Wonders
-
నాటి పురాతన కట్టడాలకు వర్చువల్ త్రీడీ టెక్నాలజీతో ప్రాణం పోస్తే...
కీస్తూ పూర్వం లేదా క్రీస్తు శకం నాటి పురాతన కట్టడాలు, ప్రపంచపు వింతలు చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. అయినా వాటి నిర్మాణ శైలి, దాగున్న అద్భుత ఆవిష్కరణలు అందర్నీ మంత్ర ముగ్దుల్ని చేస్తూనే ఉన్నాయి. అలాంటి వాటికి ప్రాణం పోసి తిరిగి పునర్నిర్మిస్తే ఎలా ఉంటుదన్న ఆలోచనే భలే ఉంటుంది కదూ. ఆ ఊహకు వర్చువల్ త్రీడీ టెక్నాలజీని జోడించి మరీ అలనాటి వైభవం మన కళ్ల ముందు ప్రత్యక్షమయ్యేలా నాటి కట్టడాలకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆహా! టైం మిషన్ వెనక్కి వెళ్లిందా.. అన్నంత అద్భుతంగా ఉన్నాయి ఆ పురాతన నిర్మాణాలు, ప్రదేశాలు. 1.ప్రపంచంలోని ఏడు వింతల్లో ది కోలోసస్ ఆఫ్ రోడ్స్ విగ్రహం ఒకటి. ఇది గ్రీకుల దేవుడైన సన్ హీలియోస్ విగ్రహం A thread of 20 ancient sites and wonders brought to life by virtual reconstructions 🧵 1. The Colossus of Rhodes, Rhodes, Greece (c.280 BC) pic.twitter.com/TM7Le7XXCg — Culture Critic (@Culture_Crit) October 20, 2023 2. గ్రీకు పాశ్చాత్య నాగరికతను, వారి సంప్రదాయ కళకు నిలువెత్తు నిదర్శనం ఏథెన్స్ దేవతకు చెందిన పార్థినాన్ దేవాలయం. 2. The Parthenon, Athens, Greece (c.432 BC) pic.twitter.com/5uzfuhQpGe — Culture Critic (@Culture_Crit) October 20, 2023 3.ఈజిప్షియన్ల పురాతన దేవాలయం లక్సోర్ టెంపుల్. 3. Luxor Temple, Luxor, Egypt (c.1213 BC) pic.twitter.com/pF2OmTPmyb — Culture Critic (@Culture_Crit) October 20, 2023 4. ఇటలీలో రోమన్ పాంపీలో ఉన్న బృహస్పతి ఆలయం 4. The Temple of Jupiter, Pompeii, Italy (c.200 BC) pic.twitter.com/nVUy0OdlHg — Culture Critic (@Culture_Crit) October 20, 2023 5. సిరియాలో పామిరాలో ఉన్న బెల్ టెంపుల్. 5. The Temple of Bel, Palmyra, Syria (c.32 AD) pic.twitter.com/HbBYIONbEx — Culture Critic (@Culture_Crit) October 20, 2023 6. మెక్సికోలో కోబాలో ఉన్న అత్యంత ఎత్తైన నోహుచ్ మ్యూల్ పిరమిడ్(మట్టి దిబ్బ). 6. Nohoch Mul Pyramid, Coba, Mexico (c.550 AD) pic.twitter.com/kFguYv0KEU — Culture Critic (@Culture_Crit) October 20, 2023 7. ఇజ్రాయెల్‌లోని జెరూసలేం ఓల్డ్ సిటీ 7. The Old City of Jerusalem, Israel (1st Century BC) pic.twitter.com/CJzlVYnd51 — Culture Critic (@Culture_Crit) October 20, 2023 8. లిబియాలో లెప్టిస్ మాగ్నా నగరంలో ఉన్న రోమన్ థియేటర్ 8. The Roman theatre in Leptis Magna, Khoms, Libya pic.twitter.com/M925LZXC6l — Culture Critic (@Culture_Crit) October 20, 2023 9. ఇరాన్లో అల్బోర్జ్‌లో ఉన్న అలముట్ కోట(పర్వత కోట) 9. Alamut Castle, the Alborz, Iran (c.1090 AD) pic.twitter.com/kn1rU74OXZ — Culture Critic (@Culture_Crit) October 20, 2023 10. టర్కీలో బోడ్రమ్, హలికర్నాసస్ వద్ద ఉన్న సమాధి 10. The Mausoleum at Halicarnassus, Bodrum, Turkey (c.351 BC) pic.twitter.com/HB1g8OJ1Vk — Culture Critic (@Culture_Crit) October 20, 2023 11. ఇటలీలోని రోమ్‌లో ఉన్న లార్గో డి టోర్రే అర్జెంటీనా. ఇది నాలుగు రోమన్ రిపబ్లికన్ దేవాలయ అవశేషాలకు సంబంధించిన బహిరంగ ప్రదేశం 11. Area Sacra di Largo Argentina, Rome, Italy (c.101 BC) pic.twitter.com/J7mPDPjrz1 — Culture Critic (@Culture_Crit) October 20, 2023 12. మెక్సికోలో టియోటిహుకాన్లో ఉన్న అదిపెద్ద భవనం సూర్యుని పిరమిడ్. 12. The Pyramid of the Sun, Teotihuacan, Mexico, (c.200 AD) pic.twitter.com/rBPIZrcyNv — Culture Critic (@Culture_Crit) October 20, 2023 13 ఫ్రాన్స్‌లో లెస్ ఆండెలిస్ వద్ద ఉన్న మధ్యయుగపు కోట చాటేవు గైలార్డ్ 13. Château Gaillard, Les Andelys, France (c.1196 AD) pic.twitter.com/KvQlUBrtAw — Culture Critic (@Culture_Crit) October 20, 2023 14 ఉత్తర ఐర్లాండ్‌లో కౌంటీ అంట్రిమ్లో ఉన్న డన్లూస్ కాజిల్ కోట 14. Dunluce Castle, County Antrim, Northern Ireland (c.1500 AD) pic.twitter.com/OCZr7bRMb7 — Culture Critic (@Culture_Crit) October 20, 2023 15 ఇంగ్లాండ్‌లో నార్తంబర్ల్యాండ్ మైల్కాజిల్ 39 అనే హాడ్రియన్స్ గోడ 15. Milecastle 39, Hadrian’s Wall, Northumberland, England (c.100 AD) pic.twitter.com/MkKdjeYWMR — Culture Critic (@Culture_Crit) October 20, 2023 16 ఇరాన్లో ఫిజురాబాద్లో ఉన్న ఖలేహ్ దోఖ్తర్ ప్యాలెస్ 16. Qal'eh Dokhtar Palace, Fizurabad, Iran (c.209 AD) pic.twitter.com/gLT7GuFPcm — Culture Critic (@Culture_Crit) October 20, 2023 17 ఇరాక్‌లోని బాబిలోన్లో ఉన్న ది హాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోన్. ఇది కూడా ప్రపంచపు ఏడు వింతల్లో ఒకటి. 17. The Hanging Gardens of Babylon, Babylon, Iraq (c.562 BC) pic.twitter.com/iMGfP3atHY — Culture Critic (@Culture_Crit) October 20, 2023 18 టర్కీలో ఎఫెసస్లో ఉన్న ఆర్టెమిస్ ఆలయం(డయానా టెంపుల్ అని కూడా పిలుస్తారు) 18. The Temple of Artemis at Ephesus, Turkey (c.550 BC) pic.twitter.com/YFCL6Wq5bB — Culture Critic (@Culture_Crit) October 20, 2023 19. ప్రపంచపు ఏడు వింతల్లో ఒకటైన ఈజిప్ట్‌లోని ది లైట్‌హైస్ ఆఫ్ అలెగ్జాండ్రియా. 19. The Lighthouse of Alexandria, Alexandria, Egypt (c.280 BC) pic.twitter.com/k3o5t1WaGo — Culture Critic (@Culture_Crit) October 20, 2023 20 ఈజిప్ట్‌లోని ది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా. మూడు గిజా పిరమిడ్లలో అతి పెద్దది 20. The Great Pyramid of Giza, Egypt (c.2561 BC) pic.twitter.com/cMw91iMw2i — Culture Critic (@Culture_Crit) October 20, 2023 (చదవండి: ఆ వృద్ధుడు 55 ఏళ్లుగా స్వీయ నిర్బంధంలోనే..ఎందుకో తెలిస్తే షాకవ్వుతారు!) -
ప్రపంచంలోని వింతైన, అద్భుతాలను చూశారా?
-
వారెవ్వా! ఓ వైపు సూర్యోదయం, మరో వైపు నిండుచంద్రుడు.. ఈ ఫొటో కోసం 2వేల సార్లు
రెప్పపాటులో అదృశ్యమైపోయే దృశ్యాలు కొన్ని మనకు తారసపడుతూ ఉంటాయి. అలాంటి దృశ్యాలను శాశ్వతంగా పదిలపరచుకోవాలంటే, అందుకు కెమెరా ఒక చక్కని సాధనం. అలాగని కెమెరా చేతిలో ఉంటే సరిపోదు. కనిపించిన దృశ్యాన్ని పదికాలాల పాటు నిలిచి ఉండేలా ఫొటో తీయడానికి ఎంతో సహనం, అంతకు మించిన సమయస్ఫూర్తి కావాలి. ఎంతో సహనంతో సమయస్ఫూర్తితో చాకచక్యంగా తీసిన ఫొటోల్లో కొన్ని అద్భుత చిత్రాలుగా నిలిచిపోతాయి. ‘నేషనల్ జాగ్రఫిక్’ 2022 సంవత్సరంలో అత్యుత్తమ చిత్రాలుగా ప్రకటించిన కొన్ని ఫొటోలు ఇవి... ఓ వైపు సూర్యోదయం, మరోవైపు చంద్రుడు ఒకవంక సూర్యోదయం, మరోవంక మబ్బుచాటు నిండుచంద్రుడు. రేయింబగళ్ల సంధికాలాన్ని ఒకే దృశ్యంలో బంధించిన అద్భుత చిత్రం ఇది. అమెరికన్ ఫొటోగ్రాఫర్ స్టీఫెన్ విల్కిస్ ఈ ఫొటో తీయడానికి పురాతన సిటడల్ శిఖరంపైకి చేరుకుని 2,092 ప్రయత్నాలు చేశాడు. చివరకు ఈ అద్భుతాన్ని కెమెరాలో విజయవంతంగా బంధించగలిగాడు. ‘పోలార్ సన్’ నేషనల్ జాగ్రఫిక్ నౌక ‘పోలార్ సన్’ గ్రీన్లాండ్ తీరానికి ఆవల సముద్రం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు తారసపడిన దృశ్యం ఇది. రెండు మంచుఖండాల మధ్యనున్న చోటు నుంచి ప్రయాణిస్తున్న చిన్న పడవ కనిపించడంతో, ఓడలోనున్న ఫొటోగ్రాఫర్ రెనాన్ ఓజ్టర్క్ తన ద్రోన్ కెమెరాను సంధించి, ఈ అద్భుత చిత్రాన్ని బంధించాడు. పశ్చిమాఫ్రికాలోని పోర్చుగీస్ ఆర్చిపెలాగో పర్వతప్రాంతంలోని ‘మడీరా లారెల్’ అరణ్యం. పురాతన వృక్షాలతో అలరారే ఈ అరణ్యాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ అరణ్యంలోని చెట్లు ఒక్కొక్కటి వెయ్యి అడుగుల నుంచి ఐదువేల అడుగుల ఎత్తున ఉంటాయి. అమెరికన్ ఫొటోగ్రాఫర్ ఓర్సోల్యా హార్స్బెర్గ్ ఈ ఫొటో తీసింది. వెనిజులా రాజధాని కరకస్లో కనిపించిన దృశ్యం ఇది. వేకువ జామునే పిట్టగోడపై వాలి మేత కోసం ఎదురుచూస్తున్న బ్లూ అండ్ యెల్లో మకావ్ పక్షులు. రామచిలుకల జాతికి చెందిన ఈ పక్షులకు స్థానికులు రోజూ పొద్దున్నే మేత పెడుతుంటారు. ఈ దృశ్యాన్ని వెనిజులాకు చెందిన ఫొటోగ్రాఫర్ అలెజాండ్రా సెగారా తన కెమెరాలో బంధించాడు. చదవండి: సముద్రంలో వెయ్యి మీటర్ల లోతు.. ఆహా అనిపించేలా నగరం! -
కోకాకోలా సరస్సును ఎప్పుడైనా చూశారా..?
Coca Cola Lake: ఎప్పుడైనా ‘కోకాకోలా’లో ఈత కొడుతున్నట్లు కలకన్నారా? అయితే, ఇప్పుడ ఆ కలను నిజం చేసుకోండి. ఆశ్చర్యపోతున్నారా! నిజం, బ్రెజిల్‌లోని రియో గ్రాండే డో నార్టే దక్షిణ తీరంలో ‘కోకాకోలా సరస్సు’ ఉంది. అసలు పేరు ‘లగోవా ద అరారాక్వారా’. ఇందులోని నీరు, అచ్చం కోకాకోలా రంగులా ఉంటే, రుచి మాత్రం సాధారణ నీటి కంటే కాస్త ఉప్పగా ఉంటుంది. ఐరన్, అయొడిన్ సహా కొన్ని రసాయనాల కారణంగా దీనికి ఆ రంగు వచ్చిందని, పైగా ఇవి శరీరానికి ఏ హాని చేయవని ఈ మధ్యనే శాస్త్రవేత్తలు నిరూపించారు. దీంతో చాలామంది ఈ సరస్సులో ఈత కొట్టేందుకు ఉత్సాహం చూపుతున్నారు. పైగా వేసవిలో ఇక్కడ స్పెషల్ వాటర్ ప్రోగ్సామ్స్ కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సరస్సు పర్యాటకులతో కిటకిటలాడుతోంది. మీరు కూడా ఈ కోకాకోలా సరస్సులో ఈత కొట్టాలనుకుంటే, బ్రెజిల్ వెళ్లాల్సిందే మరి. చదవండి: ఆ గ్రామం.. కోట్ల ఏళ్లుగా సజీవం -
ఈ హెరిటేజ్ సైట్స్‌లోకి వెళ్లలేం.. ఇదొకటే దారి!
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు.. మన దేశంలోనూ చాలా ఉన్నాయి. ఇవన్నీ మన వారసత్వ సంపద. కొంతమంది వీటిల్లో కొన్నిటికి వెళ్లి ఉంటారు కూడా.. ఈ హెరిటేజ్ సైట్స్ గురించి మనకు తెలుసు.. మరి.. కేవలం గూగుల్ మ్యాప్‌లోనే చూడగల సైట్స్ గురించి మీకు తెలుసా? ఎందుకంటే.. ఇక్కడ మనకు నో ఎంట్రీ.. ఈ ఆదివారం వరల్డ్ హెరిటేజ్ డే. ఈ సందర్భంగా అలాంటి డిఫరెంట్ ప్రదేశాల గురించి కాస్త తెలుసుకుందామా.. స్నేక్ ఐలాండ్.. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ద్వీపం.. విస్తీర్ణం కేవలం 106 ఎకరాలు. బ్రెజిల్ తీరంలో ఉండే ఈ ప్రదేశం అత్యంత విషపూరితమైన సర్పాలకు నిలయం. చిన్న ద్వీపమే అయినా.. ఇక్కడ 4 వేలకు పైగా విషపూరితమైన పాములు ఉంటాయి. అందుకే.. బ్రెజిల్ ప్రభుత్వం ఇక్కడ పర్యాటకులను అనుమతించదు. శాస్త్రవేత్తలకు పరిశోధనల నిమిత్తం పరిమిత స్థాయిలో మాత్రమే అనుమతిస్తుంది. సర్ట్ట్సీ ఇదో ద్వీపం.. ఎలా ఏర్పడిందో తెలుసా? 1963లో సముద్రంలో పేలిన ఓ అగ్నిపర్వతం వల్ల.. దాని తాలూకు లావా అవన్నీ సముద్ర ఉపరితలం మీదకు వచ్చి.. కాలక్రమేణా ద్వీపంలా ఏర్పడింది. అప్పటినుంచి దీన్ని ఓ నేచర్ ల్యాబొరేటరీగా పరిరక్షిస్తున్నారు. ఏమీలేని బంజరు భూమిలాంటి దానిపై మళ్లీ జీవం పురుడుపోసుకోవడం.. మొక్కలు తదితర జీవజాతులు ఏర్పడటం వంటిదాన్ని జీవశాస్త్రవేత్తలు చాలా నిశితంగా గమనిస్తున్నారు. అందుకే ఇక్కడ ఇతరులకు ప్రవేశం నిషిద్ధం. ఈ దీవి ఐస్‌ల్యాండ్‌కు దగ్గరగా ఉంది. వాటికన్ రహస్య పత్రాలు.. ఇక్కడ ఎవరు పడితే వారు వెళ్లలేరు.. ఈ రహస్య పత్రాలపై అజమాయిషీ అంతా పోప్‌దే. ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, పండితులకు మాత్రమే ఇక్కడ ఎంట్రీ. ఇందుకోసం వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రకరకాల పరిశీలనల అనంతరం అనుమతి ఇస్తారు. ఇక్కడ వెయ్యేళ్ల క్రితం నాటి పత్రాలు ఉన్నాయి. అందులోనూ కొన్నిటిని మాత్రమే చూడటానికే అనుమతి ఇస్తారు.. ఇందులో ప్రఖ్యాత శాస్త్రవేత్త గెలీలియో విచారణకు సంబంధించినవి.. కింగ్ హెన్రీ–8, మార్టిన్ లూథర్ ఇలా ఎంతోమంది ప్రముఖులతో సాగించిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయి. .. తొలుత అయితే.. సదరు శాస్త్రవేత్త లేదా పండితుల వయసు 75 ఏళ్లు దాటి ఉండాలనే నిబంధన కూడా ఉండేది.. తర్వాతి కాలంలో దీన్ని సడలించారు.. బొహీమియన్ గ్రోవ్.. కాలిఫోర్నియాలో 2700 ఎకరాల పరిధిలో వెయ్యేళ్లనాటి భారీ వృక్షాలతో కూడిన చిన్నపాటి అటవీ ప్రాంతంగా దీన్ని చెప్పవచ్చు. అమెరికాలోని రిచ్ అండ్ పవర్ఫుల్ వ్యక్తులకు సంబంధించిన బొహీమియన్ క్లబ్.. దీని ఓనర్. 1872లో ఈ క్లబ్‌ను స్థాపించారు. ఇందులో అత్యున్నత స్థాయి వ్యక్తులు, అమెరికా మాజీ అధ్యక్షులు సభ్యులుగా ఉంటారు. ఈ ప్రాంతంలో ఇతరులకు ప్రవేశం నిషిద్ధం. మాజీ సైనికులు ఇక్కడ రక్షణ బాధ్యతలు చూస్తుంటారు. ఏటా వేసవిలో క్లబ్ సభ్యులు ఇక్కడ కలుసుకుంటారు. స్వాల్బార్డ్ ప్రపంచ విత్తన బ్యాంకు నార్వేకు సంబంధించిన ఓ ద్వీపంలో ఉందీ విత్తన బ్యాంకు. ప్రపంచంలో ఆహార సంక్షోభం లాంటివాటిని ఎదుర్కోవడానికి అన్ని రకాల పంటల విత్తనాలను ఇక్కడ దాచి ఉంచుతున్నారు. ప్రస్తుతం 9.3 లక్షల విత్తనాల శాంపిల్స్ ఉన్నాయి. దీన్ని కూడా మనం గూగుల్ మ్యాప్‌లోనూ.. ఫొటోల్లోనూ చూడాల్సిందే.. ఇక్కడ పర్యాటకులకు ఎంట్రీ నిషిద్ధం. ఏరియా 51 ఇది చాలా ఫేమస్ ప్లేస్.. దీనిపై సినిమా కూడా తీశారు. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన అత్యంత రహస్యమైన ప్రదేశం.. నెవడాలో ఉంది. పై నుంచి విమానాలు వెళ్లడానికి కూడా అనుమతి లేదు. ఇక మనలాంటోళ్ల సంగతి చెప్పనక్కర్లేదు. ఫొటోలే చాలా రేర్‌గా దొరుకుతాయి. ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు నడుస్తాయని పైకి చెబుతారు కానీ.. వాస్తవంగా ఇక్కడ ఏం జరుగుతోందన్నది ఎవరికీ తెలియదు. ఉత్తర సెంటినల్ ద్వీపం.. సెంటినలీజ్.. మిగతా ప్రపంచంతో అస్సలు సంబంధం లేకుండా జీవనం సాగించే తెగ ఇది. ఈ ద్వీపానికి వాళ్లు ఎవరినీ రానివ్వరు.. కనీసం చూడటానికి కూడా ఇష్టపడరు.. వీళ్లతో కాంటాక్ట్ అవడానికి ప్రయత్నించిన కొందరిని చంపేశారు కూడా.. ఈ సెంటినల్ ద్వీపం మరెక్కడో లేదు.. మన అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఇది కూడా ఒకటి. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
దేవుడి మహిమంటే ఇదేనేమో?
దేవుడి మహిమలంటే అంతే మరి. మనల్ని పుట్టిస్తాడు. మన తోడును మనకోసం ఇంకెక్కడో పుట్టిస్తాడు. దేవుడు ఆడే ఈ ఆటలో... ఒక్కొసారి మనతో జీవితాంతం కలిసి ఉండే వ్యక్తి మన పక్కనే ఉన్న తెలుసుకోలేకపోతాం. మళ్లీ ఎప్పటికో కలుస్తాం. అదే విధి. దేవుడు ఆడే చదరంగం. భూమి గుండ్రంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా...తిరిగి రావాల్సిన చోటుకే వస్తారు. ఇప్పుడీ వేదాంతం అంతా ఎందుకు అనుకుంటున్నారా? ఆ కథేంటో ఓసారి చూద్దాం చైనాలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. ఒక యువకుడు (యే) చైనాలో క్వింగ్డావోలోకి ఒక కట్టడం ముందు ఫోటో దిగాడు. అక్కడే పక్కన ఒక అమ్మాయి (జియు) కూడా ఫోటో దిగింది. ఇది జరిగింది 2000 సంవత్సరంలో. సరిగ్గా 11 ఏళ్ల తర్వాత అంటే 2011లో వీరిద్దరికి పెళ్లి జరిగింది. ఆ దంపతులిద్దరూ తమ జ్ఞాపకాలకు సంబంధించిన అప్పుడెప్పుడో దిగిన ఫోటోలు చూసి ఆశ్చర్యపోయారు. జియు దిగిన ఫోటోలో తన భర్త కూడా ఉండటాన్ని ఆమె గమనించింది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనపై ఆశ్చర్యపోవడం వారివంతు అయింది. పదకొండు సంవత్సరాలక్రితమే విధి వారిని దగ్గర చేసింది. అయితే అప్పుడు వారికి తెలియదు. మళ్లీ పదకొండు సంవత్సరాల తరువాత ఇద్దరు కలిసి జీవితాన్ని పంచుకుంటారనీ. ఇప్పుడు వారిద్దరు తమ కవల పిల్లలతో మళ్లీ అదే ప్రదేశాన్ని సందర్శించాలనుకుంటున్నారట. ఈ పిల్లలు పెరిగి పెద్దయ్యాక కూడా మళ్లీ అక్కడికి వెళ్లి ఫోటోలు దిగాలనుకుంటున్నామని తెలిపారు. ఇంతకీ ఆ ప్రదేశం ఏంటో చెప్పలేదు కదూ...చైనా దేశంలోని క్వింగ్డావోలోని ఫోర్త్ స్క్వేర్. -
నిజమైన ఇంద్రజాలం
మర్యాద పలకరింపు కూడా లేకుండా– ‘ఏమిటి నీ గొప్ప? మామూలు బోధనలే కదా నువ్వు చేసేది! మరి నేను అలా కాదే! ఎన్నో అద్భుతాలు చేయగలను’ అన్నాడు గర్వంగా. ఒక పట్టణంలో రెండు ఆశ్రమాలుండేవి. ఇద్దరు గురువులు ఉండేవారు. మొదటి ఆశ్రమంలో గురువు బోధనలు చక్కగా ఉండేవి. ప్రేమ, కరుణ, శాంతం గురించి ఎక్కువగా చెబుతుండేవాడు. దాంతో వినడానికి చుట్టుపక్కల ఊళ్ల నుంచి ఎంతోమంది జనం వచ్చేవారు. రెండో గురువు గొప్ప శక్తులను సంపాదించడం మీద తన దృష్టి సారించేవాడు. అలా ఎన్నో అద్భుతాలను ఆయన చేయగలిగేవాడు. అయితే, రెండో గురువు దగ్గర ఎన్ని శక్తులు ఉన్నప్పటికీ మొదటి గురువుకే ఎక్కువ ఆదరణ ఉండేది. ఇది రెండో గురువుకు తీవ్రమైన అసూయ కలిగించేది. దాంతో ఒకరోజు నేరుగా మొదటి గురువు దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఆయన చుట్టూ శ్రోతలు కూర్చునివున్నారు. మర్యాద పలకరింపు కూడా లేకుండా– ‘ఏమిటి నీ గొప్ప? మామూలు బోధనలే కదా నువ్వు చేసేది! మరి నేను అలా కాదే! ఎన్నో అద్భుతాలు చేయగలను’ అన్నాడు గర్వంగా.‘ఏమిటా అద్భుతాలు?’ కుతూహలంగా అడిగాడు మొదటి గురువు.‘నేను మన ఊళ్లోని చెరువు ఈ ఒడ్డున బ్రష్ పట్టుకుని నిల్చుంటాను. అవతలి ఒడ్డున నా సహాయకుడు కాన్వాస్ పట్టుకుని నిలుచుంటాడు. నేను ఇక్కడ గీస్తే అక్కడ బొమ్మ రూపుకడుతుంది తెలుసా?’ అన్నాడు.‘ఓహో, నిజంగా బాగుంది. అయితే, నేను అంత ఇంద్రజాలం ప్రదర్శించలేనుగానీ నేను పడుకోగానే మాత్రం వెంటనే నిద్ర పడుతుంది’ నవ్వుతూ బదులిచ్చాడు మొదటి గురువు. -
గుడ్డు పెట్టాడు....గుడ్లు తేలేశారు!
-
కోడి గుడ్డు కాదు..మనిషి పెట్టిన గుడ్డు!
అదేంటి మనిషి ఎక్కడైనా గుడ్డు పెడతాడా? జంతువులు, పక్షులు కదా గుడ్డు పెట్టేవి అని అనుకుంటున్నారా? కానీ ఇండోనేషియాకు చెందిన 14 ఏళ్ల బాలుడు గుడ్లు పెడుతున్నాడు. అదేంటని విచిత్రంగా అనుకుంటున్నారా? దాని సంగతేంటో ఓసారి చూద్దాం. ఇండోనేషియాకు చెందిన అక్మల్ గత రెండేళ్ల నుంచి గుడ్లు పెడుతున్నాడనీ, ఇప్పటి వరకు 20 గుడ్లు పెట్టాడనీ అతని తండ్రి తెలిపాడు. ఈ విచిత్ర వ్యవహారంపై వైద్యులను సంప్రదించినా ఫలితం లేకపోయింది. డాక్టర్ల ఎదుటే అక్మల్ రెండు గుడ్లు పెట్టాడు. దీంతో గుడ్లు తేలేయడం వైద్యుల వంతైంది. అక్మల్‌కు అన్ని పరీక్షలు నిర్వహించినా, అసలు విషయాన్ని మాత్రం కనిపెట్టలేక చేతులెత్తేశారు. అంతేకాకుండా మనిషి గుడ్లు పెట్టడం అసాధ్యమని, అక్మల్ గుడ్లు మింగేసి ఉంటాడని అవే బయటకు వస్తుండవచ్చని చెబుతున్నారు. అయితే అక్మర్ తండ్రి మాత్రం.. తన కొడుకు ఇంతవరకు గుడ్డు మింగలేదని తెలిపారు. పైగా అతడు పెట్టే గుడ్డు పూర్తిగా ఎల్లో లేదా వైట్‌గా ఉంటుందని పేర్కొన్నారు. -
వింతలు చూడతరమా...
భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం. ఇక్కడి ప్రజల జీవన విధానాలు, ఆచార వ్యవహారాలు, చరిత్ర చాలా భిన్నమైనవి. సాంస్కృతిక భిన్నత్వం, చారిత్రక ప్రదేశాలు, అందమైన ప్రకృతి రమణీయ దృశ్యాలతోపాటు మరెన్నో వింతలూ, విశేషాలూ భారతదేశం సొంతం. దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ ఏదో ఓ పర్యాటక ప్రదేశం.. వింత దృశ్యాలు మనల్ని ఆకర్షిస్తాయి. విదేశీ పర్యాటకులెవరైనా మన దేశానికి వస్తే తాజ్‌మహల్‌ను చూడాలనో.. గోవా బీచ్‌ను సందర్శించాలనో భావిస్తారు. వాటితోపాటు పర్యాటకుల్ని ఆకట్టుకునే ప్రదేశాలు, వింత ఆచారాలు మన దేశంలో చాలానే ఉన్నాయి. అలాంటివాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం. మాస్ బర్డ్ సూసైడ్.. అసోంలోని బోరైల్ హిల్స్ ప్రాంతంలో ఉన్న చిన్న గ్రామం జతింగ. ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో పక్షులు గూళ్లు ఏర్పర్చుకుని నివసిస్తుంటాయి. కానీ ప్రతి ఏటా వర్షాకాలంలో ముఖ్యంగా సెప్టెంబర్- అక్టోబర్ల మధ్య ఇక్కడ పరిశోధకులకు అంతుచిక్కని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ సమయంలో రాత్రిపూట వందలకొలది వలస పక్షులు వేగంగా ప్రయాణించి, అక్కడి చెట్లను, ఇళ్లను ఢీకొని మరణిస్తాయి. ఇలా ఎప్పుడూ ఒకేసారి పక్షులన్నీ కలిసి మరణించడం శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యపరుస్తోంది. దీనిక గల కారణాలను వారు ఇంకా కనుగొనలేదు. పక్షులన్నీ ఆత్మహత్యకు పాల్పడతాయనే ఉద్దేశంతో ఈ ఘటనకు ‘మాస్ బర్డ్ సూసైడ్’ అనే పేరు పెట్టారు. తొలిసారిగా 1960లో ఈ.పీ. గీ అనే శాస్త్రవేత్త ఈ విషయాన్ని ప్రపంచానికి వెల్లడించాడు. ఆసియాలోనే శుభ్రమైన గ్రామం.. మేఘాలయ రాష్ట్రంలోని చిరపుంజి సమీపాన గల మాలిన్నాంగ్ గ్రామానికి ఆసియాలోనే అత్యంత శుభ్రమైన గ్రామంగా అంతర్జాతీయ ప్రశంసలు దక్కాయి. మేఘాలయా రాష్ట్రం పర్యావరణ పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందింది. అందులో మాలిన్నాంగ్ కూడా పర్యాటకుల్ని విపరీతంగా ఆకర్షిస్తోంది. పూర్తిస్థాయిలో ఈ గ్రామం శుభ్రంగా ఉంటూ, పచ్చని చెట్లూ, జలపాతాలు, సరస్సులతో ఆకట్టుకుంటుంది. అనేక పర్యాటక వింతలు ఈ ప్రాంతం సొంతం. ఈ గ్రామం మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడి ప్రజలు వందశాతం అక్షరాస్యత సాధించారు. దాదాపు అందరూ ఇంగ్లీష్‌ను చాలా స్పష్టంగా మాట్లాడగలరు. ల్యాండ్ ఆఫ్ స్నేక్స్.. పాములంటే అందరికీ భయమే. కానీ మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాలోని షేత్పల్ గ్రామంలోని వారు మాత్రం పాముల్ని చూస్తే అస్సలు భయపడరు. పిల్లలకు కూడా అవంటే భయం లేదు. పైగాఅక్కడ ఎక్కువగా కనిపించే పాములేంటో తెలుసా.. అత్యంత విషం కలిగిన కోబ్రాలు. స్థానికుల ఇళ్లల్లో చాలాచోట్ల ఈ పాములు దర్శనమిస్తాయి. పైగా పాములను వారు దైవంతో సమానంగా కొలుస్తారు. మరో విశేషమేంటంటే అనేక పాములు ఊళ్లో స్వేచ్ఛగా తిరుగుతున్నా ఇప్పటివరకు ఒక్కరిని కూడా కాటేసిన ఉదంతాలు లేవు. టెంపుల్ ఆఫ్ ర్యాట్స్.. ఇంట్లో ఎలుకలు కనిపిస్తే వాటి అంతు చూసే వరకూ వదలం. కానీ రాజస్థాన్‌లో మాత్రం ఎలుకల్ని దైవానికి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు. బికనీర్‌కు 30 కిలోమీటర్ల దూరంలోని డెష్నాక్ అనే చిన్న పట్టణంలో కర్ణిమాత ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఏకంగా 20,000 ఎలుకలు జీవిస్తున్నాయి. ఈ ఎలుకల్ని దేవుడి సంతానంగా భావించడం వల్ల స్థానికులు వాటిని పూజిస్తారు. వాటికి క్రమం తప్పకుండా ఆహారం పెట్టడంలాంటి సేవలు కూడా చేస్తారు. జ్వాలా మాత టెంపుల్.. హిమాచాల్ ప్రదేశ్ కంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలా మాత దేవాలయంలో ఏడాదంతా నిరంతరం జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. భక్తులు కూడా నిత్యం జ్యోతిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ గుడి మధ్యలో ఉన్న ఓ రాయిలోనుంచి ఈ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. వందల ఏళ్ల నుంచి ఇది వెలుగుతూనే ఉండడం గమనార్హం. పార్వతీదేవి ఇక్కడ జ్యోతి రూపంలో ఉన్నట్లుగా భక్తులు విశ్వసిస్తారు. లివింగ్ రూట్స్ బ్రిడ్జి.. ఇది కూడా మేఘాలయాలోని చిరపుంజిలో ఉంది. సాధారణంగా మానవులు బ్రిడ్జిలు నిర్మిస్తారు. కానీ ఈ బ్రిడ్జిని మాత్రం మానవులు పెంచారు. జలపాతాలకు పేరుగాంచిన ఈ ప్రాంతంలో పెరిగిన రబ్బరు మొక్క కాండం నుంచి పెరిగిన వేళ్లను స్థానికులు దాని పక్కనే ఉన్న నదికి బ్రిడ్జిగా మలిచారు. భూమిలోపలికి పెరగాల్సిన వేళ్లను స్థానికులు నదికి సమాంతరంగా మలిచారు. అవి క్రమంగా పెద్దవై, గట్టిపడి నదిమీద బ్రిడ్జిలా మారాయి. ఇక్కడ ఇలాంటి బ్రిడ్జిలు చాలానే కనిపిస్తాయి. లేక్ ఆఫ్ స్కెలిటన్స్.. దాదాపు 16,500 అడుగుల ఎత్తున హిమాలయాల్లోని జనావాసాలు లేని ప్రాంతంలో ఉన్న ఓ సరస్సు రూప్కండ్. ఇది ఎక్కువగా మంచుపలకలతో కప్పి ఉంటుంది. ఈ సరస్సును స్కెలిటన్ సరస్సు లేదా మిస్టరీ సరస్సు అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ దాదాపు 600 వరకు మానవ అస్థిపంజరాలు లభించాయి. దీంతో ఈ సరస్సుకు స్కెలిటన్ సరస్సు అనే పేరు వచ్చింది. ఇక్కడి మంచు కరిగిపోయిన సమయంలో సరస్సు అడుగుభాగంలో ఈ అస్థిపంజరాలు దర్శనమిస్తాయి. మన దేశంలో ప్రజలు అనేక సంఘటనల్ని ఆధ్యాత్మిక కోణంలో చూస్తారు కాబట్టి ఇక్కడ అస్థి పంజరాలు కనిపించడానికి కూడా స్థానిక దేవత కోపమే కారణమని పలువురు భావిస్తారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఏవీ లభించలేవు. -
రోబో చిల్డ్రన్స్
స్విచ్ వేస్తే లైటు వెలుగుతుంది. ఫ్యాను తిరుగుతుంది. కరెంటు పోతే ఏవీ పనిచేయవు. ఇంతకు మించి కరెంటు గురించి, వివిధ యంత్రాల పనితీరు గురించి పిల్లలకు తెలిసే అవకాశం లేదు. ఇక నగరంలో... ఆడుకోవటానికి చోటు లేదు, చుట్టూ ఉన్న విషయాలను, వాటి వెనుక ఉన్న శాస్త్రాన్ని తెలుసుకునే అవకాశం కూడా లేదు. పుస్తకాల జ్ఞానాన్ని మార్కులకు మాత్రమే పరిమితం చేస్తున్న ఈ తరుణంలో చదువుకున్న విషయాలను నిత్య జీవితంలో అన్వయించుకునేందుకు, ప్రాక్టికిల్గా తెలుసుకునేందుకు ఓ చక్కటి ప్రయత్నం చేస్తున్నది కిడిహౌ చిల్డ్రన్స్ మ్యూజియం. అమెచ్యూర్ రోబోటిక్ క్లబ్ పేరుతో జరిగే ఆ మేథోమదనం గురించి... ..:: ఓ మధు ఆరేళ్ల పిల్లాడి చేతికి బంతి ఇస్తే ఏం చెయ్యాలో చెప్పక్కర్లేదు. పిల్లలకు కొన్ని బేసిక్ విషయాలు చెప్తే చాలు.. అద్భుతాలు ఆవిష్కరిస్తారు. తరగతి గదుల్లో నేర్పే పాఠాలను ప్రత్యక్షంగా, అనుభవ పూర్వకంగా నేర్చుకోగలిగితేనే వారు నిజమైన జ్ఞానవంతులు కాగలరు. కానీ అలాంటి వెసులుబాటు స్కూళ్లు, ఇళ్లు ఎక్కడా కల్పించటం లేదు. ఈ విషయాన్ని గ్రహించి పిల్లలు శాస్త్ర, సాంకేతిక అంశాలను అర్థం చేసుకోవడానికి సరైన వాతావరణం కల్పించింది రోబోటిక్ క్లబ్. భావి సైంటిస్టులను, క్రియేటివ్ జూనియర్స్‌ను తయారు చేయడమే తమ ఉద్దేశమంటున్నారు క్లబ్ ఫౌండర్ నిరంజన్ వాసిరెడ్డి. పిల్లలకు రెడీమేడ్ గిఫ్ట్స్, బొమ్మలు కొని ఇస్తుంటారు తల్లిదండ్రులు. కానీ వారిలో సృజనను గుర్తించి అందుకు తగిన వనరులు సమకూర్చి... దానికి కొంత సాంకేతిక జోడించడమెలాగో చెబితే వాళ్లే చక్కని బొమ్మలు, రోబోలు తయారు చేసుకోగలుగుతారు. రోబో తయారు చెయ్యాలంటే ఒక లెగో కిట్ కొనుక్కోవాల్సిన పనిలేదు. ఇంట్లో వుండే వస్తువులతోనే క్రియేటివ్‌గా రోబోని తయారు చెయ్యొచ్చని చెబుతోంది రోబోటిక్ క్లబ్. అనటమే కాదు ఇక్కడికి వచ్చే పిల్లలతో అలాంటి రోబోలను తయారు చేయిస్తోంది. బేసిక్స్‌తో మ్యాజిక్స్... ఇక్కడ బ్యాటరీ బేసిక్స్ నేర్పిస్తారు. బ్యాటరీ ఎలా కనెక్ట్ చెయ్యాలి, దాని పనితీరు, బ్యాటరీలలో ఎన్ని రకాలుంటాయి? వాటిని ఎలా వాడుకోవచ్చు? ఇలాంటి విషయాలన్నీ వారికి ప్రాక్టికల్ నేర్పిస్తారు. ఆలోచనలకు పదును పెట్టే ఆటలు ఆడిస్తారు. బేసిక్ ఎలక్ట్రానిక్స్ గురించిన అవగాహన కల్పిస్తుంటారు. అందుకు కావలసిన సర్క్యూట్ బోర్డ్స్, బ్యాటరీస్ ఇక్కడ చాలానే ఉన్నాయి. వాటికి తమ సృజనను జోడించి రోబోలుగా మలిచేందుకు పిల్లలకు కావలసిన విషయ జ్ఞానాన్ని, సహకారాన్ని మేం అందిస్తాం అంటున్నారు క్లబ్ నిర్వాహకుల్లో ఒకరైన ప్రియా అయ్యంగార్. స్కిల్ ఓరియంటెడ్... ప్రతి పిల్లవాడు డిఫరెంట్. ఒక్కొక్కరికీ ఒక్కో నైపుణ్యం ఉంటుంది. ఒక్కోదాని మీద ఆసక్తి ఉంటుంది. వారిలో దాగి ఉన్న నైపుణ్యాలను బయటికి తేవడమెలాగో ఈ క్లబ్ నిర్వాహకులకు బాగా తెలుసు. పిల్లలకు ఎటువంటి హాని కలుగకుండా వస్తువులను వినియోగిస్తూ, వారికి నచ్చే విధంగా అంశాలను బోధిస్తున్నారు. నెలలో రెండో శుక్ర, శని, ఆది వారాలు రోబోటిక్స్ సంబంధించిన యాక్టివిటీస్ నిర్వహిస్తారు. ఈ యాక్టివిటీలో 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలు పాల్గొంటుంటారు. 40 నిముషాల పాటు బేసిక్ క్లాస్ అనంతరం యాక్టివిటీ నిర్వహిస్తారు. ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ నుంచి కిచెన్, గార్డెన్లో ఉండే సైన్సు పాఠాలు ఇక్కడి క్లాసుల్లో అవలీలగా నేర్చుకోవచ్చంటున్నారు పిల్లల తల్లిదండ్రులు. -
‘విశేష’నామ సంవత్సరం
పండుగలు, సెలవులు వస్తున్నాయంటే ఆనందపడని వారెవరు?.. అంబరాన్నంటే సంబరాలతో మన ముంగిటికి విచ్చేసిన 2015 సంవత్సరం ప్రతి యేడు కంటే ఎక్కువ సెలవులు, ఎన్నో వింతలు, విశేషాలను తీసుక్చొంది. ఈ ఏడాది పండుల్లో చాలా వాటిని గురువారం ఆక్రమించగా నాలుగు నెలల్లో ఐదు ఆదివారాలు రావడం విశేషం. ఒకే రోజు రెండు పండుగలు వచ్చే సందర్భాలూ ఉన్నాయి. శని, సోమవారాల్లో కొన్ని పండగలు వచ్చి ఆదివారంతో కలిపి జంట సెలవులు ఇప్పిస్తున్నాయి. ముఖ్యమైన వైకుంఠ ఏకాదశి, మిలాద్ ఉన్ నబీ పండుగలు ఈ ఏడాదిలో రెండుసార్లు రావడం విశేషం. అక్టోబర్‌లో 11 సెలవులు అక్టోబర్‌లో ఆదివారాలతో కలిపి ఎనిమిది సెలవులు రాగా, ఐచ్ఛిక సెలవులతో కలిపితే 11 సెలవులు రావడం విశేషం. వీటికి తోడు దసరా సెలవులు.. వెరసి ఈ నెలంతా సెలవులే సెలవులు. 4 నెలల్లో 5 ఆదివారాలు మార్చి, నవంబర్ నెలలు ఆదివారంతో ప్రారంభం అవుతుండగా మార్చి, మే, ఆగస్టు, నవంబర్ నెలల్లో ఐదేసి ఆదివారాలు వస్తున్నాయి. రంజాన్, మొహర్రం శనివారమే ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం శుక్రవారంతో ప్రారంభమవుతుంది. వీరు అత్యంత పవిత్రంగా జరుపుకొనే రంజాన్, మొహ్రం పండగలు మాత్రం శనివారం వచ్చాయి. ఒకేరోజు రెండు పండుగలు ⇒ఈ ఏడాది ఒకేరోజు రెండు పండుగలు.. అది కూడా ఐదు సందర్భాల్లో వస్తున్నాయి. ⇒జనవరి ఒకటి: నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి ⇒జనవరి 26: రథసప్తమి, గణతంత్ర దినోత్సవం ⇒మే 2: అన్నమయ్య జయంతి, బుద్ధ జయంతి ⇒సెప్టెంబర్ 24: బక్రీద్, ఓనమ్ ⇒నవంబరు 25: కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి ఎనిమిది జంట సెలవులు ⇒జనవరి 25 ఆదివారం, 26 సోమవారం గణతంత్ర దినోత్సవం ⇒మార్చి 28 శనివారం, 29 ఆదివారం శ్రీరామ నవమి ⇒జూలై 18 శనివారం రంజాన్, 19 ఆదివారం ⇒ఆగస్టు 15 శనివారం స్వాతంత్య్ర దినోత్సవం, 16 ఆదివారం ⇒సెప్టెంబర్ 5 శనివారం కృష్ణాష్టమి, 6 ఆదివారం ⇒అక్టోబర్ 24 శనివారం మొహర్రం, 25 ఆదివారం ⇒డిసెంబర్ 24 మిలాద్ ఉన్ నబీ, 25 క్రిస్మస్, 26 బాక్సింగ్ డే (ఐచ్ఛిక సెలవు), 27 ఆదివారం గురువారానిదే ఆధిపత్యం నూతన సంవత్సరం గురువారంతో ప్రారంభమై, గురువారంతోనే (డిసెంబర్ 31) ముగు స్తుంది. అందుకేనేమో ఈ ఏడాది గురువారం ఆధిపత్యం కొనసాగనుంది. రెండు సంప్రదాయ పండుగలతో పాటు చిన్నాపెద్దా కలిపి మొత్తం 14 పండుగలు గురువారం రోజే వస్తున్నాయి. సంక్రాంతి, దసరా గురువారమే వచ్చాయి. 10 పండుగలతో శుక్రవారం రెండో స్థానంలో ఉంది. శనివారం 9 పండుగలు, బుధవారం 7, ఆది, సోమవారాల్లో 5, మంగళవారం 4 పండుగలు రానున్నాయి. ఒకే పండుగ రెండుసార్లు సాధారణంగా ఏ పండుగైనా ఏడాదిలో ఒకసారే వస్తుంది. ఈ ఏడాది మాత్రం రెండు పండుగలు రెండేసిసార్లు రావడం అరుదైన విషయం. ⇒ వైకుంఠ ఏకాదశి: జనవరి 1, డిసెంబర్ 21 ⇒మిలాద్ ఉన్ నబీ: జనవరి 4, డిసెంబర్ 24 18 ఏళ్ల తర్వాత...మళ్లీ అవే రోజులు ఈ ఏడాది కాలెండర్లో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. 1997వ సంవత్సరంలోని కొన్ని ఆసక్తికర తేదీలు, వారాలు తిరిగి 18 ఏళ్ల తర్వాతఈ ఏడాది వచ్చాయి. వాటిని పరిశీలిస్తే... 4-04-2015, 6-06-2015, 8-08-2015, 10-10-2015, 12-12-2015 రోజులు శనివారాలుగాఉన్నాయి. ఒకే తేదీ... నెల సంఖ్యలు కలిసి వచ్చాయి. ఇవే తేదీలు, వారాలు 1997లో కనిపించాయి. అంటే 18 ఏళ్ల తర్వాత మళ్లీ అవే తేదీలు..అవే రోజులు రావడం ఈ ఏడాది క్యాలెండర్లో ప్రత్యేకత . -
అద్భుతాలు-రికార్డులు-ప్రత్యేకతలు
జనవరి : 16 - 231 మంది విద్యార్థులు ఇసైమామణీ ఎంఎస్ మార్టిన్ సారథ్యంలో బోర్డు వాయించి గిన్నిస్ రికార్డు కోసం ప్రయత్నించారు. 23 - మద్యాన్ని వ్యతిరేకిస్తూ చిన్ననగరంలో మద్యం బాటిల్ గొప్పదా, తాళిబొట్టు గొప్పదా తూకం వేస్తూ వినూత్న నిరసన చేపట్టారు. ఫిబ్రవరి: 2 - చెన్నై మైలాపూర్‌లోని ప్రసిద్ధి గాంచిన కాళవిళియమ్మన్ అమ్మవారి ఆలయానికి 1008 పాల బిందెలతో భక్తులు ఊరేగింపుగా బయలుదేరి కనుల పండుగ చేశారు. 6 - నాగపట్టణం జిల్లా మైలాడుదురైలో చోళుల కాలం నాటి శివాలయం బయటపడింది ఏప్రిల్: 13 - రాష్ట్రంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్లమెంట్ అభ్యర్థి సెంగోట్టవన్కు మద్దతుగా ప్రచారం చేసేందుకు వేలూరు జిల్లా వాణియంబాడి నియోజకవర్గంలోని రెండువేల అడుగుల ఎత్తు గల నెగ్నకొండపైకి ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను దుప్పటిలో కూర్చోబెట్టి కర్రలతో అటవీవాసులు మోసుకె ళ్లారు. మే:ఙఞ్చట13- విల్లుపురం జిల్లా ఊలందూరుపేట సమీపంలోని కూత్తాండవర్ ఆలయ ఉత్సవాల్లో హిజ్రాలకు వసంతోత్సవం జరిగింది. 13మంది హిజ్రాలకు పెళ్లి జరిగింది. 15 - ప్రముఖ మహిళా చెఫ్ మాల్గుడి కవిత నేతృత్వంలో చెన్నైనగరంలో వెయ్యిమంది వెయ్యి రకాల వంటకాలను తయారు చేసి అలరించారు.ఙఞ్చట20- హోసూరు జిల్లా ఫైవ్‌స్టార్ ఫోరంలో ఒక రక్తపింజేరి పాము ఒకేసారి 35 పిల్లలకు జన్మనిచ్చింది.ఙఞ్చట21- వేలూరు కోట మైదానంలో శునకం పిల్లికి పాలు ఇవ్వటం విశేషం. జూన్: 20-నన్మంగళం అడవుల్లోని కొండ చరియల్లో అరుదైన యారీషియన్ ఈగిల్ గుడ్లగూబలు సందర్శకులకు కనువిందు చేశారుు. జూలై:ఙఞ్చట3 - మయన్మార్‌కు చెందిన రెండు నెలల బాలుడికి కావేరి ఆస్పత్రిలో అరుదైన చికిత్స విజయవంతంగా చేశారు. 13 - సెయాస్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్సీ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయిలో వరుసగా రెండో సారి చాంపియన్‌గా దివేష్ రెడ్డి నిలిచారు.ఙఞ్చట31- కృష్ణగిరి జిల్లా బూర్గూరు సమీపంలోని కోలనూరు గ్రామానికి చిన్నస్వామి వరి పొలంలో 12 అడుగుల పొడవైన కొండ చిలువను పోలిన నాగుపాము ఐదడుగుల ఎత్తు పడగెత్తి నిలవడం ఆశ్చర్యం కలిగించింది. ఆగస్టు:ఙఞ్చట3- ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో శిక్షణ పొందిన అభ్యర్థులు తాంబరం ఎయిర్‌ఫోర్స్ శిక్షణ కేంద్రంలో చేసిన ఫైరింగ్, షూటింగ్ విన్యాసాలు అబ్బురపరిచాయి.13- స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ కన్యకాపరమేశ్వరి మహిళా కళాశాలలో యువతులు ఫేస్ పెయింటింగ్స్‌తో ఆకట్టుకున్నారు.ఙఞ్చట17- దెబ్బతింటున్న టైలరింగ్‌ను కాపాడుతూ నగరంలో 30 అడుగుల ఎత్తు, 226 అడుగుల వెడల్పు గల భారీ చొక్కాను తయారు చేసి కనువిందు చేశారు. 28 - తిరువణ్ణామలై జిల్లా ఆరణి సమీపంలోని ఆగ్రా పాళ్యానికి చెందిన శేఖర్, భాను దంపతుల కుమార్తె యువరాణి (12) కంటిలో నుంచి రాళ్లు రావటం వెలుగు చూసింది. సెప్టెంబరు:ఙఞ్చట 22- బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్‌ను కలుసుకునేలా పాలం సిల్క్స్ ఆధ్వర్యంలో ది ఇండియా వాల్ శారీ డాన్సు షో కాంపీటీషన్ల్లో యువకులు చీరలు కట్టి చిందులు వేశారు. అక్టోబర్:ఙఞ్చట 2- ది ఫెంట్లోప్ ఆధ్వర్యంలో స్థానిక వడపళనిలోని విజయామాల్‌లో వెయ్యి కిలోల భారీ కేక్ ప్రదర్శన జరిగింది. వైరముత్తు రాసిన పాటల చిత్రాల ఫొటోలతో ఆకట్టుకున్నారు.ఙఞ్చట 11- వేలూరు జిల్లా వాలాజాలోని శ్రీ ధన్వంతరి ఆరోగ్య పీఠంలో పీఠాధిపతి డాక్టర్ మురళిధరస్వామి 55వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని లక్ష నెల్లికాయలతో యాగం చేశారు. నవంబర్: 1 - ప్రపంచంలోని కట్టడాలను నగరానికి చెందిన చిన్నారులు అట్టముక్కలు, థర్మాకోల్‌తో తాజ్‌మహల్, గేట్‌వే ఆఫ్ ఇండియా, చార్మినార్ నమూనాలను తయారు చేసి అబ్బుర పరిచారు. 5 - మతిస్థిమితం లేని ఓ మహిళ బైకు కింద పడి గాయాల పాలైన కుక్కపిల్లను అక్కున చేర్చుకుని మాతృప్రేమను చాటిన అరుదైన సంఘటన మానవత్వాన్ని పరిమళింప చేసింది.ఙఞ్చట14- బాలల దినోత్సవాన్ని చాచా నెహ్రూకు జేజేలు పలుకుతూ స్థానిక చూలైలోని సెయింట్ జోసఫ్ బాలికల మహోన్నత పాఠశాలల్లో విద్యార్థులు నెహ్రూ ముఖ ఆకారంలో నిలుచుని కనువిందు చేశారు.ఙఞ్చట20- ప్రమాదంలో గాయపడి కొన ఊపిరితో ఉన్న ఓ కార్మికుడికి స్థానికంగా ఉన్న గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు గుండెకు అరుదైన చికిత్స అందించి పునర్జన్మ అందించారు. స్థానిక కేకే నగర్‌కు చెందిన కెఎల్ ధీరజ్ (05) ప్రపంచంలోని 79 దేశాల జాతీయ పతాకాలను నిమిషం వ్యవధిలో గుర్తించి గిన్నిస్ రికార్డులోకి ఎక్కి చరిత్ర సృష్టించాడు. డిసెంబర్: ఎగ్మూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో పుట్టిన రెండు రోజుల బిడ్డకు నోటిలోని 50 గ్రాముల గడ్డను అరుదైన శస్త్ర చికిత్సతో వైద్యులు తొలగించారు. మాతృదేవోభవ పూజలో మాతృమూర్తులకు కాళ్లు కడిగి తల్లి రుణం తీర్చుకున్న సంఘటన మానవత్వాన్ని చాటింది. 24 - క్రిస్మస్ను పురస్కరించుకుని నగరంలో ఓ బేకరీ దుకాణంలో మదురై ధర్మాసనం ఆకారంలో 8 అడుగుల పొడవు, 4 అడుగుల ఎత్తుతో 350 కిలోల బరువుగల కేక్‌ను తయారు చేశారు. -
‘ఆసరా’లో వింతలెన్నో!
‘ఆసరా’లో ఎన్నో వింతలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు లబ్ధిదారుల జాబితాలో తమ పేరు లేదని పలువురు ఆందోళన చెందుతుండగా.. మరోవైపు ఓ యువకుడికి వితంతు పింఛన్ మంజూరు చేశారు అధికారులు. ఇక పెన్షన్ కింద ఇచ్చిన రూ. 500 నోట్లను దుకాణాల్లో తీసుకోవడం లేదని తాడ్‌బిలోలికి చెందిన పలువురు లబ్ధిదారులు ఆ నోట్లను తిరిగి ఇచ్చేశారు. బాల్కొండలో గతనెల 8వ తేదీన ఎమ్మెల్యే చేతులమీదుగా పింఛన్ అందుకున్న లింబాద్రి పేరు ప్రస్తుత జాబితాలో లేకుండాపోయింది. వివరాలిలా ఉన్నాయి. పురుషుడికి వితంతు పెన్షన్.. ఎడపల్లి : పింఛన్ జాబితాల్లో విచిత్రాలు చోటు చేసుకున్నాయి. జాన్కంపేటలో ఇలాంటిదే చోటు చేసుకుంది. పురుషుడి పేరుతో వితంతు పెన్షన్ మంజూరు కావడంతో అందరూ అవాక్కవుతున్నారు. గ్రామానికి చెందిన గద్ద విజయ్ అనే వ్యక్తి పేరు ఆసరా పింఛన్ల జాబితాలో కనిపించింది. అయితే అది వింతువుల జాబితాలో ఉంది. ఆధార్ కార్డు నంబరుతో పాటు ఇంటి నంబరు సరిగానే ఉన్నాయి. ఇలా తప్పుడు పింఛన్ మంజూరు చేసిన అధికారులు తీరుపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు. అర్హులైనవారు కాళ్లరిగేలా తిరుగుతున్నా పింఛన్ ఇవ్వని అధికారులు.. ఇలా తప్పుడు పేర్లతో పింఛన్లు మంజూరు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పింఛన్ కోసం ఆత్మహత్యాయత్నం నిజాంసాగర్ : వికలాంగుడిగా ఉన్న తన కుమారుడికి పింఛన్ రాలేదన్న ఆవేదనతో శుక్రవారం ఓ తండ్రి ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలిలా ఉన్నాయి. సింగితం గ్రామానికి చెందిన పద్మ యాదగిరి కుమారుడు నర్సింగ్(10) వికలాంగుడు. పింఛన్ల జాబితాలో నర్సింగ్ పేరు లేదు. దీంతో ఆవేదన చెందిన యాదగిరి.. శుక్రవారం కిరోసిన్ డబ్బాతో గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నాడు. ఒంటిపై కిరోసిన్ చల్లుకొని నిప్పంటించుకోవడానికి యత్నించాడు. గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు అతడిని అడ్డుకొని సముదాయించారు. లింబాద్రికి పింఛన్ రాలేదు బాల్కొండ : గతనెల 8వ తేదీన ఎమ్మెల్యే చేతులమీదుగా పింఛన్ అందుకున్న లింబాద్రి పేరు ప్రస్తుత ఆసరా పథకం జాబితాలో లేకుండా పోయింది. జాబితాలో పేరు లేకపోవడంతో అధికారులు పింఛన్ ఇవ్వలేదు. వివరాలిలా ఉన్నాయి. ముప్కాల్ గ్రామానికి చెందిన ఈరవత్రి లింబాద్రికి చేతులు, కాళ్లు పనిచేయవు. మానసిక వైకల్యంతోనూ బాధపడుతున్నాడు. ఆయనను ఆసరా పథకానికి ఎంపిక చేసిన అధికారులు.. గతనెల 8వ తేదీన ఆసరా పథకం ప్రారంభం రోజున ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి చేతుల మీదుగా పింఛన్ అందించారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశానుసారం పింఛన్ అందిస్తున్నామని ప్రకటించారు కూడా. కానీ అంతలోనే అతడి పేరు జాబితాలోంచి మాయమైంది. శుక్రవారం గ్రామంలో పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జాబితాలో పేరు లేకపోవడంతో అతడికి పింఛన్ ఇవ్వలేదు. లింబాద్రికి సదరం సర్టిఫికెట్ లేకపోవడం వల్లే పెన్షన్ రాలేదని అధికారులు పేర్కొంటున్నారు. అయితే లింబాద్రి మానసిక వికలాంగుడు. మాటలు రావు. కాళ్లు కదలవు. తన చేతులతో ముద్దెడన్నం కూడా తినలేడు. అలాంటి వ్యక్తికి సదరం పేరుతో పింఛన్ ఇవ్వకపోవడం దారుణమని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ నోట్లు మాకొద్దు రెంజల్ : రూ. 500 నోట్లు తీసుకోవడానికి తాడ్‌బిలోలికి చెందిన పలువురు లబ్ధిదారులు తిరస్కరిస్తున్నారు. గ్రామంలో మూడు రోజులుగా పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారు. పింఛన్ కింద ఇచ్చిన రూ. 500 నోట్లను తీసుకుని లబ్ధిదారులు దుకాణాలకు వెళ్లగా.. వాటిని తీసుకోవడానికి దుకాణాల యజమానులు తిరస్కరిస్తున్నారు. నోట్లు 2005 సంవత్సరానికి ముందు ముద్రించి నవని చెప్పి తిరస్కరిస్తున్నారని పలువురు లబ్ధిదారులు పేర్కొంటున్నారు. 2005కు ముందు ముద్రించిన రూ. 500 నోట్లను బ్యాంకుల్లో తిరిగి ఇచ్చేయాలని గతంలో ఆర్బీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది. అయినా చాలా దుకాణాల్లో 2005కు ముందు ముద్రించిన రూ. 500 నోట్లను తీసుకోవడం లేదు. పింఛన్ల కింద పలువురు లబ్ధిదారులకు 2005కు ముందు ముద్రించిన నోట్లు వచ్చాయి. దుకాణాల్లో వాటిని తీసుకోకపోవడంతో లబ్ధిదారులు అధికారులను కలిసి ఆ నోట్లను మార్చుకుంటున్నారు. పింఛన్ ఇక రాదేమోనని.. కోటగిరి : ఆసరా కల్పించాల్సిన పింఛన్ ఉసురు తీస్తోంది. లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. పింఛన్ రాదేమోనన్న బెంగతో కొందరు గుండెపగిలి మరణిస్తున్నారు. చిక్కడ్‌పల్లికి చెందిన జింక పెద్దసాయిలు (68) అలాగే మరణించాడు. వివరాలిలా ఉన్నాయి. సాయిలుకు 10 గుంటల భూమి మాత్రమే ఉంది. అయితే అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తిగా నమోదయ్యాడు. దీంతో అతడి పేరు ఆసరా జాబితాలో లేకుండా పోయింది. అధికారులు ప్రకటించిన పింఛన్ మొదటి జాబితాలో పేరు లేకపోవడంతో సాయిలు ఆందోళనకు గురయ్యాడు. ఇక తనకు పెన్షన్ రాదేమోనని బాధపడ్డాడు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు అధికారులు, సర్పంచ్ చుట్టూ తిరిగాడు. గ్రామ పంచాయతీ వద్ద కాసేపు ధర్నా చేశాడు. తనకు పింఛన్ ఇప్పించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను వేడుకున్నాడు. రాత్రి ఇంటికి చేరి తొమ్మిది గంటలకు భోజనం చేశాడు. చాతిలో నొప్పి వస్తోందని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్ వచ్చేలోగానే సాయిలు మరణించాడు. -
ఆరు మాసాల్లోనే అద్భుతాలు చేయాలా?
పొన్నాల, దామోదర వ్యాఖ్యలపై అందోలు ఎమ్మెల్యే బాబూమోహన్ ఆగ్రహం జోగిపేట: ఆరు మాసాల్లో అద్భుతాలు చేయాలా! ఐదేళ్ల కోసం తమకు ప్రజలు పట్టం కట్టారనే విషయాన్ని ప్రతి పక్ష పార్టీలు గుర్తుంచుకోవాలని అందోలు శాసనసభ్యుడు బాబూమోహన్ పేర్కొన్నారు. బుధవారం జోగిపేట ఎంపీపీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జోగిపేటలో జరిగిన సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తదితరులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలను ఎమ్మెల్యే తిప్పి కొట్టారు. నియోజకవర్గానికి 60 వేల ఎకరాలు ఎక్కడి నుంచి తెస్తారని పొన్నాల ప్రశ్నించడం సిగ్గుచేటని, ఆయన మాదిరి ఎస్సీల భూములను లాక్కొని మాత్రం ఇవ్వమని, ప్రభుత్వ సొమ్ముతో కొనుగోలు చేసి ఇస్తామన్నారు. తెలంగాణ మేమిచ్చాం...మేం తెచ్చామంటున్న కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఇవ్వకుంటే భూస్థాపితమవుతామనే భయంతోనే ఇవ్వాల్సి వచ్చిందనే విషయాన్ని గమనించాలన్నారు. తెలంగాణపై నిజంగా ప్రేమ ఉంటే వందలాది మంది విద్యార్థులు, యువకులు అమరులు కాకముందే ఇవ్వాల్సి ఉండెనన్నారు. ఎన్నికల్లో ప్రజలు గట్టి తీర్పుఇచ్చినా కాంగ్రెస్ పార్టీలో మార్పురాలేదన్నారు. అసెంబ్లీలో లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి, అన్ని పార్టీలను మెప్పించి ఏకగ్రీవ తీర్మానంతో ఆమోదింపజేసుకున్న సీఎం కేసీఆర్ గురిచి మాట్లాడే అర్హత ఆ పార్టీకి లేదన్నారు. నాలుగున్నర సంవత్సరాల తర్వాత అభివృద్ధిపై మాట్లాడితే అందుకు తాము సిద్ధంగా ఉంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పార్టీలకతీతంగా పెన్షన్లు, రేషన్ కార్డులు తమ ప్రభుత్వం ఇస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనర్హులకే పెన్షన్లు ఇచ్చారన్నారు. భర్త ఉన్నా భార్యకు వితంతు పెన్షన్ ఇచ్చిన ఘునులు కాంగ్రెస్‌లో ఉన్నారన్నారు. ఈనెల 15లోగా రెండు నెలల పెన్షన్లను అందిస్తామన్నారు. రూ.540 కోట్లతో ఇంటింటికీ మంచినీటిని అందిస్తాం నియోజకవర్గంలో రూ.540 కోట్లతో ఇంటింటికి మంచినీరందిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి 100 లీటర్ల చొప్పున మంచినీటిని ఇస్తామని, ఇందుకు సంబంధించిన బిల్లు కూడా అసెంబ్లీలో ఆమోదం పొందిందన్నారు. కాకతీయ మిషన్ పేరుతో చేపట్టనున్న చెరువుల పూడిక తీత పనులకు గాను నియోజకవర్గానికి రూ.400 నుంచి రూ.600 కోట్ల వరకు కేటాయింపులు జరిగాయన్నారు. మొదటి విడతగా రూ.13.50 కోట్లు విడుదలైనట్లు వివరించారు. సమావేశంలో మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి, ఎంపీపీ అధ్యక్షురాలు విజయలక్ష్మి, డీసీసీబీ మాజీ ఉపాధ్యక్షులు జైపాల్‌రెడ్డి తదితరులు తదితరులు పాల్గొన్నారు. -
మన కళ్లముందే మరో అద్భుత ప్రపంచం
రేపు ప్రపంచ పర్యాటక దినం ప్రపంచంలో ఏడు అద్భుతాలు ఉన్నాయనేది ఒక జాబితా మాత్రమే! కానీ కంటిని కట్టడి చేసేవి, విస్మయపరిచే వింతలు భూమి నిండా ఉన్నాయి. అలాంటి వాటిని కళ్లారా వీక్షించినప్పుడు జన్మ ధన్యమైందని భావిస్తుంటాం. ఇక ఆ తర్వాత జీవితం లేకపోయినా పర్వాలేదనిపించే అనుభూతిలో మునిగిపోతాం. వందల జలపాతాలు కలిసికట్టుగా ఒకేసారి దుమికే అద్భుతం, వేల అడుగుల లోతున గల గుహలోకి వేలాడుతూ వెళ్లే ధైర్యం, భూగర్భంలో ప్రయాణ మార్గాలు, ప్రశాంతతకు కొండంత ప్రతిమ, ఆధ్యాత్మికతకు అలనాటి వైభవం.. చూసినకొద్దీ చూడాలనిపించేవి. ఒక్కసారి చూస్తే చాలు అనిపించే అలాంటి కొన్ని అద్భుతాల వివరాలు... ప్రపంచ పర్యాటక దినం సందర్భంగా ఈ వారం... లోతైన అద్భుతం: క్రుబేరా గుహ! గుహల సౌందర్యం, వాటి అద్భుతం గురించి మనకు తెలియంది కాదు. మనదగ్గర బొర్రాగుహలు, ఎలిఫెంటా, అజంతా గుహలు.. ఎన్నో లెక్కపెట్టి మరీ ఈ అద్భుతాల గురించి వివరిస్తారు. కానీ, ప్రపంచంలోనే అతి లోతైన గుహగా పేరుపొందిన క్రుబేరా గుహ 2,197 మీటర్లు అంటే సుమారు 7,208 అడుగుల లోతు వరకు ఉంటుంది. భూమి మీద అత్యంత లోతైన గుహగా పేరొందిన క్రుబేరా పై భాగంలో నీరు ఉంటుంది. భూ పొరలలో వచ్చిన మార్పుల వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి. జార్జియా దేశంలోని అబ్ఖజియా ప్రదేశంలో 1960లో ఈ గుహలను గుర్తించారు. రష్యా నుంచి అబ్ఖజియా ప్రదేశం దగ్గర. అందుకని మాస్కో చేరుకొని అక్కడ నుంచి విమానమార్గం లేదా బస్సుల ద్వారా అబ్ఖజియా ప్రాంతానికి చేరుకోవచ్చు. సెప్టెంబర్-అక్టోబర్ మాసపు రోజులు ఇక్కడ చల్లగానూ, వాతావరణం అనువుగానూ ఉంటుంది. భూగర్భ ప్రయాణం: లండన్ మన దగ్గర చిన్నా పెద్ద సబ్ వే (భూగర్భ దారులు)లలో నుంచి కాలినడకన అటూ ఇటూ వెళ్లే ఉంటారు. వాటికే అబ్బురపడి ఉంటారు. లండన్‌లో భూగర్భ ప్రయాణం చేస్తే మనిషి తెలివికి ‘ఔరా’ అనిపించకమానదు. ఇక్కడి భూగర్భ మెట్రో రైలు సిస్టమ్ ప్రపంచంలోనే అత్యద్భుతమైనదిగా పేరొందింది. లండన్‌లో అతి ప్రాచీన భూగర్భ మెట్రో రైలు వ్యవస్థ 1863లోనే ప్రారంభమైంది. నేటికి లండన్‌లో 270 అండర్‌గ్రౌండ్ స్టేషన్లు ఉన్నాయి. ఒక్కో స్టేషన్‌కి 260 మంది, మొత్తంగా 19,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. భూగర్భ మార్గంలో 4,134 స్టేషన్లు, 426 ఎస్కలేటర్లు, 164 లిఫ్ట్‌లు ఉన్నాయి. ట్యూబ్లలో రైలు వేగం 33 కి.మీ. అత్యంత రద్దీగల స్టేషన్‌గా ‘వాటర్ లూ’ పేరొందింది. ఇక్కడ ప్రతి మూడు గంటల వ్యవధిలో 57,000 వేల మంది ప్రయాణీకులు తమ తమ గమ్యస్థానాలకు ఈ భూగర్భదారుల గుండానే ప్రయాణమవుతుంటారు. మార్చ్-మే నెలలో వసంత రుతువు చివరి రోజులు. సెప్టెంబర్ - నవంబర్లోనూ వాతావరణం అనువుగా ఉంటుంది. ఆ సమయంలో ఇక్కడ పర్యాటకుల సంఖ్య అధికంగా ఉంటుంది. కొండంత ఎత్తు: లేషన్ జెయింట్ బుద్ధ అమెరికాలోని లిబర్టీ ఆఫ్ స్టాట్యూ మనకు కొట్టిన పిండి. జపాన్‌లోని బుద్ధుని ప్రతిమ, మాస్కోలో పీటర్ స్టాట్యూ ఎత్తును చూసి మనిషి అపారజ్ఞానానికి అబ్బురపడుతూనే ఉన్నాం. సుఖాసనంలో కూర్చున్నట్టుగా ఉన్న ఈ బుద్ధుని ప్రతిమ కోసం ఏకంగా కొండ రూపునే మార్చారు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనాగా పేరొందిన ఆ దేశంలోనే ‘ఎమీ’ పర్వత రాయిని క్రీ.శ. 713 వ సంవత్సరంలో ఇలా బుద్ధుని ప్రతిమగా తొలిచారు. ప్రపంచంలోనే అతి పెద్ద బుద్ధ రాయిగా పేరొందింది ఇది. ప్రాచీన సంపదకు ఆనవాలుగా నిలిచన ఈ ప్రాంతాన్ని పరిరక్షించడానికి యునెస్కో 1996లో హెరిటేజ్ సైట్లో చేర్చింది. బుద్ధుని పాదాల చెంతకు చేరుకోవాలంటే పడవలలో ఇక్కడి క్వింగీ నదిని దాటాలి. వేసవిలో ‘ఎమీ’ పర్వతం మీద వర్షాల వల్ల వాతావరణం చల్లగా ఉంటుంది. చలికాలంలో ఆహ్లాదంగా ఉంటంది. హోటళ్లు, విమానయాన టికెట్లు ఈ కాలంలో ఆఫర్లు ప్రకటిస్తాయి. అక్టోబర్ - డిసెంబర్ వరకు అత్యల్ప ఉష్ణోగతలు నమోదవుతాయి. జలపాతాల పెద్ద: ఇగుఅజు నయాగరా, విక్టోరియా జలపాతాల అద్భుతాన్ని తిలకించకపోయినా వినే ఉంటారు. కానీ ‘ఇగుఅజు’ జలపాతం గురించి విన్నారా? ‘ఇగూజు’ అని కూడా పిలిచే ఈ జలపాతం బ్రెజిల్, అర్జెంటీనా దేశాల మధ్యన ఉంది. రెండు దేశాల ప్రజలకు గర్వకారణంగా నిలిచే ఈ జలపాతం దాదాపు 275 చిన్నా పెద్ద జలపాతాల కలయికతో విస్మయపరుస్తుంటుంది. 82 మీటర్ల ఎత్తు, 150 మీటర్ల వైశాల్యం గల ఈ జలపాతం సెకనుకు 1000 ఘనపు మీటర్ల వేగంతో దుముకుతుంది. పర్యాటకులు బ్రెజిల్ వెళ్లినా, అర్జెంటినా వెళ్లినా ఈ జలపాతాన్ని రెండు విధాలుగా సందర్శించవచ్చు. బ్రెజిల్ వైపు జలపాతానికి చేరువలో వెళ్లేందుకు వంతెనలు, జెట్ బోట్స్, హెలికాఫ్టర్ సదుపాయాలు ఉంటే, అదే అర్జెంటీనా వైపుగా వెళితే బ్రెజిల్ కన్నా మరింత దగ్గరగా వంతెన మార్గాలు ఉన్నాయి. జలపాతం చుట్టుపక్కల దాదాపు రెండు వేల ఔషధ మొక్కలు, 400 రకరకాల పక్షులు, 70 రకాల క్షీరదాలను గుర్తించారు. ఈ అద్భుతానికి గులాము అయిన యునెస్కో 1986లో వారసత్వ సంపద జాబితాలో చేర్చింది. డిసెంబర్-మార్చ్ వరకు ‘ఇగూజు’లో వేసవి సమయం. జూన్ - ఆగస్టు వరకు చలికాలం. అందుకే పర్యాటకులు ఈ సమయంలో జలపాత వీక్షణకు ఆసక్తి చూపుతారు. సెప్టెంబర్-అక్టోబర్ నెలలు ఇక్కడి ఉష్ణోగ్రతలు అత్యంత అనుకూలంగా 28 డిగ్రీల సెల్సియస్‌లో ఉంటాయి. చారిత్రక వైభవం: అంకోర్ వాట్! ప్రపంచంలోనే గొప్ప చారిత్రక కట్టడంగా తాజ్‌మహల్ పేరొందింది. దీని తర్వాత ప్రాచీన వైభవాన్ని కళ్లకు కట్టే కట్టడం ‘అంకోర్ వాట్’ దేవాలయం. కాంబోడియా దేశంలో గల ఈ కట్టడం తొమ్మిదవ శతాబ్దంలో మొదలై 15వ శతాబ్దం వరకు ఖెమెర్ రాజుల కాలంలో నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. 400 చదరపు కిలోమీటర్లలో దేవాలయ సముదాయాలను ఏర్పాటు చేశారు. ఈ దేవాలయం పూర్తవడానికి దాదాపు 600 ఏళ్లు పట్టడంతో ఆయా కాలాలకు తగ్గ మార్పులతో విభిన్న శైలులతో ఆకట్టుకుంటుంది. ఖెమెర్ రాచ వైభవం ఈ దేవాలయ గోడల మీద అణువణువునా... నాటి సాంస్కృతిక సంప్రదాయ శైలులను అడుగడుగునా చూడవచ్చు. ఆగ్నేయాసియాలో ఉండే కాంబోడియా మన దేశానికి సుమారు మూడు వేల కి.మీ.దూరంలో ఉంది. విమాన ప్రయాణం రాను పోను టిక్కెట్ ధరలు 50 వేల రూపాయలకు పైగా ఉంటుంది. రాబోయే రెండు నెలలలో వర్షాలు తగ్గి, వాతావరణం పొడిగా ఉండే ఈ నెలలు ఇక్కడి దేవాలయాల సందర్శనకు అనువైనవి. -
గ్లాస్ టైల్స్.. హల్చల్
సాక్షి, హైదరాబాద్: ‘శిలలపై శిల్పాలు చెక్కినారు’ అని ఆత్రేయ ఏ టైంలో అన్నాడో కానీ, వ్యాపారులు దానికి కాస్త టెక్నాలజీ జోడించి వింతలు సృష్టిస్తున్నారు. ఇప్పటివరకు టైల్స్ అంటే ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తాయనే వరకే మనకు తెలుసు. కానీ, డీ క్రిస్టల్ గ్లాస్ టైల్స్ మాత్రం అక్కడికే పరిమితం కావట్లేదు. అద్దంలా మారుతూ అద్భుతాలు సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌లో డీ క్రిస్టల్ గ్లాస్ టైల్స్ సప్లయర్ అయిన కాచిగూడలోని హోమ్ 360 డిగ్రీ యజమాని శ్రీనాథ్ రథి ‘సాక్షి రియల్టీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే.. పూర్తిగా గ్లాస్‌తో తయారవడమే డీ క్రిస్టల్ గ్లాస్ టైల్స్ ప్రత్యేకత. 6 ఎంఎం, 8 ఎంఎం మందంతో ఉండి ఆధునిక టెక్నాలజీ సహాయంతో ఫినిషింగ్ కావటం మరో ప్రత్యేకత. అంతేకాదు.. మనకు నచ్చిన ఫొటోలు, చిత్రాలను ఈ టైల్స్‌పైన ప్రింట్ చేసుకోవచ్చండోయ్. వీటిని ఎక్కువగా పబ్బులు, రెస్టారెంట్లు, కార్పొరేట్ ఆఫీసుల్లో డెకొరేటివ్ కోసం వాడతుంటారు. ఇంటి విషయానికొస్తే.. చిన్నపిల్లల గది, వంట గది, లివింగ్ రూముల్లో ఉపయోగిస్తారు. చిన్న పిల్లల గదుల్లో వాడే ఈ టైల్స్‌పై స్పైడర్‌మ్యాన్, చోటా భీం, మిక్కీ మౌజ్ వంటి పిల్లలకు ఇష్టమైన బొమ్మలను ముద్రించుకోవచ్చు. అలాగే వంట గదుల్లో అయితే కూరగాయలు, పండ్ల వంటి మనకిష్టమైన ఫొటోలను ప్రింట్ చేసుకోవచ్చు. డీ క్రిస్టల్ గ్లాస్ టైల్స్ ఢిల్లీ నుంచి దిగుమతి అవుతాయి. వీటిలో 300/600 ఎంఎం నుంచి 600/1,800 ఎంఎం వరకు రకరకాల సైజుల్లో, అన్ని రకాల రంగుల్లో లభ్యమవుతున్నాయి. ధర విషయానికొస్తే చ.అ.కు రూ.800-1,600 వరకు ఉంది. డీ క్రిస్టల్ గ్లాస్ టైల్స్ అన్ని రకాల వాతావరణ పరిస్థితులను, వేడిని తట్టుకుంటాయి. జీవీటీ, పీజీవీటీ వంటి టైల్స్ కూడా: సాధారణంగా చాలా మంది బేసిక్ విట్రిఫైడ్ టైల్స్‌ను వాడుతుంటారు. వీటి ధర రూ.40-50 మధ్య ఉంటుంది. అయితే వీటిని షాపింగ్ మాళ్లలో వాడలేం. ఎందుకంటే కొంతకాలానికి ఈ టైల్స్‌పై ఉండే లేయర్స్ తొలగిపోతాయి. పాదాల ముద్రలూ పడతాయి. అందుకే దీని స్థానంలో డబుల్ చార్జ్ టైల్స్‌ను వాడుతున్నారు. ఈ టైల్స్ పైన 2 ఎంఎం-3 ఎంఎం కోటింగ్ ఉంటుంది. దీంతో టైల్స్ అందంగా కనిపిస్తాయి. ప్రస్తుతం నగరంలో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ (జీవీటీ), పాలిష్డ్ విట్రిఫైడ్ టైల్స్ (పీజీవీటీ) హల్చల్ చేస్తున్నాయి. అన్ని రకాల రంగుల్లో లభ్యమయ్యే వీటిని వాణిజ్య సముదాయాలు, ఆఫీసులు, షాపింగ్ మాళ్లలో వినియోగించుకోవచ్చు. జీవీటీలో 600/600 ఎంఎం నుంచి మీటర్/ మీటర్ సైజు వరకున్నాయి. వీటి ధరలు ఆయా సైజులను బట్టి చ.అ.కు రూ.60- రూ.170 వరకున్నాయి. ఎక్కువ విస్తీర్ణం ఉండే బ్యాంక్వెట్ హాళ్లు, రెస్టారెంట్లలో వీటిని వాడతారు. బాత్రూమ్, బాల్కనీ వంటి తక్కువ విస్తీర్ణం ఉండే ప్రాంతాల్లో వాడేందుకు ప్రత్యేకమైన టైల్స్ కూడా ఉన్నాయి. వీటి ధర చ.అ.కు రూ.30-45 మధ్య ఉంది. విదేశీ టైల్స్ కూడా: స్పానిష్, ఇటాలియన్, చైనా దేశాల టైల్స్‌తో పాటు నిట్కో, సొమానీ, సింపోలో, మోటో వాల్ టైల్స్‌ను కూడా సరఫరా చేస్తున్నాం. మన దేశంలో ఉండే 600/600 ఎంఎం టైల్ బరువు సుమారుగా 7.5 కిలోలుంటే.. ఇటాలియన్ టైల్ అయితే దాదాపు 10 కిలోలుంటుంది. ఇవి బరువులోనే కాదు దృఢత్వంలోనూ పటిష్టమైనవి. గుజరాత్లో 300కు పైగా టైల్స్ తయారీ పరిశ్రమలున్నాయి. అదే మన దగ్గరైతే విజయవాడ, సామర్లకోట వంటి సుమారు 5 ప్రాంతాల్లోనే టైల్స్ తయారీ యూనిట్లున్నాయి. గతేడాది రూ.10.5 కోట్లను సాధించిన కంపెనీ వార్షిక టర్నోవర్ ఈ ఏడాది 15 కోట్లకు చేరుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. -
సముద్ర తీర ప్రాంతాల సందర్శన
పాఠక పర్యటన మూడు సముద్రాలు కలిసే చోట స్నానాలు... మంచుకొండలలో అద్భుతాలు... ‘పచ్చని తరులు నెలకొన్న గిరులు మండువేసవిలో చల్లందనాన్ని... అలలు లేని సముద్రంపై లాంచీలలో విహారం ఆహ్లాదాన్ని ... ఆలయాల సందర్శన ఆధ్యాత్మికత సౌరభాలను ఎదనిండా నింపింది’ అంటూ కొచ్చిన్ నుంచి కన్యాకుమారి వరకు సాగిన తమ ప్రయాణపు అనుభూతుల గురించి వివరిస్తున్నారు హైదరాబాద్ వాస్తవ్యులైన వీరయ్యకొంకల. మండువేసవిలో చల్లదనాన్ని ఆస్వాదించడానికి విహారయాత్ర చేద్దామని మిత్రులు జె.కె శ్రీనివాస్, కె.భరత్‌ల కుటుంబాలతో కలిసి రెండు నెలల ముందుగానే ప్లాన్ చేశాం. దీని వల్ల మొత్తం తొమ్మిది రోజులలో 14 ముఖ్య ప్రదేశాలను చూడగలిగాం. దాదాపు 4,220 కి.మీ... కొచ్చిన్ నుండి చెన్నై వరకు ఉన్న అన్ని సముద్ర తీర ప్రాంతాలను చూసి ఎంజాయ్ చేశాం. రాత్రి హైదరాబాద్ నుండి బయల్దేరి మరుసటి ఉద యం 10 గంటలకు కోయంబత్తూరులో రైలు దిగాం. ఘాట్రోడ్లో దారి కిరువైపుల ఎత్తై చెట్లు, వంపుల రోడ్లు, సన్నగా ఉన్న సింగిల్ రోడ్లో మా ప్రయాణం సాగింది. పచ్చందనాల ఊటి... ముందుగా ఊటి చేరుకున్నాం. తమిళనాడులో నీలగిరి పర్వతాలలో ఉన్న ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం ఊటి. ఎటు చూసినా పచ్చదనం మంత్రముగ్ధులను చేశాయి. ఇక్కడ భోజనాల సమయంలో తాగడానికి వేడినీళ్ళు ఇచ్చారు. ముందు ఆశ్చర్యం అనిపించినా, వేసవిలోనూ చల్లగా ఉండే వాతావరణం అబ్బురమనిపించింది. అలలు లేని సముద్రం.. రెండవరోజు ఉదయం కొయంబత్తూరుకు వెళుతూ మధ్యలో తేయాకు తోటలను సందర్శించాం. కోయంబత్తూరు నుండి ఎర్నాకుళం చేరుకుని, సాయంకాలం కొచ్చిన్ ఓడరేవుకు చేరుకున్నాం. అలలు లేని గంభీర సముద్రం.. అక్కడక్కడా ఆగి ఉన్న పెద్ద పెద్ద ఓడలను చూస్తూ ఎంజాయ్ చేశాం. ద్వీపాల సముదాయం... మూడవరోజు ఉదయం అలెప్పీ చేరుకున్నాం. ఇక్కడంతా సముద్రం బ్యాక్ వాటర్, చిన్న చిన్న ద్వీపాల సముదాయాలతో ఉంటుంది. నీటిలో అక్కడక్కడా లాంచీల స్టాండులు, చిన్న చిన్న గ్రామాలు... వింతగా అనిపించాయి. అలెప్పీ బీచ్‌కు వెళ్లి 4 గంటలకు పైగా సముద్రంలో ఎంజాయ్ చేసి తిరిగి ఎర్నాకుళం చేరుకున్నాం. రాత్రి కి తిరువనంతపురం బయల్దేరాం. పద్మనాభుని సందర్శన... నాలుగవ రోజు కేరళలోని తిరువనంతపురం లో పద్మనాభస్వామి ఆలయానికి వెళ్లి, అటు నుంచి 10 కి.మీ దూరంలో కోవలం బీచ్‌లో గంటల తరబడి చల్ల చల్లగా ఎంజాయ్ చేశాం. పడమటి సింధూరం కన్యాకుమారి... భారతదేశానికి దక్షిణ దిక్కున చిట్టచివరి ప్రదేశమైన కన్యాకుమారి ప్రకృతి సిద్ధమైన అద్భుతం. ఇక్కడ సూర్యోదయం అత్యద్భుతంగా ఉంటుంది. ఇక్కడ అరేబియా, బంగాళాఖాతం, హిందూమహాసముద్రం కలిసే చోట అందరం స్నానాలు చేశాం. ఆసియాలో అతి పెద్ద విగ్రహం తిరుళ్ళువార్ సముద్రంలో 133 అడుగుల ఎత్తులో ఉంటుంది. దానికి దగ్గరలోనే వివేకానంద రాక్ మెమోరియల్ ఉంది. అక్కడ నుంచి మధురై బయల్దేరాం. పవిత్ర నగరం మదురై... తమిళనాడులోని మదురై నగరంలో మీనాక్షి అమ్మవారిని దర్శించుకొని, అనంతరం ట్రావెల్ బస్సులో రామేశ్వరంకు ప్రయాణించాం. తమిళనాడులోని ముఖ్య పట్టణాలలో రామేశ్వరం ఒకటి. శ్రీలంకకు అతి దగ్గరగా ఉన్న ఈ పట్టణంలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన రామనాథస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం ఎంతో విశాలంగా అద్భుతంగా ఉంటుంది. మేమంతా సముద్రంలో స్నానాలు చేసి, ఆలయానికి చేరుకున్నాం. మేఘాలలో విహారం... కొడెకైనాల్! ఏడో రోజు ఉదయం ట్రావెల్ బస్సులో కొడెకైనాల్ బయల్దేరాం. ఘాట్‌రోడ్డు మీద ప్రయాణం.. కొంతసేపు ఎండకాస్తే, మరికొంతసేపు వానజల్లులతో తడిసిపోతున్న కొండకోనలు కనువిందుచేశాయి. మే చివరి వారంలో.. అదీ మండువేసవిలో... స్వెటర్లు, మంకీ క్యాపులు ధరించినా చలికి తట్టుకోలేకపోయాం. మధ్య మధ్యలో జలపాతాలు.. వాటి పరిసరాలలో వేడి వేడి పదార్థాలు తిని చలి నుంచి సాంత్వన పొందాం. రైలులో రాత్రికి చెన్నై బయల్దేరి, ఎనిమిదవ రోజు ఉదయం చెన్నై నుండి 70 కి.మీ దూరంలో కంచీపురం చేరుకున్నాం. అక్కడ కంచికామాక్షి, ఏకాంబరేశ్వర, కంచి మఠం దర్శించుకొని, కంచి పట్టుచీరల సొగసు, మెరీనా బీచ్ అందాలను గుండెల్లో నింపుకుని, రాత్రి రైలులో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యాం. -
ఒబామానే మెప్పించాడు!
విజయం అద్భుతాలు సృష్టించడానికి వయసుతో పని లేదు. ఆ విషయం యూసుఫ్ బాతాని చూస్తే తెలుస్తుంది. పుట్టుకతోనే బధిరుడైన ఈ చిన్నారి చదువులో అందరినీ తోసిరాజన్నాడు. అమెరికా అధ్యక్షుడు ఒబామాతోనే శభాష్ అనిపించుకున్నాడు. కేరళలోని కోజికోడ్‌కు చెందిన యాకూబ్ బాతా... ఉద్యోగ నిమిత్తం భార్యతో సహా అబుదబీ వెళ్లి స్థిరపడ్డారు. అక్కడ వారికి యూసుఫ్ జన్మించాడు. వంశోద్ధారకుడు పుట్టాడన్న వారి ఆనందం మీద... యూసుఫ్ లోని వినికిడి లోపం నీళ్లు చల్లింది. పిల్లాడు వినలేడని తెలుసుకున్న ఆ దంపతులు కుమిలిపోయారు. అయినా అతడికి జీవితంలో ఉన్నత స్థితికి చేరేలా పెంచాలన్న ఉద్దేశంతో... అందుకు సాయం చేసే సంస్థ కోసం వెతికారు. అమెరికాలోని ‘సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద డెఫ్’ వారి ఆశను నెరవేర్చింది. యూసుఫ్ బాధ్యతను తీసుకుంది. ఆ సంస్థ ద్వారా అక్షరాలు దిద్దిన యూసుఫ్... చూస్తూండ గానే ఎవరూ అందుకోలేని స్థాయికి చేరుకున్నాడు. చదువులో అద్భుతమైన ప్రతిభను కనబరచి ఇటీవలే ‘ఔట్‌స్టాండింగ్ అకడమిక్ అచీవ్మెంట్ అవార్డు’ను అందుకున్నాడు. అతడి ప్రతిభ గురించి తెలుసుకున్న ఒబామా ప్రశంసలు కురిపిస్తూ స్వయంగా యూసుఫ్‌కి ఉత్తరం రాశారు. జీవితంలో ఇంకా ఇంకా ఎదగాలని ఆశీర్వదించారు. -
అంధులు అద్భుతాలు సృష్టిస్తారు..
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ : అవకాశాలు కల్పిస్తే అంధులు ఇతరులు ఎవ్వరికీ తీసిపోరని అద్భుతాలు సృష్టించడంలో సమర్థతను చాటుకుంటారని జిల్లా విద్యాశాఖాధికారి పి. మదన్మోహన్ అన్నారు. శుక్రవారం నల్లగొండ అంధుల పాఠశాలలో జరిగిన స్వపరిపాలన దినోత్సవంలో ఆయన మాట్లాడారు. చిన్నారుల బోధనను చూసి అభినందించారు. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. పదవ తరగతి విద్యార్థులకు హాల్‌టికెట్లను అందజేశారు. ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. డీఈఓ కె. వరుణ్, ఎంఈఓగా పి. సంఘవి, హెచ్ఎంగా బి. గణేష్, వ్యవహరించారు. డ్వాబ్ ప్రధాన కార్యదర్శి చొక్కారావు పాల్గొన్నారు. -
సేమ్ 2 సేమ్
-
ప్రచార గారడి
ఉదయగిరి, న్యూస్‌లైన్: శూన్యంలో నుంచి అద్భుతాలు సృష్టిస్తామని మభ్యపెట్టడంలో మన పాలకులు మాంత్రికులను మించిపోతున్నారు. ఏమీ చేయకుండానే అది చేశాం.. ఇది చేశామంటూ గొప్పలు ప్రచారం చే స్తున్నారు. సంక్షేమ పథకాల అమలును నెలల తరబడి నిలిపేసి ప్రచార వేదికల కోసం ఆరాటపడుతున్నారు. మూడు నెలల క్రితం మంజూరైన అరకొర పింఛన్లను రచ్చబండలో ఆర్భాటంగా పంపిణీ చేసేందుకు వాయిదా వేశారు. మహానేత డాక్టర్ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను తూ.చ.తప్పకుండా అమలు చేస్తామని ప్రకటించిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఆది నుంచి మా ట తప్పుతూనే ఉన్నారు. ఏడాదిన్నర క్రితం నిర్వహించిన రచ్చబండ సందర్భంలో ఆయన చెప్పిన గొప్పలకు తమ కష్టాలు తీరిపోతాయని ప్రజలు భ్రమపడ్డారు. జిల్లా వ్యాప్తంగా 70 వేల మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే నెలలు గడుస్తున్నా పింఛన్ల పంపిణీ మంజూరు కాలేదు. పంచాయతీ ఎన్నికల సమయంలో పింఛన్ల పంపిణీని తెరపైకి తెచ్చారు. జూలైలో కేవలం 30 వేల మందికే మంజూరు చేశారు. అయినా కొంత మంది కైనా లబ్ధి చేకూరుతుందని ప్రజలు సర్దుకుంటే.. ఇప్పటి వరకు వాటి పంపిణీ చేపట్టలేదు. త్వరలో జరగనున్న రచ్చబండలో వాటిని ఆర్భాటంగా పంపిణీ చేయాలని నిర్ణయించడంతో లబ్ధిదారులకు పడిగాపులు తప్పడం లేదు. అస్తవ్యస్తంగా పింఛన్ల పంపిణీ కొత్తగా పింఛన్ మంజూరైన వారి కష్టాలు ఇలా ఉంటే, ఇప్పటికే పొందుతున్న వారి బాధలు మరోలా ఉన్నాయి. మహానేత వైఎస్సార్ హయాంలో ప్రతి నెలా 1వ తేదీన టంఛన్‌గా పింఛన్ పొందారు. ఆదివారమైనా, సెలవైనా, పండగైనా పింఛన్ల పంపిణీ మాత్రం కొనసాగేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పదో తేదీ వస్తున్నా జిల్లాలోని పలు ప్రాంతాల్లో లబ్ధిదారులకు ఇంకా పింఛన్ అందలేదు. నిత్యం వృద్ధులు, వికలాంగులు, వితంతవులు పింఛన్ల కోసం పంచాయతీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే మూడు నెలలకోసారి పింఛన్ పంపిణీ జరుగుతుండటం మన పాలకుల తీరుకు నిదర్శనం. -
విడ్డూరం: వింతలు.. విశేషాలు
తెలివి తెల్లారినట్టే ఉంది! జపాన్‌కి చెందిన కేసుకి జినుషీ అనే ఫొటోగ్రాఫర్, గాళ్‌ఫ్రెండ్ లేదని బాధపడే కుర్రాళ్లకు ఆ బెంగను తీరుస్తానంటూ ఓ ప్రకటన చేశాడు. క్యూ కట్టిన కుర్రాళ్లకు అతడు చూపిన పరిష్కారం ఏమిటో తెలుసా! కుడి చేతి మీది వెంట్రుకలన్నీ షేవ్ చేసేశాడు. మాయిశ్చరయిజర్ రాసి నునుపుగా చేశాడు. గోళ్లకు నెయిల్ పాలిష్ వేశాడు. తినమంటూ ఓ బిస్కట్ను ఆ చేతిలో పెట్టి, తింటుంటే ఫొటో తీశాడు. దాన్ని చూపించి... ‘చూడండి, మీ గాళ్‌ఫ్రెండ్ మీకు తినిపిస్తున్నట్టే’ లేదూ, ఈ చేత్తో మీకు నచ్చినవి చేసి మీరే ఫొటోలు తీసుకోండి, మీ గాళ్‌ఫ్రెండే చేసినట్టు ఫీలవండి’ అని సలహా కూడా ఇచ్చాడు. ఈ టెక్నిక్ నేర్చుకోవడానికి యువకులు ఎగబడుతున్నారు. ఇదేం ఆనందమో ఏమో! నమ్మకమే అతడి ఆదాయం! గతంలో అమెరికాకు చెందిన ఓ డాక్టర్ చేతి గీతల్ని మారుస్తున్నాడని చదివాం. కానీ చైనాకు చెందిన మియాన్ ఏకంగా ముఖాల్నే మార్చేస్తున్నాడు. కనుబొమలు లావుగా ఉంటే ఆర్థికంగా కలసిరాదని నమ్ముతారు కాబట్టి వాటిని సన్నగా చేస్తున్నాడు. పలుచగా ఉంటే అదృష్టం అంతంత మాత్రమే అంటారు కాబట్టి అవి లేనివారికి మొలిపించేస్తున్నాడు. ముక్కు సూటిగా ఉంటే అదృష్టం కాబట్టి ముక్కును ప్లాస్టిక్ సర్జరీ ద్వారా చెక్కేస్తున్నాడు. బండ పెదవులు అదృష్టాన్ని దూరం చేస్తాయి కాబట్టి సర్జరీతో చిన్నవిగా చేసేస్తున్నాడు. పుట్టుమచ్చలు పెట్టేస్తున్నాడు. ఉన్న మచ్చలు తీసేస్తున్నాడు. ఇలా ఈ ప్లాస్టిక్ సర్జన్గారు ముఖాలని ఇష్టం వచ్చినట్టు మార్చి పారేస్తున్నాడు. అందుకోసం భారీగానే వసూలు చేస్తున్నాడు. ఇచ్చేవాళ్లుంటే తీసుకోవడానికేంలెండి! లాభం కావాలంటే... డైపర్ వేయాలి! లాభాలను పెంచుకోవడానికి ఏవేవో ప్లాన్లు వేస్తుంటారు కంపెనీ యజమానులు. ఉద్యోగులతో ఓవర్ టైమ్ చేయిస్తారు. టైమింగ్స్ మార్చేస్తుంటారు. లీవులు క్యాన్సిల్ చేస్తారు. లంచ్, టిఫిన్ సమయాల్లో కోత విధిస్తారు. ఇవన్నీ చాలామంది చేసేవే. కానీ కొరియాలోని ఓ కంపెనీ మాత్రం విచిత్రమైన పని చేసింది. హోండురాస్ ప్రాంతంలో ఉన్న యూంగ్షిన్ ఎలక్ట్రికల్ కంపెనీలో దాదాపు మూడువేల ఐదు వందల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారందరినీ ఆఫీసులకు డైపర్లు వేసుకు రావాలని ఈ మధ్య హుకుం జారీ చేసింది యాజమాన్యం. దాంతో అందరూ షాక్ తిని, ఇదేం రూలంటూ నిలదీశారు. బాత్రూములకంటూ అటూ ఇటూ తిరుగుతుంటే టైమ్ వేస్టవుతోంది, ఆ టైమును కూడా మిగుల్చుకుంటే ఉత్పత్తి పెరుగుతుంది అంటూ విచిత్రమైన లాజిక్ చెప్పింది. ఉద్యోగులకు తిక్క రేగి లేబర్ మినిస్టర్‌కి కంప్లయింట్ చేశారు. ప్రస్తుతం ఎంక్వయిరీ జరుగుతోంది. ఎంత లాభాలు ఆర్జించాలంటే మాత్రం ఇలా హక్కుల్ని కాలరాయడమేంటంటూ పలువురు తిడుతున్నారు. తిట్టకేం చేస్తారు... ఇలాంటి తింగరి రూల్స్ పెడితే! ఒళ్లు చీరేసే పండుగ పండ గను ఎలా చేసుకుంటారు? కొత్త బట్టలు వేసుకుంటారు. పిండి వంటలు చేసుకు తింటారు. విందులు వినోదాల్లో మునిగి తేలుతారు. కానీ, ఇండోనేసియా వారు రక్తాలు వచ్చేలా కొట్టుకుంటారు. వింతగా ఉన్నా ఇది నిజం. ఇండోనేసియాలో మొరెల్లా, మమలా అనే రెండు గ్రామాలున్నాయి. ఈ రెండు ఊళ్ల వారికీ ఎంతో ముఖ్యమైన పండుగ... పుకుల్ సపు. రంజాన్ నెల చివరి రోజున చేసుకుంటారు దీన్ని. ఆ రోజున స్నానాలు చేసి, ఊళ్లోవాళ్లంతా ఓ విశాల ప్రదేశానికి చేరుకుంటారు. యువకులంతా ఇద్దరిద్దరిగా విడిపోయి, వెదురు పుల్లలతో ఒకరినొకరు కొట్టుకోవడం మొదలెడతారు. ఊరి పెద్దలు వరుసగా కూచుని... ఎవరికీ పెద్ద పెద్ద గాయాలు కాకూడదని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అందరూ నీరసించిపోయే వరకూ అలా కొట్టుకుంటూనే ఉంటారు. తర్వాత పెద్దలు వారి శరీరాలకి నూనెను పూస్తారు. ఆ నూనె యాలను మాన్పడమే కాక, విరిగిన ఎముకలను కూడా అతికిస్తుందని అంటారు వారు. ఎన్నో యేళ్లుగా అక్కడ ఈ ఆచారం కొనసాగుతుంది. ఇలా చేస్తే ఊరి అరిష్టాలన్నీ తొలగిపోతాయని, అందరూ సుఖశాంతులతో ఉంటారని వారి నమ్మకమట. ఎంత నమ్మకమున్నా ఇలా ఒళ్లు చీరుకోవడమేంటో... తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడవడంలా! -
లక్ష్మీ అలంకారానికి ఆవాసం...
స్థితికారుడైన శ్రీమహావిష్ణువు ప్రియపత్ని మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది శ్రావణమాసం. ఈ మాసంలో సోమ, మంగళ, శుక్ర, శనివారాలను పుణ్యప్రదమైనవిగా పరిగణిస్తారు. సోమవారాలు శివపూజకు, మంగళవారాలు గౌరీపూజకు, శుక్రవారం శ్రీ లక్ష్మీపూజకు, శనివారం విష్ణుపూజకు మిక్కిలి అనుకూలమైనవి. ఈ మాసంలో శుక్లపక్షం విశేషమైనది. ఈ పక్షంలోని ఒక్కొక్కరోజు ఒక్కో దేవుడికి పూజ చేయాలని శాస్త్రవచనం. లక్ష్మీదేవికి నెలవైన ఈ మాసంలో ఒక్కపూట భోజనం చేస్తూ, మరోపూట ఉపవాసం ఉండి లక్ష్మీపూజ చేయడం వల్ల సకల శుభాలూ చేకూరతాయని పురాణాలు చెబుతున్నాయి. హరిః ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజామ్! చన్ద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహా!! అనంతకోటి శక్తి సంపన్న, అనంత కల్యాణ గుణసంపన్న, ధర్మ సంవర్థిత, సకల లోకరక్షిత అయిన శ్రీమహాలక్ష్మీదేవి జగత్కల్యాణ మనుగడకై నిరంతర దివ్య ఆశీస్సులనిచ్చే దేవదేవి. స్థితికార్య నిర్వహణలో శ్రీమన్నారాయణుని సమబాధ్యతను స్వీకరించిన లక్ష్మీదేవి జగతికి మూలాధారమై, నిత్యవందనీయమై విరాజిల్లుతోంది. అనంతకోటి జీవరాశులలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరూ తలచుకునే తల్లియే లక్ష్మీదేవి. ఆమె తన వైభవాన్నే వరంగా అందించి, లోకాన్ని ఆశీర్వదిస్తుంది. ప్రాణశక్తికి, దైహిక, మానసిక ఆరోగ్యానికి అధిష్థాన దేవత అయిన శ్రీ మహాలక్ష్మి పాడిపంటలతో సమస్త సంపదలనూ, శారీరక దారుఢ్యాన్నీ ప్రసాదించే వరాలతల్లి. సకల శుభాలకూ నెలవు, సత్సంతాన ప్రాప్తిని కలిగించే మహాదేవి సకల కార్యసిద్ధికీ, సర్వత్రా విజయ సాధనకీ ఆలవాలం ఆ చల్లనితల్లి. ఆ లక్ష్మీ వైభవమే సర్వజగత్తులోని అద్భుతాలు, అవసరాలు, అనంత చైతన్యవిభూతులు. పాలకడలి నుండి జనించి, వైకుంఠంలో కొలువుదీరి, లోకంలోని ప్రతి అణువులో ధ్వనించే చైతన్య వైభవమై, జీవజాతి మనుగడకై అవతరించి శ్రీలక్ష్మీదేవి మానవుల మనోవికాసానికి, ఆనందానికి, చిరునవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణసంపత్తికి, సకలసంపదలకూ ఆలవాలమై భాసిస్తుంది. భారతీయ సంప్రదాయంలో ‘భిన్నత్వంలో ఏకత్వం’ సిద్ధాంతం ప్రకారం పరబ్రహ్మ స్వరూపమైన పరమాత్ముని అనేకరూపాల్లో ఆరాధించటం ఆనవాయితీ. ‘లోకో భిన్న రుచిః’ అన్నట్లుగా పరంపరానుగతంగా, తరతరాలుగా ఆరాధ్యదైవాలను కొలవడం ప్రతీతి. కాని శ్రీలక్ష్మీదేవిని పూజించని ప్రాణి పద్నాలుగు భువనభాండాల్లో ఎక్కడా ఉండదు. సర్వమానవ జ గతి పరిపుష్టికి సహకరించే విశ్వజనని కరుణాకటాక్ష కైంకర్యాన్ని ఆశించని వారుండరు. అఖిల బ్రహ్మాండ జనిత, సకల ప్రాణులకు ఐశ్వర్యాన్ని అనుగ్రహించే లోకమాత శ్రీలక్ష్మీమాత. విద్యామాతయైన శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం లేనిదే లోకంలో మనుగడే లేదు. లక్ష్మీదేవి అంటే కేవలం ధనం కాదు. ఆమె అనంతవిభూతుల్లో ధనం ఒకటి మాత్రమే. ఉత్సాహం, ఉల్లాసం, కాంతి, సౌందర్యం, శుచిశుభ్రత... వంటి ఉత్తమలక్షణాలు శ్రీలక్ష్మీదేవి స్వరూపాలు. లక్ష్మీదేవి ఇంద్రుడితో ఇలా చెప్పింది- ‘‘బుద్ధి, ధృతి, నీతి, శ్రద్ధ, ఓర్పు, శాంతి, సమ్మతి... ఈ ఏడుగురు దేవతలూ నాకు సన్నిహితులు. నేనున్నచోట వైభవంతో విలసిల్లుతుంది’’ అని. శ్రీలక్ష్మీమాత భక్తులను కన్నబిడ్డల్లా చూసుకుంటుంది. ఆ తల్లే భక్తుల చేయి పట్టుకుని అతిజాగ్రత్తగా లక్ష్యంవైపుగా తీసుకెళ్లి విజయాన్ని ప్రసాదిస్తుంది. లక్ష్యమే రూపధారణ చేసుకుని లక్ష్మీదేవి ఆవిర్భవించింది. కాబట్టి అమ్మవారు అలక్ష్యాన్ని ఏమాత్రం క్షమించదు. ప్రపంచమంతా నిండి ఉండే శ్రీ లక్ష్మీదేవి వ్యక్తితోపాటు సమాజాన్ని, దేశాన్ని, ప్రపంచాన్నీ కీర్తి సమృద్ధులతో నింపాలనీ, ఆ దేవి దివ్యాశీస్సులే సకల లోకాల్నీ వైభవంతో విరాజిల్లేలా చేస్తాయని శ్రుతి నిర్దేశితం. శ్రీలక్ష్మీదేవి అలక... జగత్తునంతా అల్లకల్లోలం చేస్తుంది. జగములనేలే ఆ తల్లి చిరుమందహాసమైనా చాలు అనంత దివ్యవైభవ సంపదను ధారాపాతంగా వర్షిస్తుంది. అఖండ మహిమాన్వితం, పరమానందదాయకం శ్రీలక్ష్మీ వైభవం. శ్రీమహాలక్ష్మి చూపులు... దుర్మార్గుల విషయంలో పరమక్రూరంగా ఉంటాయట, భక్తులైన దీనులపై దయను కురిపిస్తాయట, దారిద్య్రమనే అరణ్యాన్ని ఇట్టే దహించివేసి, ఎంతో ఉదారంగా సంపదను అనుగ్రహిస్తాయట. ‘‘నీ చల్లని చూపులతో మా దురదృష్టాన్ని పోగొట్టు తల్లీ...’’ అని ఆమెను ప్రార్థించాలి. - ఇట్టేడు అర్కనందనాదేవి శివప్రీతికరం శ్రావణ సోమవారం శ్రావణమాసంలో వచ్చే సోమవారం శివునికి ప్రీతికరమైనది. కాబట్టి ఈ నాలుగు సోమవారాలు దీక్షగా ఉపవాసముండి శివుడికి అభిషేకం, రుద్రనమకం, చమకం పఠించడం వల్ల ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయని పురాణోక్తి.