3D Printing
-
పుష్ప-2 మూవీ.. విడుదలకు ముందు బిగ్ షాక్!
ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న తరుణం రానే వచ్చింది. మరికొద్ది గంటల్లోనే పుష్ప-2 ప్రభంజనం థియేటర్లలో మొదలు కానుంది. డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటలకే బెనిఫిట్ షోలు వేయనున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పుష్ప ఫీవర్ కొనసాగుతోంది. ఇప్పటికే టికెట్ బుకింగ్ ప్రారంభం కాగా.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. భాషతో సంబంధం లేకుండా టికెట్స్ బుకింగ్స్ పుష్ప సరికొత్త రికార్డులు తిరగరాస్తోంది.అయితే పుష్ప-2 రిలీజ్‌కు ముందు అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ మూవీని 3డీ వర్షన్లో అందుబాటులోకి రాలేదనే టాక్ వినిపిస్తోంది. రిలీజ్ రోజున అన్ని థియేటర్స్‌లోనూ కేవలం 2డీ వెర్షన్‌ను మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తున్నారని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇప్పటికే 3డీ వర్షన్ టికెట్స్ బుక్ చేసుకుంటే.. ఆ షోలు కూడా 2డీ వర్షన్‌లోనే ప్రదర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 3డీ వెర్షన్ రావడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశముంది. దీనిపై చిత్రయూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.(ఇది చదవండి: 'పుష్ప 2'.. తమన్‌ని సైడ్ చేసేశారా?)కాగా.. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను ఐమ్యాక్స్, డాల్బీ, డిబాక్స్, 4డీఎక్స్, ఐస్, 2డీ, 3డీ విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లోనూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇప్పటికే 2డీ వెర్షన్‌కు సంబంధించిన ప్రింట్‌ను రెడీ చేశారు మేకర్స్. -
గెట్ రెడీ.. ఇట్స్ త్రీడీ.. !
ఇప్పుడంటే త్రీడీ ప్రింటింగ్ సాంకేతికత గురించి అందరికీ తెలిసింది. ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అందరికీ అవగాహన వచ్చింది. కానీ 8 ఏళ్ల క్రితం త్రీడీ ప్రింటింగ్ గురించి ఎవరికీ తెలియదనే చెప్పొచ్చు. కానీ 21 ఏళ్ల కుర్రాడు త్రీడీ ప్రింటింగ్‌లో భవిష్యత్తు ఉందని గుర్తించాడు. త్రీడీ ప్రింటింగ్‌లో ఏదైనా వినూత్నంగా చేయాలని ఆలోచించాడు. ఆ ఆలోచనకు పదును పెట్టాడు. ఓ స్టార్టప్ కూడా స్థాపించాడు. ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి కంపెనీ స్థాపించాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఎన్నో అవమానాలు.. ఎన్నో భయాలు.. వాటన్నింటినీ దాటుకుని ముందడుగు వేశాడు.. ఇప్పుడు ఏకంగా హైదరాబాద్‌లోని త్రీడీ ప్రింటింగ్ కంపెనీల్లో ఒకటిగా నిలిచి.. తన సత్తా చాటుకున్నాడు. అతడి పేరే.. క్రవీంతర్ కమల్.. అతని సక్సెస్ స్టోరీ గురించి మరిన్ని విశేషాలు..మేకర్ గ్లోబల్ పేరుతో 2016లో త్రీడీ ప్రింటర్స్ తయారుచేసే చిన్న స్టార్టప్ ఏర్పాటు చేశాడు. ఇప్పుడు సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నలుగురికీ ఆదర్శంగా నిలుస్తుండటమే కాకుండా.. పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. ఒకప్పుడు అసలు భవిష్యత్తు ఉంటుందా లేదా అని అనుమానం వ్యక్తం చేసిన వారికి ఇప్పుడు త్రీడీ ప్రింటింగ్తోనే భవిష్యత్తు ఉంది అని నిరూపిస్తూ కమల్ ముందుకు సాగుతున్నాడు. మొక్కవోని ధైర్యంతో.. కంపెనీ స్థాపించిన సమయంలో త్రీడీ ప్రింటింగ్‌పై డెలాయిట్, టాటా ఏరోస్పేస్ వంటి కంపెనీల వద్దకు వెళ్లి అవగాహన కలి్పంచేవాడినని కమల్ గుర్తుచేసుకున్నాడు. ఆ తర్వాత త్రీడీ ప్రింటింగ్ మెషీన్లను సొంతంగా తయారు చేసి, కంపెనీలకు విక్రయించేవాడినని చెప్పుకొచ్చాడు. త్రీడీ ప్రింటింగ్ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిన తర్వాత వాటిని తయారుచేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు మేకర్ గ్లోబల్‌కు క్లయింట్స్‌గా మారారు. వారికి కావాల్సిన త్రీడీ ప్రింటింగ్ ఉత్పత్తులను వీరి దగ్గరి నుంచే చేయించుకోవడం మొదలు పెట్టారు. ఎన్నో సినిమాలకు సాయం.. త్రీడీ ప్రింటింగ్‌లో రోజువారీ ఉపయోగించే ఎన్నో వస్తువులు, ఉత్పత్తులను మేకర్ గ్లోబల్ తయారుచేస్తోంది. హైదరాబాద్‌లోని స్కైరూట్ కంపెనీకి రాకాట్ మోడల్స్‌ను త్రీడీ ప్రింటింగ్‌లో రూపొందించి ఇచ్చామని కమల్ పేర్కొన్నాడు. అది చాలా గర్వకారణంగా ఉందని చెప్పాడు. ఇక, ఎన్నో సినిమాల ఆర్ట్ డైరెక్టర్లకు కావాల్సిన వస్తువులను సులువుగా తయారు చేసి ఇస్తుంటామని, ఏటా కనీసం నాలుగు సినిమాలకు పనిచేస్తుంటామని వివరించాడు. ఇక, ఆర్ఆర్ఆర్, హనుమాన్, ఆపరేషన్ వాలెంటైన్, పుష్ప వంటి సినిమాలకు అవసరమైన వస్తువులను నటీనటులకు ఇబ్బంది కాకుండా తేలికగా ఉండేలా తయారు చేసి ఇచ్చామని చెబుతున్నారు. అప్పటి నుంచే ఆసక్తి.. తమిళనాడులోని తిరుచి్చలో జన్మించిన కమల్.. చెన్నైలోని లయోలా కాలేజీలో 2015లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కాలేజీ రోజుల్లోనే ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా పారిస్‌లోని తులుజ్లో ఏరోస్పేస్ హబ్‌లో నెల రోజుల పాటు ఉండే అవకాశం కమల్‌కు వచి్చంది. అక్కడే తొలిసారి త్రీడీ ప్రింటింగ్‌తో ఉన్న లాభాల గురించి తెలుసుకున్నా డు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక.. డిజైనింగ్‌పై ఇష్టంతో హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో చేరాడు. కానీ ఉద్యోగం చేయడం కన్నా సొంతంగా ఎదగాలని, నలుగురికీ ఉపాధి కలి ్పంచాలని ఆలోచన చేశాడు. అప్పుడే త్రీడీ ప్రింటింగ్ గురించి వచ్చిన ఆలోచనతో వెంటనే మేకర్ గ్లోబల్ స్టార్టప్ స్థాపించాడు. ఇప్పుడు ఏటా రెండున్నర కోట్ల టర్నోవర్‌తో ముందుకు వెళ్తున్నాడు. భవిష్యత్తులో సంస్థను మరింత విస్తరించడమే లక్ష్యంగా శ్రమిస్తున్నానని చెబుతున్నాడు. -
ఇంట్లో కూర్చుని.. త్రీడీ కిటికీలు ఎప్పుడైనా చూశారా?
ఇప్పటి వరకు మనం థియేటర్లో త్రీడీ సినిమాలు చూసి ఉండొచ్చు.. కానీ ఇంట్లో కూర్చుని త్రీడీ కిటికీలు ఎప్పుడైనా చూశారా? పడక గదిలో నక్షత్ర మండలాన్ని చూశారా? అత్యాధునిక టెక్నాలజీతో ప్రస్తుతం మార్కెట్లోకి త్రీడీ కిటికీలు, తలుపులు, నక్షత్ర మండలం.. ఇలా చాలా అందుబాటులోకి వచ్చాయి. త్రీడీలో సినిమా చూసి అద్భుతమైన అనుభూతిని పొందుతాం. అదే ఇంట్లో త్రీడీ కిటికీలు ఉంటే.. తలుపులు ఉంటే.. నక్షత్రాలు బెడ్రూంలో దర్శనమిస్తే.. ఈ ఊహే మనసును ఎంతో ఉల్లాసపరిచేది ఉంటుంది. డిజిటల్ ప్రింటింగ్ అరంగ్రేటంతో ప్రతీ దృశ్యం మన కళ్ల ముందే ఉన్నట్లుగా ఉంటుంది. మనకు తెలియని కొత్తప్రపంచాన్ని పరిచయం చేస్తున్నట్లు ఉంటుంది. ఇంట్లో కూర్చుని పచ్చని అటవీ అందాలు వీక్షించవచ్చు. సొగసైన జలపాతాలు చూడవచ్చు. క్రికెట్ స్టేడియంలో ఉన్నట్లు ఫీలు కావచ్చు. గోడలపై బీచ్ రోడ్డు పక్కనే ఉన్న కొబ్బరిచెట్లూ పెరుగుతున్నట్లు అనిపించవచ్చు. – సాక్షి, సిటీ బ్యూరోనగరంలో కొత్తగా ఇల్లు కట్టుకునే వారు ప్రస్తుతం మార్కెట్లో న్యూ ట్రెండ్ ఏం నడుస్తుందని ఇంటర్నెట్లో శోధిస్తున్నారు. దేశ, విదేశాల్లో అందుబాటులో ఉన్న ఆధునిక హంగులపై ఆరా తీస్తున్నారు. తమ అభిరుచులకు తగ్గట్లు వస్తువులను ఆర్డర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కిటికీలు, తలుపులు, గోడలు, బెడ్రూంలో సరికొత్త డిజైన్లు దర్శనమిస్తున్నాయి. కొంత కాలంగా నచి్చన సీనరీ, చిత్రాలను గోడలకు, విండోస్‌కు స్టిక్కర్ అతికించే పద్ధతి కొనసాగుతోంది.ఇటీవల మరింత అప్‌గ్రేడ్ అయ్యారు. త్రీడీ టెక్నాలజీ ఆ స్థానాన్ని భర్తీ చేస్తోంది. కస్టమైజ్ బ్లైండ్స్, జీబ్రా బ్లైండ్స్, ఉడెన్ బ్లైండ్స్, పీవీసీ బ్లైండ్స్, రోలర్ బ్లైండ్స్ అందుబాటులోకి వచ్చాయి. స్థాయిని బట్టి కనీసం రూ.200 (ఒక అడుగు) నుంచి గరిష్టంగా రూ.500 వరకు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఇంట్లోకి రూమల్ బ్లైండ్స్ను ఫ్యాబ్రిక్‌తో తయారు చేస్తున్నారు. కిటికీలు, డోర్లకు పీవీసీ బ్లైండ్స్ వినియోగిస్తున్నారు. ఇంటి యజమాని అభిరుచికి తగ్గట్లు చిత్రాలతో అందుబాటులోకి తెస్తున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసుల్లో మాత్రం సంస్థ లోగో, చేసే పనికి సంబంధించిన థీం చిత్రాలను త్రీడీ టెక్నాలజీలో అనుభూతి పొందుతున్నారు.రిలాక్స్.. రిలాక్స్నగరంలో సగటు వ్యక్తులు ఉద్యోగం, వ్యాపారం, ఇతర పనులతో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత మనసుకు ఆహ్లాదకరమైన ప్రదేశంలో కూర్చుని అలా రిలాక్స్ అవుతున్నారు. ఒత్తిడి నుంచి ఒక్కసారిగా ప్రకృతి ఒడిలోకి ఒదిగిపోయి నట్లు ఫీల్ అవుతున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో సమయం గడిపేస్తున్నారు. త్రీడీ టెక్నాలజీ ఎంత బాగుందో కదా.వేడుకల్లోనూ ఆ సోయగాలే..త్రీడీ తెరలతో చాలా మంది వేడుకల్ని సైతం సింపుల్‌గా కానిచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఓ గంట ఫంక్షన్‌కి పూలు, అలంకరణ అంటే అంత ఖర్చు ఎందుకు దండగ అనుకుని త్రీడీ బ్యాక్‌డ్రాప్ స్క్రీన్స్ కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఒక దఫా కొంటే తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. డెకరేటర్లు చేసిన వేదికల ఫొటోలను యథాతథంగా తెరమీదకి తెచ్చేస్తోంది. దీంతో అలంకరణ ఖర్చు తగ్గుతోంది. పూలు లేకుండానే ఫొటోల్లో పూల అలంకరణ కనిపించేస్తుంది. త్రీడీ మాయతో కనువిందు చేస్తున్నాయి.అప్‌గ్రేడ్ అవుతున్నారు..నగరంలో ఒకే మోడల్ ఎక్కువ రోజులు వినియోగంలో ఉండదు. మారుతున్న కాలంతో పాటే ఇక్కడి ప్రజల అభిరుచులు మారుతున్నాయి. వాల్కి అతికించే ఇమేజ్‌ల నుంచి ప్రస్తుతం త్రీడీ టెక్నాలజీ వరకు ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతున్నారు.– దీపక్, డిజైన్ వాల్స్, మియాపూర్ఇవి చదవండి: చాయ్ చమక్..! -
ఐఐటీ హైదరాబాద్ ఘనత..త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో బ్రిడ్జ్ తయారీ..!
ఐఐటీ హైదరాబాద్ అరుదైన ఘనత సాధించింది. యువ స్టార్టప్ సింప్లిఫోర్జ్ క్రియేషన్సతో కలిసి భారతదేశపు మొట్టమొదటి ప్రోటోటైప్ బ్రిడ్జ్‌ను తయారుచేసింది. స్వదేశీ 3D ప్రింటింగ్ టెక్నాలజీతో ఈ బ్రిడ్జ్ తయారు చేయడం విశేషం. ఈ త్రీడీ ప్రింటెడ్ బ్రిడ్జ్‌ని ఐఐటీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. దీన్ని కేవీఎల్ సుబ్రమణ్యం అతని రీసెర్చ్ గ్రూప్, డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ బృందం కలిసి పాదాచారుల బ్రిడ్జ్‌ని రూపొందించారు. లోడ్ పరీక్ష తర్వాత పూర్తి స్థాయి 7.50 మీటర్ల వంతెనను రూపొందించే యత్నం చేశారు. కాంక్రీట్ ఉపబలాన్ని తగ్గించి ఈ నిర్మాణాన్ని అభివృద్ధి చేశారు. ఈ వంతెనలో మెటీరియల్ ప్రాసెసింగ్, డిజైన్ మెథడాలజీలలో అనేక పురోగతులు హైలెట్‌గా నిలిచాయి. నిజానికి ఈ త్రీడి కాంక్రీట్ ప్రింటింగ్ అనేది అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు నిదర్శనం. పైగా తక్కువ బరువుతో వేగవంతమైన సమర్థవంతమైన వంతెనలు, నిర్మాణాలను అభివృద్ధి చేసే నిర్థిష్ట ఆప్టమైజ్ అప్లికేషన్ త్రీడీ టెక్నాలజీ. ఈ మేరకు ఈ ప్రోటోటైప్ వంతెనను అభివృద్ధి చేసిన కేఎల్ సుమ్రమణ్యం, అతని బృందాన్ని ఐఐటీ హైదరబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి అభినందించారు. వేగవంతమైన సమర్థవంతమైన నిర్మాణాలకు సాంకేతికతో కూడిన పరిష్కారాలు అత్యంత అవసరమని అన్నారు. సమర్థవంతమైన నిర్మాణం కోసం స్వదేశీ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం అనేది ఆత్మ నిర్బర్ కలను సాకారం చేసుకునే దిశగా డిజిటల్క్నాలజీని అభివృద్ధిపరిచే ఘనమైన ముందుడగు అని ప్రశంసించారు. ఇలాంటి ఆవిష్కరణలు ఆర్థిక పరంగా స్థానిక అభివృద్ధికి మాత్రమే గాక మౌలిక సదుపాయల రంగానికి మరిన్ని ప్రయోజనాలు అందించగలదని భావిస్తున్నానని అన్నారు.(చదవండి: ఆరోజు రాత్రి వరకు అబ్బాయి.. లేచిన వెంటనే అమ్మాయిగా మార్పు..!) -
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
సాధారణంగా ఓ ఇల్లు కట్టాలంటే బోలెడంత సమయం కావలి. ఇటుకలు, ఇసుక, సిమెంట్ ఇలా.. చాలా ముడిపదార్ధాలు కావాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు కేవలం వారం రోజుల కంటే తక్కువ వ్యవధిలోనే ఇల్లు కట్టే 3డీ టెక్నాలజీ వచ్చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..3డీ ప్రింటెడ్ హౌస్ అనేది వాతావరణ పరిస్థితులను, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విధంగా ఉంటుంది. ఇటీవల బీఎమ్ పార్ట్నర్ COBOD BOD2 మోడల్‌లలో ఒకదాన్ని ఉపయోగించి కేవలం ఐదు రోజుల్లోనే ఓ ఇల్లు నిర్మించారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక్కడ కనిపించే ఇల్లు ఇటుకలతో నిర్మించిన ఇంటి కంటే తక్కువ ధరలోనే నిర్మించారు. ఈ ఇల్లు కజకిస్తాన్‌లోని అల్మాటీలో ఉన్నట్లు సమాచారం. దీనిని నిర్మించిన కంపెనీ ఇతర ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్‌ల మాదిరిగానే.. 3D ప్రింటర్ నాజిల్ నుంచి సిమెంట్ వంటి మిశ్రమాన్ని పొరలుగా పేర్చుతుంది. ఈ విధంగా గోడ నిర్మాణం జరిగింది. ఇది రిక్టర్ స్కెలు మీద 7.0 తీవ్రత నమోదు చేసే భూకంపాన్ని కూడా తట్టుకుని నిలబడగలదని చెబుతున్నారు.బీఎమ్ పార్ట్నర్ ఈ ఇంటిని బలమైన కాంక్రీట్ మిశ్రమాన్ని ఉపయోగించి నిర్మించింది. ఇది సాధారణ ఇటుకలు, రాళ్లతో నిర్మించిన ఇంటికంటే కూడా గట్టిగా ఉంటుంది. ఇందులో కిటికీలు, తలుపులు, ఫర్నిచర్ వంటి వాటిని కూడా బిల్డర్లు నిర్మించినట్లు సమాచారం.3డీ ప్రింటెడ్ ఇంటిని ఐదు రోజుల్లో నిర్మించినప్పటికీ ప్రింటర్ సెటప్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫర్నిచర్ ఇన్స్టాల్ చేయడం ముగించే వరకు ప్రాజెక్ట్ పూర్తి కావడానికి రెండు నెలల సమయం పట్టిందని బిల్డర్స్ పేర్కొన్నారు. ఈ ఇంటిని నిమించడానికి సుమారు 21800 డాలర్స్ ఖర్చు అయినట్లు సమాచారం. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 18 లక్షల కంటే ఎక్కువని తెలుస్తోంది.మన దేశంలో 3డీ ప్రింటెడ్ హౌస్‌భారతదేశంలో కూడా ఐఐటీ మద్రాస్ స్టార్టప్ కేవలం 5 రోజుల్లో మొట్టమొదటి 3డీ ప్రింటెడ్ హౌస్‌ను నిర్మించింది. దీనిని కేంద్ర మంత్రి సీతారామన్ ప్రారంభించారు. ఈ ఇంటిని కాంక్రీట్ 3డీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి పూర్తి చేశారు. హబిటాట్ ఫర్ హ్యుమానిటీ యొక్క టెర్విల్లిగర్ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్‌తో కలిసి అభివృద్ధి చేశారు. -
దేశంలోనే తొలి '3డీ ప్రింటెడ్ ఆలయం'.. ఎక్కడో తెలుసా!
సాక్షి, సిద్దిపేట: ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలు తప్పవు.. సామగ్రి, కూలీలు అన్నీ ఇన్నీ కావు.. ఒకవేళ అందుబాటులో ఉన్నా నిర్మాణం పూర్తి కావాలంటే నెలలు గడవాల్సిందే. ఈ కష్టాలన్నింటికీ చెక్ పెడుతూ .. స్వల్ప వ్యవధిలోనే నిర్మాణాలు పూర్తి చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే మొట్టమొదటి త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ (రోబో)తో ఆధ్యాత్మిక శ్రీపాద కార్యసిద్దేశ్వరస్వామి దేవాలయాన్ని సిద్దిపేటలోని బూరుగుపల్లి సమీపంలో నిర్మించారు. నెలరోజులపాటు 3డీ ప్రిటింగ్తో 30 గంటల్లో దేవాలయ నిర్మాణం పూర్తి చేసి ఔరా అనిపించారు. ఈ త్రీడీ దేవాలయాన్ని 3,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో 30 అడుగుల ఎత్తులో నిర్మించారు. దేశంలోనే తొలి దేవాలయం! త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ(రోబో) మిషన్‌ను ఏబీబీ అనే యూరోపియన్ నుంచి తీసుకొచ్చారు. దీనిలో ఉండే ఇంటర్నల్ సిస్టమ్, దీని కోసం వినియోగించే సాఫ్ట్‌వేర్‌ను భారతదేశంలోనే తయారు చేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా 2022లో 3డీ ప్రిటింగ్ విధానంలో కాలిఫోర్నియాలోని టెహమా కౌంటీలో చర్చి నిర్మించారు. సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ ఈ ఏడాది మార్చిలో ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి దేశంలోనే తొలి త్రీడీ ప్రింటెడ్ నమూనా వంతెనను నిర్మించింది. దేశంలోనే తొలిసారిగా మిషనరీతో సిద్దిపేటలో దేవాలయం నిర్మించారు. కంప్యూటర్లో రూపొందించి.. కంప్యూటర్లో ముందుగా దేవాలయం డిజైన్ పొందుపర్చి కాంక్రీట్ త్రీడీ మిషన్ ద్వారా నిర్మించారు. అప్సూజ కంపెనీ నిర్మాణ బాధ్యతలను తీసుకొని సింప్లీ పోర్జ్ అనే త్రీడీ టెక్నాలజీ కంపెనీకి అప్పగించింది. మోదక్, దీర్ఘచతురస్రాకారం, కమలం మొగ్గ ఆకారాల్లోని గర్భ గుడీలతోపాటు ఆలయ గోపురాలను కంప్యూటర్లో తొలుత 3డీలో డిజైన్ చేసి ఆపై యంత్రాల ద్వారా నిర్మించారు. దీంతో ఆలయం భక్తులకు కనువిందు చేస్తోంది. ఇటీవల ప్రారంభం.. సిద్దిపేటలో త్రీడీ టెక్నాలజీతో నిర్మించిన శ్రీపాద కార్యసిద్దేశ్వరస్వామి దేవాలయం ఇటీవల ప్రారంభించారు. వారం రోజులపాటు విగ్రహప్రతిష్ట మహోత్సవాలను నిర్వహించారు. నిత్యం విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు దేవాలయం నిర్మించిన తీరును అడిగి తెలు సుకుంటున్నారు. త్వరగా నిర్మాణం పూర్తికావడంతో ఇతర ప్రాంతాల నుంచి సైతం ఇంజినీర్లు, పలు నిర్మాణ సంస్థలు వచ్చి నిర్మాణంను పరిశీలిస్తున్నారు. ఒక్కో గర్భగుడికి ఒక్కో ప్రత్యేకత! దేవాయలంలో గర్భగుడీలు ఒక్కొక్కటి ఒక్కో ఆకారంలో నిర్మించారు. హేరంబ గణపతి కోసం మోదకం ఆకారంలో గర్భగుడిని నిర్మించారు. ఇది 11 ఫీట్ల ఎత్తు, 8 ఫీట్ల వెడల్పు ఉంది. వీటి నిర్మాణం వారం రోజులపాటు 7 గంటలు ప్రింటింగ్‌తో నిర్మాణం పూర్తి చేశారు. అలాగే భువనేశ్వరి అమ్మవారి కోసం కమలం మొగ్గ ఆకారంలో గర్భగుడిని నిర్మించారు. ఎత్తు 11 ఫీట్లు , వెడల్పు 8.5 ఫీట్లు ఉంది. ఈ ఆకారం నిర్మాణం కోసం వారం రోజులపాటు ప్రింటింగ్ 8 గంటలు పట్టింది. దత్తాత్రేయ స్వామితోపాటు స్పటికలింగానికి గర్భగుడి దీర్ఘచతురస్రాకారంలో నిర్మించారు. 10 రోజులపాటు 15 నుంచి 16 గంటల సమయం పట్టింది. కూలీల పని తప్పింది 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ(రోబో) మిషన్‌ను ఏబీబీ అనే యూరోపియన్ నుంచి తీసుకొచ్చాం. దీనికి సంబంధించి మొత్తం సాఫ్ట్‌వేర్‌ను మన దేశంలోనే తయారు చేసి నిర్మాణం చేపట్టాం. కూలీల వ్యయప్రయాసలు తప్పాయి. – హరికృష్ణ, సీఈఓ ఇవి చదవండి: కోవిడ్.. అలర్ట్! 'జేఎన్–1 వేరియంట్' రూపంలో ముప్పు! -
అద్భుతం.. 3డీ ప్రింటెడ్ ఆలయం
సిద్దిపేట అర్బన్: వాస్తుశిల్ప సౌందర్యం, సాంకేతిక పరి/జ్ఞనం మేళవింపుతో అసాధారణమైన రీతిలో నిర్మించిన ఆధ్యాత్మిక అద్భుతం.. ప్రపంచంలోనే మొట్టమొదటి 3డీ ప్రింటెడ్ హిందూ దేవాలయం సిద్ధపేటలో ఆవిష్కృతమైంది. సింప్లిఫోర్జ్ క్రియేషన్‌తో కలిసి అప్సుజా ఇన్ఫ్రాటెక్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం బూరుగుపల్లి శివారులోని చర్విత మెడోస్‌లో నిర్మించిన 3డీ ప్రింటెడ్ దేవాలయానికి శ్రీపాద కార్య సిద్ధేశ్వర స్వామి దేవస్థానంగా నామకరణం చేశారు. వేద పండితుల ఆధ్వర్యంలో మంగళవారం మొదలైన ప్రతిష్టాపన మహోత్సవ పూజలు మరో రెండు రోజులు జరగనుండగా.. 24 నుంచి ఆలయాన్ని భక్తులు దర్శించుకునేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఐకానిక్ టెంపుల్ సాంస్కృతిక వారసత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని అప్సుజా ఇన్ఫ్రాటెక్ మేనేజింగ్ డైరెక్టర్ హరికృష్ణ జీడిపల్లి వ్యాఖ్యానించారు. 4వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 35.5 అడుగుల పొడవు, 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉందని హరికృష్ణ తెలిపారు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అమిత్ ఘూలే మాట్లాడుతూ.. ఆలయం భూకంపాలకు దెబ్బతినకుండా నిర్మించినట్టు తెలిపారు. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ వసీం చౌదరి మాట్లాడుతూ గర్భగుడిలో వేదమంత్రాల ప్రతిధ్వనులతో భక్తులను మంత్రముగ్ధులను చేసేలా నిర్మాణం జరిగిందన్నారు. పూరీ జగన్నాథ ఆలయం శైలిలో గోపురం డిజైన్ చేసినట్లు వెల్లడించారు. ఆలయ నిర్మాణ పనులు 70 రోజుల్లో పూర్తయ్యాయి. -
నాటి పురాతన కట్టడాలకు వర్చువల్ త్రీడీ టెక్నాలజీతో ప్రాణం పోస్తే...
కీస్తూ పూర్వం లేదా క్రీస్తు శకం నాటి పురాతన కట్టడాలు, ప్రపంచపు వింతలు చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. అయినా వాటి నిర్మాణ శైలి, దాగున్న అద్భుత ఆవిష్కరణలు అందర్నీ మంత్ర ముగ్దుల్ని చేస్తూనే ఉన్నాయి. అలాంటి వాటికి ప్రాణం పోసి తిరిగి పునర్నిర్మిస్తే ఎలా ఉంటుదన్న ఆలోచనే భలే ఉంటుంది కదూ. ఆ ఊహకు వర్చువల్ త్రీడీ టెక్నాలజీని జోడించి మరీ అలనాటి వైభవం మన కళ్ల ముందు ప్రత్యక్షమయ్యేలా నాటి కట్టడాలకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆహా! టైం మిషన్ వెనక్కి వెళ్లిందా.. అన్నంత అద్భుతంగా ఉన్నాయి ఆ పురాతన నిర్మాణాలు, ప్రదేశాలు. 1.ప్రపంచంలోని ఏడు వింతల్లో ది కోలోసస్ ఆఫ్ రోడ్స్ విగ్రహం ఒకటి. ఇది గ్రీకుల దేవుడైన సన్ హీలియోస్ విగ్రహం A thread of 20 ancient sites and wonders brought to life by virtual reconstructions 🧵 1. The Colossus of Rhodes, Rhodes, Greece (c.280 BC) pic.twitter.com/TM7Le7XXCg — Culture Critic (@Culture_Crit) October 20, 2023 2. గ్రీకు పాశ్చాత్య నాగరికతను, వారి సంప్రదాయ కళకు నిలువెత్తు నిదర్శనం ఏథెన్స్ దేవతకు చెందిన పార్థినాన్ దేవాలయం. 2. The Parthenon, Athens, Greece (c.432 BC) pic.twitter.com/5uzfuhQpGe — Culture Critic (@Culture_Crit) October 20, 2023 3.ఈజిప్షియన్ల పురాతన దేవాలయం లక్సోర్ టెంపుల్. 3. Luxor Temple, Luxor, Egypt (c.1213 BC) pic.twitter.com/pF2OmTPmyb — Culture Critic (@Culture_Crit) October 20, 2023 4. ఇటలీలో రోమన్ పాంపీలో ఉన్న బృహస్పతి ఆలయం 4. The Temple of Jupiter, Pompeii, Italy (c.200 BC) pic.twitter.com/nVUy0OdlHg — Culture Critic (@Culture_Crit) October 20, 2023 5. సిరియాలో పామిరాలో ఉన్న బెల్ టెంపుల్. 5. The Temple of Bel, Palmyra, Syria (c.32 AD) pic.twitter.com/HbBYIONbEx — Culture Critic (@Culture_Crit) October 20, 2023 6. మెక్సికోలో కోబాలో ఉన్న అత్యంత ఎత్తైన నోహుచ్ మ్యూల్ పిరమిడ్(మట్టి దిబ్బ). 6. Nohoch Mul Pyramid, Coba, Mexico (c.550 AD) pic.twitter.com/kFguYv0KEU — Culture Critic (@Culture_Crit) October 20, 2023 7. ఇజ్రాయెల్‌లోని జెరూసలేం ఓల్డ్ సిటీ 7. The Old City of Jerusalem, Israel (1st Century BC) pic.twitter.com/CJzlVYnd51 — Culture Critic (@Culture_Crit) October 20, 2023 8. లిబియాలో లెప్టిస్ మాగ్నా నగరంలో ఉన్న రోమన్ థియేటర్ 8. The Roman theatre in Leptis Magna, Khoms, Libya pic.twitter.com/M925LZXC6l — Culture Critic (@Culture_Crit) October 20, 2023 9. ఇరాన్లో అల్బోర్జ్‌లో ఉన్న అలముట్ కోట(పర్వత కోట) 9. Alamut Castle, the Alborz, Iran (c.1090 AD) pic.twitter.com/kn1rU74OXZ — Culture Critic (@Culture_Crit) October 20, 2023 10. టర్కీలో బోడ్రమ్, హలికర్నాసస్ వద్ద ఉన్న సమాధి 10. The Mausoleum at Halicarnassus, Bodrum, Turkey (c.351 BC) pic.twitter.com/HB1g8OJ1Vk — Culture Critic (@Culture_Crit) October 20, 2023 11. ఇటలీలోని రోమ్‌లో ఉన్న లార్గో డి టోర్రే అర్జెంటీనా. ఇది నాలుగు రోమన్ రిపబ్లికన్ దేవాలయ అవశేషాలకు సంబంధించిన బహిరంగ ప్రదేశం 11. Area Sacra di Largo Argentina, Rome, Italy (c.101 BC) pic.twitter.com/J7mPDPjrz1 — Culture Critic (@Culture_Crit) October 20, 2023 12. మెక్సికోలో టియోటిహుకాన్లో ఉన్న అదిపెద్ద భవనం సూర్యుని పిరమిడ్. 12. The Pyramid of the Sun, Teotihuacan, Mexico, (c.200 AD) pic.twitter.com/rBPIZrcyNv — Culture Critic (@Culture_Crit) October 20, 2023 13 ఫ్రాన్స్‌లో లెస్ ఆండెలిస్ వద్ద ఉన్న మధ్యయుగపు కోట చాటేవు గైలార్డ్ 13. Château Gaillard, Les Andelys, France (c.1196 AD) pic.twitter.com/KvQlUBrtAw — Culture Critic (@Culture_Crit) October 20, 2023 14 ఉత్తర ఐర్లాండ్‌లో కౌంటీ అంట్రిమ్లో ఉన్న డన్లూస్ కాజిల్ కోట 14. Dunluce Castle, County Antrim, Northern Ireland (c.1500 AD) pic.twitter.com/OCZr7bRMb7 — Culture Critic (@Culture_Crit) October 20, 2023 15 ఇంగ్లాండ్‌లో నార్తంబర్ల్యాండ్ మైల్కాజిల్ 39 అనే హాడ్రియన్స్ గోడ 15. Milecastle 39, Hadrian’s Wall, Northumberland, England (c.100 AD) pic.twitter.com/MkKdjeYWMR — Culture Critic (@Culture_Crit) October 20, 2023 16 ఇరాన్లో ఫిజురాబాద్లో ఉన్న ఖలేహ్ దోఖ్తర్ ప్యాలెస్ 16. Qal'eh Dokhtar Palace, Fizurabad, Iran (c.209 AD) pic.twitter.com/gLT7GuFPcm — Culture Critic (@Culture_Crit) October 20, 2023 17 ఇరాక్‌లోని బాబిలోన్లో ఉన్న ది హాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోన్. ఇది కూడా ప్రపంచపు ఏడు వింతల్లో ఒకటి. 17. The Hanging Gardens of Babylon, Babylon, Iraq (c.562 BC) pic.twitter.com/iMGfP3atHY — Culture Critic (@Culture_Crit) October 20, 2023 18 టర్కీలో ఎఫెసస్లో ఉన్న ఆర్టెమిస్ ఆలయం(డయానా టెంపుల్ అని కూడా పిలుస్తారు) 18. The Temple of Artemis at Ephesus, Turkey (c.550 BC) pic.twitter.com/YFCL6Wq5bB — Culture Critic (@Culture_Crit) October 20, 2023 19. ప్రపంచపు ఏడు వింతల్లో ఒకటైన ఈజిప్ట్‌లోని ది లైట్‌హైస్ ఆఫ్ అలెగ్జాండ్రియా. 19. The Lighthouse of Alexandria, Alexandria, Egypt (c.280 BC) pic.twitter.com/k3o5t1WaGo — Culture Critic (@Culture_Crit) October 20, 2023 20 ఈజిప్ట్‌లోని ది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా. మూడు గిజా పిరమిడ్లలో అతి పెద్దది 20. The Great Pyramid of Giza, Egypt (c.2561 BC) pic.twitter.com/cMw91iMw2i — Culture Critic (@Culture_Crit) October 20, 2023 (చదవండి: ఆ వృద్ధుడు 55 ఏళ్లుగా స్వీయ నిర్బంధంలోనే..ఎందుకో తెలిస్తే షాకవ్వుతారు!) -
భూకంపాలను తట్టుకొని నిలబడే ఇల్లు, కేవలం 26 గంటల్లోనే..
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటారు. అంటే జీవితంలో ఈ రెండు పనులు చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదనేది దాని అర్థం. సొంతంగా ఇల్లు కట్టుకోవాలన్నది చాలామందికి కలగా ఉంటుంది. అయితే ఇదంత చిన్న విషయం కాదు. ఎన్నో వ్యయప్రయాసలతో కూడుకున్నది. పునాది మొదలు పైకప్పు దాకా కొన్ని నెలల నుంచి సంవత్సరాల సమయం పడుతుంది. అయితే ఇప్పుడు ఎలాంటి శ్రమ లేకుండా భారత నిర్మాణ రంగంలో త్రీ డైమెన్షనల్ ప్రింటింగ్ అనే కొత్త టెక్నాలజీ వచ్చి చేరిన విషయం తెలిసిందే. దీంతో ఇటుకలు, సిమెంట్ ఏమీ అక్కర్లేదు,తాపీ మేస్త్రీలు అవసరం లేదు.జస్ట్.. ఇంటి స్థలం ఒక్కటి చాలు. అందమైన కలల సౌధాన్ని.. కష్టం లేకుండానే నిర్మించేయొచ్చు. అంతేకాకుండా ఇప్పుడు భూకంపాలను తట్టుకొని నిలబడి ఇంటి నిర్మాణాలు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. ప్రముఖ సిమెంట్ కంపెనీ ప్రోగ్రెసో తన మొట్టమొదటి 3డీ ప్రింటింగ్ ఇంటిని నిర్మించింది. ప్రోటోటైప్ డిజైన్‌తో భూకంపం లాంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా ఈ ఇంటిని డిజైన్ చేశారు. దీని స్పెషాలిటీ ఏంటంటే.. కేవలం 26 గంటల్లోనే ఈ ఇంటిని నిర్మించారు. ఈ ఇల్లు భూకంపాలను తట్టుకొని నిలబడగలదు. 49 స్క్వైర్ఫీట్లోనే ఈ ఇంటిని నిర్మించారు. ఇందులో COBOD ప్రింటర్‌ను ఉపయోగించారు. రీసెంట్గా బెంగళూరులో తొలి 3డి ప్రింటింగ్‌తో ఏర్పాటైన పోస్టాఫీస్ నిర్మాణంలోనూ ఇదే తరహా ప్రింటర్‌ను ఉపయోగించారు. ఇంటి పైకప్పులను రాంచో రకం తాటాకులతో నిర్మించారు. ఈ తరహా నిర్మాణం సాధారణంగా కొన్నేళ్లుగా లాటిన్ అమెరికాలో ఉపయోగిస్తున్నారు. ధర తక్కువగా ఉండటంతో పాటు ఇంటిని కాస్త వేడిగా ఉంచుతుంది. 3డీ ప్రింటింగ్ నిర్మాణం ముఖ్యంగా భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలాకు బాగా సరిపోతుంది. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల్లో 3డీ నిర్మాణం అందుబాటులోకి వచ్చేసింది. దీంతో ఇటుకలు, సిమెంట్ ఏమీ అక్కర్లేదు,తాపీ మేస్త్రీలు అవసరం లేకుండా కేవలం ఇంటి స్థలం ఉంటే చాలు అందమైన ఇంటిని కష్టం లేకుండానే నిర్మించేయొచ్చు. రోబోల మాదిరిగా రోజుల్లోనే ఇంటిని కట్టిపడేస్తోందీ ఈ 3డీ టెక్నాలజీ. జస్ట్ ఒక్క బటన్ ప్రెస్ చేస్తే చాలు ఇల్లు రెడీ అవుతుంది మరి. 3డి ప్రింటింగ్ టెక్నాలజీ అంటే ఏమిటి? సాధారణ ఇంటి నిర్మాణం మాదిరిగానే 3డీ ప్రింటింగ్ నిర్మాణం కూడా సాగుతుంది. అయితే, ఇందులో కార్మికులకు బదులుగా యంత్రం నిర్మాణ పని చేస్తుంది. ఇంటిని ఎక్కడ కట్టాలో నిర్ణయించాక, అవసరమైన ప్లాన్ (బ్లూప్రింట్) రూపొందిస్తారు. గోడలు, గదులు ఎలా ఉండాలో ప్లాన్ చేసి ఇంటి బ్లూప్రింట్ మోడలింగ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ద్వారా సిద్ధం చేస్తారు. అనంతరం ప్లాన్‌ను కంప్యూటర్ సాయంతో భారీస్థాయిలో ఉండే 3డీ ప్రింటర్‌కు పంపిస్తారు. ఇంటి ప్రింటింగ్ ప్రారంభించే ముందు.. పేస్ట్ లాంటి బిల్డ్ మిశ్రమాన్ని (కాంక్రీట్) వేసేందుకు అనువుగా నిర్మాణ ప్రాంతం చుట్టూ యంత్రం రోబోటిక్ హ్యాండ్ కదిలేందుకు వీలుగా బిల్డింగ్ సైట్ చుట్టూ పట్టాలు అమరుస్తారు.అన్నీ సరిచూసుకున్నాక యంత్రానికున్న ‘ప్రింట్’ బటన్ ఆన్ చేయగానే ప్రింటర్ దానికదే ప్లాన్ ప్రకారం నిర్మాణాలన్నీ ప్రారంభించి గోడలు, కిటికీలు, వెంటిలేటర్లు వంటివి పూర్తిచేస్తుంది. ఇందులో ప్రింటర్‌లోని నాజిల్ ద్వారా కాంక్రీట్ మెటీరియల్ బయటకు వస్తే.. దాన్ని మరో కాంక్రీట్ డ్రయర్ నిర్మాణ సామగ్రిని త్వరగా పటిష్టం చేస్తుంది. ఆ వెంటనే దానిపై మరో పొర కాంక్రీట్ వేస్తుంది. ఇలా పొరలు పొరలుగా ప్లాన్‌లో ఉన్నట్టుగా నిర్మాణం పూర్తవుతుంది. ఆపై కిటికీలు, తలుపులు, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ వంటి పనులను కార్మికులతో పూర్తిచేస్తారు. -
ల్యాండర్ విక్రమ్ 3డీ చిత్రం
ఢిల్లీ:చంద్రయాన్ 3 ప్రాజెక్టుని ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్‌ని విజయవంతంగా దింపింది. చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరిన మొదటి దేశంగా భారత్ అజేయంగా నిలిచింది. చంద్రునిపై ప్రజ్ఞాన్ రోవర్ సంచరిస్తూ అనేక విషయాలను వెలుగులోకి తెచ్చింది. అయితే.. జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ దిగిన దృశ్యాలను 3డీ ప్రింటింగ్‌ని ఇస్రో తాజాగా విడుదల చేసింది. Chandrayaan-3 Mission: Anaglyph is a simple visualization of the object or terrain in three dimensions from stereo or multi-view images. The Anaglyph presented here is created using NavCam Stereo Images, which consist of both a left and right image captured onboard the Pragyan… pic.twitter.com/T8ksnvrovA — ISRO (@isro) September 5, 2023 చంద్రయాన్–3 మిషన్‌లో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై క్షేమంగా దిగిన ల్యాండర్ విక్రమ్ 3డీ చిత్రమిది. ఆనాగ్రిఫ్ టెక్నిక్‌ను ఉపయోగించి ఇస్రో ఈ చిత్రాన్ని రూపొందించింది. -
దేశంలోనే తొలి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు
బెంగళూరు: భారత్‌లో తొలిసారి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు భవనాన్ని నగరంలో కేంద్ర మంత్రి అశ్విణీ వైష్ణవ్ నేడు ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో దీనిని నిర్మించినట్లు వెల్లడించారు. బెంగళూరులోని కేంబ్రిడ్జీ లే అవుట్లో ఈ పోస్టు ఆఫీస్‌ను నిర్మించారు. 1,021 చదరపు అడుగుల వైశాల్యంలో దీన్ని నిర్మించినట్లు పోస్టల్ శాఖ తెలిపింది. లార్సెన్ అండ్ టర్బో లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు చేపట్టగా.. ఐఐటీ మద్రాస్ సాంకేతికతను అందించింది. సాంప్రదాయ పద్దతిలో ఏనిమిది నెలలు పట్టేది.. కేవలం 45 రోజుల్లోనే పోస్టాఫీస్‌ను నిర్మించినట్లు చెప్పారు. The spirit of Aatmanirbhar Bharat! 🇮🇳India’s first 3D printed Post Office. 📍Cambridge Layout, Bengaluru pic.twitter.com/57FQFQZZ1b — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 18, 2023 మన సొంత టెక్నాలజీని ఉపయోగించి 3డీ పోస్టాఫీస్‌ను నిర్మించినట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గతంలో సాధ్యం కానీదాన్ని సుసాధ్యం చేసినట్లు వెల్లడించారు. 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారంగా దీన్ని నిర్మించినట్లు చెప్పారు. ఎవరూ ఊహించని విధంగా 4జీ, 5జీ టెక్నాలజీలను ఇండియా అభివృద్ధి చేసిందని అన్నారు. ఇదీ చదవండి: ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అభ్యర్థుల జాబితా విడుదల.. అత్యధికులు వారే.. -
సిద్ధిపేటలో రోబోటిక్స్, 3D ప్రింటింగ్ టెక్నాలజీతో దేవాలయాల నిర్మాణం
-
హైదరాబాద్‌లో జాతీయ 3డీ ప్రింటింగ్ కేంద్రం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్/ఉస్మానియా యూనివర్సిటీ: హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జాతీయ 3డీ ప్రింటింగ్ కేంద్రాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార శాఖ కార్యదర్శి అల్కేష్ కుమార్ శర్మ, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కేంద్రం, వివిధ పరిశ్రమలు రూ.70 కోట్ల వ్యయంతో దేశంలో తొలిసారిగా రాష్ట్రంలో ఈ అత్యాధునిక నేషనల్ సెంటర్ ఫర్ అడిటివ్ మాన్యుఫాక్చరింగ్ (3డీ ప్రింటింగ్ సెంటర్)ను ఏర్పాటు చేసిన్నట్లు వారు పేర్కొన్నారు. ఓయూ క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలోని టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్లో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన జాతీయ 3డీ ప్రింటింగ్ కేంద్రంలో ఏరోస్పేస్, డ్రోన్లు, మానవ కృత్రిమ అవయవాలు, ఆటోమొబైల్ పరికరాలు, అన్ని రకాల పరిశ్రమలకు ఉపయోగపడే వస్తువులను తయారుచేస్తారని కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.శ్రీరామ్ వెంకటేశ్ చెప్పారు. 3డీ ప్రిటింగ్ రూపకర్త ప్రొ.శ్రీరామ్ వెంకటేష్ ఓయూ ఇంజనీరింగ్ కాలేజీ మెకానికల్ ఇంజినీరింగ్ సీనియర్ ప్రొ.శ్రీరామ్ వెంకటేశ్ 2002 నుంచి 3డీ ప్రింటింగ్ సబ్జెక్టును ఇంజనీరింగ్ విద్యార్థులకు బోధిస్తున్నారు. ఈ సబ్జెక్టుపై అనేక పరిశోధనలు చేసిన ఆయన 2007లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ నుంచి రూ.కోటి ప్రాజెక్టును పొందారు. దీంతో ప్రత్యేకంగా పరికరాలను, యంత్రాలను కొనుగులు చేసి 3డీ సెంటర్‌ను అభివృద్ధి చేశారు. ఆ విధంగా ఓయూలో అంకురించిన 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ నేడు జాతీయస్థాయి ప్రింటింగ్ కేంద్రం స్థాపనకు దోహదపడిందని అధికారులు చెప్పారు. -
ఈ ట్రాక్ వేసుకుని యాప్ ఆన్ చేస్తే ... గుట్టంతా విప్పేస్తుంది!
సాక్షి,ముంబై: ట్రాక్ సూట్‌లా బాడీ స్కానర్గురించి విన్నారా. కొత్త తరహా ట్రాక్‌సూట్ నిజానికి ట్రాక్‌సూట్ కాదు, బాడీ స్కానర్! అమెరికన్ కంపెనీ ‘జోజోఫిట్’ ఇటీవల తేలికగా ట్రాక్సూట్లా తొడుక్కోవడానికి అనువైన ఈ త్రీడీ బాడీ స్కానర్‌ను రూపొందించింది. ఇది యాప్ సాయంతో పనిచేస్తుంది. దీనిని తొడుక్కుని, యాప్‌ను ఆన్ చేసుకున్నట్లయితే, క్షణాల్లోని శరీరంలోని పది కీలక భాగాలకు చెందిన కొలతలను అత్యంత కచ్చితంగా తెలియ జేస్తుంది. (రోబోటిక్ వీడియో కెమెరా: ధర తెలిస్తే షాకవుతారు) అంతేకాదు, శరీరంలోని ఏయే భాగాల్లో ఏ మేరకు కొవ్వు పేరుకుపోయి ఉందో కూడా ఇట్టే చెప్పేస్తుంది. ఎత్తు, బరువు వివరాలతో పాటు శరీరం కొలతలతో పోలిస్తే కొవ్వు నిష్పత్తి ఎంత ఉందో ఏమాత్రం తేడా లేకుండా చెప్పేస్తుంది. ప్రొఫెషనల్ క్రీడాకారులతో పాటు ఔత్సాహికులకు కూడా పనికొచ్చేలా దీన్ని తీర్చిదిద్దినట్లు ‘జోజోఫిట్’ సంస్థ చెబుతోంది. ఈ త్రీడీ బాడీ స్కానర్ ట్రాక్‌సూట్ విక్రయాల కోసం ‘జోజోఫిట్’ త్వరలోనే టెక్సాస్‌లోని ఆస్టిన్ నగరంలో షోరూమ్‌ను ప్రారంభించనుంది. (Layoffs crisis ఊడిపోతున్న ఐటీ ఉద్యోగాలు: ఇలా చేస్తే...!) -
పోతపోసిన పోస్టాఫీస్...!
బెంగళూరు: 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో పోతపోసిన తపాలా కార్యాలయం దేశంలో తొలిసారిగా బెంగళూరులో కొలువు తీరనుంది. దీన్ని ఎల్ అండ్ టీ సంస్థ 45 రోజుల్లో 1,000 చదరపు అడుగుల్లో నిర్మించనుంది. పూర్తిగా ఆటో మేటిక్‌గా పనిచేసే రోబోటిక్ ప్రింటర్ దీన్ని తయారు చేస్తుంది. కాంక్రీట్‌ను పొరలు పొరలుగా 3డీ మోడల్‌కు తగ్గట్లు పోస్తుంది. ఎక్కడా కాంక్రీట్ పడే వేగం తగ్గకుండా చూస్తూ వెనువెంటనే గట్టిపడేలా చేస్తుంది. పొరల మధ్య బలమైన బంధం ఉండేలా ‘గ్రీన్ కాంక్రీట్’ను నింపుతుంది. ‘‘జీ+3 నిర్మాణాలు, విల్లాలు, సైనిక బ్యారక్‌లు, ఒకే అంతస్తుండే పాఠశాలలు, పోస్టాఫీసులు, ఫ్యాక్టరీల నిర్మాణంపై దృష్టిపెట్టాం’’ అని సంస్థ పూర్తికాల డైరెక్టర్, ఎల్ అండ్ టీ కన్స్ట్రక్షన్ (బిల్డింగ్స్) సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎంవీ సతీశ్ ఈ సందర్భంగా మీడియాకు చెప్పారు. -
‘స్పేస్’లో ఇళ్లకు రిహార్సల్‌గా భూమిపై త్రీడీ ప్రింటింగ్ హోటల్
ఇల్లు కట్టాలంటే.. ఇటుకలు, సిమెంటు, ఇసుక ఇలా ఎన్నోకావాలి. మరి భవిష్యత్తులో చందమామపైకో, అంగారకుడిపైకో వెళ్లినప్పుడు అక్కడ ఇళ్లు కట్టుకోవాలంటే ఎలా? దీనికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చెప్తున్న సమాధానం.. ‘త్రీడీ ప్రింటింగ్’ ఇళ్లు. కేవలం చెప్పడమే కాదు! చంద్రుడు, అంగారకుడిపై ఇళ్లు కట్టేందుకు ఓ ప్రైవేటు కంపెనీతో భాగస్వామ్య ఒప్పందమూ కుదుర్చుకుంది. ఆ కంపెనీ ఇందుకు రిహార్సల్‌గా.. భూమ్మీదే త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో విశాలమైన హోటల్‌ను కట్టేందుకు రెడీ అయింది. ఈ వివరాలేమిటో తెలుసుకుందామా? భవిష్యత్తుకు బాటలు వేసేలా.. మున్ముందు చంద్రుడిపైకి, అంగారకుడిపైకి మనుషులను పంపేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో మనుషులు అక్కడ జీవించేందుకు వీలుగా.. అక్కడి మట్టితోనే ఇళ్లు కట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం త్రీడీ ప్రింటింగ్‌లో పేరెన్నికగన్న కంపెనీ ‘ఐకాన్’తో భాగస్వామ్య ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ క్రమంలో ఐకాన్ సంస్థ తొలుత ప్రయోగాత్మకంగా భూమ్మీదే త్రీడీ ప్రింటింగ్‌తో ఇళ్లను నిర్మించి పరిశీలించాలని నిర్ణయించింది. అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని ఎడారిలో ఉన్న మర్ఫా పట్టణ శివార్లలో 60 ఎకరాల్లో త్రీడీ ప్రింటింగ్ భవనాలు, గదులు, ఇతర నిర్మాణాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసింది. ఏమిటీ హోటల్ ప్రత్యేకతలు? ► ఈ హోటల్లో త్రీడీ విధానంలో ప్రింట్ చేసే కొన్ని భవనాలు, దూరం దూరంగా కొన్ని ఇళ్లు, ఒక స్విమ్మింగ్ పూల్, స్పా, ఆరుబయట సేద తీరేందుకు పలు ఏర్పాట్లు ఉంటాయి. ► దూరం దూరంగా నిర్మించే ఇళ్లకు ‘సండే హోమ్స్’గా పేరుపెట్టారు. రెండు నుంచి నాలుగు బెడ్రూమ్లు, బాత్రూమ్లతో ఆ ఇళ్లు ఉంటాయి. ► గుండ్రటి నిర్మాణాలు, డోమ్‌లు, ఆర్చీల డిజైన్లతో ఇళ్లు, భవనాలు ఉంటాయి. గదుల్లో బెడ్లు, టేబుల్స్ వంటి కొంత ఫర్నిచర్‌ను కూడా త్రీడీ విధానంలోనే ప్రింట్ చేయనున్నారు. ► చుట్టూ ఉన్న ఎడారి వాతావరణంలో కలిసిపోయేలా ఈ నిర్మాణాలకు రంగులను నిర్దేశించారు. ► ఎడారిలో క్యాంపింగ్ సైట్‌గా ఉన్న ప్రాంతంలో ప్రింట్ చేస్తున్న ఈ హోటల్‌కు ‘ఎల్ కాస్మికో’గా పేరు పెట్టారు. ఇలాంటి త్రీడీ ప్రింటెడ్ హోటల్ ప్రపంచంలో ఇదే మొదటిది కానుందని చెప్తున్నారు. ► ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ కంపెనీ ‘బిగ్ (బ్జర్కే ఇంగెల్స్ గ్రూప్)’ దీనికి డిజైన్లు రూపొందించగా.. ఐకాన్ సంస్థ త్రీడీ ప్రింటింగ్‌తో నిర్మాణాలు చేపట్టనుంది. ఇక్కడ చేసి.. చూపించి.. ‘‘చంద్రుడు, మార్స్‌పై మొట్టమొదటి నివాసాలు కట్టేందుకు మా సంస్థ నాసాతో కలసి పనిచేస్తోంది. వాటికి రిహార్సల్‌గా అక్కడి ప్రాంతాలను పోలినట్టుగా భూమ్మీద ఉన్న ఎడారిలో త్రీడీ ప్రింటింగ్‌తో ఇళ్లను నిర్మించబోతున్నాం. కేవలం మట్టిని వాడి ఇళ్లను నిర్మించిన పురాతన మూలసూత్రాలను, ప్రస్తుత అత్యాధునిక త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని వినియోగించి.. అద్భుతమైన నిర్మాణాలను రూపొందించనున్నాం..’’ – ‘ఐకాన్’ సహ వ్యవస్థాపకుడు జేసన్ బల్లార్డ్, హోటల్ యజమాని లిజ్ లాంబర్ట్ –సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఐదు రోజుల్లో ఇల్లు రెడీ.. 5.50 లక్షల ఖర్చు.. 60 ఏళ్లకు పైగా మన్నిక!
ఇటుక ఇటుక పేర్చి ఇల్లు కట్టే స్థాయిని దాటేసి.. నచ్చిన మోడల్లో ఇంటిని ప్రింటింగ్ చేసుకునే స్థితికి వచ్చేశాడు మనిషి. నెలలు, సంవత్సరాల తరబడి కట్టే ఇళ్లను సైతం త్రీడీ ప్రింటింగ్ హౌసింగ్ టెక్నాలజీ సాయంతో గంటలు.. రోజుల్లోనే చకచకా నిర్మించేస్తున్నాడు. ఎలానో ఒకసారి తెలుసుకుందాం.. సాక్షి, అమరావతి: భారత నిర్మాణ రంగంలో కొత్త టెక్నాలజీ చేరింది. శ్రమ లేకుండా ఆధునిక సాంకేతిక పద్ధతిని వినియోగించడం ద్వారా ఇళ్లను సిద్ధం చేయడంపై మద్రాస్ ఐఐటీ పూర్వ విద్యార్థులు చేసిన ప్రయోగాలు ఫలించాయి. సంప్రదాయ నిర్మాణాలకు భిన్నంగా 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ ఇళ్లను అందుబాటులోకి తెచ్చారు. ఇందుకోసం ‘త్వస్త మాన్యుఫాక్చరింగ్ సొల్యూషన్స్’ పేరుతో స్టార్టప్ సంస్థను స్థాపించి 3డీ ప్రింటర్‌ను అభివృద్ధి చేశారు. ప్రయోగాత్మకంగా ఐఐటీ ప్రాంగణంలోనే కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఓ ఇంటిని నిర్మించారు. ఒకే అంతస్తులో 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో కేవలం రూ.5.50 లక్షల ఖర్చుతో.. ఆధునిక హంగులతో 5 రోజుల్లోనే ఇల్లు పూర్తయిపోయింది. సామగ్రి కొనుగోలు, రవాణా, లేబర్ ఖర్చులు వంటివేమీ లేకుండా నిర్మించిన ఈ ఇళ్లు 50 నుంచి 60 ఏళ్లపాటు నాణ్యతతో మన్నుతాయని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ‘త్వస్త’తో జత కట్టిన ఎల్ అండ్ టీ త్వస్త స్టార్టప్ అందుబాటులోకి తెచ్చిన ఈ 3డీ ఇల్లు దేశాన్ని ఆకర్షిస్తోంది. తక్కువ ఖర్చుతోనే ఆధునిక హంగులతో డబుల్ బెడ్రూమ్ ఇంటిని పూర్తిచేయగలగడంతో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ త్వస్త మాన్యుఫాక్చరింగ్ సొల్యూషన్స్‌తో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే బెంగళూరులో 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడంతస్తుల 3డీ ప్రింటెడ్ భవన నిర్మాణం పూర్తి చేసింది. భారత తపాలా శాఖకు చెందిన ఈ భవన నిర్మాణానికి కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి సైతం మంజూరు చేయడం గమనార్హం. కొత్తగా వచ్చిన 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాలను ప్రభావితం చేసిందని.. ఈ టెక్నాలజీలో పెద్దఎత్తున ఇళ్ల నిర్మాణం చేపడితే తక్కువ సమయంలోనే లక్షలాది మందికి సొంతింటి కలను నిజం చేయవచ్చని ఇంజనీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. ప్లాన్.. కాంక్రీట్.. ప్రింటింగ్ సాధారణ ఇంటి నిర్మాణం మాదిరిగానే 3డీ ప్రింటింగ్ నిర్మాణం కూడా సాగుతుంది. అయితే, ఇందులో కార్మికులకు బదులుగా యంత్రం నిర్మాణ పని చేస్తుంది. ఇంటిని ఎక్కడ కట్టాలో నిర్ణయించాక, అవసరమైన ప్లాన్ (బ్లూప్రింట్) రూపొందిస్తారు. గోడలు, గదులు ఎలా ఉండాలో ప్లాన్ చేసి ఇంటి బ్లూప్రింట్ మోడలింగ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ద్వారా సిద్ధం చేస్తారు. అనంతరం ప్లాన్‌ను కంప్యూటర్ సాయంతో భారీస్థాయిలో ఉండే 3డీ ప్రింటర్‌కు పంపిస్తారు. ఇంటి ప్రింటింగ్ ప్రారంభించే ముందు.. పేస్ట్ లాంటి బిల్డ్ మిశ్రమాన్ని (కాంక్రీట్) వేసేందుకు అనువుగా నిర్మాణ ప్రాంతం చుట్టూ యంత్రం రోబోటిక్ హ్యాండ్ కదిలేందుకు వీలుగా బిల్డింగ్ సైట్ చుట్టూ పట్టాలు అమరుస్తారు. అన్నీ సరిచూసుకున్నాక యంత్రానికున్న ‘ప్రింట్’ బటన్ ఆన్ చేయగానే ప్రింటర్ దానికదే ప్లాన్ ప్రకారం నిర్మాణాలన్నీ ప్రారంభించి గోడలు, కిటికీలు, వెంటిలేటర్లు వంటివి పూర్తిచేస్తుంది. ఇందులో ప్రింటర్‌లోని నాజిల్ ద్వారా కాంక్రీట్ మెటీరియల్ బయటకు వస్తే.. దాన్ని మరో కాంక్రీట్ డ్రయర్ నిర్మాణ సామగ్రిని త్వరగా పటిష్టం చేస్తుంది. ఆ వెంటనే దానిపై మరో పొర కాంక్రీట్ వేస్తుంది. ఇలా పొరలు పొరలుగా ప్లాన్‌లో ఉన్నట్టుగా నిర్మాణం పూర్తవుతుంది. ఆపై కిటికీలు, తలుపులు, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ వంటి పనులను కార్మికులతో పూర్తిచేస్తారు. Been following developments in 3D printed homes overseas. Critical for India so delighted to see home-grown tech from IIT Madras (now one of the world’s leading Tech-Incubators) I know you guys raised some seed funding, but any room for me to join in? pic.twitter.com/LXoZCMAwM8 — anand mahindra (@anandmahindra) January 31, 2022 -
ప్రేమికుల దినోత్సవానికి టైటానిక్
సినిమా లవర్స్‌కి.. అందులోనూ ప్రేమకథా చిత్రాల ప్రేమికులకు ఈ ప్రేమికుల దినోత్సవానికి సిల్కర్ స్క్రీన్ పై ‘టైటానిక్’ ప్రత్యక్షం కానుంది. టైటానిక్ ఓడలో పరిచయం అయి, ప్రేమికులుగా దగ్గరయ్యే జాక్, రోజ్లు చివరికి ఓడ ప్రమాదంలో దూరమయ్యే ఈ విషాదభరిత ప్రేమకథ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించింది. ప్రేమికులుగా లియో నార్డో డికాప్రియో, కేట్ విన్ ్సలెట్ల కెమిస్ట్రీని అంత సులువుగా ఎవరూ మరచిపోలేరు. జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ ఎవర్గ్రీన్ లవ్‌స్టోరీ విడుదలై 25 ఏళ్లయింది. ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈ చిత్రాన్ని హై క్వాలిటీతో మళ్లీ సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకు రావాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించి పోస్టర్ని, ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన ట్వంటీయత్ సెంచురీ ఫాక్స్. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వచ్చే నెల 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 4కే ప్రింట్‌తో త్రీడీ వెర్షన్ లో ఈ లవ్‌స్టోరీ కొత్త హంగులతో రావడానికి సిద్ధమవుతోంది. ఇక 1997 నవంబర్‌లో విడుదలైన ‘టైటానిక్’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రూ. 13 వేల కోట్లకు పైగా కలెక్ట్ చేసి, రికార్డు సృష్టించింది. 2010లో జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి ‘అవతార్’ విడుదలయ్యే వరకూ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం రికార్డ్ ‘టైటానిక్’దే. కామెరూన్ తన సినిమా రికార్డ్‌ని తానే బద్దలు కొట్టడం విశేషం. ఇక ఆస్కార్ అవార్డ్స్‌లో 14 నామినేషన్లు దక్కించుకుని, 11 అవార్డులను సొంతం చేసుకున్న ఘనత కూడా ‘టైటానిక్’కి ఉంది. ప్రేక్షకుల ఆదరణతో పాటు ఇలా పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ చిత్రం త్రీడీ వెర్షన్‌ని 2012లో విడుదల చేశారు. ఇప్పుడు మరింత క్వాలిటీతో ‘టైటానిక్’ రానుంది. -
స్వీట్ ఎక్స్పెరిమెంట్: పరిశోధనత్రయం
3డీ బయో ప్రింటెడ్ హ్యూమన్ మోడల్స్ రూపకల్పనకు గాను ఈ ముగ్గురు యువ శాస్త్రవేత్తలకు ‘బెస్ట్ రీసెర్చ్’ అవార్డు వచ్చింది. సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఉదయ్ సక్సేనా, డాక్టర్ సుబ్రహ్మణ్యం వంగల పర్యవేక్షణలో యువ శాస్త్రవేత్తలు శరణ్య, అర్పిత రెడ్డి, ఆర్. ఎన్, సంజన బత్తుల సంయుక్తంగా నిర్వహించిన పరిశోధన ఇది. వీళ్లు టైప్ 2 డయాబెటిస్ డ్రగ్‌ను టెస్ట్ చేసే త్రీడీ బయో ప్రింటెడ్ హ్యూమన్ లైక్ టైప్ 2 డయాబెటిస్ మోడల్ని డెవలప్ చేశారు. అలానే టైప్ 2 డయాబెటిస్ నివారణకు అవసరమైన సప్లిమెంట్‌ను కూడా రూపొందించారు. ఈ సందర్భంగా ఈ ముగ్గురు యువ శాస్త్రవేత్తలు సాక్షితో పంచుకున్న వివరాలివి. దాదాపుగా ప్రతి సృష్టి మానవ దేహభాగాలను పోలిన మోడల్స్‌ను సృష్టించి వాటి మీద ఔషధాల పని తీరును పరిశీలించడం ద్వారా సత్వర ఫలితాలను సాధించవచ్చని నిరూపించారు ఈ యంగ్ సైంటిస్ట్‌లు. కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడింది. కోవిడ్‌ను నియంత్రించడానికి తయారు చేసిన మందులు ఎలా పని చేస్తున్నాయోనని నిర్ధారణ చేసుకోవడానికి జంతువుల మీద ప్రయోగించి తెలుసుకునే సమయం లేకపోయింది. ఒక ఔషధం ప్రయోగ దశలన్నీ పూర్తి చేసుకుని మార్కెట్లోకి రావడానికి సంవత్సరాలు పడుతుంది. కోవిడ్ సమయంలో అంత సమయం లేదు. అప్పుడు ఈ త్రీడీ బయోప్రింటెడ్ హ్యూమన్ లైక్ మోడల్ బాగా ఉపయోగపడింది. అలాగే ఇదే టెక్నాలజీ ఆధారంగా టైప్ 2 డయాబెటిస్ డ్రగ్ చూపిస్తున్న ప్రభావాన్ని యాక్యురేట్‌గా తెలుసుకునే విధంగా హ్యూమన్‌లైక్ టైప్ 2 డయాబెటిస్ మోడల్ని డెవలప్ చేశారు. ప్రస్తుతం ఈ యంగ్ సైంటిస్ట్‌లు ముగ్గురూ రీసెర్చ్ అసోసియేట్లుగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌లో ఇన్క్యుబేషన్ సెంటర్లోని రీజెనె ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పరిశోధనలు చేస్తున్నారు. ‘‘హెల్త్ సైన్సెస్‌లో పరిశోధనల అవసరం చాలా ఉంది. కోవిడ్ పాండమిక్ సమయంలో హ్యూమన్‌లైక్ మోడల్ ఆవశ్యకత తెలిసింది. మా పరిశోధనలో త్రీడీ బయో ప్రింటెడ్ హ్యూమన్ వాస్క్యులార్ లంగ్ మోడల్ తర్వాత టైప్ టూ డయాబెటిస్ మోడల్ మీద దృష్టి పెట్టాం. దాదాపుగా ఏడాది పాటు జరిగిన ప్రయోగం ఇది. ఒక వ్యక్తి డయాబెటిక్ దశకు చేరకుండా నార్మల్ లైఫ్ లీడ్ చేయగలిగిన విధంగా ఈ న్యూట్రాస్యూటికల్ సప్లిమెంట్‌ని రూపకల్పన చేయడంలో సక్సెస్ అయ్యాం. సమాజానికి అవసరమైన పని చేశామనే సంతృప్తి కలుగుతోంది’’ అన్నారు సంజన. ఆమెరికాలో పుట్టిన తెలుగమ్మాయి సంజన. గ్రాడ్యుయేషన్ యూఎస్‌లోని యూసీ డేవిస్‌లో పూర్తి చేసి హైదరాబాద్‌లో పరిశోధనల్లో నిమగ్నమయ్యారు. సంజన బత్తుల ‘‘సాధారణంగా జంతువుల మీద ప్రయోగం చేసి ఆ తర్వాత మనుషుల మీద క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. ఒక ఔషధం ఇలా అన్ని దశలూ పూర్తి చేసుకోవడానికి దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల సమయం పడుతుంది. అంతే కాదు, కొన్ని సందర్భాల్లో జంతువుల్లో మంచి ఫలితాలనిచ్చిన డ్రగ్ మనుషులలో అంత కచ్చితంగా పని చేయకపోవచ్చు కూడా. మేము రూపొందించిన ప్రయోగంలో హ్యూమన్ లైక్ డిసీజ్ మోడల్స్‌ని డెవలప్ చేసి వాటి మీద ఔషధాన్ని ప్రయోగించాం. దాంతో రిజల్ట్ త్వరగా తెలుసుకోగలిగాం. అలాగే టైప్ టూ డయాబెటిస్ మోడల్లో వివిధ రకాల యాంటీ డయాబెటిక్ డ్రగ్స్‌తోపాటు డివిటిజ్ అనే న్యూట్రాస్యుటికల్ సప్లిమెంట్‌ని కూడా ప్రయోగించి చూశాం. ఈ న్యూట్రాస్యూటికల్ సప్లిమెంట్ కండరాల్లో గ్లూకోజ్ స్వీకరణకు పనిచేస్తుంది. క్లినికల్ ట్రయల్స్ కూడా మంచి ఫలితాలనిచ్చాయి. ఈ సప్లిమెంట్ మార్కెట్లోకి వచ్చి ఐదు నెలలైంది’’ అని చెప్పారు అర్పిత రెడ్డి. ఆమెది వ్యవసాయ కుటుంబం. కర్నాటకలోని కోలార్ జిల్లా, శ్రీనివాసపుర తాలూక, రాయల్పాడు గ్రామం. మైసూర్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ బయో కెమిస్ట్రీ, బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజ్‌లో సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ డయాగ్నస్టిక్స్‌లో పీజీ డిప్లమో చేశారు. అర్పిత రెడ్డి, ఆర్. ఎన్ టైప్ వన్ జన్యుకారణాలతో వస్తుంది. టైప్ టూ డయాబెటిస్ మన దగ్గర లైఫ్ స్టయిల్ డిసీజ్‌గా మారిపోయింది. డయాబెటిక్ కండిషన్లో రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరుగుతాయి. ఒక వ్యక్తి డయాబెటిస్ కండిషన్‌కి రావడానికి ముందు కొంతకాలం ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉంటారు. ఆ దశలో తెలుసుకోగలిగితే దేహానికి జరిగే నష్టాన్ని నివారించవచ్చు. అందుకే మేము కండరాల కణజాలం మీద పని చేసే సప్లిమెంట్ మీద దృష్టిపెట్టాం’’ అని చెప్పారు శరణ్య. ఆమెది కేరళ రాష్ట్రంలోని కన్నూరు. మంగుళూరు యూనివర్సిటీ నుంచి బయో కెమిస్ట్రీలో పీజీ, ప్రోటియోమిక్స్లో పీజీ డిప్లమో చేశారు. శరణ్య – వాకా మంజులారెడ్డి -
ఆర్ఆర్ఆర్: చివరి దశకు భూసేకరణ.. 15 రోజుల్లో త్రీడీ నోటిఫికేషన్!
గజ్వేల్: ట్రిపుల్ఆర్ భూసేకరణ చివరి దశకు చేరుకుంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ప్రజాభిప్రాయసేకరణ పూర్తి కాగా, త్వరలోనే సంగారెడ్డి జిల్లాలో అభిప్రాయ సేకరణ పూర్తి చేయడానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. గత రెండు సభల్లో బాధితుల నుంచి వ్యక్తమైన నిరసనల నేపథ్యంలో పకడ్బందీగా ప్రక్రియను పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే సర్వే నంబర్ల వారీగా త్రీడీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి, పరిహారం లెక్కలు కూడా తేల్చనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ట్రిపుల్ఆర్ 110 కిలోమీటర్ల విస్తీర్ణం ఉండనుంది. 14 మండలాల్లోని 73కిపైగా గ్రామాల్లో భూసేకరణ జరగనుంది. జగదేవ్‌పూర్ – గజ్వేల్ – తూప్రాన్ –నర్సాపూర్ –సంగారెడ్డి మీదుగా కంది వరకు ఈ రోడ్డు విస్తరించనుంది. ఈ క్రమంలోనే భూసేకరణను పూర్తి చేయడానికి అధికార యంత్రాంగం వేగంగా చర్యలు చేపడుతోంది. సిద్దిపేట జిల్లాకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ గజ్వేల్‌లోని మహతి ఆడిటోరియంలో, మెదక్ జిల్లాకు సంబంధించి నర్సాపూర్‌లో నిర్వహించిన కార్యక్రమాల్లో బాధితుల నుంచి నిరసన వ్యక్తమైంది. భూముల విలువ పెరిగిన తరుణంలో వాస్తవ విలువకు, ప్రభుత్వమిచ్చే పరిహారానికి పొంతన ఉండదని, ఈ నేపథ్యంలో భూమికి బదులు భూమి ఇవ్వాలనే డిమాండ్‌ను అధికారుల ముందుంచారు. త్వరలోనే ప్రజాభిప్రాయసేకరణ చేపట్టనున్న సంగారెడ్డి జిల్లాలో పకడ్బందీగా పూర్తి చేయడానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. 980 ఎకరాలు.. ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిన సిద్దిపేట, మెదక్ జిల్లాలో ఇక త్రీడీ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే పనిలో రెవెన్యూ యంత్రాంగ తలమునలై ఉన్నది. ఈ నోటిఫికేషన్లో సర్వే నంబర్లవారీగా రైతుల వివరాలను అధికారికంగా ప్రకటిస్తారు. జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లి, ఇటిక్యాల, అలిరాజపేట, మర్కూక్ మండలం అంగడికిష్టాపూర్, చేబర్తి, ఎర్రవల్లి, పాములపర్తి, గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్, ముట్రాజ్‌పల్లి, సంగాపూర్, మక్తమాసాన్‌పల్లి, బంగ్లావెంకటాపూర్, వర్గల్ మండలం మైలారం, జబ్బాపూర్, నెంటూర్, రాయపోల్ మండలం బేగంపేట, ఎల్కల్ గ్రామాల్లో మొత్తంగా 980 ఎకరాల భూసేకరణ జరగనుంది. ఆ గ్రామాలకు సంబంధించిన త్రీడీ గెజిట్ నోటిఫికేషన్ 15 రోజుల్లో విడుదల కానుంది. మరో రెండు నెలల్లో.. మెదక్ జిల్లాకు సంబంధించి తూప్రాన్, నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ల నోటిఫికేషన్ సైతం త్వరలో రానుంది. రైతుల నుంచి అభిప్రాయసేకరణ ఎలా ఉన్నా.. ఈ త్రీడీ నోటిఫికేషన్ తర్వాత పరిహారం లెక్కలు తేల్చి భూముల స్వాధీనానికి చర్యలు చేపట్టనున్నారు. పరిహారం పంపిణీకి గతంలో అవలంబించిన విధానాలలు అనుసరిస్తారా? మార్పులు చేస్తారా...? అనేది వేచి చూడాల్సి ఉంది. పరిహారం లెక్కలు తేలిన తర్వాత స్వచ్ఛందంగా ముందుకొచ్చే రైతులకు వెంటనే పరిహారం అందిస్తారు. ముందుకురాని రైతులకు సంబంధించిన పరిహారాన్ని కోర్టుల్లో జమచేసి పనులు ప్రారంభిస్తారని తెలుస్తోంది. మొత్తానికి ఒకటి, రెండు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే సంకల్పంతో అధికార యంత్రాంగం ముందుకుసాగుతోంది. త్వరలో గెజిట్ నోటిఫికేషన్ గజ్వేల్ డివిజన్ పరిధిలో ట్రిపుల్ఆర్ భూసేకరణ ప్రక్రియను తుది దశకు చేరుకుంది. ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిన నేపథ్యంలో త్వరలోనే సర్వే నంబర్ల వారీగా త్రీడీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నాం. దీని తర్వాత భూముల విలువ ఆధారంగా పరిహారం లెక్కలు కూడా తేలనున్నాయి. ఆ తర్వాత ప్రక్రియను రెండు నెలల్లోపు పూర్తి చేసే లక్ష్యంగా ముందుకుసాగుతున్నాం. –విజయేందర్‌రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, గజ్వేల్ -
ఆ సత్తా భారత్ సొంతం
కేవడియా(గుజరాత్): ప్రపంచ నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని భారత్ ముందుండి నడిపించగలదని, ఆ సామర్థ్యం భారత్ సొంతమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గుజరాత్‌లోని కేవడియాలో జరుగుతున్న ఇండస్ట్రీ 4.0 అనే సదస్సునుద్దేశిస్తూ ప్రధాని మోదీ వర్చువల్‌గా ఒక సందేశం పంపారు. అందులోని సారాంశం ఆయన మాటల్లోనే.. ‘ అధునాతన సాంకేతికత ఆలంబనగా నాలుగో పారిశ్రామిక విప్లవం మొదలవ్వాలి. సృజనాత్మక ఆలోచనలతోనే ఇది సాధ్యం. వేర్వేరు కారణాల వల్ల గత పారిశ్రామిక విప్లవాల్లో భారత్ భాగస్వామి కాలేకపోయింది. ఇండస్ట్రీ 4.0కు సారథ్యం వహించే సుధృఢ లక్షణాలు దేశానికి ఉన్నాయి. యువజనాభా, డిమాండ్, స్వేచ్ఛాయుత వాణిజ్యానికి బాటలుపరిచే కేంద్ర ప్రభుత్వం సమష్టిగా దీన్ని సుసాధ్యంచేయగలవు. ప్రపంచ వస్తు గొలుసు వ్యవస్థలో భారత్ కీలక భూమిక పోషించేలా చేయగల సమర్థత దేశీయ పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలకు ఉంది. ఇందుకోసం సంస్కరణలు తెస్తూ, రాయితీల తోడ్పాటు అందిస్తూ అధునాతన సాంకేతికతను సంతరించుకున్న ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషిచేస్తున్నాం’ అని ప్రధాని మోదీ అన్నారు. ‘3డీ ప్రింటింగ్, మెషీన్ లెర్నింగ్, డేటా అనలైటిక్స్, ఎల్ఓటీ వంటి రంగాల్లో పారిశ్రామికాభివృద్ధితో ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ వృద్ధిచెందుతోంది’ అని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే కార్యక్రమంలో అన్నారు. ఈ సందర్భంగా మంత్రి గుజరాత్ కోసం 75 , కర్ణాటక కోసం 100 ఈవీ బస్సులను ప్రారంభించారు. పుణెలోని ఇండస్ట్రీ 4.0(సీ4ఐ4) ల్యాబ్‌నూ మొదలుపెట్టారు. స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్‌పై భారీ పరిశ్రమల శాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. పర్యావరణహిత అభివృద్ధిని భారత్ చాటిచెప్పింది పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే ఆర్థికాభివృద్ధిని భారత్ సాధిస్తోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అక్టోబర్ రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు భారత్ ‘వైల్డ్‌లైఫ్ వీక్’ను పాటిస్తోంది. ఈ మేరకు దేశ ప్రజలకు మోదీ హిందీలో గురువారం ఇచ్చిన సందేశాన్ని కేంద్ర పర్యావరణశాఖ శుక్రవారం ట్వీట్ చేసింది. ఆ సందేశంలో మోదీ ఏం చెప్పారంటే.. ‘పరిశ్రమలతోనే ఆర్థికాభివృద్ధి సాధ్యం. అయితే, పరిశ్రమలతో పర్యావరణానికి ముప్పు పొంచి ఉంటుంది. కానీ, పర్యావరణానికి ప్రమాదం వాటిల్లకుండానే ఆర్థికాభివృద్ధి దిశగా పయనించడమెలాగో ప్రపంచానికి భారత్ సాధించి చూపింది. సరైన విధానపర నిర్ణయాలు, అమలుతోనే ఇది సాకారమైంది. తోటి జీవాల పట్ల, జీవావరణం, జీవ వైవిధ్యం మీద మనిషి మరింత దృష్టిసారించాలి. భారత్ గడిచిన ఎనిమిదేళ్లలో కొత్తగా 259 స్థలాలను అభయారణ్యాలుగా గుర్తించి సంరక్షణ బాధ్యతలు తీసుకుంది. పులుల సంఖ్యను రెట్టింపు చేసుకుంటూ లక్ష్యాన్ని నిర్దేశిత సమయంకంటే ముందే చేరుకున్నాం. ఆసియా సింహాలు, గజరాజుల సంఖ్యా పెరుగుతోంది’ అని అన్నారు. -
ఆదిపురుష్: 3డీలో టీజర్ చూసి థ్రిల్ అయ్యాను : ప్రభాస్
‘‘ఫస్ట్ టైమ్ ‘ఆదిపురుష్’ టీజర్‌ను 3డీలో చూసినప్పుడు నేను చిన్నపిల్లాడిని అయిపోయాను. 3డీ ఫార్మాట్లో నేను కనిపించడం నాకు గొప్ప అనుభూతినిచ్చింది.. థ్రిల్ అయ్యాను’’ అని హీరో ప్రభాస్ అన్నారు. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణ ఇతిహాసం ఇతివృత్తం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్, సీతగా కృతీ సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. భషణ్ కువర్, క్రిషణ్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్, వంశీ, ప్రమోద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ‘ఆదిపురుష్’ 3డీ టీజర్‌ను ప్రదర్శించారు. ప్రభాస్ మాట్లాడుతూ – ‘‘ఇండియాలో ఇప్పటివరకు వాడని టెక్నాలజీతో ‘ఆదిపురుష్’ తీశాం. బిగ్ స్క్రీన్ కోసం తీశాం’’ అని అన్నారు. అతిథిగా పాల్గొన్న నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘ఆది పురుష్’ టీజర్ ఎలా ఉందని నన్ను కొంతమంది అడిగారు. బాగుందని చెప్పాను. కానీ నా సిబ్బందిలో కొందరు ‘ఆదిపురుష్’ టీజర్ అలా ఇలా అని అనుకుంటున్నారని చెప్పారు. నేను ఒకటే చెబుతాను.. ‘బాహుబలి పార్ట్ 1’ అప్పుడు ఆ సినిమాను ట్రోల్ చేశారు. కానీ అదే రోజు నేను ప్రభాస్‌కు ఫోన్‌చేసి ‘సూపర్ హిట్’ అన్నాను. ‘లేదు.. భయ్యా..’ అంటూ ఏదో మాట్లాడబోయాడు ప్రభాస్. లేదు.. సపర్‌హిట్ నువ్వు హ్యాపీగా ఉండు అన్నాను. బిగ్ స్క్రీన్ ఫిలింస్ టీజర్లను సెల్‌ఫోన్స్‌లో అంచనా వేయలేం. వీఎఫ్క్స్ సినిమాలను థియేటర్స్‌లోనే చూడాలి. అప్పుుడే ఆ సినిమా ఏంటో అర్థం అవుతుంది. ‘ఆదిపురుష్’ కూడా అలాంటి సినిమాయే. టీజర్‌ని నేను ఫోన్లో చూసిన తర్వాత మళ్లీ పెద్ద స్క్రీన్ పై చూశాను. ఇప్పుడు 3డీలో చూశాను. టీజర్ చూసి విజిల్స్ వేశాను. అలాగే రావణ పాత్రధారి పక్షి మీద ఎందుకు వస్తాడు? రాముడు ఇలా ఉంటాడా? అని చర్చలు జరుగుతున్నాయి. రామాయణం ఇతివృత్తాన్ని ఈ తరం ఆడియన్స్‌కు చెప్పేలా చేశారు. ‘ఆది పురుష్’ మ్యాజికల్ ఫిల్మ్ అవుతుంది’’ అన్నారు. ‘‘ఆదిపురుష్’ను ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు ఓం రౌత్ -
మానవ మస్తిష్కాన్ని కంప్యూటర్లోకి కాపీ చేయొచ్చా?
మరణించాక ఏమవుతుంది? మనిషి మస్తిష్కంలోని సమాచారమంతా మృతదేహంతోపాటే సమాధవుతుంది. లేదా కాలి బూడిదైపోతుంది. అలాగాక మెదడులోని జ్ఞాపకాలనూ సమాచారాన్నీ కంప్యూటర్లోకి లోడ్ చేసుకోగలిగితే? భలే ఉంటుంది కదూ! మృతుని జ్ఞాపకాలనూ, జీవితాంతం అతను నిల్వ చేసుకున్న సమాచారాన్నీ అతడి వారసులు ఎంచక్కా తెలుసుకోవచ్చు. ఈ దిశగా కొన్నేళ్లుగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రక్రియ ఇప్పటికిప్పుడు కాకపోయినా మున్ముందు సాధ్యపడే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అంటున్నారు. వేల కోట్ల గిగాబైట్ల సమాచారం మెదడును కంప్యూటర్‌తో పోల్చడం పరిపాటి. కంప్యూటర్ ప్రాసిసెంట్ యూనిట్లలోని ఇన్పుట్, ఔట్పుట్ ఎలక్ట్రానిక్ సిగ్నళ్ల తరహాలోనే మానవ మస్తిష్కం కూడా పని చేస్తుందని చెబుతుంటారు. కానీ వాస్తవానికి కంప్యూటర్ కంటే మెదడు అత్యంత సంక్లిష్టమైనది. అసలు మెదడు ఎంత సమాచారాన్ని నిక్షిప్తం చేసుకుంటుందనే విషయాన్ని ఇప్పటిదాకా ఎవరూ కచ్చితంగా నిర్ధారించలేకపోయారు. అమెరికాలో సియాటెల్‌లోని అలెన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్రెయిన్ సైన్స్ పరిశోధకుల బృందం రెండేళ్ల క్రితం ఎలుక మెదడులో ఒక క్యూబిక్ మిల్లీమీటర్ పరిధిలోని కణాల(న్యూరాన్లు) 3డీ నిర్మాణాన్ని మ్యాపింగ్ చేసింది. ఇసుక రేణువు కంటే తక్కువ పరిమాణంలో ఉన్న ఎలుక మెదడు భాగంలో ఏకంగా లక్షకు పైగా న్యూరాన్లున్నట్టు తేలింది. పైగా వాటి మధ్య 100 కోట్లకుపైగా కనెక్షన్లు కూడా ఉన్నట్టు గుర్తించారు. కేవలం రెండు న్యూరాన్ల మధ్య ఉన్న కనెక్షన్లో పట్టే సమాచారాన్ని కంప్యూటర్లో స్టోర్ చేసేందుకు ఏకంగా 2 పెటాబైట్లు, అంటే 2 మిలియన్ గిగాబైట్ల స్టోరేజీ అవసరమైంది. ఎలుక మెదడులో ఒక క్యూబిక్ మిల్లీమీటర్ పరిధిలోని మొత్తం న్యూరాన్లలో ఉన్న సమాచారాన్ని కంప్యూటర్లోకి ఎక్కించాలంటే కోట్ల కొద్ది గిగాబైట్ల స్టోరేజీ కావాల్సిందే. ఆ లెక్కన అత్యంత సంక్లిష్టమైన మనిషి మస్తిష్కాన్ని మ్యాపింగ్ తదితరాలన్నీ చేయడానికి, అందులో దాగుండే అపారమైన సమాచారాన్ని కంప్యూటర్లో భద్రపరచడానికి కోటాను కోట్ల గిగాబైట్ల స్టోరేజీ కావాల్సి ఉంటుంది. మనిషి మెదడులో నిక్షిప్తమై ఉన్న సమాచారాన్ని సేకరించి, కంప్యూటర్ స్టోర్ చేయడం అతిపెద్ద సవాలు అని పరిశోధకులు చెబుతున్నారు. ఇందుకోసం అత్యధిక ర్యాండమ్ యాక్సెస్ మెమరీ (ర్యామ్) ఉన్న కంప్యూటర్లు అవసరమని అన్నారు. సూక్ష్మమైన పొరలుగా.. ఎంత సమాచారాన్ని మనిషి మస్తిష్కంలో భద్రపర్చవచ్చనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇప్పటికైతే లేదు. ఆ పని చేయాలంటే మొదట మెదడులోని సమాచారాన్ని కోడ్‌లోకి మార్చాలి. అప్పుడే కంప్యూటర్ దాన్ని చదివి, స్టోర్ చేసుకుంటుంది. మెదడులో దాగున్న మొత్తం సమాచారాన్ని స్కాన్ చేసి రాబట్టలేం. మెదడు కణాల మధ్య ఉన్న కనెక్షన్లలో సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. మొత్తం సమాచారం రాబట్టాలంటే మెదడును వందల కోట్ల సంఖ్యలో సూక్ష్మమైన క్యూబ్‌లు, పొరలుగా కోయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 3డీ మ్యాపింగ్ చేయాలి. అనంతరం ఆ క్యూబ్‌లు, పొరలను తిరిగి యథాతథంగా తలలో అమర్చాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మధుమేహ బాధితులకు 3డీ ప్రింటెడ్ చెప్పులు
బెంగళూరు: మధుమేహ(డయాబెటిస్) బాధితుల కోసం బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) డిపార్టుమెంట్ ఆఫ్‌మెకానికల్ ఇంజనీరింగ్ పరిశోధకులు వినూత్నమైన పాదరక్షలు తయారు చేశారు. ఇందుకు కర్ణాటక ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అండ్ రిసెర్చ్(కేఐఈఆర్) తగిన సహకారం అందించింది. డయాబెటిస్ బాధితుల్లో కాళ్లకు పుండ్లు పడితే త్వరగా మానవు. దాంతో ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. ఒక్కోసారి కాలు తొలగించే పరిస్థితి కూడా రావొచ్చు. ఇలాంటి వారి కోసం ఐఐఎస్సీ పరిశోధకులు రూపొందించిన 3డీ ప్రింటెడ్ చెప్పులు చక్కగా పనిచేస్తాయి. కాలు ఎలాంటి ఆకృతిలో ఉన్న దానికి అనుగుణంగా మారిపోవడం వీటి ప్రత్యేకత. నడకను బట్టి చెప్పులు వాటంతట అవే సరిచేసుకుంటాయని పరిశోధకులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ చెప్పులు ధరిస్తే కాళ్లకు గాయాలయ్యే అవకాశాలు చాలా స్వల్పమేనని అన్నారు. ఒకవేళ అప్పటికే గాయాలైనా అవి త్వరగా మానిపోవడానికి ఈ చెప్పులు ఉపయోగపడతాయని వివరించారు. -
20 ఏళ్ల యువతికి 3డీ ప్రింటెడ్ చెవి
టెక్సాస్: అమెరికా వైద్యులు మొట్టమొదటిసారిగా 3డీ ప్రింటెడ్ సాంకేతికతతో రూపొందించిన చెవిని 20 ఏళ్ల యువతికి విజయవంతంగా అతికించారు. టెక్సాస్‌కు చెందిన 3డీ బయో థెరప్యూటిక్స్ అనే సంస్థ దీనిని రూపొందించింది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. మెక్సికోకు చెందిన అలెక్సా(20)కు కుడి వైపు వెలుపలి చెవి చిన్నదిగా, అక్రమాకారంలో ఉంది. పరిశీలించిన 3డీ బయో థెరప్యూటిక్స్ నిపుణులు ఆమె మరో చెవి నుంచి కణజాలాన్ని సేకరించారు. అచ్చు కుడివైపు చెవిమాదిరిగానే సహజమైందిగా అనిపించేలా ‘ఆరినోవో’అనే 3డీ టెక్నాలజీని వాడి మరో చెవికి రూపం కల్పించారు. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోకు చెందిన మైక్రోషియా–కాంజెనిటల్ ఇయర్ డిఫార్మిటీ ఇన్స్టిట్యూట్కు చెందిన సర్జన్ డాక్టర్ అర్డురో బొనిల్లా ఈ ప్రక్రియకు నేతృత్వం వహించారు. ఈ చెవిని సర్జరీ ద్వారా ఆమెకు అతికించారు. నెల రోజుల విశ్రాంతి అనంతరం గురువారం అలెక్సా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యిందన్నారు. రోగుల కార్టిలేజ్ కణాలను ఉపయోగించుకుని చెవిని పునర్నిర్మించేందుకు ఈ నూతన టెక్నాలజీని వినియోగించినట్లు డాక్టర్ అర్టురో చెప్పారు. దీని వల్ల కొత్త చెవిని శరీరం తిరస్కరించేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. ఒకటి లేదా రెండు చెవులు అసంపూర్ణంగా, వెలుపలి భాగాలు లేని మైక్రోషియా అనే లోపంతో ఉన్నవారికి ఈ ఆధునాతన చికిత్స ఎంతో ఉపకారి కాగలదని భావిస్తున్నామని ఆయన అన్నారు. ఇప్పటి వరకు పేషెంట్ పక్కటెముకల నుంచి సేకరించి కణాలను చెవి పునర్నిర్మాణానికి ఉపయోగిస్తున్నారని అన్నారు.