Jil
-
అమెరికా: ప్రేమలోకంలో అధ్యక్ష దంపతులు
వాషింగ్టన్: ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆ దేశ ప్రథమ పౌరురాలు జిల్ ప్రేమలోకంలో మునిగారు. ఈ సందర్భంగా అధ్యక్ష భవనం ఆవరణంతా లవ్ సింబల్స్‌తో నింపేశారు. దేశ ప్రజలందరికీ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా వాషింగ్టన్‌లోని శ్వేతసౌధం ఆవరణలో మొత్తం హృదయ (హార్ట్) గుర్తులు, ఐక్యత (యూనిటీ), హోప్ (నమ్మకం), ప్రేమ (లవ్) అని రాసి ఉన్న ఎర్రటి హార్ట్ సింబల్స్, పోస్టర్లు అధ్యక్ష భవనం ఆవరణలో అలంకరించారు. బైడెన్, ఆయన భార్య జిల్‌తో పాటు వారు పెంచుకుంటున్నరెండు జర్మన్ శునకాలు ఛాంప్, మేజర్‌తో పాటు ఆ పచ్చిక బయళ్లల్లో కలియ తిరిగారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఒకరినొకరు చూసుకంటూ తమ పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ‘ఈ కరోనా సమయంలో ప్రతి అమెరికా పౌరుడు కొంత నిరాశగా ఉండవచ్చునని, వేలంటైన్ డే ని మునుపటిలా ఉత్సాహంగా జరుపుకోలేకపోవచ్చు’ అని ప్రథమ పౌరురాలు జిల్ తెలిపారు. కొద్దిపాటి జాయ్, లిటిల్ హోప్ ఉండాలని సూచించారు. అయితే ‘ఇది ఫస్ట్ లేడీ ఫేవరేట్ డే’ అని బైడెన్ పేర్కొన్నారు. తాను అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన కార్యాలయంలో హార్ట్ సింబల్స్‌తో ఉన్న పోస్టర్లను జిల్ నింపేదని గుర్తుచేశారు. 43 ఏళ్ల వివాహ అనుబంధాన్ని బైడెన్ దంపతులు నెమరువేసుకున్నారు. I know the last year has been difficult and painful for all of us. I hope Jill’s Valentine’s Day message helped brighten your day. pic.twitter.com/jdEFMSDefm — President Biden (@POTUS) February 13, 2021 -
ఇటలీ పార్ట్.. హైదరాబాద్‌లోనే!
ప్రభాస్ హీరోగా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘ఓ డియర్’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. జార్జియా షెడ్యూల్ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. యూరప్ నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ లవ్‌స్టోరీ షూటింగ్ కొంత భాగం ఇటలీలో జరగాల్సి ఉంది. ఆల్రెడీ ఈ సినిమాకు చెందిన కొన్ని సన్నివేశాలను కూడా ఇటలీలో చిత్రీకరించారు. కానీ ఇటలీలో ప్రస్తుతం కరోనా ప్రభావం తీవ్రస్థాయిలో ఉంది. పైగా కరోనా కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై కూడా ఆయా ప్రభుత్వాలు కొన్ని ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో లాక్డౌన్ తర్వాత ఇటలీ షెడ్యూల్ కొనసాగించాలన్నా ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ సరిగ్గా సమకూరుతాయా? లేదా అనే సందేహం చిత్రబృందంలో ఉందట. అందుకని ఇటలీ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోనే జరపాలనుకుంటున్నారట. ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఇటలీ లొకేషన్స్‌కు సంబంధించిన డిజైన్స్, సెట్ వర్క్ వంటివాటిపై ఇప్పటికే దృష్టి సారించారని తెలిసింది. లాక్డౌన్ తర్వాత హైదరాబాద్‌లోనే ఇటలీ సెట్ వేసి, చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నారని సమాచారం. -
ఇక ప్రేమ యుద్ధం
నిన్నమొన్నటి వరకు ‘సాహో’ చిత్రం కోసం ఆయుధాలతో సావాసం చేశారు హీరో ప్రభాస్. ఇప్పుడు ప్రేమ యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రభాస్ హీరోగా ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. 1970లో సాగే ప్రేమకథతో ఈ చిత్రం ఉంటుంది, ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇటలీలో జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగనుందని తెలిసింది. గురువారం నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. ఈ షెడ్యూల్ దాదాపు 20 రోజుల పాటు సాగుతుందట. ఇందుకోసం ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ 1970 నాటి కాలం ప్రతిబింబించేలా సెట్‌ను తయారు చేశారని తెలిసింది. ఈ సినిమాలో కృష్ణంరాజు కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తారని టాక్. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోందని తెలిసింది. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘సాహో’ చిత్రం ఈ ఏడాది పంద్రాగస్టుకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ కథానాయికగా దక్షిణాదికి పరిచయం అవుతున్నారు. -
హీరోగా మారుతున్న విలన్
జిల్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ విలన్ కబీర్ సింగ్ దుహన్. తొలి సినిమాతోనే విలన్‌గా తానేంటో నిరూపించుకున్న కబీర్, కేవలం రెండేళ్ల సమయంలో 25కు పైగా సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. విలన్‌గా నటిస్తున్నా.. స్టైలిష్ లుక్స్‌తో హీరోలకు పోటి ఇచ్చే గ్లామర్ కబీర్ సొంతం. అందుకే ఈ యంగ్ విలన్.., హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. అశ్విన్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న చిత్రంతో కబీర్ సింగ్ దుహన్ హీరోగా మారుతున్నాడు. సౌత్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ జానర్‌గా పేరు తెచ్చుకున్న హర్రర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఒకేసారి రూపొందనుంది. ప్రస్తుతం సుధీప్ హీరోగా తెరకెక్కుతున్న హెబ్బులి సినిమాలో మెయిన్ విలన్‌గా నటిస్తున్న కబీర్ త్వరలోనే హీరోగానూ అలరించేందుకు రెడీ అవుతున్నాడు. -
మరో దర్శకుడిని లైన్లో పెట్టాడు
ఇప్పటికీ బాహుబలి సినిమా పనుల్లోనే బిజీగా ఉన్న ప్రభాస్.. తన నెక్ట్స్ సినిమాల విషయంలో కూడా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. యంగ్ డైరెక్టర్లతో స్టైలిష్ ఎంటర్టైనర్లకు రెడీ అవుతున్నా.. ఆ సినిమాలు ఎప్పుడు పట్టాలెక్కుతాయో మాత్రం అర్ధం కావటంలేదు. ఇంకా బాహుబలి 2 షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. ఆ సినిమా షూటింగ్ పూర్తయి రిలీజ్ అయితే గాని ప్రభాస్ మరో సినిమా మొదలు పెట్టడానికి అవకాశం లేదు. ఇప్పటికే 'రన్ రాజా రన్' ఫేం సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించాడు ప్రభాస్. ఈ సినిమా కోసం వేరే ప్రయత్నాలేవి చేయకుండా వెయిట్ చేస్తున్నాడు సుజిత్. అయితే తాజాగా మరో దర్శకుడి పేరు తెర మీదకు వచ్చింది. సుజిత్‌ను పరిచయం చేసిన యువి క్రియేషన్స్ బ్యానర్ ద్వారానే దర్శకుడిగా పరిచయం అయిన రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు ప్రభాస్. తొలి సినిమా జిల్‌తో స్టైలిష్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాధకృష్ణ ప్రభాస్‌తోనూ అదే తరహా సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. బాహుబలి 2 తరువాత ఈ ఇద్దరు దర్శకుల్లో ఎవరికి ముందుగా ఛాన్స్ ఇస్తాడో చూడాలి. అయితే దర్శకుడు ఎవరైన ఆ సినిమాను నిర్మించేది మాత్రం యువి క్రియేషన్స్ సంస్థే అన్న టాక్ వినిపిస్తోంది. ఏ సినిమా అయిన 2016లో అయితే తెర మీదకు వచ్చే అవకాశం మాత్రం కనిపించటం లేదు. -
అతనితో రెండోసారి...
ముద్దుగా, బొద్దుగా ఉండే రాశీఖన్నాకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. అయితే ఆ క్రేజ్‌కి తగ్గట్టుగా ఆఫర్లు రావడం లేదామెకు. అలాగని రాశీని మరీ తీసి పారేయనవసరం లేదు. తక్కువ ఆఫర్లు వచ్చినా, అవన్నీ మంచివే కావడం విశేషం. గోపీచంద్‌తో ‘జిల్’లో కనబడి జిల్జిల్ మనిపించిన రాశీఖన్నా, మరోసారి అతనితో రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతున్నారు. గోపీచంద్ హీరోగా ఏయమ్ రత్నం పెద్ద కొడుకు ఏయమ్ జ్యోతికృష్ణ దర్శకత్వంలో త్వరలో ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో గోపీచంద్ సరసన రాశీఖన్నా ఎంపికయ్యారట. నిజంగా రాశీకిది మంచి ఆఫరే. ఆమె ప్రస్తుతం సాయిధరమ్ తేజ్‌తో ‘సుప్రీమ్’లో నటిస్తున్నారు. రవితేజ సరసన నటించిన ‘బెంగాల్ టైగర్’ వచ్చే నెల 10న విడుదల కానుంది. -
’జిల్ ’డైరెక్టర్ స్పెషల్ ఇంటర్వ్యూ
-
ఆ సీన్ పబ్లిసిటీ కోసం చేయలేదు!
‘‘ఎప్పుడో 30 ఏళ్ల క్రితం మా నాన్నగారు (టి. కృష్ణ) తన సినిమాల్లో చర్చించిన అంశాలు నేటి సమాజంలోనూ ఉన్నాయి. అలాంటి అంశాలతో విప్లవాత్మక సినిమాలు చేసే అవకాశం వస్తే, చేయడానికి నేను రెడీగా ఉన్నా’’ అని హీరో గోపీచంద్ అన్నారు. ఓ డిఫరెంట్ లుక్‌లో ఫైర్ ఆఫీసర్గాగోపీచంద్ నటించిన ‘జిల్’ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ‘‘దర్శకుడు రాధాకృష్ణకుమార్ చెప్పిన కథను నమ్మి నేనీసినిమా చేశా. నా నమ్మకాన్ని ప్రేక్షకులు వమ్ము చేయలేదు’’ అని గోపీచంద్ అన్నారు. మరిన్ని విశేషాలను ఈ విధంగా పంచుకున్నారు. నా గత చిత్రం ‘లౌక్యం’ ఫుల్కామెడీ మూవీ. మళ్లీ అలాంటి సినిమాయే చేస్తే రొటీన్‌గా ఉందంటారు. అందుకే ఆ సినిమాకి పూర్తి భిన్నంగా ఉన్న కథను రాధాకృష్ణకుమార్ చెప్పడంతో అంగీకరించాను. ‘జిల్’ అంటే ఓ ఎక్స్ప్రెషన్. రకరకాల సందర్భాల్లో ఆ సందర్భాన్ని బట్టి ‘జిల్లుమనిపించింది’ అంటుంటాం. ఈ సినిమా చూస్తున్నప్పుడు చాలా చోట్ల అలా అనుకుంటాం. వాస్తవానికి ఇప్పటివరకూ నేను పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రం చేయలేదు. ‘జిల్’ ఆ కొరత తీర్చింది. అలాగే, నాకు తెలిసి ఈ తరంలో తెలుగులో ‘ఫైర్ ఆఫీసర్’ పాత్రతో సినిమాలు రాలేదు. సినిమా మొత్తం చక్కని ఎమోషన్‌తో ఉంటుంది. అది బాగా నచ్చింది. ఈ చిత్రంలో ఓ ముద్దు సన్నివేశం ఉంది. కానీ, దాన్ని ప్రాపర్ ‘లిప్ లాక్’ అనలేం. అప్పటికీ ఈ సీన్ అవసరమా? అనడిగాను. కానీ, అది లేకపోతే సీన్ పండదని దర్శకుడు అన్నాడు. అందుకని చేశాను. పబ్లిసిటీ కోసం చేసిన సీన్ కాదది. గత పదిహేనేళ్లుగా నా లుక్‌లో నేనెలాంటి మార్పు చేయలేదు. అందుకే, ఈ చిత్రం చూసినవాళ్లు ముందు నా లుక్ గురించి మాట్లాడుతున్నారు. అదే సినిమా నచ్చకపోతే, లుక్ డిఫరెంట్‌గా ఉన్నా ఆదరించరు. వాస్తవానికి ఈ సినిమా గురించి చెప్పినప్పుడు నిర్మాతలు వంశీ, ప్రమోద్ లుక్ మార్చాలని చెబితే, నేను సంశయించాను. దాంతో ప్రభాస్‌తో చెప్పించారు. తనేమో ‘రేయ్... లుక్ మార్చరా.. బాగుంటుంది’ అన్నాడు. సరే.. మార్చాను. లుక్ టెస్ట్ చేసినప్పుడే కచ్చితంగా బాగుంటుందనే నమ్మకం కుదిరింది. ఇప్పటివరకూ నీ కెరీర్లో ఇదే ‘బెస్ట్ లుక్’ అని సినిమా చూసినవాళ్లు అంటున్నారు. ప్రభాస్ ఈ సినిమా చూసి, ‘లుక్ అదిరింది.. ఫైట్స్, డాన్స్ బాగున్నాయి. సినిమా చాలా బాగుంది’ అన్నాడు. నేను, ప్రభాస్ మంచి స్నేహితులం. మా ఇద్దరికీ తగ్గ కథ కుదిరితే చేయాలనుకుంటున్నాం. కానీ, ఇప్పటివరకూ కథ దొరకలేదు. వాస్తవానికి మనకు కథల కొరత ఉంది. తెలుగు పరిశ్రమలో రచయితలు తక్కువయ్యారు. ఎవరైనా కథలు రాయాలనుకుంటే, ఏ హాలీవుడ్ సినిమానో, వీడియోనో చూస్తే సరిపోదు.. సమాజాన్ని చదవాలి. సమాజంలో జరుగుతున్న సమస్యలను తెలుసుకోవాలి. జనాల్లోకి వెళితే బోల్డన్ని కథలు పుట్టుకొస్తాయి. ముఖ్యంగా విప్లవాత్మక చిత్రాలు చేయాలంటే మాత్రం జనాలను పరిశీలించాల్సిందే. ఇప్పడీ తరహా చిత్రాల కొరత ఉంది కాబట్టే, చేస్తే మాత్రం హిట్ గ్యారంటీ అనొచ్చు. ఒకసారి కథ విని, ఓకే చెప్పిన తర్వాత షూటింగ్ స్పాట్లో మార్పులు చెప్పడం నాకిష్టం ఉండదు. అలాగే, నా కారణంగా నిర్మాణ వ్యయం పెరగకుండా జాగ్రత్తపడతాను. అయితే, ఒక సినిమా బడ్జెట్ పరిధులు దాటకుండా ఉండటం అనేది నిర్మాత చేతుల్లోనే ఉంటుంది. దేనికి ఎంత ఖర్చుపెట్టాలనే విషయం మీద నిర్మాతకు నియంత్రణ ఉండాలి. ప్రస్తుతం బి.గోపాల్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాను. భూపతి పాండ్యన్ దర్శకత్వంలో అంగీకరించిన చిత్రం కాదిది. ఇది వేరే కథతో రూపొందిస్తున్నాం. వక్కంతం వంశీ కథ ఇచ్చారు. ఇది మంచి లవ్ మరియు ఫ్యామిలీ మూవీ. అన్నీ కుదిరితే ఈ జూలైలో విడుదల ఉంటుంది. ఈ చిత్రం తర్వాత భవ్య క్రియేషన్స్ పతాకంపై ఓ సినిమా చేయబోతున్నా. మంచి కథలు కుదిరితే ఏడాదికి మూడు సినిమాలు చేయొచ్చు. కానీ, కథలు కుదరడంలేదు. పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత జీవితం ఒకేలా ఉంది. అయితే అంతకు ముందు పెద్దగా బాధ్యతలు ఉండేవి కాదు. ఇప్పుడు బాధ్యతగా ఉంటున్నాను. దూర ప్రాంతాలకు షూటింగ్‌కి వెళ్లినప్పుడు, మా అబ్బాయి విరాట్ కృష్ణ గుర్తొస్తుంటాడు. ‘ఇప్పుడేం చేస్తున్నాడో’ అని ఆలోచించుకుంటుంటా. -
ప్రభాస్‌కు స్పెషల్ థ్యాంక్స్
‘‘ఈ సినిమా చూసిన వాళ్లందరూ నా లుక్ చాలా బాగుందని అంటున్నారు. నా లుక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ప్రభాస్‌కు నా స్పెషల్ థ్యాంక్స్’’ అని గోపీచంద్ చెప్పారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో వంశీ-ప్రమోద్ నిర్మించిన ‘జిల్’ ఇటీవల విడుదలైంది. ఈ సినిమా విజయోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘సినిమా విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. సావిత్రిగా రాశీ ఖన్నా చాలా బాగా నటించారు ’’ అని చెప్పారు. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలని నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చలపతిరావు, అమిత్, విక్కీ తదితరులు పాల్గొన్నారు. -
వేసవిలో కలిసొచ్చే 'జిల్'
చిత్రం - జిల్..., తారాగణం - గోపీచంద్, రాశీఖన్నా, కబీర్ (నూతన పరిచయం), బ్రహ్మాజీ, చలపతిరావు, ఐశ్వర్య, కెమేరా - శక్తి శరవణన్, సంగీతం - జిబ్రాన్, ఫైట్స్ - అనల్ అరసు, కళ - ఏ.ఎస్. ప్రకాశ్, కూర్పు - కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాతలు - వి. వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం - రాధాకృష్ణ కుమార్ ............................................. కొన్ని సినిమాలకు కొన్ని బాక్సాఫీస్ సానుకూలతలు కలిసొస్తాయి. మాస్ మెచ్చే ఫార్ములా కథ... తక్కువ నిడివి సినిమా... చకచకా నడిచే కథనం... అక్కడక్కడా కథ పక్కదోవ పట్టినట్లు అనిపించినా చటుక్కున బండిని పట్టాల మీదకెక్కించే సంఘటనలున్న స్క్రిప్ట్... వీటన్నిటికీ తోడు కొత్తగా మొదలవుతున్న వేసవి సెలవుల సీజన్ కూడా కలిసొస్తే? గోపీచంద్ నటించిన తాజా చిత్రం 'జిల్'కి కూడా అవన్నీ సమకూరాయి. గత ఏడాది వచ్చిన వాణిజ్య విజయం 'లౌక్యం'తో ఊపు మీదున్న గోపీచంద్, గతంలో ప్రభాస్‌తో 'మిర్చి' తీసిన నిర్మాతలు కలసి కొత్త దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌తో చేసిన తాజా ప్రయత్నం ఇది. అన్ని సానుకూలతులున్నా... కథను బిగువుగా తెరపై నడిపించారా అన్నది చూద్దాం... కథ ఏమిటంటే... ముంబయ్‌లో ఒక మాఫియా డాన్ ఛోటా నాయక్ (నూతన పరిచయం - మోడల్ కబీర్). పోలీసుల చేతికి చిక్కినట్టే చిక్కిన అతను తప్పించుకుంటాడు. ఈ మాఫియా డాన్ తనను మోసం చేసి, వెయ్యి కోట్లు కొట్టేసిన మాజీ సహచరుడు రంగనాథం (బ్రహ్మాజీ) కోసం వెతుకుతుంటాడు. రంగనాథం హైదరాబాద్‌లో తలదాచుకొంటాడు. మరోపక్క హైదరాబాద్‌లోనే జై (గోపీచంద్) ఒక అగ్నిప్రమాద నివారక దళ అధికారి. స్వయానా ఫైర్ ఆఫీసరైన బాబాయ్ (చలపతిరావు), పిన్ని (ఐశ్వర్య) కుటుంబంతో అతనిది అందమైన అనుబంధం. అనుకోని పరిస్థితుల్లో ఒక టీనేజ్ అమ్మాయి సావిత్రి (రాశీఖన్నా)ని కాపాడిన హీరో, ఆమెతో ప్రేమలో పడతాడు. ఒక సందర్భంలో రంగనాథాన్ని విలన్ అనుచరుల నుంచి హీరో కాపాడతాడు. దాంతో, విలన్‌కూ, హీరోకూ మధ్య యుద్ధం మొదలవుతుంది. ఆ తరువాత ఒక అగ్ని ప్రమాదంలో రంగనాథ్ మరణిస్తాడు. ఆ మరణించే క్రమంలో హీరోతో ఏదో చెబుతాడు. దాంతో విలన్ ఆ వెయ్యికోట్ల రహస్యం హీరోకే చెప్పాడని వెంటపడతాడు. అక్కడ నుంచి రెండు వర్గాల మధ్య జరిగే పిల్లీ ఎలక పోరాటం మిగతా సినిమా. ఎలా చేశారంటే... కథానాయకుడిగా గోపీచంద్ మునుపటి కన్నా మరింత స్లిమ్‌గా, కొత్త లుక్‌తో, ఉత్సాహంగా కనిపించారు. సన్నివేశాల్లోనే కాక, పాటలు, ఫైట్లలోనూ అది కొట్టొచ్చినట్లు కనిపించింది. కథానాయిక రాశీ ఖన్నా కాస్తంత బొద్దుగా, ముద్దుగా ఉన్నారు. పాత్ర తాలూకు చిలిపితనం దానికి తోడైంది. దాంతో, తెర మీద అందంగా మెరిశారు. విలన్‌గా పరిచయమైన కబీర్ మంచి ఒడ్డూ పొడుగు, గడ్డంతో బాగున్నారు. చలపతిరావు, ఐశ్వర్య, చిన్న పాత్రలో కనిపించే అవసరాల శ్రీనివాస్ లాంటి వారు సరేసరి. ఈ సినిమాకు ప్రధాన బలం - కెమేరా పనితనం. కొంత డిజిటల్ కెమేరాతో, మరికొంత ఫిల్మ్‌తో చిత్రీకరించిన ఈ సినిమాలో శక్తి శరవణన్ ఛాయాగ్రహణ పనితనం చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. ఫారిన్ లొకేషన్లలో పాటల నుంచి చిన్న అపార్ట్మెంట్ల మధ్యలో, శ్మశానంలో ఫైట్ల దాకా తెరపై కనువిందైన విజువల్స్ అలరిస్తాయి.పాటల విషయంలో జిబ్రాన్ నవతరం శైలిలోని అనుసరించినా, సినిమాలో వచ్చే రెండో పాట ఒక్కటే పాడుకోవడానికి వీలుగా అనిపిస్తుంది. అనల్ అరసు ఫైట్లు, ఎలా ఉందంటే... ఈ చిత్ర కథలో లోపాలూ చాలానే కనిపిస్తాయి. విలన్ అయిన మాఫియా డాన్‌కూ, అతను వెతుకుతున్న మాజీ అనుచరుడు రంగనాథం (బ్రహ్మాజీ)కూ మధ్య ఏం జరిగిందన్నది, అతనెలా వెయ్యికోట్లతో తిరుగుతున్నాడన్నది కథలో వివరంగా చూపరు. అలాగే, హైదరాబాద్‌లో రంగనాథంకు అందించే పాస్‌పోర్ట్, వగైరాల కథ గురించీ పెద్దగా వివరం లేదు. అవన్నీ ఒక్క సీన్లో, మూడు ముక్కల్లో డైలాగుల్లో తేల్చేశారు. ఆ రకంగా స్క్రిప్టులో మరింత చిక్కదనానికి ఉన్న అవకాశాన్ని తామే చేజేతులా వదులుకున్నారు. అలాగే, ఉన్నట్టుండి సినిమాలో కామెడీ తగ్గిందనే భావన కలగడం వల్లనో ఏమో పోసాని, అతని అనుచరుడు హీరో ఇంటికి వెళ్ళి వెతికే ఘట్టాన్ని బలవంతాన జొప్పించారు. దాని వల్ల సినిమా నిడివి పెరగడం, చకచకా వెళుతున్న కథ కాళ్ళకు అడ్డం పడడం తప్ప, ఆ సీన్ వల్ల వినోదం కానీ, సినిమాకొచ్చిన విశేష ప్రయోజనం కానీ లేదనే చెప్పాలి. హీరో కుటుంబంపై విలన్ దాడి, అతని మీద ప్రతీకారానికి హీరో చెలరేగడం దగ్గరే ప్రేక్షకులకు కూడా కొంత విలన్ మీద కోపం పెరుగుతుంది. లేదంటే, విలన్ తన వెయ్యి కోట్ల కోసం తానే కొట్లాడుతున్నాడు కదా, అందులో తప్పేముంది అనిపించే ప్రమాదం హెచ్చు. సినిమా కోసమని లాజిక్‌లతో పని లేకుండా కొంత స్వేచ్ఛ తీసుకొని, ఎక్కడికక్కడ కథ ముందుకు నడవడానికి తగ్గట్లు కన్వీనియంట్ స్క్రీన్‌ప్లే రాసుకున్న సినిమా ఇది. కాసేపు ప్రేమ, ఇంకాసేపు విలనిజం, మరికాసేపు పగ - ప్రతీకరం లాంటి వాటిని తీసుకొని, దేని మీదా పూర్తి దృష్టి పెట్టలేదేమో అనిపిస్తుంది. అలాంటి లోటుపాట్లు పక్కనపెడితే, తొలి చిత్ర దర్శకుడిగా రాధాకృష్ణ కుమార్ మంచి మార్కులే పడతాయి, కొన్నిచోట్ల ఆయన రాసుకున్న డైలాగులూ, 'హీరోతో ఫోన్లో మాట్లాడినవారినల్లా చంపేస్తా'నంటూ విలన్ వేసిన పీటముడి లాంటివి ప్రేక్షకులకు బాగుంటాయి. అయితే, అవన్నీ ఈ రెండు గంటల 20 నిమిషాల సినిమాను దీర్ఘకాలం బాక్సాఫీస్ వద్ద నిలబడతాయా అన్నది చూడాలి. మీదకొచ్చి పడే కొత్త సినిమాల సత్తా ఏమిటన్న దాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. అప్పటి దాకా 'జిల్' అనే పేరు ఎందుకు పెట్టారా అని ఆలోచించకుండా, సామాన్య యాక్షన్ చిత్ర ప్రేమికులు కాలక్షేపానికి నిరభ్యంతరంగా ఈ సినిమా చూసేయవచ్చు. మొదటే చెప్పుకున్న అది 'జిల్'కు ఉన్న బలం, సానుకూలత కూడా! - రెంటాల జయదేవ -
సావిత్రికీ నాకూ పోలికే లేదు!
‘‘మంచి నటన కనబర్చడానికీ, గ్లామరస్‌గా కనిపించడానికీ స్కోప్ ఉన్న పాత్రను ఈ చిత్రంలో చేశాను. ఈ రెండూ కోణాలూ ఉన్న పాత్రలు చేసే అవకాశం అరుదుగా వస్తుంది’’ అని రాశీఖన్నా అంటున్నారు. ఊహలు గుసగుసలాడే, జోరు చిత్రాల్లో కథానాయికగా, ‘మనం’లో అతిథి పాత్రలో కనిపించిన రాశీఖన్నా ప్రస్తుతం గోపీచంద్ సరసన నటించిన ‘జిల్’ ఈ శుక్రవారం విడుదల కానుంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ చిత్రం గురించి రాశీఖన్నా మాట్లాడుతూ - ‘‘ఇందులో నా పాత్ర పేరు సావిత్రి. తను చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. దూకుడెక్కువ. కానీ, నేను సావిత్రిలా కాదు. అసలు తనకూ, నాకూ ఒక్క విషయంలో కూడా పోలిక లేదు. నా మనస్తత్వానికి వ్యతిరేకంగా ఉన్న పాత్ర కావడంతో నటిస్తున్నప్పుడు థ్రిల్‌కి గురయ్యాను. సావిత్రిని అందరూ ఇష్టపడతారు. అందులో మాత్రం సందేహం లేదు. నా నుంచి రాధాకృష్ణగారు మంచి నటన రాబట్టుకున్నారు. గోపీచంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. చాలా మంచి వ్యక్తి. పెద్ద హీరో కాబట్టి, ముందు కొంచెం తడబాటుగా అనిపించింది. కానీ, ఆయన తీరు చూసిన తర్వాత కూల్ అయిపోయాను. డాన్స్ విషయంలో కూడా చాలా హెల్ప్ చేశారు’’ అన్నారు. అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రంలో ప్రత్యేక పాట చేస్తున్నారనే వార్త వినిపిస్తోందనే ప్రశ్నకు - ‘‘ఆ చిత్రబృందం నుంచి నన్నెవరూ సంప్రతించలేదు. ఇప్పట్లో నాకు ప్రత్యేక పాటలు చేసే ఉద్దేశం కూడా లేదు. అతిథి పాత్రలు చేయాలనుకుంటున్నాను’’ అని స్పష్టం చేశారు. -
గోపి, రాశి జిల్ జిల్