
అంధులు అద్భుతాలు సృష్టిస్తారు..
అవకాశాలు కల్పిస్తే అంధులు ఇతరులు ఎవ్వరికీ తీసిపోరని అద్భుతాలు సృష్టించడంలో సమర్థతను చాటుకుంటారని జిల్లా విద్యాశాఖాధికారి పి. మదన్‌మోహన్ అన్నారు.
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ : అవకాశాలు కల్పిస్తే అంధులు ఇతరులు ఎవ్వరికీ తీసిపోరని అద్భుతాలు సృష్టించడంలో సమర్థతను చాటుకుంటారని జిల్లా విద్యాశాఖాధికారి పి. మదన్‌మోహన్ అన్నారు. శుక్రవారం నల్లగొండ అంధుల పాఠశాలలో జరిగిన స్వపరిపాలన దినోత్సవంలో ఆయన మాట్లాడారు.
చిన్నారుల బోధనను చూసి అభినందించారు. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. పదవ తరగతి విద్యార్థులకు హాల్‌టికెట్లను అందజేశారు. ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. డీఈఓ కె. వరుణ్, ఎంఈఓగా పి. సంఘవి, హెచ్‌ఎంగా బి. గణేష్, వ్యవహరించారు. డ్వాబ్ ప్రధాన కార్యదర్శి చొక్కారావు పాల్గొన్నారు.