
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకారం తీర్చుకున్నారు. ఆయనకు సెక్యూరిటీ క్లియరెన్స్ హోదాను రద్దు చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి, మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, హిల్లరీ క్లింటన్‌తో పాటు బైడెన్ కుటుంబీకులకు, ఆయన యంత్రాంగంలో మంత్రులుగా, ఉన్నతాధికారులుగా పని చేసిన పలువురికి కూడా ఈ క్లియరెన్స్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
మాజీ అధ్యక్షులు, మంత్రులు, అత్యున్నత స్థాయి అధికారులకు సెక్యూరిటీ క్లియ రెన్స్‌ను కొనసాగించడం ఆనవాయితీ. ఈ హోదా ఉండేవారికి వారికి ప్రభుత్వ నిఘా సమాచారం అందుతుంది. రహస్య పత్రాలు తదితరాలను చూసేందుకు కూడా వారికి అనుమతి ఉంటుంది. 2021లో బైడెన్ గద్దెనెక్కగానే ట్రంప్‌కు సెక్యూరిటీ క్లియరెన్స్ తొలగించారు. 2016–20 మధ్య అధ్యక్షుడైన ట్రంప్ ఆ ఎన్నికల్లో బైడెన్ చేతిలో ఓడటం, దాన్ని జీర్ణించుకోలేక క్యాపిటల్ హిల్ భవనంపై దాడికి తనవారిని ఉసిగొల్పడం తెలిసిందే.
ఈ క్రమంలోనే.. బైడెన్.. ‘తప్పుడు ప్రవర్తతో కూడిన ట్రంప్ వంటి వ్యక్తికి రహస్య, నిఘా సమాచారం అందుబాటులో ఉండటం సరికాదు. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నా’ అని చెప్పారు. తాజాగా ట్రంప్ కూడా తన నిర్ణయానికి సరిగ్గా అవే కారణాలను చూపడం విశేషం. ‘రహస్య పత్రాలు, సమాచారం బైడెన్ తదితరులకు అందుబాటులో ఉండటం దేశ ప్రయోజనాల రీత్యా క్షేమకరం కాదన్న నిర్ణయానికి వచ్చాను. అందుకే ఈ మేరకు ఆదేశాలిస్తున్నా’ అంటూ ప్రకటించారు!.
Donald Trump’s move to revoke President Biden and Vice President Harris’s security clearance is unprecedented in American history.
RETWEET if you stand with President Biden and Vice President Harris against Trump! pic.twitter.com/eyGNXppw2o— Protect Kamala Harris ✊ (@DisavowTrump20) March 22, 2025
Comments
Please login to add a commentAdd a comment