ఫుల్ పబ్లిసిటీ ఇద్దాం. ఆరు నెలల తర్వాత ఇక చూసుకో..’’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఎన్టీఆర్ పేరుతో ఉన్న ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య భరోసా)ను పేరు మార్చడంతోపాటు ఆరు నెలల తర్వాత పూర్తిగా దీనిని ఎత్తి వేయాలని వారు పథకం వేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, చంద్రబాబు మధ్య ఈ కుట్రకు సంబంధించి జరిగిన సంభాషణల వీడియో ‘సాక్షి’కి లభించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. టీవీ లైవ్ ప్రోగాంకు ముందు వీరిద్దరూ మాట్లాడుకున్న మాటలు వీరి కుట్రను బట్టబయలు చేశాయి. వారు తలచుకుంటే ఎంత విష ప్రచారమైనా చేయగలరని, దేనినైనా తారుమారు చేసే కుట్రలకు బీజాలు వేస్తారని మరోమారు రూఢీ అయింది. ఆరోగ్యశ్రీకి ఎన్టీఆర్ వైద్య భరోసా అనే పేరు మార్చిన విషయం విదితమే. ఇందులో ఎన్టీఆర్ పేరును తొలగించే విషయం రాధాకృష్ణ చంద్రబాబు మధ్య చర్చకు వచ్చింది. పేరు తొలగిద్దామనగానే తీసేయండి అని రాధాకృష్ణ సలహా ఇచ్చేశారు. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది... వాడి పనైపోయింది చంద్రబాబు : అప్పుడా టెక్నాలజీ లేదు. ఇప్పుడు వినియోగిస్తున్నాం. అదో టెక్నాలజీ. ఉద్యోగాలు, గిద్యోగాలు పోవడం..కరువు వచ్చినప్పుడు చేయకుండా పోవడం, ఉద్యోగస్తులను తిట్టడం.... రాధాకృష్ణ : అప్పుడు మీరు చేసినంత ఫుడ్‌ఫర్ వర్క్ ఎవరూ చేయలేదు. చంద్రబాబు : దానిని మిస్ యూజ్ చేశారు. రాధాకృష్ణ : ఫస్ట్ వైజాగ్, తర్వాత తిరుపతి, చివరకు విజయవాడ లైవ్‌లోకి తీసుకోండి. ఏబీఎన్ లైవ్‌కు యూట్యూబ్‌లో హైయ్యెస్ట్ లైక్స్ రావాలి. రాధాకృష్ణ : యూట్యూబ్‌లో మనది టాప్. చంద్రబాబు : వ్యూయర్షిప్లో మనది ఎంత? రాధాకృష్ణ : మనది మూడు లేదా నాలుగో స్థానం టెక్నికల్ టీమ్: (చంద్రబాబుతో) వైజాగ్ ఇంకో సిటీని కలిపాం సార్ చంద్రబాబు : ఇప్పటివరకు ఎన్ని ఉన్నాయి? రెండూ కలిపితే లక్షా ఇరవై వేలు ఉంటాయా? నేను చెప్పినప్పుడు నీవు వస్తావా? రాధాకృష్ణ : వచ్చినా నష్టంలేదు. చంద్రబాబు : నేను అడిగినప్పుడు నీవు ఆపరేట్ చేయి. రాధాకృష్ణ : ప్యాకేజీ ఇంకా మొదలు కాలేదుగా. వేరే వ్యక్తి : మొదలు కాలేదు సర్. రాధాకృష్ణ :ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అనే ఉందా పేరు? చంద్రబాబు : వాడి పేరు మార్చాలి.. మారుస్తున్నా.. రాధాకృష్ణ : మొన్న చెప్పింది ఇదే. దాన్ని టోటల్‌గా రీవ్యాంప్ చేయాలి. దానికి భారీగా మన మీడియాలో పబ్లిసిటీ ఇచ్చేద్దాం. చంద్రబాబు : మార్చేస్తున్నా. వేరే పేరు మార్చేస్తున్నా. వాడి పనై పోయింది (ఎన్టీఆర్‌ను ఉద్దేశించి) రాధాకృష్ణ : ఆ ఓకే. చంద్రబాబు : ఎన్టీఆర్... పేరు మార్చాలి. రాధాకృష్ణ : దానిని వేరే పేరు మార్చాలి. దానిని యూనివర్సల్ హెల్త్ స్కీమ్ చేస్తున్నారు కదా. పేరు మార్చేద్దాం. పబ్లిసిటీ బాగా ఇద్దాం. రీవ్యాంప్ చేద్దాం. ఈలోగా టెక్నికల్ వారితో సంభాషణ ఏ సబ్జెక్టులు ఉన్నాయి. వైజాగ్‌లో ఏమి పెట్టారు. వైజాగ్‌లో ఎల్ఈడీ...తదితర అంశాలున్నాయి. -
చంద్రబాబుపై పోసాని ఫైర్
-
చంద్రబాబుకు కులపిచ్చి
-
మెడికల్ రిపోర్ట్‌ను ఈసీకి పంపించాను
-
‘రాధాకృష్ణా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో’
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ నుంచి దర్శక నిర్మాత పోసాని కృష్ణమురళికి నోటీసులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పోసాని స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి మీడియాకు తెలియజేశారు. అయితే ఈ వార్తను ఏబీయన్ ఆంధ్రజ్యోతి వక్రీకరించి ప్రసారం చేసిందని పోసాని కృష్ణమురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అబద్ధాలు ప్రసారం చేసిన ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణపై పోసాని విరుచుకుపడ్డారు. ప్రస్తుతం తాను రూపొందిస్తున్న సినిమాలో చంద్రబాబును అవమానించినట్టుగా టీడీపీ నాయకులు కంప్లయింట్ ఇచ్చారని ఈసీ, పోసానికి నోటీసులు పంపింది. అయితే పోసాని తన సినిమా ఇంకా ఫస్ట్ కాపీ రెడీ కాలేదని సినిమాలో ఏముందో ఎవరికీ తెలిసే అవకాశం లేదని, ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి కారణంగా స్వయంగా వచ్చి కలవలేకపోతున్నట్టుగా ఈసీకి సమాధానం ఇచ్చారు. తాను యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టుగా అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్‌ను సైతం ఈసీకి పంపించానన్నారు. (చదవండి : బాబు దొంగని ప్రజలకు తెలియదా! మళ్లీ సినిమా ఎందుకు?) అయితే పోసాని, చంద్రబాబును కులం పేరుతో విమర్శించినందుకు ఈసీ నోటీసులు ఇచ్చినట్టుగా వార్తను వండి వార్చింది ఆంధ్రజ్యోతి. అంతేకాదు ఆంధ్రజ్యోతి లైవ్‌లో కుటుంబరావు, పోసాని ఆరోగ్యం బాలేనట్టుగా అబద్ధాలు చెప్తే అది పెద్ద నేరంగా పరిగణిస్తారంటూ చెప్పటంపై పోసాని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అబద్దాలు చెప్పాల్సిన అవసరం లేదన్న పోసాని.. అబద్దాలు చెప్పటం, మోసం చేయటం, వెన్నుపోటు పొడవటం చంద్రబాబు నైజం అని విమర్శించారు. అంతేకాదు చంద్రబాబుకు ఆయన పార్టీ నాయకులకు కులపిచ్చి ఉందని తాను చేసిన వ్యాఖ్యల విషయంలో వెనక్కి పోయేది లేదన్నారు పోసాని. అందుకు సాక్ష్యంగా గతంలో చంద్రబాబు ‘ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలనుకుంటారు’ అన్న వ్యాఖ్యలతో పాటు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ‘ మీరు దళితులు, మీరు వెనకబడిన వారు, మాకు పదవులు, మీకెందుకురా’ అంటూ చేసిన వ్యాఖ్యల వీడియోలను చూపించారు. (చదవండి : చంద్రబాబుపై పోసాని ఫైర్) -
చిరునవ్వుతో వెళ్లడానికి జగన్‌ను కాదు పోసానిని
-
రాధాకృష్ణా బుద్ధి తెచ్చుకో..
-
ఇక ప్రేమ యుద్ధం
నిన్నమొన్నటి వరకు ‘సాహో’ చిత్రం కోసం ఆయుధాలతో సావాసం చేశారు హీరో ప్రభాస్. ఇప్పుడు ప్రేమ యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రభాస్ హీరోగా ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. 1970లో సాగే ప్రేమకథతో ఈ చిత్రం ఉంటుంది, ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇటలీలో జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగనుందని తెలిసింది. గురువారం నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. ఈ షెడ్యూల్ దాదాపు 20 రోజుల పాటు సాగుతుందట. ఇందుకోసం ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ 1970 నాటి కాలం ప్రతిబింబించేలా సెట్‌ను తయారు చేశారని తెలిసింది. ఈ సినిమాలో కృష్ణంరాజు కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తారని టాక్. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోందని తెలిసింది. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘సాహో’ చిత్రం ఈ ఏడాది పంద్రాగస్టుకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ కథానాయికగా దక్షిణాదికి పరిచయం అవుతున్నారు. -
చాలెంజ్‌లు విసిరింది!
‘‘నా కెరీర్లో నేను విన్న చాలెంజింగ్ స్క్రిప్ట్స్‌లో ప్రస్తుతం ప్రభాస్‌తో చేస్తున్న సినిమా ఒకటి’’ అంటున్నారు పూజా హెగ్డే. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే జంటగా ఓ ప్రేమకథా చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై కృష్ణంరాజు, వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. పీరియాడికల్ లవ్‌స్టొరీగా 1920 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రం ఎక్కువ శాతం షూటింగ్ ఇటలీలో జరగనుంది. ఇందులో చేస్తున్న పాత్ర గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ – ‘‘ప్రభాస్ 20’ స్క్రిప్ట్ చాలా అద్భుతంగా ఉంది. స్క్రిప్ట్ విన్న వెంటనే స్టన్ అయిపోయాను. అలాగే ఈ స్క్రిప్ట్ నాకు చాలా చాలెంజ్‌లు కూడా విసిరింది. టీమ్ అంతా చాలా కష్టపడుతున్నాం. మీ అందరికీ సరికొత్త సినిమా ఇస్తాం అనే నమ్మకం ఉంది. ప్రస్తుతానికి చాలా టైటిల్స్ అనుకుంటున్నాం. ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదు. టైటిల్ ఫిక్స్ అయిన వెంటనే తెలియజేస్తాను’’ అన్నారు. -
హెచ్ఆర్సీని ఆశ్రయించిన అర్చకుడు గంటి రాధాకృష్ణ
-
వింటేజ్ కార్ల వ్యాపారిగా ప్రభాస్
బాహుబలి తరువాత మరోసారి లాంగ్ గ్యాప్ తీసుకున్న ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. అంతర్జాతీయ స్థాయిలో భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో పాటు మరో షూటింగ్‌లోనూ బిజీగా ఉన్నాడు ప్రభాస్. జిల్ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు. పిరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ పాత్రపై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ యూరోప్‌లో వింటేజ్ కార్ల వ్యాపారిగా కనిపించనున్నాడట. ఓ కారు అమ్మే విషయంలో జరిగిన సంఘటనతోనే సినిమా కథ మలుపు తిరుగుతుందన్న టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ప్రభాస్ పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు గోపి కృష్ణమూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. -
ప్రభాస్ కోసం వింటేజ్ కార్లు..!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ చేస్తున్నాడు. సాహో సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావటంతో కొత్త సినిమాను మొదలు పెట్టాడు. జిల్ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటలీ నేపథ్యంలో పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌కు వాహనాలు సమకూర్చటం చిత్రయూనిట్ కు భారంగా మారుతుందట. ఇటలీలో బిల్డింగ్స్ అన్ని ఇప్పటికే వింటేజ్ లుక్‌తో కనిపిస్తున్నా వాహానాలు మాత్రం మోడ్రన్‌గా మారిపోయాయి. దీంతో వింటేజ్ కార్లు, బస్సులు సేకరించే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. -
ప్రభాస్ కొత్త సినిమాకు దేశీ టైటిలే..!
బాహుబలి తరువాత సాహో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆ సినిమా రిలీజ్ కాకముందే మరో ప్రాజెక్ట్‌ను టైల్లో పెట్టాడు. జిల్ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ఇటలీలో ప్రారంభమైంది. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. ఎక్కువ భాగం విదేశాల్లో తెరకెక్కనున్న ఈ సినిమాకు ముందుగా అమోల్ (ప్రేమ) అనే ఫ్రెంచ్ పదాన్ని టైటిల్‌గా ఫిక్స్ చేశారన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా మరో టైటిల్ తెరమీదకు వచ్చింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ కావటంతో ఈ సినిమాకు ‘జాన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారట. డార్లింగ్ ఇమేజ్ ఉన్న ప్రభాస్‌కు ఈ టైటిల్ అయితే కరెక్ట్ అని భావిస్తున్నారట చిత్రయూనిట్. అయితే ఇంత వరకు చిత్రయూనిట్ నుంచి టైటిల్ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. -
ఇటలీలో ప్రభాస్ ప్రేమకథ
బాహుబలి సినిమాతో అంతర్జాతీజయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే ప్రభాస్ మరో సినిమాను ప్రారంభించే పనిలో ఉన్నాడు. ఇప్పటికే తన తదుపరి చిత్రం జిల్ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో ఉంటుందని ప్రకటించాడు ప్రభాస్. ఇటీవల లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను కూడా త్వరలోనే ప్రారంభించనున్నారు. పీరియాడిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను ఇటలీలో షూట్ చేయనున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్‌తో పాటు ప్రభాస్ కూడా ఇటలీ చేరుకున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు రాధకృష్ణ ట్విటర్ ద్వారా వెల్లడించారు. “il cast e la crew sono arrivati in italia, tutto pronto per cominciare a girare” Evviva #prabhas20 — Radha Krishna Kumar (@director_radhaa) 29 September 2018 -
కొత్త సినిమా ప్రారంభించిన ప్రభాస్
బాహుబలి తరువాత సాహో సినిమాతో బిజీగా ఉన్న యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించారు. చాలా రోజులుగా ప్రచారంలో ఉన్నట్టుగానే కేకే రాధకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ తదుపరి చిత్రం రూపొందనుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయని తెలిపారు. ఈ సినిమాను ఒకేసారి మూడు భాషల్లో తెరకెక్కించనున్నారని వెల్లడించారు. గోపిచంద్ హీరోగా తెరకెక్కిన జిల్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రాధకృష్ణ అప్పటి నుంచి ప్రభాస్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. సాహో షూటింగ్ చివరి దశకు చేరుకోవటంతో తదుపరి చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలోనే ప్రారభించనున్నారు. ఎక్కువ భాగం యూరప్‌లో చిత్రీకరించినున్న ఈ సినిమా పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కనుందన్న టాక్ వినిపిస్తోంది.