వాషింగ్టన్: ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆ దేశ ప్రథమ పౌరురాలు జిల్ ప్రేమలోకంలో మునిగారు. ఈ సందర్భంగా అధ్యక్ష భవనం ఆవరణంతా లవ్ సింబల్స్‌తో నింపేశారు. దేశ ప్రజలందరికీ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా వాషింగ్టన్‌లోని శ్వేతసౌధం ఆవరణలో మొత్తం హృదయ (హార్ట్) గుర్తులు, ఐక్యత (యూనిటీ), హోప్ (నమ్మకం), ప్రేమ (లవ్) అని రాసి ఉన్న ఎర్రటి హార్ట్ సింబల్స్, పోస్టర్లు అధ్యక్ష భవనం ఆవరణలో అలంకరించారు.
బైడెన్, ఆయన భార్య జిల్‌తో పాటు వారు పెంచుకుంటున్నరెండు జర్మన్ శునకాలు ఛాంప్, మేజర్‌తో పాటు ఆ పచ్చిక బయళ్లల్లో కలియ తిరిగారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఒకరినొకరు చూసుకంటూ తమ పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ‘ఈ కరోనా సమయంలో ప్రతి అమెరికా పౌరుడు కొంత నిరాశగా ఉండవచ్చునని, వేలంటైన్ డే ని మునుపటిలా ఉత్సాహంగా జరుపుకోలేకపోవచ్చు’ అని ప్రథమ పౌరురాలు జిల్ తెలిపారు. కొద్దిపాటి జాయ్, లిటిల్ హోప్ ఉండాలని సూచించారు. అయితే ‘ఇది ఫస్ట్ లేడీ ఫేవరేట్ డే’ అని బైడెన్ పేర్కొన్నారు. తాను అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన కార్యాలయంలో హార్ట్ సింబల్స్‌తో ఉన్న పోస్టర్లను జిల్ నింపేదని గుర్తుచేశారు. 43 ఏళ్ల వివాహ అనుబంధాన్ని బైడెన్ దంపతులు నెమరువేసుకున్నారు.
I know the last year has been difficult and painful for all of us. I hope Jill’s Valentine’s Day message helped brighten your day. pic.twitter.com/jdEFMSDefm
— President Biden (@POTUS) February 13, 2021
Comments
Please login to add a commentAdd a comment