
త్వరలో జపాన్‌లో నిర్మాణం
టోక్యో: ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 3డీ ప్రింటెడ్ రైల్వేస్టేషన్ నిర్మాణానికి జపాన్‌లోని ఓ రైల్వే ఆపరేటింగ్ సంస్థ శ్రీకారం చుట్టింది. ఈ స్టేషన్ చుట్టకొలత 108 చదరపు అడుగులు. జపాన్‌లో జనాభా పరంగా మూడో అతిపెద్ద నగరమైన ఒసాకా నుంచి 60 మైళ్ల దూరంలోని దక్షిణ వకయామ ప్రావిన్స్‌లో ఈ స్టేషన్‌ను నిర్మించబోతున్నట్లు వెస్ట్ జపాన్ రైల్వే(జేఆర్ వెస్ట్) సంస్థ తాజాగా ప్రకటించింది.
ప్రస్తుతం ఇక్కడ కలపతో నిర్మించిన రైల్వే కాంప్లెక్స్ ఉంది. అది చాలావరకు దెబ్బతినడంతో పూర్తిగా కూల్చివేసి 3డీ ప్రింటెడ్ స్టేషన్ నిర్మించాలని నిర్ణయించారు. ఈ కొత్త స్టేషన్ చిత్రాలను ఇప్పటికే విడుదల చేశారు. ఈ నెల 25వ తేదీ తర్వాత నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. సెరెండిక్స్ అనే నిర్మాణ సంస్థ సైతం ఇందులో భాగస్వామిగా మారుతోంది.
3డీ ప్రింటింగ్ టెక్నాలజీలో ఈ సంస్థకు మంచి అనుభవం ఉంది. కొత్త టెక్నాలజీతో రైల్వే స్టేషన్‌నిర్మాణం కేవలం ఆరు గంటల్లో పూర్తి కానుంది. జపాన్‌లో ప్రస్తుతం పనిచేసే సామ ర్థ్యం కలిగిన యువత సంఖ్య తగ్గుతోంది. వృద్ధు ల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో శ్రామిక శక్తి అందుబాటులో లేకుండాపోతోంది. అందుకే తక్కువ సమయంలో నిర్మాణాలు పూర్తయ్యే టెక్నాలజీపై జపాన్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో తక్కువ మంది కార్మికులతో నిర్మాణాలు చకచకా పూర్తి చేయొచ్చు. ఇందులో భవనం విడిభాగాలను ముందుగానే తయారు చేస్తారు. నిర్మాణ స్థలానికి తీసుకెళ్లి వాటిని బిగించేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment