
స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పడానికి సిద్ధమవుతున్నారు పూజా హెగ్డే. చాక్‌పీస్, డస్టర్ తీసుకొని టీచర్‌గా మారడానికి రెడీ అవుతున్నారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా ‘జాన్’ (వర్కింగ్ టైటిల్) అనే చిత్రం తెరకెక్కుతోంది. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకుడు. 1960లలో ఇటలీలో జరిగే ప్రేమకథగా ఈ సినిమా కథాంశం ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో పూజా స్కూల్ టీచర్ పాత్రలో కనిపిస్తారనే వార్త ప్రచారంలో ఉంది. మరి ఈ స్కూల్ టీచర్‌కి ప్రభాస్ ఎలా ప్రేమ పాఠాలు చెప్పారో స్క్రీన్ మీద తెలుసుకోవడమే. యూవీ క్రియేషన్స్, గోపీ కృష్ణ మూవీస్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
Comments
Please login to add a commentAdd a comment