ఇక ప్రేమ యుద్ధం | Prabhas starts new movie from jil radha krishna direction | Sakshi
Sakshi News home page

ఇక ప్రేమ యుద్ధం

Published Wed, Mar 20 2019 12:24 AM | Last Updated on Wed, Mar 20 2019 12:24 AM

Prabhas starts new movie from jil radha krishna direction - Sakshi

నిన్నమొన్నటి వరకు ‘సాహో’ చిత్రం కోసం ఆయుధాలతో సావాసం చేశారు హీరో ప్రభాస్‌. ఇప్పుడు ప్రేమ యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రభాస్‌ హీరోగా ‘జిల్‌’ ఫేమ్‌ రాధా కృష్ణకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. 1970లో సాగే ప్రేమకథతో ఈ చిత్రం ఉంటుంది, ఈ సినిమా తొలి షెడ్యూల్‌ ఇటలీలో జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరగనుందని తెలిసింది. గురువారం నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. ఈ షెడ్యూల్‌ దాదాపు 20 రోజుల పాటు సాగుతుందట.

ఇందుకోసం ఆర్ట్‌ డైరెక్టర్‌ రవీందర్‌ 1970 నాటి కాలం ప్రతిబింబించేలా సెట్‌ను తయారు చేశారని తెలిసింది. ఈ సినిమాలో కృష్ణంరాజు కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తారని టాక్‌. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్‌ చేస్తోందని తెలిసింది. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘సాహో’ చిత్రం ఈ ఏడాది పంద్రాగస్టుకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌ భామ శ్రద్ధాకపూర్‌ కథానాయికగా దక్షిణాదికి పరిచయం అవుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement