నాటి పురాతన కట్టడాలకు వర్చువల్‌ త్రీడీ టెక్నాలజీతో ప్రాణం పోస్తే... | 20 Ancient Sites And Wonders Brought To Life By Vrtual Reconstructions | Sakshi
Sakshi News home page

క్రీస్తూ పూర్వం నాటి పురాతన కట్టడాలకు వర్చువల్‌ త్రీడీ టెక్నాలజీతో ప్రాణం పోస్తే...

Published Sat, Oct 21 2023 12:22 PM | Last Updated on Sat, Oct 21 2023 12:54 PM

20 Ancient Sites And Wonders Brought To Life By Vrtual Reconstructions - Sakshi

కీస్తూ పూర్వం లేదా క్రీస్తు శకం నాటి పురాతన కట్టడాలు, ప్రపంచపు వింతలు చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. అయినా వాటి నిర్మాణ శైలి, దాగున్న అద్భుత ఆవిష్కరణలు అందర్నీ మంత్ర ముగ్దుల్ని చేస్తూనే ఉన్నాయి. అలాంటి వాటికి ప్రాణం పోసి తిరిగి పునర్నిర్మిస్తే ఎలా ఉంటుదన్న ఆలోచనే భలే ఉంటుంది కదూ. ఆ ఊహకు వర్చువల్‌ త్రీడీ టెక్నాలజీని జోడించి మరీ అలనాటి వైభవం మన కళ్ల ముందు ప్రత్యక్షమయ్యేలా నాటి కట్టడాలకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. ఆహా! టైం మిషన్‌ వెనక్కి వెళ్లిందా.. అన్నంత అద్భుతంగా ఉన్నాయి ఆ పురాతన నిర్మాణాలు, ప్రదేశాలు. 

1.ప్రపంచంలోని ఏడు వింతల్లో ది కోలోసస్‌ ఆఫ్‌ రోడ్స్‌ విగ్రహం ఒకటి. ఇది గ్రీకుల దేవుడైన సన్‌ హీలియోస్‌ విగ్రహం 
 

2. గ్రీకు పాశ్చాత్య నాగరికతను, వారి సంప్రదాయ కళకు నిలువెత్తు నిదర్శనం ఏథెన్స్‌ దేవతకు చెందిన పార్థినాన్‌ దేవాలయం.

3.ఈజిప్షియన్ల పురాతన దేవాలయం లక్సోర్‌ టెంపుల్‌.

4. ఇటలీలో రోమన్‌ పాంపీలో ఉన్న బృహస్పతి ఆలయం

5. సిరియాలో పామిరాలో ఉన్న బెల్‌ టెంపుల్‌. 

6. మెక్సికోలో కోబాలో ఉన్న అత్యంత ఎత్తైన నోహుచ్‌ మ్యూల్‌ పిరమిడ్‌(మట్టి దిబ్బ). 

7. ఇజ్రాయెల్‌లోని జెరూసలేం ఓల్డ్‌ సిటీ

8. లిబియాలో లెప్టిస్‌ మాగ్నా నగరంలో ఉన్న రోమన్‌ థియేటర్‌

9. ఇరాన్‌లో అల్బోర్జ్‌లో ఉన్న అలముట్‌ కోట(పర్వత కోట)

10. టర్కీలో బోడ్రమ్, హలికర్నాసస్ వద్ద ఉన్న సమాధి 

11. ఇటలీలోని రోమ్‌లో ఉన్న లార్గో డి టోర్రే అర్జెంటీనా. ఇది నాలుగు రోమన్‌ రిపబ్లికన్‌ దేవాలయ అవశేషాలకు సంబంధించిన బహిరంగ ప్రదేశం

12. మెక్సికోలో టియోటిహుకాన్‌లో ఉన్న అదిపెద్ద భవనం సూర్యుని పిరమిడ్‌. 

13 ఫ్రాన్స్‌లో లెస్‌ ఆండెలిస్‌ వద్ద ఉన్న మధ్యయుగపు కోట చాటేవు గైలార్డ్‌

14 ఉత్తర ఐర్లాండ్‌లో కౌంటీ అంట్రిమ్‌లో ఉన్న డన్‌లూస్‌ కాజిల్‌ కోట

15 ఇంగ్లాండ్‌లో నార్తంబర్‌ల్యాండ్‌ మైల్‌కాజిల్‌ 39 అనే హాడ్రియన్స్‌ గోడ

16 ఇరాన్‌లో ఫిజురాబాద్‌లో ఉన్న ఖలేహ్‌ దోఖ్తర్‌ ప్యాలెస్‌

17 ఇరాక్‌లోని బాబిలోన్‌లో ఉన్న ది హాంగింగ్‌ గార్డెన్స్‌ ఆఫ్‌ బాబిలోన్‌. ఇది కూడా ప్రపంచపు ఏడు వింతల్లో ఒకటి.

18 టర్కీలో ఎఫెసస్‌లో ఉన్న ఆర్టెమిస్‌ ఆలయం(డయానా టెంపుల్‌ అని కూడా పిలుస్తారు)

19. ప్రపంచపు ఏడు వింతల్లో ఒకటైన ఈజిప్ట్‌లోని ది లైట్‌హైస్‌ ఆఫ్‌ అలెగ్జాండ్రియా.

20 ఈజిప్ట్‌లోని ది గ్రేట్‌ పిరమిడ్‌ ఆఫ్‌  గిజా. మూడు గిజా పిరమిడ్‌లలో అతి పెద్దది

(చదవండి: ఆ వృద్ధుడు 55 ఏళ్లుగా స్వీయ నిర్బంధంలోనే..ఎందుకో తెలిస్తే షాకవ్వుతారు!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement